elections 2014
-
ఆత్మావలోకనం అవసరం
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది. ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం. రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు! ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా? -
Telangana: రూ. 50 వేలకు మించి తీసుకెళ్లొద్దు
నిజామాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల(mlc elections) నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అభ్యర్థుల ప్రచారాలు, హడావుడి అంతగా లేకపోవడంతో ఎన్నికల కోడ్(Election Code) విషయం చాలా మందికి తెలియడం లేదు. చాలా చోట్ల సాధారణ రోజుల మాదిరిగానే నగదును తీసుకొని ప్రయాణిస్తున్నారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదుతో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ఆధారాలు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, (Nizamabad)మెదక్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56, టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీసినట్లు తెలిసింది. దీంతో ఎన్నికల అధికారులు నగదు తరలింపు, ఇతర వ్యవహారాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు దృష్టి సారించారు.ఆధారాలు లేకపోతే సీజ్ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే సంబంధిత ఆధారాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే వాటిని సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన నగదు, అప్పుగా, పంటలు అమ్మిన వచ్చిన డబ్బులతోపాటు బంగారం, వెండి కొనుగోలు చేసినా వాటికి ఇచ్చే రసీదులను వెంట ఉంచుకోవాల్సిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం, వెండి, చీరలు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులను వెంట పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.సరిహద్దుల్లో కట్టుదిట్టంజిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాది మంది నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, కార్లు, వాహనాలను చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. సరైన ఆధారాలు చూపని నగదు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగదు తీసుకెళ్లే వారు ఏమరుపాటుగా ఉండకుండా జాగ్రత్త వహిస్తూ ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, లేకపోతే నగదు సీజ్ అయ్యే ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.సరైన ఆధారాలు ఉండాలికోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశాం. పెళ్లిళ్లు, పంట విక్రయాలు చేసేవారు నగదు తీసుకువెళ్లేటప్పుడు తప్పనిసరిగా రసీదులు, ఆధార పత్రాలను వెంట ఉంచుకోవాలి. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల లోపు నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సరైన ఆధారాలు చూపిస్తే ఎన్నికల అధికారుల ద్వారా తిరిగి అందజేస్తాం.– రాజావెంకట్‌రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్ -
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి దౌర్జానాల మధ్య సగం చోట్ల ఎన్నికల వాయిదా. 3 కార్పోరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు జరగాల్సి ఉండగా 5 చోట్ల జరగని ఎన్నికలు
-
సాక్షి కార్టూన్
-
Year Ender 2024: అయోధ్యలో నూతన రామాలయం.. ట్రంప్ పునరాగమనం.. ఈ ఏడాదిలో ఆసక్తికర పరిణామాలివే
2024 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యంలో పెద్దపండుగలాంటి లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో జరగగా, అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన ఎన్నికల ఘట్టం ముగిసింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న రాజకీయాలు, ఆర్థికరంగ పరిణామాలు, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ ఇలా మరెన్నో రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.బోయింగ్‌కు కలసిరాని ఏడాదిఏవియేషన్ దిగ్గజ సంస్థ బోయింగ్ తమ 737 మ్యాక్స్‌కు గత ఏడాది ఎదురైన సమస్యలు పరిష్కారమవుతాయని భావించింది. అయితే 2024 మొదట్లో అలాస్కా ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్ విమానం ప్రయాణం మధ్యలో దాని వెనుక డోర్ ప్లగ్-ఇన్ పనితీరులో విఫలమయ్యింది. ఈ ఘటనలో ఎటువంటి భారీ ప్రమాదం జరగనప్పటికీ, 737 మ్యాక్స్ 9 తరహాకు చెందిన విమానాల తయారీ నిలిచిపోయింది. ఈ ఏడాది బోయింగ్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. మరోవైపు బోయింగ్‌కు చెందిన మాజీ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జాన్ బార్నెట్ అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు.స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ప్రయోగం విఫలంబోయింగ్ సంస్థ 2024లో చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాన ప్రయోగం అర్థాంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. వ్యోమగాములు సునీత, విల్మోర్లు ఎనిమిది రోజుల మిషన్ కోసం జూన్‌లో అంతర్జాతీయ స్సేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా, స్టార్ లైనర్‌లో లోపాలు తలెత్తాయి. థస్టర్ విఫలమవడం, హీలియం లీక్ కావడంతో సునీత, విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే 2025 ఫిబ్రవరిలో వారిద్దరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయోధ్యలో నూతన రామాలయం2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకతో ఈ ఏడాది హిందువులకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హిందువుల కల నెరవేరింది. నాటి నుంచి బాలరాముని దర్శనం కోసం లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు.ట్రంప్ పునరాగమనం2024లో అగ్రగాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ విజయం సాధించారు.మరింత ధనవంతుడైన ఎలన్ మస్క్ ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కి 2024 కలసివచ్చింది. పలు వెంచర్లలో మస్క్ విజయాలను అందుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ విజయంతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సంపద ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఉక్రెయిన్ చేతికి రష్యా ప్రాంతాలు2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 2024లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2024 ఆగస్టులో ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ ఒబ్లాస్ట్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఉక్రెయిన్ ఇతర ప్రాంతాల్లో ఓడిపోయినప్పటికీ కుర్స్క్‌పై నియంత్రణను కొనసాగించింది.ఇది కూడా చదవండి: Christmas And New Year Trip: రూ. ఐదువేలతో సూపర్ టూర్ ప్లాన్ -
సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ మూక దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి బృందంపై శుక్రవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై 50 మంది టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశాయి. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు గాయాలయ్యాయి. కెమెరా ధ్వంసమైంది. జర్నలిస్టులపై దాడి దుర్మార్గంపులివెందుల నియోజకవర్గం, వేముల మండల కేంద్రం లో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్తుల పై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డైమండ్ చేశారు.కవరేజీకి వెళ్లిన సాక్షి టివి కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము , సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గం అన్నారు. అంతేకాక కెమెరాలను, సెల్ ఫోన్లను కూడా పగులగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని సురక్షితంగా ఇంటికి పంపాలని పోలీసులను కోరారు.కూటమి ఆగడాలపై ఫిర్యాదుఇప్పటికే జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూటమి ఆగడాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోడ్యూస్ సర్టిఫికెట్ వీఆర్ఓలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు.పెద్దముడియం, మైలవరం, జమ్మలమడుగు మండలాలకు సంబంధించి వీఆర్ఓలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. కొంతమంది వీఆర్ఓలను సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారన్నారు. ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు ఉన్నారని వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ శుక్రవారం అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.సాగునీటి సంఘాల ఎన్నికలపై హైకోర్టు కాలువలకు సాగు నీరు ఎప్పుడు కావాలి? ఎంత కావాలి అనేది రైతులకు పూర్తి అవగాహన ఉంటుంది. నీటి సంఘాల్లో వీరిని భాగస్వామ్యుల్ని చేసేలా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. అందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.👉చదవండి : ప్రశాంతంగా నీటి సంఘాల ఎన్నికలు -
యూటీలు ఎటో?
కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) మొదటి నుంచీ జాతీయ పార్టీలదే ఆధిపత్యం! గత ఎన్నికల్లో యూటీల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి మరిన్ని సీట్లపై కన్నేయగా, వాటిల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది... 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూటీలను బీజేపీ కొల్లగొట్టింది. ఢిల్లీలో మొత్తం 7 సీట్లనూ చేజక్కించుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌ల్లో 3 సీట్లు నెగ్గింది. చండీగఢ్ ఎంపీ సీటును కాషాయ పార్టీ తరఫున ప్రముఖ నటి కిరణ్ అనుపమ్ ఖేర్ వరుసగా రెండోసారి గెలిచారు. అంతక్రితం ఈ సీటు కాంగ్రెస్ గుప్పిట్లో ఉండేది. డామన్ డయ్యు స్థానమూ బీజేపీ హస్తగతమైంది. 1987లో ఏర్పాటైన ఈ యూటీలో కాంగ్రెస్ 5 సార్లు, బీజేపీ 6 సార్లు నెగ్గాయి. అయితే 2009 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. అండమాన్ నికోబార్‌లో మాత్రం బీజేపీ సీటును కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది! 2009, 2014ల్లో బీజేపీ గెలిచిన ఈ స్థానం 2019లో కాంగ్రెస్ పరమైంది. దాద్రానగర్ హవేలీ సీటును 2021 ఉప ఎన్నికల్లో శివసేన గెలుచుకుంది. ఇక్కడ పలు పార్టీల తరఫున ఏకంగా ఏడుసార్లు నెగ్గిన మోహన్‌భాయ్ సంజీభాయ్ దేల్కర్ 2019లో స్వతంత్రునిగా నెగ్గారు. 2021లో అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆయన భార్య కాలాబెన్ మోహన్‌భాయ్ దేల్కర్ శివసేన తరఫున పోటీ చేసి నెగ్గారు. ఇక లక్షద్వీప్‌లో కాంగ్రెస్ హవాకు 2019లో ఎన్సీపీ అడ్డుకట్ట వేసింది. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షదీ్వప్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. మోదీ పర్యటన తర్వాత టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. పుదుచ్చేరిపై పార్టీల గురి పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలైన ఎన్ఆర్ కాంగ్రెస్ (ఎన్ఆర్సీ), డీఎంకేతో పాటు కాంగ్రెస్ కూడా చక్రం తిప్పుతున్నాయి. ఈ ఎంపీ సీటును 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ఆర్సీ గెలుచుకుంది. 2019లో దీన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుని బీజేపీ, ఎన్ఆర్సీలతో కూడిన ఎన్డీఏ కూటమికి షాకిచి్చంది. ఎన్.రంగస్వామి కాంగ్రెస్ నుండి విడిపోయి ఎన్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. నాటినుంచి ఇక్కడ కాంగ్రెస్ తేరుకోలేకపోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో ఎన్ఆర్సీ 10 చోట్ల గెలిచింది. బీజేపీకి 6 సీట్లు రావడంతో రంగస్వామి మళ్లీ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న యానాం కూడా ఉండటం విశేషం! కశ్మీర్..బీజేపీ బ్రహ్మాస్త్రం 2019లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ జమ్మూ కశ్మీర్‌పై మోదీ సర్కారు ఫోకస్ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలి్పస్తున్న ఆర్టికల్ 370ను 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 6 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019లో జమ్ము, లద్ధాఖ్లోని 3 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాశ్మీర్ లోయలోని 3 సీట్లను జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీ) చేజిక్కించుకుంది. 2014లో కూడా బీజేపీకి 3 సీట్లు రాగా పీడీపీకి 3 దక్కాయి. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లలో గెలిచి ముఫ్తీ మహమ్మద్ సయీద్ సీఎంగా సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. 2016లో ఆయన మరణించడంతో కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఏడాది సెపె్టంబర్ లోపు అక్కడ జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత దానికి మళ్లీ రాష్ట్ర హోదా దక్కే అవకాశాలున్నాయి. గతంలో ఇక్కడ చక్రం తిప్పిన కాంగ్రెస్ గులాంనబీ ఆజాద్ రాజీనామాతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సొంత పార్టీ పెట్టుకున్న ఆజాద్ చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్ములోని 2 సీట్లలో కాంగ్రెస్‌కు ఎన్సీ, పీడీపీ మద్దతివ్వనున్నాయి. కాశ్మీర్ లోయలోని 3 సీట్లపై మాత్రం పీటముడి పడింది. మూడింట్లోనూ పోటీ చేస్తామని ఎన్సీ ప్రకటించింది. పీడీపీ కూడా వెనక్కి తగ్గడం లేదు. సర్వేల అంచనాలు ఇలా... ఈసారి కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ బలం మరింత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీలో మళ్లీ క్లీన్‌స్వీప్‌తో పాటు పుదుచ్చేరి, లద్దాఖ్, చండీగఢ్ ఆ పార్టీ పరం అవుతాయంటున్నాయి. జమ్ము కశ్మీర్లో 2, దాద్రానగర్, డామన్ డయ్యు, అండమాన్ సీటు కూడా బీజేపీవేనన్నది వాటి అంచనా. కాంగ్రెస్ లక్షదీ్వప్‌లో మాత్రం నెగ్గవచ్చని, కశ్మీర్‌లోని 3 సీట్లలో ఎన్సీ గెలుస్తుందని అన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జోరు జోరుగా.. హుషారుగా.. కాంగ్రెస్!
వికారాబాద్: రాష్ట్రమంతా కాంగ్రెష్ జోష్ ఉందని.. కార్యకర్తలంతా పార్టీ గెలపుకోసం కలిసికట్టుగా పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ బూత్ కో ఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నందున అధికార పార్టీ నేతలు సైతం హస్తం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపు వ్యూహమే మన రాష్ట్రంలో అమలు చేస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు మరింత శ్రద్ధతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటుగా అధికార పార్టీ సర్వేలోనూ పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడం ఖాయమే ప్రచారం జోరుగా సాగుతోందన్నారు. బూత్ కోఆర్డినేటర్స్ ఎన్నికల ప్రక్రియను తెలుసుకోవడంతో పాటుగా క్షేత్రస్థాయిలో సైతం ఓటు వేసే విధానాల గురించి వివరించాలన్నారు. అనంతరం గద్దర్ మృతికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ ఎంపీపీ అంజిలయ్య, యువజన విభాగం అధ్యక్షుడు జంగయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శులు యాదయ్య, సత్యనారయణ, కుల్కచర్ల ఎంపీటీసీ సభ్యుడు ఆనందం, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రాంచందర్, బీసీ సెల్ అధ్యక్షుడు మహేశ్, మండల ఉపాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, పార్టీ మీడియా కోఆర్డినేటర్స్ భాస్కర్, భరత్ కుమార్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో బీజేపీ పాలనే.. బీఆర్ఎస్ ఇక నాలుగు నెలలే..
నిజామాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా నాలుగు నెలలేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం కల్వరాల్, సదాశివనగర్ మండల కేంద్రంలో వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతివృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టాన్ని చూసి బాధిత రైతుల కంటతడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు లకు పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబందు పేరుతో ఎకరాకు రూ. 5 వేలు ఇస్తూ ఇతర పథకాలను ఎత్తివేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మండలాధ్యక్షుడు నర్సింరెడ్డి, ఎంపీటీసీలు మహిపాల్ యాదవ్, భైరవరెడ్డి, నా యకులు పైళ్ల కృష్ణారెడ్డి, పొతంగల్ కిషన్‌రావు, కొప్పుల గంగారెడ్డి, మర్రి రాంరెడ్డి, సురేందర్‌రెడ్డి, మార రమేశ్‌రెడ్డి, నర్సారెడ్డి, స్వామి గౌడ్, గంగాధర్‌రావు, భూంరావ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ జీ.. అప్పుడిచ్చిన హామీ ఏమైంది?
విదేశాలలో మన నల్లధనం గుట్టలకొద్దీ మూలుగుతోందని, అదంతా తెచ్చి దేశ పౌరుల ఖాతాల్లో వేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పెద్ద నోట్ల రద్దుకు ముందు.. చెప్పారు. పెద్ద నోట్లు రద్దయ్యాయి కానీ, అకౌంట్లలో చిన్నమొత్తమైనా వచ్చి పడలేదు. ఎక్కడి నల్ల ధనం అక్కడే ఉండిపోతే ఎలా పడుతుంది. పన్నుల ఎగవేత, అవినీతి, గుప్తధనం అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు, దొంగ రవాణా.. వీటివల్ల నల్లధనం జమ అవుతూ ఉంటుంది. 1956లో మన నల్ల ధనం దేశ జీడీపీలో 4.5 శాతం ఉండగా, 1980–83 మధ్య ఇది 18 నుంచి 21 శాతానికి పెరిగింది. 2012లో భారత్‌లో మొత్తం నల్లధనం పరిమాణం రూ.63 లక్షల కోట్లని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అధ్యయనంలో వెల్లడయింది. అవినీతి నిరోధక చట్టం (1988), బినామీ లావాదేవీల చట్టం (1988), అక్రమ ధన చలామణి నిరోధక చట్టం (2002), లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలు, ఆఖరికి పెద్ద నోట్ల రద్దు కూడా నల్లధన వ్యాప్తిని నిరోధించలేక పోయాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ‘అనుబంధం’ నల్లధనం ఉత్పత్తికి ప్రధాన కారణంగా చెబుతున్న సామాజిక అభివృద్ధి అధ్యయనవేత్తలు.. మరో ఇరవై ఐదేళ్లకైనా నల్లధనం ఉత్పత్తి, విస్తృతి తగ్గితే గొప్ప సంగతేనని అంటున్నారు. 2020లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్, నార్వే.. అతి తక్కువ అవినీతి గల దేశాలుగా నిలిచాయి. ఇది కూడా చదవండి: ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్ -
ఆ మోదీ వేరు... ఈ మోదీ వేరు
ఈ దొంగలందరి పేర్లలో మోదీ అన్న పదం ఎందుకుందో...అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తే...ఆ మోదీ వేరు...మేం వేరు అంటున్నారు మోదీనగర్ వాసులు. రాహుల్ వ్యాఖ్యలతో తమకే సంబంధం లేదని, తామెవరం దొంగలం కామని వారు స్పష్టం చేస్తున్నారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య మోదీనగర్ పేరుతో ఉన్న పట్టణవాసులకు ఇబ్బందికరంగా మారింది. లలిత్ మోదీ తాతగారి ఊరైన ఈ మోదీనగర్ ఢిల్లీకి ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘజియాబాద్–మీరట్ మధ్యలో ఉన్న ఈ పట్టణం ఒకప్పుడు పలు రకాల మిల్లులు, ఫ్యాక్టరీలతో చరిత్ర ప్రసిద్ధిగాంచింది. రాహుల్ వ్యాఖ్యలతో ఈ పట్టణం రాజకీయ రొంపిలో చిక్కుకుంది. రాజకీయ రొంపిలోకి తమను లాగవద్దని వారు కోరుతున్నారు. మోదీ అన్నది మా పట్టణం పేరు. ఇది దొంగల నగరం కాదు. రాహుల్ అలా అనడం తప్పు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేశ్ కుమార్ అగర్వాల్ అనే మోదీనగర్ వాసి. ‘ఇక్కడ మోదీ పేరుతో చక్కెర కర్మాగారం ఉంది. పరిశ్రమలున్నాయి. ఆలయం కూడా ఉంది. మోదీ అన్న పేరు ఇక్కడ ఎంతో గొప్పది’అని అగర్వాల్ స్పష్టం చేశారు. 1923 ప్రాంతంలో లలిత్‌మోదీ తాతగారైన రాజ్ బహదూర్ గుజర్మల్ మోదీ పాటియాలా నుంచి ఇక్కడికి వచ్చి అనేక ఫ్యాక్టరీలు, డిగ్రీ కాలేజీ పెట్టారు. ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా అందజేసింది.మొదట్లో ఈ పట్టణాన్ని బేగమాబాద్ అని పిలిచేవారని, గుజర్మల్ మోదీ చేసిన అభివృద్ధికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఆయన పేరు పెట్టిందని 76 ఏళ్ల మిథిలేశ్ చెప్పారు. మోదీలను కించపరచడానికి వారు కేవలం ఏదో ఒక వర్గం వారు కాదని, పార్శీలు, ముస్లింలు, ఇతర సామాజిక వర్గాల వారిని ఇక్కడ వృత్తిరీత్యా మోదీలుగా పిలుస్తారని మిథిలేశ్ తెలిపారు. నిజాయితీకి, కష్టించే తత్వానికి ప్రతీకగా మోదీ పేరు నిలుస్తుందన్నారు. -
మేనిఫెస్టోల్లో ప్రజాసమస్యలు మాయం
భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా సమస్యల ప్రస్తావన మచ్చుకైనా మేనిఫెస్టోల్లో లేకపోవడం విచారకరం. బీజేపీతోసహా రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవు. ప్రతి ఎన్నికల ప్రచారం వివాదాలకు ఆజ్యం పోయడంతోనే ముగుస్తోంది. మానవాభివృద్ధి నివేదికల్లో మన దేశం చిన్న చిన్న దేశాల కంటే అట్టడుగుస్థానంలో పడిపోయింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నిద్రపోతున్న దయనీయమైన స్థితి, 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తుండటం.. ఇవేవీ మేనిఫెస్టోల్లో చోటుచేసుకోకపోవడం గర్హనీయం. ఎవరైతే సమాజగమనాన్ని మార్చడానికి నిరంతరం శ్రమిస్తారో, పరిష్కారమార్గాలకోసం పరితపిస్తారో, తమ కార్యాచరణ ద్వారా ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు కారణమవుతారో, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల మనసుల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తం గానూ ఎందరో త్యాగధనులు దేశ భవిష్యత్తుకోసం తమ జీవితాలను ధారపోశారు. కానీ ఇటీవల మన దేశంలో జరుగుతున్న పరిణామాలనూ, నడుస్తున్న చరిత్రనూ గమనిస్తే నిరాశే మిగులుతుంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు చాలా ఉత్సాహంతో, ప్రణాళికలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. సభల్లో అధినాయకుల ప్రసంగాల్లోనూ ప్రజలకు హామీలు గుప్పించేస్తున్నారు. అయితే చాలా వరకు రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, ఓటర్ల సాక్షిగా నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవనడంలో సందేహం అక్కర్లేదు. ప్రజల సమస్యలు పాక్షికంగానే ప్రస్థావనకు వచ్చాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలకు వాళ్ళ ప్రణాళికల్లో, ప్రసంగాల్లో చోటు దక్కడంలేదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రణాళికను గమనిస్తే మరింత ఆందోళన కలుగుతోంది. ఈ దేశంలో అన్ని విషయాలతో పాటు కులం ఒక నిజం. కులం ఒక వర్గీకరణ మాత్రమే కాదు. అది వివక్షకూ, అణచివేతకూ, అసమానతలకూ ప్రతిరూపం. ఇప్పటికీ అంటరానితనానికీ, అవమానాలకూ గురవుతున్న దళితుల విషయంగానీ, సమాజానికి దూరంగా అడవుల్లో నివసిస్తూ, తమ జీవితాలతో పాటు అల్లుకొని వున్న అటవీ సంపదనూ, ఖనిజవనరులనూ కొల్లగొడుతుంటే చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోతున్న ఆదివాసుల ఊసుగానీ ఈ ప్రణాళికల్లో కనిపించకపోవడం గమనించాల్సిన విషయం. అలాగే వృత్తులనూ, ఉపాధినీ కోల్పోయి పొట్టచేత పట్టుకొని ఎక్కడెక్కడికో వలసపోతున్న బీసీ కులాల గురించిగానీ, మతం పేరుతో వివక్షకూ, హింసకూ గురవుతున్న మైనారిటీల గురించిగానీ ఎన్నికల ప్రణాళికలు పట్టించుకున్న పాపాన పోలేదు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ప్రస్థావన మచ్చుకైనా ప్రణాళికల్లో లేకపోవడం గర్హనీయమైన విషయం. గతంలో ఇదే బీజేపీ ప్రణాళికల్లో మాట వరసకైనా ఈ విషయాలను చేర్చింది. కానీ ఈసారి అవేవీ వీరి దృష్టినైనా తాకకపోవడం విచారకరం. పైగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదల కోసం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్ల విషయం మాత్రం చాలా ప్రముఖంగా పేర్కొన్నారు. ఆ పార్టీలో కొనసాగుతున్న ఈ వర్గాల నేతలుగా కొనసాగుతున్న వారు కూడా ఎందుకు నోరు మెదపడంలేదో అర్థం కాని విషయం. పైగా, ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో పేదరికం, ఆకలి, అభద్రత, ఆరోగ్యం, విద్య లాంటి సమస్యలు కూడా ఏ ఎన్నికల ప్రణాళికలోనూ చర్చకు రావడం లేదు. ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార స్థితిగతులపై 2018లో విడుదలైన ఒక నివేదిక ఎన్నో కఠినమైన విషయాలను బయటపెట్టింది. ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధ్యయనంలో దాదాపు 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తున్నట్టు తేలింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉంటున్న దయనీయ స్థితి ఉన్నదని తెలిసింది. దేశంలోని 21 శాతం మంది పిల్లలు వయసుకి తగ్గ శారీరక ఎదుగుదల లేక అనారోగ్యంతో బతుకులీడుస్తున్నారని కూడా ఆ సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్త ఆకలి సూచికలో మన దేశం 103వ స్థానంలో ఉంది. ఈ సంస్థ సర్వే చేసిన దేశాలు 119 మాత్రమే. అంటే మన దేశం అ«ట్టడుగు స్థితిలో 7వ స్థానంలో ఉంది. వీటన్నింటితో పాటు, గ్రామీణ, పట్టణ పేద మహిళలు దాదాపు 51.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తీవ్ర ఆందోళన కలిగించే ఇలాంటి అంశాలేవీ ఈ అతిపెద్ద ఎన్నికల్లో చర్చకు నోచుకోకపోవడం గమనార్హం. చర్చలే జరగకపోతే, మన పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు సైతం ఆకలి సూచికలో మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ మార్చిలో విడుదలైన ఏడవ ప్రపంచ సంతోషదాయక నివేదిక మన దేశంలో గూడుకట్టుకున్న దుఃఖాన్ని ప్రతిబింబించింది. మన పొరుగుదేశమైన భూటాన్ ఆలోచన ప్రకారం మనిషికి ఆర్థికంగా అందే ప్రయోజనాలతో పాటు, ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరా? అనేది కూడా పరిశీలించాలనే ప్రయత్నం మొదలైంది. మార్చి 21న ప్రతి సంవత్సరం సంతోష దినోత్సవం జరుపుతూ గత ఏడేళ్ల నుంచి ఐరాస నివేదికలను విడుదల చేస్తున్నది. అందులో మన దేశం మొదటి నుంచీ వెనుకబడే ఉంది. 2013లో 111వ స్థానం, 2015లో 117వ స్థానం, 2016లో 118వ స్థానం, 2017లో 122వ స్థానం, 2018లో 122వ స్థానం. ఇక 2019లో 140వ స్థానానికి పడిపోవడం మన దేశ దుస్థితినీ, ప్రజల్లోని అసంతృప్తినీ చాటిచెపుతోంది. దేశ ప్రజల సంతోషం గ్రాఫ్ విషయంలో పాక్, బంగ్లాదేశ్, లాంటి దేశాలు కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. ఈ నివేదికలో గృహ వసతి, ఆదాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఉద్యోగం, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు, ఆయుర్దాయం, రక్షణ లాంటి విషయాలను పరిగణనలోనికి తీసుకున్నారు. మన దేశంలో ఆదాయాలు ఎక్కువగా ఉన్న వర్గాలు కూడా సంతోషంగా లేవని ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆరోగ్యంపై పెరుగుతున్న భారం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల విద్య విషయంలో అవుతున్న వ్యయం కూడా ఈ వర్గాలను వేధిస్తున్నది. ముఖ్యంగా నగరీకరణ పెరుగుతుం డటం వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలు ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. నగరాలలోకి ఆడపిల్లలను పంపాలనే ఆలోచన కూడా తల్లిదండ్రులను భయపెడుతున్నది. గత ఐదేళ్ళలో భిన్న విశ్వాసాలు, ప్రజల్లో పెరుగుతున్న వైషమ్యాలు కూడా ఈ దేశంలోని ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు కారణంగా భావించొచ్చు. వీటన్నింటితో పాటు దేశానికి శక్తివంతమైన మానవ వనరులు మన యువత. ఈ దేశంలోని కోట్లాది మంది యువతీ, యువకులు అభద్రతలో కొట్టుమిట్టాడుతున్నారు. 2018లో మన నిరుద్యోగం రేటు 3.5 శాతం. దాదాపు 40 కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగానే జీవితాలను గడుపుతున్నారు. ఇది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే అంశం. ఎందుకంటే, సమాజ స్థితిని తెలియజేసేది యువత ఎదుగుదల మాత్రమే. ఈ ప్రమాదకర పరిస్థితి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇన్ని సమస్యలున్నా భారతదేశం పేద దేశం మాత్రం కాదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశమే. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మన స్థూల జాతీయదాయం చూస్తే మన దేశ ఆర్థిక పురోగతి అర్థం అవుతుంది. 1951 నుంచి మన సరాసరి స్థూల జాతీయాదాయం 6.21 శాతంగా ఉండింది. కానీ 2010లో 11.40 శాతాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. మన దేశ స్థూల జాతీయాదాయం దాదాపు రెట్టిం పైంది. అయితే ఇది ప్రజల బతుకుల్లో ఎక్కడా కనిపించడంలేదు. మన దేశంలో దేశ సంపద పెరుగుతున్నది. కానీ అది కొద్దిమంది చేతుల్లోకే చేరుతున్నది. ‘పెరుగుతున్న అంతరాలు’ పేరుతో ఆక్స్‌ఫామ్ అనే అంతర్జాతీయ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆదాయాల్లో అంతరాల గురించి సవివరంగా పేర్కొన్నారు. మనదేశంలోని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ 59 వ నివేదికలో ఇదే రకమైన ఆందోళనను వ్యక్త పరిచింది. దేశంలో అంతరాలు 1990 నుంచి పెరగడం ఎక్కువైంది. సరళీకరణ ఆర్థిక విధానాలూ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల ఆదాయాల్లో అంతరాలు ఆకాశాన్నంటుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. 2017లో వెలువరించిన ప్రపంచ సంపద నివేదికలో పేర్కొన్నట్టు, 2002లో పది శాతం మంది చేతుల్లో 52.9 శాతం సంపద ఉండగా, 2012 కి వచ్చేసరికి 62.1 శాతానికి పెరిగింది. అదేవిధంగా 2002లో 15.7 శాతం సంపద కేవలం ఒక్కశాతం మంది చేతుల్లోనే పోగుపడింది. 2012లో అది 25.7 శాతానికి మించి పోయింది. దీనివల్ల దేశంలో ప్రజల్లో ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం పెరిగిపోతున్నది. ఈ విషయాలేవీ కూడా ఈ ఎన్నికల్లో చర్చకు కూడా రాకపోవడం గమనార్హం. దీనికి బలమైన కారణం ఉన్నది. ఈ దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులూ, వ్యాపారులూ, పారిశ్రామిక వేత్తలూ, వాణిజ్యవేత్తలూ, అవినీతిమయమైన బ్యూరోక్రసీ ఒక కూటమిగా ఏర్పడింది. దీనితో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఏర్పడిన బడ్జెట్లూ, సహజ వనరులైన భూమి, అడవి, భూగర్భ సంపద అంతా కొందరి చేతుల్లోకి పోయింది. దానితో లక్షల రూపాయల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న వాళ్ళు అనతికాలంలోనే వేలకోట్లకు అధిపతులుగా మారుతున్నారు. ఈ స్థితిలో జరుగుతున్న ఎన్నికలు ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబించకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. కానీ సమాజం దీన్ని సమస్యగా భావించకపోవడమే నేరమౌతుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
బీజేపీ చరిత్రలో తొలిసారిగా...
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్‌సభ బరిలో అత్యధిక అభ్యర్థులను బరిలో నిలపనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకుగాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటి వరకు 408 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. మరో 30 స్థానాలకు గెలుపుగుర్రాల కోసం అన్వేషిస్తోంది. దీంతో బీజేపీ చరిత్రలో అత్యధికంగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఎన్నికగా రికార్డు సృష్టించనుంది. దేశ వ్యాప్తంగా గల 543 స్థానాలకు గత ఎన్నికల్లో 428 మంది బరిలో నిలపిన విషయం తెలిసిందే. అంతకుముందు 2009 ఎన్నికల్లో 433, 2004లో 364, 1999 ఎన్నికల్లో 339 అభ్యర్థులను కమలం పార్టీ బరిలో నిలపింది. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు.. ఏడు లోక్‌సభ స్థానాలు గల ఢిల్లీలో టికెట్ కోసం ఎంతోమంది పోటిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల ఒప్పందంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో సరైన అభ్యర్థుల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. 80 లోక్‌సభ స్థానాలు గల యూపీలో కూడా మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పంజాబ్, హర్యానాలో శిరోమణీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ.. ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మధ్యప్రద్‌శ్‌లో మరో ఎనిమిది స్థానాలకు పెండింగ్‌లో ఉంచింది. ఏపీ, తెలంగాణలో గత ఎన్నికల్లో కేవలం 12 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఈసారి ఒంటరిగా మొత్తం 42 స్థానాల్లోనూ బరిలో నిలిచింది. గత ఎన్నికల మాదిరీగానే ఈసారి కూడా కే్ంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుంతుందని ఆ పార్టీ నేతలు ధీమావ్యక్తం చేస్తున్నారు. కాగా 2014 ఎన్నికల్లో 280పైగా స్థానాలను కైవసం చేసుకుని తొలిసారి ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
2014 ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాకయ్యాయి
-
మళ్లీ తెరపైకి వామపక్ష ఐక్యత!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పరస్పర పోటీలు, అవి ముగిశాక ఐక్యతా ప్రయత్నాలు అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి. వామపక్షాల ఐక్యత అంటూ కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో ఈ పార్టీలకు కనీసం ఒక్క సీటైనా దక్కకపోగా ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువగా ఓట్లు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఈ పార్టీల పరిస్థితి నిరాశాజనకంగా తయారైంది. ఎన్నికలకు ముందు ఇరు పార్టీల నేతలు తాము పోటీచేస్తున్న కూటముల విషయంలో పరస్పరం బహిరంగ విమర్శలకు సైతం దిగారు. కనీసం కలిసి పోటీ చేసే పరిస్థితులు లేకపోవడమే కాకుండా పరస్పర విమర్శలు చేసుకుంటుండటంతో ప్రస్తుతం ఈ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు ముందుగా రాష్ట్ర స్థాయిలో వామపక్ష ఐక్యతపై దృష్టి పెట్టాలంటూ ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వామపక్ష ఐక్యత అంటూ మళ్లీ రెండు పార్టీల మధ్య రాజీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతకుముందు తలోదారి.. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమిలో సీపీఐ చేరింది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర పక్షాలు, ప్రాంతీయ పార్టీలను ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నాలకు ఇది ఊతమిస్తుందని ఆ పార్టీ భావించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల కల్లా జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పడకపోయినా, రాష్ట్ర స్థాయిల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య స్నేహం పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని సీపీఐ జాతీయ నాయకత్వం భావించింది. అందుకే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరేందుకు మొదటి నుంచీ సీపీఎం ఉత్సాహం చూపలేదు. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తామంటూ గతంలో జాతీయపార్టీ చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. సీపీఐ, ఇతర వామపక్షాలు, సామాజిక సంఘాలు, సంస్థలతో కలిసి తన ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకే సీపీఎం మొగ్గుచూపింది. ఇందులో భాగంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ప్రయోగాలు విఫలం కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. మరోవైపు సీపీఐ, సీపీఎం జాతీయ పార్టీలు కూడా ముందు వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ తాజాగా సూచించడంతో రాష్ట్ర స్థాయిలో కమ్యూనిస్టు పార్టీల ఐక్యతా ప్రయత్నాల్లో భాగంగా స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై ఈ పార్టీలు దృష్టి సారించాయి. -
రాజ్‌భవన్ ముట్టడి యత్నం విఫలం
సాక్షి, బెంగళూరు: గవర్నర్ వజూభాయ్ వాలా సంఖ్యాబలం లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్‌భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్వీన్స్క్రాస్ రోడ్డులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాజ్‌భవన్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి సమీపంలోని కబ్బన్పార్కుకు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. గవర్నర్, పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ సమీపంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమంలో ఎంపీ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధారాలతో ఆడియో క్లిప్పును విడుదల చేసింది. చిత్రదుర్గ గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దడ్డల్కు మంత్రి పదవితో పాటు భారీగా డబ్బు ఆశచూపినట్లు అందులో ఉంది. -
బీజేపీ తరఫునే సీఏ పనిచేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరఫున పనిచేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన ‘స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ లాబరేటరీస్ (ఎస్సీఎల్–గ్రూప్)’కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ), అంతకుముందు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎన్నికల్లో కూడా తన సేవలను అందించిందన్న విషయంపై చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. 2010లో బీహార్ ఎన్నికల్లో జేడీయూ తరఫున మొదటి సారి భారత ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఆ తర్వాత ఏయే ఎన్నికల్లో ఏయే పార్టీల తరఫున పనిచేసిందో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో సీఏ సంస్థ ఓ రాజకీయ పార్టీ తరఫున పనిచేసిందని, అందులో 300 మంది శాశ్వత సిబ్బంది, 1400 మందిని తాత్కాలిక ఉద్యోగులతో తన సేవలను అందించిందని ‘క్వార్ట్స్జ్’ డాట్ కామ్ తాజాగా సేకరించిన డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. భారత్‌లోని అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, కటక్, గజియాబాద్, గువహటి, ఇండోర్, కోల్‌కతా, పట్నా, పుణె అనే నగరాలను కేంద్రంగా సీఏ తన సేవలను అందించింది. భారత్ ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా పనిచేసిందని, బహూశ తమ క్లైంట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చని ఈ కంపెనీ మాజీ ఉద్యోగి ఈనెల 27వ తేదీన బ్రిటీష్ పార్లమెంటరీ కమిటీ ముందు అంగీకరించడం, కాంగ్రెస్ పార్టీ క్లైంట్ కాదని కంపెనీ వర్గాలు ప్రకటించడం తెల్సిందే. వీటిలో ఎవరి మాట నిజమైందో తెలియదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఏ నిజంగా పనిచేసినట్లయితే కంపెనీ పరువు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తాము సేవలందించిన స్థానాల్లో 92 శాతం తన క్లైంట్ అభ్యర్థులు విజయం సాధించారని కంపెనీ తెలిపింది. ఈ లెక్కన ఆ కంపెనీ బీజేపీ పార్టీ తరఫునే సేవలు అందించి ఉండాలి. స్పష్టత కోసం సీఏ, ఎస్సీఎల్ యాజమాన్యం నుంచి సమాధానాన్ని కోరింది. అయితే వారి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. వాస్తవానికి సీఏ 2013లో ఆవిర్భవించినప్పటికీ దాని మాతృసంస్థ ఎస్సీఎల్ 2003లో ఏర్పాటైన నాటి నుంచి భారత్‌లో ఎన్నికలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. 2003లో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో ప్రధాన రాష్ట్ర పార్టీ సంస్థాగత బలం, ఓటర్ల ప్రవృత్తి, రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలపై అదే సంవత్సరం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ తరఫున ఓటర్ల నాడి, ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మళ్లే ఓటర్లను గుర్తించడం లాంటి అంశాలపై సంస్థ అధ్యయనం జరిపింది. 2007లో జిహాది గ్రూపుల నియామకాలను ఎలాంటి ప్రచారం ద్వారా ఎదుర్కోవాలి అన్న అంశంపై కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, జార్ఖండ్, యూపీ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. 2010 బీహార్ ఎన్నికల్లో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసినట్లు డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఈ సేవల కోసం సీఏ సంస్థ ఓటర్ల ఫేస్బుక్ ఖాతాలను వాడుకుందనే విషయం వెలుగులోకి రావడంతో ఈ అంశంపై గొడవ జరుగుతున్న విషయం తెల్సిందే. -
మొదలైన కౌటింగ్.. ఎవరిదో గెలుపు?
-
మొదలైన కౌటింగ్.. ఎవరిదో గెలుపు?
లక్నో: ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ లో 75 జిల్లాల్లోని 78 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. లక్నోలో కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పంజాబ్ లోని 24 ప్రాంతాల్లోని 54 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లుధియానా కౌంటింగ్ కేంద్రంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మణిపూర్ లోని 11 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. గెలుపెవరిదన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. విజయంపై ఆయా పార్టీల అభ్యర్థులు దీమాగా వ్యక్తం చేస్తున్నారు. -
'దేశ' ఎజెండానే రామ మందిర నిర్మాణం!
లక్నో:అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనేది దేశ ప్రజల అభిలాషని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) స్పష్టం చేసింది. ఇందుకు ప్రభుత్వానికి చాలా సమయం ఉందని ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ తెలిపారు. చట్టపరిధిలో రామమందిరం నిర్మించడానికి ప్రభుత్వానికి 2019 వరకూ సమయం ఉందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కర్యాకారి మదల్ సమావేశం తొలిరోజు కార్యక్రమంలో భాగంగా హాజరైన దత్తాత్రేయ మీడియాతో్ మాట్లాడారు. 'రామ మందిరం అనేది దేశ ఎజెండా. అది యావత్తు జాతి కోరిక. ఇందులో భాగంగానే వీహెచ్ పీకి మేము మద్దతు తెలుపుతున్నాం'అని తెలిపారు. ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణంపై బీజేపీ తీసుకున్ననిర్ణయంతోనే కేంద్రంలో పూర్తి ఆధిక్యంతో పగ్గాలు చేపట్టందన్నారు. అయితే అదే డిమాండ్ ను తాము మళ్లీ ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న రామ మందిర నిర్మాణంపై ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
అధికారంలో ఉంటే వీరంగం సృష్టిస్తారా?
-
ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో నాశనం చేశారు!
-
'టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారు'
-
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది
-
'పచ్చ'స్వామ్యం
-
తప్పుడు హామీలు మనం ఇవ్వలేదు.. ఇవ్వలేం కూడా..
-
ఉత్తరాంధ్ర బాగుకే అమ్మను నిలబెట్టా!
-
'పార్టీలో నష్టనివారణ చర్యలు ప్రారంభించాం'
విశాఖ: పార్టీలో నష్ట నివారణ చర్యల ప్రారంభించామని వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీకి నష్టం కలిగించిన వారిపై పార్టీ పెద్దలు లోతుగా దృష్టిపెట్టారన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ధర్మాన..త్రిసభ్య కమిటీ నివేదికను బట్టే పార్టీకి నష్టం కలిగించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. రాజధాని విషయంలో తెరచాటు వ్యవహార మంచిది కాదన్నారు. విశాల దృక్పధంతో రాజధాని ప్రాంతం గుర్తించాలన్నారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాన సూచించారు. విశాఖ రూరల్‌జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాల్లో పరిస్థితిపై అనకాపల్లిలో సమీక్ష నిర్వహించామన్నారు. దీనిని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సమీక్షలో చర్చించామన్నారు. స్థానిక సంస్థల ఫలితాల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ప్రస్తుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలుతోపాటు పార్టీ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యకర్తలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన ప్రణాళికలకు చర్యలు చేపట్టామన్నారు. -
గెలుపోటములు సహజం
పార్టీకి ఆదరణ ఉంది కార్యకర్తలూ.. నిరుత్సాహం వద్దు మాజీ మంత్రి ధర్మాన 9 నియోజవర్గాలపై సమీక్ష మునగపాక, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, లోపాలను సరిదిద్దుకొని పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి అవసరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి, త్రిసభ్యకమిటీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. అనకాపల్లిలో పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా మునగపాక వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ ఉందన్నారు. మోసపూరిత హామీలు, డబ్బు ప్రభావంతో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ రూరల్‌జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాల్లో పరిస్థితిపై అనకాపల్లిలో సమీక్ష నిర్వహించామన్నారు. దీనిని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సమీక్షలో చర్చించామన్నారు. స్థానిక సంస్థల ఫలితాల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలుతోపాటు పార్టీ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యకర్తలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైనప్రణాళికలకు చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గాలవారీ సమీక్ష అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరా తీశారు. ధర్మాన ప్రసాద్‌రావు, జోగి రమేష్, సాయి రాజులతో కూడిన బృదం పట్టణంలోని న్యూకాలని రోటరీ కల్యాణమండపంలో ఆదివారం గ్రామీణ జిల్లాలోని చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, యలమంచిలి, నర్సిపట్నం, పాయకరావుపేట, పెందుర్తి నియోజకర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలుపొందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు. కార్యకర్తలు, నాయకులతో సమీక్షించారు. జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అధ్యక్షతన నియోజకవర్గాల వారీ సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, కిడారి సర్వేశ్వరావు, గిడ్డ ఈశ్వరి,అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పార్టీ నాయకులు గండి బాబ్జి, కరణం ధర్మశ్రీ, చెంగల వెంకట్రావు, ప్రగడ నాగేశ్వరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్సీపీ నాయకులు మళ్ల సంజీవరావు,పిన్నమరాజు వెంకటపతిరాజు(చంటిరాజు),మళ్ల బుల్లిబాబు, పెంటకోట శ్రీనివాసరావు, భీశెట్టి జగన్, టెక్కలి కొండలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మోడీ నుంచి జనం కోరేదిదీ!
-
ఎవరికి వారు సీఎం అవ్వాలనుకుంటే.. ఇదే గతి!
-
కేసీఆర్‌కు ఇక 'పరీక్షా' సమయం
-
లోక్‌సభ సభ్యులూ 'పెద్దలే'
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎంపీ కావాలంటే ఆషామాషీ విషయం కాదు. లోక్‌సభకు పోటీచేసి గెలవాలంటే రాజకీయాల్లో తలపండిపోవాలి. చాలా తక్కువ మందికి మాత్రమే తక్కువ వయసులో గెలిచే అవకాశం ఉంటుంది. 16వ లోక్‌సభనే చూసుకుంటే.. మనకున్న మొత్తం 543 మంది ఎంపీలలో, ఏకంగా 253 మందికి 55 ఏళ్లకు పైగా వయసుంది. అదే గత లోక్‌సభలో అయితే ఈ వయసు దాటినవాళ్లు 234 మందే. దేశ చరిత్రలోనే ఇంత ఎక్కువ మంది పెద్దవయసు వాళ్లు లోక్‌సభకు ఎంపిక కావడం ఇదే ప్రథమమని అంటున్నారు. కాగా, ప్రతిసారీ లోక్‌సభకు ఎన్నికవుతున్న పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నా.. లోక్‌సభకు మాత్రం పెద్దవాళ్లే ఎన్నికవుతున్నారు. ఈసారి లోక్‌సభలో కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీ. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయనకంటే పెద్ద వయస్కులు ఎవరూ ఈ సభలో లేరు. ఇక మరో సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి వయసు 80 ఏళ్లు. మాజీ ప్రధాని దేవెగౌడకు 81 ఏళ్లు. ఇక ఇప్పటివరకు లోక్‌సభకు అత్యంత ఎక్కువసార్లు ఎన్నికైన సభ్యుడు.. కాంగ్రెస్ ఎంపీ కమల్‌నాథ్ (67). ఆయన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నుంచి ఇప్పటికి తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. లోక్‌సభలో 40 ఏళ్లలోపు వయసున్న ఎంపీలు కేవలం 13 శాతం మందే.. అంటే 71 మంది మాట. ఈసారి అత్యంత పిన్నవయస్కులలో ఐఎన్ఎల్డీ అధినేత ఓంప్రకాష్ చౌతాలా మనవడు దుష్యంత్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ ఉన్నారు. ఈ జాబితాలో ఇంకా. చెన్నైకి చెందిన డాక్టర్ జె.జయవర్ధన్, హీనా గవిత్, రక్షా నిఖిల్ కూడా ఉన్నారు. -
ఎందుకు ఓడిపోయామంటావ్..!
-
ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్సీపీదే హవా
ఒంటరిగా పోటీ చేసి అత్యధిక శాతం ఓట్లను సాధించిన పార్టీగా రికార్డు అన్నాడీఎంకే, బీజేడీ, తృణమూల్ కంటే అత్యధికం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే అరుదైన గౌరవం సాధించింది. ఈ ఎన్నికల్లో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో సొంత రాష్ట్రంలో ఎక్కువ ఓట్ల శాతం సాధించిన పార్టీగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. పొత్తులేవీ లేకుండా ఒంటరిగా పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో అత్యధిక శాతం ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు వారి సొంత రాష్ట్రంలో తెచ్చుకున్న ఓట్ల శాతం కంటే వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంతంలో సాధించిన ఓట్ల శాతం ఎక్కువ. ఈ ఎన్నికల్లో లోక్‌సభలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా స్థానం దక్కింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ప్రాంతీయ పార్టీల్లో ఏఐడీఎంకే 37 స్థానాలతో మూడో స్థానం, 34 సీట్లతో తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌కు 20, మహారాష్ట్రకు చెందిన శివసేనకు 18, టీడీపీ 16, టీఆర్ఎస్ 11 సీట్లు వచ్చాయి. తొమ్మిది సీట్లతో జాతీయ పార్టీ సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రెండూ సమానంగా నిలిచాయి. ఓట్ల శాతం విషయానికొస్తే.. ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే తమిళనాడులో సాధించిన ఓట్ల కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 0.1 శాతం అదనంగా ఓట్లు తెచ్చుకోగలిగింది. అన్నాడీఎంకేకు తమిళనాడులో 44. 3% ఓట్లు రాగా, బిజూ జనతాదళ్‌కు ఒడిశా రాష్ట్రంలో 44.1% ఓట్లు, తృణమూల్‌కు పశ్చిమబెంగాల్లో 39.3% ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో 44.4% ఓట్లను సాధించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ సైతం తెలంగాణ ప్రాంతంలో పోలైన మొత్తం ఓట్లలో కేవలం 34.75% ఓట్లనే సాధించగలిగింది. చివరకు సీమాంధ్రలో అధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి కూడా.. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లకన్నా దాదాపు 4% తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ- టీడీపీ కూటమిగా పోటీ చేయడం ద్వారా ఆ రెండు పార్టీలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్‌కన్నా 2% అదనంగా ఓట్లను తెచ్చుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్‌లో బలీయంగా ఉన్న ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీలు ఈ ఎన్నికల్లో వరుసగా 19.6%, 22.3% ఓట్లు మాత్రమే సాధించగలిగాయి. -
పొన్నూరులో టిడిపి దాడులు
-
టీడీపీ దాడి.. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి విషమం
అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా మారింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే వినుకొండ సమీపంలో ఓ వ్యక్తిని చంపేశారు. శనివారం నాడు పొన్నూరు మండలంలో బాలరాజు, సత్యానందం అనే ఇద్దరు వ్యక్తులను హతమార్చే ప్రయత్నం చేయగా, వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో వాళ్లను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సన్నిహితులు. టీడీపీకి ఎందుకు ఓటేయలేదు, వైఎస్ఆర్సీపీలో కొనసాగితే ఊరుకునేది లేదని బెదిరించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఎప్పుడు ఎవరొచ్చి దాడులు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి కాలంలో టీడీపీ వర్గాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ డాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే దాడులు చేశారు. -
పదవులొచ్చినా పగ్గాలేవి!
సాక్షి, ఏలూరు : జిల్లాలో నగర, పురపాలక సంఘాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినా పాలకవర్గాలు ఎప్పుడు కొలువు తీరతాయనే దానిపై స్పష్టత కొరవడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గెలిచిన అభ్యర్థులు పదవులు చేపట్టకుండా స్తబ్దుగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానిక సంస్థలు దాదాపు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. పాలన గాడిన పడే రోజు కోసం ప్రజలు, పదవి చేపట్టే సమయం కోసం గెలిచిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రెండు నెలల నిరీక్షణ 2010 సెప్టెంబర్‌తో పాలకవర్గం గడువు ముగిసిన ఏలూరు నగరపాలక సంస్థ, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 4 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవం కాగా, 287 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. నిజానికి ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అదేనెల 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టాలని నిర్ణయించారు. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కిం పు వాయిదా పడింది. ఈ నెల 12న పురపాలక ఫలితాలు ప్రకటించారు. ఇందుకోసం 43 రోజులు ఎదురుచూసిన అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా పదవి చేపట్టడానికి నిరీక్షించక తప్ప డం లేదు. మునిసిపల్ కౌన్సిల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటా రు. కొన్ని సందర్భాల్లో వీరి ఓటు అత్యంత కీలకం అవుతుంటుంది. అయితే గత శాసనసభ రద్దు కావడంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైతే తప్ప పాలకవర్గం ఏర్పాటుకు మార్గం ఏర్పడలేదు. ఈనెల 7న సార్వత్రిక ఫలితాలు వచ్చాక కూడా పురపాలక సంఘాల పాలకమండళ్ల ఏర్పాటుపై చలనం లేదు. ఎంపీల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. జూన్ రెండు తర్వాత కొత్త ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవీ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఏర్పాటవుతాయి. పాలకవర్గాలు ఉంటే తప్ప నిధులు విడుదలచేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పడంతో మునిసిపాలిటీలకు రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అవి రావాలంటే మరికొంత సమయం వేచి చూడక తప్పదు. -
అధినేత్రి వద్ద గోడు వెళ్లబోసుకున్న మాజీలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణలో పార్టీ ఓటమి గల కారణాలను ఏకరువు పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకొస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయామని సోనియా వద్ద మాజీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతగా అపాయింటెడ్ డే రోజున వేడుకలు జరుపుతామని అధినేత్రిని కోరారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో ఆపార్టీ రెండు ఎంపీ స్థానాల మాత్రమే గెల్చుకుంది. -
'తెలంగాణ ఏర్పాటులో భాగమైనందుకు గర్వపడుతున్నాం'
-
ఓటమికి కారణమేమి‘టి’..?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి కారణాలు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినా ఓటమిపాలవడానికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో టీ మాజీ ఎంపీలంతా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, వివేక్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరు జైపాల్‌రెడ్డితో చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీనే అన్న అంశాన్ని జనంలోకి బలంగా తీసుకుపోవడంలో విఫలమయ్యామని వారు విశ్లేషించుకున్నట్టు సమాచారం. రాష్ట్ర సాధనలో సమష్టిగా పోరాడినట్టే ఎన్నికల ప్రచారంలో కలిసి ముందుకు వెళ్లలేకపోయామని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఇన్చార్జీలు, ఇతర ద్వితీయ శ్రేణి నాయకుల వ్యవహార శైలి కారణంగానే ఓటమి పాలయ్యామని మరికొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తమకు స్వేచ్ఛ ఇవ్వలేదని, అభ్యర్థుల ఎంపికలో కొందరు సీమాంధ్ర నాయకుల మాటలను పరిగణనలోకి తీసుకున్నారన్న వాదనలు కొందరు వినిపించినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గెలిచే అభ్యర్థులకు, తమకు అనుకూలంగా ఉండే వారికి సీట్లు ఇప్పించుకుని ఉంటే వారంతా తమ గెలుపునకు సహకరించేవారన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చినట్టు సమాచారం. కాగా, తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై ఓ నివేదికను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపాలని వీరు తీర్మానించినట్టు తెలిసింది. -
రాహుల్ బృందంపై కాంగ్రెస్‌లో విమర్శలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ‘రాహుల్ బృందం’పై మాటల దాడికి దిగారు. రాహుల్ సలహాదారులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేదని విమర్శించారు. పోల్ మేనేజ్మెంట్లో ఎటువంటి పాలనానుభవం లేని వ్యక్తులే కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై కలత చెందే తాను ఈ విమర్శలు చేస్తున్నానని...పార్టీపై తనకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ తిరిగి పుంజుకోవాలన్నదే తన వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఇకపై క్షేత్రస్థాయిలో పాలనానుభవం ఉన్న వారికే నాయకత్వ పదవులు ఇవ్వాలని సూచించారు. దేవ్రా వ్యాఖ్యలను పార్టీలోని సీనియర్ నేత సత్యవ్రత్ చతుర్వేది సమర్థించారు. పార్టీలోని సమస్యలు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు నిష్కర్షగా, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాదత్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ప్రజలతో పార్టీ నేతలు మమేకం కాకపోవడం వల్లే మహారాష్ట్రలో పార్టీ దెబ్బతిన్నదని ఆమెకు వివరించారు. దేవ్రా, ప్రియాదత్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలవడం తెలిసిందే. మరోవైపు ఈ నెల 24న ఢిల్లీలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. -
సీఎం పదవి వదులుకోను: వీరభద్ర సింగ్
న్యూఢిల్లీ: తన పదవికి రాజీనామా చేయబోనని కాంగ్రెస్ నాయకుడు, హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ స్పష్టం చేశారు. తనను ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదని చెప్పారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆయన కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని, ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓటు వేశారని పేర్కొన్నారు. తమకు రెండు లేదా మూడో స్థానం దక్కినంత మాత్రానా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో హిమచల్ ప్రదేశ్ లోని నాలుగు స్థానాలను బీజేపీ గెల్చుకున్న సంగతి తెలిసిందే. -
ములాయం, మాయ, కాంగ్రెస్ ల కొంప ముంచిన యూపీ ఫలితాలు
తాజా ఎన్నికల ఫలితాలతో ములాయం, మాయావతిలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇరు పార్టీలు, వీటితో పాటు కాంగ్రెస్ పూర్తిగా యూపీలో తుడిచిపెట్టుకుపోయాయి. మొత్తం 80 లోకసభ స్థానాల్లో 71 స్థానాలను బిజెపి గెలుచుకుంది. కులాల ఆధారంగా ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా లెక్కలో లేకుండా పోయాయి. మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్ పీకి ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ఈ సారి లోకసభలో బిఎస్ పీ సభ్యులు ఒక్కరు కూడా ఉండరు. కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మినహా మరెవరూ గెలవలేదు. అయిదుగురు మంత్రులు సహా మొత్తం 14 మంది సిట్టింగ్ ఎంపీలు మట్టి కరిచారు. ఇక ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి అయిదు సీట్లు వచ్చాయి. అయితే ఈ అయిదుగురు ములాయం కుటుంబ సభ్యులే. ములాయం రెండు సీట్లనుంచి, ఆయన అల్లుళ్లు అక్షయ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ లు మాత్రమే గెలవగలిగారు. లోకసభ ఎన్నికల ఫలితాల ప్రకారం బిజెపికి 335 అసెంబ్లీ స్థానాలు రావచ్చు. సమాజ్ వాదీ పార్టీ కేవలం 37 సీట్లలో తొలి స్థానంలో ఉంది. ఇక బిఎస్ పీ కేవలం 9 మంది ఎమ్మెల్యేలను గెలుచుకునే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కి 13 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. కుర్మీ కులస్తుల్లో బలంగా ఉన్న అప్నా దళ్ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పార్టీ దాదాపు 11 సీట్లు గెలుచుకోవచ్చు. బిజెపి అన్ని కులాల్లో బలాన్ని పెంచుకుంది. ముఖ్యంగా ఓబీసీలు పార్టీ పైపు భారీ సంఖ్యలో వచ్చారు. బిజెపి తరఫున గెలిచిన వారిలో అయిదుగురు లోధాలు, ఆరుగురు కుర్మీలు, ఇద్దరు గుజ్జర్లు, అయిదుగురు జాట్లు ఉన్నారు. యాదవ ఓట్లలోనూ భారీ ఎత్తున చీలిక వచ్చింది. దీంతో ములాయం పార్టీ మట్టి కరిచింది. ఇప్పుడు ఫలితాల తరువాత ములాయం సిగ్ పార్టీ యూపీ యూనిట్ ను రద్దు చేశారు. బీఎస్ పీ కూడా మొత్తం తన పార్టీ రాష్ట్ర స్థాయి యూనిట్టన్నిటినీ రద్దు చేసింది. ఆరుగురు జోనల్ సంయోజకులను కూడా తొలగించింది. ఎస్ పీ, బీఎస్ పీ, కాంగ్రెస్ లు ఇప్పుడు మోడీ సునామీని రాబోయే రోజుల్లో ఎలా తట్టుకోవాలన్న విషయంపై తర్జన భర్జనలు పడుతున్నాయి. మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తూండటంతో దానికి తగిన వ్యూహాలను పదును పెట్టుకునే పనిలో పడ్డాయి. -
పరాజయ భారంతో.. నేడు రాజీనామా!
ఈశాన్య రాష్ట్రమైన అసోంను ఏకఛత్రాధిపత్యంగా పదమూడేళ్లుగా అప్రతిహతంగా పాలిస్తున్న తరుణ్ గొగోయ్.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని, ఇకమీదట ముఖ్యమంత్రి పదవి వద్దని చెబుతూ గురువారం నాడే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే అసోంలో ఈసారి బీజేపీ పాగా వేసింది. అక్కడ మొత్తం 14 లోక్‌సభ స్థానాలుండగా.. ఏడింటిని బీజేపీ సొంతం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మూడంటే మూడే స్థానాలు దక్కాయి. మరో మూడు స్థానాలను అస్సాం యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏయూడీఎఫ్) గెలుచుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ మాత్రం ఎలాగోలా తమ కుటుంబ ప్రతిష్ఠను కాపాడుతూ కలియాబార్ పార్లమెటరీ నియోజకవర్గంలో 94వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. 2001 నుంచి అసోంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. గొగోయ్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే క్రమశిక్షణ రాహిత్యం, ముఠాతత్వం లాంటివి ఇటీవల అక్కడ ఎక్కువైపోయాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుందని తెలుస్తోంది. 2009లో ఏడు సీట్లను సాధించిన కాంగ్రెస్, ఈసారి వాటిలో నాలుగింటిని కోల్పోయింది. ఆరు స్థానాల కంటే తక్కువ వస్తే రాజీనామా చేస్తానని ముందే చెప్పినందున అలా చేస్తున్నట్లు గొగోయ్ చెప్పారు. -
ఒంటరులే.. విజేతలు!!
నేను సింగిల్.. అవుదాం మింగిల్ అనుకుంటూ పాటలు పాడేస్తున్నారా? కాసేపు ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఓసారి విశ్లేషించి చూసుకుంటే, ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో కూడా పెళ్లికెందుకు తొందర అని మీరు అనుకోక తప్పదు. కొత్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం పురుచ్చితలైవి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వీళ్లంతా ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్లే. మరో పోలిక ఏమిటంటే.. వీళ్లంతా ఒంటరులే. కొత్త ప్రధాని నరేంద్రమోడీకి పెళ్లయినా కూడా చాలాకాలంగా ఆయన బ్రహ్మచర్యాన్నే పాటిస్తున్న విషయం ఇప్పుడు బహిరంగ రహస్యం. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి, రోజుకు ఐదారు బహిరంగం సభల్లో పాల్గొని, ఎన్నికల వ్యూహాలు రూపొందించి.. ఒకరకంగా ఒంటిచేత్తో బీజేపీకి ఎవరితోనూ కూటమి కట్టాల్సిన అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ అందించారు. ఒడిషాలో బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఘోటక బ్రహ్మచారి. దేశమంతా నరేంద్రమోడీ గాలి వీస్తున్నా.. దానికి ఎదురొడ్డి నిలిచి గెలిచిన విజేత ఈయన. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగిన ఒడిషాలో నవీన్ సారథ్యంలోని బీజేడీ విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 115 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు గాను 20 స్థానాలు గెలుచుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా బ్రహ్మచారిణే. రాష్ట్రంలో తన ప్రాభవాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, ప్రతిపక్ష డీఎంకేకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకంగా 37 సీట్లు ఎగరేసుకుపోయారు. మిగిలిన రెండింటిలో కూడా ఒకచోట బీజేపీ, మరోచోట పీఎంకే గెలిచాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలు గెలుచుకున్నా.. ఈసారి ఆ పార్టీని జయయలిత అథఃపాతాళానికి తొక్కేశారు. శారదా చిట్‌ఫండ్ స్కాంతో ప్రతిష్ఠ మసకబారినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు దాటినా, ప్రభుత్వంపైన.. సీఎం పైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా కూడా మమతా బెనర్జీ తన దమ్మేంటో చూపించారు. వామపక్షాల దుమ్ము దులిపేశారు. పశ్చిమబెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉంటే, వాటిలో 34 సీట్లను సొంతం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో కేవలం 19 సీట్లే గెలుచుకున్నా, ఈసారి వామపక్షాల ఖాతాలోని మొత్తం 15 సీట్లనూ కొల్లగొట్టి తృణమూల్ బలాన్ని 34కు చేర్చారు. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న రెండు స్థానాలను మాత్రమే లెఫ్ట్‌ఫ్రంట్ గెలుచుకోగలిగింది. మమతా బెనర్జీ కూడా ఘోటక బ్రహ్మచారిణే అన్న విషయం కూడా తెలిసిందే. ఇలా.. ఈసారి ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన నలుగురూ ఒంటరి జీవితాలు గడుపుతున్నవాళ్లే. దీనిపై ఓ పరిశోధన కూడా జరిగింది. ఒంటరి జీవితం గడిపేవాళ్లకు ఎక్కువ సమయం ఉంటుందని, ఇంట్లో ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి సులభంగా పనులు చేసుకోగలరని అంటున్నారు. అలాగే ఇంట్లో ఎవరితో గొడవలు కూడా కావు కాబట్టి పని సులభంగా అవుతుందనీ చెబుతున్నారు. అందుకే.. సోలో బతుకే సో బెటరు!! -
బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి
* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నాలుగేళ్లు కూడా నిండకుండానే సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి తన సత్తా చాటింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, సార్వత్రిక ఎన్నికలలోనూ తొలిసారి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించింది. దేశంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు అనేక పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. దశాబ్దాల చరిత్రగల పార్టీలు ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవాన్ని చవిచూశాయి. వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి బలంగా వీచి మోడీ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగలిగింది. రాష్ట్రంలో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినిమా హీరో పవన్ కళ్యాణ్‌ను వెంటబెట్టుకొని తిరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, నాయకురాలు షర్మిలలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గణనీయమైన ఫలితాలు సాధించారు. వారి శ్రమకు ఫలితం దక్కింది. గ్రామీణ ప్రాంతాల ఓట్లర్లు ఆ పార్టీ పట్ల మంచి ఆదరణ చూపారు. * 2014 స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలోని 2571 మునిసిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 53 వార్డులను, సిపిఐ 16, బిజెపి 12, సిపిఎం 8, బిఎస్పి 5 వార్డులను మాత్రమే గెలుచుకోగా, తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి 942 వార్డులను గెలుచుకుంది. టిడిపి 1428 వార్డులను గెలుచుకుంది. * కార్పోరేషన్లలో అయితే టిఆర్ఎస్ 48, బిజెపి 4, కాంగ్రెస్ 2, సిపిఎం 3, సిపిఐ 2, బిఎస్పి ఒక్క స్థానంలో మాత్రమే గెలవగా, వైఎస్ఆర్ సిపి 124 స్థానాలను గెలుచుకుంది. మునిసిపల్ ఎన్నికలలో పోలైన ఓట్లలో టిడిపికి 45.18 శాతం ఓట్లు పోల్ కాగా, వైఎస్ఆర్ సిపికి 40.54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య 4.64 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. * ఈ ఎన్నికలలో 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది. 30 ఏళ్ల అనుభవం గల టిడిపి 5,216 ఎంపిటిసి స్థానాలను, 373 జడ్పిటిసి స్థానాలను గెలుచుకోగా, తొలిసారి పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి 4,199 ఎంపిటిసి స్థానాలను, 275 జడ్పిటిసి స్థానాలను గెలుచుకుంది. ఇంత చేసి ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం 3.07 శాతం మాత్రమే. * పార్టీ ఆవిర్భవించి కొద్ది కాలమే అయినా ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి క్రమశిక్షణ గల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఎటువంటి గొడవలకు తావులేకుండా లోక్‌సభ, శాసనసభ సీట్లను కేటాయించింది. కొత్తవారికి అనేకమందికి టిక్కెట్లు ఇచ్చినా ఎటువంటి వివాదాలకు తావులేకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ అభ్యర్థులకు సహకరించారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో టిడిపి, బిజెపిలలో వివాదాలు చెలరేగాయి. ఈ పార్టీల తరపు తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టిడిపి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. * వైఎస్ఆర్ సిపి విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అన్ని వర్గాల టిక్కెట్లు ఇచ్చింది. తిరుపతి, కుప్పంలలో మాజీ ఐఏఎస్ అధికారులను, మల్కాజ్‌గిరిలో మాజీ ఐపిఎస్ అధికారిని, అరకులో మాజీ గ్రూప్1 అధికారిని నిలిపింది. ఇంకా పిహెచ్డి, పిజి చేసిన అనేక మంది విద్యావంతులకు అవకాశం ఇచ్చింది. * టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి ప్రధాన్యత. కాపులకు, బిసిలకు, మైనార్టీలకు తగిన స్థాయిలో అవకాశం. * కొత్తవారికి, యువతకు అవకాశం ఇచ్చింది. ఎంపిలుగా గెలిచిన 9 మందిలో ఏడుగురు కొత్తగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. శాసనసభకు ఈ పార్టీ తరపున 45 మంది కొత్తవారు ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది గతంలో ఇతర పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరపున నిలిచి గెలిచారు. అటువంటి వారిలో సినీనటి రోజా, విశ్వేశ్వర రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి వంటి వారు ఉన్నారు. * పార్టీ కోసం శ్రమించిన శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డలో నామినేషన్ దాఖలు చేసిన తరువాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ తరపున మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బ్యాలెట్ పేపర్లో ఆమె పేరునే ఉంచారు. మరణించినా జనం ఆమెనే 17,928 ఓట్ల మెజార్టీతో ఎన్నుకొని ఘన నివాళులర్పించి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. * ఏపిలో అత్యధిక స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి కాబోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి అధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఆ జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలు ఉండగా, 8 స్థానాలలో వైఎస్ఆర్ సిపి విజయం సాధించింది. బిజెపి మొదటి సారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 30 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ పార్టీ 282 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 2001లో ప్రారంభమైన టిఆర్ఎస్ 2004లో ఎన్నికలలో పోటీచేసి 26 శాసనసభ స్థానాలను, 5 లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఎన్నికలలో పోటీచేసి 16 శాసనసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగారు. ఆర్ఎస్ వంటి పార్టీ 63 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి రావడానికి 14 ఏళ్లు పట్టింది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వేవ్‌లో 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క లోక్‌సభ సీటును గానీ, ఒక్క శాసనసభ స్థానాన్ని గానీ గెలుచుకోలేకపోయింది. ఉభయ కమ్యూనీస్టు పార్టీలు, లోక్‌సత్తా పార్టీ పరిస్థితి కూడా అంతే. అవి ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఇటు దక్షిణాదిలో డిఎంకె(ద్రవిడ మున్నెట్ర కజగం), అటు ఉత్తరాదిలో బహుజన సమాజ్‌వాది పార్టీ, ఆస్సాం గణపరిషత్, నేషనల్ కాన్షరెన్స్ పార్టీలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవానికి గురయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీ కేవలం 5 స్థానాలతో, బీహార్‌లో అధికారంలో ఉన్న జెడి(యు) 2 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించింది. టిడిపికి గట్టి పోటీ ఇచ్చి 70 శాసనసభ స్థానాలను, 9 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. నాలుగేళ్లు (29.11.2010) కూడా నిండని వైఎస్ఆర్ సిపి అనతి కాలంలోనే ఇంతటి పోటీని తట్టుకొని ఇన్ని స్థానాలను గెలుచుకోవడం గొప్ప విజయంగా భావించవచ్చు. మోడీ గాలిలో కూడా ప్రజలు ఈ పార్టీని ఇన్ని స్థానాలతో గెలిపించి బలమైన ప్రతిపక్షంగా నిలిపారు. -
ఉత్తరాంధ్రలో మారిన లెక్కలు!
