Infections
-
చెవులు, ముక్కు కుట్టించుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
ఇటీవల కొందరు కనుబొమల దగ్గర, పెదవుల దగ్గర, మరికొందరైతే నాభి దగ్గర కూడా బాడీ పియర్సింగ్ చేయించుకుంటున్నారు. గతంలో సాంప్రదాయికంగా బంగారపు ఆభరణాల తయారీ కళాకారులే ఈ చెవులు కుట్టడాన్ని చేసేవారు. ఇప్పుడైతే చాలాచోట్ల బ్యూటీ సెలూన్లలోనూ పియర్సింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడూ చాలామంది నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ చేయిస్తున్నారు.డాక్టర్ల దగ్గరే మేలు... ఇప్పుడు అధునాతన పియర్సింగ్ పరికరాలతో చెవులు, ముక్కు లేదా దేహంలో అవసరమైన చోట్ల పియర్సింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచిన లేదా స్టడ్స్గా ఉంచదలచిన బంగారు, వెండి తీగలను ముందుగానే డాక్టర్లు స్టెరిలైజ్ చేశాకే ముక్కుచెవులు కుట్టడం చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఆరోగ్యపరంగా డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ ప్రక్రియ జరగడం ఎంతో మంచిది. డాక్టర్ల ఆధ్వర్యంలో ఇలా స్టెరిలైజ్ చేశాకే బంగారు రింగు తొడగడం లేదా స్టడ్స్ తొడగడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇలా చెవి, ముక్కు కుట్టడం లేదా అలా కుట్టిన చోట తీగ / స్టడ్ వేయాల్సిన ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. పియర్సింగ్లో కలిగే అనర్థాలు... ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందూ, ఆ తర్వాతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ తర్వాత ఇది మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం : ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. ఇలా సిస్ట్ / గ్రాన్యులోమా / కీలాయిడ్ వచ్చే అవకాశం ఉన్నవారు చిన్నప్పుడే వేసిన రంధ్రం తప్ప మళ్లీ పియర్సింగ్ చేయించు కోపోవడమే మంచిది. మచ్చ ఏర్పడటం : కొన్ని సార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోండి... శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవీ లేనప్పుడే ముక్కు, చెవులు కుట్టించే ప్రక్రియకు వెళ్లాలి.చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అనుభవజ్ఞుల దగ్గరే ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోవడం మంచిది. చెవులు లేదా ముక్కు కుట్టించే ముందుగా ప్రీ–స్టెరిలైజ్డ్ స్టడ్స్ ఉపయోగించి చెవులు, ముక్కు కుడతారు. కాబట్టి అందరిలో అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చెవులు లేదా ముక్కు కుట్టడానికి 45 నిమిషాల ముందుగా లోకల్ అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చు. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడమే మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డర్మటాలజిస్ట్ / డాక్టర్ సలహా తీసుకోవడం మేలు. కీలాయిడ్స్ వచ్చే శరీర స్వభావం (శరీరంపై ఏదైనా గాయం అయినప్పుడు ఆ ప్రదేశంలో ఉబ్బినట్లు గా మచ్చ వచ్చే శరీర తత్వం) ఉన్నవారు బాడీ పియర్సింగ్కు వెళ్లకపోవడమే మంచిది. -
సూక్ష్మజీవుల దండయాత్ర
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలపై సూక్ష్మజీవులు దండయాత్ర చేస్తున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్, శిలీంధ్రాల దాడితో ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మురుగు నీటిలో ఎక్కువ రోజులు ఉండటం, క్రిమికీటకాలు కుట్టడం వల్ల సూక్ష్మజీవులు శరీరంపై చేరి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ముంపు తగ్గిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ల బారినపడిన వందలాది మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు వరదలతో సర్వం కోల్పోయి బాధితులు మానసిక ఒత్తిడిలో ఉంటే.. ఇప్పుడు వారిని ఇన్ఫెక్షన్లు వెంటాడుతున్నాయి. వరద వచ్చి 15 రోజులైనా ఇంకా కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఇళ్లలోని దుస్తులు, సామాన్లను శుభ్రం చేసుకునే క్రమంలో మురుగు నీటిలోనే ఉండటం, క్రిమికీటకాలు ఉండటంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)వరద తగ్గిందని ఊరట చెందేలోపే... వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కువ రోజులు నీటిలోనే నానటం, సూక్ష్మజీవులు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.పాచిపోయిన పాదాలతో ఇన్ఫెక్షన్లు సోకిన వారు ఆస్పత్రులకు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారు చికిత్సకోసం వస్తున్నారు. అలాంటి వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లతో కాళ్లపై పుండ్లు వచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన శానిటరీ వర్కర్‌కు నీటిలో క్రిమి కుట్టడంతో చేతికి ఇన్ఫెక్షన్ సోకి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి చేతికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటంతో చేయి తీసి వేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే వైద్యులు తెలిపారు. మానసిక ఒత్తిళ్లతో..వరద ప్రాంతవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు ఇష్టమైన సామాన్లు ఎంతోకాలం కష్టపడి సమకూర్చుకుంటే ఇప్పుడు అవన్నీ వరద పాలయ్యాయి. చాలా వరకూ పనికిరాకుండా పోయాయి. మరికొందరు ఆ ప్రాంతంలో సొంత ఇళ్లను సైతం సమకూర్చుకున్నారు. రుణాలు తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. తాము ఇళ్లు కొన్నది ముంపు ప్రాంతంలోనా! అంటూ కొందరు వేదన పడుతున్నారు. ఇలా వరద బాధితులందరూ ప్రస్తుతం మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. అలాంటి వారిలో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు ఉంటాయని, వ్యాధులున్న వారు పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదుపులో ఉండని వ్యాధులతో..ముంపు ప్రాంతాల్లో వేలాది మంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వాటితో బాధపడుతున్న వారు సైతం ఉన్నారు. వారంతా ఇళ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. దీంతో వాళ్లు రెగ్యులర్‌గా వాడే మందులు నీట మునిగాయి. దీంతో 15 రోజులుగా మందులు వాడకుండా ఉండటంతో మధుమేహం, రక్తపోటు వంటివి అదుపు తప్పాయి. అలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు అదుపులో లేనివారికి ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గే అవకాశం ఉండదంటున్నారు. ఇన్ఫెక్షన్ల బాధితులే అధికంవరద ముంపు ప్రాంతాల నుంచి కాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకిన వారు చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్నారు. ఎక్కువ రోజులు మురుగు నీటిలో నడవడం వల్ల కాళ్లు పాచిపోయి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. మందులు వరద పాలవడం వల్ల మధుమేహులు మందులు సక్రమంగా వాడక, శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి ఉంటాయి. మానసిక ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే ప్రమాదమే. సక్రమంగా మందులు వాడుతూ.. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా చూసుకోవాలి. -
మంకీపాక్స్ లక్షణాలు ఇవే.. చికిత్స గురించి తెలుసా?
ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ (ఎంపాక్స్) మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్ సుమారు 70 దేశాలకు పాకింది. ఇప్పటివరకు 100 మంది ఎంపాక్స్‌తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే..సుమారు 17 వేలకుపైగా అనుమానిత కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి. కాంగోలో మంకీ పాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ విజృంభించడం సహా ఇతర చుట్టు పక్కల 12 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.ఎంపాక్స్‌ను మంకీపాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు. ఇటీవలి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి.మంకీపాక్స్ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. మంకీపాక్స్ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాక్సిన్నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. డెన్మార్క్‌కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. -
వచ్చే..వానజల్లు : మరి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా ఉండాలంటే..!
చక్కని మట్టివాసన, స్వచ్ఛమైన, చల్లటి గాలులు...మొత్తానికి వర్షాకాలం వచ్చేసింది. దీంతో మండే ఎండలనుంచి భారీ ఊరట లభించింది. కానీ వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హాయినిచ్చే చిరుజల్లులే జలుబు, జ్వరం, అలెర్జీలు , ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా మోసుకొస్తాయి. ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలూ ఎక్కువే. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచే, పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దాం రండి.వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఫలితంగా వ్యాధికారక క్రిములు చెలరేగే అవకాశం ఉంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతంది. తేమ గట్‌లో హానికరమైన బ్యాక్టీరియా , శిలీంధ్రాల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఇది గట్ ఫ్లోరాకు అంతరాయం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టుతాయి. కలుషితమైన ఆహారం, నీరుతో రోగాలు ప్రబలుతాయి.సాధ్యమైనంతవరకు ఈ సీజన్లో కాలి చల్లార్చిన నీళ్లను తాగాలి. ఆహారాలను కూడా వేడి వేడిగా తినడం ఉత్తమం. వంట ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.పసుపు : మన నిత్యం ఆహారంలో పసుపును చేర్చుకోవాలి. ఇందులోని కర్కుమిన్ శక్తి వంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి,అలెర్జీ రాకుండా కాపాడుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీమైక్రోబయల్ ఏజెంట్ అంది. ఇది జీర్ణక్రియకు సహాయప డుతుంది. వాపును తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.వెల్లుల్లి: యాంటీబయాటిక్,యాంటీవైరల్ లక్షణాల పవర్‌హౌస్ వెల్లుల్లి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో సాయపడుతుంది.పెరుగు : ప్రోబయోటిక్స్‌తో నిండిన పెరుగు మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆరోగ్య కరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.కాకరకాయ: కాకర యాంటీమైక్రోబయల్లక్షణాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి.రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడతాయి అలాగే ఈ సీజన్లోలభించే బీర,సొర లాంటి తీగ జాతి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.తాజా ఆకుకూరలు : తోటకూర, బచ్చలికూర, పాలకూర తదితర ఆకుకూరలనుఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి,ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.సిట్రస్ పండ్లు: రోగ నిరోధక శక్తిని పెంచే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కీలకమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.తులసి: ఆయుర్వేదంలో తులసి ఔషధ గుణాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాలతో పాటు , తులసి చికాకు కలిగించే అలెర్జీ లక్షణాలతో పోరాడుతుంది. తాజా తులసి ఆకులను నమలవచ్చు. లేదా టీలో నాలుగు తులసి ఆకులు వేసుకున్నా మంచిదే. ముఖ్యంగా చిన్నపిల్లలకు కొద్దిగా అల్లం, తులసి ఆకులతో మరగించిన నీళ్లకు కొద్దిగా తేనె కలిపి తాగిస్తే మంచిది.వీటితో పాటు చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. పిల్లలు, పెద్దవాళ్లు చలినుంచి కాపాడే ఉలెన్ దుస్తులు వాడాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. -
మీ తలలో 'గుయ్య్య్' మంటూ సన్నని శబ్దమా.. అయితే జాగ్రత్త!
'చెవి పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టుగా చెవిలోనో లేదా తలలోనో గుయ్య్య్ మంటూ హోరు. ఇలా గుయ్‌మంటూ శబ్దం వినిపించడాన్ని వైద్య పరిభాషలో దీన్ని ‘టినైటస్’ అంటారు. ప్రజల్లో ఇదెంత సాధారణమంటే.. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 16 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలోనూ ‘టినైటస్’ బాధించే జనాల సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని వయసుల వారినీ వేధిస్తూ లక్షలాది మందిని బాధించే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.' టినైటస్తో చెవిలో లేదా తలలో హోరున శబ్దం అదేపనిగా వినిపిస్తున్నప్పుడు నొప్పి కంటే.. దాన్ని విడిపించుకోలేకపోవడంతో విసుగుతో కూడిన నిస్పృహ వేధిస్తుంది. కొందరిలో ఇది గర్జన అంతటి తీవ్రంగా కూడా వినిపిస్తుండవచ్చు. కొందరిలో ఎడతెగకుండా వినిపిస్తున్నప్పటికీ.. మరికొందరిలో మాత్రం వస్తూ, పోతూ ఉండవచ్చు. ఇలా వస్తూపోతూ వినిపిస్తుండే హోరును ‘పల్సేటింగ్ టినైటస్’ అంటారు. దీని వల్ల ప్రాణాపాయం లేకపోయినప్పటికీ.. దేనిమీద ఏకాగ్రతా, దృష్టీ నిలపలేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో నిరాశా నిస్పృహలకూ, తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యే అవకాశముంది. ఎందుకిలా జరుగుతుందంటే.. ఈ కింది అంశాలు టినైటస్కు దోహదపడవచ్చు లేదా అవి ఈ సమస్యను తీవ్రతరం చేసే అవకాశమూ ఉంది. అవి.. చెవిలో పేరుకుపోయే గులివి లేదా చెవిలో ఇన్ఫెక్షన్ దీర్ఘకాలంపాటు బయట ఏదైనా హోరుకు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వినికిడి తగ్గడం / వినికిడి సమస్యలు ఇంకేమైనా మందులు తీసుకుంటూ ఉండటంతో వాటి దుష్ప్రభావంగా తలలో లేదా మెడభాగంలో ఎక్కడైనా గాయాలు కావడం దీర్ఘకాలపు అనీమియా, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ వంటి తలనొప్పులు ముప్పుగా పరిణమించే అంశాలు.. సాధారణంగా టినైటస్ ప్రాణాపాయం కాకపోయినా, కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టే అంశంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఆ ముప్పులేమిటంటే.. నిటారుగా నిల్చోలేక, ఎటో ఓ పక్కకు తూలిపోయే బ్యాలెన్సింగ్ సమస్య రావడం. వినికిడి సమస్యలు వస్తూపోతూ ఉన్నప్పుడు లేదా తీవ్రమైన వినికిడి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో వెంటనే ఈఎన్టీ నిపుణులను కలిసి, తమకు మీనియర్స్ డిసీజ్ (కళ్లు తిరుగుతుండే లక్షణాలతో కూడిన లోపలి చెవిని ప్రభావితం చేసే వర్టిగో లాంటి వైద్య సమస్య), అకాస్టిక్ న్యూరోమా (ఒక రకం నరాల సమస్య) వంటి జబ్బులేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం. నిర్ధారణ.. దీని లక్షణాలు కొన్ని ఇతర సమస్యలతోనూ పోలుతున్నందువల్ల దీన్ని జాగ్రత్తగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయడమన్నది చాలా కీలక అంశం. టినైటస్ నిర్ధారణకు ఈఎన్టీ నిపుణులు రకరకాల పరీక్షలు చేస్తుంటారు. వాటిలో కొన్ని.. బాధితుల వైద్య చరిత్ర: వీరి మెడికల్ హిస్టరీని సునిశితంగా పరిశీలించడం. అంటే వారికి వినిపిస్తున్న శబ్దాలు ఎలాంటివి, మునుపు తల, మెడ వంటి చోట్ల ఏమైనాగాయాలయ్యాయా, ఇతరత్రా ఏమైనా వైద్యసమస్యలున్నాయా వంటి అంశాలని పరిశీలిస్తారు. వినికిడి పరీక్షలు: వినికిడి లోపం ఏదైనా ఉందా, ఉంటే ఏమేరకు వినికిడి కోల్పోయారు వంటి అంశాలు. ఇమేజింగ్ పరీక్షలు: కొన్ని సందర్భాల్లో ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, చెవిలో లేదా మెదడులో ఏమైనా మార్పులు వచ్చాయా అని పరిశీలించడం. చికిత్స / మేనేజ్మెంట్.. అన్ని రకాల వైద్యపరీక్షల తర్వాత.. ఒకవేళ చెవిలో గులివి లేదా చెవి ఇన్ఫెక్షన్తో ఈ సమస్య వచ్చినట్టు గుర్తిస్తే ఆ మేరకు గులివిని క్లీన్ చేయడం లేదా చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు అవసరమైన మందులు వాడాలి. ఎమ్మారై / సీటీ స్కాన్ వంటి పరీక్షల్లో మెదడులోగానీ, చెవిలోగాని గడ్డలు లేవని తేలితే.. అక్కడ టినైటస్కు ఉన్న కారణాలనూ, బాధితులపై ప్రభావాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాధితుల్లో తీవ్రమైన యాంగ్జైటీ ఉన్నప్పుడు టినైటస్ను తగ్గించే మందులతో పాటు, యాంటీ యాంగ్జైటీ మందుల్ని వాడాలి. కొన్నిసార్లు ఓరల్ స్టెరాయిడ్స్ లేదా అవసరాన్ని బట్టి ఇంట్రా టింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లూ, కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్స్ వంటివి వాడాల్సి రావచ్చు. డా. సంపూర్ణ ఘోష్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఇవి చదవండి: ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..! -
కండ్లకలక వస్తే అలా మాత్రం చేయకండి, కంటిచూపు పోతుంది
కండ్లకలక.. దీన్నే పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అసలే వర్షకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడే ప్రజలకు కండ్లకలక ఇప్పుడు మరో సమస్యగా మారింది. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. కండ్లకలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లను చూసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కంటిలో చిన్న నలక పడినా ఆ బాధ వర్ణనాతీతం. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలక వచ్చిన రోగి నుంచి ఈజీగా ఎనిమిది మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది.ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. వ్యాధి నయం కావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కండ్లకలక లక్షణాలు కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. కంటి నుంచి కంటిన్యూగా నీరు కారుతుంది, కంటిరెప్పలు ఉబ్బిపోతాయి. సరిగా చూడలేకపోవడం, లైట్ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం దీని లక్షణాలు కండ్లకలక వస్తే జ్వరం, తేలిపాటి గొంతునొప్పి కూడా బాధిస్తుంది. కండ్లకలక వస్తే ఏం చేయాలి? కండ్లకలక సోకితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్ వాడొచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వాడాలి. కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు. కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. దీంతో తొందరగా తగ్గిపోతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించాలి. కండ్లకలక వస్తే ఇలా అస్సలు చేయొద్దు కండ్లకలక చిన్న సమస్యే అని సొంత వైద్యం చేసుకోవద్దు కళ్లను తరచూ తాకొద్దు, దీనివల్ల సమస్య మరింత పెరుగుతంది ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పడు జనంలోకి తిరగడం వంటివి చేయొద్దు సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం. కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 #Conjuctivitis#HealthForAll#SwasthaBharat pic.twitter.com/1r7hp7II4D — Ministry of Health (@MoHFW_INDIA) August 2, 2023 వాళ్లను చూస్తే కండ్లకలక వస్తుందా? కండ్లకలక వచ్చినవారిని నేరుగా చూస్తే ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకుతుందా? అంటే అది ఒట్టి అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. వైరల్ కన్జక్టివిటిస్ ఉన్న వాళ్లను చూస్తే ఇది వ్యాపించదు. ఈ వ్యాధి ప్రధానంగా చేతుల ద్వారా ఇతరులకు సోకుంది. కండ్లకలక వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను తాకడం, ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి అంటుకుంటుంది. అలాగే వాళ్లు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల నుంచి కూడా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అంతేకానీ కండ్ల కలక సోకిన వాళ్లు మరొకరిని చూసినంత మాత్రాన్నే వ్యాధి సోకే అవకాశమే లేదు. ఇక సన్ గ్లాసెస్ లేదా ముదురు కళ్లద్దాలు ధరించడం వల్ల కండ్లకలక ఇతరులకు వ్యాపించదు అనే సందేహం చాలామందికి వెంటాడుతుంది. కానీ ఇందులో నిజం లేదు. కళ్లద్దాలు ధరించడం వల్ల అసౌకర్యాన్ని కొంతమేరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాధిని నిరోధించే ఛాన్స్ లేదు. ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా..?
దెబ్బ తగిలిందని టీటీ ఇంజెక్షన్ తీసుకుకున్నాను. అయినా నొప్పి తగ్గట్లేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా చీము పట్టింది. ఇనుప రేకు గీసుకుపోయింది..టీటీ ఇంజెక్షన్ ఇవ్వండి". దెబ్బ తగిలింది ఇనుముతో కాదు కదా.. టీటీ ఇంజెక్షన్ ఎందుకు? దెబ్బ తగిలింది.. టీటీ ఇంజెక్షన్ తీసుకొని ఆరు నెలలకు పైనే అయింది. మరో ఇంజెక్షన్ ఇవ్వండి. ప్రజలు నంచి సాధారణంగా వినే మాటలే ఇవీ.. దీన్నిబట్టి చూస్తే.. టీటీ ఇంజెక్షన్ గురించి సామాన్య ప్రజలకు చాలా అపోహలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అపోహాలకు చెక్‌పెట్టి..అసలుఎప్పుడెప్పుడూ తీసుకోవాలి? అలసెందుకు తీసుకోవాలో చూద్దా!. ధనుర్వాతం.. టెటనస్.. లాక్ జా.. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్లో ఒకటి. దీని గురించిన మొదటి ప్రస్తావన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే హిప్పోక్రేట్స్ (Hippocrates) రచనల్లో కనిపిస్తుంది. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ రోజుకీ ధనుర్వాతం అంటే టెటనస్ బారిన పడిన వారిలో 70 నుంచి 80% మరణాలు నమోదు అవుతున్నాయి. కాబట్టి, చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలలో ఇది కూడా ఉంటుంది. గర్భిణులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకు ఇది రక్షణ ఇస్తుంది. ఈ ఇన్ఫెక్షన్కు కారణం క్లస్ట్రీడియమ్ టెటానీ(Clostridium Tetani) అనే ఒక సూక్ష్మ జీవి (బ్యాక్టీరియా). ఇవి మట్టిలో, నేలలో, దుమ్ములో, ఇలా ప్రతి చోటా ఉంటాయి. అవి శరీరంలోకి చేరుకున్నప్పుడు వ్యాధికి కారణం అవుతాయి. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. టీటీ ఇంజెక్షన్ కేవలం టెటనస్ వ్యాధి నుంచి రక్షణను ఇస్తుంది. అది కూడా దెబ్బ తగిలిన ఒక్క రోజు లోపు దీన్ని తీసుకోవాలి. ఇది శరీరంలోకి ఎలా చేరతుందంటే? శరీరానికి అయిన పుండ్లు, లేక తగిలిన దెబ్బల ద్వారా ఇవి శరీరంలోకి చేరగలవు. మొల, లేక ఏదైనా పదునైన వస్తువులు గుచ్చుకోడం వల్ల, శరీరానికి గాయం అయినప్పుడు చేరవచ్చు. కాలిన గాయాల నుంచి జరగొచ్చు. కాన్పు సమయంలో తల్లికి లేక పుట్టిన శిశువుకి బొడ్డు కోయడానికి వాడిన పరికరం సరిగ్గా లేకపోతే ఆ శిశువుకి ధనుర్వాతం కలిగే అవకాశం ఉంది. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు, తగిలిన గాయాల ద్వారా వ్యాధి కారకాలు శరీరంలోకి చేరగలవు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, లేక ఏదైనా పట్టీ కట్టినప్పుడు లేదా మార్చినప్పుడు చేరే అవకాశం ఉంటుంది. కుక్క లేక ఇతర జంతువులు కరిచినప్పుడు ఆ గాయాల ద్వారా సంభవించవచ్చు. ఎముకలు విరగడం, లేక దీర్ఘ కాలిక పుండ్లు, గాయాలు ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు.. ►వ్యాప్తి ఎలా జరిగింది అనే దాన్ని బట్టి, ఎన్ని రోజులకు లక్షణాలు కనిపిస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. ►ఎక్కువ శాతం రెండు వారాలలోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన గాయాలలో, లక్షణాలు కొన్ని గంటల నుంచి, ఒకటి రెండు రోజుల్లోనే కనిపిస్తాయి. చిన్న గాయాలతో కొన్ని నెలల తరవాత కూడా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ►ఎక్కువ శాతం కేసుల్లో మొదట నోటి కండరాలు పట్టేస్తుంటాయి. తర్వాత ఒకొక్కటిగా అన్ని కండరాలు బిగుసుకుపోవడంతో, నొప్పి ఎక్కువవుతుంది. క్రమేణా, అన్ని కండరాలు బిగించినట్టు పట్టేస్తాయి. ఆహారం మింగడం కష్టంగా మారుతుంది. ►తీవ్రమైన తలనొప్పి, అదుపు లేకుండా జ్వరం, చెమటలు కూడా కనిపిస్తాయి. అదుపు లేకుండా శరీర భాగాలలో కదలికలతో మూర్ఛ, ఫిట్స్ తరవాత దశలో కనిపిస్తాయి. ►గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్త పోటు పెరిగి క్రమేణా ప్రాణాపాయ స్థితి వస్తుంది. చికిత్స విధానం: ⇒ఈ వ్యాధిని తొలి దశల్లో కచ్చితంగా నిర్ధారించడం కష్టం. లక్షణాల ఆధారంగా, ఎక్కువ శాతం దీనిని గుర్తిస్తారు. ⇒వ్యాధి లక్షణాలు కనిపించిన తరవాత చికిత్స చాలా వేగంగా అందించాలి. వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేరి, గాయం అయిన చోటును పూర్తిగా శుభ్రపరిచి, యాంటీబయోటిక్ ⇒ఇంజెక్షన్లు, కండరాల నొప్పులకు, పట్టేయడాన్ని తగ్గించే (muscle relaxant) మందులు వాడుతూ, ఒంట్లో నీరు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ⇒ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చు. అవసరాన్ని బట్టి, కృత్రిమ శ్వాస అందిస్తూ, మందుల ప్రభావం కోసం ఎదురు చూడాలి. నివారణ: ధనుర్వాతాన్ని నివారించే సులువైన, ఏకైక మార్గం టీకా తీసుకోవడం. అందుకే చిన్న పిల్లలకు ప్రభుత్వం అందించే టీకాలల్లో డిఫ్తీరియా( కంఠవాతము), కోరింత దగ్గు టీకాలతో పాటు ధనుర్వాతం టీకా కూడా ఉంటుంది. అలాగే అయిదు సంవత్సరాలు, పది సంవత్సరాల వయసులో బూస్టర్ డోస్ ఇస్తారు. ఆ తరవాత పెద్ద వాళ్ళల్లో, ప్రతి పది సంవత్సరాలకు ఒక డోస్ టీకా తీసుకోవాలి. కాన్పు సమయంలో బిడ్డకు వ్యాధి సోకకుండా, గర్భిణులు తప్పకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఏదైన దెబ్బ తగిలినా, కాలిన గాయాలు, లేక పుండ్లు ఉన్నా, వాటిని శుభ్రం ఉంచుకోవాలి. అవి మానేవరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. టీటీ ఇంజెక్షన్‌పై కొన్ని అపోహలు/ నిజాలు ఇవే... దెబ్బ వల్ల కలిగే నొప్పిని టీటీ ఇంజెక్షన్ తగ్గించలేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా ఇతర క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. పుండు తగ్గే వరకు జాగ్రత్తగా ఇతర మందులు వాడాలి. ఆ ఇన్ఫెక్షన్ కేవలం తుప్పు పట్టిన వాటి నుంచే కాదు.. ఏ గాయం వల్ల అయినా కలగవచ్చు. ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే పది సంవత్సరాల వరకు అది ధనుర్వాతం రాకుండా రక్షణ ఇస్తుంది. ప్రతి ఆరు నెలలకు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాంతక వ్యాధి అయిన టెటనస్ రాకుండా ఉండడానికి టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ నవీన్ రోయ్, ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు (చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!) -
Diabetes: పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నట్లే..
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటీస్ అని కూడా పిలిచే ఈ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. ఇది వస్తే పేషెంట్లు ఎలా ఉంటారనే దాని గురించి అందరికి తెలిసిందే. దీనికి పూర్తిగా నివారణ లేదు గానీ కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడమే గాక సులభంగా బయటపడవచ్చు. ఐతే ఈ డయాబెటిస్ పేషెంట్లకి రోగ నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉన్నందున కొన్ని రకాల అంటువ్యాధుల వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధుల వచ్చాయి అంటే మీరు డేంజర్లో ఉన్నట్లు అర్థం. సత్వరమే మేల్కోని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ రోగులుకు సాధారణంగా వచ్చే అంటువ్యాధులు నేషనల్ లైబ్రెరీ ఆప్ మెడిసినల్ అధ్యయనాల ప్రకారం..పేషెంట్లో ఆరు శాతం మంది ఇన్ఫెక్షన్ల సంబంధింత వ్యాధుల కారణంగా ఆస్పత్రుల చేరి మరణాల వరకు సంభవించిన కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎముకలు, కీళ్ల ఇన్ఫక్షన్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పాదాలలో చలనం తగ్గి గాయమైన తెలయకపోవడం. ఆ తర్వాత క్రమంగా అది పెద్దదిగా మారి దాని నుంచి శరీరమంతా ఇన్ఫక్షన్ వ్యాపించి ప్రాణాంతకంగ మారిని కేసులు ఎక్కువే. ఆయా రోగులకు అంత్యభాగంలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే ఏదైన వ్యాధి వస్తే ఈజీగా ఇన్షక్షనే అయ్యే ప్రమాదం ఎక్కువ. రకరకాల చర్మ సమస్యలు వచ్చినా మధుమేహం ఎక్కువగా ఉంది అనడానికి ప్రధమ సంకేతం గోరుచుట్టు, యూరినరీ ఇన్ఫక్షన్లు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి, ముక్కు, గొంతు ఇన్ఫక్షన్లు వచ్చిన సాధారణంగా భావించొద్దు. అలాగే స్త్రీలల్లో జననేంద్రియాలలో ఏదైన ఇన్ఫక్షన్ల వచ్చిన తేలికగా తీసుకోవద్దు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల మాదిరిగా ఉంటాయి. అందువల్లే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాడం ఉత్తమం. (చదవండి: కొబ్బరినీళ్లతో ఇన్ని ప్రయోజనాలా?.. మరి డయాబెటిక్ పేషెంట్స్ తాగొచ్చా?) -
గర్భంలో ఉండగానే కరోనా సోకిన పసికందులకు దెబ్బతిన్న మెదడు
కరోనా మహమ్మారికి సంబంధించి పలు కథనాలు విన్నాం. గానీ గర్భంలో ఉండగానే శిశువులు ఈ మహ్మమారి బారిన పడిన తొలి కేసును గుర్తించి వైద్యలు షాక్‌కి గురయ్యారు. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు తల్లులకు పుట్టిన శిశువుల్లో ఇలా జరిగిందని పరిశోధకులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. గర్భంలో ఉండగానే కరోనా బారిన పడటంతో రెండు శిశువుల బ్రెయిన్ హేమరేజ్‌తో జన్మించినట్లు యూఎస్‌లోని వైద్యులు వెల్లడించారు. ఇదే తొలికేసు అని కూడా తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మియామి తన పీడియాట్రిక్స్ జర్నల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటన వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకమునుపు జరిగినట్లు జర్నల్ పేర్కొంది. ఇద్దరు తల్లలు గర్భధారణ సమయంలోనే కరోనా బారిన పడినట్లు తెలిపారు. ఐతే వారిలో ఒక తల్లికి తేలికపాటి లక్షణాలు కనిపించగా మరో తల్లి కరోనా కారణంగా తీవ్ర అనారోగ్య పాలైందని తెలిపారు. దీంతో వారికి పుట్టిన శిశువులు ఇద్దరు జన్మించిన వెంటనే ఫిట్స్‌తో బాధపడినట్లు తెలిపారు వైద్యులు. తర్వాత వారిలో సరైన విధుంగా పెరుగుదల కూడా లేకపోవడం గుర్తించినట్లు తెలిపారు. ఆ శిశువుల్లో ఒక శిశువు 13వ నెలలో మరణించగా మరోక శిశువు వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఇంతవరకు చిన్న పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరగలేదన్నారు. తొలిసారిగా ఆ శిశువులకు నిర్వహించగా కరోనా వైరస్ జాడలను గుర్తించినట్లు తెలిపారు. చనిపోయిన శిశువుకి పోస్ట్‌మార్టం నిర్వహించగా మెదడులో కరోనా వైరస్ జాడలను గుర్తించామని, అందువల్లే మెదడు దెబ్బతిందని మియామి విశ్వవిద్యాలయ పరిశోధకుల వెల్లడించారు. అలాగే కరోనా బారిన పడి తీవ్రంగా అనారోగ్యం పాలైన తల్లికి కేవలం 32 వారాలకే డెలివరి చేశామని చెప్పారు. ఆమె శిశువే బాగా ఈ వైరస్ ప్రభావానికి గురై చనిపోయినట్లు తెలిపారు. అందువల్ల దయచేసి గర్భధారణ సమయంలో కరోనా బారిని పడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీడీయాట్రిక్ వైద్యులను సంప్రదించాలని సూచించారు పరిశోదకులు. అయితే గర్భధారణ సమయంలో డెల్టా వేరియంటే లేదా ఓమిక్రాన్ వేరియంట్ బారిన పడితే ఈ విధంగా జరుగుతుందనేది స్పష్టం కాలేదని చెప్పారు పరిశోధకులు. ఇలా తల్లి మావి నుంచి శిశువుకి వైరస్ సంక్రమించిన తొలికేసు ఇదేనని మియామి విశ్వవిద్యాలయ గైనకాలజిస్టు మైఖేల్ పైడాసస్ చెబుతున్నారు. (చదవండి: ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!) -
భారత్ ఐడ్రాప్స్‌పై యూఎస్ ఆరోపణలు! తోసిపుచ్చిన ఫార్మా కంపెనీ
భారత్ కంపెనీ తయారు చేసిన ఆర్టిఫిషియల్ టియర్స్ అనే ఐడ్రాప్స్ పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఐ డ్రాప్స్ వాడటం వల్ల అత్యంత శక్తిమంతమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతవరకు ఇలాంటి బ్యాక్టీరియా జాతిని అమెరికాలో గుర్తించలేదని, ఇది ఏ యాంటి బయోటిక్స్‌కి లొంగదని యూఎస్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తన నివేదికలో పేర్కొంది. ఈ ఐ డ్రాప్స్‌ని చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ కంపెనీ ఎజ్రీకేర్ బ్రాండ్ పేరుతో తయారు చేస్తోంది. ఐతే ఈ ఐడ్రాప్స్ కారణంగా ముగ్గురు మృతి చెందారని, ఎనిమిది మందికి అంధత్వం వచ్చిందని, డజన్ల కొద్దీ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని సీడీసీ వెల్లడించింది. దీంతో అమెరికా ఆ ఉత్పత్తులన్నింటిని వెంటనే నిలిపేసింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ ఈ డ్రాప్స్‌లో కలుషితమైన కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల కంటి ఇన్షెక్షన్లు వస్తాయని, అది అంధత్వానికి లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ బ్యాక్టీరియా కారణంగా రక్తం, ఊపిరితిత్తులు ఇన్ఫక్షన్ అవుతాయని, దీని యాంటి బయోటిక్ రెసిస్టన్స్ కారణంగా చికిత్స చేయడం కష్టతరంగా మారిందని అమెరికా నివేదికలో తెలిపింది. ఈ ఐ డ్రాప్స్‌ని ఉపయోగించిన రోగులు, కంటి ఇన్ఫ్క్షన్లు వచ్చినా, అందుకు సంబంధించిన లక్షణాలు ఏమైనా తలెత్తిని వెంటనే వైద్యులను సంప్రదించాలని సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్సీడీసీ స్పష్టం చేసింది. స్పందించిన గ్లోబల్ ఫార్మా కంపెనీ: ఈ మేరకు ఐ డ్రాప్స్‌ను తయారు చేసే గ్లోబల్ ఫార్మా కంటపెనీ డైరెక్టర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. అమెరికా చేసిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చారు. ఆ ఐ డ్రాప్స్‌లో వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాలేదని, కలుషితమైన కృత్రిమైన నీటిని వినియోగించలేదని వెల్లడించారు. ప్రమాణాల అనుగుణంగానే ఈ డ్రగ్‌ని రూపొందించినట్లు తెలిపారు. దశల వారిగా జరిపిన పరిశోధనల్లో తమకు ఐ డ్రాప్స్‌లో అలాంటివేమి కనిపించలేదని, కలుషితమైన వాటిని ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. అమెరికా చేసిన ఆరోపణలను ఖండించారు. కూడా. ఈ ఐ డ్రాప్ తయారు చేసే డ్రగ్ ప్లాంట్ వద్ద కూడా కలుషిత నీటిని వినియోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆమె నొక్కి చెప్పారు (చదవండి: యూకేలో పాస్‌పోర్ట్ సిబ్బంది సమ్మె) -
బాల్యంలో నిమోనియా బారిన పడితే... భయంపుట్టిస్తున్న స్టడీ వివరాలు..
లండన్: బాల్యంలో నిమోనియా వంటివాటి బారిన పడ్డవారికి పెద్దయ్యాక శ్వాసపరమైన ఇన్ఫెక్షన్ల ముప్పు అధికమని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా 26 నుంచి 73 ఏళ్ల మధ్య వయసులో శ్వాస సంబంధిత సమస్యలతో మరణించే ప్రమాదమూ ఎక్కువేనని అది తేల్చింది. ‘‘రెండేళ్లు, అంతకంటే తక్కువ వయసులో బ్రాంకైటిస్, నిమోనియా వంటివాటి బారిన పడేవారిలో పెద్దయ్యాక శ్వాస సంబంధిత వ్యాధులతో అకాల మరణం సంభవించే ఆస్కారం ఇతరులతో పోలిస్తే 93 శాతం ఎక్కువ’’ అని వివరించింది. దీర్ఘకాలిక శ్వాస సమస్యలు పెద్ద ఆరోగ్య సమస్యగా మారాయి. వీటివల్ల 2017లో ప్రపంచవ్యాప్తంగా 39 లక్షల మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో చాలా మరణాలకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) కారణమని అధ్యయనం పేర్కొంది. అందుకే శ్వాస సంబంధిత సమస్యలను చిన్నతనంలోనే సంపూర్ణంగా నయం చేయడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉందని అధ్యయనానికి సారథ్యం వహించిన ఇంపీరియల్కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన జేమ్స్ అలిన్సన్ అభిప్రాయపడ్డారు. దీని ఫలితాలు ద లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పుణెలో రుబెల్లా వ్యాధి కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్..
ముంబై: మహారాష్టత్ర పుణెలో మంగళవారం రెండు రుబెల్లా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చిన్నారులకు పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ఇవే తొలి కేసులు కావడం గమనార్హం. ఇద్దరు చిన్నారుల్లో ఒక్కరు కోత్రుడ్, మరొకరు ఖరాడి ప్రాంతానికి చెందిన వారని పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరిలో ఖరాడీకి చెందిన 11 ఏళ్ల బాలుడు మీజిల్స్-రుబెల్లా టీకా తీసుకున్నాడని, అయినా వ్యాధి బారినపడ్డాడని అధికారులు పేర్కొన్నారు. మరో 12 ఏళ్ల బాలుడు వ్యాక్సిన్ తీసుకున్నాడో లేదో సమాచారం లేదని చెప్పారు. ఈ రెండు రుబెల్లా కేసులతో పాటు నగరంలో మంగళవారం కొత్తగా 15 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది నమోదైన మీజిల్స్ కేసుల సంఖ్య 26కు పెరిగింది. కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. మీజిల్స్, రుబెల్లా వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని రాష్ట్ర పర్యవేక్షణ అధికారి డా.ప్రదీప్ అవాతే తెలిపారు. వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, దద్దుర్లు వస్తాయన్నారు. రుబెల్లా సోకిన వారికి మాత్రం దాదాపు లక్షణాలు కన్పించవని, స్వల్పంగా ఉంటాయని పేర్కొన్నారు. టీకాలు తీసుకున్న వారికి కూడా ఈ వ్యాధులు వస్తాయని స్పష్టం చేశారు. వాక్సిన్లు 90 శాతం ప్రభావం చూపుతున్నాయన్నారు. చదవండి: రూ.500కే వంటగ్యాస్.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు.. -
ప్రతి రెండు సెకన్లకు ఒక మరణం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్లేగు.. మలేరియా.. మశూచి వంటివి ఒకప్పుడు లక్షల ప్రాణాలు బలితీసుకున్నాయి. అవి ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకే లక్షణమున్న అంటు వ్యాధులు కావడం.. టీకాలు, మందుల్లాంటివి లేకపోవడమే దానికి కారణం. తర్వాత టీకాలొచ్చాయి.. మందులూ అందుబాటులోకి వచ్చాయి. అంటువ్యాధులతో ప్రాణాలు కోల్పోవడం తగ్గింది. కానీ మనిషిని మరో ప్రమాదం చుట్టుముడుతోంది. అది కొత్త ముప్పేమీ కాదు.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లేమి, జీవనశైలి మార్పుల పుణ్యమా అని విజృంభిస్తున్న అసాంక్రమిక వ్యాధులు.. గుండెపోటు, మధుమేహం, కేన్సర్లు, శ్వాసకోశ సమస్యలే అవి. ఇప్పుడివే సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. వ్యాధుల నివారణకు చర్యలు అవసరం ►అసాంక్రమిక వ్యాధులు పెచ్చరిల్లేందుకు ప్రధాన కారణం ఆహార అలవాట్లు. వాటి నియంత్రణతోపాటు వ్యాయా మం, దురలవాట్లకు దూరంగా ఉండటం అవసరం. ప్రభుత్వాలు కాలుష్య రహిత నగరాలను ప్రోత్సహించాలి. అందరికీ ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో సగమందికిపైగా తమకు రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నట్టు తెలియడం లేదని ఇటీవలి అధ్యయనం ఒకటి చెబుతోంది. ప్రజల్లో అరోగ్యంపై ఉన్న అవగాహనకు ఇదో మచ్చుతునక. అసాంక్రమిత వ్యాధులను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే మరణాలు తగ్గించవ చ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీవి తంలో మంచి ఉత్పాదక స్థితిలో ఉన్న ముప్ఫై ఏళ్లవారి నుంచి 70ఏళ్లవారి వరకూ అసాంక్రమిక వ్యాధుల బారిన పడకుండా చూసుకోవడం కష్టమేమీ కాదు. పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా వారు తమ కుటుంబాలను సొంతంగా పోషించుకోగలరు. సామాజిక ఉత్పా దకతకూ భంగం ఏర్పడదు. అసాంక్రమిక వ్యాధుల బారినపడి చికిత్స, పోషణ తాలూకూ ఖర్చులు ప్రభు త్వంపై పడటం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకు వస్తే.. ప్రధానమైన ఈ 4అసాంక్రమిత వ్యాధుల నుంచి వారిని కాపాడవచ్చు. భారత్‌లో పరిస్థితి ఇదీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. భారత్‌లో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో అసాంక్రమిత వ్యాధుల వల్లే 60.46 లక్షల మరణాలు (66 శాతం) నమోదవుతున్నాయి. ఇందులో గుండె సంబంధిత వ్యాధులతో 25.66 లక్షలు (28%), తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో 11.46 లక్షల (12%) మంది మరణిస్తు న్నారు. ఇక కేన్సర్‌తో 9.20 లక్షల మంది, మధుమేహంతో 3.46 లక్షల మంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో పరిస్థితి ఇదీ.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో 74 శాతం అసాంక్రమిక వ్యాధులతో సంభవిస్తున్నవే. ఏటా వీటితో దాదాపు 4.1 కోట్ల మంది మరణిస్తున్నారు. గుండె జబ్బులతో మరణాలు 1.80 కోట్లు, కేన్సర్‌తో 93 లక్షలు, శ్వాస సంబంధ వ్యాధులతో 41 లక్షలు, మధుమేహంతో 20 లక్షల మరణాలు ఉంటున్నాయి. అంటే అసాంక్రమిక వ్యాధుల మరణాల్లో 80 శాతం ఈ నాలుగు రకాల వ్యాధులే ఉండటం గమనార్హం. ఈ మరణాల్లో పొగాకు వినియోగం వల్ల 80 లక్షలు, ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల 18 లక్షలు, ఆల్కాహాల్‌తో (కేన్సర్ కలిపి) 30 లక్షలు, సరైన శారీరక శ్రమ చేయకపోవడం వల్ల 8.3 లక్షల మరణాలు సంభవిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ►మీకు తెలుసా.. మీరు ఈ రెండు పదాలు చదివేలోపు భూమ్మీద ఓ ప్రాణం అసాంక్రమిక వ్యాధుల కారణంగా గాల్లో కలిసిపోయి ఉంటుంది. అవును.. ఇది నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అసాంక్రమిక వ్యాధుల కారణంగా ఏటా 4.1 కోట్ల మంది మరణిస్తున్నారు. ఓపికగా లెక్కేస్తే.. ఇది రెండు సెకన్లకు ఒక్కరని స్పష్టమవుతుంది. ప్రపంచం మాటిలా ఉంటే.. ఇప్పటికే గుండెజబ్బులు, మధుమేహానికి రాజధానిగా మారిన భారత్‌లోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అసాంక్రమిక వ్యాధుల కారణంగా ఇక్కడ ఏటా సుమారు అరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిజానికి అసాంక్రమిక వ్యాధులతో ఇన్ని విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరమే లేదు. ఈ వ్యాధులు ఒక రకంగా మనం కోరి తెచ్చుకున్నవే. ప్రజల్లో ఆరోగ్యంపట్ల ఏ కొంచెం అవగాహన పెరిగినా కొన్ని లక్షల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రభుత్వాలు ఆరోగ్యంగా జీవించేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తే, ప్రోత్సహిస్తే.. తగిన విధానాలను రూపొందిస్తే ఆగే అకాల మరణాల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ సంఖ్యలేవీ గాల్లోంచి పుట్టుకొచ్చినవి కావు. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలేసి చెప్పినవే! అసాంక్రమిక వ్యాధుల మరణాల్లో అల్ప, మధ్యాదాయ వర్గాల వాటా దాదాపు 86 శాతం. అంటే తగిన వైద్య సదుపాయాల్లేని పరిస్థితుల్లో పేదలే ఎక్కువగా బలవుతున్నారన్నమాట. ప్రపంచ సగటు ఆయుర్ధాయం 2022లో 72.98 ఏళ్లుకాగా.. అల్ప, మధ్యాదాయ దేశాల్లో బాగా తక్కువగా ఉండటం గమనార్హం. మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే.. అసాంక్రమిత వ్యాధులను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నియంత్రించవచ్చు. ప్రధానంగా షుగర్, బీపీ, శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, కేన్సర్ వంటివి రాకుండా చూసుకునే వీలుంది. ఆహారం, రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా నియంత్రించుకోవచ్చు. అల వాట్లు, ఆహారం, ధూమపానం, మద్యం వంటి వాటివల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయి. తల్లిదండ్రులకు షుగర్, థైరాయిడ్ ఉండటం వల్ల తమకు వచ్చిందని చాలామంది చెబుతుంటారు. అది పూర్తి వాస్తవం కాదు. అలా రాకుండా జాగ్రత్త పడొచ్చు. కేన్సర్ కూడా అంతే. ఆహార అలవాట్లు, నిల్వ ఉంచిన, ప్యాకేజీ ఆహార పదా ర్థాలను తినడం వల్ల వచ్చే అవకాశ ముంది. చాలామంది ఇంట్లో తయారు చేసుకోకుండా రెడీమేడ్ ఆహారాలను తింటున్నారు. ఇది కేన్సర్‌కు ఒక కార ణం. మద్యం కూడా ఒక కారణం. కలుషిత గాలి వల్ల శ్వాసకోశ సమస్యలు, కేన్సర్లు వస్తాయి. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులు రాకుండా చూసు కోవచ్చు. – డాక్టర్ సాయి ప్రత్యూష, ఆస్పిన్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్ పొగాకు, మద్యం మానేయాలి.. సమయానికి నిద్ర ఉండాలి పొగాకు, మద్యం వాడకం తగ్గించాలి. దీని పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఏదైనా వ్యాధి బారినపడిన వారు ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే కొంత వరకు కాపాడవచ్చు. బయటి ఫుడ్ తగ్గించాలి. ఎక్కువగా నడవాలి. ఆలస్యంగా నిద్ర పోవడం, తిన్న వెంటనే పడుకోవడం కూడా మంచిది కాదు. ఎక్కువ బరువు ఉండటం కూడా ఇబ్బందికరమే. షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు ముందు జాగ్రత్తగా చికిత్స తీసుకో వాలి. మందులు సక్రమంగా వాడా లి. ఇవన్నీ ఎవరికి వారే గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ తూడి పవన్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్, కిమ్స్, సన్‌షైన్ ఆస్పత్రి -
సుదీర్ఘకాలంగా కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత విముక్తి
కోవిడ్.. రెండేళ్లుగా ప్రజలను అల్లాడిచ్చిన ఈ మహమ్మారి ప్రస్తుతం పత్తాలేకుండా పోయింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓరియంట్ వేరియంట్లతో యావత్ ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకున్న వైరస్ ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. జనాలు కూడా కరోనాను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలేవి పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. సాధారణంగా కోవిడ్ బారిన పడితే 10 లేదా 20 మహా అయితే నెలలో కోలుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి సంవత్సరానికి మించి మహమ్మారితో పోరాడుతూనే ఉన్నాడు. ఏకంగా 411 రోజులుగా అతన్ని కరోనా విడిచిపెట్టడం లేదు. దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న రోగి తాజాగా వైరస్ నుంచి బయటపడ్డాడు. నిర్ధిష్ట వైరస్ జన్యు కోడ్‌ను విశ్లేషించి సరైన చికిత్సను అందిచడంతో కోలుకున్నాడని బ్రిటీష్ పరిశోదకులు తెలిపారు. గైస్ &సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, కింగ్స్ కాలేజ్ లండన్‌లోని పరిశోధకుల బృందం క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో 13 నెలలపాటు కరోనా సోకిన 59 ఏళ్ల వ్యక్తికి చేసిన చికిత్స గురించి వివరించారు. చదవండి: విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు మూత్రపిండం మార్పిడి కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి 2020 డిసెంబరులో కోవిడ్ సోకిందని.. ఈ ఏడాది జనవరి వరకు పాజిటివ్ గానే కొనసాగిందనిప పేర్కొన్నారు. దీర్ఘకాల కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు నానోపోర్ సీక్వెన్సింగ్ టెక్నాలజీతో వేగవంతమైన జన్యు విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో రోగికి బీ.1 వేరియంట్ సోకినట్లు గుర్తించారు. కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా చికిత్స చేసినట్లు పరిశోధకులు తెలిపారు. సదరు వ్యక్తి కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లోనే కరోనాకు గురవ్వడంతో ఈ చికిత్స ద్వారా నయం చేశామని. ఇది ఓమిక్రాన్ వంటి వేరియంట్‌పై సమర్థంగా పనిచేయదని పేర్కొన్నారు. ఇలా మొత్తానికి కరోనా ఫస్ట్ వేవ్ నుంచి వైరస్‌తో పోరాడుతున్న రోగిని విజయవంతంగా దాని నుంచి విముక్తి కలిగించారు. సాధారణ వైరస్ కాదు అయితే అతనికి సోకింది పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఇది నార్మల్ కోవిడ్ కంటే భిన్నమైంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది సోకిన వారు నెలలు ఒక్కోసారి సంవత్సరాలు కూడా కరోనా పాటిజివ్‌గా వస్తుందని సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టుకు చెందిన అంటువ్యాధుల ప్రత్యేక వైద్యుడు ల్యూక్ స్నెల్ తెలిపారు. అంటువ్యాధుల తీవ్ర ముప్పు వల్ల సగం మంది రోగుల్లో ఊపిరితిత్తుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
కో–ఇన్ఫెక్షన్స్.. ఏకకాలంలో అనేక జ్వరాలు..!
ఇటీవలి కాలంలో ప్రతి ఇంటా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడటం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్యకాలంలో వరసగా వర్షాలు అందరినీ బెంబేలెత్తించాయి. నిన్న మొన్నటి కరోనా కాలం తర్వాత... అదే సంఖ్యలో మూకుమ్మడి జ్వరాలు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఇప్పటి జ్వరాల్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఒకే సమయంలో రెండు రకాల జ్వరాలు నమోదవ్వడం ఇటీవల నమోదైన ధోరణి. ఇలా ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లు రావడాన్ని వైద్యనిపుణులు తమ పరిభాషలో ‘కో–ఇన్ఫెక్షన్స్’గా చెబుతున్నారు. ఆ ‘కో–ఇన్ఫెక్షన్ల’పై అవగాహన కోసమే ఈ కథనం. ఓ కేస్ స్టడీ: ఇటీవల ఓ మహిళ జ్వరంతో ఆసుపత్రికి వచ్చింది. తొలుత ఆమెలో డెంగీ లక్షణాలు కనిపించాయి. పరీక్షలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం డాక్టర్లు చూశారు. ఆ తర్వాత ఆమెకు ఆయాసంగా ఉండటం, ఊపిరి అందకపోవడం గమనించారు. అప్పుడు పరీక్షిస్తే ఆమెకు కోవిడ్ కూడా ఉన్నట్లు తేలింది. ఇలా ఒకేసారి రెండు రకాల జ్వరాలు (ఇన్ఫెక్షన్లు) ఉండటాన్ని ‘కో–ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇలా రెండ్రెండు ఇన్ఫెక్షన్లు కలసి రావడం కాస్తంత అరుదు. కానీ ఇటీవల ఈ తరహా కేసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. ఇక ఈ కేస్ స్టడీలో కోవిడ్ కారణంగా బాధితురాలిని నాన్–ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టి, ఆక్సిజన్ ఇస్తూ... రెండు రకాల ఇన్ఫెక్షన్లనూ తగ్గించడానికి మందులు వాడాల్సి వచ్చింది. వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలు కలగలసి... సాధారణంగా జ్వరాలతో బయటపడే ఇన్ఫెక్షన్లు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటివి బ్యాక్టీరియల్ జ్వరాలు. రెండోవి వైరల్ జ్వరాలు. అయితే ఇటీవల బ్యాక్టీరియల్ జ్వరాల్లోనే రెండు రకాలుగానీ లేదా ఒకేసారి రెండు రకాల వైరల్ ఇన్ఫెక్షన్లుగానీ... లేదంటే ఒకేసారి వైరల్‌తో పాటు బ్యాక్టీరియల్ జ్వరాలుగానీ కనిపిస్తున్నాయి. అంతేకాదు... ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లతో పాటు ఒకే సమయంలో కుటుంబసభ్యుల్లో అనేక మంది జ్వరాల బారినపడటం అనేకమందికి ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియల్ జ్వరాలతో కలగలసి... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే కొందరిలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో ఎలుకలతో వ్యాపించే బ్యాక్టీరియల్ జ్వరం ‘లెప్టోస్పైరోసిస్’ కనిపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బొరియలు వాననీటిలో నిండిపోగా ఎలుకలు ఇళ్లలోకి రావడం పరిపాటిగా మారింది. లెప్టోస్పైరోసిస్ కనిపించడానికి ఇదే కారణం. ఇంకొందరిలో తొలుత జ్వరం రావడం... ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాలూకు రెండో పరిణామంగా (సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల) నిమోనియా కేసులూ కనిపిస్తు న్నాయి. ఇక లక్షణాల తీవ్రత ఎక్కువగా లేని కోవిడ్ రకాలతో (ఒమిక్రాన్ వంటి వాటితో) కలిసి ఇతరత్రా జ్వరాలు రావడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. యాంటీబయాటిక్స్ వద్దు... జ్వరం వచ్చిన వెంటనే కొందరు పారాసిటమాల్‌తో పాటు యాంటీబయాటిక్స్ మొదలుపెడతారు. యాంటీవైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా... అవసరం లేకపోయినా వాటిని తీసుకోవడం వల్ల కొన్ని కౌంట్లు మారుతాయి. విరేచనాల వంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వంటి అనర్థాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా... మూడోనాడు కూడా జ్వరం తగ్గకపోతే... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు కలగలసి రావడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ కొన్ని సందర్భాల్లో డెంగీ, స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్ లాంటివి కలసి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. దాంతో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివారణ... వర్షాకాలంలో పరిసరాల్లో నీళ్లు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది... ఈ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాల పారిశుద్ధ్య జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగినంత అప్రమత్తంగా ఉండాలి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మెష్ / మస్కిటో రెపల్లెంట్స్ వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక పెద్దవయసు వారు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే అవకాశాలున్నందున వాటి పట్ల మరింత అప్రమత్తత వహించాలి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వైరల్ జ్వరాలివే.. వైరల్ జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తోంది. సాధారణంగా అది కోవిడ్‌తో పాటు కలిసి రావడం చాలామందిలో కనిపిస్తోంది. మరికొందరిలో వైరల్ ఇన్ఫెక్షన్లయిన కోవిడ్, ఫ్లూ... ఈ రెండూ కలగలసి వచ్చాయి. ఇంకొందరిలో కోవిడ్, ఫ్లూ, స్వైన్–ఫ్లూ... ఈ మూడింటిలో ఏ రెండైనా కలసి రావడమూ కనిపించింది. లక్షణాలు... వైరల్ జ్వరాల విషయానికి వస్తే... వీటిల్లో జ్వరం తీవ్రత... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వంటివి సోకినప్పుడు జ్వరం, దగ్గు కనిపిస్తుంటాయి. తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇటీవల కోవిడ్‌తో కలసి మరో ఇన్ఫెక్షన్ ఉంటే... ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. వెరసి... జ్వరం, స్వల్పంగా జలుబు/ఫ్లూ లక్షణాలు, కొందరిలో ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ. డెంగీ కేసుల్లో కొందరిలో ఒంటిపై ర్యాష్ వంటి లక్షణాలతో పాటు రక్తపరీక్షలు చేయించినప్పుడు... ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు... కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్ అందరికీ తెలిసిన వైద్య పరీక్షే. డెంగీ నిర్ధారణ కోసం చేసే కొన్ని పరీక్షల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ డెంగీలో లక్షణాలకే చికిత్స చేయాల్సి ఉన్నందున... ప్లేట్లెట్ కౌంట్తోనే దీన్ని అనుమానించి... తగిన చికిత్సలు అందించాలి. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిన టైఫాయిడ్ నిర్ధారణ కోసం వైడాల్ టెస్ట్ అనే వైద్య పరీక్ష చేయించాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి. చికిత్స వైరల్ జ్వరాలకు నిర్దిష్ట చికిత్స లేనందున జ్వరానికి పారాసిటమాల్ ఇస్తూ... లక్షణాలను బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అందించాలి. ద్రవాహారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే... వాటిని బట్టి చికిత్సను మార్చాలి. (ఉదా. డెంగీలాంటి కేసుల్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, వాటిని ఎక్కించడం). ఇక టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అయితే జ్వరం వచ్చిన రెండు, మూడు రోజుల వరకు అది వైరలా, బ్యాక్టీరియలా తెలియదు కాబట్టి కేవలం పారాసిటమాల్ తీసుకుంటూ... ఆ పైన కూడా జ్వరం వస్తూనే ఉంటే వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించి, తగిన చికిత్సలు తీసుకోవాలి. ఇక లెప్టోస్పైరోసిస్ వంటివి కాలేయం, కిడ్నీ వంటి వాటిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారి. అందుకే ఈ కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఫిజీషియన్ -
సంక్షోభాలు, విలయాలతో అంటురోగాలు.. ప్రాణాంతక ఆంత్రాక్స్ బయటపడిందిలా!
న్యూయార్క్: వరదలు, కరువు వంటి పర్యావరణ సంక్షోభాలు, విలయాలు కలిగించే నష్టం ఎంత అపారంగా ఉంటుందో మనమంతా చూస్తున్నదే. అయితే వీటివల్ల టైఫాయిడ్, జికా వంటి అంటురోగాల వ్యాప్తి కూడా పెరుగుతోందని ఓ సర్వే తేల్చింది! 2016 సంగతి. ఉత్తర సైబీరియాలో నివసించే ప్రజలు ఉన్నట్టుండి రోగాల బారిన పడసాగారు. వారితో పాటు జింకల వంటి జంతువులకు కూడా ఆంత్రాక్స్ సోకి కలకలం రేపింది. ఉష్ణోగ్రతల పెరుగుదలే దీనికి కారణమని తేలింది. 2016లో సైబీరియాలో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరగనంతగా పెరిగాయి. దాంతో మంచు విపరీతంగా కరిగి దశాబ్దాల క్రితం ఆంత్రాక్స్‌తో చనిపోయిన ఓ జింక శవం బయట పడిందట. అందులోంచి ఆంత్రాక్స్ కారక బ్యాక్టీరియా తదితరాలు గాల్లో వ్యాపించి మరోసారి వ్యాధి తిరగబెట్టేందుకు కారణమయ్యాయని తేలింది! ఇదొక్కటనే కాదు. తుఫాన్లు, కరువులు, వరదలు తదితరాల వాతావరణ సంబంధిత విలయాలు ఆంత్రాక్స్ వంటి బ్యాక్టీరియా మొదలుకుని జికా వంటి వైరస్లు, మలేరియా వంటి పరాన్నభుక్కు సంబంధిత అంటువ్యాధుల వ్యాప్తిని 58 శాతం దాకా పెంచుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయి–మనోవాకు చెందిన కెమిలో మోరా అనే శాస్త్రవేత్త చేసిన అధ్యయనంలో తేలింది. ఇందుకోసం విలయాలు, వ్యాధుల మధ్య సంబంధంపై వచ్చిన వందలాది పరిశోధక పత్రాల నుంచి సమాచారాన్ని ఆయన బృందం సేకరించింది. దాన్ని లోతుగా విశ్లేషించిన మీదట ఈ మేరకు తేల్చింది. ఈ ఫలితాలను నేచర్ జర్నల్ పచురించింది. గ్రీన్హౌస్ ఉద్గారాలను ఆపాల్సిందే కొన్ని విలయాలకు అంటువ్యాధులతో సంబంధం నేరుగా కనిపిస్తుంది. వరదలొచ్చినప్పుడు కలుషిత నీటి వల్ల వ్యాపించే మెదడు వాపు వంటివాటివి ఇందుకు ఉదాహరణ. నీరు చాలాకాలం నిల్వ ఉండిపోతే డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటివీ ప్రబలుతాయి. విపరీతమైన వేడి గాలుల వంటి పర్యావరణ విపత్తులు కూడా పలు రకాల వైరస్లు ప్రబలేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. విపత్తుల కారణంగా 1,000కి పైగా మార్గాల్లో అంటురోగాలు ప్రబలినట్టు సర్వేలో తేలిందని మోరా చెప్పుకొచ్చారు. ‘‘వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడం భారీ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. బదులుగా మూలానికే మందు వేసే ప్రయత్నం చేయాలి. అంటే, పర్యావరణ విపత్తులకు మూలకారణంగా మారిన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు తక్షణం అడ్డుకట్ట వేయాలి’’ అని సూచించారు. -
కరోనా ఎంత పనిచేసింది.. టెన్షన్ పెడుతున్న సర్వే!
లండన్: కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిపై ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందట. శ్వాసకోస సమస్యలు, నీరస, రుచి, వాసన తెలియకపోవడం వంటి వ్యాధి లక్షణాల్లో కనీసం ఒక్కటైనా వారిని చాలాకాలం బాధిస్తున్నట్టు లాన్సెట్ జర్నల్ శుక్రవారం విడుదల చేసిన తాజా సర్వే పేర్కొంది. కరోనాపై ఇప్పటిదాకా చేసిన అత్యంత సమగ్రమైన సర్వేల్లో ఇదొకటని చెప్తున్నారు. నెదర్లాండ్స్‌లో 76,422 మందిపై 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు దాకా సర్వే జరిపారు. అప్పటికి వ్యాక్సీన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలపై ఈ వ్యవధిలో వారి నుంచి 24 సార్లు వివరాలను సేకరించారు. 21 శాతం మంది తమకు కరోనా నిర్ధారణ అయిన తొలి 5 నెలల్లో వాటిలో ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించాయని చెప్పారు. 12 శాతానికి పైగా, అంటే ప్రతి 8 మందిలో ఒకరు తాము దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. అయితే ఇలాంటి వారినుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకడం లేదని సర్వేలో తేలడం విశేషం. ఈ విషయంలో మరింత లోతుగా పరిశీలన జరిపేందుకు మరింత సమగ్రమైన డేటా అవసరం చాలా ఉందని నెదర్లాండ్స్‌లోని గ్రొనింజెన్ వర్సిటీ ప్రొఫెసర్ జుడిత్ రొస్మలెన్ అన్నారు. ఇది కూడా చదవండి: చైనీయులు తైవాన్ విషయమై ఏం అన్న ఊరుకునేట్లు లేరు! సారీ చెప్పాల్సిందే కోవిడ్ సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు -
అసలే వర్షాకాలం.. లో దుస్తుల విషయంలో జాగ్రత్త! ఇలా మాత్రం చేయకండి!
సాధారణంగా చాలా మంది దుస్తుల కోసం వేల రూపాయలు ఖర్చుపెడుతుంటారు. అయితే... లో దుస్తుల విషయంలో మాత్రం తగిన శ్రద్ధ వహించరు. చవకరకం లోదుస్తులు వాడతారు. దానివల్ల ఎంతో అసౌకర్యం. మామూలుగా రోజువారి ధరించే లో దుస్తులు వర్షాకాలంలో ధరించకూడదు. మరి ఎలాంటి లో దుస్తులు వేసుకోవాలో చూద్దాం.. జననాంగాల్లో ఇన్ఫెక్షన్లు! వర్షాకాలంలో దుస్తులు త్వరగా ఆరవు. ఉతికిన దుస్తులు ఎండటానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుంది. అలా రెండు, మూడు రోజులు బయట ఉన్నవాటిని ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పూర్తిగా ఎండకుండా.. తడిగా ఉన్న లో దుస్తులు ధరించడం వల్ల బాక్టీరియా తయారై.. జననాంగాల్లో ఇన్ఫెక్షన్లు సంభవించే ప్రమాదం ఉంది. వ్యాయామం చేసిన తర్వాత అంతేకాదు, వర్షాకాలంలో కూడా వ్యాయామం చేసిన తర్వాత కాళ్ల దగ్గర చెమటలు వస్తాయి. అప్పుడు లో దుస్తులు తడిసిపోతాయి. వాటిని అలానే ఉంచుకుంటే.. దురద లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. వ్యాయామం తర్వాత వెంటనే లో దుస్తులు మార్చుకోవాలి. కాటన్‌వి అయితే! ►ఇక బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించకూడదు. దానివల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. కాబట్టి.. కొద్దిగా వదులుగా ఉండే లో దుస్తులు ధరించడమే ఉత్తమం. ►లోదుస్తులను చాలా రకాల మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు కానీ స్వచ్ఛమైన కాటన్‌వి అయితేనే మంచిది. ►అలాగే, లోదుస్తులను శుభ్రపరిచే డిటర్జెంట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ►గాఢమైన వాసనలతో ఉండే డిటర్జెంట్లు వాడకపోవడం మంచిది. ►ఎందుకంటే వాటిలోని రసాయనాలు రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కూడా పాటించండి! ►ఈ సీజన్లో బ్యాగ్‌లో ఎప్పుడూ కొన్ని పాలిథిన్ కవర్లు ఉంచుకోవాలి. ►అలాగే తేలికగా ఉండే రెయిన్ కోట్ ఒకటి స్పేర్‌లో ఉంచుకోవాలి. ►వీటితోపాటు జలుబు, దగ్గుకు వాడే ట్యాబ్లెట్లు, హ్యాండ్ కర్చీఫ్‌లు, విక్స్, లవంగాలు వంటివి ఉంచుకోవడం మంచిది. ►గొంతులో గరగరగా ఉన్నప్పుడు లవంగాలు బాగా పని చేస్తాయి. చదవండి: Monsoon- Wardrobe Ideas: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్! Health Benefits Of Corn: మొక్కజొన్న పొత్తు తరచుగా తింటున్నారా? ఇందులోని లైకోపీన్.. -
ఒమిక్రాన్ మళ్లీ రాదనుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఒకసారి వచ్చిపోయాక మళ్లీ రాదని నిర్లక్ష్యం వద్దని కిమ్స్ ఆస్పత్రి పల్మనాలజిస్ట్, స్లీప్ డిపార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణప్రసాద్ అన్నారు. ఒకసారి ఒమిక్రాన్ వచ్చి తగ్గాక మళ్లీ నెల, నెలన్నరలో రీ ఇన్ఫెక్షన్ వస్తోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? ఒకసారి ఒమిక్రాన్ వచ్చాక మళ్లీ రాదనుకోవద్దు. గత నెలలో ఒమిక్రాన్ సోకి నెగెటివ్ వచ్చాక బయట తిరిగి వైరస్‌కు మళ్లీ ఎక్స్పోజ్ అయిన కొందరు కరోనా బారిన పడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్ కేసులు మళ్లీ వస్తున్నాయి. అలాంటి కొన్ని కేసులు గుర్తించాం. కాబట్టి కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరే దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి వచ్చిన వాళ్లలో లక్షణాలేంటి? కరోనా రెండోసారి సోకినా తీవ్రత ఎక్కువగా ఉండట్లేదు. లక్షణాలూ మునుపటిలా స్వల్పంగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ దాదాపుగా ‘అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్’లోనే ఉంటున్నాయి. డెల్టాతో ›ఇన్ఫెక్ట్ అయిన వారు, అస్సలు టీకా తీసుకోనివారు కొంతమంది దీర్ఘకాలిక కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ప్రస్తుతం ఒకరోజు జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు తగ్గిపోయాక కఫంతో కూడిన దగ్గు ‘అలర్జీ బ్రాంకైటీస్ లేదా అస్థమా’ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కాగానే కొంచెం దగ్గురావడం, పడుకున్నాక దగ్గుతో ఇబ్బంది పడటం, కొందరికి పిల్లి కూతలుగా రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. వారం కిందట ఒకరోజు జ్వరం, కొద్దిగా ఒళ్లునొప్పులు వచ్చి తగ్గిపోయాయని, ఆ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఎక్కువ మంది చెబుతున్నారు. అలా వారికి అప్పటికే కరోనా సోకిందని తెలుస్తోంది. చాలా మందికి మళ్లీ ఆస్థమా లేదా ‘అలర్జీ బ్రాంకైటీస్’ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు దుమ్ము, పొగ, చల్లటి పదార్థాలు, చల్లటి గాలి నుంచి తగిన రక్షణ పొందుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ కోవిడ్ సమస్యలుంటున్నాయా? అసలు టీకాలు తీసుకోని వారు, ఒక్క డోస్ తీసుకున్న వారికి సంబంధించి వైరస్ సోకాక వారం, పది రోజుల తర్వాత దగ్గు, ఆయాసం పెరిగిన కేసులు స్వల్పంగా వస్తున్నారు. వీరిలో కొన్ని కేసులు ‘లంగ్ షాడోస్’ వంటివి వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ డెల్టా కేసులు వస్తున్నాయి కాబట్టి న్యూమోనియా, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. -
కరోనా రీ–ఇన్ఫెక్షన్ గనుక వస్తే..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!
మీకు ఇప్పటికే ఓసారి కరోనా సోకిందా? తొలిసారి అనుభవంతో మళ్లీ మరోసారి ఇన్ఫెక్షన్ గనక వస్తే... అది తీవ్రంగా బాధిస్తుందనీ లేదా ప్రాణాంతకమవుతుందేమోనని ఆందోళన పడుతున్నారా? రీ–ఇన్ఫెక్షన్ కేసుల్లో అస్సలు అలాంటి భయమే అవసరం లేదని భరోసా ఇస్తున్నారు అధ్యయనవేత్తలు. రెండోసారి గనక కరోనా ఇన్ఫెక్షన్ సోకితే దాదాపు 90 శాతం మందిలో అది తీవ్రమైన లేదా క్రిటికల్ లేదా మరణం వంటి వాటికి దారితీయదు. అంతేకాదు... మొదటిసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో చాలా సీరియస్ అయ్యే అవకాశాలు 2.5 శాతం కాగా... రీ–ఇన్ఫెక్ట్ అయిన వాళ్లలో ఆ అవకాశాలు కేవలం 0.3 శాతం మాత్రమేనని, ఇక క్రిటికల్ అయ్యే పరిస్థితి తొలిసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో 0.40% కాగా... రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో ఇది సున్నా శాతం (0%) అనీ, మరణానికి దారి తీయడం అనే అంశంలోనూ తొలిసారి సోకిన వారు 0.1% కాగా... రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలోనూ అది సున్నా శాతం (0%) అంటూ భరోసా ఇస్తున్నారు. కాబట్టి రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో కొంతవరకు హాస్పిటలైజ్ అయితే అవ్వొచ్చుగానీ... క్రిటికల్, మరణానికి దారితీసే ప్రమాదమే ఉండదన్నది ఖతర్ పరిశోధకులు తేల్చిన అంశం. ఖతర్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌తో పాటు వీల్ కార్నెల్ మెడిసిన్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఓ సంయుక్త అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ బృందం రెండోసారి ఇన్ఫెక్షన్కు గురైన దాదాపు 1,300 మందికిపైగా వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ వివరాలన్నీ ‘ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. అయితే ఈ పరిశోధనపై కొన్ని విమర్శలూ వినిపిస్తున్నాయి. ఖతర్‌లో అంత తీవ్రంగా కరోనా లేదనీ, అందువల్ల బాగా చల్లగా ఉండే పాశ్చాత్యదేశాల్లోని వాతావరణం కారణంగా... ఇదే అధ్యయనం పాశ్చాత్యులకు అంతే కచ్చితంగా వర్తించకపోవచ్చంటూ కొన్ని దేశాలూ, సంస్థలూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే... ఫిబ్రవరి 28, 2020 నుంచి ఏప్రిల్ 28, 2021 మధ్యకాలంలో తొలిసారి ఇన్ఫెక్ట్ అయిన 3,53,000 మందిపైనా... వారిలోనే మళ్లీ రీ–ఇన్ఫెక్ట్ అయిన 1,300 మందిపైనా నిర్వహించినందున ఈ అధ్యయనానికి ఎంపిక చేసిన శాంపుల్ పెద్దదిగానే భావించాలనీ, ఇది కొంతమేరకు ఊరటనిచ్చే అంశమేనని మరికొందరు నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
జింక్ ప్రాముఖ్యం తెలుసా.. తగుస్థాయిలో తీసుకోకపోతే..
మన శరీరానికి విటమిన్లతోపాటు మినరల్స్ (ఖనిజాలు) కూడా తగుమోతాదులో అవసరమే! అంటే కాల్షియం, మాగ్నిషియం, ఐరన్ వంటివి మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. వాటిల్లో ముఖ్యమైన ఖనిజం జింక్. మన శరీరంలో ఈ ఖనిజం నిర్వహించే ముఖ్య విధులు, ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం.. జింక్‌ను ఎందుకు తీసుకోవాలి? మన వ్యాధినిరోధక వ్యవస్థ వివిధ అలర్జీలు, వ్యాధులు, వైరస్ల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే కోవిడ్ సంక్షోభ కాలంలో అందరి దృష్టి ఇమ్యునిటీ పై పడింది. మరి ఇమ్యునిటీ ఏవిధంగా పెంచుకోవాలి? అనే అంశంపై చాలా మందికి క్లారిటీ లేదు. ముఖ్యంగా విటమిన్ ‘సి’, ‘డి’ లతో పాటు జింక్ ఖనిజం కూడా ఇమ్యునిటీ పెంపునకు తోడ్పడుతుంది. మన శరీరంలో జింక్ నిర్వహించే పాత్ర ఏమిటి? మానవ శరీరంలో అనేక జీవక్రియలతో జింక్ సంబంధం కలిగి ఉంటుంది. భిన్న కణసంబంధ ప్రక్రియల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ప్రొటీన్ సంశ్లేషణ, గాయాలు నయంచేయడానికి, కణ విభజనకు, డీఎన్ఏ సమన్వయానికి కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా సంభవించే జలుబు, హైపోథైరాయిడ్ నివారణకు, జీర్ణ వ్యవస్థకు, హృదయ సంబంధింత వ్యాధుల నుంచి రక్షణ, చర్మ మరియు కంటి ఆరోగ్యానికి, రుచి, వాసన పసిగట్టడానికి ఇది అవసరం. అంటువ్యాధులతో పోరాడి రక్షణ కల్పించడంలో జింక్ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రపంచ వ్యాప్త పరిశోధనల్లో రుజువైంది. జింక్ తగుమోతాదులో తీసుకోకపోతే ఏమౌతుంది? మానవ శరీరం దానంతట అది జింక్‌ను ఉత్పత్తి చేసుకోలేదు, అలాగే నిల్వ చేసుకునే అవకాశం కూడా లేదు. కేవలం ఆహారం ద్వారా మాత్రమే అది శరీరానికి అందుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం యేటా సుమారు 8 లక్షల మంది జింక్ కొరతతో మరణిస్తున్నారు. వారిలో సగానికిపైగా 5యేళ్లలోపు పిల్లలు ఉండటం గమనార్హం. జింగ్ లోపిస్తే రోగనిరోధక వ్యవస్థ పనితీరు సన్నగిల్లి, క్రమంగా ప్రాణాంతకంగా మారే అవకాశం ఎక్కువ. సెల్యులర్, సబ్ సెల్యులర్ స్థాయిల్లో అకాల కణ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆకలి మందగించడం, గాయాలు నెమ్మదిగా మానడం, పేగు సంబంధిత వ్యాధులు, మొటిమలు, మానసిక రుగ్మతలు తలెత్తడం, జుట్టు రాలడం, బ్లడ్ షుగర్ సమస్యలు, సంతాన వైఫల్యం వంటివి సంభవించవచ్చు. ఒక రోజుకు ఏంత పరిమాణంలో జింక్ అవసరం? జింక్ చాలా సూక్ష్మస్థాయిలో మాత్రమే మన శరీర ఆరోగ్యానికి అవసరం అవుతుంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఒక రోజుకు మహిళలకైతే 8 గ్రాములు, పురుషులకు11 గ్రాముల జింక్ అవసరం అవుతుందని వెల్లడించింది. గర్భం దాల్చిన మహిళలకైతే రోజుకు 11 గ్రాములు, పాలిచ్చే తల్లులకు 12 గ్రామలు జింక్ అవసరం అవుతుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారం ►మాంసాహారంలో, నత్తగుల్లల్లో, పౌల్ ట్రీ ఉత్పత్తుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ►మొక్క సంబంధిత ఆహారంలో సాధారణంగా జింక్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే శాఖాహారంలో జింక్ లభ్యత తక్కువ. అయినప్పటికీ బ్రెడ్, చిక్కుళ్లు, కాయధాన్యాలు, పప్పుధినుసులు మొదలైన వాటిల్లో జింక్ లభ్యత ఉంటుంది. అలాగే కొన్ని వంటలను కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో వండటం లేదా మొలకెత్తించడం ద్వారా కూడా దీనిని పొందుకోవచ్చు. అంటే బీన్స్, ధాన్యాలు, విత్తనాలను నానబెట్టడం, వేయించడం, పులియబెట్టడం ద్వారా జింక్ లభ్యతను పెంపొందించుకుని ప్రయోజనం పొందవచ్చు. ►మన దేశంలో అనేక మంది ధాన్యపు ఆహారఅలవాట్లు కలిగి ఉండటం వల్ల జింక్ హీనత అధికంగా కనిపిస్తుంది. కొన్ని సార్లు మాంసాహారులకంటే శాకాహారులకే 50 శాతం అధికంగా జింక్ అవసరం అవుతుంది. అందుకు ఉత్తమ మార్గం ఏమిటంటే... పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, కాయధాన్యాల్లో పుష్కలంగా జింక్ ఉంటుంది. అలాగే వాల్నట్స్, బాదం పప్పు, జీడి పప్పు, పొద్దు తిరిగుడు, గుమ్మడి, పుచ్చకాయ విత్తనాలు వంటి గింజల ద్వారా జింక్ కొరతను భర్తీ చేయవచ్చు. అలాగే అవకాడో పండు, జామ, పుట్టగొడుగులు, బచ్చలికూర, బ్రకోలి క్యాబేజిలలో కూడా జింక్ నిండుగా ఉంటుంది. కాబట్టి పటిష్టమైన ఇమ్యునిటీని పెంపొందించడంలో జింక్ ప్రాధాన్యత ఎనలేనిది. కోవిడ్ నుంచే కాకుండా ఇతర అంటురోగాలు, వ్యాధుల నుంచి మన శరీరానికి రక్షణ కల్పించడంలో జింక్ కూడా అవసరమేనని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహార అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుకోండి. చదవండి: Facts About Hair: ఒక వెంట్రుక వయసు దాదాపుగా ఇన్నేళ్లు ఉంటుందట!! -
బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది
-
కరోనాను గుర్తించే పనిలో తేనెటీగలు
సాక్షి,న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పెను సంక్షోభాన్ని సృష్టించింది. కరోనా అంతానికి గ్లోబల్‌గా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికి కచ్చితమైన పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా వైరస్‌ను గుర్తించేందుకే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో తొందరగా కరోనాను గుర్తించే పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెదర్లాండ్స్ పరిశోధకులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలను పసిగట్టేలా తేనెటీగలకు శిక్షణనిస్తున్నారు. తేనెటీగలకు వాసన పసిగట్టే అసాధారణ గుణం ఉందని, అదే తమ రీసెర్చ్‌కు దోహదపడుతుందని చెబుతున్నారు. కరోనా నిర్దారణ పరీక్షలకు గంటలు లేదా రోజులు పట్టవచ్చు, కాని తేనెటీగల నుండి ప్రతిస్పందన వెంటనే ఉంటుంది. ఈ పద్ధతి చౌకగా కూడా ఉంటుంది. కోవిడ్ టెస్ట్ ఫలితాలకోసం వేచి ఉండే సమయం తగ్గనుందని భావిస్తున్నారు. అంతేకాదు పరీక్షలు కొరత ఉన్న దేశాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. (కరోనా విలయం: డీఆర్డీవో డ్రగ్‌కు గ్రీన్ సిగ్నల్) నెదర్లాండ్స్ యూనివర్సిటీలో బయో వెటర్నరీ ల్యాబ్‌లో తెనేటీగల సామర్ధ్యంపై పరిశోధనలు చేస్తున్నారు. మొదట కోవిడ్ ఇన్ఫెక్షన్ శాంపిళ్లను వాసన వీటికి చూపుతారు. పువ్వుల్లో మకరందాన్నే ఆఘ్రాణించే రీతిలోనే ఇవి స్ట్రా లాంటి నాలుకలతో వాటి వాసన పీల్చుతాయని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వైరాలజీ ప్రొఫెసర్ విమ్ వాన్ డెర్ పోయెల్ చెప్పారు. ఆ తరువాత ‘రివార్డు’గా చక్కర కలిపిన నీటిని వీటికి ఇస్తామన్నారు. అయితే ఇన్ఫెక్షన్ సోకని శాంపిల్ ని చూపితే వీటికి ఈ రివార్డు ఉండదని తెలిపారు. కోవిడ్ నమూనాలను చూపినప్పుడు మాత్రం దీన్ని స్వీకరించేందుకు ఇష్టపడట. చక్కెర నీటిని తీసుకున్న తేనెటీగలు, ఈ నమూనాల శాంపిళ్లను అందించినపుడు నాలుకలను చాచవని చెప్పారు. తేనెటీగలను సేకరించేవారి నుంచి తాము వీటిని తీసుకువచ్చి ప్రత్యేక హార్నెసెస్ వంటి వాటిలో ఉంచుతామన్నారు. ఇలా వీటి వల్ల కోవిడ్ ఫలితాలను త్వరగా గుర్తించవచ్చునన్నారు. వీటి రెస్పాన్స్ తక్షణమే ఉంటుందన్నారు. ఇది చౌక అయిన పధ్దతి అని, టెస్టులు తక్కువగా జరిగే దేశాల్లో ఇది ప్రయోగాజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. (కళ్లు తెరవండి! లేదంటే 10 లక్షల మరణాలు: లాన్సెట్ హెచ్చరిక) అయితే దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదని ఘెంట్ విశ్వవిద్యాలయంలో తేనెటీగలు, కీటకాలు, జంతు రోగనిరోధక శాస్త్రాన్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ డిర్క్ డీ గ్రాఫ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇలాంటివి పనికి రావని, కరోనా నిర్దారణ పరీక్షల కంటే కూడా ఇతర పనులకోసం వాటిని వినియోగించుకుంటానని వెల్లడించారు. క్లాసిక్ డయాగ్నస్టిక్ పరికరాలనే కోవిడ్ టెస్టులకు వినియోగించుకోవడం మంచిదన్నారు. 1990 ప్రాంతాల్లో అమెరికాలోని రక్షణ విభాగం ‘‘ఇన్సెక్ట్ స్నిఫింగ్" అనే సాంకేతికతను వాడిందని, పేలుడు పదార్థాలను, విషపదార్థాలను గుర్తించడానికి తేనెటీగలు, కందిరీగలను వినియోగించుకుందని ఆయన పేర్కొన్నారు. (కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!) -
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కోవిడ్ బారిన పడి తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం పూర్తిస్థాయిలో చక్కబడిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.ఎం.వి.రావు గురువారం మీడియాకు తెలిపారు. ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, తగిన విశ్రాంతి అనంతరం త్వరలోనే రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతారని తెలియజేశారు. బుధవారమే ఆయనకు వివిధ వైద్యపరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించగా, గురువారం వాటన్నింటినీ పరిశీలించినపుడు అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా తేలిందన్నారు. సీఎంకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని ఇదివరకే వెల్లడి కాగా, రక్తనమూనాలు అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని డా.ఎం.వి.రావు తెలిపారు. చదవండి: భర్తకు కరోనా.. భయంతో ఉరేసుకున్న భార్య చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం -
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దుల కారణంగా చెవి ప్రాంతం ఎర్రబడటం, ర్యాష్ రావడం జరుగుతుండవచ్చు. సాధారణంగా చాలావరకు కృత్రిమ ఆభరణాలలో నికెల్ అనే లోహం ఉంటుంది. దీనివల్ల ర్యాషెస్ వస్తాయి. ఇలాంటివి ఆభరణాల కారణంగా కొందరిలో చెవి వద్ద కాస్తంత దురద, చెవి రంధ్రం వద్ద ఎర్రబారడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఈ దశలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అక్కడి గాయం రేగిపోయి, రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇలాంటివారు నికెల్‌తో చేసిన కృత్రిమ ఆభరణాలు, రింగులు, దిద్దులు ధరించడం సరికాదు. వీరు మొమెటజోన్ ఉన్న ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి కాస్త తక్కువ పాళ్లు కార్టికోస్టెరాయిడ్ కలిసి ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్నచోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాయండి. ఇలాంటి క్రీములను సాధారణంగా డర్మటాలజిస్ట్ ల సూచనలతో వాడటమే మంచిది. -
గర్భవతులకు ఇదో పెద్ద సమస్య!
గర్భవతుల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి పెరుగుతున్నకొద్దీ అది మూత్రనాళాలపై ఒత్తిడి కలగజేయడం వల్ల మూత్రపిండాలు వాచిపోతాయి. దాంతో మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ కాస్తా... మూత్రపిండాలకూ చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉంది లేదా నెలల నిండకముందే ప్రసవం కూడా కావచ్చు. అందువల్ల గర్భవతులు మూత్రపరీక్ష చేయించుకుని, ఇన్ఫెక్షన్ ఉంటే తప్పక మందులు వాడాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్కు చికిత్స సాధారణంగా వచ్చే సిస్టైటిస్‌కి మూడు రోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు సరిపోతుంది. మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే దీర్ఘకాలం పాటు చికిత్స (లాంగ్ టర్మ్ సప్రెసెంట్ థెరపీ) అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలలో రాళ్లను తొలగించడం కోసం కొన్ని నాన్‌సర్జికల్, సర్జికల్ ప్రొíసీజర్స్ అవసరం కావచ్చు. -
కరోనాతో కొత్తముప్పు !
సాక్షి, విజయవాడ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో రోజుకో కొత్త సమస్యలు వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో పలువురిలో మధుమేహం స్థాయిలు పెరగడంతో పాటు, లంగ్ ఇన్ఫెక్షన్స్కు గురవడం, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. తాజాగా కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌లకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఆస్పత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రోగుల్లో 7 నుంచి 8 శాతం మంది రోగులు నాలుగు నుంచి ఆరు వారాల్లో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వెంటిలేటర్ దాకా వెళ్లొచ్చిన రోగుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. దీంతో కరోనా తగ్గినా మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు... కరోనాతో కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా సివియర్ కండీషన్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్ రోగుల్లో గుండె సమస్యలను గుర్తించడంతో ఇటీవల కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలో గుండె వైద్య విభాగాన్ని సైతం ఆఘమేఘాలపై ప్రారంభించారు. ఆ విభాగంలో ప్రతి రోగికి ఈసీజీ, ఎకో కార్డియాలజీ పరీక్ష చేస్తున్నారు. అవసరమైతే యాంజియోగ్రామ్ నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరోనా రోగులకు గుండె వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తున్నారు. (ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా!) వెలుగు చూస్తున్న సమస్యలివే... కరోనాతో చికిత్స పొందుతున్న రోగులు కొందరు పల్మనరీ ఎంబోలిజయ్(ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం)కు ఎక్కువుగా గురవుతున్నారు. కరోనా మరణాల్లో ఎక్కువ మందిలో ఇదే కారణంగా చెపుతున్నారు. కొందరిలో గుండె రక్తనాళాల్లో, మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి, పూడికలు రావడం, కాళ్ల రక్తనాళాల్లో సైతం గడ్డలు ఏర్పడి రక్తప్రసరణ తగ్గుతున్న వారిని గుర్తిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 నుంచి 3 శాతం మందిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి మరణాలు సంభవిస్తుండగా, డిశ్చార్జి అయిన వారిలో 7 నుంచి 8 శాతం మందిలో గుండె, మెదడు సమస్యలు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ►ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నెలల పాటు యాంటి కో ఆగ్యులేషన్ మందులు వాడాలి. అలా వాడిన వారిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడిన సందర్భాలు లేవు. ►ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు స్టెరాయిడ్స్ వాడిన వారు, ఆ తర్వాత ఫాలోఅప్ మందులు కూడా వాడాలి. ►యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ►పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ►తరచూ రక్తంలో ఆక్సిజన్శాతాన్ని పరీక్షించుకోవాలి. ఏ మా త్రం తగ్గినట్లు గుర్తించినా వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి కోవిడ్ సివియర్ స్టేజ్‌కు వెళ్లిన కొందరిలో యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తంలో విపరీతమైన గడ్డలు ఏర్పడటం గుర్తిస్తున్నాం. గుండె రక్తనాళాలతో పాటు, మెదడు, కాళ్ల రక్తనాళాల్లో కూడా గడ్డలు ఉంటున్నాయి. ఒక వ్యక్తి పదిరోజుల పాటు మంచంపైనే పడుకుంటే సాధారణంగా పల్మనరీ ఎంబోలిజమ్కు గురయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఐసీయూలో కదలకుండా రోజుల తరబడి ఉంటున్న వారికి పల్మనరీ ఎంబోలియజ్, కరోనాతో ఏర్పడే గడ్డలతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. అలాంటి వారికి యాంటి కో ఆగ్యులేషన్ థెరపీ అందిస్తారు. కరోనా చికిత్స పొందిన వారిలో పదిహేను ఇరవై రోజుల్లో కొందరిలో, నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మరికొందరిలో గుండె సమస్యలు, గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవుతున్న వారిని గుర్తిస్తున్నాం. విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో ఈసమస్యలకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్ -
పసుపుతో మోకాళ్ల నొప్పులు దూరం..
న్యూఢిల్లీ: భారత దేశంలో విస్తృతంగా ప్రజలందరు ఉపయోగించే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ పదార్ధం ఉండడం ద్వారా అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పసుపుతో బ్యాక్టేరియా, వైరల్ ఇన్‌ఫైక్షన్స్ తగ్గుతాయని మనకు తెలిసు. కానీ మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సైతం తగ్గుతాయని ఆస్ట్రేలియాలోని టాస్మానియా విశ్వవిద్యాలయానికి చేసిన అధ్యయనంలో తేలింది. కాగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 70 మందిని కొన్ని వారాల పాటు పరీక్షించగా, బాధితులకు ఉపశమనం కలిగిందని తెలిపారు. అన్నల్ మెడిసిన్, జర్నల్ ఆఫ్ మెడిసిన అధ్యయన సంస్థలు సైతం పసుపుతో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని దృవీకరించాయి. భారత సంస్కృతిలోనే మెజారిటీ రోగాలకు పసుపును విరివిగా వాడేవారు. కానీ గత కొంత కాలంగా అల్లోపతి మందులను ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా యాంటీ వైరల్ జబ్బులకు పసుపు ఎంత మేలు చేస్తోందో ఆయుర్వేద నిపుణులు తెలియజేయడంతో ప్రస్తుతం పసుపును విరివిగా వాడుతున్నారు. అయితే గతంలో కొందరు అల్లోపతి వైద్యులు కేవలం ఇంటి చిట్కాలకే ఉపయోగపడుతుందని భావించేవారు. కానీ విదేశీయుల అధ్యయనంలో కూడా పసుపు ద్వారా మోకాళ్ల నొప్పులు తగ్గనున్నట్లు తేల్చడం దేశ ఆయుర్వేధానికి ఎంతో ప్రయోజనకరం. పసుపును ఉపయోగించే విధానాలు -పసుపును పదార్ధాల రూపాల్లోనే కాకుండా మాత్రల రూపంలో కూడా ఉపయోగించవచ్చు -సాధారణంగా మన భారతీయుల వంటలలో పసుపును విరివిగా వాడుతుంటారు. పసుపులో లభించే కర్కుమిన్ పదార్ధం వల్ల ఎంతో లాభం -పాలలో పసుపును వేసి త్రాగితే అనేక రోగాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. -అదే విధంగా పసుపుతో కలిపిన టీ త్రాగినా ఆరోగ్య పటిష్టతకు ఎంతో లాభమని నిపుణులు సూచిస్తున్నారు. -
అధిక యాంటీబయాటిక్స్‌తో ఇన్ఫెక్షన్లు
ఆరోగ్యంపై బాగా అవగాహన పెరిగింది.. ప్రజలు సొంత ప్రయోగాలు చేస్తున్నారు.. శరీరంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మందుల షాపునకు వెళ్తున్నారు.. వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు.. కొందరు ఓ వారం వాడితే బాగుంటుందని ఉచిత సలహా.. దీంతో అలా వాడేస్తున్నారు.. ఇవే కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నాయి.. వీటిపై అవగాహన కోసం ప్రతి ఏడాదీ 13వ తేదీ వరల్డ్ సెప్సిస్ డే నిర్వహిస్తున్నారు. గుంటూరు మెడికల్: విచ్చల విడిగా యాంటీబయాటిక్స్ వినియోగించడంతో పాటు వ్యాధి నివారణకు వాడాల్సినవి కాకుండా ఇతర యాంటీబయాటిక్స్ వాడడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనేక మంది ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇన్ఫెక్షన్ల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి ఏడాది 7 నుంచి పది కోట్ల మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి మృతి చెందుతున్నట్లు అంచనా. ప్రతి 3.5 సెకన్లకు ఒకరు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది 2.70 కోట్ల నుంచి 3 కోట్ల మంది ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలుకొని, ఐదేళ్లలోపు పిల్లలు 60 లక్షల మంది ప్రతిఏడాది ఇన్ఫెక్షన్లతో చనిపోతున్నారు. లక్షణాలు.. సెప్సిస్ అనేది ఒక ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. ఇది సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, తీవ్రమైన చలి, ఆయాసం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, బీపీ తగ్గడం, పెరగడం, రోగి తికమక పడడం తదితర లక్షణాలు వ్యాధి బాధితుల్లో కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ.. బ్లడ్ కల్చర్, కార్బాఆర్, బయోఫయర్ టెస్ట్‌ల ద్వారా సెప్సిస్ వ్యాధిని నిర్ధారిస్తారు. అంటు వ్యాధి కారకాలు, వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి, వాటి స్థానం నుంచి రక్త ప్రవాహంలో కలవడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బు. తక్షణమే గుర్తించి చికిత్స చేయని పక్షంలో శరీరంలోని పలు అవయవాలు ఇన్ఫెక్షన్ల వలన పనిచేయడం మానివేసి రోగి ప్రాణాలు కోల్పోతాడు. రాజధాని జిల్లాల్లో బాధితులు గుంటూరు జిల్లాలో ఫిజీషియన్లు 120 మంది, కృష్ణా జిల్లాలో వంద మంది వైద్యనిపుణులు ఉండగా, ప్రతిరోజూ ఒక వైద్యుడి వద్దకు 20 మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి చికిత్స కోసం వస్తున్నారు. వీరికి సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించని పక్షంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్గా (సెప్సిస్) మారి రోగులను ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. వ్యాధి సోకే భాగాలు ఇన్ఫెక్షన్లు నూటికి 50 శాతం ఊపిరితిత్తుల్లో వస్తాయి. తదుపరి కిడ్నీలు, బ్రెయిన్, యూరినరి ట్రాక్ట్, చర్మం, ఇతర భాగాల్లో వ్యాధి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్లు రావడం ద్వారా అల్సర్లు ఏర్పడతాయి. క్యాన్సర్ బాధితులు, షుగర్ బాధితులు, కాలిన గాయాల వారిలో, మేజర్ ట్రామా బాధితుల్లో, హెచ్ఐవీ బాధితుల్లో సూక్ష్మ క్రిముల ద్వారా ఈ వ్యాధి త్వరితగతిన ఎక్కువ మందిలో వ్యాప్తి చెందుతుంది. కాళ్లల్లో పుండ్లు ఏర్పడి చీము పట్టి పరిస్థితి ప్రమాదంగా మారి కొన్ని సార్లు ఆపరేషన్ల ద్వారా ఆగాయాలను తొలగించాల్సి వస్తుంది. పౌష్టికాహారం తీసుకోవాలి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఖనిజ లవణాలు, విటమిన్లు, కార్బోహైడ్రేడ్లు, అన్ని సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి. మరుగుదొడ్లు వినియోగించిన పిదప, భోజనానికి ముందు తప్పనిసరిగా కాళ్లు, చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రమైన వ్రస్తాలు ధరించడం, నిద్రించే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. యాంటీబయాటిక్స్ వైద్యుల సలహాలు మేరకు మాత్రమే వాడాలి. –డాక్టర్ కోగంటి కల్యాణ చక్రవర్తి, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు -
అంటువ్యాధులు పరార్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలతో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే జూన్, జూలై, ఆగస్టులో మలేరియా కేసులు సగానికి పైగా తగ్గగా డెంగీ, డయేరియా 10–20 శాతానికే పరిమితమైనట్లు పంచాయతీరాజ్ శాఖ పరిశీలనలో తేలింది. 13 వేల పంచాయతీల్లో పారిశుధ్య పనులు.. ► ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకు ముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్, పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. ► మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా మనం – మన పరిశుభ్రత పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా డెంగీ కేసులు... ► గత ఏడాది జూన్, జూలై, ఆగస్టులో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి ఇదే కాలంలో కేవలం 601 మాత్రమే నమోదైనట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. డెంగీ కేసులు గత ఏడాది మూడు నెలల్లో 944 కేసులు నమోదు కాగాఈసారి అదే వ్యవధిలో 24 మాత్రమే గుర్తించారు. ► గత ఏడాది 1,11,685 డయేరియా కేసులు మూడు నెలల్లో నమోదు కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో 20,355 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది 9,528 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 355 కేసులే నమోదయ్యాయి. -
ముంపు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు
సాక్షి, అమరావతి: తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన 112 గ్రామాలకు ప్యాకెట్లు, క్యాన్లు, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ సరఫరా చేస్తోంది. పాక్షికంగా నీట ముంపునకు గురైన వాటితో కలిపి మూడు జిల్లాల్లో 330 గ్రామాల వరకు వరద నీటి ప్రభావం ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డిలు మంగళవారం సాయంత్రం మూడు జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలు, ఎస్ఈలు, ఇతర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ► ముంపు గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 4.86 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 20 లీటర్ల సామర్ధ్యం కలిగిన 1,160 క్యాన్లు, 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 ట్యాంకర్లను గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలకు ఇప్పటికే తరలించింది. ► ముంపు గ్రామాల్లో డయేరియా, మలేరియా, అంటు వ్యాధులు ప్రబలకుండా ఆయా గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాల ఓవర్‌హెడ్ ట్యాంకులు, బోర్ల నీటిని రెండు, మూడు రోజుల పాటు తాగొద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించాలి. ► ముంపు గ్రామాల్లో ప్రతి బోరు, బావి నుంచి నీటి శాంపిల్స్ సేకరించి, అవి తాగునీటి అవసరాలకు పనికి వస్తాయా లేదా అని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి, ప్రతి రోజూ క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలి. ► తాగడానికి పనికొస్తాయని నిర్ధారణ అయిన బోర్లను గుర్తించి, వాటిలోని నీటిని మాత్రమే వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజెప్పాలి. ► ఆయా ప్రాంతాల్లో నీరు పూర్తిగా గ్రామం నుంచి వెళ్లగానే పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా చేపట్టాలి. ► మేట వేసిన మట్టిని తొలగించి బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ చల్లాలి. ► రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఎక్కడైనా రోడ్లపై చెట్లు విరిగిపడితే, వాటిని వెంటనే తొలగించాలి. -
కోవిడ్ ఆసుపత్రులు ప్రమాణాలు పాటించాలి
న్యూఢిల్లీ: కరోనా కేసులు అత్యధికంగా నమోదైన జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ నివారణ చర్యలు సక్రమంగా చేపట్టక పోవడం వల్ల వైద్య సిబ్బంది రక్షణ ఆందోళనకరంగా మారిందని కేంద్ర వైద్య బృందం అభిప్రాయపడింది. కోవిడ్–19ని ఎదుర్కోవడంలో వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖల సంసిద్ధతను సమీక్షించేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరు ఉన్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లకు చెందిన ఈ నిపుణుల బృందాలు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో అత్యధిక కోవిడ్ కేసులున్న జిల్లాల్లో పర్యటించాయి. కరోనా వైరస్ సోకిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు శాంపిల్స్ సేకరించేటప్పుడు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదనీ, దీంతో ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ సోకుతోందనీ, తద్వారా ఇతరలుకు సైతం ఇది పాకుతోందని ఈ బృందాలు గుర్తించాయి. శాంపిల్స్ తీసుకొనేటప్పుడు, వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపేటప్పుడూ నిర్దిష్ట ఉష్ణోగ్రతల్లో భద్రపరిచాలని వారు సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటి సర్వే నిర్వహించేందుకు తగినంత మంది సిబ్బందిని నియమించాలని ఈ బృందం సూచించింది. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర బృందాలు స్పష్టం చేశాయి. -
కరోనా : సహకరించకుంటే కేసు
సాక్షి, హైదరాబాద్: కరోనా (కోవిడ్-19) వైరస్‌పై అంటువ్యాధుల నివారణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. ఈ మేరకు అంటువ్యాధుల నియంత్రణ చట్టం–1897కు అనుగుణంగా తెలంగాణ అంటువ్యాధుల (కోవిడ్) నియంత్రణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం రాత్రి విడుదల చేసింది. దాని ప్రకారం ఎవరైనా కోవిడ్ అనుమానిత లక్షణాలుండి ఆస్పత్రిలో చేరేందుకు కానీ, ఐసోలేషన్‌లో ఉండేందుకు కానీ నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు పెట్టాలని స్పష్టం చేసింది. వీటిని అమలు చేసే బాధ్యతలను కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, ప్రజారోగ్య డైరెక్టర్, డీఎంఈ, వైద్య విధాన కమిషనర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించింది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఇది ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించినందున, దాని నియంత్రణకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే కోవిడ్ అనుమానాస్పద కేసులను పరీక్షించి, పైన పేర్కొన్న అధికారులకు సమాచారం అందించాలి. వ్యక్తుల ప్రయాణ చరిత్రను తెలుసుకోవాలి. ఆ వివరాలను నమోదు చేయాలి. - అవసరమైనప్పుడు పైన పేర్కొన్న అధికారులు ఆదేశిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కోవిడ్ నిర్ధారణకు సంబంధించిన విభాగాలు ఏర్పాటు చేసుకొని అనుమానిత కేసులకు పరీక్షలు నిర్వహించాలి. - గత 14 రోజుల్లో ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చారా లేదా తెలుసుకోవాలి. ప్రయాణ చరిత్ర ఉన్నా లేకపోయినా వారు 14 రోజులు ఇంటి నిర్బంధంలో ఉండాలి. లక్షణాలుంటే ఆస్పత్రికి తరలించాలి. కేంద్రం జారీచేసిన గృహ నిర్బంధ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. - గృహ నిర్బంధ మార్గదర్శకాలను పాటించని వ్యక్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో ఉంచాలి. - ప్రయాణ చరిత్ర, లక్షణాలతో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రొటోకాల్ ప్రకారం ఆస్పత్రిలో ఉంచాలి. - అలాంటి కేసులన్నింటినీ వెంటనే రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ యూనిట్‌కు పంపాలి. జిల్లా కలెక్టర్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలి. - కలెక్టర్ లేదా ప్రజారోగ్య డైరెక్టర్ తదితరుల అనుమతి లేకుండా, వారు కేసులను నిర్ధారణ చేయకుండా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ముద్రించడం తగదు. అవాస్తవాలను ప్రచారం చేస్తే, పుకార్లను వ్యాపింపజేస్తే ఈ నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. - కోవిడ్‌ను పరీక్షించాలనుకునే ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థలు రాష్ట్ర ఐడీఎస్పీ యూనిట్‌కు తెలపాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ఐడీఎస్పీ యూనిట్ వీటిని పర్యవేక్షిస్తుంది. - కోవిడ్ ప్రభావిత దేశం లేదా ప్రాంతం నుంచి గత 14 రోజుల్లో ప్రయాణ చరిత్ర ఉన్న ఎవరైనా, స్వచ్ఛందంగా స్టేట్ కంట్రోల్ రూం (040–24651119) లేదా టోల్ ఫ్రీ నంబర్ 104కు సమాచారం ఇవ్వాలి. - కోవిడ్ లక్షణాలున్న వారు ఐసోలేషన్‌కు నిరాకరిస్తే, ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిపెడితే ఆ వ్యక్తిపై చట్టప్రకారం చర్యలుంటాయి. - జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తదితరులకు అనేక అధికారాలు ఇచ్చారు. తమ పరిధిలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోవాలి. సినిమా హాళ్ల మూసివేత, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, సామూహిక సమావేశాలను నిషేధించడం, పాఠశాలలు, కార్యాలయాలను మూసేయాలి. - ఈ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తి, సంస్థలను శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లుగా పరిగణిస్తారు. అవసరమైతే జరిమానా విధించొచ్చు. -
రక్తానికీ ఇన్ఫెక్షన్
మన దేహంలోని ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ రావడం మనం చూస్తుంటాం. కళ్లకు వస్తే కళ్లకలక (కంజెక్టివైటిస్) అనీ, కాలేయానికి వస్తే హెపటైటిస్ అనీ, అపెండిక్స్‌కు వస్తే అపెండిసైటిస్ అని చెప్పుకోవడం మనందరికీ తెలిసిందే. మరి శరీరంలోని అన్ని అవయవాలకూ వచ్చినప్పుడు రక్తానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఉంది. కాకపోతే దీని గురించి మనకు అంతగా తెలియదు. రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ను మనం వాడుక భాషలో ‘రక్తం విషంగా మారిపోయింది’ అని వ్యవహరిస్తుంటాం. నిజానికి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైది. ప్రతి ఏటా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చే కండిషన్ బారిన పడుతున్నారు. వైద్య పరిభాషలో సెప్టిసీమియా లేదా సెప్సిస్ అని పిలిచే ఈ కండిషన్ ఎందుకు ఏర్పడుతుంది? అదెంత ప్రమాదకరం? అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?... ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. ముందుగా సెప్టిసీమియా అంటే ఏమిటో చూద్దాం. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో ఎలాంటి సూక్ష్మజీవులూ ఉండకూడదు. రక్తంలోకి బ్యాక్టీరియా లేదా వైరస్ చొరబడితే అవి రక్తప్రవాహంలోకి ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తూ ఉంటాయి. రక్తం మన దేహంలోని ప్రతి అవయవానికీ చేరి పోషకాలను అందిస్తుంది కాబట్టి... ఈ హానికారక సూక్ష్మజీవులు, అలాగే ఆ ప్రమాదకర రసాయనాలు సైతం ప్రతి అవయవానికీ చేరి అంతర్గత అవయవాలన్నీ వాచే ప్రమాదం ఉంది. అంటే ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్ వస్తే అది చాలా సేపటి వరకు ఆ అవయవానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందోమోగానీ... రక్తానికి ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం అది చాలా త్వరితంగా దేహమంతా పాకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలా రక్తం ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని సెప్టిసీమియా అంటారు. దీన్నే డాక్టర్లు సంక్షిప్తంగా ‘సెప్సిస్’ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఎందుకిలా జరుగుతుంది? నిజానికి సెప్సిస్ అనేది ఓ ప్రాణాంతకమైన పరిస్థితే అయిన్పటికీ... ఇది ఒక అనివార్యమైన స్థితి. ఎందుకంటే... మన దేహంలో ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్ సోకడమో, గాయాలు కావడమో జరిగినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. అలాంటి ప్రతిస్పందన కాస్తా వికటించి, దేహమంతా పాకుతూ పోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సెప్సిస్‌లో రకాలు సెప్సిస్ రెండు రకాలుగా కనిపిస్తుంది. 1. సెప్సిస్, 2. సెప్టిక్ షాక్. ఈ రెండు పరిస్థితుల్లోనూ యాంటీబయాటిక్స్ ఇస్తూ సదరు ఇన్ఫెక్షన్ను కట్టడి చేసేలా చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన స్థితి ఎవరెవరిలో... సెప్టిసీమియా లేదా సెప్సిస్ ఎవరికైనా సోకవచ్చు. అయితే కొంతమందిలో సెప్సిస్ ఏర్పడే పరిస్థితి మరింత ఎక్కువ. దీనికి తేలిగ్గా గురయ్యేవారు ఎవరంటే... ♦ బాగా పసివాళ్లు, పిల్లలు, వయోవృద్ధులు ♦ డయాబెటిస్, క్యాన్సర్, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడుతున్నవారు ♦ తీవ్రంగా ఒళ్లు కాలిపోయి గాయాలకు గురైనవారు, ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులు. ♦ శస్త్రచికిత్స చేయించుకున్న పేషెంట్లు ♦ రోగనిరోధకవ్యవస్థ బాగా బలహీనంగా ఉన్న ఎయిడ్స్ రోగులు, కీమోథెరపీ చేయించుకుంటున్న వ్యక్తులు. సెప్టిక్ షాక్‌లో... ♦ రోగి చురుకుదనాన్ని పూర్తిగా కోల్పోయి, అయోమయానికి గురవుతాడు. ♦ తన పరిస్థితి పూర్తిగా దిగజారిందనీ, మరణం ఖాయమని అనిపిస్తోందని చెబుతుంటాడు. ♦ తలతిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మాటలు తొట్రుపడుతుంటాయి. వేగంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ♦ పొట్టలో వికారం, వాంతులు, విరేచనాలు విపరీతమైన కండరాలనొప్పి మూత్రం కొద్దిగా మాత్రమే వస్తుంది. ♦ చర్మం చల్లబడుతుంది. వివర్ణమవుతుంది. స్పృహ ఉండదు. చికిత్స సెప్సిస్ ప్రధానంగా బ్యాక్టీరియా వల్లనే ఏర్పడుతుంది. అది ఏ బ్యాక్టీరియా కారణంగా వచ్చిందన్న అంశాలను పక్కనబెట్టి, రోగి రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియగానే అత్యవసరంగా రెండు అంచెల్లో చికిత్స అందించాల్సి ఉంటుంది. మొదటిది యాంటీబయాటిక్స్ ఇవ్వడం. రెండోది దేహంలోని అంతర్గత అవయవాలను రక్షించడం. ఇందుకోసం కృత్రిమంగా శ్వాస అందిస్తారు. సెలైన్‌తో సహా అవసరమైన ఇతర ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం మొదలుపెడతారు. సెప్సిస్ అని అనుమానించినప్పుడు అందుకు కారణం అయివుంటుందనుకున్న బ్యాక్టీరియాను అదుపు చేసేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్ ఇవ్వడం మొదలుపెట్టేస్తారు. ఆ వెంటనే... సదరు ఇన్ఫెక్షన్కు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేసి, నిర్దిష్టంగా ఆ సూక్ష్మజీవిని నిర్ధారణ చేశాక అందుకు అవసరమైన మందులను మారుస్తారు. రోగి శరీరంలో సెప్సిస్ ఏ భాగం నుంచి వ్యాపించడం ప్రారంభమైందో గుర్తించి వెంటనే దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేస్తున్న కణజాలాన్నీ, వాచిన ప్రాంతంలోని చీమును తొలగించడం మొదలు పెడతారు. ఇందుకోసం అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స చేసిన వారికి ఉపయోగించిన ట్యూబ్స్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తోందని గుర్తించినప్పుడు వాటిని తొలగించడమో చేస్తారు. నివారణ... ఒక అంచనా ప్రకారం దేశ జనాభాలో ప్రతీ ఏటా దాదాపు రెండు శాతం మంది సెప్సిస్ బారినపడుతున్నారు. ఒక ఉజ్జాయింపుగా ప్రతి ఏటా రెండున్నర కోట్ల మందికి సెప్సిస్ సోకుతోంది. కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు. ♦ ఫ్లూ, నిమోనియా వంటివి సోకకుండా ఎప్పుడూ చేతులను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ♦ గాయాలైనప్పుడు లేదా చర్మం గీసుకుపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడుక్కుని గాయం తగ్గే చికిత్స తీసుకోవాలి. ♦ గోళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. డయాబెటిస్ రోగులు శరీరంపై ఎక్కడా పుండ్లు, గాయాలు లేకుండా జాగ్రత్త పడాలి. సెప్సిస్‌ను గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. అది ఇతర కీలకమైన అవయవాలకు చేరితే చాలా ప్రమాదకరమని గుర్తించి జాగ్రత్తపడాలి. సెప్సిస్ లక్షణాలు – ముందస్తు హెచ్చరికలు సెప్సిస్‌కు సంబంధించిన ఈ లక్షణాలను ముందస్తు హెచ్చరికలుగా భావించి, అత్యవసర వైద్యచికిత్స అందించాలి. ఈ లక్షణాలను గుర్తించడం, ప్రతిస్పందించడం సెప్సిస్ ఏర్పడిన వ్యక్తిని రక్షించుకోవడంలో చాలా కీలక భూమిక వహిస్తాయి. ♦ జ్వరం వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. లేదా కొంతమందిలో దేహ ఉష్ణోగ్రత చాలా తక్కువకు పడిపోయి చలితో వణికిపోతూ ఉంటారు. ♦ గుండె అధిక వేగంతో కొట్టుకుంటుంది. ♦ శ్వాసవేగమూ విపరీతంగా పెరిగిపోతుంది. ♦ విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ♦ చర్మంలోని చిన్న రంధ్రాల నుంచి రక్తస్రావమై దద్దుర్లు ఏర్పడతాయి. ♦ రోగి మానసిక స్థితిలోనూ తీవ్రమైన మార్పులు వస్తాయి. నిద్రమత్తు ఆవరిçస్తుంది. రోగి అయోమయానికి గురవుతాడు. ప్రతి విషయంలోనూ నిరాసక్తత. ♦ సెప్సిస్ మరింత తీవ్రంగా మారినప్పుడు ఇంకా ప్రమాదకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది సెప్టిక్ షాక్ స్థితి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు తక్షణం రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఆ వ్యక్తికి ఇటీవలై ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉన్నా, లేదా శస్త్రచికిత్సలేమైనా జరిగినా, ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సెప్సిస్ చికిత్సకి ముందుగానే డాక్టరుకు ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి. -
