macharla
-
పిన్నెల్లిపై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేత కొమ్మెర శివ
-
ఆ వీడియో లీక్ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవో
సాక్షి, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆ వీడియో తమ నుంచి బయటకు వెళ్లలేదని గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులకు చెప్పారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం ధ్వంసంపై సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు మీనా తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో పరామర్శల పేరుతో వెళ్లి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకు అనుమతిస్తే రేపు వేరే పార్టీ వాళ్లు వెళ్తామంటారని, అందుకే బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లనీయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లువచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టు వివరించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఏ రోజు, ఎన్ని గంటలకు ఎన్నిటేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుందో రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కింపుస్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తరువాతనే ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించాలని సూచించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్లో ఎప్పటి కప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కార్డులు లేనివారిని, అనధికార వ్యక్తులను, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాల్లోకి అనుమతికుంచ కుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగుతున్నదని, స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరీంధర ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి.ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్‌లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన జూలకంటి..నిజానికి.. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు.అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్‌లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్‌లలో కూర్చున్న వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్‌లో టీడీపీ చేసిన రిగ్గింగ్ బయటపడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.రీపోలింగ్ కోరిన పిన్నెల్లి..మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్‌కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్‌వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది. -
ఎన్నికల సంఘం సఛ్చీలతను నిరూపించుకోవాలి
సాక్షి, అమరావతి: మాచర్లతో పాటు పల్నాడు ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ కోరింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన పాల్వాయిగేట్ పోలింగ్ స్టేషన్‌లోని వెబ్ కామ్ ఫుటేజి బయటకు ఎలా వచ్చిందో దర్యాప్తు చేయాలని కోరింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి వెబ్ కామ్‌లో రికార్డయిన వీడియో ఓ పార్టీ నేత అయిన లోకేశ్‌కు ఎలా చేరిందో ఎన్నికల కమిషన్ స్పష్టం చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. సున్నితమైన అంశం వీడియోను లోకేశ్ ఎక్స్ ఖాతా ద్వారా పబ్లిక్ డొమైన్లో పెట్టడమే కాకుండా, ట్వీట్ చేయడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారం వెనుక కొంతమంది ఎన్నికల కమిషన్ అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. కోర్టుకు మాత్రమే సమర్పించాల్సిన ఈ వీడియోను బహిర్గతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని ఇతర పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఘటనల వీడియోలను కూడా విడుదల చేయాలని కోరారు. ఈ పరిణామాలన్నీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అధికారుల సఛ్చీలతపై అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు. ఒక్క మాచర్లలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది, పోలీస్ అధికారులు సైతం ఓ పార్టికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. పౌరులకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేనప్పుడు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఏ విధంగా సగటు ఓటరుకు నమ్మకం కలుగుతుందని ప్రశి్నంచారు. ఇతర పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఘటనలపైనా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటే ఎన్నికల కమిషన్‌పై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఇతర వీడియోలను బయటపెట్టడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బా«ధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికల సంఘం సఛ్చీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. -
AP: సిట్ దూకుడు.. అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు!
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దృష్టిసారించింది. కాగా, హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లను సిట్ నమోదు చేయనుంది. అయితే, కొందరు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఇక, హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. -
Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
-
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 6 వ తేదీ షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం విడుదల చేశారు. సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
CM Jagan: 15న మాచర్లకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం(నవంబర్ 15న) పల్నాడు జిల్లా మాచర్లకు వెళ్లనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు Varikapudisela Project ఆయన శంకుస్ధాపన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం 9.45 గంటలకు సీఎం జగన్ తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. నేరుగా మాచర్లకు చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశం సభాస్ధలి వద్దనే వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. -
బడుగులకు రాజ్యాధికారం సాకారమైంది
సాక్షి, నరసరావుపేట: భారత దేశ చరిత్రలో నినాదాలుగానే మిగిలిపోయిన సామాజిక సాధికారత, బడుగులకు రాజ్యాధికారాన్ని సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. ఇది బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగన్ అందించిన ఫలమని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా మాచర్లలోని పార్క్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎలా మేలు చేసిందో వివరించారు. 70 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంక్‌గా చూసిన సీఎంలను గతంలో చూశామని, సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఈ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించి వృద్ధిలోకి తెస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క మైనార్టీకి మంత్రిగా అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తనను డిప్యూటీ సీఎంగా చేశారని, నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఓ మైనార్టీ మహిళను మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా చేసిన ఘనత జగనన్నదేనని తెలిపారు. నాలుగున్నరేళ్లలో మైనార్టీలకు రూ.23,176 కోట్ల లబ్ధి కలిగించారని చెప్పారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న సీఎంకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసి జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని, వెన్నెముక వంటి బ్యాక్‌బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్ బీసీలను అక్కున చేర్చుకొని, అన్నింటా పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులతో పాటు పూర్తి అధికారాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో చరిత్రలో మరే సీఎం చేయని విధంగా అధిక శాతం పదవులు ఇచ్చారన్నారు. నలుగురు బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపడం విశేషమన్నారు. నందిగం సురేష్ వంటి పేదింటి వ్యక్తిని పార్లమెంట్‌కు పంపిన ఘనత జగనన్నదేనని అన్నారు. బీసీలకు జడ్జి పోస్టులు వద్దని లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పేదింటి పిల్లలను అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. రాజధాని ప్రాంతంలో బడుగు, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వారికి గూడు కల్పించాలని జగనన్న కలలు కన్నారన్నారు. వీటన్నింటినీ ఓర్వలేని చంద్రబాబు కోర్టులకు వెళ్లి వాటిని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా ద్వితీయ శ్రేణి మనుషులుగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అంటూ ఆప్యాయంగా పిలిచి, వారి ఉన్నతికి పాటు పడుతున్న సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఎస్టీలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. జగన్ డిప్యూటీ సీఎం ఇవ్వడంతోపాటు, ట్రైబల్ కమిషన్ ఏర్పాటు చేశారని, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలో ఏకంగా 3.26 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం గిరిజనులకు అందజేసిందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాలు కుల గణన చేస్తామని కాకమ్మ కథలు చెప్పాయని, సీఎం జగన్ దాన్ని ఆచరణలో పెడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సీఎం జగన్ పల్నాడుకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, వరికపూడిసెలకు అనుమతులు సాధించారని, రూ.3 వేల కోట్లతో హైలు అభివృద్ధి చేయించారని, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తన్నారని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే పల్నాడు రూపురేఖలే మారుస్తామని చెప్పారు. వెల్లివిరిసిన సామాజిక చైతన్యం ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సాయంత్రం 5 గంటలకు రెంటచింతల నుంచి వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు లావు శ్రీకష్ణదేవరాయలు, నందిగం సురేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. యాత్రకు వేలాది ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మాచర్ల శివారు నుంచి పాదయాత్రగా పట్టణంలోని పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. మాచర్ల నేతలు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం భారీ జన సందోహం మధ్య సభ ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాల పేదలకు చేస్తున్న మేలును నేతలు వివరిస్తున్నప్పుడు ప్రజలు పెద్దపెట్టున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ‘మా నమ్మకం నువ్వే జగన్.., జగన్ రావాలి– జగనే కావాలి’ ‘వై నాట్ 175 ’ అంటూ నినదించారు. నేడు సత్యసాయి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో సామాజిక సాధికార యాత్ర సాక్షి, అమరావతి: గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ యాత్ర ఏడో రోజు శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది. -
సామాజిక సాధికారితకు పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం జగన్
మాచర్ల(పల్నాడు జిల్లా): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. శుక్రవారం ఆరో రోజు బస్సుయాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలోని మాచర్లలోని పార్క్ సెంటర్ వద్ద జరిగిన సభలో వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహానేతకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఎంపీలు కృష్ణ దేవరాయులు, విజయసాయి రెడ్డి, నందిగం సురేష్, ఎమ్మేల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి ,సునీత, కుంబా రవిబాబు, ఏసురత్నం, పలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బడుగు బలహీనర్గాలను సొంత బిడ్డల్లా చూసుకున్న ముఖ్యమంత్రి జగన్ తప్ప మరొకరు లేరు. దమ్మున్న నాయకుడు కాబట్టే కరోనా విపత్తులోనూ , రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా, వసతి దీవెన, పంట బీమా, జగనన్న తోడు, చేదోడు వంటి అనేక పథకాలు అమలు చేశారు.కరోనా సమయంలో పేదల ప్రాణాలకోసం సీఎం జగన్ పరితపించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం 2,300 కోట్ల రూపాయలు మాచర్ల నియోజకవర్గానికి ఖర్చు చేశారు. త్వరలోనే సీఎం జగన్ రూ.1600 కోట్లతో వరికశిల పూడి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. సీఎం జగన్ ఆదేశాలతో బడుగు బలహీనర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాం’ అని తెలిపారు ఇక స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ఎమ్మెల్యే పిన్నెల్లి. ఎమ్మెల్సీ కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ‘ పల్నాడు గడ్డ వైసీపీ అడ్డ. చంద్రబాబు హయాంలో రాక్షస పాలన జరిగింది. మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. సమాజంలో అణచివేతకు గురైనవారిని పైకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. మాచర్లలో 50 వేలమంది గిరిజనులు ఉన్నారు. షెడ్యూల్ కులాలు, తెగలను చంద్రబాబు నీచంగా చూశారు. ఎస్సీల్లో ఎవరు పుట్టలనుకుంటారు.. గిరిజనులకు తెలివితేటలు ఉండవు అనే మాటలతో చంద్రబాబు హింసించారు. దేశంలో 3లక్షల 26 వేల ఎకరాల భూమిని ట్రైబల్స్ కు అటవీ చట్టాల ప్రకారం పంచిన వ్యక్తి సీఎం జగన్ ఒక్కరే. ట్రైబల్ మెడికల్ కాలేజ్, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ, ట్రైబల్ హాస్పిటల్ స్థాపించారు’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ అన్ని వర్గాల కోసం రాజ్యాంగం రాశారు. రాజ్యాధికారంలో అంతర్భాగం అయినప్పుడే చిన్న కులాలు అభివృద్ధి చెందుతాయి. కులగణన చేయాలని తీర్మానం చేశాం. బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్. ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ..‘ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినపుడు నేను ఓడిపోయినా ప్రపంచప్రఖ్యాతి గాంచిన మిర్చియార్డు చైర్మన్‌గా వడ్డెర కులానికి చెందిన నన్ను నియమించారు. ఆ పదవిలో వుండగానే మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబును దగ్గరగా చూశాను.. పేదకులాలకోసం ఒక్క పని కూడా చేయలేదు. వచ్చే ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి.. చంద్రబాబు మాటలను నమ్మవద్దు’ అని తెలిపారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ పల్నాడు పౌరుషానికి ప్రతీక పిన్నెల్లిరామకృష్ణారెడ్డి.ప్రజల్లో ఉన్నారు కాబట్టే నాలుగుసార్లు గెలిపించారు. 2024లో మాచర్లలో, రాష్ట్రంలో వైసీపీ జెండా మరోసారి ఎగరబోతోంది. 2014నుండి 2019 వరకు జరిగిన చంద్రబాబు పాలనను, సీఎం జగన్ పాలనను బేరీజు వేసుకోవాలి. డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా మాట్లాడుతూ.. ‘ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాల్లో సామాజిక సాధికారతను చేతల్లో చూపించిన వ్యక్తి సీఎం జగన్. సామాజిక న్యాయమే జగన్ విధానం. చంద్రబాబు హయాంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా మైనార్టీని నియమించడం ఒక చరిత్ర. మైనార్టీల సంక్షేమంలో కోసం చంద్రబాబు రూ.2600 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రూ.23వేల 176 కోట్లు ఖర్చు చేశారు. సామాన్యులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండండి. ప్రతిపక్షాలు ఒక్క జగన్ ని ఎదుర్కోవడానికి కలిసిపోయాయి’ అని పేర్కొన్నారు. ఎంపీ కృష్ణ దేవరాయులు మాట్లాడుతూ.. ‘ 2019లో అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ముందు రెండు దారులు ఉన్నాయి. మేనిఫెస్టోను వెబ్సైట్నుండి తొలగించి మాట తప్పడం ఒక దారి.. ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి విపత్తు వచ్చినా ప్రతీ హామీని నిలబెట్టుకోవడం మరో దారి. సీఎం జగన్ ఏ దారి ఎన్నుకున్నారో మీరే ఆలోచించుకోవాలి. గెలిచిన తర్వాత నాలుగున్నరేళ్ళపాటు ప్రజల్లోనే ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు అధికారం ఇస్తే పెత్తనం చేశారు. కొడుకుకు, మనుమడికి దోచి పెట్టారు. చంద్రబాబు ఆధారాలతో దొరికాక కూడా నిజం గెలవాలి అంటున్నారు. చంద్రబాబు రోగాలతో బయటకు వచ్చారు. బాలకృష్ణ చంద్రబాబును టచ్ చేయమంటున్నారు. చంద్రబాబును టచ్ చేయాల్సిన దౌర్భాగ్యం ఎవరికీ లేదు. సీఎం జగన్ తాను నివాసం ఉంటున్న కొద్ది దూరంలోనే ప్రజలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అమరావతిని అడ్డుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టారు’అని పేర్కొన్నారు. -
గొర్రెలకు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏ జీఆర్) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో రెండొందలకు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని గొర్రెల్లో జన్యు వైవిధ్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాగావళి గొర్రె(విజయనగరం నాటు గొర్రె)లతో పాటు పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల (కృష్ణ) గొర్రెలను అధికారికంగా గుర్తించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఏదైనా కొత్త జాతిని గుర్తించాలంటే వాటి బాహ్య, జన్యు లక్షణాల నిర్థారణ, జనాభా స్థితుగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న మాచర్ల, గరివిడి పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు 15 ఏళ్లపాటు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక సమర్పించాయి. అధికారిక గుర్తింపుతో ప్రయోజనాలివీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు పొందాలంటే గొర్రెల జాతులను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్రా, పల్నాడు, రాయలసీమ ప్రాంతవాసులు తాము పెంచే జాతులను నాటు గొర్రెలుగా పేర్కొనాల్సి రావడంతో తగిన లబ్ధి, ఆశించిన ధర పొందలేకపోతున్నారు. ప్రస్తుతం వీటికి అధికారిక గుర్తింపు లభించడంతో వాటిని పెంచేవారు ఇకపై అన్ని రకాల లబ్ధి పొందగలరు. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధర ప్రస్తుతం రూ.30 వేలు కాగా గుర్తింపుతో రూ.45 వేలు పలికే అవకాశం ఉంది. ఆడ గొర్రెలకు ప్రస్తుతం రూ.10 వేలు లభిస్తుండగా.. ఇకపై రూ.15 వేల వరకు పలుకుతాయి. కృష్ణ గొర్రెలకు వందేళ్ల చరిత్ర మాచర్ల గొర్రెల జన్మస్థలం కృష్ణా నది పరీవాహక ప్రాంతం కావడంతో వీటిని కృష్ణ గొర్రెలుగా పిలుస్తారు. నదికి ఇరువైపులా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఏపీలో 6.60 లక్షల సంపద ఉందని అంచనా. నెల్లూరు, ముజఫర్ నగర్ గొర్రెల కంటే అధిక బరువు కలిగి ఉంటాయి. నలుపు, తెలుగు, గోధుమ రంగుల్లో ఉంటాయి. తల కుంభాకారంగా, చెవులు, తోక గొట్టాల వలె ఉంటాయి. కొమ్ములు తలకి సమాంతరంగా వుంటాయి. మొదటి ఈత 18–24 నెలలకు వస్తాయి. 20 శాతంపైగా కవలలకు జన్మనిస్తాయి.ప్రతి రెండేళ్లకు 3 పిల్లల చొప్పున ఏడేళ్ల జీవిత కాలంలో 6–8 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 53.25 కేజీలు, ఆడ గొర్రె 40 కేజీల వరకు పెరుగుతాయి. యుద్ధాలు చేసిన గొర్రెలివి నాగావళి జాతి గొర్రెలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కళింగుల కాలంలో ఈ గొర్రెలను యుద్ధాలు, పందేలకు వినియోగించేవారని చెబుతుంటారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో సుమారు 9.90 లక్షల నాగావళి గొర్రెలు ఉన్నట్టు అంచనా. బూడిద, గోధుమ, తెలుపు మిశ్రమ వర్ణం కలిపి ఉంటాయి. తల పాము పడగ ఆకారం ఉంటుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయం, నోరు, ఉదరం, కాళ్ల చివర భాగం నల్లగా, తోక సన్నగా, కాళ్లు, గిట్టలు బలంగా పొడవుగా ఉంటాయి. ఏడేళ్ల పాటు జీవించే ఈ గొర్రెలు ఏడాదిన్నర నుంచి ప్రతి రెండేళ్లకు 6 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 2.5 అడుగులు ఎత్తు పెరిగితే.. ఆడ గొర్రెలు మగ గొర్రెల కంటే 2 అంగుళాల తక్కువ ఎత్తు ఉంటాయి. పొట్టేలు 42 కిలోలు, ఆడ గొర్రెలు 35 కిలోల వరకు బరువు పెరుగుతాయి. 12 నెలల వయసులోనే మంచి మాంసం దిగుబడి వస్తుంది. వీటి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. పరాన్న జీవులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే రోగాలను తట్టుకునే శక్తి వీటికి ఉంది. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కీలక ముందడుగు నాగావళి, మాచర్ల గొర్రె జాతులకు గుర్తింపు లభించడం ఏపీ పశు గణాభివృద్ధిలో కీలకమైన ముందడుగు. 15 ఏళ్లుగా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు, అధ్యయనం ఎట్టకేలకు ఫలించాయి. గుర్తింపుతో ఈ జాతుల పరిరక్షణకు పెద్దఎత్తున నిధులు మంజూరవుతాయి. – డాక్టర్ కె.సర్జన్‌రెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్, ఎస్వీవీ విశ్వవిద్యాలయం -
మాచర్లలో భరతుడంటా!.. లోకేశ్ మళ్లీ ఏసేశాడు
సాక్షి, నరసరావుపేట : ‘యుద్ధానికి వెళుతున్న భరతుడికి వీర తిలకం దిద్దిన ప్రాంతం మా చర్ల’ అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తన అ జ్ఞానాన్ని మరోసారి చాటుకున్నారు. పల్నా డు జిల్లా గురజాలలో బుధవారం జరిగిన బహిరంగ సభలో లోకేశ్ పైవిధంగా నాలుక ను మడతేసిపడేశారు. వాస్తవానికి బాలచంద్రుడికి వీర తిలకం దిద్ది పంపింది మగువ మాంచాల. పల్నాటి గడ్డపై పసివాడిని అడిగినా ఈ విషయం ఇట్టే చెప్పేస్తాడు. కానీ లోకేశ్ మాత్రం తన మిడిమిడి జ్ఞానంతో భరతుడిని మాచర్లలోకి దించేశారు. పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర సత్తెనపల్లి నియో జకవర్గం రాజుపాలెం మండలం మీదుగా పెద కూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది చదవండి: చంద్రబాబు, సీఎం జగన్ మధ్య తేడా ఇదే.. -
అజ్ఞాతంలోకి మాచర్ల టీడీపీ ఇన్ ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి
-
బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు
-
మార్కాపురం: ఆ భయంతోనే యువతి ఆత్మహత్యాయత్నం
ప్రకాశం: మార్కాపురం లాడ్జిలో యువతి ఆత్మాహత్యయత్నం కేసులో విస్మయానికి గురి చేసే విషయం వెలుగు చూసింది. చదువుల తల్లి అయిన ఆ విద్యార్థిని.. పిచ్చిగా మూఢనమ్మకంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఈ కేసులో పూర్తి వివరాలు తెలిశాక తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం షాక్ తిన్నారు. ప్రకాశం జిల్లాలోని సీఎస్ పురంలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది సదరు యువతి. పరీక్షలు అయిపోవడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. అయితే ఇంటికని చెప్పి బయలుదేరిన ఆమె.. మార్కాపురంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏప్రిల్ 27వ తేదీన బసచేసింది. అక్కడి నుంచి ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయన సకాలంలో స్పందించి పోలీసులను అప్రమత్తం చేయడంతో.. విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె అసాధారణమైన విషయాలు వెల్లడించింది. తన ఆత్మహత్యాయత్నం వెనుక ఒక బాబా ప్రమేయం ఉందని తెలిపింది. ఇంతకీ ఆ బాబా ఏం చెప్పాడంటే.. ఆమె కుటుంబానికి పాము పగ పట్టిందని, దాని వెనుక ఉంది ఆమెనే అని. గతంలో ఆమె నీడ పడి రెండు పాములు రక్తం కక్కుకుని చచ్చిపోయాయట. వాటి పగతో శాపం తగిలిందని, ఆమె కుటుంబం సర్వనాశనం అవుతుందని ఆ బాబా చెప్పాడట. ఈ విషయాన్ని ఆమె బలంగా నమ్మింది. ఇదంతా తన వల్లే అనుకుంది. అందుకే నాలుగు పేజీల లేఖ రాసి స్వగ్రామం మాచర్లలో నివసిస్తున్న తన తండ్రికి వాట్సప్ ద్వారా ఫోటో తీసి పంపించింది. అనంతరం బ్లేడు తో చేయి కోసుకుంది. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న విద్యార్ధినిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె బతికింది. ఇంత చదువు చదివి.. ఇలాంటి మూఢనమ్మకాలకు లొంగిపోవడమేంటంటూ ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నాగార్జునకొండకు ప్రారంభమైన లాంచీ సర్వీసులు
విజయపురిసౌత్ (మాచర్ల): పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. విజయపురిసౌత్ లోని లాంచీస్టేషన్ నుంచి జలవనరుల శాఖ ఏఈఈ కేవీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం నాగసిరి లాంచీని ప్రారంభించారు. కొండలో విధులు నిర్వహించే 30 మంది ఉద్యోగులతో నాగసిరి లాంచీ కొండకు వెళ్లింది. రెండేళ్లుగా కోవిడ్, భద్రతా కారణాలతో నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చదవండి: కోడె ధర రూ.2 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత నడుమ లాంచీలు నాగార్జునకొండకు తిప్పేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు పురావస్తుశాఖ సిబ్బంది కొండపై పిచ్చి మొక్కలను, ముళ్ల చెట్లను తొలగించి శుభ్రం చేయనున్నారు. అనంతరం పర్యాటకులను లాంచీల ద్వారా కొండకు చేరవేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నియోజకవర్గంలో మొత్తం అయిదు జెడ్పీటీసీ స్థానాలను, 71 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మాచర్ల మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దుర్గి మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందగా, వెల్దుర్తి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ► మాచర్ల మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 ► దుర్గి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 ► వెల్దుర్తి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 ►కారంపూడి మండలం లో మొత్తం ఎంపీటీసీ 15 ► రెంటచింతల మండలం మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 ► నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. -
అభిమాని కల నెరవేర్చిన అల్లు అర్జున్!