ఓటరు నాడి ఓ పట్టాన చిక్కదనడానికి తాజాగా జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని బట్టి విశదమవుతోంది. ఓటరు తీర్పు ఎప్పటికప్పుడు విలక్షణంగానే ఉంటుందనేది మరోసారి విస్పష్టమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పది, విజయనగరం జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 15 మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం జిల్లాలోని విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, తూర్పు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల మినహా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేచి చూడగా పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ఉత్తరాంధ్రలోని 29 నియోజకవర్గాల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస, నరసన్నపేటల్లోనే ఆధిక్యం కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందడం గమనార్హం! అయితే, ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిన పాతపట్నం, పాలకొండ, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేయడం విశేషం! ఆమదాలవలస పరిధిలో స్థానిక ఎన్నికల్లో 5,229 ఓట్ల ఆధిక్యం కనిపించినా, అసెంబ్లీకి వచ్చేసరికి ఈ నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి తమ్మినేని సీతారాం (వైఎస్సార్సీపీ)పై ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక నరసన్నపేటలో స్థానిక ఎన్నికల్లో 3,260 ఓట్ల ఆధిక్యాన్ని వైఎస్సార్సీపీ కనబరిచినా, అసెంబ్లీ ఫలితాల్లోకి వచ్చేసరికి ఇక్కడ బగ్గు రమణమూర్తి (టీడీపీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్సీపీ)పై 4,889 ఓట్ల మెజారిటీ సాధించారు. పాతపట్నం పరిధిలో స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, వైఎస్సార్సీపీకి ప్రత్యర్థి టీడీపీ కన్నా 1317 ఓట్లు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ అభ్యర్థి కలమట వెంకటరమణ (వైఎస్సార్సీపీ) తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (టీడీపీ)పై 3,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. పాలకొండలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 3,504 ఓట్ల ఆధిక్యం వచ్చినా, అసెంబ్లీ స్థానాన్ని మాత్రం వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజాంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ 4289 ఓట్ల ఆధిక్యం కనబరిచినా, అసెంబ్లీ ఫలితం వచ్చేసరికి కంబాల జోగులు (వైఎస్సార్ సీపీ) మాజీ స్పీకర్ ప్రతిభాభారతి (టీడీపీ)పై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈ జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, ఎచ్చెర్ల, టెక్కలి, శ్రీకాకుళం స్థానాలు స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో ఆధిక్యత కనబరిచిన టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. విజయనగరం జిల్లా ఫలితాలను విశ్లేషిస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబరిచిన బొబ్బిలి సెగ్మెంట్లో ఆ పార్టీయే గెలుపొందింది. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీకి 6384 ఓట్ల ఆధిక్యం రాగా.. అసెంబ్లీ అభ్యర్థి సుజయ్ కృష్ణరంగారావు టీడీపీ అభ్యర్థి లక్ష్మునాయుడుపై 7330 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ జిల్లాలో మరోరెండు స్థానాలను వైఎస్సార్సీపీ గెలుపొందింది. కురపాంలో స్థానిక ఎన్నికల ఫలితాల్లో 525 ఓట్లు తగ్గినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి పి.పుష్పశ్రీవాణి టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్‌పై 19వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం! సాలూరులో స్థానిక ఫలితాల్లో టీడీపీ 1654 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచినా, అసెంబ్లీకి వచ్చేసరికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజన్నదొర టీడీపీ అభ్యర్థి భాంజ్దేవ్పై సుమారు ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ జిల్లాలో మిగిలిన పార్వతీపురం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట సెగ్మెంట్లలో స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో టీడీపీదే పైచేయిగా ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా ఫలితాల సరళిని చూస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరిచిన పాడేరు (9282), అరకులోయ (21824), మాడుగుల (45) సెగ్మెంట్లలో ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఆధిక్యం కన్నా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పాడేరులో జి.ఈశ్వరి పాతికవేలకు పైగా, అరకులోయలో కిడారి సర్వేశ్వరరావు 33వేల పైగా, మాడుగులలో బూడి ముత్యాలనాయుడు ఐదు వేలపైగా ఓట్ల మెజారితో విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో స్థానిక ఫలితాల సరళిని బట్టి చూస్తే ఆరు నియోజకవర్గాల్లో ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. -అవ్వారు శ్రీనివాసరావు -
మన్యంపై వైఎస్ఆర్సీపీ పట్టు
సీతంపేట: సీమాంధ్ర పరిధిలోని మన్యంపై వైఎస్ఆర్సీపీ పట్టు సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి మినహా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల పరిధిలో ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరుచోట్ల వైఎస్సార్సీపీకే ఏజెన్సీ వాసులు పట్టం కట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి ముడియం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి, విజయనగరం జిల్లా కురుపాం నుంచి పాముల పుష్పశ్రీవాణి, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో గిరిజనులకు సంబంధించిన పథకాల అమలు, పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిబంధనల ప్రకారం గిరిజన సలహా మండలిని ఏర్పాటుచేయాలి. దీనికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. వివిధ శాఖలకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. నాన్ అఫీషియల్ సభ్యులుగా ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. వీరంతా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించి, దాని అమలును పర్యవేక్షిస్తారు. అలాగే.. నిధుల వ్యయం, ఇతరత్రా అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఉండేవారు. ప్రతిపక్షానికి చెందిన ఒకరిద్దరినే నియమించేవారు. అది కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరిగేది. ఇప్పుడు పరిస్థితి వేరు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీలో ఒక్కరే ఎస్టీ ఎమ్మెల్యే ఉండటం, మిగిలిన వారంతా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకే చెందిన వారు కావడంతో ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారిని సలహా మండలి సభ్యులుగా నియమించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు శాసనసభ ఎస్టీ కమిటీలోనూ వీరికే ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది. ఫలితంగా గిరిజన సమస్యలపై స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసే అవకాశం వైఎస్ఆర్సీపీకి దక్కనుంది. -
టీఆర్ఎస్ మిత్రపక్షంగా బీఎస్పీ?
ఆదిలాబాద్: తెలంగాణలో ఖాతా తెరిచిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) టీఆర్ఎస్ సర్కారుకు మిత్రపక్షంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీఎస్పీ ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), కోనేరు కోనప్ప (సిర్పూర్) గురువారం కేఆర్ఎస్ను కలిసి తమ మద్దతు ప్రకటించనున్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ ఎమ్మెల్యేలిద్దరు విజయం సాధించిన విషయం విధితమే. ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకునే స్థాయిలో బీఎస్పీ జిల్లాలో బలంగా లేకపోయినప్పటికీ, ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత చరిష్మాతో విజయం సాధించారు. కాగా, సర్కారు ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ టీఆర్ఎస్కు ఉన్నప్పటికీ, ఆ పార్టీ ఎంఐఎం మద్దతు కోరుతోంది. అలాగే, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ సర్కారుకు మిత్రపక్షంగా ఉండాలని యోచిస్తుండటం గమనార్హం. మరోవైపు నిర్మల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తోంది. ఇంద్రకరణ్‌రెడ్డి తన అనుచరులను బీఎస్పీ తరపున బరిలోకి దించిన విషయం విదితమే. -
లోక్‌సభకు ఎన్నికైన ఏకైక జంట
పాట్నా: బీహార్‌కు చెందిన పప్పు యాదవ్ దంపతులు లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. 16వ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన వీరు పార్లమెంట్ దిగువసభలో కొలువుదీరనున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక జంట వీరే కావడం విశేషం. పప్పు యాదవ్ గా ప్రసిద్ధుడైన రాజేష్ రంజన్ ఐదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మాధేపురా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను 56 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. సపాల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పప్పు యాదవ్ భార్య రంజీత్ రంజన్... జెడీ(యూ) అభ్యర్థి దిలేశ్వర్ కామైత్పై దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడం విశేషం. అయితే తమ సిద్ధాంతాలు, దారులు వేరైనా తమ లక్ష్యం ఒకటేనని పప్పు యాదవ్ దంపతులు నవ్వుతూ చెప్పారు. -
ఇక రొటీన్ !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయం ముగిసింది... ఎన్నికలు అయిపోయాయి... వాటి ఫలితాలూ వచ్చేశాయి. దీంతో జిల్లా ప్రజలు మళ్లీ యథాతథ జీవనంపై దృష్టి సారించారు. ఒకేసారి దూసుకొచ్చిన మూడు ఎన్నికలలో వివిధ పార్టీల తరఫున పనిచేసిన కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇప్పుడు రిలాక్స్‌గా ఫీలవుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయ బిజీతో పెండింగ్‌లో పెట్టిన పనులను పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇప్పటిదాకా రాజకీయ చర్చలతో కాలం గడిపిన వారంతా ఇక సొంత పనులు చక్కబెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ పాత వృత్తుల్లో నిమగ్నమైపోయారు. అధికార యంత్రాంగం విషయానికి వస్తే... ఎన్నికల కారణంగా పెండింగ్‌లో పెట్టిన పనులపై కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన గ్రీవెన్స్‌డే సోమవారం తిరిగి ప్రారంభమయింది. సాధారణ పనులు మొదలు పెట్టినప్పటికీ.. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావడానికి మాత్రం మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమై ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు నూతన అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెపుతున్నారు. ప్రస్తుతానికి విభజన లెక్కలు... ఇన్నాళ్లూ ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్న జిల్లా యంత్రాంగం ఇప్పుడు రాష్ట్ర విభజన లెక్కలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మూడు రకాల ఎన్నికల నిర్వహణ, వాటి ఫలితాల వెల్లడి ఘట్టాలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర లెక్కల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఉద్యోగుల పంపిణీతో పాటు నూతన రాష్ట్రంలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమయ్యే నిధులు, వార్షిక బడ్జెట్ ప్రణాళికలకు అనుగుణంగా నిధులు వ్యయం చేయాల్సిన తీరుపై ఉన్నతాధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించిన యంత్రాంగం ఏ శాఖలో ఎవరు తెలంగాణలో ఉండాలి, ఎవరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే వరకు ఈ విభజన లెక్కల్లోనే ఉంటామని అధికారులు చెపుతున్నారు. పోలవరం ముంపు ప్రాంతంలోని గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన నేపథ్యంలో సరిహద్దుల ఏర్పాటు, నిర్వాసితుల పరిహారం ఫైళ్లు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇంకా కొన్ని పూర్తి కావాలి... విభజన లెక్కల పరిస్థితి అలా ఉంటే... జిల్లాలో మళ్లీ అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి మరో నెలరోజులు పట్టే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు జిల్లాలో కొత్త అభివృద్ధి పనులు ప్రారంభం కావని వారు చెపుతున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు పాలకవర్గాల ఏర్పాటు, జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికలాంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే ప్రజాప్రతినిధులు కొత్త పనుల ప్రారంభంపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనులు కొనసాగుతున్నప్పటికీ.. కొత్తగా ప్రారంభించాల్సిన వాటికి మాత్రం కొంత సమయం పట్టనుంది. అలా వెళ్లొద్దామా..! దాదాపు మూడు నెలలుగా రాజకీయాలతో బిజీగా గడిపిన వారంతా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎండాకాలం కావడంతో ఇప్పటికే చాలా మంది ఊర్లకు వెళ్లిపోగా, పాఠశాల సెలవులు కూడా ముగిసే సమయం వస్తుండడంతో వీలున్నంత త్వరగా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చోటా మోటా నాయకులు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. గెలిచిన వారు మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరగా, ఓడిన పార్టీ వారు కుటుంబాలతో కలిసి వెళుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పోలీసులు కూడా వరుస సెలవులు పెట్టి విహారయాత్రలకు పయనమవుతున్నారు. -
టీడీపీలో వెన్నుపోటుదారులెవరు..?
