Survey details
-
పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే.. మహిళలపైనే అధికం!
ఐక్యరాజ్యసమితి: పని ప్రదేశాల్లో దిగువస్థాయి సిబ్బందికిపై హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారాయని ఓ సర్వేలో తేలింది. యువత, వలసదారులు, రోజువారీ వేతన జీవులు, ముఖ్యంగా మహిళలే ఇందుకు బాధితులుగా మారుతున్నారని వెల్లడైంది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన మొట్టమొదటి సర్వే ఇది. ఐరాస అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్, గాల్లప్ సంస్థ కలిసి గత ఏడాది చేపట్టిన ఈ సర్వే ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల్లోని 75 వేల మంది సిబ్బందిపై సర్వే జరపగా 22% మందికి పైగా ఏదో ఒక రకమైన వేధింపులు, హింసకు గురవుతున్నట్లు తెలిపారని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు పని ప్రదేశంలో ఏదో ఒకవిధమైన వేధింపులకు గురవుతున్నట్లు తెలపగా, 6.3% మంది భౌతిక, మానసిక, లైంగిక హింసను, వేధింపుల బారినపడ్డారు. 17.9% మంది మాత్రం ఉద్యోగం చేసుకునే చోట ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉపాధి పొందే చోట భౌతికంగా హింస, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు 8.5% మంది పేర్కొనగా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. ‘పని ప్రదేశాల్లో వేధింపులు ప్రమాదకరమైన అంశం. దీనివల్ల వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆదాయ నష్టం వాటిల్లి, వారి కెరీర్ దెబ్బతింటోంది’అని సర్వే అభిప్రాయపడింది. ప్రభావవంతమైన చట్టాలు, విధానాలను రూపొందించి ఈ సమస్యను పరిష్కరించవచ్చునని పేర్కొంది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
కరోనా ఎంత పనిచేసింది.. టెన్షన్ పెడుతున్న సర్వే!
లండన్: కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిపై ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందట. శ్వాసకోస సమస్యలు, నీరస, రుచి, వాసన తెలియకపోవడం వంటి వ్యాధి లక్షణాల్లో కనీసం ఒక్కటైనా వారిని చాలాకాలం బాధిస్తున్నట్టు లాన్సెట్ జర్నల్ శుక్రవారం విడుదల చేసిన తాజా సర్వే పేర్కొంది. కరోనాపై ఇప్పటిదాకా చేసిన అత్యంత సమగ్రమైన సర్వేల్లో ఇదొకటని చెప్తున్నారు. నెదర్లాండ్స్‌లో 76,422 మందిపై 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు దాకా సర్వే జరిపారు. అప్పటికి వ్యాక్సీన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలపై ఈ వ్యవధిలో వారి నుంచి 24 సార్లు వివరాలను సేకరించారు. 21 శాతం మంది తమకు కరోనా నిర్ధారణ అయిన తొలి 5 నెలల్లో వాటిలో ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించాయని చెప్పారు. 12 శాతానికి పైగా, అంటే ప్రతి 8 మందిలో ఒకరు తాము దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. అయితే ఇలాంటి వారినుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకడం లేదని సర్వేలో తేలడం విశేషం. ఈ విషయంలో మరింత లోతుగా పరిశీలన జరిపేందుకు మరింత సమగ్రమైన డేటా అవసరం చాలా ఉందని నెదర్లాండ్స్‌లోని గ్రొనింజెన్ వర్సిటీ ప్రొఫెసర్ జుడిత్ రొస్మలెన్ అన్నారు. ఇది కూడా చదవండి: చైనీయులు తైవాన్ విషయమై ఏం అన్న ఊరుకునేట్లు లేరు! సారీ చెప్పాల్సిందే కోవిడ్ సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు -
లేడీ బాస్‌లే నయం!