సినిమా హీరోలకు, హీరోయిన్లకు చాలా మంది అభిమానులు ఉంటారు. అయితే వీరిలో కొంతమంది సినిమా రిలీజైన మొదటి రోజు సినిమాలు చూస్తూ, కట్ అవుట్లు పెట్టే వారుంటే మరికొంతమంది వారి కోసం ఏదైనా చేసే వీరాభిమానులు ఉంటారు. అలాంటి ఒక ఫ్యాన్స్ తన ఫేవరెట్ హీరో అల్లుఅర్జున్ కోసం ఏకంగా రెండు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు కలవాలని ప్రయత్నిస్తున్న దక్కని అవకాశం ఈ సరైన దక్కుతుందా అని ఆశపడిన అతని కల నెరవేరింది. ఎట్టకేలకు తన అభిమాన హీరోను కలుసుకొని ఫోటో దిగి మురిసిపోతున్నాడు ఆ వీరాభిమాని. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని, దాంతో ఆయనను కలవడానికి నాలుగు, ఐదు సార్లు ప్రయత్నించాడు. అయితే ఎన్ని సార్లు ప్రయత్నించిన బన్నిని కలవలేకపోయాడు. దీంతో ఆ వీరాభిమాని గత నెలలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఎన్ని సార్లు ప్రయత్నించిన బన్నిని కలవలేకపోయానని, ఈసారి బన్ని కోసం పాదయాత్ర చేసుకుంటూ వస్తానని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 14న నడుచుకుంటూ హైదరాబాద్‌కు బయలుదేరిన నాగేశ్వరరావు 22వ తేదీకి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే అదే సమయంలో బన్ని తన కుటుంబంతో కలిసి గోవా టూర్‌కు వెళ్లారు. తన కోసం అంత దూరం నుంచి వచ్చిన అభిమానిని తన ఆఫీసులో కలిసి గంట సేపు మాట్లాడాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సినిమాల విషయానికి వస్తే బన్ని ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్ని కనిపించనున్నాడు. రష్మిక మందనా అల్లు అర్జున్ పక్కన హీరోయిన్గా కనిపించనుంది. చదవండి: సందేశాత్మక చిత్రం.. బాగా నచ్చింది: బన్నీ -
బన్నీని కలిసేందుకు అభిమాని పాదయాత్ర
-
బన్నీ కోసం 250 కి.మీ. పాదయాత్ర
జనాలకు, ముఖ్యంగా యువతకు సినీతారలంటే అభిమానం ఎక్కువ. వారి ఫొటోలను గోడలపై అతికించుకుంటారు. పేర్లను టాటూలుగా పొడిపించుకుంటారు. మరికొందరైతే ఏకంగా గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్లందరూ తమ జీవితంలో ఒక్కసారైనా తమ హీరోతో కలిసి ఓ ఫొటో దిగాలని, లేదా నేరుగా చూడాలని తాపత్రయపడుతుంటారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఇలాంటి కోవకే చెందుతాడు. పి. నాగేశ్వర్ రావు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. అతడిని కలిసేందుకు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు అతని ఆశయం ఫలించనేలేదు. దీంతో ఎలాగైనా ఈసారి హీరో కంట పడాలని మాచర్ల నుంచి హైదరాబాద్ వరకు 250 కి.మీ పాదయాత్ర చేసి హైదరాబాద్ చేరుకున్నాడు. (చదవండి: నవరసాల నటి సీతాదేవి కన్నుమూత) ఈ విషయం గురించి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ "గంగోత్రి సినిమా నుంచి నేను బన్నీ అన్నకు ఫ్యాన్. అప్పటి నుంచి అన్నను చూసేందుకు నాలుగైదు సార్లు ప్రయత్నించా. కానీ, కుదరలేదు. అందుకే ఈసారి పాదయాత్ర చేపట్టా. ఇది చూసైనా నాకు తనను కలిసే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. సెప్టెంబర్ 17న పాదయాత్ర ప్రారంభించా. సెప్టెంబర్ 22న బంజారా హిల్స్‌కు చేరుకున్నా" అని తెలిపాడు. ఈ వీడియో బన్నీ కంట పడేవరకు షేర్ చేస్తామని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా బన్నీ క్రేజ్ తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యే వచ్చిన బన్నీ 'అల వైకుంఠపురం'లోని పాటలు బాలీవుడ్ సెలబ్రిటీలతో కూడా డ్యాన్స్ చేయించాయి.(చదవండి: కుంటాల సందర్శన.. అల్లు అర్జున్‌పై ఫిర్యాదు) -
వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు
సాక్షి,నల్గొండ: కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు నల్గొండ జిల్లా పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాచర్ల మీదుగా ప్రయాణికుల వాహనాలను అనుమతించడం లేదు. నాగార్జునసాగర్ దాటిన తర్వాత ఆంధ్రాలోకి ప్రవేశించే మాచర్ల చెక్ పోస్టును ఆంధ్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుగా గుర్తించడం లేదు. అందువల్ల మాచర్ల మీదుగా ప్రయాణికుల వాహనాలను అనుమతించడం లేదని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. అందువల్ల మాచర్ల మీదుగా ఆంధ్రాలోకి వెళ్లాలనుకునే ప్రయాణికులు, వాహనాలు వాడపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. నాగార్జున సాగర్ వెళ్లడానికి వచ్చి ఆంధ్ర చెక్‌పోస్ట్ వద్ద ఇబ్బందులు పడొద్దని డీఎస్పీ సూచించారు. చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం -
‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు’
సాక్షి, గుంటూరు : మాచర్ల దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు జిల్లాలో పర్యటించే ముందు నేతలు పోలీసులకు సమాచారం ఇస్తే రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అన్నారు. మంగళవారం జిల్లాలో పోలీసు అధికారుల సంఘ సభ్యులు బాలమురళికృష్ణ, మాణిక్యాలరావు, బేబీ రాణి మాట్లాడుతూ.. పోలీసులకు ముందుగానే సమాచారం అందించామని బోండా ఉమా, బుద్దా వెంకన్న మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం సమంజసం కాదని తెలిపారు. మాచర్లలో దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకుని, దాడి నుంచి నేతలను కాపాడారని తెలిపారు. పోలీసులు వాహనంలో రాజకీయ నాయకులను ఎక్కించుకోకూడదని తెలిసినా వారి ప్రాణాలు కాపాడేందుకు పోలీస్ వాహనంలో నాయకులను తరలించామన్నారు. తమ ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడామని పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడిన పోలీసులపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యే పోలీసులకు పోస్టింగ్‌లు వేశారని మాట్లాడుతున్నారన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే పోస్టింగ్‌లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. రిపోర్టు ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదని, సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘పోలీసులపై బురద చల్లవద్దు. రాజకీయ పార్టీలకు అంటగడుతూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దు. పోలీసులు నాయకుల ప్రాణాలను కాపాడినా.. నింధించడం బాధ కలిగించింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం వలనే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళగలిగారు. పోలీసులు లేకుంటే నేడు మీరు బ్రతికి ఉండే వాళ్ళు కాదు. రాజకీయ నాయకులు పోలీసులపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. మీ పై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడము’ అని పోలీసు అధికారుల సంఘ సభ్యులు హెచ్చరించారు. -
బోండా ఉమ, వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నాం
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగినట్లు ప్రచారం చేయొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, ఏపీ పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. (వీడియోలు తీయండి.. గొడవ చేయండి ) ఆమె చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే.. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన సంఘటనపై డీజీపీ స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలతో పాటు, ఆయన చూపించిన వీడియోపై డీజీపీ వివరణ ఇచ్చారు. మహిళా అభ్యర్థి చుట్టు ఉన్నది టీడీపీ నేతలే అని, నామినేషన్ ఎవరో దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. (ఆడలేక మద్దెల ఓడు) ఎన్నికల నిర్వహణకు మానిటరింగ్ సెల్ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా 35 సంఘటనలు జరిగాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా 43 ఫిర్యాదులు వచ్చాయన్నారు. నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల నామినేషన్లలో 14 ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించారన్నారు. కేవలం ఎనిమిది సంఘటనల్లో మాత్రమే 307 సెక్షన్ కింద కేసులు నమోదు అయినట్లు డీజీపీ తెలిపారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (కాషాయ పవనం.. సైకిల్‌పై పయనం) రూ.కోటి 84 లక్షల నగదు సీజ్ పోలీసుల దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకూ పోలీసుల తనిఖీల్లో రూ.కోటి 84 లక్షల నగదు సీజ్ చేశామని, రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, 701 మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిఘా యాప్ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. (కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేసిన జేసీ!) రికార్డు స్థాయిలో... ఆపరేషన్ సురా 1,1386 బైండోవర్ కేసులు నమోదు చేశామని, అలాగే 10,980 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నామని, జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వద్ద 27,735 మంది, సమస్యాత్మక ప్రాంతాల్లో 4,399 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సురా పేరుతో రికార్డు స్థాయిలో నాటు సారా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరిగేవని, ఈసారి అలా జరగకుండా చూడబోతున్నామన్నారు. అభ్యర్థులు మద్యం, డబ్బుతో పట్టుబడితే అనర్హలు అవుతారంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. (డీజీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు హైడ్రామా) వాళ్ల కాల్‌డేటా పరిశీలిస్తున్నాం.. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమాచర్ల ఎందుకు వెళ్లారో..అక్కడి నుంచి విజయవాడకు ఎలా వచ్చారో విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మాచర్లలో ఘటన జరిగితే అక్కడి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారని, మాచర్ల ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారన్నారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. వాళిద్దరూ ఎందుకు మాచర్ల వెళ్లారు, ఎప్పుడు పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. దీనిపై బోండా ఉమ, బుద్ధా వెంకన్న తమకు స్టేట్మెంట్ ఇవ్వాలని అన్నారు. (అల్లర్లకు పన్నాగం) -
మాచర్ల ఘటనకు బాధ్యులైన ముగ్గురిని అరెస్ట్ చేశాం
-
ఉమా నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత బోండా ఉమా సవాల్‌పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీటుగా స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘పల్నాడు ప్రజలను బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు కాదని బోండా ఉమా తెలుసుకోవాలి. విజయవాడ గల్లీలో రౌడీయిజం చేసినట్లు పల్నాడులో చేస్తామంటే కుదరదు. మాచర్ల మళ్లీ వస్తానని సవాల్ చేయడం కాదు, దమ్ముంటే రావాలి. లేదా నన్ను విజయవాడ రమ్మన్నా వస్తా. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదు. ఈ విషయంలో ఎక్కడదాకా వెళ్లడానికి అయినా నేను సిద్ధంగా ఉంటా. ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేశారు. (కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి) గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. (బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని?) కాగా బోదిలవీడులో రెండు వర్గాల కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్ధేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చూడగా మార్గమధ్యలో మాచర్ల వద్దే స్థానికంగా జరిగిన ప్రమాదంతో ఘర్షణ జరిగింది. (స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు !) -
మాచర్ల ఘటనపై స్పందించిన డీజీపీ
సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సత్వరం స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆయన బుధవారం ఆదేశించారు. మరోవైపు జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ.... మాచర్లకు బయల్దేరారు. ఎవరు దాడి చేశారో తెలియదు... కాగా మాచర్ల ఘటనలో ఎవరు దాడి చేశారో తెలియదని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఎవరు...ఎవరిపై దాడి చేశారో విచారణలో తెలుస్తుందన్నారు. మాచర్లలో ప్రజలను రెచ్చగొట్టేందుకే బోండా ఉమ, బుద్ధా వెంకన్న అక్కడకు వెళ్లారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. -
కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు
-
కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి
సాక్షి, గుంటూరు(మాచర్ల): పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నతో పాటు మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించారన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఓ పిల్లాడికి తగిలిందని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని తెలిపారు. వారిని సముదాయించాల్సింది పోయి బోండా సహా ఇతర టీడీపీ నాయకులు దుర్భాషలాడారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమని, అందులో భాగంగానే పది కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారని తెలిపారు. ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు, ముస్తాఫాలపై దాడులు చేసి చంపడానికి యత్నించారని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అయినా తాము సంయమనంతో వ్యవహరించామని తెలిపారు. -
కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట..
సాక్షి, మాచర్ల రూరల్: కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట.. కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో యువకుడు మృతిచెందగా.. యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరులో వలంటీర్‌గా పనిచేస్తున్న కేతావత్ శివా నాయక్ (22)కు, రెంటచింతల మండలం పశర్లపాడుకు చెందిన జఠావత్ అనితతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మాచర్ల పట్టణంలోని ఓ కళాశాలలో అనిత డిగ్రీ చదువుతోంది. వేసవి సెలవుల్లో వివాహం జరిపించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో అనిత కుటుంబంలో ఏర్పడ్డ స్వల్ప విభేదాలతో కలత చెందిన శివానాయక్, అనితలు గురువారం కంభంపాడు కుడికాలువలో దూకారు. అక్కడ పొలం పనులు చేసుకుంటున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడికి చేరుకుని కాలువలో కొట్టుకుపోతున్న ఇద్దరినీ రక్షించేందుకు అక్కడే ఉన్న కొంతమందిని పురమాయించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శివా నాయక్ కొట్టుకుపోగా.. కొన ఊపిరితో ఉన్న అనితను ఒడ్డుకు చేర్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివా నాయక్ మృతదేహాన్ని కాలువలో గాలించి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన తమ పిల్లలకు ఈ దుస్థితేంటంటూ ఇరు కుటుంబాల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పైశాచికమా.. ప్రమాదమా?
సాక్షి, గుంటూరు : గుర్తు తెలియని అగంతకులు పైశాచికంగా వ్యవహరిస్తూ చిన్నారులను చిదిమేస్తున్నారా..? లేకా ప్రమాదవశాత్తూ పిల్లలు చనిపోతున్నారా..? ప్రస్తుతం పల్నాడులో ఇదే చర్చ కొనసాగుతోంది. మాచర్ల, గురజాల పట్టణాల్లో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. మాచర్లలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏడేళ్ల బాలుడు అదృశ్యమై నాలుగు రోజుల తర్వాత క్వారీ గుంతలో శవమై తేలాడు. తాజాగా గురజాలలో వారం రోజుల కిందట నాలుగేళ్ల బాలుడు సుభాష్ అదృశ్యమై నేటికీ ఆచూకీ లభించలేదు. దుండగులు పిల్లలను కిడ్నాప్ చేసి హత్య చేస్తున్నారా..? ఏమైనా ప్రమాదాలకు గురై చిన్నారులు మృత్యువాత చెందుతున్నారా అనే విషయం నేటికీ పోలీసులు తేల్చకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అభం శుభం తెలియని చిన్నారుల నిండు నూరేళ్ల జీవితాలు అర్ధంతంగా కొడిగడుతున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు జీవితకాలం శిక్ష పడుతోంది. ఉన్నతంగా పెంచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకున్న వారికి తీరని శోకమే మిగులుతోంది. చిన్నారులు అదృశ్యమైన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ కేసు నమోదు చేసి సరిపెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాచర్లలో, తాజాగా ఆగస్టు 25న గురజాలలో ఇద్దరు బాలురు అదృశ్యం ఆ ప్రాంత వాసుల్లో కలకలం రేపుతుంది. ఆయా కేసుల్లో నిందితులను గుర్తించడం పోలీసులకు సైతం మిస్టరీగానే మిగిలింది. ఆధునిక పరిజ్ఞానం ఎంత ఉన్నా నిందితుల గుర్తింపులో నెలలు గడుస్తూనే ఉన్నాయి. కేసులను కొలిక్కి తీసుకురావడంలో పోలీసుల వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనలు జరిగిందిలా.. మాచర్లలోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటేశ్వరనాయక్ వెల్ధుర్తి మండలంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుంటాడు. ఇంటి వద్ద భార్య సరోజనీబాయ్ కుమారుడు సాయిసాధిక్ ఉరఫ్ సిద్దు (7) ఈ ఏడాది ఏప్రిల్ 22న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో మాచర్ల టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల అనంతరం బాధితుడి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న క్వారీలోని నీటిలో సిద్దు శవమై తేలాడు. కిడ్నాప్ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆ కేసులో మిస్టరీ వీడలేదు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటిలో పడ్డాడా లేకపోతే ఎవరైనా తీసుకెళ్లి పడేశారా అనే విషయం పోలీసులకు అంతు పట్టడం లేదు. లేకుంటే మరేమైనా కారణాలున్నాయా అనే కోణాల్లో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. బాలుడి తల్లిదండ్రులు సైతం తమ బిడ్డను ఎవరో పొట్టనపెట్టాకున్నారని అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేసి రూరల్ ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా గురజాలకు చెందిన గురవయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తాడు. ఇద్దరు మగ పిల్లలున్నారు. పెద్ద కుమారుడు సుభాష్ ఇంటి ఎదురు ఆడుకుంటుండగా గత నెల 25న గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేశారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మరో ఐదు రోజులకు (అగస్టు 30వ తేదీన) బాధితుడి ఇంటి సమీపంలోని ముళ్ళ పొదల్లో బాలుడు అదృశ్యం అయిన సమయంలో వేసుకున్న లాగు, టీషర్టు రక్తపు మరకలతో తడిచి వేర్వేరు చోట్ల పడేసి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. పోలీస్ జాగిలం కూడా బాలుడు ఇంటి వద్ద నుంచి బట్టలు ఉన్న చోటకు వచ్చి నిలిచిపోయింది. ఎలాంటి క్లూ దొరకలేదు. ఇదిలా ఉంటే మా బిడ్డను ఎవరో హతమార్చారంటూ తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అసలు బాలుడు ఉన్నాడా..? లేదా..? అనే విషయంలో పోలీసులు కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కిడ్నాప్ చేసిన దుండగులు బట్టలకు రక్తపు మరకలు పూశారా? లేకుంటే నిజంగానే పొట్టన పెట్టుకున్నారా? అనే సందేహంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడికి చెందిన బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నట్లయితే... నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌గా ఉన్న గురజాలలో కనీసం ప్రధాన రహదారులను కవర్ చేసేలా ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు లేవు. ప్రధాన దుకాణదారులు, అపార్టుమెంట్లు వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కొందరు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు సుముఖత చూపకపోవడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. అదే సీసీ కెమేరాలు ఉన్నట్లయితే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదని పోలీసులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. -
సాత్విక్ కేసులో మలుపు.. అది హత్య కాదు!
మాచర్ల: ఆరేళ్ల చిన్నారి సాయి సాత్విక్ సిద్ధు మృతి వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సాయి సాత్విక్ సిద్ధూ హత్యకు గురికాలేదని, ఆ బాలుడు ఆడుకుంటూ వెళ్లి క్వారీ గుంటలో పడి చనిపోయాడని గురజాల డీఎస్పీ శ్రీధర్ బాబు వెల్లడించారు. మాచర్లలో ఈనెల 22న ఇంటిముందు ఆడుకుంటూ సిద్ధూ అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో సిద్ధు కిడ్నాప్‌కు గురయ్యాడని భావించామని, గుంటూరు రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఓ వ్యక్తి భుజాలపై ఉన్న బాలుడిని సాత్విక్ అనుకున్నామని ఆయన వివరించారు. అయితే, విచారణలో అతను గుంటూరు అరండల్ పేటకు చెందిన మరో బాలుడిని తేలిందని చెప్పారు. అసలు సాత్విక్ కిడ్నాప్‌కు గురికాలేదని, ఇంటి ముందు ఆడుకుంటూ.. ఇంటికి 400 మీటర్ల దూరంలో ఉన్న క్వారీ గుంటలో ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయాడని తెలిపారు. క్వారీ దగ్గర సాత్విక్ ఆడుకుంటున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించామని, ఆ బాలుడిది హత్య కాదని డీఎస్పీ తెలిపారు. ఈనెల 22న ఇంటిముందు ఆడుకుంటూ సిద్ధు అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో బాలుడు కిడ్నాప్ అయ్యాడని భావించారు. 23న గుంటూరు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళుతున్న దృశ్యాలు చూసి.. సాత్విక్ అనుకొని పోలీసులు భ్రమపడ్డారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మాచర్ల శివారులోని క్వారీ గుంతలో బాలుడి మృతదేహం లభ్యమవ్వడంతో బాలుడు దారుణ హత్యకు గురైనట్టు తొలుత భావించారు. అయితే, విచారణలో అది నిజం కాదని తేలింది. మాచర్లలోని నెహ్రూనగర్‌లో నివసిస్తున్న వెంకటేశ్వర నాయక్, సరోజ దంపతుల కుమారుడు సాయి సాత్విక్ సిద్ధు. బాలుడి తండ్రి వెంకటేశ్వర నాయక్ వెల్దుర్తి మండలం కండ్లకుంటలోని మోడల్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ.. మాచర్లలోని నెహ్రూనగర్ 2వ లైన్లో అద్దెకు ఉంటున్నారు. సిద్ధూ మృతి విషయం తెలియడంతో బాలుడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా కన్నీరుమున్నీరవుతున్నారు. -
గోదావరి జిల్లాలోని కోవ్వూరులో టీడీపీకి భారీ షాక్
-
టీడీపీకి ఝలక్ .. టీవీ రామారావు రాజీనామా
-
టీడీపీకి ఝలక్ .. టీవీ రామారావు రాజీనామా
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలోని కోవ్వూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తొలిరోజే మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానికులకు కాకుండా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు కొవ్వూరు టికెట్ ఇవ్వడంపై టీవీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు టికెట్‌ను తన కూతురికి కేటాయించాలని చంద్రబాబును టీవీ కోరారు. కానీ చంద్రబాబు ఆమెను కాదని అనితకు ఇచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన టీవీ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయానికి నిరసనగా టీడీపీకి రాజీనామా చేస్తున్నానని రామారావు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచరులతో సమావేశమయ్యారు. గుంటూరులోనూ అదే పరిస్థితి గుంటూరు జిల్లా టీడీపీలోనూ అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మాచర్ల టికెట్‌ను అంజిరెడ్డికి ప్రకటించడం పట్ల చలమారెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్టీ ఆఫీసు వద్ద చలమారెడ్డి వర్గం ధర్నాకు దిగారు. చలమారెడ్డి ముద్దు.. అంజిరెడ్డి వద్దూ అంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని కాదని, కొత్తవారికి టికెట్ ఇవ్వడం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. స్థానికులకు నచ్చని అభ్యర్థిని ప్రకటిస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు.ఇక కర్నూలు జిల్లా బనగాణపల్లేలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఓటమి భయంతో బీసీ వెనుకంజ వేస్తున్నారు. బీజీ జనార్దన్ రెడ్డి సొంతగ్రామంలో 100 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. -
నడిరోడ్డుపై రౌడీషీటర్ హత్య
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో సోమవారం ఓ రౌడీషీటర్‌ను దుండగులు వెంటాడి నడిరోడ్డుపైనే నరికి చంపారు. రెండు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన అతను పట్టణంలో ఉన్న భార్య వద్దకు వచ్చి ప్రత్యర్థుల చేతిలో బలయ్యాడు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మూడు గంటల్లోనే నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు హత్యలో పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో కనుగొన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన రౌడీషీటర్ శెట్టిపల్లి ప్రేమ్‌కుమార్(30) గతంలో రేపల్లె, చెరుకుపల్లి గ్రామాల్లో రెండు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తూ అప్పీలుకు వెళ్లి తిరిగివచ్చాడు. ఆ రెండు సంఘటనల్లో హత్యకు గురైన రేపల్లెకు చెందిన శివ, చెరుకుపల్లికి చెందిన నాగేశ్వరరావు బంధువులు ప్రేమ్‌కుమార్‌పై కక్ష పెట్టుకుని అదును కోసం వేచివున్నారని సమాచారం. ప్రేమ్‌కుమార్ భార్య జ్యోత్స్న మాచర్ల ప్రాంతంలో నివాసముంటూ వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ప్రేమ్‌కుమార్ సోమవారం మాచర్లలో ఉన్న తన భార్య వద్దకు వచ్చి బుల్లెట్‌పై తిరిగి వెళుతుండగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ప్రేమ్‌కుమార్‌ను వెంబడించారు. పట్టణంలోని ఎస్వీఆర్ బార్ సమీపంలో దాడికి దిగారు. పసిగట్టిన ప్రేమ్‌కుమార్ బుల్లెట్‌ను వదిలివేసి పారిపోతుండగా దుండగులు వెంటపడి తల వెనుక భాగంలో గొడ్డలితో నరికారు. దీంతో ప్రేమ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సాంబశివరావు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. సంఘటన జరిగిన వెంటనే అన్ని కోణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తెల్ల అంబాసిడర్ కారులో వచ్చిన నిందితులు హత్య అనంతరం దాంట్లోనే పారిపోయారు. సమాచారం అందుకున్న రెంటచింతల ఎస్ఐ కోటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండటాన్ని గమనించిన నిందితులు కారును వెనక్కు తిప్పారు. ఎస్ఐ కారును వెంబడించారు. నిందితులు గోలి గ్రామంలో కారును వదిలేసి పరారయ్యారు. ఎస్ఐ వెంటాడి గోలి సమీపంలోని క్వారీలో జూలకంటి సుధాకర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు పరారయ్యారు. మరో నలుగురు అంతకు ముందే సత్రశాలలో దిగి నల్గొండ జిల్లాలోకి వెళ్లిపోయారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల అదుపులో ఉన్న సుధాకర్‌ను విచారించగా తన అన్న సురేష్ సూచనలతో ఏడుగురం ఈ హత్య చేసినట్లు వెల్లడించాడు. -
ఫిలింనగర్లో దారుణం..
