లండన్: కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిపై ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందట. శ్వాసకోస సమస్యలు, నీరస, రుచి, వాసన తెలియకపోవడం వంటి వ్యాధి లక్షణాల్లో కనీసం ఒక్కటైనా వారిని చాలాకాలం బాధిస్తున్నట్టు లాన్సెట్ జర్నల్ శుక్రవారం విడుదల చేసిన తాజా సర్వే పేర్కొంది.
కరోనాపై ఇప్పటిదాకా చేసిన అత్యంత సమగ్రమైన సర్వేల్లో ఇదొకటని చెప్తున్నారు. నెదర్లాండ్స్‌లో 76,422 మందిపై 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు దాకా సర్వే జరిపారు. అప్పటికి వ్యాక్సీన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలపై ఈ వ్యవధిలో వారి నుంచి 24 సార్లు వివరాలను సేకరించారు. 21 శాతం మంది తమకు కరోనా నిర్ధారణ అయిన తొలి 5 నెలల్లో వాటిలో ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించాయని చెప్పారు.
12 శాతానికి పైగా, అంటే ప్రతి 8 మందిలో ఒకరు తాము దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. అయితే ఇలాంటి వారినుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకడం లేదని సర్వేలో తేలడం విశేషం. ఈ విషయంలో మరింత లోతుగా పరిశీలన జరిపేందుకు మరింత సమగ్రమైన డేటా అవసరం చాలా ఉందని నెదర్లాండ్స్‌లోని గ్రొనింజెన్ వర్సిటీ ప్రొఫెసర్ జుడిత్ రొస్మలెన్ అన్నారు.
ఇది కూడా చదవండి: చైనీయులు తైవాన్ విషయమై ఏం అన్న ఊరుకునేట్లు లేరు! సారీ చెప్పాల్సిందే
కోవిడ్ సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు
Comments
Please login to add a commentAdd a comment