TRS LP
-
నవంబర్ 18న హైదరాబాద్‌లో మహాధర్నా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగింది. ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ నెలాఖరున టీఆర్ఎస్ ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ ధర్నా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం తెలపనున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోంది. బఫర్ స్టాక్ చేయాల్సిన భాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక్కో రాష్ట్రానికి ఒక నీతి అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. పంజాబ్‌లో కొనుగోలు చేస్తూ మన దగ్గర కొనుగోలు చేయడం లేదు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదు. ఎఫ్‌సీఐ ధాన్యం కొంటామంటుంది. కేంద్రం కొనమంటుంది. గత యాసంగి ధాన్యం ఇంకా మన గోదాములలో ఉంది. వానాకాలం పంట కొంటారో కొనరో తెలియదు. చదవండి: (తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..) ఇలాంటి పరిస్థితుల్లో యాసంగిలో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా చెపుతాడు. కొనుగోలు కేంద్రాలలో డ్రామాలు చేసేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. రైతు నిరసన చేస్తే బీజేపీ నేతలు రాళ్లతో దాడి చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలి. వరి ధాన్యం కొంటారో కొనరో సమాధానం చెప్పాలి. బీజేపీ వ్యవహారాన్ని క్షమించేది లేదు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నా ఎందుకు?. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు కాదా.. వాళ్ళు కొనుగోలు కేంద్రాల దగ్గరకు ఎంధుకు రాకూడదు' అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో భారీ ధర్నా వరి ధాన్యం కొనుగోలు విషయంలో రేపు ప్రధానికి, సంబంధిత మంత్రికి లేఖ రాస్తా. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినట్లుగా.. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేస్తుందా లేదా చెప్పాలి. కేంద్రం పాలసీ స్పష్టంగా చెప్పాలి. యాసంగిలో వరి ధాన్యం వేయాలి అని చెప్పిన బండి సంజయ్ అదే మాట మీద ఉన్నడా లేదా అనేది తేలాలి. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ భారీ ధర్నా చేస్తారు. ధర్నా తర్వాత, రాజ్ భవన్లో గవర్నర్‌కు మెమోరాండం ఇస్తాం. 18న ధర్నా తర్వాత కేంద్రానికి రెండు రోజుల సమయం ఇస్తాం. అప్పటికీ సమాధానం రాకపోతే రైతులకు ప్రత్యమ్నాయ పంటలను వేయాల్సిందిగా సూచిస్తాం. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. లోక్‌సభలో, రాజ్యసభలో మా పార్లమెంట్ పక్షం వ్యతిరేకించింది అని సీఎం కేసీఆర్ అన్నారు. చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి) -
సీఎల్పీ విలీనాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తా’
మోత్కూరు: కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ ఎన్నికలలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్ తీరుపై పార్లమెంట్లో చర్చించేలా చేస్తానని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని చెప్పార -
టీఆర్ఎస్కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్
-
టీఆర్ఎస్కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమత్రి కేసీఆర్ వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే నివేదికను బయటపెట్టారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్ఎస్కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని తాను చేయించిన సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి తెలిపారు. సొంత సర్వేలో భారీ మెజార్టీ వస్తుందని తేలడంతో టీఆర్ఎస్ నేతలలో భారీ ఉత్సాహం నెలకొంది. అలాగే త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండాలని ఈ భేటీలో నిర్ణయించింది. కాగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నిక, మూడేళ్ల పాలనపై సంబురాలు, పార్టీతో పాటు, ప్రభుత్వ పోస్టులపై చర్చ జరిగింది. మరోవైపు కేసీఆర్ చేయించిన సర్వేపై పార్టీ ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్‌కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 18మంది గ్రేహౌండ్స్ కమాండ్లతో అదనపు భద్రత కల్పించారు. -
వందకు పైగా మనవే: కేసీఆర్ జోస్యం
-
వందకు పైగా మనవే
తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ⇒ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ⇒ 101 నుంచి 106 స్థానాల్లో గెలుస్తాం ⇒ టీఆర్ఎస్ఎల్పీ భేటీలో సీఎం జోస్యం సాక్షి, హైదరాబాద్: ‘‘మళ్లీ మనమే అధికారం లోకి వస్తాం. ఈసారి ఎన్నికల్లో కనీసం 101 నుంచి 106 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. పార్టీ చేయించిన సర్వేలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఎమ్మెల్యే జాతకం నా దగ్గరుంది. ఆ వివరాలు ఎవరివి వారికి ఇస్తా. పనితీరు సరిగా లేనివారు కుంగిపోవాల్సిన పనిలేదు. ఇంకొంచెం కష్టపడండి. సర్వేలో మంచి పర్సెంటేజీ వచ్చిన వాళ్లూ పొంగిపోవొద్దు. ఇంకా కష్టపడాలి. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేనిచోట కూడా పార్టీకి మంచి ఆదరణ ఉంది. అదే మీకు శ్రీరామరక్ష. ఆయా ఎమ్మెల్యేలు బాగా పర్యటించాలి. బహిరంగ సభలు పెట్టండి. నేను హాజరవుతా’’ అంటూ ఎమ్మెల్యేలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో తన అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శుక్రవారం నుంచి ప్రారంభవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అరగంట పాటు ప్రసంగించారు. సభ్యుల పనితీరు ఎలా ఉండాలో, ఎలా సన్నద్ధమై రావాలో వివరించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల తాను చేయించిన సర్వే వివరాలను భేటీలో సీఎం బయట పెట్టారు. అయితే వాటిని అందరి ముందూ కాకుండా, ఒక్కో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల తో పదేసి నిమిషాల చొప్పున మాట్లాడి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, విపక్షాల పరిస్థితి,ఎమ్మెల్యే పనితీరు గురించి తెలిపారు. సర్వేలో 40 శాతంకన్నా తక్కువ ఫలితం వచ్చినవారు ఇంకా కష్టప డాలన్నారు. విప్‌లూ... మెరుగవ్వండి అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులంతా హుందా గా వ్యవహరించాలని, విపక్షాలను ఎదుర్కొ నేందుకు బాగా తయారై రావాలని సీఎం సూచించారు. ‘‘హాజరు పూర్తి స్థాయిలో ఉం డాలి. మంత్రులు సహా అంతా సభకు కనీసం అరగంట ముందే రావాలి. ప్రధానంగా మంత్రులు ఏ రోజుకారోజు ఎజెండా చూసు కుని సన్నద్ధమవాలి’’ అని సూచించారు. ప్రభుత్వ విప్ల పనితీరు సరిగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా సమన్వయం సరిగా చేయలేక పోతున్నారన్నా రు. ఈసారి వారి పనితీరు మెరుగుపడాలని సూచించారు. ప్రభుత్వాన్ని మీరూ ప్రశ్నించండి ప్రజోపయోగమైందని అనుకున్న ప్రతి అంశా న్నీ ప్రభుత్వం దృష్టికి తేవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. ‘‘కేవలం ప్రతిపక్షాలే ప్రశ్నలేస్తా యని అనుకోవద్దు. అధికార పార్టీ సభ్యులు కూడా గట్టిగానే ప్రశ్నలడగాలి. జీరో అవర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి’’ అని సూచించారు.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లా డాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశా నికి ఎంపీలను కూడా ఆహ్వానించినా ఇద్దరే వచ్చారంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశా రు. సమావేశ వివరాలను ఎంపీలకు తెలియజేయాలన్నారు. 15 రోజుల్లో సభ్యత్వం పూర్తి కావాలి పార్టీ సంస్థాగత అంశాలను కూడా సీఎం చర్చించారు. ‘‘పార్టీ సభ్యత్వాలను 15 రోజుల్లో పూర్తి చేయాలి. వారంలో సభ్యత్వా లివ్వడం మొదలుపెట్టాలి. పార్టీ క్రియాశీలక సభ్యులకు ఏప్రిల్ 1 నుంచి బీమా వర్తించేలా సభ్యత్వాలను తక్షణమే పూర్తి చేయండి’’ అని ఆదేశించారు. ఇందులో ఎలాంటి పొడిగింపూ, గ్రేస్ పీరియడూ ఉండవన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక ఏప్రిల్ 21న పార్టీ ప్లీనరీ నేపథ్యంలో కమిటీల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో నియోజకవర్గ ఇన్చార్జులతో భేటీ అవుతా మన్నారు. జిల్లావారీగా ఎమ్మెల్యేలకు సభ్యత్వ పుస్తకాలందజేశారు. సిట్టింగులకు మళ్లీ సీట్లు కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో దాదాపు ఆర్నెల్ల కింద చేయించిన సర్వే, గత జనవరి ఆఖరులో చేయించిన సర్వేల ఫలితాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సీఎం అందజేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా 100 పై చిలుకు స్థానాల్లో గెలుపు టీఆర్ఎస్దేనని, అంతా మంచిగా పని చేస్తే ప్రతి సిట్టింగ్ సభ్యునికీ మళ్లీ టికెట్ దక్కుతుందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తవారికీ అవకాశం ఉంటుందన్నారు. జాగ్రత్తగా పని చేయాలని, ఇష్టారాజ్యం కుదరదని సున్నితంగా హెచ్చరించారు. ఇకనుంచి ఎమ్మెల్యేలపై కానీ, మంత్రులపై, ప్రభుత్వంపై గానీ అవినీతి ఆరోపణలొస్తే తీవ్రంగా స్పందించాలని సూచించారు. ‘‘మీపై అవినీతి ఆరోపణలొస్తే కుంగిపోవద్దు. వాటిని నిరూపించాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేయండి. ఎక్కడా వెనక్కి తగ్గొద్దు. ఆరోపణలను ఉపేక్షించొద్దు’’ అని స్పష్టం చేశారు. -
స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే పార్టీ విలీనమైనట్లు కాదు: వైఎస్సార్సీపీ తెలంగాణ సాక్షి, హైద రాబాద్: తమ పార్టీ తెలంగాణ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకోవడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్ పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరడాన్ని రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోందని వారు ఒక ప్రకటనలో గుర్తు చేశారు. వందకు వంద శాతం సభ్యులు వేరొక పార్టీలో చేరినా అది రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేశారు. తన నిర్ణయానికి ఉన్న రాజ్యాంగ బద్ధత ఏమిటో స్పీకర్ వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ విలీనమైనట్లు కాదన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు తావివ్వడమంటే ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై గౌరవం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తామని వెల్లడించారు. -
గవర్నర్ ను కలవనున్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులతో పాటు కేసీఆర్... గవర్నర్‌తో భేటీ కానున్నారు. కేసీఆర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్‌కు టీఆర్ఎస్ నాయకులు సమర్పించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సంసిద్ధమని ఆయనకు తెలియజేయనున్నారు. మొదట సీనియర్ నాయకులు మాత్రమే గవర్నర్ వద్దకు వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తాను కూడా గవర్నర్‌ను కలవాలని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.