వ్యాధులు ‘అంటు’కుంటున్నాయి..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే రోగికి ప్రస్తుతమున్న జబ్బుకు తోడు మరికొన్ని తోడవుతున్నాయి. వారి పక్కనున్న వారికి కూడా ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అంతేకాదు వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బందికి కూడా ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. 2018లో కేరళలో నిఫా వైరస్ సోకిన రోగికి వైద్య సేవలు అందించిన నర్సు ఇన్ఫెక్షన్కు గురై మృతిచెందింది. అలాగే హైదరాబాద్‌లో ఒక ప్రభుత్వ పెద్దాసుపత్రిలో గతంలో ఒక ఎయిడ్స్ రోగికి ఇచ్చిన ఇంజెక్షన్ పొరపాటున గుచ్చుకోవడంతో నర్సుకు కూడా ఎయిడ్స్ సోకింది. కొన్నాళ్ల చికిత్స అనంతరం ఆమె ఈ నెల 5న చనిపోయింది. రోగులకు చికిత్స అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వారికి, సందర్శకులకు కూడా ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. ఇన్ఫెక్షన్లు, ఇతరత్రా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు వ్యవస్థలు, కమిటీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా ఇన్ఫెక్షన్ల నివారణ, నియంత్రణకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లల ఆసుపత్రుల్లో అధికం.. మన దేశంలో ఆసుపత్రులకు వచ్చే వారిలో 10 శాతం మంది జీవితంలో ఒక్కసారైనా ఇన్ఫెక్షన్కు గురై ఉంటారని అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 7 శాతంగా ఉంది. ఇన్ఫెక్షన్లు ప్రధానంగా రక్తం, మూత్రం ద్వారా కలుగుతాయి. న్యూమోనియా, జీర్ణకోశ వ్యాధుల్లోనూ సంభవిస్తాయి. కొన్ని రకాల శస్త్రచికిత్సలలో ఆపరేషన్ చేసిన 30 రోజుల తర్వాత కూడా ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో ప్రస్తావించింది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు ఆపరేషన్ చేసిన ఏడాదిలోపు ఎప్పుడైనా సోకే ప్రమాదముంది. వాటిని శస్త్రచికిత్స అనంతర అంటు వ్యాధులుగా పరిగణిస్తారు. జీర్ణకోశ అంటు వ్యాధులు ప్రధానంగా పిల్లల ఆసుపత్రుల్లో లేదా పిల్లల వార్డుల్లో కనిపిస్తాయి. కలుషితమైన వాతావరణం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, చేతులు సరిగా కడుక్కోకపోవడం వంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. బ్యాక్టీరియా కారణంగా పిల్లలకు ఒక్కోసారి తీవ్రమైన విరేచనాలు అవుతాయి. వైద్యం చేయించుకునేందుకు వచ్చే వృద్ధులకు కూడా ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. డయాబెటిస్, కేన్సర్ వంటి రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారికి త్వరగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. సరైన వెంటిలేషన్ లేకపోవడం, అపరిశుభ్రత వల్ల ఇన్ఫెక్షన్లు అధికంగా సోకుతున్నాయి. ఐసీయూ వార్డులు సక్రమంగా లేకపోతే వెంటిలేటర్లపై ఉండే రోగులకు త్వరగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. పరికరాలు సరిగా లేకపోవడం, హెల్త్ ప్రొటోకాల్‌ను పాటించకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. ఇన్ఫెక్షన్ల నియంత్రణకు మార్గదర్శకాలు.. ►ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలి. ►రోగులుండే పడకల మధ్య స్థలం ఒకట్రెండు మీటర్ల దూరం ఉండాలి. రోగిని ఆసుపత్రుల్లో చేర్చే ముందు గదిని శుభ్రం చేయాలి. అంతకుముందు ఉన్న రోగి ఉపయోగించిన అన్ని వస్తువులను తీసివేయాలి. బెడ్ షీట్లు ఉతికినవి వాడాలి. ►చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ►సురక్షితమైన ఇంజెక్షన్లను మాత్రమే వాడాలి. ►ప్రతి వైద్య పరీక్షకు ముందు శుభ్రమైన చేతి తొడుగులు వాడాలి. ►కత్తెరలు, స్ట్రెచర్లు, నీడిల్స్ తదితరమైనవి అత్యంత శుభ్రంగా ఉంచాలి. ►రోగులను చూసేందుకు వచ్చే సందర్శకులపై ఆంక్షలు తప్పనిసరి. ఆసుపత్రుల్లో వారి కదలికను పరిమితం చేయాలి. సందర్శకులు ఆసుపత్రి పడకలపై కూర్చోవడం, పడకలపై పడుకోవడం, కాళ్లు పెట్టడం వంటివి చేయకూడదు. ►సందర్శకులు రోగి గదిలోకి వెళ్లేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో గౌను, మాస్క్ ధరించాలి. ►సందర్శకుల సంచులు, ఇతర వస్తువులను రోగి ప్రాంతం వెలుపల ఉంచాలి. ►వార్డ్ నర్సింగ్ సిబ్బంది, సంబంధిత వైద్యులు రోగి బంధువులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు తెలియజేయాలి. ►12 ఏళ్లలోపు పిల్లలను రోగి దగ్గరకు అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే రోగిని తాకడానికి ముందు, తర్వాత చేతి పరిశుభ్రత పాటించాలి. ►రోగితో కేవలం ఒక సహాయకునికి మాత్రమే అనుమతి ఉండాలి. ►మొబైల్ ఫోన్ల వల్ల కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబటి రోగులు మొబైల్ ఫోన్లను వాడకూడదు. ►సందర్శకుల్లో ఎవరికైనా జలుబు, దగ్గు, దద్దుర్లు లేదా మరేదైనా ఇన్ఫెక్షన్ ఉంటే రోగి దగ్గరకు రానీయకూడదు. ►రోగుల మరుగుదొడ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. సందర్శకులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ►ప్రతి వార్డు, ఐసీయూలు, ఇతరత్రా రోగులుం డే ప్రదేశాలను ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీ సందర్శించాలి. -
జబ్బుల మాటున ఇన్ఫెక్షన్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) వెల్లడించింది. గతేడాది జూన్ వరకు నిర్వహించిన సర్వే వివరాలను ఎన్ఎస్వో అధికారికంగా తాజాగా ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని తేలింది. ఇన్పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 31.4 శాతం మంది ఇన్ఫెక్షన్ సంబంధిత రోగాలతోనే వస్తున్నారని వెల్లడైంది. ఇన్ఫెక్షన్ల తర్వాత ఎక్కువ మంది గాయాలతో వస్తున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో పేగు, గుండె సంబంధిత రోగులు ఉన్నారని సర్వే వెల్లడించింది. అయితే ఇన్ఫెక్షన్ల బారినపడుతున్న వారిలో పురుషులకన్నా మహిళలే ఎక్కువని సర్వే తేల్చింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 31.4 మంది మగవారు, 31.8 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్ సంబంధిత జబ్బులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 31.3 శాతం మంది పురుషులు, 31.4 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్ జబ్బులకు గురువుతున్నారని వెల్లడైంది. కేన్సర్‌కే అత్యధిక ఖర్చు... ఖర్చుల విషయానికి వస్తే అన్నింటికన్నా కేన్సర్ చికిత్స కోసం ఎక్కువ ఖర్చవుతోందని సర్వే వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం సగటున ప్రతి కేన్సర్ రోగికి కనీసం రూ. 61,216 ఖర్చవుతోందని సర్వే తేల్చింది. ఆ తర్వాత గుండె జబ్బులకు ఎక్కువ ఖర్చవుతుండగా రోగాల సంఖ్యలో ఎక్కువగా ఉన్న ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధులకు అతితక్కువ ఖర్చుతో వైద్యం అందుతోందని వెల్లడించింది. -
గుప్పెడు వేపాకులు
►గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి వడకట్టి ఒక బాటిల్లో పోసి ఉంచాలి. స్నానం చేసే బకెట్ నీటిలో కప్పు వేపాకుల నీళ్లు కలపాలి. ఈ నీటితో రోజూ స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, యాక్నె వంటివి మెల్ల మెల్లగా తగ్గిపోతుంటాయి. ►గుప్పెడు వేపాకులను మెత్తగా నూరి రెండు కప్పుల నీటిలో కలిపి మరిగించాలి. ఒక కప్పు అయ్యేవరకు మరగనిచ్చి, చల్లారనివ్వాలి. ఈ నీళ్లలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి, చల్లటి నీళ్లతో కడిగేయాలి. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నె నుంచి విముక్తి లభిస్తుంది. పోర్స్‌లో మలినాలు శుభ్రపడతాయి. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. -
వ్యాయామంతో తీవ్రమైన ఆయాసం
నా వయసు 34. నాకు దుమ్ము సరిపడదు. డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ముకు ఎక్స్పోజ్ అయితే ఆయాసం వస్తుంటుంది. వింటర్ వచ్చింది కదా అని వ్యాయామం చేయదలచినప్పుడల్లా నాకు ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. వ్యాయామ ప్రక్రియ ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడటంతో పాటు తేమపూరితమవుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... ►పొడి దగ్గు వస్తుండటం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ►పిల్లికూతలు వినిపించడం వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ►వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకో డయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే దేహానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? నాకు కొద్దినెలలుగా నెలలుగా దగ్గు, విపరీతమైన ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? దయచేసి తగిన సలహా ఇవ్వండి. పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపతిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెకండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోళ్ల దాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్ఫ్లమేషన్ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్లలో నిపుణులైన పల్మునాలజిస్ట్లను సంప్రదించండి. డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
గ్యాస్ట్రిక్ అల్సర్ నయమవుతుందా?
నా వయసు 35 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి అల్సర్ అన్నారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ►80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి ►చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ... జాగ్రత్తలు: ►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, ►పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ►కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఆటిజమ్ తగ్గుతుందా? మా బాబుకు మూడున్నర ఏళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో ఈ సమస్యకు చికిత్స అందుబాటులో ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడే వారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారికి స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలను బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ తిరగబెట్టడం మామూలే. కారణాలు: ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
తల్లి వైద్యం
‘నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అంటారు. రూపమ్ విషయంలో మాత్రం ‘చైల్డ్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అనుకోవాలి. కూతురు కలిగించిన అవసరం కారణంగా ఆ తల్లి ఓ దివ్యౌషధాన్ని కనిపెట్టారు మరి! తెలంగాణలో ఉంటున్న రూపమ్ సింగ్ ఓ రెండేళ్ల నుంచి ఎగ్జిబిషన్లలో ఒక టేబుల్ వేసుకుని ఒక స్టాల్ పెడుతోంది. ఆమె ఒక చిన్న కుటీర పరిశ్రమ నిర్వాహకురాలిగా ప్రపంచానికి పరిచయమై నిండా ఐదేళ్లు కూడా కాలేదు. ‘‘గృహిణిగా ఉన్న మీరు పరిశ్రమ ఎప్పుడు స్థాపించారు. చిన్న పాపాయిని చూసుకుంటూ, పరిశ్రమను నడిపించడం ఇబ్బందిగా అనిపించడం లేదా’’ అని తెలిసినవారెవరైనా అడిగితే ఆమె చెప్పే సమాధానం ఒక్కటే.. నా పరిశ్రమ వయసు... పాపాయి వయసుకు ఒక ఏడాది తక్కువ. నన్ను పారిశ్రామిక వేత్తను చేసింది నా పాపాయే’’ అని నవ్వుతుంది. మరో క్షణంలో పాపాయికి ఎదురైన చర్మ సమస్య గుర్తుకు వచ్చి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. గాలి కూడా పడేది కాదు! ‘‘మా పాపకు పుట్టినప్పటి నుంచి చర్మ సమస్య ఉంది. ఎన్ని క్రీములు రాసినా తగ్గేది కాదు. ఎంతమంది డెర్మటాలజిస్టులను కలిశానో లెక్కే లేదు. మార్కెట్లో ఉన్న రకరకాల లోషన్లు రాశాను. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే... పాపాయి పాకుతూ కార్పెట్ మీదకు వెళ్లిందంటే ఆ వెంటనే ఒళ్లంతా ఎర్రగా దద్దుర్లు వచ్చేవి. కార్పెట్‌లో దాగిన దుమ్ము కణాల వల్ల అలా అవుతుందని కార్పెట్ తీసేశాను. పాపాయి తిరిగే నేలను తళతళ మెరిసేలా తుడిచేదాన్ని. అయినా ర్యాష్ వస్తూనే ఉండేది. ఆఖరుకు నేను దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నా ... వెంటనే బుగ్గంతా గరుకు తేలి ఎర్రగా అయ్యేది. చివరకు ఇంటి నాలుగ్గోడలు దాటలేని పరిస్థితి వచ్చింది. చెట్ల గాలి కోసం పాపాయిని బయటకు తీసుకెళ్లినప్పుడు.. ఒంటికి ఏమీ తగలకుండా చూసుకున్నా కూడా గాల్లోని ఇన్ఫెక్షన్ ఒంటిని ఎర్రబార్చేది. డాక్టర్లు ఎగ్జిమా అని రకరకాల మందులిచ్చేవారు. అవి రాస్తే మరింత మంటగా అనిపించేదో ఏమో... పాపాయి ఇంకా ఎక్కువగా ఏడ్చేది. అలా తొమ్మిది నెలల వరకు బాధపడింది. నా అదృష్టమో, పాపాయి అదృష్టమో కానీ అప్పుడు ఒక డాక్టర్ ఇచ్చిన సలహా మా జీవితాలను మార్చేసింది. ఇల్లే ఔషధాలయం మా అమ్మమ్మ, నానమ్మలు మాకోసం చిన్నప్పుడు వాడిన దినుసుల జాబితా రాసుకుని వాటి కోసం మార్కెట్లో ప్రయత్నించాను. కొన్ని దొరకలేదు. దాంతో వాటిని ఇంట్లోనే తయారు చేయడానికి సిద్ధమయ్యాను. స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆ నూనెలో మరికొన్ని దినుసులు కలిపి తైలం తయారు చేసుకుని పాపాయి ఒంటికి రాశాను. సింథటిక్ వస్త్రాలను మానేసి మెత్తటి కాటన్ దుస్తులు మాత్రమే వేశాను. ఇలా నాలుగు వారాల్లోనే చర్మంలో మార్పు కనిపించింది. రెండు నెలలకంతా పాపాయి చర్మం లేత తమలపాకులాగా మారిపోయింది. పాపాయిని చూసిన బంధువులు, పక్కిళ్ల వాళ్లు ‘‘ఏం మందులు వాడారు? ఎలా తగ్గింది?’’ అని ప్రశ్నలు. నేను చేసింది చెప్పిన తర్వాత చాలా మంది రొటీన్ స్కిన్ కేర్ కోసం క్రీమ్‌లు, తైలాలు అడిగి చేయించుకునే వారు. మొదట్లో ఫ్రీగా చేసిచ్చాను. ఇలా ఉచితంగా ఇస్తుంటే– తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు తీసుకోమనేవాళ్లు. దినుసులకు అయిన ఖర్చు మాత్రం తీసుకుని చేసిచ్చాను. దీనినే ఒక బ్రాండ్‌నేమ్‌తో చేయమని మా చెల్లెలు అనుపమ్ సలహా ఇవ్వడంతో 2014లో ‘ప్రకృత’ అనే పేరుతో రిజిస్టర్ చేశాను. ప్రకృతి ఇచ్చిన సహజసిద్ధమైన వస్తువులతో, ఎటువంటి రసాయనాలు లేకుండా తైలాలు, లేపనాలు చేస్తున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే మా పాపాయి కోసం ఎలా చేశానో, మార్కెట్ కోసం కూడా అలానే చేస్తున్నాను. ఇప్పుడు నాకిది ఒక వ్యాపకంగా మారిపోయింది’’ అని చెప్తుంది రూపమ్. ఇన్ని విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్తారామె, ఆఖరుకు తన క్రీమ్‌ల ఫార్ములాలను కూడా. తన పాపాయి పేరు తప్ప! – మంజీర -
నగరంలో పెరుగుతున్న పావురాలతో వ్యాధుల ముప్పు..!
సాక్షి,సిటీబ్యూరో: శాంతికి చిహ్నమై..భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు... ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? ఆహ్లాదం కోసమో లేక పుణ్యం వస్తుందన్న విశ్వాసంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ప్రస్తుతం కేరళను వణికిస్తున్న ప్రాణాంతక ‘నిఫా’ వైరస్ తరహా ఉపద్రవం భవిష్యత్తులో పావురాల వల్ల వచ్చే ప్రమాదం పొంచి ఉందా...? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నారు వైద్యనిపుణులు, పరిశోధకులు. పావురాల సంఖ్య పెరిగితే భవిష్యత్‌లో రాజధాని గ్రేటర్ హైదరాబాద్ రోగాల అడ్డాగా మారడం తథ్యమని హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయన నివేదిక హెచ్చరిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న పావురాల సంఖ్య ... గ్రేటర్ హైదరాబాద్‌లో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షలకు పైగా ఉండొచ్చని నిపుణుల అంచనా. పావురాలతో ఎదురయ్యే ప్రమాదాలపై ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం హైదరాబాద్‌లో తొలిసారి అధ్యయనం చేపట్టింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించకపోతే త్వరలోనే ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వాసుదేవరావు హెచ్చరిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఆయన ఆధ్వర్యంలోని బృందం అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనంలోని ప్రాథమిక అంశాలను 2017లో ‘సాక్షి’ తొలిసారి ప్రజల ముందుకు తెస్తోంది. గత రెండేళ్లలో పావురాల సంఖ్య లక్ష వరకు పెరిగిందని, వాటి సంఖ్యను వెంటనే నియంత్రించేందుకు ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని వాసుదేవరావు సూచిస్తున్నారు. లేనిపక్షవలో నిఫా వైరస్ కలకలంతో కేరళవాసులు ఎలా భయపడుతున్నారో హైదరాబాద్‌వాసులు సైతం పావురాలను చూసి వణికిపోవాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరలో తమ అధ్యయనాన్ని ముగించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అధ్యయనం తుది అంకంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ సాయంతో ప్రత్యేక వివరాలను సేకరించనున్నారు. ప్రాణహాని ఇలా... పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా కూడా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీనిని సాధారణ సమస్యగా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే అది పక్షవాతానికి దారితీసి, చివరకు మృత్యువుకు కారణమవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు పేర్కొన్నారు. అయితే అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తించడం లేదన్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉన్నందున ఇప్పుడు మేల్కొనకుంటే నగరం రోగాల అడ్డాగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవీ వాస్తవాలు... ♦ శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ♦ హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పు డు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ♦ భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. విదేశాల్లో నిషేధం... సెంట్రల్ లండన్‌లో పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో దాణా వేయడాన్ని నిషేధించారు. 2003లోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సెంట్రల్ లండన్ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో దాణా వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించి తాజాగా ఆయా ప్రాంతాల్లో నిషేధాన్ని విధించడంతోపాటు నియంత్రణ చర్యల అమలు చేస్తోంది. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పావురాలకు దాణా వేస్తే 500 పౌండ్ల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. సింగపూర్ తదితర నగరాల్లోనూ జరిమానాలు, హెచ్చరికలతో ప్రజలను కట్టడి చేస్తున్నారు. దాణా వేస్తున్నందునే పావురాల సంఖ్య భారీగా పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటోందని గుర్తించిన పలు అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ ప్రధాన నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు దాణా వేయడంపై నిషేధం విధిస్తున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం పావురాలకు విచ్చలవిడిగా దాణా వేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఈసారి డెంగీతో డేంజరస్ డబుల్ ధమాకా!..
సాధారణంగా షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తుంటాయి. చిత్రం ఏమిటంటే... అటాంటి డబుల్‌ధమాకానే ఈ సారి ఈ సీజన్లో ఈ దోమ కూడా ఇస్తోంది. రెండు జబ్బులనూ వ్యాప్తి చేయగల ఈ దోమ కావడం వల్ల ఇది డెంగీనీ, చికన్గున్యాను కలిసి డెంజరస్ డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తోంది. డెంగీ మళ్లీ విజృభించింది. టైగర్ దోమ తన పంజా విసిరి ఇరు రాష్ట్రాలనిప్పుడు అల్లకల్లోలం చేసేస్తోంది. డెంగీ వైరస్‌ను ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వ్యాప్తి చేసే విషయం తెలిసిందే కదా. ఈ దోమనే వాడుక భాషలో టైగర్ మస్కిటో అని కూడా అంటారు. డెంగీను వ్యాప్తి చేసే ఇదే దోమ ఇప్పుడు చికన్గున్యాను కూడా తెస్తోంది. మిక్స్డ్ ఇన్ఫెక్షన్ జ్వరాలుగా ఈ సీజన్లో ఈ వ్యాధులు వస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే డెంగీపైనా, ఈ మిక్స్డ్ ఇన్ఫెక్షన్పైన అవగాహన పెంచుకోడాల్సిన అవసరం ఉంది. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. నిజానికి డెంగీ కూడా చాలా రకాల వైరల్ జ్వరాల్లాగే తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) వ్యాధి. కానీ కొంతమంది వ్యాధిగ్రస్తుల్లో వారి ప్లేట్లెట్లు ప్రమాదకర స్థాయి కంటే కిందికి పడిపోతాయి. దాంతో అది చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటివారి విషయంలో మాత్రం చాలా అప్రమత్తత అవసరం. అది మినహా మిగతా అందరికీ ఇది లక్షణాలకు చేసే వైద్యచికిత్స (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్)తోనే తగ్గిపోతుంది. కాకపోతే రోగి ప్రమాదకరమైన పరిస్థితిల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక ప్లేట్లెట్లు పడిపోయిన కారణంగా రోగిలోని అంతర్గత అవయవాల్లోకి రక్తస్రావమయ్యే పరిస్థితి రోగికి వచ్చినప్పుడు మాత్రం అలాంటి వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. అలాంటి కేసులు మినహాయిస్తే డెంగీ అనేది మనం అనుకున్నంత ప్రమాదకరం కాదని గుర్తిస్తే, దాని గురించి ఉన్న అపోహలతోనూ, వ్యాధి పట్ల ఉన్న దురభిప్రాయాలతో కలిగే ఆందోళన తగ్గుతుంది. డెంగీలో రకాలు డెంగీలో మూడు రకాలు ఉన్నాయి. అవి... 1 ఎలాంటి హెచ్చరికలూ చూపకుండా వచ్చే సాధారణ డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) 2 కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) 3 తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) లక్షణాలు ►హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా కనిపించే డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : ఈ తరహా డెంగీ వచ్చిన వారు సాధారణంగా డెంగీ విస్తృతంగా వస్తున్న ప్రాంతంలో నివసిస్తున్న వారై ఉంటారు. వైద్యపరిభాషలో ఇలా డెంగీ విస్తృతంగా ఉన్న ప్రాంతాలను ఎండెమిక్ ప్రాంతాలుగా చెబుతుంటారు. ఇలాంటి చోట్ల ఉన్న వారిలో జ్వరం, వికారం/వాంతులు, ఒళ్లంతా నొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్), ఒంటి మీద ర్యాష్ వంటి బయటి లక్షణాలు కనిపిస్తాయి. వీరికి టార్నికేట్ అనే పరీక్ష చేస్తారు. దీంతో పాటు సాధారణ రక్తప్రరీక్ష చేసినప్పుడు డెంగీ వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్తకణాల సంఖ్య బాగా తక్కువగా కనిపిస్తుంది. ►హెచ్చరికలతో కనిపించే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : పై లక్షణాలతో పాటు పొట్టలో నొప్పి, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం కొందరిలో పొట్టలోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం అవుతుండటం, రోగి అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికి ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా రోగి తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి (పల్మునరీ ఎడిమాతో) శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్రమైన రక్తస్రావం కారణంగా రోగి స్పృహకోల్పోవడం లేదా పాక్షికంగానే స్పృహలో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతర్గత అవయవాలు తమ విధులు నిర్వహించడంలో విఫలం అవుతాయి. అంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే కండిషన్ ఏర్పడి చాలా కీలకమైన అవయవాలు పనిచేయకుండా మొరాయిస్తాయి. ►మిక్స్డ్ ఇన్ఫెక్షన్లో భాగంగా చికన్గున్యాతో పాటు వస్తే... అలాంటప్పుడు మరింత ఎక్కువగా ఎముకలు, కీళ్ల నొప్పులు (జాయింట్ పెయిన్స్) ఉంటాయి. డెంగీలో కంటే మిక్స్డ్ ఇన్ఫెక్షన్లో ఈ నొప్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. డెంగీలో మరింత ప్రమాదకరమైన మరికొన్ని లక్షణాలివీ... ►ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన అంతర్గత అవయవాలలోకి రక్తస్రావం అయ్యే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితితో పాటు మరికొన్ని సందర్భాల్లో కొన్ని ఇతర లక్షణాలూ రోగుల్లో కనిపిస్తుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది ఒంట్లో నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్). ►కొందరిలో కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. హార్ట్‌బీటింగ్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల మెదడు దెబ్బతినే (బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే) ప్రమాదమూ ఉంది. మన వ్యాధినిరోధక వ్యవస్థ (పూర్తి ఇమ్యూన్ సిస్టమే) డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ►గుండె స్పందనలు (హార్ట్‌బీట్) 60 కంటే తక్కువకు పడిపోవడం అన్నది చాలా ప్రమాదకరమైన సూచన. రోగికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్‌లో ఉంచాల్సిన అవసరం ఏర్పడవచ్చు. నివారణే ఎంతో మేలు అన్ని వ్యాధుల లాగే డెంగీ విషయంలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగ్యూ వచ్చేందుకు దోహదపడే టైగర్‌దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే కుడుతుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తపడాలి. వీలైతే వారంలో ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి. ►ఇంట్లోని మూలల్లో.. చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశాల్లో ఎడిస్ ఎజిపై్ట అవాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అయితే అదే సమయంలో బయటి నుంచి దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించుకోడానికి తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకోవడం చాలా మంచిది. ►ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి ప్రదేశాల్లో మనకు తెలియకుండానే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. అందుకే ఇంటి పరిసరాల్లో ఉండే ఇలాంటి వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. ఇంట్లో వాడని డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టడం మంచిది. అలాగే వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించ వచ్చు. ►ఇది పెద్దగా ఎత్తులకు ఎగరలేదు. అందుకే కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు తొడుక్కోవడం చాలా రక్షణ ఇస్తుంది. అలాగే చేతుల విషయంలోనూ ఫుల్‌స్లీవ్ మంచివి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా షార్ట్స్ లాంటి వాటికి బదులుగా ఒంటిని నిండుగా కప్పిచేసే దుస్తులనే ధరించాలి. కాళ్లనూ కవర్చేసే పైజామాలు, రాత్రిపూట కూడా సాక్స్ వేసుకుని నిద్రించడం మంచిది. ►ఏడిస్ ఈజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ►దోమలను దూరంగా తరిమివేసే మస్కిటోరిపలెంట్స్ వాడటం మేలు. పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్ వాడవచ్చు. (పికారిటిన్ లేదా ఆయిల్ ఆఫ్ లెమన్ యూకలిప్టస్ లేదా ఐఆర్3535... కంపోజిషన్లోని ఈ మూడింటిలో ఏది ఉన్నా ఆ రిపల్లెంట్స్ వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్ ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. అయితే ముఖం మీద స్ప్రే చేసుకునే సమయంలో ఇవి కళ్ల దగ్గర స్ప్రే కాకుండా జాగ్రత్త పడాలి. వ్యాక్సిన్ అందుబాటులో ఉంది... అయితే ? ఇప్పుడు డెంగీకి టీకా (వ్యాక్సినేషన్) అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు ఈ టీకాను గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండోసారి డెంగీ రావడం చాలా ప్రమాదకరం కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని నివారించేందుకు ఈ టీకా తోడ్పడుతుంది. అంటే అంతర్గత అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం అయి రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. సాధారణ డెంగీ నివారణకు దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రమాదకర పరిస్థితులకు ముందస్తు సంకేతాలివి ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చిగుర్ల్లలోంచి కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అలాగే ఒంటి మీద (చర్మం కింద) రక్తపు మచ్చల్లాంటివి కనిపిస్తే అది డెంగ్యూకు ముందస్తు స్థితి అన్నమాట. ఇలాంటి మచ్చలనే వైద్యపరిభాషలో ‘పిటేకియే’ అంటారు. దీన్ని బట్టి డెంగీని గుర్తించవచ్చు. మొదటి సారి కంటే... తర్వాతి వాటితోనే మరింత డేంజర్ సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగీ కంటే... ఒకసారి వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగీని సంక్రమింపజేసే వైరస్‌లో నాలుగు రకాలున్నాయి. అదే రకం వైరస్ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకోరకమైన డెంగీ వైరస్ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. అందుకే మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. చికిత్స... డెంగీ అనేది వైరస్ కారణంగా వచ్చే వ్యాధి కాబట్టి దీనికి నిర్దిష్టంగా మందులేమీ ఉండవు. అందువల్ల కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచే నోటిద్వారా లవణాలతో కూడిన ద్రవాహారం (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్– ఓఆర్ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి షాక్‌లోకి వెళుతుంటే అప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల నుంచి 15 వేలు అంతకంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. వాటిని ఎప్పుడు ఎక్కించాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగీ ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగీ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. ఆ సాధారణ మందులు...డెంగీ రోగులకు ఎంతో ప్రమాదం సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగీ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. ఇది మరింత ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోడాల్సిన విషయం. ►ప్లేట్లెట్లు తగ్గుతున్నప్పుడు ప్రతి రోజూ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష రోజుకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయాల్లో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు బాగా నీరసంగా ఉన్నా... దాంతో పాటు రక్తపోటు (బీపీ) పడిపోతూ ఉన్నా వెంటనే హాస్పిటల్లో చేరడం అవసరం. డెంగీ లక్షణాలు కనిపిస్తే యాంటీబయాటిక్స్ వద్దు చాలా మంది గ్రామీణ డాక్టర్లు డెంగీ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగీ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. డాక్టర్ల విచక్షణ, సలహా మేరకే ఇతర మందులు కూడా ఇక మనం వాడే చాలారకాల ఇతర మందులు సైతం ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ర్యానిటడిన్, సెఫలోస్పోరిన్, క్యాప్టప్రిల్, ఏసీ ఇన్హిబిటార్స్, బ్రూఫెన్, డైక్లోఫినాక్, యాస్పిరిన్ వంటి అనేక మందులు ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించడం లేదా ప్లేట్లెట్ ఫంక్షన్‌ను ప్రభావితం చేయడం చేస్తాయి. అందుకే మరీ అత్యవసరం అయితే తప్ప డెంగీ లక్షణాలు కనిపిస్తే వారికి యాంటీబయాటిక్స్‌తో పాటు ఇతర రకాల మందులు వాడటం సరికాదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వాడాలి. డెంగీ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ ఉండదు. కొందరిలో మినహాయించి అది అంతరిలోనూ ప్రమాదకరం కాదు. అందుకే ఎప్పటికప్పుడు తమ ప్లేట్లెట్ల కౌంట్‌ను పరిశీలిస్తూ... నయమయ్యే వరకు అప్రమత్తంగా ఉంటే చాలు. నిర్ధారణ పరీక్షలు ►సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ►డెంగీ నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు. ►డెంగీ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువే కాబట్టి అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఇప్పుడు మరింత అధునాతనమైన నిర్ధారణ పరీక్ష ఇప్పుడు అత్యంత అధునాతమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. అదే ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష. అయితే ఇది పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్లేట్లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్లకు సంబంధించిన కచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పత్తికి తోడ్పడే ఎముకలోని భాగమైన బోన్‌మ్యారో పనితీరు కూడా ఈ పరీక్షతో తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటి చికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఆ మేరకు ప్లేట్లెట్స్ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్‌మ్యారోలో లోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్ ప్రాణాలను కాపాడతారు. ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం రోగులందరికీ ఉండదు ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే... డెంగీకి గురైన ప్రతి పేషెంట్‌కీ ప్లేట్లెట్ల మార్పిడి అవసరం ఉండదు. కేవలం ప్రమాదకరమైన స్థాయిలో ప్లేట్లెట్లు పడిపోయిన వారికి మాత్రమే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనే ఈ చికిత్స చేస్తారు. మిక్స్డ్ ఇన్ఫెక్షన్తో ఈసారి మరింత ప్రత్యేకం...! ఈసారి వస్తున్న డెంగీకి మరో ప్రత్యేకత ఉంది. ఈ సీజన్లో వస్తున్న వైరల్ జ్వరాల్లో డెంగీతో పాటు చికన్‌గున్యా ఫీవర్స్ కలిసి వస్తున్నాయి. అంటే ఒకరకంగా చెప్పాలంటే ‘మిక్సిడ్ ఇన్ఫెక్షన్’లాగా వస్తోంది. సాధారణంగానే డెంగీలో ఎముకల నొప్పి ఉంటుంది. పైగా దీనితో పాటు చికన్‌గున్యా తోడవ్వడంతో ఎముకల్లో నొప్పి మరింత తీవ్రస్థాయిలో ఉంటోంది. ఒకవేళ అది మిక్స్డ్ ఇన్ఫెక్షన్ అయితే.. డెంగీకి ఇచ్చే చికిత్సతో పాటు ప్రతి ఆరుగంటలకు ఒకసారి పార్సిటమాల్ టాబ్లెట్ ఇవ్వాలి. దీనివల్ల జ్వరం, నొప్పులు రెండూ తగ్గుతాయి. అదే కేవలం డెంగీకి అయితే ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి పారసిటమాల్ ఇస్తారు. మూడు రోజులు మాత్రం ఇచ్చి ఆ తర్వాత ఆపేస్తారు. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ పెరిగి డెంగీ నుంచి కోలుకున్న తర్వాత చికన్‌గున్యాకు అవసరమైన చికిత్స ఇస్తారు. ఎందుకంటే చికన్గున్యాతో వచ్చే నొప్పులు నెలల తరబడి ఉంటాయి కాబట్టి నొప్పులు తగ్గడానికి అవసరమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వరుసగా అబార్షన్స్ అవుతున్నాయి... సంతానం కలుగుతుందా?
నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ►ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ►గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ►గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ►గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ►కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ►వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ►రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్ తలనొప్పి... చికిత్స ఉందా? నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? తరచూ తలనొప్పి వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత కచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్‌స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ బాబుకు ఆటిజమ్... చికిత్స ఉందా? మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవడలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
బాబుకు పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో ఎరుపు
మా బాబుకి తొమ్మిదేళ్లు. మూడు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంసీయూ... ఇలా కొన్ని టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్ నార్మల్ అనే వచ్చాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ అని యాంటిబయటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు మళ్లీ బాధ పడుతున్నాడు. పదిరోజుల కిందట మళ్లీ మూత్రంలో రక్తం పడింది. డాక్టర్ దగ్గరకెళితే మళ్లీ పరీక్షలు చేశారు. అవి కూడా నార్మలే. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, రక్తం ఎందుకు పడుతోంది? మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకూ ఎలాంటి ప్రమాదం ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచన. పిల్లల యూరిన్‌లో రక్తం కనబడానికి గల కొన్ని కారణాలు: మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యున్లాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ కాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా కాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ప్రధానం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి. మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్‌లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండటం ముఖ్యం. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను మీ డాక్టర్‌తో మరోసారి చర్చించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. రోజుల పాప... తలలో తెల్ల వెంట్రుకలు మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్‌కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్‌ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి. పాపకు తలలో ర్యాష్... పరిష్కారం చెప్పండి మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా డాక్టర్గారికి చూపించాం. మొదట తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచనా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్. పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనకభాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
బాబుకు తరచూ విరేచనాలు... తగ్గేదెలా?
మా బాబుకు రెండేళ్లు. రెండు నెలల క్రితం వాడికి చాలా ఎక్కువగా విరేచనాలు అయ్యాయి. అప్పుడు హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పట్నుంచీ తరచూ విరేచనాలు అవుతున్నాయి. మందులు వాడినప్పుడు కొద్దిగా తగ్గి, వెంటనే మళ్లీ పెరుగుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? మీరు వివరించిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి దీర్ఘకాలిక (క్రానిక్) డయేరియా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలా విరేచనాలు రెండు వారాలకంటే ఎక్కువగా కొనసాగితే వాటిని దీర్ఘకాలిక డయేరియాగా పరిగణించవచ్చు. దీర్ఘకాలిక డయేరియాకు మన పరిసరాలను బట్టి ఇన్ఫెక్షన్స్ ప్రధాన కారణం. వైరల్, బ్యాక్టీరియల్, పోస్ట్ ఇన్ఫెక్షియస్, ట్రాపికల్ స్ప్రూ వంటివి ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి. ఈ అంశాలతోపాటు ఎంజైమ్స్, ఆహారం అరుగుదలలో మార్పులు... అందులోనూ మరీ ముఖ్యంగా చక్కెర పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలలో మార్పులు కూడా ఇందుకు కారణాలు కావచ్చు. వాటితో పాటు ఇమ్యూనలాజికల్, అలర్జిక్ వంటి అంశాలు కూడా విరేచనాలకు కారణమవుతాయి. అలాగే పేగుల స్వరూపంలో లోపాలు (స్ట్రక్చరల్ డిఫెక్ట్స్) కూడా కారణం కావచ్చు. పేగుల కదలిక (మొటిలిటీ)లో మార్పులు కూడా విరేచనాలకు దోహదం చేస్తాయి. వీటికి తోడు ఎండోక్రైన్ కారణాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక కారణాల వల్ల పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు రావడం జరుగుతుంటుంది. పిల్లల్లో వాళ్ల బరువు / ఎదుగుదల నార్మల్‌గా ఉంటే చాలావరకు తీవ్రమైన (సీరియస్) అంశాలు అందుకు కారణం కాకపోవచ్చు. అంటే... ఐబీడీ, ఎంజైముల్లో లోపాలు, అనటామికల్ లోపాలు, ఇమ్యూనలాజికల్ సమస్యల వంటివి అందుకు కారణం అయ్యే అవకాశం పెద్దగా లేదు. ఇక పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు అవుతున్న సందర్భంలో కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్ (క్రానిక్ డయేరియా వర్కప్), కొన్ని స్పెషల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంజైమ్ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇంటస్టైనల్ బయాప్సీ, మైక్రో బయలాజికల్ పరీక్షలు, ఇంటస్టినల్ మార్ఫాలజీ పరీక్షలు, ఇమ్యూనలాజికల్ పరీక్షలు చేయించడం వల్ల నిర్దిష్టంగా కారణాన్ని తెలుసునే అవకావం ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబుకు ‘పోస్ట్ ఎంటరైటిస్’ అనే కండిషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే... ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక లోపల జరిగిన నష్టం (డ్యామేజీ) వల్ల కొన్ని ఆహారాల పట్ల అతడి కడుపు సెన్సిటివిటీని వృద్ధి చేసుకొని ఉండవచ్చు. దీనివల్ల పదే పదే మోషన్స్ అవుతుండవచ్చు. అయితే మీ బాబు వయసున్న పిల్లల్లో కొన్నిసార్లు రోజుకు 3 నుంచి 6 సార్లు విరేచనాలు కావడం నార్మల్‌గా కూడా జరగవచ్చు. దీన్ని ‘టాడ్లర్స్ డయేరియా’ అంటారు. మీ బాబు తీసుకున్న ఆహారం అతడి ఆహారకోశంలో ఉండాల్సిన టైమ్ కంటే తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ గట్ ట్రాన్జిట్ టైమ్) కూడా ఒక కారణం కావచ్చు. పై కండిషన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. తీసుకునే ఆహారంలో కొద్దిగా ఫైబర్ తగ్గించడం, చక్కెర పదార్థాలను పూర్తిగా మానేయడం ద్వారా గట్‌ఫ్లోరా పూర్తిగా రీప్లేస్ చేయడం వల్ల ఈ కండిషన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ ఇవ్వడం, ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం వల్ల పై కండిషన్లను పూర్తిగా నయం చేయవచ్చు. అప్పటికీ డయేరియా లక్షణాలు తగ్గకుండా ఉంటే ఇతర కారణాలను కనుగొని, వాటికి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. మాటిమాటికీ జ్వరం... నయమయ్యేదెలా? మా బాబుకు పది నెలలు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా తరచూ జ్వరం వస్తోందంటున్నారు. మాకు ఆందోళనగా ఉంది. తగిన పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’గా చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లోనూ చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, వ్యాధి నిరోధక శక్తి, మూత్ర కోశ అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలు, విసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపలే మిగిలిపోవడం (వాయిడింగ్ డిస్ఫంక్షన్), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ చేయడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్లా కూడా ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో జ్వరం, త్వరగా చిరాకు పడటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాల ఉంటాయి. వాటి సహాయంతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను డయాగ్నోజ్ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థ (జెనిటోయూరినరీ సిస్టమ్)కు సంబంధించి ఏదైనా లోపాలు (అబ్నార్మాలిటీస్) ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరిగా అవసరం. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), కిడ్నీ అబ్నార్మాలిటీస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎమ్సీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు తప్పక చేయించాలి. పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) ఉన్నట్లు బయటపడితే... వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ (పైలో నెఫ్రైటిస్) సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తాగేలా వారికి అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలపై అవగాహన పెంచుకొని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
వరుసగా అబార్షన్స్...సంతానం కలుగుతుందా?
నా వయసు 33 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడుసార్లు అబార్షన్ అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? మీకు జరిగినట్లు ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ►ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ►గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ►గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ►గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ►కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ►వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ►రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ వేరికోస్వెయిన్స్తగ్గుతాయా? నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఇందులో శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ►కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ►ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: ►కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ►కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ►చర్మం దళసరిగా మారడం ►చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ స్పాండిలోసిస్‌కు పరిష్కారం ఉందా? నా వయసు 45 ఏళ్లు. గత కొన్ని నెలల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు: ►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు ►జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ►స్పైన్ దెబ్బతినడం వల్ల ►వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు: సర్వైకల్ స్పాండిలోసిస్: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్: నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స: రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఇంత పసిదానికి ఈ గురక ఏమిటి?
మా పాపకు ఐదున్నర నెలలు. తాను పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవల ఆ శబ్దం మరీ ఎక్కువయ్యింది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే తగ్గిపోతుందన్నారు. పాప సమస్య ఏమిటి? మాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. పిల్లి కరిచింది... సలహా ఇవ్వండి మా బాబుకి ఐదేళ్లు. వాడు ఆడుకుంటూ, ఆడుకుంటూ పిల్లి దగ్గరికి వెళ్లినప్పుడు అది కరిచింది. అది పెంపుడు పిల్లి కాదు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే పూర్తి వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. మావాడి విషయంలో ఆందోళనగా ఉంది. దయచేసి మాకు సరైన సలహా ఇవ్వండి. జంతువుల వల్ల మనుషులకు వచ్చే జబ్బులను, జంతువులు కరవటం వల్ల వచ్చే జబ్బులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ప్రమాదకరమైన జూనోటిక్ వ్యాధులలో రేబిస్ ఒకటి. అందరూ అనుకుంటున్నట్లు రేబిస్ కేవలం కుక్కల ద్వారానే కాక– పిల్లులు, నక్కలు, గబ్బిలాలు, కోతులు, అరుదుగా ఎలుకల వల్ల కూడా కలుగుతుంది. అన్ని జంతువులలో రేబిస్ ఉండకపోవచ్చు. అయితే స్ట్రే యానిమల్స్ కరిచినప్పుడు– దాని ద్వారా రేబిస్ సంక్రమిస్తుందో లేదో అని నిర్ధారణకు అయ్యేవరకు వాటికి రేబిస్ ఉన్నట్లుగానే పరిగణించి, జంతువు కాటుకు గురైన వారికి చికిత్స చేయాలి. ఒక వేళ కరిచిన జంతువు పదిరోజులలోపు చనిపోయినా లేదా అది రేబిస్ ఉన్న జంతువు అని నిర్ధారణ అయినా పూర్తి ట్రీట్మెంట్ ఎంతైనా అవసరం.జంతువుల వల్ల అయిన గాయాన్ని మూడు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. గాయం 2, 3 కేటగిరీలకు చెందినదైతే వైద్యం తప్పనిసరిగా చేయించవలసి ఉంటుంది. వ్యాక్సిన్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా కేటగిరీని బట్టి 3 నుంచి 5 సార్లు యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జంతువులు విపరీతంగా కరిచినప్పుడు వ్యాక్సిన్‌తో పాటు యాంటీ రేబిస్ ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి. కరిచిన జంతువుకు రేబిస్ లేకపోయినా ఇది తప్పనిసరి. మామూలుగా మన పరిసరాలలో తిరిగే జంతువులు గీరటం లేదా కరవటం జరిగినప్పుడు మొదటి పదిరోజుల్లో ఆ జంతువుకి ఎటువంటి హాని జరగకపోతే మొదటి మూడు డోసులతో వ్యాక్సిన్‌ను నిలిపివేయవచ్చు. ఇంత చిన్న బాబుకూ తలనొప్పా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల వాడు తరచూ తలనొప్పి అంటూ ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు వాంతులు కూడా అవుతున్నాయి. కొన్నిసార్లు కాసేపు నిశ్శబ్దంగా పడుకోబెడితే తలనొప్పి తగ్గుతోంది. కానీ చాలాసార్లు మాత్ర వేస్తేగానీ తగ్గడం లేదు. కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని కూడా చెబుతున్నాడు. మా బాబు సమస్య ఏమిటి? వాడికి తగ్గేదెలా? మీరు చెబుతున్న దాన్ని బట్టి మీ బాబుకు తరచూ తలనొప్పి ఒకింత తీవ్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. చిన్న పిల్లలతో పాటు టీనేజర్లలో తలనొప్పి రావడం మామూలే. పిల్లల్లో పదేపదే తీవ్రమైన తలనొప్పులకు కారణాలు అనేకం. వాటిలో ముఖ్యమైన వాటిల్లో మైగ్రేన్ ఒకటి. ఇక దీనితో పాటు టెన్షన్ హెడేక్, అటనామిక్ డిస్ట్రబెన్సెస్ వల్ల కూడా తలనొప్పులు రావచ్చు. అలాగే కొన్నిసార్లు కొన్ని సెకండరీ కారణాల వల్ల అంటే... ఇతరత్రా అవయవాల్లో సమస్యల వల్ల... (ఉదాహరణకు సైనసైటిస్, కంటికి సంబంధించిన సమస్యలు లేదా మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు) కూడా తలనొప్పి రావచ్చు. ఇక మీ బాబు విషయానికి వస్తే అది మైగ్రేన్ అని చెప్పవచ్చు. మైగ్రేన్ జబ్బు తరచూ ఒక మాదిరి నుంచి తీవ్రమైన తలనొప్పితో వస్తుంటుంది. ఇది ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా ఉండవచ్చు. కొన్నిసార్లు వికారం, వాంతులు, కాంతిని చూడటాన్ని, శబ్దాలు వినడాన్ని ఇష్టపడకపోవడం, కొన్నిసందర్భాల్లో ఏదో అవయవం బలహీనంగా ఉన్నట్లు అనిపించడం, తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదు నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో 10 శాతం మందికి ఏదో ఒక రూపంలో మైగ్రేన్ కనిపిస్తుంది. తలనొప్పి వచ్చే పిల్లలందరికీ అన్ని పరీక్షలూ అవసరం లేకపోయినప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉండటం లేదా దానితో పాటు నరాలకు సంబంధించిన లక్షణాలు (అసోసియేటెడ్ న్యూరలాజికల్ సింప్టమ్స్) ఉన్న కొద్దిమందిలో మాత్రం కొన్ని ఇమేజింగ్ పరీక్షలు అవసరమవుతాయి. ఇక చికిత్స విషయానికి వస్తే... తలనొప్పి కనిపించిన సందర్భం (అక్యూట్ ఫేజ్)లో ఎన్ఎస్ఏఐడీ గ్రూపు మందులతో తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఇక దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న పిల్లలకు అది రాకుండా నివారించడానికి కొన్ని మందులు... ఉదాహరణకు ఎమిట్రిప్టిలిన్, ప్రొప్రొనలాల్ వంటివి అనేకం ఇప్పుడు వాడుతున్నారు. ఇవి కొన్ని నెలల పాటు వాడటం వల్ల లక్షణాలు మళ్లీ కనిపించకపోవడం లేదా చాలారోజుల పాటు కనిపించకుండా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బిహేవియర్ థెరపీతో నొప్పి తీవ్రత తగ్గి, మంచి మెరుగుదల కనిపిస్తుంది. ఇక మైగ్రేన్‌ను ప్రేరేపించే ట్రిగ్గర్స్... అంటే ఏదైనా పూట ఆహారం తీసుకోకుండా ఉండటం, నీళ్లు తక్కువగా తాగడం, నిద్రలేమి, కెఫిన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమబద్ధంగా ఒకేవేళకు ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేసేవారిలో నొప్పి తీవ్రత తక్కువ. పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
‘చుక్కలు’ చూపిస్తున్నాయి!
రోజూ లక్షల్లో మనదేశంలో స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోతున్నాయి. అయితే అదే సమయంలో కంట్లో వేసే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలోనే అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ మందుల అమ్మకాలు 54 శాతం పెరిగాయి. ఇదేంటి సెల్ఫోన్లకు, చుక్కల మందుకు ఉన్న సంబంధం ఏంటనుకుంటున్నారా?.. స్మార్ట్ ఫోన్లే మన కళ్లలో నీళ్లను ఆవిరి చేసేస్తున్నాయి.. ఐ డ్రాప్స్ కంపెనీల లాభాలు పెంచుతున్నాయి. స్మార్ట్ ప్రపంచంలో సమస్త సమాచారం చేతికందే దూరంలోనే ఉంటుంది. కాలు కదపకుండా మనకు కావాల్సిన సమాచారం, ఇతర అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కలిగింది. మన అవసరాలు తీర్చడంతోపాటు అవే గ్యాడ్జెట్స్ మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయి. అతిగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లు వాడటం వల్ల మన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగినట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి. 70% మంది కళ్లు పొడిబారిన సమస్యతో బాధపడుతుండగా వారిలో సగం మంది 20 నుంచి 30 మధ్య వయస్సు వారు ఉన్నారు. ఈ సమస్య కారణంగా కంటికి అవసరమైన నీళ్లు ఉత్పత్తి కావడం లే దని ఎయిమ్స్ గతేడాది చేపట్టిన సర్వేలో తేలింది. పదిమందిలో ఏడుగురికి ఇదే సమస్య కంటి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతి పదిమందిలో ఏడుగురు ‘డిజిటల్ విజన్ సిండ్రోమ్’తో బాధ పడుతున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా గడిచిన నాలుగేళ్లలో 54 శాతం కంటి చుక్కల మందుల వ్యాపారం పెరిగింది. కంటికి చేటును తెస్తున్న ‘స్మార్ట్ ’డివైజెస్ మనదేశంలో ఒక వ్యక్తి సగటున రెండు గంటల 39 నిమిషాలపాటు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నట్లుగా ఈ ఏడాది చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆఫీసులో ఉద్యోగి రోజుకు ఆరున్నర గంటలపాటు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను వాడుతున్నట్లుగా మరో సంస్థ వెల్లడించింది. ప్రింట్ అయిన పేజీని చదవడానికి, కంప్యూటర్ లేదా డిజిటల్ స్క్రీన్‌ను చూడటానికి చాలా తేడా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ పేర్కొంది. కంప్యూటర్ స్క్రీన్‌పై వెలుతురులో అక్షరాలను చదవడంలో ఇబ్బందులు ఉంటాయి. గ్లేరింగ్, రిఫ్లెక్షన్, స్క్రీన్‌ను పైకీ కిందకి కదిలించడం వల్ల కంటి సమస్యలు పెరుగుతాయని వెల్లడించింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ల వాడకంతోపాటు ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండటం, వాతావరణ కాలుష్యం, ముఖ సౌందర్య సామగ్రి కళ్లు పొడిబారిపోవడానికి మరో కారణమని ఎయిమ్స్‌లోని ఆప్తమాలజీ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్ తెలిపారు. ఏటా పెరుగుతున్న ఐ డ్రాప్స్ బిజినెస్ కళ్లు పొడిబారిన సమస్యకు సాధారణంగా రిఫ్రెష్ టియర్స్ వాడుతుంటారు. 2014 జూలై నుంచి 2018 జూలై మధ్య ఈ రిఫ్రెష్ టియర్స్ అమ్మకాలు 73 శాతం పెరిగాయి. ఓ కంపెనీ అమ్మకాలు 4,71,000 యూనిట్ల నుంచి 8,15,700 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. మరో బ్రాండ్‌కు చెందిన అమ్మకాలు ఏకంగా 800 శాతం పెరిగాయి. 2014లో ఆ బ్రాండ్ 82,600 యూనిట్లు అమ్మగా, 2018లో 7,45,000 యూనిట్లు అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో కంటి చుక్కల మందుల విభాగంలో 284 కొత్త ఉత్పత్తులను మందుల కంపెనీలు ప్రారంభించాయి. అందులో 45 ఉత్పత్తులు అంటే 15 శాతం కేవలం కళ్లు పొడిబారిన సమస్యకు సంబంధించినవే కావడం గమనార్హం. మిగిలినవి ఐ ఇన్ఫెక్షన్, కంటి చూపు మందగించిన సమస్యలకు వాడే డ్రాప్స్ ఉన్నాయి. -
నేనొక భయానికి లోనవుతున్నాను
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు నేనొక భయానికి లోనవుతున్నాను. మనశ్శాంతి కోల్పోతున్నాను. మా బంధువుల్లో ఒకరికి గర్భంలోనే బిడ్డ చనిపోయింది. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే భయానికి గురవుతున్నాను. ‘స్టిల్‌బర్త్’కు ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ముందస్తు నివారణ మార్గాలు ఉంటే దయచేసి చెప్పండి. – బి. సంగీత, జగిత్యాల ఏడోనెల వచ్చిన తర్వాత నుంచి కడుపులోని బిడ్డ చనిపోవడాన్ని లేదా కాన్పు సమయంలో చనిపోవడాన్ని స్టిల్ బర్త్ అంటారు. స్టిల్బర్త్కి... కొన్ని తెలిసిన, ఎన్నో తెలియని కారణాలు ఉంటాయి. తల్లిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్స్, జ్వరం, తీవ్ర రక్తహీనత, షుగర్, బీపీ ఎక్కువగా ఉండటం, కిడ్నీ, లివర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక సమస్యలు, అదుపులో లేని థైరాయిడ్, రక్తం గూడుకట్టడంలో సమస్యలు, తల్లి నుంచి బిడ్డకి రక్త సరఫరాలో సమస్యలు వంటి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల స్టిల్‌బర్త్ అవ్వవచ్చు. అలాగే బిడ్డలో జన్యుపరమైన సమస్యలు, అవయవాల్లో లోపాలు, బిడ్డ సరిగా పెరగకపోవడం, బిడ్డలో తీవ్రమైన ఇన్ఫెక్షన్స్, గర్భంలో మాయ విడిపడిపోవడం (Abruption), కార్డ్ ప్రొలాప్స్ (బిడ్డ కంటే ముందు బొడ్డుతాడు బయటికి రావడం), బొడ్డుతాడు ముడిపడటం, మెడ చుట్టూ బిగుసుకుపోవడం, ఉమ్మనీరు బాగా తగ్గిపోయి బిడ్డకు ఊపిరాడకపోవడం, కాన్పు సమయంలో బిడ్డపై ఒత్తిడి, ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల స్టిల్ బర్త్ జరుగుతుంది. తల్లిలో అధిక బరువు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి లక్షణాలు ఉంటే కూడా స్టిల్‌బర్త్ జరగవచ్చు. కొందరిలో అంతా బాగుండి కూడా.. తెలియని కారణాల వల్ల ఉన్నట్లుండి బిడ్డ కడుపులోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. గర్భం దాల్చినప్పటి నుంచి డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లు చేయించుకోవడం, అవసరమైన రక్త పరీక్షలు, బీపీ, స్కానింగ్‌లు చేయించుకుంటూ డాక్టర్ రాసిన మందులు వేసుకుంటూ వారి సలహాలను పాటించడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఎడమవైపుకి తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల బిడ్డకు రక్తసరఫరా బాగా ఉంటుంది. ఏడోనెల తర్వాత బిడ్డ కదలికలు గమనించుకుంటూ ఉండాలి. అవి బాగా తగ్గినట్లు అనిపిస్తే డాక్టర్ని సంప్రదించడం మంచిది. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఇతర సమస్యలు ఉన్నప్పుడు దానికి తగ్గ చికిత్స, సూచనలు తప్పకుండా పాటించడం మంచిది. ఒక్కొక్కసారి ఎన్ని జాగ్రత్తలు, సూచనలు, చెకప్‌లు చేయించుకున్నా కొందరిలో ఉన్నట్లుండి స్టిల్‌బర్త్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటికి ముందస్తు పరీక్షలు ఏమీ ఉండవు. దీనికోసం భయపడి ఆందోళన చెందడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. గర్భంతో ఉన్నప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆనందంగా, సంతోషంగా గడపడం ముఖ్యం. Menstrual Hygiene అనే మాట చాలాసార్లు విన్నాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. న్యాప్కిన్స్ అవసరం లేకుండా పీరియడ్స్‌ను మేనేజ్ చేయడానికి పంజాబ్‌లో అండర్వేర్లు వచ్చాయని చదివాను. వీటివల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందా? – డి.శైలు, టెక్కలి పీరియడ్స్ సమయంలో శారీరక శుభ్రత, జననేంద్రియాల శుభ్రత చాలా ముఖ్యం. దీన్నే Menstrual Hygiene అంటారు. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ బయటకు వచ్చి చాలాసేపు జననేంద్రియాల దగ్గర ఉన్నప్పుడు, ఆ చెమ్మలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా ఇన్ఫెక్షన్ గర్భాశయానికి పాకే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి న్యాప్కిన్స్ తరచూ మార్చుకుంటూ ఉండాలి. రోజూ స్నానం చేయాలి. జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవాలి. న్యాప్కిన్స్ కాకుండా శుభ్రంగా లేని బట్టలు లేదా ఇంకా ఇతర పద్ధతులు పాటించడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. న్యాప్కిన్స్ మార్చిన ప్రతిసారి, అలాగే మలవిసర్జన, మూత్ర విసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో కొద్దిగా నీరసంగా ఉంటుంది కాబట్టి పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో న్యాప్కిన్స్ వాడే అవసరం లేకుండా డైరెక్ట్‌గా పీరియడ్ అండర్‌వేర్స్ అని మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇందులో అండర్వేర్లకి కింది భాగంలో వెదురు నుంచి తయారు చేసిన బట్టను చాలా పొరలుగా దళసరిగా కుట్టడం జరుగుతుంది. ఇది బ్లీడింగ్‌ను పీల్చుకుంటుంది. వివిధ రకాల సైజుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఆన్‌లైన్‌లోనూ దొరుకుతున్నాయి. పీరియడ్స్ అండర్‌వేర్స్ కూడా పీల్చుకునే చెమ్మనుబట్టి సైజుల వారీగా దొరుకుతాయి. వీటిని మంచినీటిలో సోపుతో బాగా శుభ్రపరిచి, గాలికి ఆరవేసి, మళ్లీ వాడుకోవచ్చు. ఇవి వందశాతం సురక్షితం అని చెప్పలేము, కాకపోతే మనం వాటిని జాగ్రత్తగా శుభ్రపరిచే విధానాన్నిబట్టి ఉంటుంది. పీరియడ్స్ ఎప్పుడు సరిగా మొదలవుతుందో తెలియక ఆందోళన పడుతున్నవారికి, ప్రతిరోజు అవసరం లేకుండా న్యాప్కిన్ పెట్టుకొని పనికి వెళ్లేవారికి ఆ రోజుల్లో వాడటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఉన్నట్లుండి బ్లీడింగ్ మొదలైనా కూడా టెన్షన్, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ∙చైల్డ్‌హుడ్ క్యాన్సర్ సర్వైవర్లు భవిష్యత్‌లో గర్భం దాల్చినప్పుడు... గుండెకు సంబంధించిన రుగ్మతలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నా ఫ్రెండ్ ఎక్కడో చదివి చెప్పింది. ఇది ఎంత వరకు నిజం? దీని గురించి వివరంగా తెలియజేయగలరు.– కె.ప్రభ, హైదరాబాద్ చిన్నప్పుడు క్యాన్సర్ వచ్చి చికిత్స తీసుకున్న వాళ్లు భవిష్యత్‌లో గర్భం దాల్చినప్పుడు క్యాన్సర్ ఏ అవయవానికి వచ్చిందనే దాన్నిబట్టి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్‌కి ఇచ్చే రేడియోథెరపీ వల్ల కొందరిలో గర్భాశయ కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం జరుగుతుంది. దాని వల్ల అబార్షన్లు, బిడ్డ ఎక్కువ బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పులు జరగటం, సాధారణ కాన్పు అవ్వడానికి ఇబ్బందులు ఉండవచ్చు. క్యాన్సర్‌కి కీమోథెరపీ ఇవ్వడంవల్ల రక్తహీనత, నడుము నొప్పి వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కిడ్నీ క్యాన్సర్‌కి చికిత్స తీసుకున్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పాంక్రియాస్ క్యాన్సర్‌కి చికిత్స తీసుకున్న వారికి గర్భం దాల్చిన తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కీమోథెరపీలో వాడే మందులవల్ల గుండెలోని కండరాలు దెబ్బతిని బలహీనపడతాయి. దానివల్ల గర్భం దాల్చిన తర్వాత బలహీనబడిన గుండెపైన భారంపడి, గుండె పనితీరులో లోపాలు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఛాతీ, పొట్ట క్యాన్సర్లకు ఇచ్చే రేడియోథెరపీ వల్ల కూడా గర్భం దాల్చిన తర్వాత గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ ,హైదరాబాద్ -
ఆ అనాథ శిశువు ఇక లేదు
బనశంకరి : ఈనెల 1న ఇక్కడి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని లభించిన అనాథ శిశువు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఇందిరా గాంధీ చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎలక్ట్రానిక్ పోలీసులు తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ నిర్మాణ భవనం వద్ద 20 రోజుల క్రితం శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ చిన్నారికి మహిళా కానిస్టేబుల్ అర్చన దగ్గరకు తీసుకుని పాలు పట్టారు. అనంతరం చిన్నారిని విల్సన్ గార్డెన్‌లోని శిశు విహార్‌కు అప్పగించారు. అక్కడ మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పసిందును జయనగర్‌లోని ఇందిరా గాంధీ చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో చిన్నారి ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ అర్చన కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ముక్కు బిగదీసుకుపోతోంది.. అదేపనిగా తుమ్ములు...
నా వయసు 29 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. వాసనలు తెలియడం లేదు. చాలామంది డాక్టర్లను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – సంతోష్దేవ్, సంగారెడ్డి మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. నివారణ : ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ∙చల్లని వాతావరణానికి దూరంగా ఉండటం ∙పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స : హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ ఆపరేషన్ తర్వాత కూడా కిడ్నీలో రాళ్లు... నా వయసు 32 ఏళ్లు. నాకు గతంలో కిడ్నీలో రాళ్లు వచ్చాయి. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలంగా నడునొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించాను. వారు స్కాన్ తీయించి, మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడకుండా చేసేలా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వండి. – ఎల్. కృష్ణమూర్తి, మేదరమెట్ల మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి, శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటికరూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరతాయో, అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రవ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం... ఇలా ఎక్కడైనా రాళ్లు ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ 50% మందిలో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వీటిని మళ్లీ ఏర్పడకుండా చేసే అవకాశం ఉంటుంది. కారణాలు : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మరికొన్ని ఇతర కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొందరిలో మూత్రకోశ ఇన్ఫెక్షన్స్, మూత్రమార్గంలో అడ్డంకులు ఏర్పడటం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలో విటమిన్–ఏ పాళ్లు తగ్గడం వంటి ఎన్నో అంశాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవేకాకుండా కిడ్నీలో రాళ్లను ప్రేరేపించే అంశాలు... ఆహారంలో మాంసకృత్తులు, ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకోవడం; సాధారణం కంటే తక్కువగా (అంటే రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువగా) నీళ్లు తాగడం వంటి వాటితో కిడ్నీలో రాళ్లు రావచ్చు. ఇక కొన్ని ఇతర జబ్బుల వల్ల... ముఖ్యంగా హైపర్ కాల్సీమియా, రీనల్ ట్యూబులార్ అసిడోసిస్, జన్యుపరమైన కారణాలతో, ఆస్పిరిన్, యాంటాసిడ్స్, విటమిన్–సి ఉండే కొన్ని మందులు, క్యాల్షియమ్ సప్లిమెంట్లతోనూ కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. లక్షణాలు : విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పటి ప్రధాన లక్షణాలు. కొందరిలో ఒకవైపు నడుమునొప్పి రావడం, నొప్పితో పాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడటాయి. దీనివల్ల నడుము, ఉదరమధ్య భాగాల్లో నొప్పి, ఇక్కడి నుంచి నొప్పి పొత్తికడుపు, గజ్జలకు, కొన్నిసార్లు కాళ్లలోకి పాకడం జరుగుతుంది. మరికొందరిలో కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు. వీటిని సైలెంట్ స్టోన్స్ అంటారు. చికిత్స : హోమియోలో కిడ్నీలో రాళ్లను తగ్గించేందుకూ, మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడకుండా, రాళ్లను నియంత్రించేందుకూ అవకాశం ఉంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కాళ్లు లాగుతున్నాయి నా వయసు 47 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? – డి. కమలబాయి, నిజామాబాద్ మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేకదిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. శరీరంలోని ఇతర భాగాలలోనూ కనిపించినా 80 శాతం కేసుల్లో వేరికోస్ వెయిన్స్ కాళ్లపైనే కనిపిస్తాయి. కారణాలు : ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు : ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం. చికిత్స : వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేయవచ్చా?
నా వయసు 32 ఏళ్లు. నాకు గతంలో కిడ్నీలో రాళ్లు వచ్చాయి. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలంగా నడుంనొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించాను. వారు స్కాన్ తీయించి, మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడకుండా చేసేలా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వండి. – సిరాజుద్దిన్, నల్లగొండ కిడ్నీలో రాళ్లు ఏర్పడటమనే సమస్య ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. కొందరిలో వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ 50% మందిలో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వీటిని మళ్లీ ఏర్పడకుండా చేసే అవకాశం ఉంటుంది. మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి, శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటికరూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరతాయో, అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రవ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం... ఇలా ఎక్కడైనా రాళ్లు ఏర్పడవచ్చు. కిడ్నీరాళ్లలో రకాలు : క్యాల్షియమ్ స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్, సిస్టిక్ స్టోన్స్, స్ట్రూవైట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఇలా కిడ్నీస్టోన్స్లో అనేక రకాలు ఉంటాయి. కారణాలు: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మరికొన్ని ఇతర కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొందరిలో మూత్రకోశ ఇన్ఫెక్షన్స్, మూత్రమార్గంలో అడ్డంకులు ఏర్పడటం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలో విటమిన్–ఏ పాళ్లు తగ్గడం వంటి ఎన్నో అంశాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవేకాకుండా కిడ్నీలో రాళ్లను ప్రేరేపించే అంశాలు... ఆహారంలో మాంసకృత్తులు, ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకోవడం; సాధారణం కంటే తక్కువగా (అంటే రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువగా) నీళ్లు తాగడం వంటి వాటితో కిడ్నీలో రాళ్లు రావచ్చు. ఇక కొన్ని ఇతర జబ్బుల వల్ల... ముఖ్యంగా హైపర్ కాల్సీమియా, రీనల్ ట్యూబులార్ అసిడోసిస్, జన్యుపరమైన కారణాలతో, ఆస్పిరిన్, యాంటాసిడ్స్, విటమిన్–సి ఉండే కొన్ని మందులు, క్యాల్షియమ్ సప్లిమెంట్లతోనూ కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. లక్షణాలు: విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పటి ప్రధాన లక్షణాలు. కొందరిలో ఒకవైపు నడుమునొప్పి రావడం, నొప్పితో పాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీనివల్ల నడుము, ఉదరమధ్య భాగాల్లో నొప్పి, ఇక్కడి నుంచి నొప్పి పొత్తికడుపు, గజ్జలకు, కొన్నిసార్లు కాళ్లలోకి పాకడం జరుగుతుంది. మరికొందరిలో కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు. వీటిని సైలెంట్ స్టోన్స్ అంటారు. చికిత్స: హోమియోలో కిడ్నీలో రాళ్లను తగ్గించేందుకూ, మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడకుండా, రాళ్లను నియంత్రించేందుకూ అవకాశం ఉంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ వేసవి విహారయాత్ర తర్వాత కామెర్లు... చికిత్స ఉందా? నా వయసు 36 ఏళ్లు. ఈ వేసవిలో విహారయాత్రకు వెళ్లొచ్చిన తర్వాత ఆకలి తగ్గింది. మలబద్దకంగా అనిపించడంతో పాటు మూత్రం పచ్చగా వస్తోంది. కొందరు కామెర్లు వచ్చాయని అంటున్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? – కె. సెల్వరాజ్, హైదరాబాద్ కామెర్లు అనేది కాలేయ సంబంధిత వ్యాధి. ఇటీవలి కాలంలో తరచూ తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటిగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కంటే ముందుగా ఇతరులే దీన్ని గుర్తిస్తారు. రక్తంలో బిలురుబిన్ పాళ్లు పెరిగినప్పుడు (హైపర్ బిలురుబినీమియా) చర్మం, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేన్స్‌లో పసుపుపచ్చ రంగు తేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. శరీరానికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను రక్తంలోకి ఎర్రరక్తకణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ అనే పదార్థం ప్లీహం (స్లీ్పన్)లో శిథిలమైపోయి బైలురుబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతాయి. శరీరంలో పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా చెప్పవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి, పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్ డక్ట్) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కామెర్లకు కారణాలు: ∙హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే వైరస్ల కారణంగా కామెర్లు వచ్చే అవకాశం ఉంది ∙ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ∙పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు ∙కాలేయం పాడైపోవడం ∙కాలేయం నుంచి పేగుల్లోకి వెళ్లే కాలేయ వాహికలో అంతరాయం ఏర్పడటం వంటివి జరిగితే కామెర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. లక్షణాలు: ∙వికారం, వాంతులు ∙పొత్తికడుపులో నొప్పి ∙జ్వరం, నీరసం, తలనొప్పి కడుపు ఉబ్బరంగా ఉండటం కామెర్లు సోకినప్పుడు కళ్లు పచ్చబడటం. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఎల్ఎఫ్టీ, సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రా సౌండ్ స్కాన్ చికిత్స: కామెర్లను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను, శారీరక, మానసిక స్థితని పరిగణనలోకి తీసుకొని డాక్టర్లు మందులు సూచిస్తారు. ప్రారంభదశలోనే వాడితే కామెర్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు హోమియోలో చెలిడోనియం, సెలీనియం, లైకోపోడియం, మెర్క్‌సాల్, నాట్‌సల్ఫ్ వంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన మంట... ఎందుకు? నా వయసు 35 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. మహిళను కావడంతో ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – సోదరి, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిలో రెండు రకాలు... అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే హెచ్ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం. వ్యాధి నిర్ధారణ పరీక్షలు: యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్. హోమియోపతి చికిత్స: రోగిలో మళ్లీ మళ్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి హోమియో మందులు తోడ్పడతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
పాపకు ఘనాహారం ఎలా పెట్టాలి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఐదు నెలలు. మరో నెల రోజుల్లో ఘనాహారం మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. ఇలా ఘనాహారం మొదలుపెట్టేవారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియజేయండి. – ఆర్. ధరణి, హైదరాబాద్ పాలు తాగే పిల్లలను ఘనాహారానికి అలవాటు చేయడాన్ని వీనింగ్ అంటారు. ఈ వీనింగ్ ప్రక్రియలో చిన్నపిల్లలకు ఆర్నెల్లు దాటాక తల్లిపాలతో పాటు అన్నం, గోధుమల వంటి గింజధాన్యాలు (సిరియెల్స్), ఆపిల్, సపోటా వంటి పళ్లు, పప్పుధాన్యాలు (దాల్స్), కూరలలో క్యారట్, బాగా ఉడికించిన దుంపలు వంటివి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చాక మంచినీళ్లు తాగించడం అవసరం. ఈ వయసు పిల్లలకు పళ్లను జ్యూస్ రూపంలో ఇవ్వడం సరికాదు. పిల్లల ఆహారం తయారీకి కుదరని, అత్యవసర సమయాల్లో మాత్రమే – మార్కెట్లో దొరికే పిల్లల ఆహార పదార్థాలు (రెడీమేడ్ సిరియెల్ బేస్డ్ ఫుడ్స్)ను ఇవ్వవచ్చు. బాబు గోడకు ఉన్న సున్నం తింటున్నాడు... మా బాబు వయసు ఐదేళ్లు. చాలా సన్నగా ఉంటుంది. అన్నం అసలు తినదు. చిరుతిండి ఎక్కువగా తింటుంది. ఈమధ్య ఎక్కువగా గోడకు ఉన్న సున్నం తింటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఒంట్లో రక్తం తక్కువగా ఉందని అని కొన్ని మందులు ఇచ్చారు. వాడినా ప్రయోజనం లేదు. ఈ సమస్య తగ్గడం ఎలా? మా బాబు కొంచెం లావెక్కడానికి తగిన సలహా ఇవ్వగలరు. – మీనాక్షి, చిత్తూరు మనం ఆహారంగా పరిగణించని పదార్థాలను పదే పదే తినడాన్ని వైద్య పరిభాషలో ‘పైకా’ అంటారు. ఈ కండిషన్ ఉన్నవారు మీరు చెప్పినట్లుగా సున్నంతో పాటు ప్లాస్టర్, బొగ్గు, పెయింట్, మట్టి, బలపాలు, చాక్‌పీసుల వంటి పదార్థాలను తింటుంటారు. మన సంస్కృతిలో మనం తినని పదార్థాలను తినడాన్ని కూడా ఒక రుగ్మతగానే అనుకోవాలి. అయితే ఇది చాలా సాధారణ సమస్య. ఐదేళ్ల లోపు పిల్లల్లో ఇది చాలా తరచూ కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణాలను నిర్దిష్టంగా చెప్పలేం. బుద్ధిమాంద్యం, పిల్లలపై పడే మానసిక ఒత్తిడి, తల్లిదండ్రుల ఆదరణ సరిగా లేకపోవడం వంటి కొన్ని అంశాలను దీనికి కారణాలుగా చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో తగిన పోషకాలు తీసుకోకపోవడం, ఐరన్ వంటి ఖనిజాల లోపం కూడా పైకా సమస్యతో పాటు కనిపిస్తూ ఉంటుంది. ఈ రుగ్మత ఉన్న పిల్లల్లో జింక్, లెడ్ స్థాయుల్లో మార్పులు, ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయేమో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. అనర్థాలు : ∙పేగుల్లో ఆహారానికి అడ్డంకి కలగడం ∙ఐరన్ పోషకంలో లోపం ఎక్కువగా కనిపించడం ∙మన శరీరంలో అనేక రోగకారక క్రిములు పెరగడం...వంటి అనర్థాలు పైకా వల్ల కనిపిస్తాయి. ఇక మీ పాప విషయంలో ఇదీ కారణం అని నిర్దిష్టం చెప్పలేకపోయినప్పటికీ పైన పేర్కొన్న కారణాల్లో ఏదైనా ఉందేమోనని చూడాలి. మరికొన్ని ఇతర పరీక్షలు కూడా చేసి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని విశ్లేషించాలి. మీ పాపకు డీ–వార్మింగ్ మందులతో పాటు ఇతర పారసైటిక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే మందులు మరోసారి వాడటం అవసరం. దానితో పాటు ఐరన్, క్యాల్షియమ్, జింక్ వంటి పోషకాలు ఇవ్వడం మంచిది. అలాగే కొద్ది మందిలో కొద్దిపాటి మానసిక చికిత్స (అంటే... డిస్క్రిమినేషన్ ట్రైనింగ్, డిఫరెన్షియల్ పాజిటివ్ రీ ఇన్ఫోర్స్మెంట్ వంటి ప్రక్రియలతో) కూడా అవసరం. ఈ చిన్నపాటి పద్ధతులతో చిన్నపిల్లల్లో ఆహారం కాని పదార్థాలను తినే అలవాటును చాలావరకు మాన్పించవచ్చు. ఇక లావు, సన్నం అనేది పిల్లల విషయంలో చాలా సాధారణంగా వినే ఫిర్యాదే. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పిల్లలను చూశాకే నిర్ధారణ చేయాలి. మీ పాప తన వయసుకు తగినంత బరువు ఉన్నట్లయితే పరవాలేదు. ఒకవేళ అలా లేకపోతే ఇంట్లో ఇచ్చే సాధారణ పోషకాలతో పాటు, కొన్ని మెడికల్లీ అప్రూవ్డ్ పోషకాలను ఇవ్వాల్సి రావచ్చు. మీరు మరోసారి మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించి, ఈ విషయాలను చర్చించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
మైగ్రేన్‌కు పరిష్కారం ఉందా?
నా వయసు 35 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. నా సమస్యకు హోమియోలో çపరిష్కారం ఉంటే చెప్పండి. – రవికిరణ్, నిజామాబాద్ పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. కారణాలు : తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు : పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1. పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 2. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు : అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 3. పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు : చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉం్డటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఏడీహెచ్‌డీకి చికిత్స ఉందా? మా బాబు వయసు ఏడేళ్లు. ఒక చోట కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్ చేస్తుంటారు. డాక్టర్‌కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? – కనకారావు, భీమవరం ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ ( ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు. సమస్యకు కారణాలు : ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. లక్షణాలు : ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. నిర్ధారణ : రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స : హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? నా వయసు 30 ఏళ్లు. వివాహమై నాలుగేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? హోమియోలో ఈ సమస్యకు పరిష్కారం ఉందా? – ఎస్. మాధవి, ఇల్లందు సంతానలేమి సమస్య ఇటీవల చాలా మందిలో కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో లేదా ఇద్దరిలోనూ ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ∙హార్మోన్ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్ ∙పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు : ∙ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ∙సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. కారణాలు కనుగొని ఇన్ఫెర్టిలిటీకి కారణమైన లోపాలను చక్కదిద్దాలి, ఇలా సంతానం కలిగించేందుకు దోహదం చేసే మందులు ఉన్నాయి. వాటితో ఈ సమస్య చాలావరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఇన్ఫెక్షన్లతో గుండెకు ముప్పు
లండన్ : ఛాతీ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా సహా ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులకు తర్వాతి సంవత్సరాల్లో గుండెపోటు ముప్పు అధికమని ఓ అథ్యయనంలో వెల్లడైంది. సాధారణ ఇన్ఫెక్షన్లకు గురయ్యే వారికి గుండె పోటు, స్ట్రోక్ ముప్పును నివారించేందుకు స్టాటిన్లు, హార్ట్ పిల్స్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యుమోనియా, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన 12 లక్షల మందిని పరిశీలించగా, వారిలో ఎనిమిదేళ్లలో గుండె పోటు వచ్చే ముప్పు 40 శాతం మందికి ఉందని పరిశోధనలో వెల్లడైంది. వారిలో 150 మంది స్ర్టోక్‌కు గురయ్యే రిస్క్ పొంచిఉందని తేలింది. గుండె ఆరోగ్యంపై ఇన్ఫెక్షన్ల ప్రభావం ఒబెసిటీ కంటే అధికంగా ఉంటుందని బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ మెడికల్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి పరిశోధక బృందం వెల్లడించింది. ఇన్ఫెక్షన్తో బాధపడిన వారికి హైబీపీ, కొలెస్ర్టాల్, డయాబెటిస్ వ్యాధులకు ఇచ్చిన చికిత్స మాదిరి ట్రీట్మెంట్ అందించాలని సూచించింది. వారి గుండెకు ఎలాంటి ముప్పు లేకుండా నివారణ కోసం స్టాటిన్స్, ఆస్పిరిన్లు ఇవ్వాలని వైద్యులకు తెలిపింది. -
ఐక్యూ హయ్యర్‌గా ఉంటుందా?
ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీలు రోజుకు తొమ్మిది గుడ్లు తింటే పుట్టబోయే బిడ్డ ఐక్యూ అనేది హయ్యర్ ఉంటుందని ఒక స్టడీ తెలియజేసినట్లు చదివాను. ఇది ఎంత వరకు నిజం? గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారానికి ఐక్యూకు సంబంధం ఉంటుందా? మరోవైపు గర్భిణీ స్త్రీలు గుడ్లు తినడం మంచిది కాదనేది కూడా విన్నాను. దీని గురించి తెలియజేయగలరు. – నవ్య, కర్నూల్ గర్భంతో లేనివారే రోజుకు తొమ్మిది గుడ్లు తినాలంటే ఇబ్బంది పడతారు. అలాంటిది గర్భంతో ఉన్నవారు రోజుకు అన్ని గుడ్లు తిన్నారంటే.. వారిలో అజీర్తి, కడుపు ఉబ్బరం, బరువు అధికంగా పెరగడం, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి. పుట్టబోయే బిడ్డ ఐక్యూ అనేది తల్లిదండ్రుల ప్రవర్తన, నడవడిక, జన్యుపరంగా, ఇలా చాలా వాటిపై ఆధారపడి ఉంటుంది. గర్భిణీ సమయంలో తల్లిలో మానసిక ఒత్తిడి, కొన్నిరకాల ఇన్ఫెక్షన్స్, బిడ్డ మెదడులో లోపాలు, పనితీరులో లోపాలు వంటి వాటివల్ల బిడ్డ ఐక్యూ తగ్గే అవకాశాలు ఉంటాయి. గర్భిణీ సమయంలో తల్లి మానసికంగా ఆనందంగా ఉండటం, ఆరోగ్యకరమైన, సులువుగా అరిగే పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఐక్యూ పెరగటం ఉండదు. గుడ్డు తెల్లసొనలో ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బిడ్డ మెదడు పెరుగుదలకు ఉపయోగపడతాయి. పచ్చసొనలో కొవ్వు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలలో సన్నగా ఉన్నవారు రోజుకు ఒక గుడ్డు తీసుకోవచ్చు. లావుగా ఉన్నవారు తెల్లసొనను రోజూ తీసుకుంటూ పచ్చసొనను వారానికి ఓసారి తీసుకోవచ్చు. పచ్చి గుడ్డు లేదా సగం ఉడికిన గుడ్డు కాకుండా బాగా ఉడికిన గుడ్డును తీసుకోవాలి. పచ్చి లేదా సరిగా ఉడకని గుడ్డులో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు, గర్భాశయంలో కాంట్రాక్షన్స్, నెలలు నిండకుండానే కాన్పు వంటి సమస్యలు రావచ్చు. ఒక గుడ్డులో 70 క్యాలరీల శక్తి ఉంటుంది. గరిష్టంగా రోజుకు.. వారి శరీరతత్వాన్నిబట్టి రెండు గుడ్లు తినొచ్చు. నాకు వేపుడు పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం. ప్రెగ్నెన్సీ సమయంలో తినొచ్చా? ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పారసెటమాల్ మాత్రను తీసుకోవడం మంచిది కాదని విన్నాను. ఈ సమయంలో ఎలాంటి మాత్రలు తీసుకోకూడదో తెలియజేయగలరు. – పీఆర్, ఇచ్చాపురం వేపుడు పదార్థాలలో నూనె ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువగా వేయించడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు ఎక్కువగా ఆవిరైపోతాయి. అలాంటివి తింటే రుచికి తప్పితే, బిడ్డ పెరుగుదలకి పెద్దగా ఉపయోగం ఉండదు. తరచూ వేపుడు పదార్థాలు తీసుకోవడం వల్ల అజీర్తి, అసిడిటీ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రుచి కోసం అయితే అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు. గర్భిణీ సమయాల్లో వచ్చే నొప్పులకు, జ్వరానికి పారసెటమాల్ మాత్ర ఒక్కటే మంచిది. దీనివల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఏమీ లేవు. ఒళ్లునొప్పులు, తలనొప్పి, జ్వరం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పారసెటమాల్ మాత్ర అవసరాన్ని బట్టి రోజుకు రెండు, మూడుసార్లు వేసుకోవచ్చు. గర్భిణీ సమయాల్లో ఏ మందులు అయినా డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవలసి ఉంటుంది. కొన్నిరకాల యాంటిబయోటిక్స్, నొప్పి నివారణ మందులు, ఫిట్స్, డిప్రెషన్‌కు వాడే మాత్రలు వంటివి గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వాడవలసి వచ్చినా, అవి వాడకపోతే హాని ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సలహామేరకు అతి తక్కువ దుష్ప్రభావాలు ఉన్న మందులను వాడొచ్చు. నా వయసు 37. థైరాయిడ్, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. ఇటీవల ఒక ఐదునెలలు థైరాయిడ్ టాబ్లెట్లు వాడడం మానేశాను. వారం రోజుల క్రితం టెస్ట్ చేయించుకుంటే టి3 – 87, టి4 – 5.3, టీఎస్‌హెచ్ 5.4 ఉంది. ఇప్పుడు థైరోనార్మ్ 25 ఎమ్.జీ మొదలుపెట్టాను. అంత మోతాదు సరిపోతుందా? టీఎస్‌హెచ్ ఎక్కువగా ఉంటే హైపో థైరాయిడిజమ్ అంటారా? లేక హైపర్ థైరాయిడిజమ్ అంటారా? పీసీఓడీకి ఎటువంటి మందులు వాడడం లేదు. రెండు లేక మూడు నెలలకు ఒకసారి నెలసరి వస్తుంది. దీనితో నాకు హెయిర్‌ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలుపగలరు? – సరిత, తాళ్ళరేవు మీరు బరువు ఎంత ఉన్నారు? వివాహం అయిందా లేదా? పిల్లలు ఉన్నారా లేదా? అనే ప్రధానమైన విషయాలు రాయలేదు. పీరియడ్స్ సక్రమంగా రావడానికి గర్భాశయం, అండాశయాల పనితీరు, మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్ఎస్హెచ్, సీహెచ్, ప్రొలాక్టిన్, టీఎస్‌హెచ్ హార్మోన్లు, థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే టి3, టి4 హార్మోన్లు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లన్నీ సక్రమంగా ఉండాలి. మీకు టీఎస్‌హెచ్ కొద్దిగా బార్డర్‌లైన్‌లో పెరిగింది. దీనిని హైపో థైరాయిడిజమ్ అంటారు. మెడలోపల ఉండే థైరాయిడ్ గ్రం«థి నుంచి విడుదలయ్యే టి3, టి4 అనే థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా విడుదల అవుతుంటే.. థైరాయిడ్ గ్రం«థిని ఉత్తేజపరచడానికి (స్టిములేట్) మెదడులోకి పిట్యూటరీ గ్రంథి నుంచి టీఎస్‌హెచ్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. మీకు థైరోనార్మ్ 25 ఎమ్.జీ సరిపోతుంది. మీకున్న పీసీఓడీ సమస్యవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, జుట్టు ఊడిపోవడం, అవసరం లేని దగ్గర జుట్టు పెరగడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడతాయి. ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి మితమైన ఆహారం, వ్యాయామాలు చేసి బరువు తగ్గటం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, అశ్రద్ధ చేయకుండా మీ శరీరతత్వాన్ని బట్టి కొంతకాలంపాటు అవసరమైన మందులు వాడటం మంచిది. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఖైదీలకు క్షయ, అంటురోగాలు..
జిల్లాలోని జైళ్లన్నీ ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో కోడిపిల్లల్ని బుట్టలో వేసి కుక్కినట్లు కుక్కేస్తున్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా మగ్గుతున్న వారికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. విడుదలయ్యేటప్పటికి పలువురు ఖైదీలు మంచంపడుతుండడం విమర్శలకు తావిస్తోంది. జైళ్లలోని దుస్థితిపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చీవాట్లు పెడుతున్నా పరిస్థితిలో ఏ మాత్రమూ మార్పురాకపోవడం గమనార్హం. తప్పట్లేదు.. తిరుపతి, సత్యవేడు లాంటి ప్రాంతాల్లో కొత్తగా జైళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. నిధుల కోసం నిరీక్షిస్తున్నాం. ఎర్రచందనం కేసుల్లో వస్తున్న వారిపై హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్లు పెడుతుండడంతో వీరికి బెయిల్ రావడానికి 60 నుంచి 90 రోజులు పడుతోంది. ఒక్కోసారి బెయిల్ వచ్చినా ష్యూరిటీ ఇచ్చేవారులేక ఇక్కడే ఉండిపోతున్నారు. వారికి వైద్యులతో పరీక్షలు చేయించి, మందులు కూడా ఇస్తున్నాం. మరీ సీరియస్‌గా ఉంటే ప్రభుత్వాస్పత్రులకు రెఫర్ చేస్తున్నాం. పరిమితి మించినా ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితుల్లో ఖైదీలను ఉంచాల్సి వస్తోంది. – బ్రహ్మయ్య, జిల్లా జైళ్ల అధికారి చిత్తూరు అర్బన్: నేరాలు, ఆరోపణల్లో పోలీసులు అరెస్టు చేస్తున్న నిందితులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. పరిమితికి మించి జైళ్లలో కుక్కేస్తుండడంతో వారు అనారోగ్యం బారినపడుతున్నారు. మహిళా ఖైదీల హక్కులు కాలరాస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులో జిల్లా జైలు ఉండగా తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె ప్రాంతాల్లో సబ్‌జైళ్లు ఉన్నాయి. నెలకు సగటున 180 మంది ఖైదీలు జైళ్లకు వస్తుండగా అందులో 12 మంది మాత్రమే బెయిల్‌పై విడుదలవుతున్నారు. మిగిలివారు ఆరోపణలు ఎదుర్కొంటూ అండర్ ట్రయల్ ఖైదీలుగా కారాగారాల్లోనే ఉండిపోతున్నారు. ఎర్ర స్మగ్లర్లతో మరింత ఎక్కువ.. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ. తమిళనాడు నుంచి చెట్లను నరకడానికి వస్తున్న వారిని వందల సంఖ్యలో పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో జైళ్లలో ఉండాల్సిన ఖైదీల పరిమితికంటే మూడు రెట్లు ఎక్కువ మందిని వేయక తప్పడం లేదు. వైద్యసేవలు అంతంతమాత్రమే.. ఖైదీలకు క్షయ, శ్వాసకోస, చర్మవ్యాధులతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వ్యాధులబారిన పడుతున్న వారికి ఇక్కడ అందుతున్న వైద్య సేవలు అంతంత మాత్రమే. జైలు నుంచి విడుదలయ్యే నాటికి ఖైదీలు పూర్తిగా మంచానపడి కాటికి కాళ్లు చాపుతున్నారు. కొందరు ఆరోగ్యం బాగుచేసుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, మదనపల్లెలోని జైళ్లలో మహిళా ఖైదీలు ఉంటున్నా. వీరి హక్కులకు భంగం కలుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే.. అండర్ ట్రయల్ కేసుల్లో దీర్ఘకాలికంగా జైళ్లలో మగ్గిపోతున్న వారికి ఉచిత న్యాయసేవల ద్వారా బెయిల్ ఇప్పించే పద్ధతులపై అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పారిపోడు, దర్యాప్తుకు సహకరిస్తాడనే కేసుల్లో పోలీసులు అరెస్టులకు ఊరటనివ్వాల్సిన అవసరం ఉందనే వాదనలున్నాయి. మహిళా ఖైదీల హక్కులకు భంగం వాటిల్లకుండా జైళ్లలోని బ్యారక్‌లలో సీసీ కెమెరాలు ఉంచడం లాంటివి చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి జైలులో వారానికి ఒక్కసారైనా మానసిక వైద్య నిపుణుల ద్వారా ఖైదీల మనోగతాన్ని తెలుసుకుని చికిత్స చేయడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం నింపొచ్చు. -
ఇన్ఫెక్షన్స్ రాకుండా..?
పొత్తి కడుపు ఇన్ఫెక్షన్లు రాకుండా ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరంగా తెలియజేయగలరు. – కె.స్వాతి, వరంగల్ పొత్తికడుపులో గర్భాశయం, ట్యూబ్‌లు, అండాశయాలు, మూత్రాశయం, పేగులు వంటి ఎన్నో అవయవాలు ఉంటాయి. వీటిలో దేనికి ఇన్ఫెక్షన్ వచ్చినా దానిని పొత్తికడుపు ఇన్ఫెక్షన్ కిందే పరిగణించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల, పొత్తికడుపులో నొప్పి, మూత్రం మంట, జ్వరం, విరోచనాలు, నడుంనొప్పి, వాసనతో కూడిన తెల్లబట్ట వంటి అనేక లక్షణాలు, ఇన్ఫెక్షన్ సోకిన అవయవాన్ని బట్టి ఉంటాయి. సాధారణంగా శారీరక పరిశుభ్రత, మంచినీళ్లు రోజుకి కనీసం 2–3 లీటర్లు తాగడం, జననేంద్రియాల శుభ్రత, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకి శుభ్రపరుచుకోవడం, పౌష్టికాహారం, బయట అపరిశుభ్ర ఆహారం తీసుకోవటం, రక్తహీనత లేకుండా చూసుకోవడం, ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవడం వంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల చాలావరకు పొత్తికడుపు ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. కొద్దిగా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినా, వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవటం వల్ల, ఇన్ఫెక్షన్ మరింత సోకే ప్రమాదం రాకుండా అరికట్టవచ్చు. ∙ ప్రెగ్నెన్సీ సమయంలో ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల లావు పెరిగే అవకాశం ఉందా? – జీఆర్, అమలాపురం ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్‌లో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో చేప శరీరం నుంచి తీసే సప్లిమెంట్స్‌లో ఉండే డీహెచ్ఏ మరియు ఈపీఏ అనే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ శిశువు యొక్క మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే బిడ్డ కళ్లకు కూడా మంచిది.వీటివల్ల తల్లికి కూడా చర్మానికి, గుండెకి మంచిది. అలాగే బీపీ పెరిగే అవకాశాలు, నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, మన శరీరంలో తయారు కావు. వీటిని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్స్లాగా మాత్రమే మన శరీరంలోకి చేరుతాయి. ఇవి చేపలు తినడం వల్ల లభ్యమవుతాయి. వెజిటబుల్ ఆయిల్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, డార్క్ లీఫీ వెజిటబుల్స్ (పాలకూర), సోయా బీన్స్, బ్రొకోలీ వంటి వాటిలో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, చేపలలో దొరికేంత కాకపోయినా, కొద్దిగా లభ్యమవుతాయి. సప్లిమెంట్స్ బదులు చేపలు వారానికి ఒకటి రెండుసార్లు తీసుకోవటం వల్ల ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ప్రొటీన్స్, విటమిన్ డి, అయోడిన్, సెలీనియమ్ వంటి పోషక పదార్థాలు కూడా లభ్యమవుతాయి. ఈ సప్లిమెంట్స్ వల్ల లావు పెరగరు. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటూ, కాన్పు తర్వాత కూడా మూడు నెలలపాటు తీసుకోవటం వల్ల, తల్లిపాల ద్వారా బిడ్డకు ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ectopic pregnancyఅనేది ప్రమాదకరమని విన్నాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. దీనికి సంబంధించిన సంకేతాలను ముందుగా ఎలా తెలుసుకోవచ్చు? – పీఎన్, శ్రీకాకుళం సాధారణంగా అండాశయం నుంచి అండం విడుదలయ్యి ఫెలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశించి, యోని భాగం నుంచి వీర్య కణాలు గర్భాశయం ద్వారా, ట్యూబ్‌లోకి ప్రవేశించిన తర్వాత, వీర్య కణం అండంలోకి దూరుతుంది. తద్వారా అండం ఫలదీకరణ చెంది, అది వృద్ధి చెందుతూ పిండంగా మారి, పిండం గర్భాశయంలోకి ప్రవేశించి, గర్భాశయ పొరలోకి అతుక్కుని, గర్భం పెరగడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పిండం, గర్భాశయంలోకి ప్రవేశించకుండా, ట్యూబ్‌లోనే ఉండిపోయి అక్కడ పెరగడం మొదలవుతుంది. కొందరిలో అండాశయంలో, పొత్తి కడుపులో, సర్విక్స్‌లో కూడా పిండం పెరగవచ్చు. గర్భాశయంలో కాకుండా పిండం ఇతర భాగాలలో పెరగడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది 95% ట్యూబ్స్‌లో ఏర్పడుతుంది. పెరిగే పిండానికి అనుగుణంగా గర్భాశయం సాగినట్లు, ట్యూబ్స్ సాగలేవు కాబట్టి, కొంత సమయానికి ట్యూబ్స్ పొత్తికడుపులో పగిలిపోయి విపరీతమైన కడుపునొప్పి, కడుపులో బ్లీడింగ్ అయిపోవటం, తల్లి షాక్‌లోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తిస్తే, ప్రాణాపాయ స్థితిని తప్పించుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షన్ వల్ల, లేదా ఎన్నో తెలియని కారణాల వల్ల, ట్యూబ్స్ పాక్షికంగా మూసుకోవటం, లేదా వాటి పనితీరు సరిగా లేకపోవటం వల్ల పిండం గర్భాశయంలోకి ప్రవేశించలేక ట్యూబ్‌లోనే ఉండిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. ఇందులో లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. కొందరిలో పీరియడ్ రావలసిన సమయానికి కొద్దికొద్దిగా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ కనిపించడం, కొందరిలో పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి ఉండటం. కొందరిలో పీరియడ్ మిస్ అయ్యి, ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన తర్వాత, కొద్దిగా స్పాటింగ్ అవ్వటం, కడుపులో విపరీతమైన కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి ఎమర్జెన్సీ పరిస్థితులలో హాస్పిటల్‌కు రావటం జరుగుతుంది. ఈ పరిస్థితిని వెజైనల్ స్కానింగ్ చేయించుకోవటం ద్వారా తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించవచ్చు. కొందరిలో గుర్తించేటప్పటికే ట్యూబ్ పగిలిపోయి, కడుపులో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆపరేషన్ చేసి ట్యూబ్ తీసివేయవలసి ఉంటుంది. చాలా ముందుగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తిస్తే, చాలావరకు కొందరిలో ఆపరేషన్ లేకుండా మందులు, ఇంజెక్షన్ల ద్వారా కరిగించే ప్రయత్నం చేయవచ్చు. - డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ కూకట్పల్లి హైదరాబాద్ -
పదిదేశాల్లో అంటు వ్యాధిలా హెచ్ఐవీ
హైదరాబాద్: భారత్, చైనాతో పాటు పది దేశాల్లో హెచ్ఐవీ అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతుందని ఐకరాజ్య సమితి(యూఎన్) తమ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్మూలనుకు చెపట్టిన కార్యక్రమాలపై జరిపిన విశ్లేషణ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. భారత్, చైనాతోపాటు, ఇండోనేషియా, పాకిస్థాన్, వియాత్నం, మయన్మార్, పాపువా న్యూ గినియా, ఫిలిప్పిన్స్, తైలాండ్, మలేసియాలో హెచ్ఐవీ అంటువ్యాధిలా ప్రబలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా హెచ్ఐవీ సోకిన బాధితుల్లో 95 శాతం ఈ పదిదేశాలకు చెందిన వారేనని పేర్కొంది. దీనికి సెక్సు వర్కర్లు, ట్రాన్స్జెండర్స్లతో లైంగిక చర్యలకు పాల్పడటం, ఇంజక్షన్స్ తో డ్రగ్స్ తీసుకోవడమే ప్రధాన కారణంగా తెలిపింది. అయితే గత ఆరు సంవత్సరాల నుంచి హెచ్ఐవీ భారిన పడే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 13 శాతం తగ్గిందని పేర్కొంది. భారత్‌లోని 26 నగరాల్లో జరిపిన సర్వేలో 46 శాతం మంది డ్రగ్స్ ఇంజెక్ట్ చెసుకోవడం వల్లే హెచ్ఐవీ బాధితులుగా మారారని పేర్కొంది. గతంతో పోలిస్తే ఎయిడ్స్ బాధితుల మరణాలు తగ్గినట్లు తమ సర్వేలో వెల్లైడందని యూఎన్ రిపోర్టులో పేర్కొంది. -
నయం చేసే మిరియం
గుడ్‌ఫుడ్ మిరియాలు ఆహారానికి రుచిని మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వాటితో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. మిరియాలలో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్స్ను నిరోధిస్తాయి. ∙మిరియాలు ఉన్న ఆహారం తిన్న వెంటనే అవి జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములను, రసాయనాలను పుష్కలంగా స్రవింపజేసేలా చూస్తాయి. అందుకే మిరియాలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో కడుపు సంబంధిత సమస్యలు చాలా తక్కువ. అంతేకాదు మలబద్దకాన్ని, డయేరియా ను సైతం నివారిస్తాయి. ∙జలుబు, దగ్గు వంటి సమస్యలకు తొలుత స్ఫురించే ఇంటి చిట్కా మిరియాలే. ఇలా అవి జలుబు, దగ్గులను నివారించడానికి కారణం వాటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణమే. మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు అరికడతాయి. తద్వారా ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. నిత్యం మిరియాలతో కూడిన ఆహారం తీసుకునే వారిలో పొట్ట పెరగదని పరిశోధనలలో తేలింది. ∙మిరియాలు చుండ్రును నివారిస్తాయి. ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్ సమస్యకు మిరియాలు మంచి ఉపశమనం. -
లివర్ పెరిగిందంటున్నారు... ఎందుకిలా?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. రాత్రివేళల్లో కడుపునొప్పిగా అనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – కె. రామమూర్తి, ఇంకొల్లు మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. ఇక మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా అనే వివరాలు తెలియజేయలేదు. కొన్నిరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. అలాగే ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు మీకు కడుపునొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. నా వయసు 35 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. తొలుత గుండెకు సంబంధించిన సమస్యేమోనని అనుమానించి, కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? – ధరణికుమార్, నూజివీడు మీరు తెలిపిన వివరాల ప్రకారం... మీరు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారా కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
బయో టెర్రరిజం, అంటువ్యాధులపై యుద్ధం
⇒ ప్రజారోగ్య బిల్లు–2017 ముసాయిదా తయారు ⇒ 1897 నాటి అంటువ్యాధుల చట్టం స్థానే కొత్తది ⇒ రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ కేంద్రం లేఖ సాక్షి, హైదరాబాద్: బయో టెర్రరిజం, ప్రమాదకరమైన అంటువ్యాధులపై యుద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం 1897 నాటి అంటు వ్యాధుల చట్టాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయిం చింది. దానిస్థానే ప్రజారోగ్య (అంటు వ్యా ధులు, బయో టెర్రరిజం, విపత్తు నిర్మూ లన, నియంత్రణ, నిర్వహణ)బిల్లు–2017కు రూప కల్పన చేసింది. బిల్లు ముసాయిదాను రాష్ట్రా లకు పంపించింది. దీనిపై అభిప్రాయా లు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేసింది. దాదాపు 120 ఏళ్ల క్రితం ఏర్పాటైన అంటువ్యాధుల చట్టం– 1897 ప్రస్తుత పరి స్థితులకు అనుగుణంగా లేదు. బయో టెర్ర రిజం ద్వారా వ్యాధుల వ్యాప్తి అంశాలు పాత చట్టంలో లేవు. ఇన్నేళ్లలో అనేక అంటువ్యా ధులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని నిర్మూలించడం, నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. ప్రమాదకరంగా బయో టెర్రరిజం.. నేరుగా యుద్ధం చేయకుండా జంతువులు, మనుషులు, ఇతరత్రా పద్ధతుల్లో వైరస్‌ను ప్రజల్లో వ్యాపింపజేయడం ద్వారా నష్టం చేకూర్చేందుకు ఉగ్రవాదులు, శత్రు దేశాలు ప్రయత్నిస్తుంటాయి. తద్వారా దేశంలో పెద్ద ఎత్తున జన సమూహం అనారోగ్యంతో చని పోయే పరిస్థితులు తలెత్తుతుంటాయి. బయో టెర్రరిస్టు ఏజెంట్లు ఆంత్రాక్స్, ట్రెంచ్ ఫీవర్, గ్లాండర్స్, క్యూ ఫీవర్, ప్లేగ్, కలరా తదితర బ్యాక్టీరియాలను ప్రజల్లోకి పంపుతారు. ఎబోలా, లస్సా ఫీవర్, ఎల్లో ఫీవర్, డెంగీ వంటి వైరస్‌లనూ సమాజంలోకి వదిలే అవ కాశం ఉంది. ఇలా దాదాపు 36 రకాల బ్యాక్టీ రియాలు, వైరస్లు, ఫంగీ, టాక్సిన్స్‌లను బయో టెర్రరిజంలో ఉపయోగించేవిగా గుర్తించారు. ఆంత్రాక్స్ను పోస్టల్ కార్డుల ద్వారానూ.. కరపత్రాల ద్వారానూ వ్యాపిం పజేసే ప్రమాదమూ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వివిధ దేశాలు ఇలాంటి బయో టెర్రరిజాన్ని వాడుకుంటున్నాయి. ఉగ్ర వాదులూ దీన్నో సాధనంగా ఉపయోగించు కుంటున్నారు. 1984లో అమెరికాలోని డల్లాస్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పాల్గొనకుండా రెస్టారెంట్లు, స్టోర్లు తదితర చోట్ల సాల్మొనిల్లా టైఫీమురియం అనే బ్యాక్టీరియాను కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు వ్యాపింపజేశాయి. దీంతో 750 మంది ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆంత్రాక్స్ను జంతువులపై ప్రయోగించారు. 1972లో ఇద్దరు అమెరికా విద్యార్థులు షికాగోలోని ప్రజా నీటి సరఫరా ట్యాంకుల్లో టైఫాయిడ్ బ్యాక్టీరియాను వ్యాపింపజేశారు. 1993లో టోక్యోలో ఒక మత సంస్థ ఆంత్రాక్స్ బ్యాక్టీరి యాను వ్యాపింపజేసింది. ఇలా బయో టెర్రరి జానికి సంబంధించి వందల ఉదాహరణ లున్నాయి. ఇటువంటి వాటికి దేశంలో చెక్ పెట్టాలనేదే కొత్త చట్టం ఉద్దేశం. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో రాష్ట్రాల్లోకి కేంద్ర బలగాలు.. ఆరోగ్య రంగం రాష్ట్రాలకు సంబం ధించిన అంశం. అయితే బయో టెర్రరిజం, ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని నివారించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర బలగాలు రాష్ట్రాల్లోకి నేరుగా ప్రవేశించేందుకు నూతన చట్టం వీలు కల్పిస్తుంది. ఎవరి మీదనైనా.. సంస్థలపైనా అనుమానం ఉంటే ఎటువంటి హెచ్చరికలు లేకుండా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అలాగే బయో టెర్రరిజం కుట్రలో భాగంగా వైరస్, బ్యాక్టీరియా ఉన్న వ్యక్తి తాను వైద్యం చేయించుకోనంటే కుదరదు. వారిని బలవంతంగా పట్టుకొచ్చి చికిత్స చేయిస్తారు. మానవ హక్కుల పేరుతో ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. కాగా, ఈ బిల్లును తాము స్వాగతిస్తున్నా మని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఆ టైమ్‌లో చాలా ఇబ్బందిగా ఉంటోంది
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ధనరాజు, అనకాపల్లి మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ నా కిడ్నీ పాడైందా?! కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత పదేళ్ల నుంచి డయాబెటిస్తో బాధపడుతున్నాను. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. కానీ ఒకసారి శరీరంలో చక్కెరస్థాయి పెరిగి కళ్లు తిరిగి పడిపోయాను. చికిత్స తర్వాత కొన్నాళ్ల పాటు డాక్టర్లు ఇన్సులిన్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం వారి సూచనల మేరకే మళ్లీ మందులు వాడుతున్నాను. అయితే కొంతకాలం నుంచి నా ముఖం చాలా ఉబ్బినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా కాళ్లలో వాపుతో పాటు మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండి కాస్త ఇబ్బంది కలుగుతోంది. ఈ లక్షణాలతో నేను తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాను. ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు, ఆఫీసులోని కొలీగ్స్ అందరూ కిడ్నీ పాడైపోయిందని భయపెడుతున్నారు. అసలు నాకు ఏమైంది? వాళ్లు చెబుతున్నది నిజమేనా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శ్రీనివాస్, అనంతపురం మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. మీకు కాళ్లలో వాపులతో పాటు ముఖం ఉబ్బినట్లుగా ఉందని చెబుతున్నారు. అయితే వీటితో పాటు ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం లాంటి లక్షణాలతో ఏమైనా సతమతమవుతున్నారా... అనే విషయాలను కాస్త గమనించండి. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మంచి నెఫ్రాలజిస్టును సంప్రదించండి. వారు మీకు ముందుగా సీరమ్ క్రియాటినిన్, అల్ట్రా సౌండ్ లాంటి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఏమైనా అసాధారణ ఫలితాలు వస్తే మరింత లోతుగా పరిశీలించేందుకు జీఎఫ్ఆర్, స్కానింగ్ లాంటి పరీక్షల ద్వారా కిడ్నీ పనితీరును క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలితే అందుకు తగ్గట్లుగా చికిత్సా విధానాన్ని అవలంబిస్తారు. ఇందుకు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కిడ్నీ సమస్యకు మంచి మందులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన పలితాలు పొందగలుగుతారు. అలాకాకుండా మీరు చికిత్సపై అనుమానాలు పెంచుకుని డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే మీ సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్కు గురైన కిడ్నీకి చికిత్సను తాత్సారం చేస్తే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. ఒక్కోసారి ఏకంగా కిడ్నీనే తొలగించాల్సి వస్తుంది. డయాబెటిస్ ఉందని చెప్పి మీరు మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. మాంసాహారాన్ని మితంగా తినండి. మద్యపానం, పొగతాగడం వంటి దురలవాట్ల జోలికి వెళ్లకండి. మీ ఎత్తుకు తగిన విధంగా మీ శరీర బరువు ఉండేలా చూసుకోండి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, రోజుకు 4 నుంచి 6 లీటర్ల నీటిని తాగడం, తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఆహారాన్ని ఒక్కోసారి పెద్దమొత్తంలో తీసుకోకుండా... కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకునేలా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మీరు విలువైన సమయాన్ని వృథా చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్సను పొందండి. డాక్టర్ సాయిరాం రెడ్డి సీనియర్ నెఫ్రాలజిస్టు అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ సికింద్రాబాద్ -
పశువుల ఆరోగ్యం.. జర భద్రం!
అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి చికిత్స కంటే నివారణే మేలు పాకలను శుభ్రంగా ఉంచాలి వైద్యుల సలహాలు పాటించాలి - టేక్మాల్ పశువైద్యాధికారి బెంజ్‌మెన్ సలహాలు సూచనలు పశువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి అంటువ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకరమైన అంటువ్యాధులకు చికిత్సకు బదులు నివారణే ముఖ్యం. వాటిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఏ మాత్రం అనుమానం వచ్చిన వైద్యులను సంప్రదించాలని టేక్మాల్ పశువైద్యాధికారి బెంజ్‌మెన్ (సెల్: 96630 25553) తెలిపారు. వ్యాధుల నివారణకు పశువైద్యాధికారి సలహాలు, సూచనలు మీకోసం... - టేక్మాల్ - గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు రెండింటి నివారణకు రక్షాబయోవ్యాక్.. గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటువ్యాధి మూడింటి నివారణకు రక్షట్రయోవాక్ పేరుతో ఒకే టీకా లభిస్తుంది. - టీకాలను శీతలపరిస్థితిలో భద్రపరచడం, కంపెనీలు నిర్దేశించిన విధంగా మోతాదు వాడడం చల్లని సమయాల్లో టీకాలు వేయడం, ఆరోగ్యమైన పశువులకే వేయడం, బూస్టర్ డోసు వేయడం, టీకాలు గ్రామాల్లోని పశుసంపదకంతా సాముహికంగా వేయడం, టీకాలు వేసేప్పుడు సూదులు మార్చడం మొదలగు జాగ్రత్తలు తీసుకుంటే టీకాల వల్ల సత్ఫలితాలుంటాయి. - టీకాలు వేసేముందు పశువులకు అంతర పరాన్నజీవుల మందులు తాగిస్తే టీకాలు చక్కగా పని చేస్తాయి. సాధారణ వ్యాధులు, అంటువ్యాధులు అంత ప్రమాదకరమైనవి కానప్పటికీ.. పశువుల్లో ఉత్పాదక సామర్థ్యాన్ని హరించివేస్తాయి. అప్పుడప్పుడు ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి. ఈ రెండు రకాల అంటు వ్యాధుల నివారణకు ఈ కింది విషయాల్లో రైతాంగం శ్రద్ధవహిస్తే చాలావరకు పశువుల్ని సంరక్షించుకోవచ్చు. - వ్యాధిగ్రస్త పశువుల్ని మందనుంచి వేరుచేసి, సత్వరమే చికిత్స చేయించాలి. మిగతా ఆరోగ్యకరమైన పశువులకు వెంటనే టీకాలు వేయించాలి. - టీకాలు వేసిన తర్వాత పశువుల్లో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించడానికి 15-20 రోజుల సమయం పడుతుంది. టీకాల్ని వేయడం ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత త్వరగా వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. - వ్యాధిగ్రస్త పశువులు తినగా మిగిల్చిన మేత, దాణా, నీళ్లు పశువుల చొంగతో కలుషితమవడం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వాటిని తొలగించాలి. లేదా కాల్చివేయాలి. - వ్యాధిసోకి మరణించిన పశు కళేబరాలను సాధారణంగా నీటి ప్రవాహాలు, కాలువలు, కుంటలు, పచ్చికబయళ్లలో పడేయడం వల్ల వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. కళేబరాన్ని లోతైన గొయ్యితీసి పాతిపెట్టాలి. దొమ్మవ్యాధి సోకిన పశువుల్ని మరణించిన చోటే పాతిపెట్టాలి. ఎలాంటి పరిస్థితిలో కోయకూడదు. - టీబీ, హెచ్ఎస్ మొదలగు వ్యాధులు గాలి ద్వారా, శాసద్వారా వ్యాపిస్తాయి. పశువుల్ని పాకల్లో కిక్కిరిసి ఉంచకూడదు. పాకల్లో గాలి, వెంటిలేషన్ మెరుగ్గా ఉండేలా నిర్మించుకోవాలి. పశువులకు సరిపోను స్థలం ఉంచాలి. - జోరిగలు, దోమలు, గోమార్లు మొదలగు బాహ్యపరాన్న జీవులకాటు ద్వారా సర్రాథ్తేలేరియాసిన్ వంటి వ్యాధులు సోకుతాయి. సాయంత్రం వేళల్లో పాకల దగ్గర వేపాకు కాల్చాలి. అప్పుడప్పుడు పశువుల శరీరంపై, పాకల్లో బాహ్యపరాన్న జీవుల నిర్మూలన మందుల్ని పిచికారి చేయాలి. బాహ్యపరాన్నజీవుల బెడద తగ్గడానికి పాకల్లో చెత్త చెదారం లేకుండా, శుచి శుభ్రత పాటించాలి. - పశువుల మలమూత్రాల ద్వారా జలగ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. పాకల్ని రోజుకు రెండు సార్లు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేస్తూ పొడిగా ఉంచాలి. మురుగునీరు పారుదల సౌకర్యం బావుండేలా చూసుకోవాలి. పాకలో నేలమీద పొడిసున్నం చల్లుతుండాలి. - మందలోకి వ్యాధి ప్రవేశించకుండా వ్యాధులు సోకిన సమయాల్లో పశువుల్ని అమ్మడం, కొనడం చేయకూడదు. అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో సంతలు మూసివేయాలి. ఒక వేళ కొత్త పశువులను మందలో కలపాలంటే 15 రోజులు విడిగా ఉంచి, ఆరోగ్యంగా ఉందో లేదో పరిశీలించి మాత్రమే పాకల్లో ఉంచాలి. - పశువుల్లో వ్యాధులు ప్రబలినప్పుడు సామూహికంగా నీళ్లు తాగడం, మేత తినడం, తిరగడం చేయాకూడదు. పశువులు మేసే బయళ్లను కూడా మారుస్తుండాలి. - వర్షపు జల్లులు, వడగాలుల తీవ్రతకు గురవడం వల్ల, చాలాదూరం ప్రయాణించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురై వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లి గొంతువాపు వంటి వ్యాధులు సోకుతాయి. పశువుల్ని వాతావరణ తీవ్రత నుంచి సంరక్షించుకోవాలి. - పశువులకు పరిశుభ్రమైన, క్లోరినేషన్ చేసిన నీటిని అన్నివేళలా తాగేందుకు అందుబాటులో ఉంచాలి. పుష్టికరమైన పశుగ్రాసాలను, దాణాను అందిస్తుండాలి. - రేబిస్, బ్రూసెల్లోసిస్ మొదలగు వ్యాధులు పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే స్వభావం కలిగి ఉంటాయి. పశుపోషకులు, పనివాళ్ళు చేతులు, దుస్తులు శుభ్రంగా ఉంచుకోవాలి. - టీబీ ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్స కూడా లొంగని అనుత్పాదక పశువుల్ని పాకల్లో నుంచి తొలగించాలి. - బ్రూసెల్లోసిన్, ట్రైకోమోనియాసిస్, ఐబీఆర్ మొదలగు వ్యాధులు దున్నలు, ఆంబోతుల సంపర్కం ద్వారా వ్యాపిస్తాయి. ఆంబోతులు, దున్నల సంపర్కం పట్ల అప్రమత్తంగా ఉండాలి. - మాయ ద్వారా, గర్భకోశస్రవాల ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి. మేత కలుషితం అవుతుంది. స్రవాలు పొదుగుకు అంటుకోవడం వల్ల పొదుగు వాపు సమస్య ఉత్పన్నమవుతుంది. పశువుల పాకల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. - ఎలుకలు, కుక్కలు, పిల్లులు, పక్షులద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. జంతువులను, పక్షులను దూరంగా ఉంచాలి. - కలుషితమైన పాలు, మాంసం ద్వారా కూడా వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయి. వాటిని బాగా మరగబెట్టి లేదా ఉడికించి మాత్రమే వినియోగించాలి. - వాహనాలను, సందర్శకులను పశువుల పాకలోకి అనుమతించకూడదు. - పశువులను, దూడలను క్రమపద్ధతిలో డీవార్మింగ్ చేస్తుండాలి. - రోజూ ఉదయం, సాయంత్రం యజమాని స్వయంగా పశువుల ఆరోగ్యాన్ని పరిశీలిస్తుండాలి. -
వణికిస్తున్న అంటువ్యాధులు...
-ఏ ఇంట్లో చూసినా బాధితుల మూలుగులు! -మలేరియా,టైఫాయిడ్,అతిసారతో అస్వస్థత -వర్షాకాలంలో ముందస్తు చర్యలపై అధికారుల నిర్లక్ష్యం -అస్తవ్యవస్తంగా పారిశుధ్యం..పలు చోట్ల పైప్లైన్ల లీకేజీలు -జూన్ నుంచి జూలై 9వ తేదీ వరకు 164 మంది బాధితుల చేరిక తాండూరు (రంగారెడ్డి జిల్లా) అంటు వ్యాధులు వణికిస్తున్నాయి. తాండూరులో ఏ ఇంట్లో చూసినా ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్, అతిసార బాధితుల మూలుగులే వినిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరు వాంతులు,వీరేచనాలు, జ్వరాలతో బాధపడుతుండటం గమనార్హం. వద్ధుల నుంచి చిన్నారుల వరకు రోగాలతో మంచాన పడుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతున రోగుల సంఖ్య పెరుగుతున్నదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం, మురుగునీరు పారుదల వ్యవస్థతో అంటువ్యాధులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఏటు చూసినా ఇళ్ల మధ్య మడుగు కట్టిన మురుగు నీరు...చెత్పకుప్పలతో పరిసరాలు దుర్వాసనతో కంపు కొడుతున్నాయి. దాంతో అంటురోగాలు విజంభిస్తున్నాయి. వర్షాకాలంలో అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు కినుకువహిస్తున్నారు. ఇప్పటికే జ్వరాలతో బషీరాబాద్ మండలంలో ఇద్దరు విద్యార్థులు మత్యువాత పడ్డారు. తాండూరు పట్టణంతోచుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను రోగాలు బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో వందమందికిపైగా రోగాల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. తాండూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. సుమారు 65వేలకుపైగా జనాభా ఉంది. వార్డులోన్లి కాలనీలతోపాటు అంతర్గత రోడ్ల పక్కన చెత్తను తరలింపు సవ్యంగా సాగటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వ్యర్థాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నది. దోమల సమస్య ఉత్పనమవుతున్నది. అతిసార, మలేరియా, టైఫాయిడ్‌లు సోకి తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి,ప్రై వేట్ ఆసుపత్రి పాలవుతున్నారు. కాల్వలు లేకపోవడంతో ఆదర్శనగర్‌లో ఇళ్ల మధ్యనే మురుగునీరు నిలిచింది. మురుగునీరు కాల్వ నుంచి వెళ్లే తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో నీరు కలుషితమవుతున్నదని స్థానికులు వాపోతున్నారు. మరోచోట మురుగునీటి కాల్వలోనే తాగునీటి పైప్‌లైన్ ఉండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం వల్ల అంటువ్యాధులు సోకుతున్నాయని పట్టణ వాసులు వాపోతున్నారు. ఇదే ప్రాంతంలో ఇంకో చోట తాగునీటి పైప్‌లైన్ లీకేజీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ వర్షపునీరు నిలిచి తాగునీరు కలుషితమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల సంఖ్య ఇలా.. గత నెల జూన్‌లో 73మంది మహిళలు,పురుషులు, 54మంది చిన్నారులు, ఈనెల ఇప్పటి వరకు 37మంది మలేరియా,టైఫాయిడ్, అతిసార బారిన పడి జిల్లా ఆసుపత్రిలో చేరారు. వీరిలో కొంతమంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఒక్కొక్క మంచంపై ఇద్దరు రోగులకు చికిత్సల అందిస్తున్నారు. ప్రై వేట్ ఆసుపత్రిలో చేరుతున్న రోగులు ఉన్నారు. కలుషితనీరు,ఆహారమే కారణం కలుషితనీరు,ఆహార పదార్థాలతోపాటు దోమలు, పరిసరాల అపరిశుభ్రత తదితర కారణాల వల్లనే అతిసార,టైఫాయిడ్, మలేరియా వ్యాధులు సోకుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాచి వడబోసిన నీళ్లను సేవించాలి. వేడి పదార్థాలు తీసుకోవాలి. ప్రస్తుతం మలేరియా, టైఫాయిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అతిసార కేసులు కొన్ని నమోదు అయ్యాయి. రోగులకు చికిత్సలు అందిస్తున్నాం. కొందరు డిశ్చార్జి అయ్యారు. -భాగ్యశేఖర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
పదే పదే నోటి పూత... తగ్గేదెలా?
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. అతి తరచుగా ‘నోటిపూత’ వస్తోంది. మందులు వాడినా తగ్గడం లేదు. నోట్లో చిన్న చిన్న కురుపుల్లా వస్తున్నాయి. నీళ్లు తాగడం కూడా కష్టంగా ఉంటోంది. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేదం మందులు తెలియజేయగలరు. - భానుమతి, కరీంనగర్ నోటిపూత వ్యాధిని ఆయుర్వేదంలో ‘ఆస్యాపాకం’ అంటారు. ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం, బీ-కాంప్లెక్సు వంటి కొన్ని పోషకపదార్థాలు లోపించడం, నోటిలో స్థానికంగా కలిగే కొన్ని క్రిమిరోగాలు (ఇన్ఫెక్షన్లు), మానసిక ఒత్తిడి వల్ల కలిగే ఆందోళన, భయం, అభద్రతాభావం మొదలైనవి ఆస్యాపాకానికి ప్రధాన కారణాలు. చికిత్స : కారణాన్ని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. దీన్నే ‘నిదాన పరివర్జనం’గా ఆయుర్వేదం చెప్పింది. ఆహారం : తేలికగా జీర్ణమయ్యే లఘ్వాహారం (బార్లీ జావ, గోధుమజావ, మెత్తటి మజ్జిగ అన్నం మొదలైనవి) తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం, మసాలాలు దగ్గరికి రానివ్వకండి. అరటిపండు రోజూ తినండి. గోధుమరొట్టె (పుల్కా)ను పెరుగులో నానబెట్టి మెత్తగా చేసి తినండి, నీళ్లు ఎక్కువగా తాగండి. విహారం : మానసిక ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోండి. రాత్రివేళ కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. పడుకునే ముందు ఒక గ్లాసెడు పాలు తాగండి. రోజూ తేలికపాటి వ్యాయామం చెయ్యండి. రోజూ రెండుపూటలా ఖాళీ కడుపున పదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ఔషధం : {తిఫలాచూర్ణంతో కషాయం కాచుకుని, చల్లారిన తర్వాత నోటిలో పుక్కిలిపట్టి శుభ్రపరచుకోవాలి (ఉదయం, రాత్రి) లఘుసూతశేఖర రస (మాత్రలు) ఉదయం 2, రాత్రి 2 ఆమలకీ స్వరసం (ఉసిరికాయ రసం) : ఒక చెంచా తేనెతో రెండుపూటలా సేవించాలి. అల్లం, జీలకర్ర కషాయం : 20 మి.గ్రా. రోజూ ఉదయం పరగడపున తాగాలి. గమనిక : ఇవి వ్యాధి తగ్గేవరకు మాత్రమే గాక... ఎంత కాలమైనా సేవించవచ్చు. ఇంకా తగ్గకపోతే... జాజి ఆకు ముద్దను పలుచగా చేసి నోటిలో ఉంచుకొని, అనంతరం, నీటితో శుభ్రం చేసుకోవాలి లేదా చందనం (మంచిగంధం), పచ్చకర్పూరం కలిపి నేతితో నోటిలో పూతగా వాడవచ్చు. ఈ ముద్దను అరచెంచా, రెండుపూటలా కడుపులోకి సేవించవచ్చు. నా వయసు 44. షుగరు, బీపీవ్యాధులు లేవు. మూడునెలలనుండి మూత్రవిసర్జన చేసినప్పడు మంట, మూత్రం కొంచెం కొంచెంగా అవటం, చాలామార్లు రావటం జరుగుతోంది. డాక్టర్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనిచెప్పి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఆయుర్వేదంలో మంచిమందులుంటే చెప్పగలరు. పథ్యం తెలుపగలరు. - రాధాబాయి, తెల్కపల్లి మీరు ద్రపదార్థాలు పుష్కలంగా తాగండి. అంటే బార్లీనీరు, పులుపులేని మజ్జిగ, పుచ్చకాయ రసం మొదలైనవి. ఆహారంలో కారం, పులుపు తాత్కాలికంగా మానేయండి. ఉప్పు బాగా తగ్గించండి. పరిశుభ్రంగా ఉండే చెరుకు రసం తీసుకోండి. ఈ కింది మందులు ఒక నెలరోజులపాటు వాడండి. చంద్రప్రభావటి మాత్రలు ఉదయం 1, రాత్రి 1 గోక్షురాది గుగ్గులు మాత్రలు ఉదయం 1, రాత్రి 1 చందనాసవ ద్రావకం నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలుపుకుని రోజూ రెండుపూటలా తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
వ్యాధుల పంజా
మారుతున్న వాతావరణంతో పెరుగుతున్న అంటువ్యాధులు ఆస్పత్రుల్లో పెరుగుతున్న చికున్‌గన్యా, డెంగీ రోగుల సంఖ్య ఫాగింగ్ కూడా చేపట్టని అధికారులు రెండు నెలల్లో 374 చికున్ గన్యా, 548 డెంగీ కేసుల నమోదు బెంగళూరు: విజృంభిస్తున్న వర్షాలు, దోమల తీవ్రత, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, చికున్ గన్యా లాంటి వ్యాధులకు చిక్కిన ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు నగరంలోకూడా ఇదే పరిస్థితి నెలకొంది. బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో చెత్త నిర్వహణ అధ్వానంగా మారింది. పేరుకుపోతున్న చెత్త, ఇందుకు తోడవుతున్న చిరుజల్లులు వెరసి ఉద్యాననగరిలో దోమల స్వైరవిహారం పెరుగుతోంది. దీంతో నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికున్‌గన్యా, డెంగీ తదితర సమస్యలతో ఇబ్పంది పడుతున్న వారు నగరంలోని ఆస్పత్రుల వద్ద క్యూకడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో 213 చికున్‌గన్యా కేసులు నమోదు కాగా, మే-జూన్ మధ్య ఈ సంఖ్య 374కు పెరిగింది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 468 డెంగీ కేసులు నమోదు కాగా, మే-జూన్ మధ్య కాలాంలో ఈ సంఖ్య 548కు పెరిగింది. బెంగళూరు నగరంలో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 24 చికున్ గన్యా కేసులు నమోదు కాగా, మే-జూన్ కాలానికి ఈ సంఖ్య 40కు పెరిగింది. ఇక జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 29 డెంగీ కేసులు నమోదు కాగా, మే-జూన్ కాలానికి ఈ సంఖ్య 61కు పెరిగింది. కాగా, నగరంలో దోమల బెడద పెరిగిపోవడానికి బీబీఎంపీ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నిర్వహణలో పూర్తిగా విఫలమైన బీబీఎంపీ కనీసం వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సైతం నిర్లక్ష్యం వహిస్తోందని చెబుతున్నారు. ఈ విషయంపై నగరంలోని హెచ్ఆర్బీఆర్ లే అవుట్‌కు చెందిన విక్రమ్ మాట్లాడుతూ....‘మా ప్రాంతంలో చెత్త నిర్వహణలో బీబీఎంపీ పూర్తిగా విఫలమైంది. మూడు నాలుగు రోజులకోసారి చెత్తను తొలగిస్తున్నారు. కురుస్తున్న వర్షానికి చెత్త తోడై మరీ ఎక్కువగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. వాటి నివారణకు కనీసం ఫాగింగ్ కూడా చేయలేదు. జూన్ నెల ప్రారంభం నుంచి ఇప్పటి దాకా మా ప్రాంతంలో డెంగ్యీతో ఒకరు చనిపోగా, పది మంది ఆస్పత్రిలో చేరారు’ అని తెలిపారు. ఇక ఈ విషయంపై మస్కిటో కంట్రోల్ బీబీఎంపీ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ....‘ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ను ప్రారంభించాం. దోమలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. 60శాతం మురికి వాడల్లో ఈ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేశాం’ అని చెప్పారు. -
చెయ్యి దాచేశారు..!
దక్షిణ బ్రెజిల్‌లోని ఒర్లీన్స్ పట్టణంలో నివసించే 42 ఏళ్ల కార్లోస్ మరియోట్టి ఓ ఫ్యాక్టరీలో మెషీన్ ఆపరేటర్. ఒకరోజు ఏమరుపాటుగా ఉండటంతో ప్రమాదానికి గురయ్యాడు. అతని ఎడమ చెయ్యి యంత్రాల మధ్యకు వెళ్లిపోయి అరచేతికి ఇరువైపులా చర్మం ఒలిచేసినట్లుగా ఊడిపోయింది. ఇన్ఫెక్షన్ సోకకూడదనుకుంటే మోచేయి దాకా చేతిని తొలగించాల్సిందే. ఇలాంటి తరుణంలో డాక్టర్లు ఓ వినూత్న ఆలోచన చేశారు. అతని పొట్టకు రంధ్రం చేసి డామేజి అయిన చెయ్యిని ఇలా పొట్టచర్మం కిందకు పెట్టేసి... పైనుంచి సాఫ్ట్టిష్యూ పెట్టి కుట్టేశారు. చూసేవారికి వింతగా కనపడుతున్నా... ఓ ఆరువారాల తర్వాత చేయిని పొట్టలోంచి తీసి వేరేచోటి నుంచి చర్మం తీసి గ్రాఫ్టింగ్ చేస్తారట. అప్పటిదాకా ఇన్ఫెక్షన్లు సోకకుండా ఇలా పొట్టలో చెయ్యిని దాచేశారన్న మాట. -
బీపీ, షుగర్ ఉన్నా... బైపాస్ సర్జరీ చేయవచ్చు
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు తొమ్మిదేళ్లు. వేసవిలో బాగానే ఉంటుంది కానీ, వర్షాకాలం, శీతాకాలాలలో విపరీతమైన జలుబు, ముక్కు దిబ్బెడ, తలనొప్పితో బాధపడుతుంటుంది. డాక్టర్‌కు చూపిస్తే సైనసైటిస్ అని చెప్పి, ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోలో ఈ సమస్యకు పరిష్కారం ఉంటే చెప్పగలరు. - పుష్ప, హైదరాబాద్ ప్రతి ఒక్కరిలోనూ నుదురు, కళ్లకు కింది భాగంలో ముక్కుకు రెండువైపులా గాలితో నిండిన సంచుల్లాంటి నిర్మాణాలుంటాయి. వీటినే సైనస్ అంటారు. ఈ సైనస్‌లు మెత్తటి శ్లేష్మపు పొరతో కప్పి ఉంటాయి. ఈ పొర ఒక పలుచటి ద్రవపదార్థాన్ని నిరంతరం ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ ద్రవపదార్థం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముక్కు రంధ్రాల్లోకి చేరుకుంటుంది. కాని కొన్ని సందర్భాల్లో ఇది ప్రవహించే మార్గంలో అవరోధాలు ఏర్పడి, అది సైనసైటిస్‌కు దారి తీస్తుంది. దీంతో సైనస్ భాగాలలో నొప్పితో బాటు బరువెక్కినట్లుంటుంది. తరచు జలుబు, అలర్జీ, నాసల్ పాలిప్స్, ముక్కు రంధ్రల మధ్య గోడ పక్కకు మరలడం, సైనస్ ఎముకలు విరగడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సైనసైటిస్ వస్తుంది. రకాలు: సైనసైటిస్ ముఖ్యంగా రెండురకాలు. 1. నాలుగు వారాలు లేదా అంతకంటే తక్కువ కాలవ్యవధిలో ఎక్కువగా ముక్కు నుంచి నీరు కారడం, నొప్పి ఉంటాయి. దీనినే అక్యూట్ సైనసైటిస్ అంటారు. 2. వ్యాధిలక్షణాలు 8 వారాలకంటే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దానిని క్రానిక్ సైనసైటిస్ అంటారు. లక్షణాలు: ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, వాసన తెలియకపోవడం, దగ్గు, జ్వరం, పంటినొప్పి, శ్వాసపీల్చుకోవడం ఇబ్బందిగా ఉండటం, నాసికా రంధ్రాలలో చీము పట్టడం, తల ముందుకి వంచినప్పుడు నొప్పిగా, బరువుగా ఉండటం, తలనొప్పి, చెవులు బరువెక్కడం, నీరసం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. నిర్థారణ: ఎక్స్‌రే, సీటిస్కాన్, ఎమ్మారై, నాసల్ ఎండోస్కోపీ, ఐజీఐ, అలర్జీ టెస్ట్, పి.ఎఫ్‌టి ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో సైనసైటిస్‌కు ప్రత్యేక రీతిలో, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అధునాతనమైన కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురైన రోగనిరోధక శక్తిని సరిచేసి, సైనసైటిస్‌ను సంపూర్ణంగా నివారిస్తారు. శరీరంలో రోగనిరోధకతను పెంపొందించి, తద్వారా అన్ని ప్రతికూల పరిస్థితులలో ఆరోగ్యవంతమైన జీవనం సాగించే విధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ కచ్చితమైన వైద్యాన్ని అందిస్తుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 62 ఏళ్లు. గత మూడు నెలలుగా తల నొప్పి, మాట్లాడటం కష్టం కావడం, కొద్దిగా వినికిడి లేకపోవడం, అప్పుడప్పుడూ వాంతులు వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాం. ఆయన ఎమ్మారై స్కానింగ్ తీయించి, మెదడులో ట్యూమర్స్ ఉన్నాయని అన్నారు. దీనికి చికిత్స వివరాలు తెలుపండి. - ఆర్. వెంకటేశ్వర్లు, చీరాల మెదడు కణజాలంలో అసాధారణ పెరుగుదల వల్ల బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడతాయి. ఇందులో ఒక రకం క్యాన్సర్ ట్యూమర్. ఇందులో మళ్లీ రెండు రకాలు ఉంటాయి. మొదటిది మెదడులోనే ఏర్పడుతుంది. రెండోరకం శరీరంలోని ఇతర భాగాల్లో మొదలై... మెదడుకు వ్యాపించి, అక్కడ ట్యూమర్‌గా ఏర్పడుతుంది. మెదడు ట్యూమర్ వల్ల తలనొప్పి, ఫిట్స్, కంటిచూపు, నడక, మాట, స్పర్శలో తేడారావడం, వాంతులు, మానసికమైన మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు ట్యూమర్ల నిర్ధారణ చేయడానికి సీటీ స్కానింగ్, ఎమ్మారై వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్స ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ట్యూమర్లు నెమ్మదిగా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి వాటికి జీవితకాలంలోనే ఎలాంటి శస్త్రచికిత్సా అవసరం ఉండకపోవచ్చు. చికిత్స ఎంతవరకు సఫలం అవుతుందన్న విషయం మెదడులో ఆ ట్యూమర్ ఉండే ప్రదేశాన్ని బట్టి, ఎంత త్వరగా పెరుగుతుందన్న అంశం పైన ఆధారపడి ఉంటుంది. మెదడులోనే పుట్టే ప్రైమరీ ట్యూమర్ల కంటే ఇతర చోట పుట్టి, మెదడుకు వ్యాపించే సెకండరీ లేదా మెటస్టాటిక్ ట్యూమర్లు మరింత వేగంగా పెరుగుతాయి. పరిమాణంలో పెద్దవిగా ఉన్న ట్యూమర్లకు సర్జరీ తప్పనిసరి. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమైన అవయవాలకు వెళ్లే నాడులకు ట్యూమర్లు దగ్గరగా ఉంటే వాటిని పూర్తిగా తొలగించడానికి వీలుపడదు. అలాంటప్పుడు ట్యూమర్‌ను కొంతమేరకు తీసివేసి, మిగిలిన దాన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. న్యూరో సర్జరీ విభాగంలో ఎస్.ఆర్.ఎస్. అనే చికిత్స ప్రక్రియ భవిష్యత్తులో మరింత చిన్న చిన్న ట్యూమర్లకూ మరింత సమర్థంగా అందించే దిశగా ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. డాక్టర్ టి.వి.ఆర్.కె. మూర్తి సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ కార్డియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 54 ఏళ్లు. ఏడాది క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆయాసపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే పరీక్షలు చేసి, బైపాస్ చేయాలంటున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - ఏ. సుబ్బారాయుడు, రాజమండ్రి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడితేనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్ బైపాస్ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలగుతున్నారు. అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ 3 - 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే 50 పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం. బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. డాక్టర్ సుఖేష్ కుమార్ రెడ్డి సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ యశోద హాస్పిల్స్ సోమాజిగూడ హైదరాబాద్ -
ఉదయం వేళల్లో తలనొప్పి వస్తుందా..?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 65. ఆవిడకు తరచు తల తిరిగినట్టు ఉంటుంది. అలాగే చెవిలో హోరు, చెవి నొప్పితో రాత్రిళ్లు సరిగా నిద్రలేక బాధపడుతున్నారు. దయచేసి ఆమె సమస్యలకు సరైన హోమియో మందు సూచించగలరు. - సూర్య, హైదరాబాద్. చెవిలో ముఖ్యంగా మూడుభాగాలుంటాయి. అవి 1. చెవి వెలుపలి పొర 2. మధ్య పొర 3. లోపలి పొర. ఈ మూడు పొరలకు ఇన్ఫెక్షన్స్ లేదా ఏమైనా వ్యాధులు వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవడం వల్ల వచ్చి తగ్గుతుంటాయి. ఒక్కోసారి ఇవి దీర్ఘకాలికంగా కూడా రావచ్చు. త్వరితంగా వచ్చేవాటిని ఎక్యూట్ సప్పురేటివ్ ఒటైటిస్ మీడియా, దీర్ఘకాలికంగా వచ్చే వాటిని క్రానిక్ సప్పురేటివ్ ఒటైటిస్ మీడియా అంటారు. మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎలర్జీ వల్ల ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ముఖ్యలక్షణాలు: చెవినొప్పి, సరిగ్గా వినిపించకపోవడం, చెవి పట్టేసినట్లుగా అనిపించడం, జ్వరం, తల దిమ్ము, ఏ పనీ చేయాలనిపించకపోవడం. తల తిరగడం: తల తిరగడాన్ని వెర్టిగో అంటారు. పడుకున్నప్పుడు లేదా పడుకుని అకస్మాత్తుగా లేచినా, పైకి చూసినా వెర్టిగో వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. మినియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో తల తిరగడం, సరిగా వినిపించకపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఎకోస్టిక్ న్యూరోమా: దీనిలో చెవి లోపల కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరు, నడిచేటప్పుడు సరిగా బ్యాలెన్స్ లేకపోవడం, ముఖం నిండా తిమ్మిరి రావడం లక్షణాలు కనిపిస్తాయి. ల్యాబరెంత్రైటిస్, వెస్టిబ్యూల్ న్యూరైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో తల తిరుగుడు, వికారం, వినికిడి లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితోబాటు ఓటోస్కిలోరిసిస్, టినిటస్ లాంటి సమస్యలు కూడా సాధారణమే. చెవి, ముక్కు, గొంతు సమస్యలకు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యల వల్ల రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల, మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది. హోమియో చికిత్స: పాజిటివ్ హోమియోపతిలో వ్యాధి మూలకారణాలను విశ్లేషించి, రోగి శారీరక, మానసిక తత్వాలను బట్టి జెనిటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, వ్యాధికి శాశ్వత నివారణ జరుగుతుంది. న్యూరో సర్జికల్ కౌన్సెలింగ్ ఉదయం వేళలలో తలనొప్పి వస్తుందా..? నా వయసు 35. నేను కాల్సెంటర్లో పని చేస్తున్నాను. ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తుంటాను. నాకు ఇటీవల బాగా తలనొప్పి వస్తుంది. తల బాగా బరువెక్కినట్లు ఉంటుంది. ఒక్కోసారి తలనొప్పి ప్రారంభమై క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా తలనొప్పే కదా అంతగా పట్టించుకోలేదు. కానీ నెలరోజులుగా తలనొప్పి నన్ను బాధిస్తోంది. అప్పుడప్పుడు తగ్గి మళ్లీ వస్తోంది. తలనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతున్నాను. ఏకాగ్రతతో ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. - సంతోష్ కుమార్, హైదరాబాద్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీలో మెదడు సంబంధిత సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. మీకు ఉదయం లేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు వాంతులు అవుతున్నాయా చూసుకోండి. ఒకవేళ ఉదయం తలనొప్పితో పాటు వాంతులు అవుతుండటం, వాంతి చేసుకోగానే తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం వంటి లక్షణాలు కనిపిస్తే దానిని బ్రెయిన్ ట్యూమర్‌గా అనుమానించాలి. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే వాంతి చేసుకున్న తర్వాత తలనొప్పి తగ్గి, సాధారణంగా అనిపిస్తుంది. దాంతోపాటు చూపులో కూడా తేడా వస్తుంది. మనకు కనిపించే వస్తువులు కూడా అస్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు ఉంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోండి. ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారణ అయినా మీరు ఆందోళన చెందకండి. ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్‌కు అందుబాటులో అత్యాధునిక వైద్యప్రక్రియలో సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. వ్యాధి దశను బట్టి చికిత్స ఉంటుంది. మీ కుటుంబంలోగానీ, మీ వంశంలోగానీ ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ సమస్య ఉంటే కనుక బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పల్మనాలజీ కౌన్సెలింగ్ మా బ్రదర్‌ని మా ఊరు హాస్పిటల్లో చేర్చాము. ‘ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూలో ఉంచాల’న్నారు. ఒక రోజు తర్వాత ‘సీరియస్‌గా ఉంది, హయ్యర్ సెంటర్‌కి తీసుకెళ్లమ’న్నారు. హాస్పిటల్ మార్చాం. రోజుకయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. కౌంటర్లో అడిగితే ఇది అన్ని సౌకర్యాలున్న హైఎండ్ ఐ.సి.యు. అన్నారు. మాకు ఏం జరుగుతుందో సరిగా అర్థం కావడం లేదు. మంచి ఐ.సి.యు. అంటే ఏమిటి? ఖర్చులో అంత తేడా ఎందుకుంది? - వి.ఆర్. వసంత్, కోదాడ ఐ.సి.యు. రెండు రకాలు. ఓపెన్ అని, క్లోజ్డ్ అని. పాశ్చాత్య దేశాలలో సాధారణంగా క్లోజ్డ్ ఐ.సి.యు.లు ఉంటాయి. ఓపెన్ అంటే ఏ కన్సల్టెంట్ అయినా తన పేషెంట్‌ను ఐ.సి.యు.లో డెరైక్ట్‌గా చేరుకోవచ్చు. అవసరాన్ని బట్టి స్పెషలిస్ట్‌ని పిలిచి చూపిస్తారు. క్లోజ్డ్ అంటే, క్రిటికల్ కేర్‌తో క్వాలిఫికేషన్ ఉండి, పేషెంటు సీరియస్‌గా ఉన్నప్పుడు అవసరమైన ఏ స్పెషాలిటీకి సంబంధించిన నిర్ణయమైనా తీసుకొనగలిగి, మరియు ఏ స్పెషాలిటీకి సంబంధించిన అత్యవసరమైన ప్రొసీజర్స్ వెంటనే చేయగలిగిన సమర్థమైన డాక్టర్లు ఐ.సి.యు.లో 24 గంటలూ ఉంటారు. అందువల్ల పేషెంటు బ్రతికే ఛాన్సు క్లోజ్డ్ ఐ.సి.యు.లో ఎక్కువ. అంతేకాకుండా మంచి ఐ.సి.యు. అంటే లెవెల్-3 ఐ.సి.యు. అంటారు. ఇవి సాధారణంగా టెరిషియరీ కేర్ / రిఫరల్ సెంటర్స్‌లోనే ఉంటాయి, అంటే పేషెంటుకు కావలసిన యంత్రాలు, ఇతర పరికరాలు, మానిటర్లు ప్రతి పేషెంటుకి 24 గంటలు ఒక ట్రైన్డ్ నర్స్ ఉండాలి. సాధారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంటుకి చాలా లైన్లు, ట్యూబులు, శరీరంలోకి, రక్తనాళాలలోకి, ఊపిరితిత్తులలోకి ఉంటాయి. అందువల్ల ఐ.సి.యు.లో అనుకోని ఘటనలు (యాక్సిడెంట్స్) జరగకుండా, పేషెంటుకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, వీటివల్ల ప్రాణహాని కలుగకుండా ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు, ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకొనే జాగ్రత్తలు అన్నిటి వల్ల ఖర్చు పెరుగుతుంది. ఇక మీ బ్రదర్ విషయానికొస్తే అతడికి ఎ.ఆర్.డి.ఎస్. అంటే (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్). ఇది లంగ్స్‌కు వచ్చే చాలా సీరియస్ జబ్బు. ఇలాంటి పేషెంట్లు ప్రపంచంలో 100లో 40 మంది దాకా చనిపోతుంటారు. ముందుగా సరిపడా మందులు (యాంటీబయాటిక్స్) మొదలుపెట్టి, పేషెంట్‌కి కావలసిన ఇతర సపోర్ట్స్ అన్నీ సమకూర్చి; జబ్బు వచ్చినప్పుడు ఏ ఇతర అవయవ వ్యవస్థలు ప్రభావితం కాకుండా ఉండి, ఇతర సమస్యలు (అంటే బి.పి., షుగరు, కిడ్నీ, లివర్ జబ్బులు వంటివి) లేకుండా ఉంటే బ్రతికే చాన్సులు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లను అడగండి. వివరిస్తారు. -
తల్లుల బాధ్యత..
