అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారంతో గుంటూరులో జిల్లా టీడీపీలో గందరగోళం చోటు చేసుకుంది.
గుంటూరు: అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారంతో గుంటూరులో జిల్లా టీడీపీలో గందరగోళం చోటు చేసుకుంది. మంగళగిరి, మాచర్ల స్థానాల్లో పోటీ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు జంకుతున్నారు. తాము పోటీ చేయలేమంటూ మంగళగిరి, మాచర్ల టీడీపీ అభ్యర్థులు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిపారు.
మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు తులసీ రామచంద్రప్రభు విముఖత వ్యక్తం చేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత కారణంగా మాచర్ల నుంచి బరిలో దిగేందుకు బి.శ్రీనివాసయాదవ్ ససేమీరా అంటున్నారు. మంగళగిరిలో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆరుద్ర అంకవరప్రసాద్ సిద్దమవుతున్నారు. శనివారం ఆయన నామినేషన్ వేయనున్నారని సమాచారం.