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కంపెనీల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులే మెరుగ్గా పని చేస్తున్నారు. నైపుణ్యంలోనూ వారే ముందంజలో నిలుస్తున్నారు. పుణె కేంద్రంగా పని చేస్తున్న టెక్నాలజీ సంస్థ ఎస్‌సీఐకేఈవై నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. ఆ సంస్థ దేశంలోని పలు సాఫ్ట్వేర్, వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న 5,388 మంది మహిళా, పురుష ఉద్యోగుల పనితీరుపై ఇటీవల అధ్యయనం చేసింది. సహచరులతో కలిసిపోవడం, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడం, మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి 6 అంశాల ఆధారంగా ఈ అధ్యయనం జరపగా.. ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. లేడీ బాస్‌లే మేలు కంపెనీల్లో సహచరులను కలుపుకుని పని చేయడంలో మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా ఉంటున్నారు. తమతో కలిసి పనిచేసే వారితో ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నారు. మగ బాస్‌ల కంటే మహిళా బాస్‌లే తమ ఉద్యోగుల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంతోపాటు వారిని మేలైన రీతిలో ప్రోత్సహిస్తున్నారు.(చదవండి: కరోనా ఎఫెక్ట్‌తో స్వయం ఉపాధిలోకి.. ) సంప్రదింపులు.. బేరసారాల్లోనూ మేటి ఇతర కంపెనీలు, వ్యక్తులతో సంప్రదింపులు జరపడం, బేరసారాలు కొనసాగించడంలో మహిళలు మగవారితో సమానంగా.. చాలాసార్లు వారి కంటే మెరుగ్గా మహిళా ఉద్యోగులు వ్యవహరిస్తున్నట్టు తేలింది. ఇలాంటి సమయాల్లో కచ్చితమైన డేటా, సంబంధిత అంశాలపై పూర్తి అవగాహనతో ఉంటున్నారు. మేనేజ్మెంట్ నైపుణ్యంలోనూ మహిళల సమర్థత పురుష ఉద్యోగుల కంటే బాగా ఉంటోంది. ఏదైనా పని అప్పగించినప్పుడు ప్రభావవంతంగా పూర్తిచేయడంలో ఉద్యోగినులే ముందుంటున్నారు. ఉద్యోగుల మధ్య అభిప్రాయ భేదాలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకుని పరిష్కరించడంలోనూ మహిళా ఉద్యోగులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఉద్వేగాలను నియంత్రించుకుంటున్నా.. తప్పని ఒత్తిడి భావోద్వేగాలను నియంత్రించుకోవడంలోనూ ఉద్యోగినులే మెరుగ్గా ఉన్నట్టు తేలింది. 16.8 శాతం మహిళా ఉద్యోగులు భావోద్వేగాలకు గురైన సమయంలోనూ స్థిరంగా పనిచేస్తుండగా.. 14.7 శాతం మంది పురుషులు మాత్రమే అలాంటి సమయాల్లో స్థిరంగా ఉండి పనిచేస్తున్నారు. కానీ.. ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో మాత్రం ఉద్యోగినులు బాగా ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. రెండేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగుల్ని పరిశీలించగా.. ప్రతి 10 మంది ఉద్యోగినుల్లో ఆరుగురు భావోద్వేగాల వేళ ఒత్తిడికి గురవుతున్నారు. పురుషుల విషయానికి వస్తే ప్రతి 10 మందిలో నలుగురు మాత్రమే ఒత్తిడికి లోనవుతున్నారు. ఉద్యోగ అనుభవం ఎక్కువ ఉన్న వారిని పరిశీలించినప్పుడు ప్రతి 10 మంది ఉద్యోగినుల్లో 8 మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఫురుషులైతే ప్రతి 10 మందిలో ముగ్గురు మాత్రమే ఒత్తిడికి లోనవుతున్నారు. -
స్వచ్ఛతలో సత్తుపల్లి ర్యాంకెంత..?
