
చెయ్యి దాచేశారు..!
దక్షిణ బ్రెజిల్‌లోని ఒర్లీన్స్ పట్టణంలో నివసించే 42 ఏళ్ల కార్లోస్ మరియోట్టి ఓ ఫ్యాక్టరీలో మెషీన్ ఆపరేటర్. ఒకరోజు ఏమరుపాటుగా ఉండటంతో ప్రమాదానికి గురయ్యాడు. అతని ఎడమ చెయ్యి యంత్రాల మధ్యకు వెళ్లిపోయి అరచేతికి ఇరువైపులా చర్మం ఒలిచేసినట్లుగా ఊడిపోయింది. ఇన్‌ఫెక్షన్ సోకకూడదనుకుంటే మోచేయి దాకా చేతిని తొలగించాల్సిందే.
ఇలాంటి తరుణంలో డాక్టర్లు ఓ వినూత్న ఆలోచన చేశారు. అతని పొట్టకు రంధ్రం చేసి డామేజి అయిన చెయ్యిని ఇలా పొట్టచర్మం కిందకు పెట్టేసి... పైనుంచి సాఫ్ట్‌టిష్యూ పెట్టి కుట్టేశారు. చూసేవారికి వింతగా కనపడుతున్నా... ఓ ఆరువారాల తర్వాత చేయిని పొట్టలోంచి తీసి వేరేచోటి నుంచి చర్మం తీసి గ్రాఫ్టింగ్ చేస్తారట. అప్పటిదాకా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఇలా పొట్టలో చెయ్యిని దాచేశారన్న మాట.