కేరెంటింగ్ పసిపిల్లలకు స్నానానికి ముందు ఏదైనా నూనెతో మసాజ్ చేస్తుంటారు. దాంతో పాటు బ్రెడ్‌తో స్క్రబ్ కూడా చేస్తే వారి మృదువైన చర్మం మరింత కాంతిమంతంగా మారుతుంది. అందుకోసం 3-4 బ్రెడ్ ముక్కలను పచ్చిపాలలో నానబెట్టాలి. అందులోకి పాలు ఇంకి మెత్తగా అయ్యాక వాటిని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని పిల్లల చర్మానికి స్క్రబ్‌లా వాడాలి. అలా ప్రతిరోజూ చేస్తే మృదువైన చర్మంతో పాటు వారికి ఎలాంటి అలర్జీలు రాకుండా ఉంటాయి. చిన్నారులకు డైపర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి వాడిన ప్రదేశాల్లో అలర్జీ, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోనే డైపర్ క్రీమ్ తయారు చేసుకోవడం మంచిది. దానికి ఓ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. దాని పైన ఓ మూతలో కొద్దిగా కొబ్బరి నూనె, రెండు చేమంతి పూలు వేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ కొబ్బరి నూనె ఎల్లో క్రీమ్‌లా తయారవుతుంది. దాన్ని డైపర్ల అంచుకు రాస్తే అది మంచి లోషన్‌గా ఉపయోగపడుతుంది. -
టైప్ చేస్తున్నప్పుడు వేళ్లు నొప్పి..!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 28. ఒక కంపెనీలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. కంప్యూటర్‌పై టైపింగ్ పని ఎక్కువగా చేస్తుంటాను. ఇటీవల టైప్ చేస్తున్న సమయంలో నా వేళ్లు ఎంతో నొప్పిగా ఉంటున్నాయి. రాత్రివేళల్లో చేతిలో సూదులు గుచ్చుతున్నంత బాధ ఉంటోంది. నా చేతులు బలహీనమైనట్లుగా కూడా అనిపిస్తోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - రాధిక, హైదరాబాద్ మన చేతులకు సంబంధించిన నరాలు మణికట్టు దగ్గర ఒక సన్నటి ద్వారం గుండా అరచేతుల్లోకి వెళ్తుంటాయి. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ మణికట్టులోని ఎముకలు అరుగుదలకు గురవుతుంటాయి. దాంతో మణికట్టు గుండె వెళ్లే నరాలకు మార్గం మరింత సన్నబడుతుంది. ఒక్కోసారి మహిళలు గర్భవతి అయినప్పుడు నీరు వచ్చినట్లగానే మణికట్టులోనూ నీళ్లు చేరుతుంటాయి. దాంతోపాటు టైపింగ్ సమయంలో మన మణికట్టును కాస్త ఒంచి టైప్ చేస్తుంటాం. దానివల్ల నరాల ప్రవేశద్వారం మరింత సన్నబడుతుంది. ఫలితంగా నరాలపై ఒత్తిడి పడి అరచేతుల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చుతున్న బాధ కలుగుతాయి. మీ విషయంలో ఒకసారి నర్వ్ కండక్షన్ స్టడీ పరీక్షలు చేయించి, వ్యాధిని దాని తీవ్రతను తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. నా వయసు 30 ఏళ్లు. ఈ వయసులోనే నాకు మోకాళ్లలో నొప్పులు వస్తున్నాయి. మెట్లు ఎక్కులేకపోతున్నాను. మా అమ్మ, అమ్మమ్మ - వీళ్లిద్దరూ మోకాళ్లలో నొప్పులతో బాధపడ్డారు. వాళ్లిద్దరికీ ఆర్థరైటిస్ ఉందని తేలింది. ఇది వారసత్వంగా కుటుంబాల్లో రావచ్చని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. దాంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. కుటుంబంలో అమ్మకు ఆర్థరైటిస్ వస్తే నాకూ వస్తుందా? దయచేసి వివరించండి. - ధనలక్ష్మి, ఒంగోలు మెట్లు ఎక్కే సమయంలో మోకాళ్లలో నొప్పి వస్తే... అది ఆర్థరైటిస్ కాకపోవచ్చు. మీ అమ్మ, అమ్మమ్మకు ఆర్థరైటిస్ అన్నది వయసుతో పాటు వచ్చిన సమస్య. మీరు ఆందోళన పడకుండా మీ సమస్య నిర్ధారణ కోసం ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. హోమియో కౌన్సెలింగ్ నాకు తరచూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. హోమియో వైద్యవిధానంలో తగ్గే మార్గం చెప్పండి. - సూర్యనారాయణ, మెదక్ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ)గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రా ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన కొందరిలో ఈ-కొలై అనే బ్యాక్టీరియా దీనికి కారణం కావచ్చు. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా ఉంటుంది. మలవిసర్జన సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ-కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే హెచ్ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలి, జ్వరం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు: యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ హోమియోపతి చికిత్స: వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి - బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. ఇటీవల ఒకసారి రక్తం తగ్గితే, దాత నుంచి రక్తాన్ని స్వీకరించాను. ఆ తర్వాత నాకు హైఫీవర్ వచ్చింది. వైద్యపరీక్షలు చేయించుకుంటే, నాకు హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. ఈ వ్యాధి గురించి వివరాలు తెలపండి. - ఒక సోదరుడు, గుంటూరు హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ చాలా వేగంగా కాలేయానికి చేరి, సమస్యతు తెచ్చిపెడుతుంది. ఇది ఒక రకంగా హెచ్ఐవీ కంటే కూడా చాలా ఎక్కువరెట్లు ప్రమాదకరమైనది.ఇది రక్తం, లాలాజలం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా వ్యాపించవచ్చు. వైరస్ చేరిన వెంటనే పెద్దగా లక్షణాలు కనిపించకపోవచు కొంతమందిలో ఫ్లూ లాంటి జ్వరం, తీవ్రమైన అలసట, వికారం, కళ్లు, ఒళ్లు పచ్చబారటం వంటి కామెర్ల లక్షణాలు, కడుపునొప్పి, విరేచనాలు, కీళ్లనొప్పులు రావచ్చు. దీన్ని గుర్తించేందుకు యాంటిజెన్ పరీక్షలు చేస్తారు. వైరస్ చేరిన వెంటనే పరీక్షలలో ఈ విషయం తెలియదు. ఇన్ఫెక్షన్ సోకిన ఆరు నుంచి పన్నెండు వారాల తర్వాత మాత్రమే పాజిటివ్ ఫలితం వస్తుంది. ఆ సమయంలో మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. దీనికి బారిన పడిన పది మందులో తొమ్మిది మందికి ఆర్నెల్లలో అదే తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రమే వ్యాధి శరీరంలో ఉండిపోయి, అది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా మారుతుంది. దాంతో కాలేయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. లివర్ క్యాన్సర్‌గా రావడానికి హెపటైటిస్-బి ఒక ముఖ్య కారణం. ఇది సోకినప్పుడు ఇన్ఫెక్షన్ ముదరకుండా కాలేయం దెబ్బతినకుండా చికిత్స అందిస్తారు. ఇంటర్ఫెరాన్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. కొన్నివారాలా పాటు మందులు వాడితే వైరస్ పెరుగుదల ఆగిపోతుంది. కొన్సిసార్లు జీవితాంతం మందులు వాడాల్సి రావచ్చు. శరీరంలో హెపటైటిస్-బి వైరస్ ఉండేవారి రక్తం నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి సూదులు, సిరంజీలు, బ్లేడ్లు, టూత్‌బ్రష్‌లతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. కాబట్టి ఇలాంటి వస్తువులు వాడటంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరు వాడిన వస్తువులను మరొకరు వాడకపోవడం ద్వారా హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ను నివారించవచ్చు. రక్తమార్పిడితో పాటు అది వ్యాపించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను నివారించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు. -
గైనకాలజీ కౌన్సెలింగ్
తెలుపు అవుతోంది, ప్రమాదమా? నా వయసు 24. పెళ్లికాలేదు. నాకు ప్రతిరోజూ కొంచెం తెల్లబట్ట అవుతోంది. కేవలం పీరియడ్స్ ముందు మాత్రమే అలా అవుతుంటుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇదేమైనా సమస్యకు సూచనా? ఇలా ఎందుకు అవుతోంది? నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - మను, ఈ-మెయిల్ పెళ్లికాని అమ్మాయిల్లో తెల్లబట్ట అవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయ ముఖద్వారంలో, యోనిభాగంలో మ్యూకస్గ్రంథులు ఉంటాయి. వాటి నుంచి హార్మోన్ల ప్రభావం వల్ల నీరులాంటి, వాసనలేని స్రావాలు విడుదలవుతుంటాయి. అవి ఎక్కువగా నెలసరికి ముందు, నెలసరి మధ్యలో అంటే అండం విడుదలయ్యే సమయంలో వెలువడుతుంటాయి. దీనివల్ల వాసన, దురద ఉండదు. అంతేగాక ఇది హానికరం కూడా కాదు. ఇక కొందరిలో ఫంగల్, బ్యాక్టీరియల్, ట్రైకోమొనియాసిస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వైట్ డిశ్చార్జి అవుతుంది. ఇది పెరుగులాగా, ముక్కలుగా, నురగలా, కొంచెం పచ్చగా ఉండి, దురద, మంట, వాసనతో ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కొంతమందిలో నులిపురుగులున్నా, వైట్డిశ్చార్జీ అవుతుంది. మలబద్ధకం వల్ల కూడా వైట్ డిశ్చార్జి సమస్య రావచ్చు. కొంతమందిలో రక్తహీనత వల్ల రోగనిరోధకశక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల కూడా ఇదే సమస్య రావచ్చు. ఈకాలం అమ్మాయిలు బిగుతైన దుస్తులు, జీన్స్, నైలాన్ ప్యాంటీస్ వంటివి ఎక్కువగా ధరిస్తున్నారు. దాంతో జననాంగాలకు గాలిసోకక, ఆ ప్రాంతంలో చెమట ఎక్కువగా పట్టి ఇన్ఫెక్షన్స్కు దారితీయవచ్చు. జననాంగాల వద్ద ఉండే రోమాలను రెండువారాలకొకసారి తొలగించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్లను తగ్గించుకునేందుకు కొందరు యాంటీసెప్టిక్ లోషన్స్‌తో ఆ ప్రాంతాల్లో శుభ్రం చేసుకుంటుంటారు. ఇలా యాంటీసెప్టిక్ లోషన్స్‌తో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడం సరికాదు. దానివల్ల యోనిభాగంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (లాక్టోబాసిలై) నశిస్తాయి. ఇవి యోనిలో స్రావాలు సరైన ‘పీహెచ్’ పాళ్లలో ఉండేలా చూసి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంటాయి. మీరు అక్కడ శుభ్రం చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే లాక్టోబాసిలైతో కూడిన ‘ఫెమినైన్ వాష్’లను వాడుకోవచ్చు. ఇక ఆహారంలో తీసుకునే పెరుగులో కూడా లాక్టోబాసిలై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగు, మజ్జిగ లాంటివి ఎక్కువగా వాడటం కూడా మంచిదే. లోదుస్తులుగా కాటన్ ప్యాంటీస్ వాడటం వల్ల, వాటికి చెమటను పీల్చుకునే గుణం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ అవకాశాలు తగ్గుతాయి. రాత్రివేళ ప్యాంటీస్ ధరించకుండా ఉండటం మంచిది. అవసరమైతే పగటిపూట జననాంగాల వద్ద యాంటీఫంగల్ పౌడర్ చల్లుకోవచ్చు. పుష్కలంగా మంచినీళ్లు తాగడం, తాజాపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
వ్యాధుల కాలం వచ్చేసింది. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తాగునీరు, ఆహారం కలుషితమై భయంకరమైన డయేరియా, అతిసార, వైరల్ ఫీవర్ సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అంటువ్యాధుల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. ♦ పొంచి ఉన్న భయంకరమైన అంటువ్యాధులు ♦ డయేరియా, అతిసార ప్రబలే అవకాశం ♦ వైరల్ ఫీవర్లు రావచ్చంటున్న వైద్యులు ♦ జాగ్రత్తలు తప్పనిసరి లబ్బీపేట : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం చిత్తడిగా మారింది. డ్రెయినేజీలు పొంగి మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. మంచినీటి పైపులైన్ లీకేజీలు ఏర్పడుతున్నాయి. భయంకరమైన ఈ వాతావరణంతో తాగునీరు కలుషితమై అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం కారణంగా డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటా వైరస్ అనే వేల రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు నీరు, ఆహారంలో కలిసినప్పుడు అతిసార, డయేరియా సోకుతాయి. కొన్ని రకాల వైరస్ల కారణంగా నీళ్ల విరేచనాలతో పాటు రక్త విరేచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు వెంట.. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో.. ఈగలు వాలుతున్న ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా అంటువ్యాధులు సోకే అవ కాశం ఉందంటున్నారు. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వర్షంలో తడవటం వంటి కారణాలతో జలుబుతో పాటు వైరల్ ఫీవర్ కూడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకుంటే ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆయా వ్యాధుల ఠమొదటిపేజీ తరువాయి లక్షణాలు, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వాస్పత్రి పిడియాట్రిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఎస్ విఠల్‌రావు ‘సాక్షి’కి వివరించారు. డయేరియా వ్యాధికి కారణాలు : కలుషిత నీరు, కలుషిత ఆహారం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం లక్షణాలు : నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరేచనం అయితే డయేరియాగా భావించాలి. చికిత్స : ఎక్కువసార్లు విరేచనాలు కావడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు. పొటాషియం, గ్లూకోజ్ తగ్గి షాక్‌లోకి వెళ్లిపోతారు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు, మూడు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. అతిసార వ్యాధి కారణాలు : కలుషిత నీరు, ఆహారంతో పాటు తాగునీటిలో విరేచనం కలవడం లక్షణాలు : రోజులో 10 నుంచి 20సార్లు నీళ్ల విరేచనాలతో పాటు వాంతులు కూడా అవుతుంటాయి. కలుషిత నీటి వల్ల వచ్చే ఈ వ్యాధి కుటుంబ సభ్యులందరితో పాటు ఆ ప్రాంతంలోని చాలామందికి ఒకేసారి సోకుతుంది. రోగి త్వరగా డీహైడ్రేషన్‌కు గురై షాక్‌లోకి వెళ్లిపోతాడు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కళ్లు లోతుకుపోవడం, నీరసించి పోవడం, చురుకుదనం తగ్గిపోయి మాట్లాడలేకపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రం కూడా తగ్గడంతో ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. చికిత్స : అతిసారకు గురైన వారిని ఎంత త్వరగా ఆస్పత్రి తీసుకెళ్తే అంత మంచిది. రక్త విరేచనాలు వ్యాధి కారణం : ఫుడ్ పాయిజన్ లక్షణాలు : తీవ్రమైన కడుపునొప్పితో రక్త విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనం కావడం వల్ల ఇతర వ్యాధులని ప్రజలు అపోహ పడుతుంటారు. వీరితో మల పరీక్ష చేసి, వ్యాధి కారకాన్ని గుర్తించడం జరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ డయేరియా సోకిన రోగికి మామూలు వ్యక్తులు, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. లేకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంది. ♦ రోగిని పట్టుకున్నప్పుడు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా వ్యాధి సోకకుండా 90 శాతం అరికట్టవచ్చు. ♦ వ్యాధి సోకిన రోగికి కొబ్బరినీళ్లు, మజ్జిగ, బార్లీనీళ్లు, కూల్‌డ్రింక్స్, ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. ♦ విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వకూడదు. వేయించిన బ్రెడ్, లైట్ టీ, దోరగా పండిన అరటి పండు (బాగా పండినది తినకూడదు), అన్నం, పప్పు తీసుకోవచ్చు. ♦ ఈ సీజన్లో సాధ్యమైనంత వరకూ బయట ఆహారం తినకుండా ఉండటం, కాచి చల్లార్చిన నీరు తాగడం మంచిది. ♦ విరేచనం తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ♦ విరేచనాలు అవుతున్నప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్‌ను కలిపి 3 నుంచి 4 గంటల వ్యవధిలో మొత్తం తాగాలి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండండి విజయవాడ సెంట్రల్ : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ సూచించారు. తన చాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఉత్పత్తి అయ్యి మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు, అతిసార, పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. వ్యాధులపై అవగాహన కలిగించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే ర్యాలీలు, మంగళవారం మాస్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాంతులు, విరేచనాలు అయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. చెత్తను సైడ్ డ్రెయిన్లలో పడేయడం వల్ల పారిశుధ్యం క్షీణించే అవకాశం ఉందని, నిల్వ ఉన్న, మాంసాహారాన్ని తినడం మంచిది కాదని పేర్కొన్నారు. ఏఎన్ఎం, కమ్యూనిటీ ఆర్గనైజర్లు రోజూ ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్, మలేరియా విభాగం అధికారి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
లివర్... సెంటర్ ఫర్ పవర్
ట్రివియా మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి, ఇది పోషకాల ఖజానా. మనం తినే ఆహారంలోని విటమిన్లు, ఐరన్ సహా ఖనిజ లవణాలను నిల్వ ఉంచుకుని, నిరంతరం శరీరానికి సరఫరా చేస్తుంది. శరవేగమైన ప్రాసెసర్ గల సూపర్ కంప్యూటర్ స్థాయిలో పనిచేసే అవయవం లివర్ మాత్రమే. మెదడుకు గ్లూకోజ్ సరఫరా చేయడం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం, పోషకాలను నిల్వ చేసుకోవడం వంటి దాదాపు రెండువందల పనులను ఏకకాలంలో చేస్తుంది. లివర్ పదిశాతం కొవ్వుతో తయారై ఉంటుంది. లివర్‌లో కొవ్వు అంతకు మించిన పరిస్థితినే ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఫ్యాటీ లివర్ పరిస్థితి ఏర్పడితే టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. శరీరంలోని మాలిన్యాలను, విషపదార్థాలను లివర్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఆల్కహాల్, ఇతర మాదక పదార్థాల వల్ల శరీరానికి కలిగే అనర్థాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.మన శరీరంలో ప్రవహించే రక్తంలో పది శాతం లివర్లోనే ఉంటుంది.మన శరీరంలో తిరిగి పెరిగే సామర్థ్యం ఉన్న ఏకైక అవయవం లివర్ మాత్రమే. ఒకవేళ సగానికి పైగా దెబ్బతిన్నా, ఇది పూర్తిగా పెరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అందుకే అవసరంలో ఉన్న ఇతరులకు లివర్‌లో కొంత భాగాన్ని దానం చేసినా, ఎలాంటి ఇబ్బంది ఉండదు.యంత్రాలలో బ్యాటరీ పనిచేసినట్లే, మన శరీరంలోని లివర్ పనితీరు ఉంటుంది. ఇది చక్కెరను నిల్వ చేసుకుని, శరీర అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తూ ఉంటుంది. లివర్ ఈ పని సమర్థంగా చేయకుంటే, రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పడిపోయి, కోమాలకు చేరుకునే ప్రమాదం ఏర్పడుతుంది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : ప్రస్తుత సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, సీజనల్ వ్యాధులపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు, వైద్య సిబ్బందితో శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయా పీహెచ్‌సీల్లో వైద్యుల పనితీరు, సీజనల్ వ్యాధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాల నిర్వహణ, టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ క్యాంపులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, డెంగ్యూ, మలేరియా, టీబీ, కుష్టువ్యాధి కేసులు తదితర అంశాలపై పీహెచ్‌సీల పరిధిలవారిగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది ఆస్పత్రులకు వేళకు రావాలని, విధిగా సమయపాలన పాటించాలన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆస్పత్రులపైనే ఉంటుందని, వైద్యులు అంకితభావంతో, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో ఎన్ఆర్హెచ్ఎం(నేషనల్ రూరల్ హెల్త్ మిషన్) డీపీఓ రాజారెడ్డి, క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ పద్మశ్రీ, సీహెచ్ఓ బొడ్డు ప్రసాద్, వైద్యులు చందు, ప్రసన్నకుమార్, సుధాకర్, సాజిత్, బజన్,జమాల్, విజయ్‌తో పాటు క్లస్టర్ పరిధిలోని జఫర్గడ్, కూనూరు, వేలేరు, ఘన్పూర్, మల్కాపూర్, తాటికొండ పీహెచ్‌సీల సూపర్వైజర్లు, హెచ్‌ఈఓలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వామ్మో.. ఫీవర్
కేసుల నమోదు ఇలా.. నెల పరీక్షించిన రోగులు డెంగీ మలేరియా చికున్‌గున్యా ఫైలేరియా సెప్టెంబర్ వరకు 3,86,766 8 56 27 34 అక్టోబర్‌లో 37,214 2 3 20 3 సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో ఒకరిద్దరి చొప్పున మంచం పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా, ఫైలేరియా వ్యాధులతో జనం సతమతమవుతున్నారు. వ్యాధులను నయంచేసేందుకు ఆస్పత్రుల్లో తగిన వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25,902 మందికి విషజ్వరాలు ప్రబలినట్లు ప్రభుత్వ వైద్యగణాంకాలు సూచిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సపొందిన వారిసంఖ్య మరింత రెట్టింపు ఉంటుందని అంచనా. అయితే జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన 3,86,766 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. వీరిలో 56 మందికి మలేరియా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే డెంగీకేసులు 8, చికెన్‌గున్యా వ్యాధిన పడిన వారు 27 మంది ఉన్నారు. ఫైలేరియా సోకిన వారు 34 మంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అక్టోబర్ ఒక్క నెలలోనే 37,214 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా ముగ్గురికి మలేరియా, ఇద్దరికి డెంగీ, ముగ్గురు ఫైలేరియా బారినపడినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదభరితమైన డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులు వాస్తవానికి ఇంతకంటే ఎక్కువగా ఉంటాయని వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు. వైద్యసిబ్బంది అంతంతే.. సుస్తీ చేసి దవాఖానాకు వెళ్తే పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలుకుని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో కూడా వైద్యసిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో 85 పీహెచ్‌సీలు, ఐదు కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ప్రధాన ఆస్పత్రి ఉంది. పీహెచ్‌సీలను మి నహాయించి అన్ని ఆస్పత్రుల్లో 840 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నా యి. అయితే వీటికి మంజూరైన వైద్యపోస్టుల్లో సగం వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లా మొత్తంలో సివిల్‌సర్జన్ స్పెషలిస్టు 22 మందికి గాను 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే గైనకాలజిస్టు 30మంది ఉండాల్సి ఉండగా 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనస్థిషియా నిపుణులకు సం బంధించి 10పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్ సర్జరీ 14 పోస్టులకు గాను 8 ఖాళీ, జనరల్ మెడిసిన్ విభాగంలో 14 పోస్టులకు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా అన్ని విభాగాల్లో 213 పోస్టులకు 89 భర్తీకి నోచుకోవడం లేదు. వైద్యసిబ్బంది కొరత కారణంగానే రోగులకు చికిత్స అందడం లేదు. పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్యసిబ్బంది లేని కారణంగా రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. -
స్వచ్ఛతకు నీళ్లొదిలారు
‘నెల్లూరు నీళ్లు తాగితే జబ్బులు ఖాయం’ అని స్వయానా జిల్లా కలెక్టరే అన్నారంటే నగరంలో తాగునీటి వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. అధికారులు కాస్త దృష్టిపెడితే రక్షిత నీటిని ఇవ్వడం పెద్ద విషయం కాదని ఈ నెల 2న జూబ్లీహాల్లో జరిగిన స్వచ్ఛభారత్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన చురకంటించారు. అయినా కూడా కార్పొరేషన్ అధికారుల్లో చలనం లేదు. అంటువ్యాధులు పొంచి ఉన్న కాలంలో మురికి, నీచు వాసనతో కూడిన తాగునీరు కుళాయిల్లో వస్తుండటం నగరవాసులను కలవరపెడుతోంది. * నగరంలో ఆకుపచ్చరంగులో తాగునీరు * ప్రబలుతున్న అంటువ్యాధులు * చోద్యం చూస్తున్న అధికారులు * మినరల్వాటర్కు భలే డిమాండ్ నెల్లూరు(హరనాథపురం): నెల్లూరు నగరంలోని వెంగళరావునగర్‌కు చెందిన ప్రసాద్‌ది సామాన్య కుటుంబం. తాగునీటి కోసం తప్పనిసరిగా నగరపాలక సంస్థ కుళాయిలపై ఆధారపడాల్సిందే. ఇటీవల కార్పొరేషన్ నీటిని తాగిన ప్రసాద్ డయేరియా బారిన పడ్డాడు. నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డాడు. ఆస్పత్రి ఖర్చు దాదాపు రూ.10 వేలు అయింది. దేవుడా ఏంటి ఈ పరిస్థితి అనుకుంటూ రోజుకు రూ.25 పెట్టి మినరల్ వాటర్ కొనుక్కుని వాడుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఒక్క ప్రసాద్‌దే కాదు. నగరంలో దాదాపు 75 శాతం మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా నగరపాలక సంస్థ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో నగరంలో అంటురోగాలు ప్రబలుతున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 54 డివిజన్ల ప్రజలకు పెన్నానది, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు, హెడ్‌వాటర్ రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ఈ ప్రదేశాల్లో నీటిని క్లోరినేషన్ చేసి అనుబంధ ట్యాంకులకు పంపాల్సి ఉంది. అక్కడి నుంచి పైపుల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలకు నీటిని సరఫరా చేస్తారు. ఈ క్రమంలో నీటిని శుభ్రపరచడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి తోడు నగరంలోని తాగునీటి పైపులైన్లు పగుళ్లిచ్చి నీరు లీకేజీ అవుతున్నాయి. ఈ ప్రదేశాల నుంచి వ్యర్థాలు, మురుగునీరు ప్రవహిస్తూ కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నాయి. దీంతో కార్పొరేషన్ కుళాయిల నుంచి ఆకుపచ్చరంగులో నీరు విడుదలవుతోంది. ఈ నీరు దుర్గంధం వెదజల్లుతూ, చిన్నపాటి పురుగులు కన్పిస్తున్నాయి. ఈ నీటిని చూస్తేనే ప్రజల కడుపులు కెళ్లిస్తున్నాయి. ఈ నీటిని తాగుతున్న ప్రజానీకం వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే సమస్య. ఈ విషయంపై నిత్యం కార్పొరేషన్ అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మినరల్ వాటర్‌కు పెరిగిన డిమాండ్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నగర ప్రజలు నానా ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల పరిస్థితి మరీ దారుణం. నీరు కలుషితమవడంతో ప్రజలు మినరల్ వాటర్‌పై ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుతం వాటర్ ప్లాంట్ నిర్వాహకులు అడ్వాన్స్‌గా రూ.140 తీసుకుని 20లీటర్ల క్యాను నీటిని రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. దీంతో నగరంలో మినరల్ వాటర్‌కు డిమాండ్ పెరిగింది. మినరల్ వాటర్ కొనలేని సామాన్యులు గత్యంతరం లేక కార్పొరేషన్ నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నట్టు? నగరంలో కలుషిత నీరు సరఫరా అవుతున్నా నగర పాలక సంస్థ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. సాధారణంగా నీటిని సరఫరా చేసే పెన్నానది, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు, హెడ్‌వాటర్ రిజర్వాయర్ల వద్ద నిత్యం నీటిని శుభ్రపరచి క్లోరినైజేషన్ చేయాల్సి ఉంది. పాయింట్ టు పాయింట్ క్లోరిన్ శాతం 0.2పీపీఎం ఉండాలి. ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈల నుంచి ఫిట్లర్ల వరకు ప్రతి ఒక్కరి వద్ద క్లోరిన్ శాతాన్ని పరిశీలించేందుకు క్లోరోస్కోప్స్ పరికరాలు ఉండాలి. అయితే ఎక్కడా క్లోరిన్ శాతాన్ని పరిశీలించిన దాఖలాలు కానరావడం లేదు. పైపులైన్ల లీకేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతులు చేయాల్సిన అధికార యంత్రాంగం నిద్రమత్తులో జోగుతోంది. ఆధార్‌సీడింగ్, పింఛన్ల వెరిఫికేషన్లకు కింది స్ధాయి సిబ్బందిని ఉపయోగించడంతో వారి రెగ్యులర్ పనితీరును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లీకేజీలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. అటు ప్రజలు, ఇటు పత్రికలు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వీరికి మాత్రం సమస్య పట్టడం లేదు. కార్పొరేషన్‌కు, తమ నివాసాలకు మినరల్ వాటర్ తెప్పించుకుంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర పురపాకశాఖ మంత్రి నారాయణ స్వయంగా సమ్మర్‌స్టోరేజీ ట్యాంకును పరిశీలించి మురుగునీరు వస్తున్నదని హెచ్చరించినా కార్పొరేషన్ అధికారుల తీరు మారలేదు. నూతన కమిషనర్ చక్రధర్‌బాబు అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాలని, లీకేజీలను అరికట్టాలని, అంటువ్యాధులపై అవగాహనతో ఉండాలని సూచించారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాల్సి ఉంది. -
వానొచ్చే.. వ్యాధులొచ్చే..!
ప్రబలుతున్న అంటురోగాలు - ఆస్పత్రులకు పరుగులుపెడుతున్న జనం - వాతావరణంలో మార్పు వల్లే వైరస్ వ్యాప్తి అంటున్న నిపుణులు - తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల వాసులు టైఫాయిడ్, వైరల్ జ్వరాల బారిన పడి ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వర్షాకాలం మొదలైన తర్వాత నగరంలో సరైన వర్షాలు లేక నీటిఎద్దడి ప్రారంభమైంది. దానికితోడు విద్యుత్ కోతలు నగరవాసులకు నరకం చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ నీళ్లు రెండు, మూడు రోజులకొకసారి వదిలేవారు. నీళ్లు పట్టుకునే సమయంలో కొన్ని ఏరియాల్లో స్థానికుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఇటువంటి సమయంలో గత కొన్ని రోజులుగా వర్షాలు వచ్చి పలకరించడంతో నగరవాసులు పులకరించిపోయారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం సాగలేదు. ఇన్నాళ్లుగా నీళ్లు లేక ఇబ్బందులుపడిన ప్రజలు ఇప్పుడు వర్షం నీటితో కలుషితమైన మంచినీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. దీంతోపాటు పలు మురికివాడలు, అనధికార కాలనీల్లో డయేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాగా, మున్ముందు దోమలతో వృద్ధి చెందే వ్యాధులైన డెంగీ, మలేరియా వంటివి కూడా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మూల్‌చంద్ మెడిసిటీలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ..‘ మా ఆస్పత్రికి డెంగీ లక్షణాలతో ఇద్దరు రోగులు వచ్చారు. అదే సమయంలో టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో డజనుకుపైగా రోగులు చికిత్స కోసం వచ్చారు.,’ అని చెప్పారు. వాతావరణంలో అనూహ్య మార్పులు, అధికతేమ వల్ల వైరల్ బాక్టీరియా త్వరితగతిన వ్యాప్తి చెందుతోందని ఆయన వివరించారు. సాకేత్ ప్రాంతంలో ఉన్న మ్యాక్స్ ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్అయిన డాక్టర్ రోమెల్ టిక్కూ మాట్లాడుతూ వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని చెప్పారు. కొన్ని కేసుల్లో ఈ జ్వరాలు రెండు, మూడు వారాల వరకు రోగిని పట్టిపీడించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాల కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, వాటి వల్ల ఈ వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో డెంగీ వ్యాధితో బాధపడుతున్న 33 మంది రోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వచ్చారు. అయితే వారిలో ఎవరూ మరణించిలేదు. వీటిలో కేవలం ఆగస్టు నెలలోనే 11 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు పదోవంతు తగ్గాయి. ఇదిలా ఉండగా, మలేరియా కేసులు సైతం గత యేడాది కంటే ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి. ‘ఓవర్ హెడ్ ట్యాంకులను, పూలకుండీలు, ఇతర నీరు నిలిచే అవకాశమున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడంతో మలేరియా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు.. అలాగే పరిపాలన విభాగం కూడా నగరవ్యాప్తంగా ఫాగింగ్ చేపట్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు యత్నించింద’ని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ.. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారే ఎక్కువగా వైరల్ వ్యాధుల బారిన పడతారని చెప్పారు. సరైన సమయంలో పౌష్టికాహారం తినడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని తెలిపారు. ‘దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు తుమ్మినప్పుడో, దగ్గినప్పుడో ఆ కణాలు గాలిలో కలిసి దగ్గర్లోనే ఉన్న ఇతరులకు ఆ జబ్బులు అంటుకుంటాయి. అలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే రోగాలబారిన పడకుండా మనలను మనం కాపాడుకోవచ్చ’ని ఆయన సలహా ఇచ్చారు. -
మెళకువలతో మేనికాంతి...
ఈ వయసులో చర్మం ముడతలు పడే అవకాశం ఎక్కువ. అందుకని పడుకునేముందు తప్పనిసరిగా ‘ఫేస్ వాష్‌తో’ (సబ్బును ఉపయోగించకూడదు) ముఖాన్ని శుభ్రపరుచుకోండి. మార్కెట్లో లభించే ‘నైట్ క్రీమ్స్’ చర్మతత్వానికి సరిపడేవి ఉపయోగించడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. త్వరగా ముడతలు పడదు. మసాజ్‌కి ఆలివ్, కొబ్బరినూనెలు మేలైనవి. ఈ వయసులో చర్మం పొడిబారడం సహజం. తైలగ్రంథుల పనితీరు మందగిస్తుంది. దాంతో వాటినుంచి చమురు ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా పొడిబారిన చర్మం దురద పెడుతుంటుంది. దీంతో చర్మం నల్లబడుతుంది. కొన్నిసార్లు చారలు కూడా పడిపోతుంటాయి. వీరిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. గోళ్లు విరిగిపోతుంటాయి. పాదాల పగుళ్లు బాధిస్తుంటాయి. డయాబెటిస్, రీనల్ ఫెయిల్యూర్, బీపీ సమస్యలు సాధారణం. వీటి వల్ల చర్మం దెబ్బతింటుంది. * ఏ కాలంలోనైనా, గోరువెచ్చని నీటితో, టిఎస్ఎఫ్ఎమ్ ఎక్కువ కంటెంట్ ఉన్న సోప్‌తో స్నానం చేయాలి. తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. * పాదాల చర్మం బాగుండటానికి రాత్రి సగం చెంచా ఉప్పు కలిపిన లీటర్ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచి, శుభ్రంగా తుడిచి, తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోని పడుకోవాలి. * పదే పదే పాదాలను తడపకూడదు. గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే గోళ్ల రంగు మారుతుంది. దానికీ తగు చికిత్స తీసుకోవాలి. * ఎండలోకి వెళ్లేటప్పుడు బిడియపడకుండా పెద్ద హ్యాట్ లేదా గొడుగు, సన్‌గ్లాసెస్, మేనికి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. * లో దుస్తులు సరైనవి కానప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రోజూ స్నానం చేసి, పొడి దుస్తులను మాత్రమే ధరించాలి. * 8-10 గ్లాసుల నీరు తప్పక తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. నాన్‌వెజ్ తినేవారు ఎగ్‌వైట్, ఫిష్, చికెన్, మల్టీ విటమిన్ ట్యాబెట్ తీసుకుంటే ఇమ్యూన్ పెరుగుతుంది.