సాక్షి, సత్తుపల్లి: కేంద్ర ప్రభుత్వం సత్తుపల్లి స్వచ్ఛతకు పట్టం కట్టింది. బుధవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్–2019 ర్యాంకుల్లో సత్తుపల్లి మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో 65 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో 4,041 మున్సిపాలిటీతో పోటీపడి 4వేల మార్కులకు 2214.58 మార్కులు సాధించింది. అదేవిధంగా జాతీయస్థాయిలో ఇల్లెందు(389వ ర్యాంక్), మణుగూరు(953వ ర్యాంక్), కొత్తగూడెం(339వ ర్యాంక్), మధిర(501వ ర్యాంక్), పాల్వంచ(967వ ర్యాంక్) పొందాయి. జనవరిలో సర్వే జరిపిన కేంద్ర ప్రత్యేక బృందాలు.. స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంకు కేటాయించేందుకు జనవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్వే సంస్థ మున్సిపాలిటీలో సర్వే నిర్వహించింది. సెల్‌ఫోన్‌తో ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో 200 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించింది. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, బహిరంగ మల విసర్జన, తాగునీటి సరఫరా, తడి, పొడి చెత్తల సేకరణ, డంపింగ్ యార్డ్, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మున్సిపాలిటీ : సత్తుపల్లి విస్తీర్ణం : 18.90 చదరపు కిలోమీటర్లు జనాభా : 31,893 వార్డులు : 20 నివాసాలు : 7,202 పారిశుద్ధ్య సిబ్బంది : 115 మంది వాటర్ ట్యాంకర్లు : 2 పారిశుధ్య వాహనాలు : రిక్షాలు–12, ఆటోలు–2, డంపర్బిన్లు–20, డీసీఎం–1, ట్రాక్టర్లు–4 రోజువారీ సేకరించే చెత్త : 14 టన్నులు చాలా సంతోషంగా ఉంది దేశంలోనే సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో ఉత్తమ ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉంది. వరంగల్ రీజియన్‌లో సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో మూడవ స్థానం లభించినందుకు గర్వంగా ఉంది. కౌన్సిలర్లు, ఉద్యోగులపై మరింత బాధ్యత పెరిగింది. ప్రధానంగా ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఈ ర్యాంక్‌ను సాధించగలిగాం. – దొడ్డాకుల స్వాతి, చైర్పర్సన్, సత్తుపల్లి మున్సిపాలిటీ అందరి కృషితోనే సత్తుపల్లి మున్సిపాలిటీలోని అధికారులు, కార్మికులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఉత్తమ ర్యాంక్ సాధించగలిగాం. ఇదే స్ఫూర్తితో మరింత సుందరంగా సత్తుపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. పట్టణాభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి. – చీమా వెంకన్న, కమిషనర్, సత్తుపల్లి మున్సిపాలిటీ -
లెక్క తేలింది..
ఆదిలాబాద్‌టౌన్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సర్వే పూర్తయ్యింది.. దీంతో ఈ పథకానికి అర్హుల లెక్క తేలింది. జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన 45,042 కుటుంబాలు ఉండగా, ఇందులో 41,439 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సర్వే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. కాగా మొదటి విడతగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున ఈ నెల 24న డబ్బులు జమ కానున్నాయి. జిల్లాలో మొత్తం 1,33,447 మంది రైతులు ఉండగా, కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి నిబంధన ఉండడంతో సగానికంటే ఎక్కువ మంది రైతులు పథకానికి దూరమయ్యారు. ఈ నెల 14న ప్రారంభమైన సర్వే 20వ తేదీ వరకు నిర్వహించారు. ఏఈఓలు సేకరించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. ఇప్పటివరకు 32,763 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు. మిగతా వారి వివరాలు సైతం మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు రైతుల ఖాతాల్లో డబ్బులు.. సమ్మాన్ పథకంలో భాగంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈనెల 24 నుంచి డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6వేలు ఇవ్వనున్న విషయం తెలిసిందే. మూడు విడతలుగా అకౌంట్లలో వేయనున్నారు. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున అందించనున్నారు. అయితే జిల్లాలోని 18 మండలాల్లో 5 ఎకరాలు కలిగి ఉన్న రైతులు 45,042 రైతు కుటుంబాలు ఉండగా, ఇందులో 194 మంది రైతులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, లాయర్లు, డాక్టర్లు, ఐటీ చెల్లించేవారు, తదితరులు ఉండడంతో అనర్హులుగా గుర్తించారు. ఈ పథకానికి సంబంధించి 41,439 మంది రైతులను అధికారులు అర్హులుగా గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు 32,763 మంది రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. 3,374 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించాల్సి ఉందని, 676 మంది రైతుల పూర్తి వివరాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. రైతుల వివరాలు అప్లోడ్ చేస్తున్నాం జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలు 45,042 ఉండగా, ఇప్పటివరకు 41,414 మంది రైతులను అర్హులుగా గుర్తించాం. 194 మంది రైతులను ఈ పథకానికి అనర్హులుగా గుర్తించాం. 676 మంది రైతుల వివరాలు పూర్తిగా లేవు. 3,374 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 33,763 రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాం. ఇంకా 95 గ్రామాల రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్ -
ప్రజాభిప్రాయ సేకరణలో టీడీపీ ఎమ్మెల్యే హల్చల్
సాక్షి, కర్నూలు జిల్లా : రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణలో టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హల్చల్ చేశారు. వివరాలు..కొలిమిగుండ్ల మండలం మీర్జాపురంలో జరుగుతున్న ప్రజాభిప్రాయసేకరణలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు స్వాగతించారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడని ప్రజలు ఆరోపించారు. తన స్వార్థం కోసం ఫ్యాక్టరీని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని ప్రజలు హెచ్చరించారు. అదే విధంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి రావడం లేదంటూ అధికారులను, ప్రభుత్వాన్ని వైఎస్సార్సీప నాయకులు నిలదీశారు. దాంతో కలెక్టర్ ముందే టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రెచ్చిపోయారు. టీడీపీ ప్రభుత్వ చొరవతోనే పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగి తీవ్రవిమర్శలు చేశారు. దీంతో ప్రజలు ఎదురుతిరిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రంగ ప్రవేవంతో వివాదం సద్దుమణిగింది. -
రైతు అ‘సమగ్ర’ సర్వే
రెవెన్యూ రికార్డులకు.. సర్వే వివరాలకు భారీ తేడా సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన సర్వే వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలడం లేదు. ఓ గ్రామంలో 300 మంది రైతులున్నారని శాఖ తేలిస్తే, 1,100 మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరి ప్రభుత్వ పెట్టుబడి ఎవరికివ్వాలి? చివరికి ఆ మొత్తం నిజమైన రైతులకు చేరకుండా పక్కదారి పడితే పెద్ద కుంభకోణంగా మారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఏ భూమి ఎవరిదో స్పష్టతకు రావాలి. ఇందుకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేయాలి. గ్రామం యూనిట్‌గా సర్వే జరగాలి. ఎంత భూమి ఉంది? ఎవరి పేరిట మీద ఉందనే విషయంలో స్పష్టతకు రావాలి.’’ ఇటీవలి సమీక్షలో రైతు సమగ్ర సర్వేపై సీఎం కేసీఆర్ పెదవి విరుపిది. ఆ సర్వేను ఆయన విశ్వసించడం లేదనేం దుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)తో నిర్వహించిన ఈ సర్వేపై తొలి నుంచీ ఆరోపణలున్నాయి. సమగ్రంగా జరగలేదని, పలుచోట్ల రైతుల ఇళ్లకు వెళ్లకుండానే రాసేశారని వచ్చిన విమర్శలు సీఎం దాకా వెళ్లాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి రైతులకు పెట్టుబడి పథకం అమలుకు ఈ సర్వేను ఆధారం గా తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ జరిపి, సర్వే వివరాల ను ఆ సమాచారంతో సరిచూసుకొని ముందుకు పోతుందంటున్నారు. 30 లక్షల ఎకరాలు తగ్గాయి..! సాగుభూమి, రైతుల సంఖ్యలో వ్యవసాయశాఖ లెక్కలకు, సర్వేలో బాగా తేడా లుండటంతో దాని సాధికారతపై సీఎంకు అనుమానం తలెత్తింది. రాష్ట్రంలో రైతుల వద్ద ఉన్న భూమి వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 1.54 కోట్ల ఎకరాలు కాగా సర్వేలో 1.24 కోట్లే తేలింది. రైతుల సంఖ్య కూడా శాఖ వద్ద 55.53లక్షలుంటే çసర్వేలో 45.55లక్షలే తేలారు. ఉద్యాన పంటల విస్తీర్ణమూ 8లక్షలకు బదులు 3.59 లక్షలుగా తేలింది. కొత్త ఏఈవోలకు సమగ్ర శిక్షణ ఇవ్వకుండా సర్వే భారమంతా వారిపై వేసి అధికారులు చేతులు దులుపుకోవడమే దీనికి కారణమంటున్నారు. సకాలంలో ట్యాబ్‌లు ఇవ్వక పోవడంతో సర్వే వివరాలు రాయడానికే సమయం సరిపోయింది. దాంతో చాలాచోట్ల మొక్కుబడి సమాచారంతో సరిపుచ్చారన్న వాదనలున్నాయి. వివరాలను మళ్లీ సరిచూసి ట్యాబ్‌లో నిక్షిప్తం చేయాలని శాఖ ఆదేశించింది. -
టీఆర్ఎస్కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్
-
టీఆర్ఎస్కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమత్రి కేసీఆర్ వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే నివేదికను బయటపెట్టారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్ఎస్కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని తాను చేయించిన సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి తెలిపారు. సొంత సర్వేలో భారీ మెజార్టీ వస్తుందని తేలడంతో టీఆర్ఎస్ నేతలలో భారీ ఉత్సాహం నెలకొంది. అలాగే త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండాలని ఈ భేటీలో నిర్ణయించింది. కాగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నిక, మూడేళ్ల పాలనపై సంబురాలు, పార్టీతో పాటు, ప్రభుత్వ పోస్టులపై చర్చ జరిగింది. మరోవైపు కేసీఆర్ చేయించిన సర్వేపై పార్టీ ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్‌కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 18మంది గ్రేహౌండ్స్ కమాండ్లతో అదనపు భద్రత కల్పించారు. -
పల్లెకు చేరిన సర్వే..
