సాక్షి, నల్లగొండ: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా ఓ పోలీసు అధికారి.. వివాహిత అయిన కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య.. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్నేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య జ్యోతి.. మహేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వారించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వీరిద్దరూ తమ తీరు మార్చుకోలేదు. ఇక, తాజాగా వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరోవైపు భర్తపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా మహేందర్ భార్య జ్యోతి మాట్లాడుతూ.. ఐదారేళ్లుగా వసంతతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మహేందర్‌ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలి. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలి. లేకపోతే మాకు మెర్సీ కిల్లింగ్‌కు అవకాశం కల్పించాలి. వసంతకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె భర్తకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. వసంత కూడా నాపై దాడి చేసింది. నన్ను కొట్టి ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎత్తుకెళ్లింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment