
టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమత్రి కేసీఆర్ వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే నివేదికను బయటపెట్టారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్‌ఎస్‌కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని తాను చేయించిన సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి తెలిపారు. సొంత సర్వేలో భారీ మెజార్టీ వస్తుందని తేలడంతో టీఆర్‌ఎస్ నేతలలో భారీ ఉత్సాహం నెలకొంది.
అలాగే త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తటస్థంగా ఉండాలని ఈ భేటీలో నిర్ణయించింది. కాగా టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నిక, మూడేళ్ల పాలనపై సంబురాలు, పార్టీతో పాటు, ప్రభుత్వ పోస్టులపై చర్చ జరిగింది. మరోవైపు కేసీఆర్ చేయించిన సర్వేపై పార్టీ ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్‌కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 18మంది గ్రేహౌండ్స్ కమాండ్‌లతో అదనపు భద్రత కల్పించారు.