కరోనా మహమ్మారికి సంబంధించి పలు కథనాలు విన్నాం. గానీ గర్భంలో ఉండగానే శిశువులు ఈ మహ్మమారి బారిన పడిన తొలి కేసును గుర్తించి వైద్యలు షాక్‌కి గురయ్యారు. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు తల్లులకు పుట్టిన శిశువుల్లో ఇలా జరిగిందని పరిశోధకులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. గర్భంలో ఉండగానే కరోనా బారిన పడటంతో రెండు శిశువుల బ్రెయిన్ హేమరేజ్‌తో జన్మించినట్లు యూఎస్‌లోని వైద్యులు వెల్లడించారు. ఇదే తొలికేసు అని కూడా తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మియామి తన పీడియాట్రిక్స్ జర్నల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకమునుపు జరిగినట్లు జర్నల్ పేర్కొంది. ఇద్దరు తల్లలు గర్భధారణ సమయంలోనే కరోనా బారిన పడినట్లు తెలిపారు.
ఐతే వారిలో ఒక తల్లికి తేలికపాటి లక్షణాలు కనిపించగా మరో తల్లి కరోనా కారణంగా తీవ్ర అనారోగ్య పాలైందని తెలిపారు. దీంతో వారికి పుట్టిన శిశువులు ఇద్దరు జన్మించిన వెంటనే ఫిట్స్‌తో బాధపడినట్లు తెలిపారు వైద్యులు. తర్వాత వారిలో సరైన విధుంగా పెరుగుదల కూడా లేకపోవడం గుర్తించినట్లు తెలిపారు. ఆ శిశువుల్లో ఒక శిశువు 13వ నెలలో మరణించగా మరోక శిశువు వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఇంతవరకు చిన్న పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరగలేదన్నారు. తొలిసారిగా ఆ శిశువులకు నిర్వహించగా కరోనా వైరస్ జాడలను గుర్తించినట్లు తెలిపారు.
చనిపోయిన శిశువుకి పోస్ట్‌మార్టం నిర్వహించగా మెదడులో కరోనా వైరస్ జాడలను గుర్తించామని, అందువల్లే మెదడు దెబ్బతిందని మియామి విశ్వవిద్యాలయ పరిశోధకుల వెల్లడించారు. అలాగే కరోనా బారిన పడి తీవ్రంగా అనారోగ్యం పాలైన తల్లికి కేవలం 32 వారాలకే డెలివరి చేశామని చెప్పారు. ఆమె శిశువే బాగా ఈ వైరస్ ప్రభావానికి గురై చనిపోయినట్లు తెలిపారు.
అందువల్ల దయచేసి గర్భధారణ సమయంలో కరోనా బారిని పడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీడీయాట్రిక్ వైద్యులను సంప్రదించాలని సూచించారు పరిశోదకులు. అయితే గర్భధారణ సమయంలో డెల్టా వేరియంటే లేదా ఓమిక్రాన్ వేరియంట్ బారిన పడితే ఈ విధంగా జరుగుతుందనేది స్పష్టం కాలేదని చెప్పారు పరిశోధకులు. ఇలా తల్లి మావి నుంచి శిశువుకి వైరస్ సంక్రమించిన తొలికేసు ఇదేనని మియామి విశ్వవిద్యాలయ గైనకాలజిస్టు మైఖేల్ పైడాసస్ చెబుతున్నారు.
(చదవండి: ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!)
Comments
Please login to add a commentAdd a comment