పాలమూరు : రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించనున్న సమగ్రసర్వేకు జిల్లాలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సర్వేకు సంబంధించిన ఫారాలన్నింటినీ ఎన్యుమరేటర్లకు పంపిణీ చేశారు. సర్వే వివరాలు సేకరించేందుకు నియమించిన 39,498 మంది ఎన్యుమరేటర్లు గ్రామాలు, పట్టణాలకు బయల్దేరి వెళ్లారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్ల వారీగా సిబ్బందిని సమాయత్తం చేసి సర్వే కోసం పంపారు. సర్వేకోసం జిల్లాను 501 రూట్లు, 314 జోన్లుగా విభజించారు. సమగ్ర సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 1665 వాహనాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా జిల్లానుంచి వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు కూడా వాహనాలను ఏర్పాటు చేశారు. నేడు అంతటా బంద్ వాతావరణమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ముందుస్తుగా సెలవు ప్రకటించాయి. అన్ని ఆలయాల్లోనూ ఉదయం 8 గంటల లోపు పూజా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. బ్యాంకులు, సినిమా థియేటర్లు, వస్త్ర దుకాణాలు, పెట్రోలు బంక్‌లతోపాటు పట్టణ ప్రాంతాలు, పల్లెల్లో సైతం వ్యాపార సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లా సమస్తం సెలవు రోజుగా కనబడనుంది. ఇందుకుగాను జిల్లా కేంద్రంలోని పెట్రోలు బంకుల్లో సోమవారం రాత్రి వాహనాల రద్దీ కనబడింది. ప్రభుత్వం ముందస్తుగా సెలవు ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారంతా జిల్లాకు చేరుకున్నారు. పల్లెల్లో పండగ సందడి సంకురాత్రి పండ్గకు కూడా రాని .. పిల్లగాండ్లు... ఏ పండ్గా.. లేని దినాన ఇంటి కొచ్చిండ్రని.. తాతా అవ్వలు శానా ఖుషీ అవుతుండ్రు.. ఏండ్ల కొద్దీ ఊరు మొఖం చూడని ఉద్యోగస్తులు కూడా ఊర్లను వెతుక్కుంటూ వెళ్లి అమ్మ, నాన్నల దగ్గరకు చేరుకోవడం జిల్లా వ్యాప్తంగా అన్ని పల్లెల్లోనూ సందడి నెలకొంది. ఎక్కడెక్కడో ఉన్న వలస జీవులంతా ఊళ్లకు చేరుకుంటుండంతో ప్రతి ఇల్లూ.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేను దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబాల వారంతా మళ్లీ ఒకసారి తమ సొంతింటికి కట్టగట్టుకుని చేరుకుంటున్నారు. పండగలకు పబ్బాలకు వీలు కాక రాలేనివారు సైతం ఈ సర్వేకోసం రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. జిల్లాకు చెందిన 12 లక్షల మంది హైదరాబాద్, బెంగుళూరు, పూణె, ముంబై. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వలసకూలీలుగా, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులుగా కొనసాగుతున్న దాదాపు 3లక్షల మంది ఇళ్లకు చేరుకుంటున్నారు. -
తెలంగాణ సర్వేపై కేంద్ర హోం శాఖ ఆరా
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. సర్వే వివరాలు తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఒకే రోజు సర్వే నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వానికి పలువురు ఎంపీల ఫిర్యాదు చేశారు. సర్వే రోజున అందరూ ఇంటి వద్దే ఉండాలని చెప్పడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్రానికి ఎంపీలు తెలిపారు. దీంతో కేంద్ర హోంశాఖ సర్వే వివరాలు కోరింది. ఈనెల 19న ప్రజల సమగ్ర వివరాలు సేకరించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంటివద్ద లేని వారి వివరాలు నమోదు చేయబోయని ప్రభుత్వం స్పష్టం చేసింది.