
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కోవిడ్ బారిన పడి తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం పూర్తిస్థాయిలో చక్కబడిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.ఎం.వి.రావు గురువారం మీడియాకు తెలిపారు. ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, తగిన విశ్రాంతి అనంతరం త్వరలోనే రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతారని తెలియజేశారు. బుధవారమే ఆయనకు వివిధ వైద్యపరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించగా, గురువారం వాటన్నింటినీ పరిశీలించినపుడు అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా తేలిందన్నారు. సీఎంకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని ఇదివరకే వెల్లడి కాగా, రక్తనమూనాలు అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని డా.ఎం.వి.రావు తెలిపారు.
చదవండి: భర్తకు కరోనా.. భయంతో ఉరేసుకున్న భార్య
Comments
Please login to add a commentAdd a comment