హైదరాబాద్: ఫిలింనగర్లో దారుణం చోటుచేసుకుంది. బానోతు జగన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సైదప్ప బస్తీలో మంగళవారం తెల్లవారుజామున ఇంటిముందు గేటు శబ్ధం రావడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారన్న అనుమానంతో ఇంటి యజమానులు పైఅంతస్తుకు వెళ్లి చూడగా జగన్ చనిపోయి ఉన్నాడని, ఆ సమయంలో అక్కడే మరో వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడని భార్య దేవికని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పిందని, దీంతో అనుమానం వచ్చి ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోయాడని వారు చెబుతున్నారు. జగన్ చాలా మంచి వ్యక్తి అని, మరో వ్యక్తితో కలిసి భార్యనే హత్య చేసి ఉంటుందని వారు చెప్పారు. వెంటనే పోలీసులకు విషయం చేరవేశామని వారు తెలిపారు. పెళ్లైననాటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. కాగా, జగన్ మద్యం మత్తులో ఉండగా, అతని పురుషాంగంపై దాడి చేసి, నోట్లో హిట్ కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య దేవికని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు జగన్ స్వస్థలం గుంటూరు జిల్లా మాచర్ల. జగన్ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం
-
అండగా ఉంటామంటూ పదవిని ఒదులుకోమన్నారు..
► అండగా ఉంటామంటూ పదవిని ఒదులుకోమన్నారు.. ►దిక్కుతోచని స్థితిలోనే చైర్పర్సన్ శ్రీదేవి రాజీనామా! మాచర్ల: ఎలాగైతేనేం వైరిపక్షం విజయం సాధించింది...ఒక పక్క భర్తను కోల్పోయి బాధలో ఉన్నా ఆమెను రాజకీయంగా వెంటాడుతూనే ఉన్నారు... పదవి వదులుకో మేము సహాయం చేస్తామంటూ పరామర్శల పేరుతో నిత్యం రాజకీయాలు నడిపారు...పార్టీ ఒప్పందం పేరుతో చివరికి పంతం నెగ్గించుకున్నారు. మాచర్ల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామలు చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ అంతర్గత పోరులో భాగంగా కథ ఎలా నడిచిందంటే.... రెండున్నర సంవత్సరాల కిందట మున్సిపల్ ఎన్నికలు వచ్చిన సమయంలో ఎవరూ ముందుకు రాకపోవటంతో గోపవరపు శ్రీదేవి కుటుంబాన్ని రంగంలోకి దించారు. రెండున్నరేళ్ల ఒప్పందంతో శ్రీదేవి మున్సిపల్ పీఠాన్ని అధిరోహించారు. అయితే పదవిలో ఉన్నా ఏ ఒక్క పనీ చేయనీయకుండా వైస్‌చైర్మన్ వర్గీయులు రాజకీయం నడిపి ఇబ్బందులకు గురిచేశారు. పదవి దిగేందుకు ఆరు నెలలు అవకాశం ఉన్నా... అందరి నాయకుల వద్దకు తిరిగి చైర్పర్సన్ వర్గీయులపై నానా ఆరోపణలు చేసి వేధించారు. దీంతో నిత్యం ఆలోచనలతో మానసిక ఒత్తిడికి గురై చైర్పర్సన్ భర్త మృతిచెందారు. అప్పటి వరకు ఒప్పందం పేరుతో కథ నడిపిన నాయకులు ఆ తర్వాత పరామర్శల పేరుతో తెర లేపారు. అండగా ఉంటామన్నారు. ఒంటరిగా మిగిలిన శ్రీదేవిని పార్టీ ఒప్పందం పేరుతో రాజీనామా చేయలంటూ ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. తమ పంతం కోసం మంతనాలు కొనసాగించారు. మీడియాకు తెలిస్తే ఇబ్బందని రాత్రికిరాత్రి చర్చలు జరిపి అనుకున్నది సాధించారు. ఈ పదవి నాకొద్దు అంటూ కన్నీటితో నమస్కారం పెట్టి గోపవరపు శ్రీదేవి రాజీనామా చేశారు. సర్వస్వం కోల్పోయి దిక్కు తోచని స్థితిలో తనకు ఎవరూ అండగా ఉండే అవకాశం లేదని, భర్త మానసికంగా ఒత్తిడికి గురై మృతిచెందిన విధంగానే తనకు కూడా ఏదైనా జరిగితే కుమారుడు దిక్కులేని వాడవుతాడనే ఆలోచనతో కూడా శ్రీదేవి తప్పుకున్నట్టు చెబుతున్నారు. శ్రీదేవిని పదవినుంచి తప్పించడంలో ఓ సామాజిక వర్గం రాజకీయం నడిపినట్టు స్థానికంగా చర్చించుకుంటున్నారు. బాధలో ఉన్న చైర్పర్సన్ కుటుంబాన్ని ఓదార్పు పేరుతో సందర్శించిన నాయకులు ఒప్పందాన్ని కూడా అమలు చేయాలంటూ ఒత్తిడి తెచ్చి రాత్రికిరాత్రి విషయాన్ని సెటిల్ చేసినట్లు చర్చనడుస్తోంది. చైర్మన్ వర్గానికి అనుకూలంగా ఉన్నట్లు మాట్లాడుతూనే రాజకీయంగా చక్రం నడిపినట్లు చెబుతున్నారు. శ్రీదేవి రాజీనామా చేసిన కొద్ది గంటలలోనే మున్సిపల్ వైస్‌చైర్మెన్ మంగమ్మ సమావేశానికి అధ్యక్షత వహించి పలువురు నాయకుల అభినందనలు అందుకున్నారు. మొత్తంగా మాచర్ల తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఒక మహిళ నుంచి మరో మహిళకు దక్కిన తీరు చూసి ఔరా రాజకీయం అంటూ ప్రజానీకం ముక్కున వేలేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
మాచర్ల: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం మందాటిబోడు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. క్వారీలో పని చేయడానికి బైక్ పై వెళ్తున్న ముగ్గురు కూలీలు మందాటిబోడు వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మావోయిస్టు పోస్టర్ల కలకలం
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో మావోయిస్టు పోస్టర్లు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. బుధవారం ఉదయం గ్రామ ప్రధాన రహదారిపై బడ్డీ కొట్టుకు రెండు పోస్టర్లను అంటించి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పదేళ్ల క్రితం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌కు గ్రామానికి చెందిన కుక్కమూతి శ్రీనుయే కారణమని అందులో ఆరోపించారు. మావోయిస్టుల పేరుతో నగదు వసూళ్లకు పాల్పడుతున్న అతడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అందులో హెచ్చరించారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. -
కుటుంబకలహాలతో మహిళ దారుణ హత్య
మాచర్ల: గుంటూరు జిల్లాలో శుక్రవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. కుటుంబకలహాల నేపథ్యంలో మహిళను సమీప బంధువు అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. ఈ దారుణం మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు భార్య కాంతమ్మ(40)కు ఆమె సోదరి కుటుంబంతో తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కాంతమ్మ ఇంటి ముందు ఉండగా సోదరి కొడుకు వెంకట్రావు గొడ్డలితో విచక్షణా రహితంగా నరకాడు. దీంతో కాంతమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం వెంకట్రావు అక్కడి నుంచి పరారయ్యాడు. సీఐ శివశంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి వెళ్లొచ్చేసరికి..
మాచర్ల: పొరుగూరికి పెళ్లికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. సిరిగిరిపాడు గ్రామానికి చెందిన కొండయ్య రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి పెళ్లికి వెళ్లాడు. ఇదే అదునుగా చేసుకున్న దొంగలు కొండయ్య ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.40 వేల నగదు, 10 సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. శనివారం తెల్లవారుజాము ఇంటికి చేరుకున్న బాధితులు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి
మాచర్ల: గుంటూరుజిల్లా ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మృతి చెందింది. మాచర్ల మండలం బైరనిపాడు గ్రామానికి చెందిన బత్తుల సంధ్యారాణి (20)ని కాన్పు కోసం కుటుంబసభ్యులు బుధవారం తెల్లవారుజామున మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు రక్తస్రావం అవుతున్నా పట్టించుకోలేదు. రక్తస్రావం ఆగక సంధ్యారాణి ఆరోగ్యం విషమిస్తుండడంతో మధ్యాహ్నం సమయంలో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్‌లో తరలించే చర్యలు చేపట్టారు. అయితే, అంబులెన్స్ నర్సారావుపేటకు చేరుకుంటున్న సమయంలో సంధ్యారాణి మృతి చెందింది. బాధితురాలి బంధువులు ఆందోళనకు వస్తున్నారన్న సమాచారంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించి.. తమ గదులకు తాళాలు వేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. నవజాత శిశువు వారోత్సవాల సమయంలో ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనం మారింది. -
మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య
మాచర్ల టౌన్(గుంటూరు జిల్లా): రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో మర్రి శ్రీనివాస్(36) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. సుమారు రూ.6 లక్షలు అప్పుల అయినట్లు తెలిసింది. గతంలో ఆయన ఎంపీటీసీగా పనిచేశారు. -
లైసెన్స్ లేని బాణాసంచా దుకాణం సీజ్
మాచర్ల టౌన్ (గుంటూరు) : అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న దీపావళి బాణాసంచా దుకాణాన్ని పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని సాగర్ రోడ్డులో సాయివిజయలక్ష్మి క్రాకర్స్ షాపు ఉంది. ఈ దుకాణం యజమాని గత ఏడాది పొందిన లెసైన్సును ఈ ఏడాది రెన్యువల్ చేయకుండానే విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అర్బన్ సీఐ సత్యకైలాస్‌నాథ్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సాయంత్రం దాడులు జరిపి రూ.1.50 లక్షల విలువైన బాణాసంచాను స్వాధీనం చేసుకుని, దుకాణాన్ని సీజ్ చేశారు. -
మాచర్ల చెక్ పోస్టులో తనిఖీలు
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అంతర్రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం ఉదయం జరిపిన సోదాల్లో 10 ధాన్యం లారీలను నిలిపివేశారు. ఈ లారీలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళుతున్నాయి. తనిఖీల్లో భాగంగా పన్నులు చెల్లించలేదని గుర్తించిన సిబ్బంది వాటిని నిలిపివేశారు. -
'సరస్వతి' భూములపై లేనిపోని వివాదం
సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అవి పూర్తిగా కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న భూములని.. వాటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమ పార్టీ వాళ్లపై దాడి చేశారని, ఇప్పుడు మళ్లీ అక్కడ బాంబులు దొరికాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. -
మాచర్లలో పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత
గుంటూరు : మావోయిస్టుల ప్రభావితం అధికంగా ఉన్న మాచర్లలో పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు మాచర్ల ఇన్ఛార్జ్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ పోలింగ్‌కు 1000 భద్రత సిబ్బందిని నియమించామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 245 ఉండగా,...వాటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 236 ఉన్నాయన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 129 ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టు, ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరింపచేసామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి మూడు కంపెనీల అదనపు బలగాలను రప్పించినట్లు తెలిపారు. -
'మంగళగిరి, మాచర్లలో పోటీ చేయం'
గుంటూరు: అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారంతో గుంటూరులో జిల్లా టీడీపీలో గందరగోళం చోటు చేసుకుంది. మంగళగిరి, మాచర్ల స్థానాల్లో పోటీ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు జంకుతున్నారు. తాము పోటీ చేయలేమంటూ మంగళగిరి, మాచర్ల టీడీపీ అభ్యర్థులు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిపారు. మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు తులసీ రామచంద్రప్రభు విముఖత వ్యక్తం చేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత కారణంగా మాచర్ల నుంచి బరిలో దిగేందుకు బి.శ్రీనివాసయాదవ్ ససేమీరా అంటున్నారు. మంగళగిరిలో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆరుద్ర అంకవరప్రసాద్ సిద్దమవుతున్నారు. శనివారం ఆయన నామినేషన్ వేయనున్నారని సమాచారం. -
ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
-
ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
మాచర్ల: పోలింగ్ స్టేషన్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టిన గుంటూరు జిల్లా మాచర్ల తాజా ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేశారు. పోలింగ్ స్టేషన్లో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ బెదిరించిన సంఘటనలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ అరెస్ట్‌కు ఆదేశించింది. మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా 29వ వార్డులో లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. పోలీస్ సిబ్బంది, ఇతర పార్టీల ఏజెంట్లను దుర్భాషలాడారు. ఓ దశలో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ.. నరుకుతా అంటూ బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
ఈవీఎం పగలగొట్టి.. నరికేస్తానంటూ..!
-
ఈవీఎం పగలగొట్టి.. నరికేస్తానంటూ మాజీ ఎమ్మెల్యే వీరంగం
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 29వ వార్డులో తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. పోలీస్ సిబ్బంది, ఇతర పార్టీల ఏజెంట్లను దుర్భాషలాడారు. ఓ దశలో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ.. నరుకుతా అంటూ బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని లక్ష్మారెడ్డిని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. సాయంత్రంలోపు లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశముంది. -
'మాచర్లను సీమాంధ్రకు రాజధాని చేయాలి'
-
'వైఎస్ ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు'
గుంటూరు : వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టేది కాదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఓట్లు-సీట్లు కోసం కాంగ్రెస్ రాజకీయ డ్రామా ఆడుతోందని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ నాలుగోవ వర్థంతి సందర్భంగా ఆ వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించింది. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, పేదలకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వైఎస్ఆర్ వర్థంతి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ నేత మద్దాల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు చేపట్టారు. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఇక చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.