గిద్దలూరు, న్యూస్‌లైన్ : టీడీపీలో వెన్నుపోటుదారులున్నారని ఆ పార్టీ తరఫున గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన అన్నా రాంబాబు అనడంతో.. వారెవరా..? అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అన్నా రాంబాబు.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. తన ఓటమికి పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులే కారణమని, వారంతా సభ నుంచి ఇప్పుడే వెళ్లిపోవాలని అనడంతో కార్యకర్తలంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఎవరా వెన్నుపోటుదారులనుకుంటూ చర్చించుకున్నారు.రాంబాబు మాటలకు వేదికపై కూర్చున్న ఇద్దరుముగ్గురు నాయకులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారి మొహాల్లో కనిపించింది. దీంతో వారినుద్దేశించే రాంబాబు అలా మాట్లాడారేమోనని అక్కడున్నవారంతా అనుకున్నారు. అప్పులు తీర్చుకున్నసీజనల్ నాయకులు... రాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన సీజనల్ నాయకులు, గిద్దలూరు పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎన్నికల సీజన్లోనే ప్రజలకు కనిపిస్తారు. వీరెంతటి వారంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కోట్ల రూపాయలు తమ చేతిలో పెట్టి నిశ్చంతగా ఉండమంటారు. కానీ, ఈసారి ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలిచ్చినా వారి జేబులు నిండలేదు. అన్నా రాంబాబుకు సంబంధించి ఓటర్లకు చేరాల్సిన నగదును ఈ సీజనల్ నాయకులే దిగమింగారన్న వార్తలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. తన ఓటమికి కారణం అదేనని రాంబాబు మనసులోనూ తట్టబట్టే వందలాది మంది కార్యకర్తల ముందు వెన్నుపోటుదారుల గురించి మాట్లాడారని ప్రజలు చెప్పుకుంటున్నారు. భారీగా నగదుతో ఓ లాడ్జిలో ఉన్న రాంబాబు వర్గీయులను అదే పార్టీలో ఉన్న రాచర్లకు చెందిన ఓ సీజనల్ నాయకుడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పట్టించినట్లు తెలిసింది. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా రాంబాబు మాఫీ చేసుకున్నట్లు సమాచారం. కేవలం తనకు కోటి రూపాయల ప్యాకేజీ ఇవ్వలేదనే అక్కసుతోనే రాచర్లకు చెందిన ఆ సీజనల్ నాయకుడు ఇలా చేశాడని టీడీపీ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. హాస్యాస్పదంగా రాంబాబు మాటలు... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాక్షాత్తూ తన సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి అప్పట్లో అధికారంలోకి వచ్చాడని యావత్ రాష్ర్టం కోడై కూస్తోంది. అలాంటి పార్టీ తరఫున పోటీచేసిన రాంబాబు.. తన ఓటమికి పార్టీలోని వెన్నుపోటుదారులే కారణమని అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఉంటూ వెన్నుపోటుదారులు బయటకు వెళ్లాలని మాట్లాడటం చూస్తే..చంద్రబాబును కూడా బయటకు పొమ్మన్నట్లుగా రాంబాబు మాటల తీరు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓటమికి కారణాలేవైనప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరినీ రాంబాబు అనుమానించి దూషించడం సరికాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఈవీఎంలపై రగడ
చీరాల, న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఒక కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు అధికారులు ప్రయత్నించిన వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం రాత్రి తరలించేందుకు ప్రయత్నించగా..సమాచారం అందుకున్న టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కాలేజీ వ ద్దకు ఇరుపార్టీల కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ క్షణంలో అయినా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో టియర్‌గ్యాస్, ప్రత్యేక బలగాలను తరలించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఈవీఎంలు ఉంచిన గదిని పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవోను సైతం టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని..ఈవీఎంలు ఉంచిన గది వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం..రాత్రివేళ ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం..స్ట్రాంగ్ రూం కిటికీలు తెరచి ఉంచడంపై తమకు సమాధానం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భర్త పోతుల సురేష్ నిలదీశారు. స్థానిక అధికారులు ముందుగా గదిలో ఉన్న ఈవీఎంల నంబర్లు తమకు ఇవ్వలేదని, ఇందులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రిటర్నింగ్ అధికారి పద్మజపై ఆరోపణలు చేశారు. స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని..ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పర్యవేక్షణలో ఈవీఎంల అక్రమ తరలింపుపై విచారణకు నాయకులు డిమాండ్ చేశారు. స్ట్రాంగ్‌రూంలో ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలే ఉన్నాయని డీఆర్వో, ఆర్డీవోతో పాటు స్థానిక అధికారులు చెప్పినా టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించి విచారణ జరిపించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా చీరాలలో ఉంచిన ఈవీఎంలను తరలించపోవడం వెనుక రెవెన్యూ అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నరహర ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. వీడిన అనుమానం.. ఈవీఎంల వ్యవహారంపై స్థానిక, జిల్లా అధికారులతో కాకుండా ఇతర అధికారులతో విచారణ చేయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణాధికారులుగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి ఆర్డోఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల తహశీల్దార్ వెంకటేశ్వర్లును నియమించింది. సాయంత్రానికి చీరాల వచ్చిన విచారణాధికారులు పార్టీల నాయకులతో చర్చించారు. అనుమానం ఉన్న ఈవీఎంలను అభ్యర్థుల సమక్షంలోనే సీలు తీసి పరిశీలించారు. మొత్తం అందులో ఉన్న 71 ఈవీఎంలను తనిఖీ చేశారు. అన్ని ఈవీఎంలలో రిజల్ట్ సున్నాలు రావడంతో అది రిజర్వ్, ట్రైనింగ్ ఈవీఎంలుగా విచారణాధికారులు నిర్ధారించారు. ఆ ఈవీఎంలలో అవకతవకలు లేవు కాలేజీలో భద్రపరచిన ఈవీఎంల పరిశీలన అనంతరం విచారణాధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో ఎటువంటి పోలు కాలేదని, అవి రిజర్వ్‌లో ఉంచినవని చెప్పారు. అయితే ఈవీఎంలను భద్రపరిచే విషయంలో స్థానిక ఎన్నికల, రెవెన్యూ అధికారులు నిబంధనలు విస్మరించారని, స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం వలనే వివాదం తలెత్తిందని తమ పరిశీలనలో తేలిందన్నారు. దీనిపై అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు నివేదించనున్నామన్నారు. దీంతో 24 గంటలుగా చీరాలలో ఉద్రిక్తతకు కారణమైన ఈవీఎంల వివాదానికి తెరపడింది. -
ఏం చేద్దాం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇచ్చిన చేదు ఫలితాలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహిం చని ఫలితాల దిగ్భ్రమ నుంచి ఆ పార్టీ దిగ్గజా లు ఇంకా తేరుకోవడం లేదు. ‘తెలంగాణ’ ఏ ర్పాటును సా నుకూలంగా మార్చుకోలేకపోయామన్న బాధతోపాటు, రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ ఆ పార్టీ నేతలలో సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుండగా, తమ వ్యూ హం ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. ప్రతికూల పరిస్థితులు, ఫలితాల నేపథ్యంలో ఏం చేయాలనే ఆలోచనలో వారు పడిపోయారు. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం సాగుతుండగా, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపేందుకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు డీసీసీ సన్నాహాలు చేస్తోంది. ఇంతటి ఘోర పరాజయమా! సార్వత్రిక ఎన్నికలలో ఊహించని ఫలి తాల నుంచి కాంగ్రెస్ సీనియర్లు ఇంకా తేరుకోలేదు. అన్ని స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై ఇంకా ‘పోస్టుమార్టం’ సాగుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ, సురేశ్ షెట్కార్ ఓటమి కూడా వారిని ఆలోచనలో పడవేసింది. కొద్దిగా ప్రశాంతత కోసం కేడర్‌కు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి. వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మహ్మద్ షబ్బీర్‌అలీతోపాటు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ‘అసలేం జరిగిందో’నని ఫలితాలను విశ్లేషిస్తున్నారు. గెలుపు ధీమాలో ఉన్న ఈ ముగ్గురు నేతలకు ఓటమితో ఊహించని షాక్ తగిలింది. బాల్కొండ నుంచి ఆర్మూరుకు మారడంతో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డికి కలిసి రావడం లేదు. ఆయన కూడా వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఈరవత్రి అనిల్ సైతం ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గ్రూపుల పోరూ కొంప ముంచింది. జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితా లు రావడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి, సరైన మార్గదర్శనం, ప్లానింగ్ లేకపోవడంతోనే ఫలితాలు దారుణం గా వచ్చాయంటున్నారు. టీపీసీసీ తీరుపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తెలంగాణ’కు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలంగా వ్యవహరిం చిన అంశాన్ని ప్రచారంలో సానుకూలం గా మార్చుకోవడంలో టీపీసీసీ వైఫల్యం చెందిందన్న ఆరోపణలున్నాయి. ఇది లా ఉంటే జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు ల పోరు, ప్రత్యర్థులకు కలిసొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ‘తెలంగాణ ’ ప్రకటన సందర్భంగా పలు జిల్లాల్లో నేతలం తా కలిసికట్టుగా ‘కృతజ్ఞత’సదస్సులు నిర్వహించగా.. జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల నడుమ సంబరాలు జరుపుకోవడం అప్పట్లో చర్చనీయాం శం అయ్యింది. డీఎస్, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సురేశ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్ వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట నడుస్తుందని ప్రచారం కూడ జరిగింది. ఇవన్నీ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపగా.. ఇప్పటికైనా గ్రూపులు వీడుతారా? అన్న చర్చ కూడ జరుగుతోంది. -
ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా గత నెల 22 వ తేదీన నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా ఆయన వచ్చారు. ఈ సభకు బంజారాల గురువు రామారావు మహారాజ్ మహారాష్ట్ర నుంచి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై నరేంద్రమోడీకి మహారాజ్ ‘విజయోస్తూ’ అంటూ ఆశీర్వదిం చారు. దేశంలో మోడీని ప్రధానిగా చూడాలని కాంక్షించిన నేపథ్యంలో ఇందూరు గడ్డపై మహారాష్ట్ర మహారాజ్ ఆశీర్వదం ఎంతగానో తోడైందని బంజారవర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో బీజేపీకి దేశప్రజలు అఖండ మెజారిటీని అందించారు. దీంతో ఆయన నవభారత నిర్మాణానికి పూనుకునేందకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
నీతి, నిజాయతీతో వ్యవహరిస్తాం
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నీతి, నిజాయతీతో పనిచేసి ఉత్తమ సేవలు అందిస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశాలి భవన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజా వ్యతిరేక పాలనకు విసిగిపోయి ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలిపారు. రహదారులు, వాగులపై వంతెనలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దుకు తోడ్పడతానన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇద్దరు పేద బిడ్డలను గెలిపించి గుండెలకు హద్దుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది విద్యార్థి యువజనుల త్యాగఫలితంగానే తాము ఎన్నికల్లో విజయం సాధించామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా బెల్లంపల్లికి వచ్చిన ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, రాష్ట్ర నాయకులు ఎస్.నర్సింగం, జెడ్పీటీసీ సభ్యులు ఎం.సురేశ్‌బాబు, కొడిపె భారతి, అల్లి మోహన్, ఆర్.సత్తయ్య, బెల్లంపల్లి పట్టణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పి.సురేశ్, బి.అర్జయ్య పాల్గొన్నారు. -
జెడ్పీపై గులాబీ జెండాఎగరేస్తాం
సిద్దిపేటటౌన్, న్యూస్‌లైన్: జెడ్పీపై గులాబీ జెండాను ఎగరేస్తామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు చేరడంతో టీఆర్ఎస్ బలం 24కు పెరిగిందన్నారు.మరి కొందరు జెడ్పీటీసీ సభ్యులు త్వరలో పార్టీలో చేరుతారన్నారు. మెదక్, గజ్వేల్ మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకుంటామని చెప్పారు. మరో రెండు ఎంపీపీలపై గులాబీ జెండా ఎగురువేస్తామన్నారు. జిల్లాలోని మెజార్టీ ఎంపీపీలను కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీలను గెలుచుకున్నామని, జహీరాబాద్‌లో స్వల్ప మెజార్టీతో సీటు కొల్పోయామని చెప్పారు. నారాయణఖేడ్‌లో అన్నదమ్ముల పోటీ వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిసారి ఎదురుగాలి
చేవెళ్ల, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్లోళ్ల కుంటుంబానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురుగాలి వీచింది. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో, 1999 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో అన్నీ తామై నడిపిన ఆ కుంటుబానికి నేడు ప్రాతినిథ్యం కరువైంది. 30 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చిన ప్రజల నుంచి మొదటిసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక కుటుంబం నుంచి ఒకేసీటు అనే నినాదాన్ని ఏఐసీసీ అమలుచేయడంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాలో ఆధిపత్యం చలాయించిన మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డి కోసం పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కార్తీక్‌రెడ్డికి కేటాయించింది. అయితే కార్తిక్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 26,685 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరినా ప్రజలు ఆదరించారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి సబితారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సైతం ఆమె విజయం సాధించారు. ఇలా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, సబితారెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 వరకు పట్లోళ్ల కుటుంబ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీకి రిజర్వ కావటంతో సబితారెడ్డి మహేశ్వరం జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నిరాశలో కార్యకర్తలు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతో నాలుగైదేళ్లుగా క్షేత్ర స్థాయిలో కార్తిక్‌రెడ్డి పనిచేశారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌ను కాపాడుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ నవనిర్మాణ పాదయాత్ర పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ వద్దగల ఆరెమైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల మీదుగా తాండూరు వరకు 101 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన రావడంతో ఎంపీ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారని భావించారు. రాహుల్ దూతలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించారు. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో పోటీ నెలకొన్నప్పటికి కార్తిక్‌రెడ్డి అధిష్టానం నుంచి టికెట్ సాధించగలిగారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. అనూహ్యంగా కార్తిక్‌రెడ్డి కంటే తెరాస అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చే వెళ్లతో పాటు నవాబుపేట, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండ లాల్లో ఏ ఒక్క చోటా కార్తిక్‌రెడ్డికి ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల్లోనూ వెనుకబడి పోవటం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అంతర్మథనంలో పడిపోయారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో లోక్‌సభకు మొత్తం 1,61,971 ఓట్లు పోలవగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యధికంగా 79,781 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 53,096 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా సబితాఇంద్రారెడ్డి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. -
ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ
సాక్షి, ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో మహా గెలుపును సాధించిన బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటి నుంచే కనీసం 150 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటోంది. 288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో శివసేన 171 స్థానాలు, బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన 45 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 46 స్థానాలు దక్కించుకుంది. దీంతో శివసేనకంటే ఒక్క స్థానం అధికంగా లభించడంతో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. 1994లో అధిక స్థానాలు దక్కించుకున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అధిక స్థానాలున్న శివసేనకే ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. అయితే 2009లో ఒక్కసీటు కారణంగా ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సీన్ మరింతమారేలా చేసింది. అధిక స్థానాలతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహాకూటమికి మొత్తం 51 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో బీజేపీకి 27.57 శాతం, శివసేనకు 20.82 శాతం ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. మారనున్న ఫార్ములా..? సీట్ల పంపకాలలో కొత్త ఫార్ములాతో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలకుపైగా శివసేన, బీజేపీల కూటమి కొనసాగుతోంది. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, దివంగత బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్‌ల హాయాంలో లోక్‌సభలో బీజేపీకి అధికంగా, అసెంబ్లీలో శివసేనకు అధిక సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ కోటాలోకి 26 రాగా, శివసేనకు 22 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో శివసేన కోటాలో 171, బీజేపీ కోటాలో 117 స్థానాలున్నాయి. అయితే గతంలో శివసేన, బీజేపీలే మిత్రపక్షాలుగా ఉండగా, ఈసారి మహాకూటమిగా మారిన ఈ కూటమిలో ఆర్పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని షేత్కారీ పార్టీ తదితరాలున్నాయి. దీంతో ఫార్ములా మార్చాల్సి రానుంది. శివసేన, లేకపోతే బీజేపీ నుంచి కొన్ని స్థానాలను వీరికి కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు బలం పెరగడంతో బీజేపీ 150 స్థానాల్లో పోటీచేస్తే శివసేన, ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించనున్నారనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమచారం. అయితే కొత్తఫార్ములాకు శివసేన ససేమిరా అంటుంది. పాతఫార్ములాతోనే పోటీ చేసినా కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయిస్తామని శివసేన పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మారుతున్న సీన్...? కాషాయ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత బాల్‌ఠాక్రే హాయాంలో ఏ నిర్ణయమైన ఆయనతో సంప్రదింపుల అనంతరమే తీసుకునేవారు. శివసేనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. అయితే బాల్‌ఠాక్రే మరణానంతరం మార్పువచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. సామ్నా దినపత్రికలో బాల్‌ఠాక్రే తనదైన శైలిలో ప్రత్యర్థులతోపాటు అవసరమైన సమయంలో మిత్రపక్షమైన బీజేపీపై కూడా విమర్శలు సంధించి తమ ప్రాధాన్యత ఏమిటన్నది చాటుకునేవారు. ఇటీవలే గుజరాతీయుల అంశంపై ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై నరేంద్ర మోడీ నిరసన తెలిపినట్టు సమాచారం. దీంతో వెంటనే ఉద్ధవ్‌ఠాక్రేతోపాటు ఇతర నాయకులు సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయంతో పార్టీ నాయకత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో సంజయ్ రావుత్ అధికారాలను కూడా కొంచెం తగ్గించారు. దీన్నిబట్టి కాషాయకూటమి(మహాకూటమి)లో కొంత సీన్ మారిందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమి లేదని శివసేన, బీజేపీలు పేర్కొంటున్నాయి. పాత పద్ధతిలోనే పోటీ: ఉద్ధవ్ సాక్షి, ముంబై: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్‌ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్డీయేతో సమావేశం తర్వాత ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పటిష్టం చేసేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని, మంత్రి పదవులపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మంత్రి పదవులపై శివసేన తొందరపడడం లేదని, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే చర్చిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైన కలిసే తీసుకుంటామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని, దీంతో తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐకమత్యంతో శాసనసభ ఎన్నికలకు వెళతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏ విధంగా తిరస్కరించారో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని, ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును ఇప్పటికీ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు, ఒకవేళ అది మంచిది, సురక్షితమే అయితే దేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకైనా తరలించాలి. కానీ ఈ ప్రాజెక్టు మాకొద్దు అని స్పష్టం చేశారు. ఒకవేళ విద్యుత్ అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ‘మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకూటమి ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళతార’న్నారు. ఇతర అంశాలతోపాటు నష్టపరిహారం గురించి చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గురించి విలేకరులడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ నోరు విప్పలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ఏదైన అఘాయిత్యానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. -
మోడీ దెబ్బ ఆ పార్టీలకు గట్టిగానే తాకింది!
-
'ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తాం'
-
అఖిలేష్ మంత్రి వర్గం నుంచి 36 మందికి ఉద్వాసన
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ తన మంత్రి వర్గంలోని 36 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. సార్వత్రిక ఎన్నికలలో సవాజ్‌వాది పార్టీ ఓటమికి ఆ మంత్రులను బాధ్యులను చేస్తూ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చాలా తక్కువ స్థానాలను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా, 71 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. సమాజ్‌వాది పార్టీ కేవలం 5 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అప్నాదల్ పార్టీలు చెరో 2 స్థానాలను గెలుచుకున్నాయి. -
సుపరిపాలనే ప్రధాన ఎజెండా: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: సుపరిపాలనే తమ ప్రధాన ఎజెండా అని, ఈ నినాదంతోనే ముందుకెళతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. స్వావలంబన, ఆర్థిక స్థిరత్వమున్న దేశాభివృద్ధే తమ లక్ష్యమన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ రోజు చరిత్రాత్మకమైందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లవిరిసిందన్నారు. దేశ చరిత్రలో అత్యధిక ఓట్లు నమోదు కావడం ఇదే ప్రథమం అన్నారు. పది రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించిందని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఎక్కువ స్థానాలు సాధించామని వెల్లడించారు. -
'సీఎం అవుతానని ఊహించలేదు'
పాట్నా: నేను ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రినవుతానని ఊహించలేదని బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జితన్ మంజీ అన్నారు. ముఖ్యమంత్రి కావడం ఆశ్చర్యం కలిగించిందని జీతన్ అన్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేయడం, రాజీనామా ఉపసంహరణకు ఆయన ససేమిరా అనడంతో జేడీయూ కొత్త సీఎంను ప్రకటించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో జితన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రిగా వ్యవహరించిన జితన్ రామ్ మంజీను నితీష్ ఎంపిక చేశారు. జితన్ ఎంపిక కూడా రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగింది. నితీశ్‌కు 68 ఏళ్ల జితన్ అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడనే పేరుంది. జెహానాబాద్ జిల్లాలోని మఖ్దుమ్‌పూర్(ఎస్సీ) నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మాజీ సీఎం కనబడుట లేదు!
శీర్షిక చదివి చకితులవకండి. ఇది నికార్సైన నిజం. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి నల్లారి వారు నలుసైపోయారు. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి నాలుగు రోజులైనా ఆయన దర్శనం లేదు. కనీసం మాట కూడా వినిపించలేదు. సమైక్య చాంపియన్ నేనేనంటూ భుజాలెగరేసి తన పార్టీని బరిలోకి దింపి భంగపడ్డారు కిరణయ్య. 'జై సమైక్యాంధ్ర'తో ప్రజలు జేజే అందుకోవాలన్న ఆయనగారి ఆశలు ఫలించకపోవడంతో ముఖం చాటేశారా? సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 150పైగా స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట కూడా ఆ పార్టీ విజయం గెలవలేదు. సొంత నియోజకవర్గం పీలేరు సీటైనా వస్తుందనుకున్న కిరణ్‌కు చేదుఅనుభవమే ఎదురైంది. అత్యధిక స్థానాల్లో జై సమైక్యాంధ్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఎన్నికల ఫలితాలు విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. పార్టీ ఓటమిపైన కానీ, పోలింగ్ సరళిపైన కానీ తన స్పందన వెల్లడించలేదు. అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులు ఎన్నికల ఫలితాలపై తమ స్పందన తెలిపారు. చివరి బంతి వరకు వేచిచూసే అలవాటున్న కిరణ్ ఈ విషయంలోనే అదే పంథా అనుసరిస్తున్నట్టు కనబడుతోంది. కిరణ్ ప్రత్యర్థులు మాత్రం మాజీ సీఎం కనబడుట లేదు అంటూ జోకులు పేలుస్తున్నారు. ఇప్పటికైనా పలుకైనా కిరణ్ పలుకుతారో, లేదో? -
ముంచింది నిర్లక్ష్యమే..!
- ఓటమిపై జిల్లా కాంగ్రెస్ నేతల పోస్ట్‌మార్టం - స్వయంకృతాపరాధం.. - కారు స్పీడే కారణం - టీపీసీసీకి డీసీసీ నివేదిక సాక్షి, మహబూబ్‌నగర్: అధికార పక్షం కాంగ్రెస్ జిల్లాలో ఆశిం చిన స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, విభేదాలే కొంపముంచాయనే అభిప్రాయానికి వచ్చారు. అందువల్లే జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు రెండోస్థానం లభించిందని.. కొన్నిచోట్ల స్వల్పఓట్ల మెజార్టీతోనే ఓడిపోయామని నివేదికలో జిల్లా కమిటీ పేర్కొంది. మరికొన్ని నియోజకవర్గాల్లోనైతే చివరివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం వంటి విషయాలు కూడా నష్టాన్ని కలుగజేశాయని వివరించింది. 2009 ఎన్నికల్లో ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత ఎన్నికల్లో కంటే ఒక సెంబ్లీ స్థానాన్ని అదనంగా సాధించుకున్నప్పటికీ.. చేరుకోవాల్సిన లక్ష్యాన్ని అధిగమించలేకపోయామని నివేదికలో పేర్కొంది. కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లో మూడోస్థానం, మహబూబ్‌నగర్‌లో నాలుగోస్థానానికి పార్టీ పడిపోవడానికి అనేక కారణాలను విశ్లేషించింది. నియోజకవర్గాల వారీగా.. మహబూబ్‌నగర్‌లో చివరివరకు అభ్యర్థి ఎంపికలో అధిష్టానవర్గం అవలంభించిన ఊగిసలాట ధోరణి, కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన ఒక నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం వంటి విషయాల నేపథ్యంలోనే నాలుగో స్థానంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లినట్లు తేల్చింది. - నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పార్టీకి చెందిన కొందరు నాయకులు పలు ప్రలోభాలకు తలొగ్గి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కొంత నష్టం కలిగించిందని పేర్కొంది. కల్వకుర్తి నియోజకర్గంలో ఓ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించకపోవడం తీవ్రఇబ్బందికి గురిచేసినట్లు ప్రస్తావించారు. - షాద్‌నగర్, జడ్చర్ల, కొల్లాపూర్, దేవరకద్ర, అచ్చంపేట నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గాలి బాగా వీయడం కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. నారాయణపేటలో కొత్త వారికి టికెట్ ఇవ్వడం వల్ల మొదటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారు సహాయ నిరాకరణ చేయడంతో ఇక్కడ ఓడిపోయినట్లు వివరించారు. - కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని టీఆర్ఎస్ బరిలో నిలపడం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని నాయకులు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు పార్టీ నుంచి వలస వెళ్లినప్పుడు కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులను ఆ నియోజకవర్గంలో కాపాడుకోవడంలో విఫలమవడం వంటి అంశాలు తీవ్రనష్టానికి గురిచేసినట్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో చతికిలపడిన టీడీపీ గెలుపొందిందని ఆ నివేదికలో పీసీసీ ఆవేదన వ్యక్తం చేసింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ తరువాత కారణాల నేపథ్యంలోనే తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొంది. ఈ గుణపాఠాల వెల్లువలో జిల్లాలో కాంగ్రెస్‌ను సంస్థాగతపరంగా భవిష్యత్‌లో మరింత పటిష్టం చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగుతామని ఆ నివేదికలో డీసీసీ వివరించింది. -
రచ్చ గెలిచి.. ఇంట గెలవకున్నా..
* పద్ధతి మార్చుకోని కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు * ఇక్కడ ఓడినా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ రెచ్చగొట్టే ర్యాలీ * పట్టణంలో ఓ సామాజికవర్గమే లక్ష్యంగా షాపులపై దాడులు * భయంతో షాపులు మూసి పరుగులు తీసిన వ్యాపారులు * తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలు కందుకూరు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఓడామన్న బాధను బయటకు కనిపించకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివరాలు.. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దివి శివరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. నియోజకవర్గంలో ఓటమిపాలైనా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ పట్టణంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. కోటారెడ్డినగర్లోని దివి శివరాం ఇంటి నుంచి ఓవీరోడ్, పోస్టాఫీసు సెంటర్, పామూరు రోడ్, ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశారు. తమకు ఓట్లు వేయలేదని భావిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారి షాపులను టార్గెట్ చేశారు. పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న వేముల పాపయ్యగుప్తా జ్యూయలర్స్ (వీపీజీ జ్యూలయర్స్) ఎదుట కొందరు ద్విచక్ర వాహనాలు ఆపి హంగామా చేశారు. అనంతరం ఆ జ్యుయలరీ షాపును టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. షాపు అద్దాలు పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీలు కాకపోవడంతో పక్కనే ఉన్న సైకిల్‌ను బలంగా విసరడంతో షాపు అద్దాలు ధ్వసమయ్యాయి. దీంతో అప్పటికే షాపులో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో పాటు కూలీలు, యజమాని గజగజలాడిపోయారు. భయభ్రాంతులకు గురై షాపు షెట్టర్ వేసుకుని లోపలే ఉండిపోయారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు మొత్తం భయంతో తమ షాపులు మూసివేసి పరుగులు తీశారు. ర్యాలీ పామూరురోడ్డులోకి వచ్చే సరికి వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత దాడి జరిగిన వీపీజీ జ్యుయలరీ వద్దకు వచ్చిన దివి శివరాం.. షాపు యజమానితో మాట్లాడారు. ఏదో పొరపాటున అద్దాలు ధ్వంసమయ్యాయని సర్దిచెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. ఓట్లు పడలేదని నిర్ధారించుకునేదాడులు గెలుపు కోసం టీడీపీ నాయకుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వరుసగా మూడోసారి శివరాం ఓటమి పాలుకావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలన్నిటినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పట్టణంలో అధిక సంఖ్య లో ఓటర్లు ఉన్న ఓ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించగా ఎన్నికల్లో వారికి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలో అధిక మంది ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. తాము ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓట్లు సైతం తమకు పడలేదనే బాధ టీడీపీ నేతల్లో ఉంది. ఓటమికి గల కారణాలను అన్వేషించిన టీడీపీ నేతలు పట్టణంలో ఆ సామాజికవర్గం వారి షాపులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. పాత సంప్రదాయం పునరావృతం కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : కందుకూరులో పాత సంప్రదాయం పునరావృతమైంది. నియోజకవర్గంలో ఓటమి తట్టుకోలేని టీడీపీ శ్రేణులు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంపై అక్కసు వెల్లగక్కాయి. నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఓడినా ఆ పార్టీ కార్యకర్తలు పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ ముందుగా ఊహించిన విధంగానే జరిగింది. టీడీపీ ఓటమిని తట్టుకోలేని ఆ పార్టీ కార్యకర్తలు తొలి రెండు రోజలు మౌనం వహించారు. తమ ఉనికిని ఏ విధంగానైనా చాటుకోవాలని భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న పేరుతో కందుకూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కోవూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం మీదుగా కావాలనే సాగించారు. అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఫ్లెక్సీలను చించేసి బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు భయంతో తలుపులు ముసికొని లోపలే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మీ అంతు చస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ రఫీ పూల కొట్టు ఎదురుగా తారాజువ్వలు కాలుస్తూ భయనక వాతావరణం సృష్టించారు. రఫీపై దాడి చేసేందుకు పక్కనే ఉన్న దేవాల యంలో 20 మంది టీడీపీ యువకులు సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ మధుబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన జ్యుయలరీ షాపును పోలీసులు పరిశీలించారు. సీఐ ఎం.మధుబాబు, పట్టణ ఎస్సై రమణయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్లో ఫిర్యాదు చేయాలని షాపు యజమానికి సూచించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వైఎస్సార్ సీపీ దూకుడు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు పడ్డాయి. పరిషత్‌పోరులో ఇప్పటికే ఆధిక్యత చాటుకుని జెడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్న ఆపార్టీ ... సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బలీయమైన శక్తిగా అవతరించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమైంది. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇటు లోక్‌సభ, అటు శాసనసభ ఎన్నికల్లోనూ ఆపార్టీకి ఓట్లశాతం కూడా గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 14 శాతం ఓట్లు అధికంగా వైఎస్సార్ సీపీకి నమోదుకావడం విశేషం. మొత్తంమీద జిల్లాలో ఓట్లశాతంలో, సీట్ల సాధనలో వైఎస్సార్ సీపీ దూసుకుపోయింది. గిరగిరమంటూ ‘ఫ్యాన్’గాలి జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీలు, నెల్లూరు కిందనున్న కందుకూరు అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి పోలైన ఓట్లను పరిశీలిస్తే.. 49.06 శాతం మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి జేజేలు పలికారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 24.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో 20,85,923 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్ సీపీకి 9,80133, టీడీపీకి 9,72,310, కాంగ్రెస్‌కు 16,837 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీకి పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకి 46.98 శాతం, టీడీపీకి 45.99, కాంగ్రెస్‌కు 0.76 శాతం ఓట్లు లభించాయి. లోక్‌సభ అభ్యర్థులకు పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకే అధికంగా 49.06 శాతం నమోదుకావడం విశేషం. ఆధిక్యతల విషయంలోనూ టీడీపీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రికార్డు సాధించింది. జిల్లాలోని 12 అసెంబ్లీలకు గాను 6 స్థానాల్లో పార్టీ పాగా వేసింది. యర్రగొండపాలెంలో పోలైన ఓట్లు మొత్తం 1,57,090 కాగా, ఇందులో 85,417 ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజుకు అనుకూలంగా పడ్డాయి. సమీప టీడీపీ ప్రత్యర్థి బూదాల అజితారావు కంటే 19,150 ఓట్లు అధికంగా డేవిడ్‌రాజుకు మెజార్టీ రావడం విశేషం. గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి 12,893 ఓట్ల మెజార్టీ సాధించారు. మిగిలిన నాలుగుస్థానాల్లో 10 వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇదే ఉత్సాహం.. ఊపును భవిష్యత్‌లోనూ చూపేందుకు ఉద్యమ చైతన్యాన్ని పార్టీకేడర్లో నూరిపోసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. -
మాగుంట నిర్వేదం
సాక్షి, ఒంగోలు: చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి. ఓటమితో కొందరు నేతల్లో నిర్వేదం మొదలైంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై అంతర్మథనంలో ఉన్నారు. ఆయన ఓటర్లకు పంపిణీ చేయాలని అందించిన డబ్బును సక్రమంగా వినియోగించకపోవడమే ఓటమికి కారణమని సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై..చెప్పిన తర్వాత కొంతకాలం పార్టీ మార్పుపై సుదీర్ఘ మంతనాలు జరిపి టీడీపీ లోకొస్తే, పార్టీశ్రేణుల వైఖరి కారణంగా తనకెదురైన పరాభవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల కార్యాలయంలో సాంకేతిక సిబ్బందిని ఇతర పనులకు ఉపయోగించాలని... ఎన్నికల హంగులన్నీ తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై చివరి వరకు ఆశతో ఎదురుచూసిన మాగుంట ...ఫలితం అనుకూలంగా రాకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర నిర్వేదానికి లోనై టీడీపీ శ్రేణులపై అలకబూనినట్లు సహచరవర్గాల ద్వారా తెలుస్తోంది. మాగుంట ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బుపంపిణీ చేశారు. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఆర్థిక సహకారం భారీగానే సమర్పించుకున్నట్లు వినికిడి. అయితే, అందులో సగం కూడా ఓటర్లకు పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపులో వైవీ సుబ్బారెడ్డికి 5,84,209 ఓట్లు పడగా, మాగుంటకు మాత్రం 5,69,118 ఓట్లు పోలైనట్లు తేలింది. వైవీ సుబ్బారెడ్డి 15,095 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో తనకు తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరుల ద్వారా విచారణ చేయించగా, అక్కడ డబ్బు పంపిణీ సరిగ్గా చేయలేదనే విషయం బయటపడింది. రాజ్యసభ పదవికి ప్రయత్నాలు.. పార్టీని నమ్ముకుని రావడమే కాకుండా.. ఆర్థిక ఆసరా కల్పించిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఏదో ఒకటి నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని జిల్లా టీడీపీ పెద్దలు నడుంకట్టారు. ఇందులో భాగంగానే పలువురు నేతలు మాగుంటను కలిసి.. ఓటమిపై దిగులుపడొద్దని ఓదార్చినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీకాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పదవిని భర్తీచేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈస్థానం దక్కొచ్చు. నెల్లూరు జిల్లాతో సత్సంబంధాలు నడిపే మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజ్యసభ పదవిపై కన్నేశారు. ఎలాగైనా, ఆ పదవినైనా తనకు ఇప్పించాలని ఇప్పటికే పలువురు పార్టీపెద్దల వద్ద ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. ఆయనకు సుజనాచౌదరి మద్దతు ఉండటంతో .. జిల్లా నుంచి కరణం బలరాంతో పాటు పలువురు నేతలు గట్టిహామీనిచ్చారు. దీంతో కొందరు ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు సోమవారం హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. అయితే, చంద్రబాబు మాత్రం ఈపదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు...మాగుంటకు ఎంత వరకు అవకాశాలుంటాయనేది చెప్పలేమంటూ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. -
చీరాలలో ఈవీఎంల కలకలం
చీరాల, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు అధికారులు ఓ అభ్యర్థికి పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అధికారుల ఈవీఎంల తరలింపు ప్రయత్నం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా అధికారులు ఓ స్వతంత్ర అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి అతని గెలుపునకు కారణమయ్యారంటూ ఫలితాల అనంతరం నుంచి చీరాలలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టణ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వివరాలు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల కోసం తెచ్చిన ఈవీఎంలను ఇప్పటి వరకు చీరాలలో ఉంచడంతో పాటు వాటిని అందరికీ అనుమానం వచ్చే రీతిలో రాత్రి వేళలో పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం కూడా ఇవ్వకుండా రహస్యంగా తరలించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.ఈవీఎంల తరలింపు వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఈవీఎంలు భద్రపరిచిన వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులెవ్వరూ అక్కడకు రాకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గ ఫలితాలపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టింది. సోమవారం రాత్రి రెవెన్యూ శాఖకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్, పోలింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వ్యక్తి, మున్సిపల్ సిబ్బంది కలిసి వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నం చేశారు. గది సీల్ తీసే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న కళాశాల వాచ్మెన్ తమ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఈ సమయంలో తీసుకెళ్తే తనకు ఇబ్బంది అవుతుందని, ప్రిన్సిపాల్ అనుమతి తీసుకోవాలన్నాడు. ఎన్నికల డీటీ ఝాన్సీరాణి కూడా వాటిని తీసుకెళ్లేందుకు అంగీకరించనట్లు సమాచారం. మిగిలిన వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ విషయం టీడీపీ, వైఎస్సార్ కార్యకర్తలకు తెలిసింది. పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, నాయకులను చూసి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది రెండు కార్లలో అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ వాహనాల్లో వెంబడించినా వారు కనిపించకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
ప్రజలకు అందుబాటులో ఉంటా..
జనగామ, న్యూస్‌లైన్ : తనను ఆదరించిన జనం రుణం తీర్చుకోలేనిది.. వారికి నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన తదుపరి సోమవా రం ఆయన తొలిసారి జనగామకు వచ్చా రు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ అభిమానాన్ని ఉద్యమం రూపంలో చూపిన ప్రజలు ఇప్పుడు ఓటు రూపంలో చూపి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. గెలుపు ఆనందం కన్నా హామీల బాధ్యతలు ఎక్కువయ్యాయని, వాటిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పా రు. కేబినెట్ ప్రారంభమైన వారం రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండా యాదగిరిరెడ్డి, నాయకులు కన్నా పరుశరాములు, రంగారెడ్డి, చేవెల్ల సంపత్, పసుల ఏబెల్, తిప్పారపు ఆనంద్, ఆలూరి రమేష్, ఆకునూరి వెంకన్న, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పొత్తుతో నష్టపోయాం
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు వద్దని పార్టీ శ్రేణులన్నీ మొత్తుకున్నా జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ ఓట్లు టీడీపీకి లాభించాయని, ఆ పార్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన వారి నాయకులు సహకరించలేదని ఆరోపించారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచామని, జిల్లాలో టీడీపీ గెలిచిన పరకాల, పాలకుర్తి సీట్లు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే సాధ్యమయిందని చెప్పారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా వారి నుంచి సహకారం అందలేదని, ఈ పరిస్థితి పునరావృతమైందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కష్టాలకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రబీ సీజన్లో మూడు సార్లు అకాల వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొత్త దశరథం, కాసర్ల రాంరెడ్డి, కుమారస్వామి, గాదె రాంబాబు, రావు అమరేందర్‌రెడ్డి, ఏదునూరి భవాని, కూచన రవళి పాల్గొన్నారు. -
కల్వకుర్తి కాంగ్రెస్‌దే..
బీజేపీ అభ్యర్థిపై 78 ఓట్లతో గెలిచిన వంశీచంద్‌రెడ్డి కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఈవీఎంలో సాంకేతిక లోపంతో నెలకొన్న మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి విజేత ఎవరో తేలిపోయింది. హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి టి.ఆచారిపై 78 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సోమవారం వెల్దండ మండలం జూపల్లి గ్రామంలోని 119వ పోలింగ్‌బూత్‌లో జరిగిన రీపోలింగ్ విజేతను నిర్ణయించింది. ఈ బూత్ పరిధిలో వంశీచంద్‌రెడ్డికి 328 ఓట్లు, ఆచారికి 450, టీఆర్ఎస్ అభ్యర్థి జి.జైపాల్‌యాదవ్‌కు 55 ఓట్లు పడ్డాయి. ఈనెల 16న సాధారణ ఎన్నికల లెక్కింపు సందర్భంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జూపల్లి గ్రామ 119వ పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఈవీఎం సాంకేతిక లోపంతో ఫలితాన్ని చూపలే కపోయింది. దీంతో ఫలితాన్ని నిలిపివేశారు. సోమవారం ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు. తర్వాత చల్లా వంశీచంద్‌రెడ్డిని విజేతగా ప్రకటించారు. కాగా, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,61,799 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి 42,782 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి టి. ఆచారికి 42,704 ఓట్లు వచ్చాయి. 29,844 ఓట్లతో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి జి.జైపాల్‌యాదవ్ మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డికి 13,818, స్వతంత్ర అభ్యర్థి కె.నారాయణరెడ్డికి 24,095 ఓట్లు పోలయ్యాయి. -
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ఎవ్వరూ అధైర్యపడవద్దు... ఓటమి కి కుంగిపోవద్దు... ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే... ప్రజాతీర్పును శిరసావహించి ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం తన నివాసంలో అర్బన్ నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజాతీర్పును గౌరవించాలని సూచించా రు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు తన ఇంటి తలుపులు తెరచి ఉంటాయని భరోసా ఇచ్చారు. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో మూడేళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిందన్నారు. ఇరుపార్టీల నడుమ ఓట్ల శాతం అతి స్వల్పమేనన్నారు. 67 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుని సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలిచామన్నారు. పాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పోరుబాట పడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా... పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసినా ఏనా డూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందేనన్నారు. ఈ ఐదేళ్లు ప్రజ ల మధ్యలో ఉండి, వారి సమస్యల పరి ష్కారానికి కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆదరిస్తారని సూచించారు. సమావేశంలో మైనార్టీ నేత సాలార్‌బాషా, పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, సిటీ యూ త్ అధ్యక్షుడు మారుతీనాయుడుతో పా టు గెలుపొందిన కార్పొరేటర్లు, డివిజన్ కమిటీ నాయకులు, మహిళా విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
టీడీపీకి ఓటేయలేదని పొట్ట కొడుతున్నారు!
సాక్షి, అనంతపురం : ఎన్నికల హడావుడి ముగిసిందో, లేదో అప్పుడే గ్రామాల్లో ‘రాజకీయాలు’ మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్న నెపంతో పలుచోట్ల టీడీపీకి చెందిన సర్పంచులు ఉపాధి హామీ పథకం కూలీల పొట్టకొడుతున్నారు. పనులకు అనుమతి నిరాకరిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూలీలు ఉన్నతాధికారులకు వివరిస్తున్నా లాభం లేకుండా పోతోంది. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో పనుల కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం ఆనవాయితీ. అయితే.. స్థానికంగానే పనులు కల్పించి వ లసలు ఆపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామాల్లో పనులు మంజూరు చేయాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమై తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని టీడీపీకి చెందిన సర్పంచులు కక్ష సాధిస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకిమద్దతు తెలిపారనే నెపంతో పనులకు ఆమోదం తెలపకుండా వాయిదా వేస్తున్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాప్తాడు మండలం గాండ్లపర్తిలో ఉపాధి పనులు కావాలని కూలీలు రెండు నెలలుగా అడుగుతున్నా గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ అనుమతి ఇవ్వడం లేదు. స్థానికసంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో తాము చెప్పిన పార్టీకి కాదని.. మరో పార్టీకి మద్దతు తెలిపారనే కారణంతో కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేది లేక పలువురు కూలీలు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని 838 గ్రామ పంచాయతీల్లో 3,173 పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకంటే రెట్టింపు పనులు కావాలని కూలీలు అడుగుతున్నా గ్రామాల్లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు. ఇంతకుముందు ఎన్ని పనులు అడిగితే అన్ని మంజూరు చేసేవారని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించి.. వారి స్థానంలో టీడీపీ సర్పంచులకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్రామాల్లో పనులు కల్పించకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు నిలిపివేసే పరిస్థితి ఉంది. అప్పుడు వారంతట వారే వెళ్లిపోయేలా వ్యూహాలు రచిస్తున్నారు. మా దృష్టికి వచ్చింది కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఉపాధి పనులకు ఆమోదం తెలపడం లేదని మా దృష్టికి వచ్చింది. అయితే.. రాజకీయాలు వేరు, పనులు వేరని ఇప్పటికే ఎంపీడీఓల ద్వారా సర్పంచులకు తెలియజేశాం. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం. - సంజయ్ ప్రభాకర్, పీడీ, డీడబ్ల్యూఎంఏ -
ఎంపీపీ పదవుల కోసం హంగ్‌లారుస్తూ..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రాదేశిక ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చిన మండల పరిషత్‌లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. ఆయా మండలాల్లో కీలకంగా మారిన ఇతర పార్టీల ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు నడుపుతున్న వారు తమకు మద్దతు పలికితే వైస్ ఎంపీపీ పదవులతో పాటు కార్లు, ఇళ్లు, భూ ములు, పెద్ద ఎత్తున డబ్బు నజరానా ఇచ్చేందుకు సిద్ధపడు తున్నట్టు తెలిసింది. అయితే అందరికీ ఒకే రకమైన ఆఫర్లు ఇస్తుండడంతో అసలు ఎవరికి వైస్ ఎంపీపీ పదవులు కట్టబెడతారన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 12 మండలాల్లో కీలకం కానున్న టీడీపీయేతర ఎంపీటీసీలు జిల్లాలో 34 మండలాలు ఉండగా, ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 12 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికీ దక్కని పరిస్థితి ఏర్పడింది. బాడంగి, బలిజి పేట, భోగాపురం, దత్తిరాజేరు, గుర్ల, మక్కువ, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పార్వతీపురం, రామభద్రపు రం, సాలూరు మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. దీంతో అక్క డ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆయా మండల పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు టీడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. అక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులతో పాటు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, గెలుపొందిన అభ్యర్థులు కీలకంగా మారారు. బంపర్ ఆఫర్లు.... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ఎలాగైనా జిల్లాలో పట్టు సాధించేందుకు హంగ్ ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ పదవులకు దక్కించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈ మేరకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గెలిచిన స్వతంత్రులను ఇప్పటికే రహ స్య ప్రదేశాలకు తరలించారు. వారిలో కొందరిని విహార యాత్రల పేరుతో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లా, షిర్డీ వంటి సూదూర ప్రాంతాలకు తీసుకువెళ్లారు. అయితే స్వతంత్రులు వచ్చినా కలిసి రాని మండలాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీల నుంచి పోటీ చేసి గెలుపొందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరికి స్వతంత్రుల కన్నా భారీ ఎత్తు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా మండల ఉపాధ్యక్ష పదవితో మరికొన్ని ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ఒకే మండలంలో ఇద్దరు ముగ్గురికి ఇదే తరహాలో ఆఫర్లు ఇస్తుండడంతో చివరికి ఆ పదవిని ఎవరికి కట్టబెడతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాజకీయాలను గమనిస్తున్న మరికొంతమంది గెలుపు వీరులు భారీ మొత్తంలో నజరానాలు ఆశిస్తుండడంతో వారి కోర్కెల చిట్టా తీర్చేందుకు స్థానిక నాయకులు జేబులు చింపుకోవాల్సి వస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
ఎంపీటీసీలుగా భార్యాభర్తలు
వేపాడ, న్యూస్‌లైన్: మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన భార్యభర్తల ఎంపీటీసీలుగా ఎన్నికయ్యా రు. సోంపు రం జంక్షన్ వద్ద నివాసం ఉంటున్న గళ్ల శ్రీరాములునాయుడు, ఆయన భార్య దంతేశ్వరీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పాటూరు నుంచి గళ్ల దంతేశ్వరి 956 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా.. గళ్ల శ్రీరాములునాయుడు దబ్బిరాజుపేట నియోజ కవర్గంనుంచి 42 ఓట్ల మెజార్టీతో విజయం సాధిం చారు. గతంలో పాటూరు ఎంపీటీసీగా దంతేశ్వరి ఐదేళ్ల పాటు ఎంపీపీగా పని చేశారు. -
కాంగ్రెస్, టీడీపీ దోస్తీ
ఎంపీటీసీ ఎన్నికల్లో పలుచోట్ల హంగ్ - ఎంపీపీ స్థానాల కోసం ఎత్తుకు పైఎత్తులు - చిరకాల ప్రత్యర్థులతోనూ చెలిమి - డోన్, బండిఆత్మకూరులో బొమ్మాబొరుసుతో నిర్ణయం - ఓర్వకల్లులో అధ్యక్ష ఎంపిక వాయిదా - మరో ఏడు స్థానాల కోసం పోటాపోటీ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమైంది. మండల పరిషత్ ఎన్నికల ఫలితాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. పలు మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారిపోతున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆలింగనం చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. జిల్లాలో ఇటీవల వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే తొమ్మిది స్థానాల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోవడంతో హంగ్ నెలకొంది. వీటిని ఎలాగైనా తమ ఖాతాలో జమ చేసుకోవాలనే తలంపుతో ఆ రెండు పార్టీలు రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. కొందరు స్వతంత్రులతో మంతనాలు నెరుపుతుండగా.. మరికొందరు శుత్రువులతో సైతం చేతులు కలుపుతున్నారు. గతంలో ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లోనే ఎంపీపీ ఎంపిక పూర్తయ్యేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంపీపీల ఎంపికకు సమయం ఉండటంతో.. రాజకీయ పార్టీలు శిబిరాల ఏర్పాటు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరిని రహస్య ప్రాంతాలకు తరలించారు. ఎంపీటీసీ అభ్యర్థులకు ఏమి కావాలో అడిగి తెలుసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో 53 ఎంపీపీ స్థానాలు ఉండగా.. 23 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 21 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన 9 స్థానాల్లో అధిక్యత కోసం పోటాపోటీ నెలకొంది. వెల్దుర్తిలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో 6 వైఎస్సార్సీపీ, 5 టీడీపీ, మరో 6 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ మద్దతు కోరుతున్నట్లు సమాచారం. కల్లూరులో 3 వైఎస్ఆర్సీపీ, 8 టీడీపీ, 6 స్వతంత్రులు, సీపీఎం ఒకటి గెలుచుకున్నాయి. ఎంపీపీ కోసం టీడీపీ పట్టుబడుతోంది. మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతోంది. కోడుమూరులో వైఎస్సార్సీపీ 8, కాంగ్రెస్ 7, టీడీపీ 2, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ఎంపీపీ పదవిని ఇతరులకు కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. - డోన్లోవైఎస్సార్సీపీ 9, టీడీపీ 9 స్థానాలను దక్కించుకోగా.. రెండు పార్టీల నేతల్లో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఎంపీపీ పదవి ‘అదృష్టం’పై ఆధారపడి ఉంది. - పాణ్యం మండల పరిషత్‌లో టీడీపీ బొక్క బోర్లా పడింది. ఎంపీపీ స్థానం ఎస్టీకి రిజర్వు అయ్యింది. అయితే టీడీపీ తరఫున ఎస్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్టీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో టీడీపీకి 8 ఎంపీటీసీ స్థానాలు వచ్చినా ప్రయోజనం లేకపోతోంది. ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకోనుంది. - బండిఆత్మకూరులో వైఎస్సార్సీపీ, టీడీపీకి చెరి ఏడు స్థానాలు దక్కాయి. ఇక్కడ ఎంపీపీ పదవి ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. - గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, కాంగ్రెస్ 3, టీడీపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. - ఓర్వకల్లులో వైఎస్సార్సీపీ 8, టీడీపీ 3, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలుపొందారు. కన్నమడకల స్థానం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి తిక్కలి వెంకటస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో అధ్యక్ష ఎంపిక వాయిదా పడనుంది. - సి.బెళగల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 6, టీడీపీకి 7, కాంగ్రెస్‌కు 3 ఎంపీటీసీ స్థానాలు లభించాయి. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీకి మద్దతిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకే ఎంపీపీ పదవి దక్కనున్నట్లు సమాచారం. -
‘కారు’దే జోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక ఎన్నికల్లో కారు రయ్‌మంటూ దూసుకెళ్లింది. జిల్లాలో పెద్దగా ప్రభావం లేని ఆ పార్టీ.. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బలపడి సత్తాచాటింది. మునుపెన్నడూ లేనంతగా.. అత్యధికంగా ఓట్లు సాధించి బలమైన పార్టీగా అవతరించింది. గత ఎన్నికల కంటే 22.27శాతం ఓట్లు అధికంగా సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే పార్టీలవారీగా వచ్చిన ఓట్లలో తెలుగుదేశం పార్టీ ముందువ రుసలో ఉండగా.. తెలంగాణ రాష్ట్ర సమితి రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో గత రెండు సాధారణ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతం (2009 ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాల్లో పోటీ చేయగా, 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా 4 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది.) జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 8 సీట్లు కైవసం చేసుకోగా టీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4స్థానాల్లో ‘కారు’దే జోరు పోటీ చేయగా ఒక సీటును సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2సీట్లతో సరిపెట్టుకుంది. ఓట్ల పరంగా టీడీపీ మొదటి స్థానంలో ఉంది. టీఆర్ఎస్ ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నికలు చెంపపెట్టుగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకత.. దీనికితోడు పార్టీలో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఈసారి 9.16శాతం ఓట్లు తగ్గి సీట్ల సంఖ్య భారీగా పడిపోయింది. టీడీపీకి ఈసారి సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓట్లు 1.46 శాతం మాత్రమే పెరిగాయి. తెలంగాణ రాష్ట్రసమితి అనూహ్యంగా బలపడింది. తెలంగాణ సెంటిమెంటు, దానికితోడు ప్రముఖ నేతలంతా పార్టీలో చేరి పోటీచేయడంతో కారుజోరు పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు ఓట్ల శాతం భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 6.64శాతం ఓట్లు సాధించగా.. తాజా ఎన్నికల్లో 28.92శాతం ఓట్లు పోలయ్యాయి. ఏకంగా 22.27 శాతం ఓట్లు పెరగడం విశేషం. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ సైతం బలపడింది. నాలుగుస్థానాల్లో పోటీ చేసి ఒక సీటు సాధించింది. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి 6.86శాతం ఓట్లు రాగా.. ఈసారి కేవలం నాలుగు స్థానాల్లో పోటీ చేయగా 5.92శాతం ఓట్లు వచ్చాయి.