గోప్యంగా ఉంచాల్సిన వీడియోలు లోకేశ్‌కు ఎలా చేరాయి?
మాచర్లతో పాటు పల్నాడులోని వీడియోలన్నీ బయటపెట్టాలి
ఓ పార్టీకి కొమ్ము కాసిన కొందరు పోలీసులు, ఎన్నికల సిబ్బంది
బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ వీడియోలన్నీ బహిర్గతం చేయాలి
ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ డిమాండ్
సాక్షి, అమరావతి: మాచర్లతో పాటు పల్నాడు ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ కోరింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన పాల్వాయిగేట్ పోలింగ్ స్టేషన్‌లోని వెబ్ కామ్ ఫుటేజి బయటకు ఎలా వచ్చిందో దర్యాప్తు చేయాలని కోరింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి వెబ్ కామ్‌లో రికార్డయిన వీడియో ఓ పార్టీ నేత అయిన లోకేశ్‌కు ఎలా చేరిందో ఎన్నికల కమిషన్ స్పష్టం చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.
సున్నితమైన అంశం వీడియోను లోకేశ్ ఎక్స్ ఖాతా ద్వారా పబ్లిక్ డొమైన్‌లో పెట్టడమే కాకుండా, ట్వీట్ చేయడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారం వెనుక కొంతమంది ఎన్నికల కమిషన్ అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. కోర్టుకు మాత్రమే సమర్పించాల్సిన ఈ వీడియోను బహిర్గతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని ఇతర పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఘటనల వీడియోలను కూడా విడుదల చేయాలని కోరారు. ఈ పరిణామాలన్నీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అధికారుల సఛ్చీలతపై అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు.
ఒక్క మాచర్లలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది, పోలీస్ అధికారులు సైతం ఓ పార్టికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. పౌరులకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేనప్పుడు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఏ విధంగా సగటు ఓటరుకు నమ్మకం కలుగుతుందని ప్రశి్నంచారు. ఇతర పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఘటనలపైనా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటే ఎన్నికల కమిషన్‌పై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఇతర వీడియోలను బయటపెట్టడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బా«ధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికల సంఘం సఛ్చీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment