గవర్నర్ ను కలవనున్న కేసీఆర్ | TRS Chief KCR to Meet Governor Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ ను కలవనున్న కేసీఆర్

Published Sun, May 18 2014 10:39 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

గవర్నర్ ను కలవనున్న కేసీఆర్ - Sakshi

గవర్నర్ ను కలవనున్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులతో పాటు కేసీఆర్... గవర్నర్తో భేటీ కానున్నారు. కేసీఆర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్కు టీఆర్ఎస్ నాయకులు సమర్పించనున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు తాము సంసిద్ధమని ఆయనకు తెలియజేయనున్నారు. మొదట సీనియర్ నాయకులు మాత్రమే గవర్నర్ వద్దకు వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తాను కూడా గవర్నర్ను కలవాలని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement