Womb
-
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్‌లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్‌లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్‌ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
2 గర్భసంచులు.. 2 రోజులు..2 ప్రసవాలు
అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!! తొలి మూడు కాన్పులు సాధారణమే... కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె! అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి. ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు. పిల్లల బుల్లి రికార్డు...! నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు! బంగ్లా మహిళ బంపర్ రికార్డు! ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గర్భిణిపై కూలిన ఇంటిపైకప్పు
మెదక్ మున్సిపాలిటీ: తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన గర్భిణిపై ఇల్లు కూలిన ఘటనలో కడుపులోని గర్భస్థ శిశువు మృతి చెందగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్‌లోని మిలట్రీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుడైన మహ్మద్ సర్వర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కూతురు యాస్మిన్ సుల్తానా ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 15 రోజుల్లో ఆమెకు ప్రసవం చేయాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తరుణంలో భారీ వర్షాలకు తడిసిన ఇంటి గోడ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో యాస్మిన్ తీవ్రంగా గాయ పడటంతో వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె కడుపులో గర్భస్థ శిశువు మృతి చెందినట్లు గుర్తించి తొలగించారు. యాస్మిన్‌ను హైదరా బాద్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన యాస్మిన్ తల్లి చాంద్ సుల్తానా మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాస్మిన్ సుల్తానా కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువా రం పరామర్శించి రూ.లక్ష సాయం అందించారు. -
గర్భస్థ శిశువు మెదడుకు శస్త్రచికిత్స
బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. వైద్య రంగంలోనే అద్భుతాన్ని సృష్టించారు. తల్లిగర్భంలో ఉన్న 34 వారాల శిశువు(పిండం)కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. శిశువు మెదడులో అపసవ్యంగా ఉన్న రక్తనాళాన్ని సర్జరీతో సరిచేశారు. ప్రపంచంలో ఈ తరహా సర్జరీ చేయడం ఇదే ప్రథమం. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, బ్రిఘామ్, ఉమెన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగింది. గర్భస్థ శిశువుల్లో అరుదుగా తలెత్తే ఈ వైకల్యాన్ని ‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ఫార్మేషన్’ అంటారు. ఇలాంటి వైకల్యంతో జన్మించే శిశువులు మెదడులో గాయాలు, గుండె వైఫల్యం వంటి కారణాలతో మరణించే అవకాశం ఉంటుందని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ డారెన్ ఒబ్రాచ్ చెప్పారు. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం అపసవ్యంగా ఏర్పడడమే గాలెన్ మాల్ఫార్మేషన్. దీనివల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్త పీడనం ఎక్కువై సిరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిరలలో ఒత్తిడి కారణంగా మెదడు పెరుగుదల మందగిస్తుంది. కణజాలాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా గుండె పనితీరు కూడా దెబ్బతినవచ్చు. గాలెన్ మాల్ఫార్మేషన్తో బాధపడుతున్న గర్భస్థ శిశువుల్లో 50 నుంచి 60 శాతం మంది పుట్టిన వెంటనే ఆరోగ్యం విషమిస్తుందని, వారు బతికే అవకాశాలు కేవలం 40 శాతం ఉంటాయని డారెన్ ఒబ్రాచ్ వెల్లడించారు. -
గర్భంలో ఉండగానే కరోనా సోకిన పసికందులకు దెబ్బతిన్న మెదడు
కరోనా మహమ్మారికి సంబంధించి పలు కథనాలు విన్నాం. గానీ గర్భంలో ఉండగానే శిశువులు ఈ మహ్మమారి బారిన పడిన తొలి కేసును గుర్తించి వైద్యలు షాక్‌కి గురయ్యారు. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు తల్లులకు పుట్టిన శిశువుల్లో ఇలా జరిగిందని పరిశోధకులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. గర్భంలో ఉండగానే కరోనా బారిన పడటంతో రెండు శిశువుల బ్రెయిన్ హేమరేజ్‌తో జన్మించినట్లు యూఎస్‌లోని వైద్యులు వెల్లడించారు. ఇదే తొలికేసు అని కూడా తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మియామి తన పీడియాట్రిక్స్ జర్నల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటన వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకమునుపు జరిగినట్లు జర్నల్ పేర్కొంది. ఇద్దరు తల్లలు గర్భధారణ సమయంలోనే కరోనా బారిన పడినట్లు తెలిపారు. ఐతే వారిలో ఒక తల్లికి తేలికపాటి లక్షణాలు కనిపించగా మరో తల్లి కరోనా కారణంగా తీవ్ర అనారోగ్య పాలైందని తెలిపారు. దీంతో వారికి పుట్టిన శిశువులు ఇద్దరు జన్మించిన వెంటనే ఫిట్స్‌తో బాధపడినట్లు తెలిపారు వైద్యులు. తర్వాత వారిలో సరైన విధుంగా పెరుగుదల కూడా లేకపోవడం గుర్తించినట్లు తెలిపారు. ఆ శిశువుల్లో ఒక శిశువు 13వ నెలలో మరణించగా మరోక శిశువు వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఇంతవరకు చిన్న పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరగలేదన్నారు. తొలిసారిగా ఆ శిశువులకు నిర్వహించగా కరోనా వైరస్ జాడలను గుర్తించినట్లు తెలిపారు. చనిపోయిన శిశువుకి పోస్ట్‌మార్టం నిర్వహించగా మెదడులో కరోనా వైరస్ జాడలను గుర్తించామని, అందువల్లే మెదడు దెబ్బతిందని మియామి విశ్వవిద్యాలయ పరిశోధకుల వెల్లడించారు. అలాగే కరోనా బారిన పడి తీవ్రంగా అనారోగ్యం పాలైన తల్లికి కేవలం 32 వారాలకే డెలివరి చేశామని చెప్పారు. ఆమె శిశువే బాగా ఈ వైరస్ ప్రభావానికి గురై చనిపోయినట్లు తెలిపారు. అందువల్ల దయచేసి గర్భధారణ సమయంలో కరోనా బారిని పడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీడీయాట్రిక్ వైద్యులను సంప్రదించాలని సూచించారు పరిశోదకులు. అయితే గర్భధారణ సమయంలో డెల్టా వేరియంటే లేదా ఓమిక్రాన్ వేరియంట్ బారిన పడితే ఈ విధంగా జరుగుతుందనేది స్పష్టం కాలేదని చెప్పారు పరిశోధకులు. ఇలా తల్లి మావి నుంచి శిశువుకి వైరస్ సంక్రమించిన తొలికేసు ఇదేనని మియామి విశ్వవిద్యాలయ గైనకాలజిస్టు మైఖేల్ పైడాసస్ చెబుతున్నారు. (చదవండి: ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!) -
ఇదేం కక్కుర్తి, అమ్మకానికి.. అమ్మతనం!
మాతృత్వం.. అడవారి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. అయితే జన్యుపరమైన కారణాలతోనో.. శారీరక లోపంతోనో ఆ భాగ్యానికి నోచుకోని వారికి అద్దెగర్భం ద్వారా పరోక్షంగా తల్లయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. కానీ కాసుల కోసం వెంపర్లాడే కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారం తాజాగా రాజధాని నగరంలో బట్టబయలైంది. సాక్షి, చెన్నై: అద్దె తల్లుల వ్యవహారం మరోమారు చెన్నైలో వెలుగు చూసింది. చూలైమేడులో కొన్నిచోట్ల ప్రత్యేక గదుల్లో అద్దె తల్లులను ఉంచి ఓ ఆసుపత్రి యాజమాన్యం చికిత్స అందిస్తుండడం బయట పడింది. దీనిపై ఆరోగ్యశాఖ సోమవారం విచారణకు ఆదేశించింది. వివరాలు.. ప్రముఖ సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చెన్నైలో మరోమారు అద్దె తల్లుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చూలైమేడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి అద్దె తల్లుల ద్వారా సరోగసీ విధానంలో పిల్లలను విక్రయిస్తోందనే ఆరోపణలు వెల్లవెత్తాయి. అదే సమయంలో మీడియాకు అద్దె తల్లి ఇచ్చిన సమాచారంతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రి బండారం బట్టబయలైంది. పేదరికమే పెట్టుబడిగా.. చూలైమేడు పరిసరాల్లో అద్దెకు అనేక ఇళ్లను తీసుకుని మరీ సంబంధిత ప్రైవేటు ఆసుపత్రి సరోగసీకి చికిత్స అందిస్తుండడం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో ప్రత్యేక గదులకే ఈ అద్దె తల్లులను పరిమితం చేయడం గమనార్హం. అలాగే, కొన్ని ఇళ్లలో ఉన్న పేద యువతుల వద్ద అండాలను సైతం సేకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. అద్దె తల్లుల్లో ఆంధ్రా, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన వారే కాదు, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది. అద్దెతల్లులు ఉన్న చోటకే వెళ్లి వైద్యులు పరిశోధించడం, చికిత్సలు నిర్వహించడం జరుగుతోంది. ఈ అద్దె తల్లులు అందరూ పేదరికంలో నలుగుతున్నారని, వీరిలో కొందరికి వివాహాలకు కూడా కాలేదని వెల్లడైంది. తమ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం అద్దె తల్లులుగా వచ్చిన వారిని ఆస్పత్రి యాజమాన్యం వేదిస్తున్నట్లు, వీరు ఇస్తున్న మందులు తమపై భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన కలుగుతోందని 25 ఏళ్ల బాధితారులు మీడియాకు సమాచారం ఇచ్చింది. దీనిపై ఆరోగ్యశాఖ వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంపై సోమవారం సమగ్ర విచారణకు ఆదేశించింది. వైద్యశాఖ అధికారులు విశ్వనాథన్, కృష్ణన్ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన కమిటీని దర్యాప్తు కోసం నియమించింది. చదవండి: వీధి కుక్క దాడిలో పసికందు మృతి.. పేగులు బయటకు తీయటంతో..! -
తల్లి గర్భంలోనే రుచుల మక్కువ
లండన్: కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలపై జిహ్వచాపల్యం ప్రదర్శిస్తారు. మరికొందరు వాటిని చూడగానే ఇబ్బందిగా మొహంపెడతారు. ఇలా ఆహారాన్ని ఇష్టపడడం లేదా పడకపోవడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుందని ఇంగ్లాండ్‌లోని డర్హాం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తల్లి తీసుకొనే ఆహారం, వాటి రుచులకు గర్భంలోని శిశువులు చక్కగా స్పందిస్తున్నట్లు గమనించారు. 18–40 ఏళ్ల వయసున్న 100 మంది గర్భిణులకు 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. 32, 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు రెండుసార్లు స్కానింగ్ చేశారు. 100 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. స్కానింగ్‌కు 20 నిమిషాల ముందు మొదటి గ్రూప్‌లోని గర్భిణులకు క్యారెట్‌ను, రెండో గ్రూప్‌లోని వారికి క్యాబేజీని 400 ఎంజీ మాత్రల రూపంలో ఇచ్చారు. మూడో గ్రూప్‌లోని గర్భిణులకు ఏమీ ఇవ్వలేదు. క్యారెట్ మాత్ర తీసుకున్న మహిళల గర్భంలోని శిశువుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. క్యాబేజీ మాత్ర తీసుకున్న వారి గర్భంలోని శిశువులు మాత్రం ఇష్టం లేదన్నట్లుగా ముఖం చిట్లించారు. మాత్రలేవీ తీసుకోనివారి గర్భంలోని శిశువుల్లో ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ అధ్యయనం వివరాలను సేజ్ జర్నల్‌లో ప్రచురించారు. గర్భిణి తీసుకొనే ఆహారం శిశువును కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే జన్మించిన బిడ్డలు చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చుకొంటారని తెలిపారు. గర్భస్థ శిశువలకు నిర్ధిష్ట ఆహారం పరిచయం చేస్తే భవిష్యత్తులో దానిపైవారు మక్కువ పెంచుకుంటారని సూచించారు. -
బిడ్డ పుట్టిన రోజే అమ్మకు కూడా పుట్టినరోజు
అమ్మ సృష్టికర్త. అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది, అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు కూడా పుట్టిన రోజే. బిడ్డ అమ్మ శరీరంలో అంతర్భాగం. ఈవేళ మనకున్న శరీరం అమ్మ కడుపులో పుట్టి పెరిగిందే కదా! పుట్టినది మొదలు మల మూత్రాదులను శుభ్రం చేసి, పెంచి పెద్దచేసి, ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలు కష్టపడకూడదని, తాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పైకి చెప్పకుండా పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తన ఆయుర్దాయం కూడా పిల్లలకు ఇవ్వమని ప్రార్థించే అమ్మ లాంటి వ్యక్తి ఈ లోకంలో మరొకరు ఉండరు. అమ్మే ఈ శరీరాన్ని ఇవ్వకపోతే మనకు ఈ శరీరం ఎక్కడిది ? మన సుఖ సంతోషాలకు మన కీర్తిప్రతిష్ఠలకు మూలమయిన ఈ శరీరం అమ్మ ప్రసాదించిందే. అమ్మను మించిన దైవం ఎక్కడుంది? అందుకే వేదం మొదటి నమస్కారం అమ్మకు చేయించింది– మాతృదేవోభవ–అని. మిగిలిన అందరికీ పుట్టిన రోజు ఒక్కటే కానీ అమ్మకు మాత్రం తాను స్వయంగా జన్మించిన రోజున ఒక పుట్టిన రోజుతోపాటూ, ఎంతమంది బిడ్డల్ని కంటుందో ఆమెకు అన్ని పుట్టినరోజులుంటాయి. అంటే అమ్మకు ఇద్దరు బిడ్డలుంటే మూడు పుట్టినరోజులుంటాయి. స్త్రీగా తన పుట్టినరోజును భర్త వేడుకగా చేస్తే, మిగిలిన పుట్టిన రోజులను బిడ్డలు తమకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా మొదట ఆమెకు కొత్త బట్టలు పెట్టి తరువాత తాము వేసుకుని వేడుక చేసుకోవాలి. స్త్రీగా కూడా ఆమె పుట్టిల్లు, అత్తవారిల్లు... రెండింటి క్షేమాన్నీ ఆకాంక్షిస్తుంది. తల్లిగా రెండు వంశాలను తరింప చేస్తుంది. ధర్మపత్నిగా పురుషుడికి యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకు అర్హుడిని చేస్తుంది. భగవంతుడు ఎక్కడో ఉండడు, అమ్మరూపంలోనే మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే బద్దెనగారు ‘‘నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్/నారియె నరులకు రత్నము/ చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!’’ అన్నారు. మనుషులలో రత్నం అంత గొప్పది స్త్రీ అంటున్నారు. అలాగే ‘చీరయె శృంగారమండ్రు...’ అన్నారు. చీర అంటే స్త్రీలు ధరించేదని కాదు. రాముడు నార చీరెలు కట్టుకున్నాడు అంటారు. చీర– అంటే వస్త్రం. శృంగారం అంటే పరమ పవిత్రమయిన అలంకరణ, శుద్ధమయినది... అని! కట్టుకున్న బట్టను బట్టి మనిషి జీవన విధానం తెలుస్తుంటుంది. వేల ఖరీదు చేసే వస్త్రాలే కట్టుకోవాలనే నియమం ఏదీ ఉండదు. ఏది కట్టుకున్నా బట్ట పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండాలి. నిజంగా కష్టంలో ఉండి నిస్సహాయ పరిస్థితుల్లో తప్ప మనిషి ఎప్పుడూ పరిశుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పిల్లలు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి బట్టలు వారు శుభ్రం చేసుకోవడం చిన్నప్పటినుండే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీకు పరిశుభ్రత మీద ఆసక్తి పెరగడమే కాక, అమ్మ కష్టాన్ని కూడా తగ్గించిన వారవుతారు. మన సంప్రదాయం ప్రకారం బయట ఎక్కడికి వెళ్లి వచ్చినా ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి, బయట తిరిగొచ్చిన బట్టలు మార్చుకోవాలి. విడిచిన బట్టలు, తడి బట్టలు ఇంట్లో ఎక్కడంటే అక్కడ కుప్పలుగా వేయకుండా వాటి స్థానాల్లో వాటిని ఆరేయడమో, తగిలించడమో చేయాలి. అది మన శరీరానికి, పరిసరాలకే కాదు, మన ప్రవర్తనకు, మన శీలానికి, మన వ్యక్తిత్వానికి అలంకారం. అది మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. బద్దెన గారు చెప్పినవి చిన్నచిన్న మాటలే అయినా మన జీవితాలను చక్కటి మార్గంలో పెట్టే సూత్రాలు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
240 రోజులు.. కన్యాకుమారి- కశ్మీర్ వరకు 4000 కి.మీ..
‘అర్ధరాత్రి ఏంఖర్మ... పట్టపగలు కూడా ఆడపిల్ల స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి మనదేశంలో ఉంది’ అనే మాటను తన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంది శ్రిష్టి బక్షి. ఆ మాటలు విన్నప్పుడల్లా ఒక రకమైన అసంతృప్తి, కోపం. ‘మనదేశంలో ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం ఆడపిల్లలకు లేదా!’ అనే నిరాశ ఆమెలో కమ్ముకుంటున్న సమయంలో ఒకరోజు.... శ్రిష్టి ఏదో ఊరు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ రాత్రి హైవే 91లో ఒక మహిళ తన కూతురు తో కలిసి ధైర్యంగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం ఆమె కంటపడింది. మన దేశం గురించి సానుకూల దృక్పథం నింపిన ఆ దృశ్యం తనలో ఒక ఆలోచన మెరిపించింది. పాదయాత్ర తో దేశాన్ని చుట్టి రావాలని! ‘ఊహాలు బానే ఉన్నాయి గానీ కల ఫలిస్తుందా?’ అనుకునేలోపే ‘శభాష్’ అంటూ భుజం తట్టాడు భర్త. ‘ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చేసేయాలి’ అని ప్రోత్సహించాడు. ఇక నాన్న ‘నేను ఉన్నాను కదమ్మా’ అంటూ రూట్‌మ్యాప్ గీసిచ్చాడు. శ్రిష్టి పాదయాత్ర గురించి తెలిసి సన్నిహితులు, మిత్రులు ‘మేము సైతం..’ అంటూ ముందుకొచ్చారు. ఒంటరిగా మొదలుపెడదామనుకున్న పాదయాత్రలో పదకొండు మంది కలిశారు. అలా పన్నెండు మందితో పాదయాత్రకు అంకురార్పణ జరిగింది. మహిళా బృందాలతో శ్రిష్టి తొలి అడుగు తమిళనాడు నుంచి మొదలైంది. వీళ్లు అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళ వచ్చి ఆసక్తిగా వివరం అడిగింది. విన్న తరువాత ఆమె పరుగున వెనక్కి వెళ్లి బుట్ట నిండా పండ్లు ఇచ్చి ‘మీరు మా బిడ్డల భవిష్యత్ కోసం నడుస్తున్నారు. మీకు అంతా మంచే జరగాలి’ అని ఆశీర్వదించింది. ఈ సంఘటనతో శ్రిష్టి బృందం ఉత్సాహం రెట్టింపు అయింది. ఒక ఊళ్లో యాసిడ్ దాడి బాధితురాలిని కలిశారు. ‘దురదృష్టకర సంఘటన జరిగింది. అలాగని ఏడుస్తూ జీవితాన్ని చీకటి చేసుకుంటూ కూర్చోలేను కదా! నా జీవితాన్ని నేనే కొత్తగా నిర్మించుకోవాలి అనుకున్నాను’ అంటున్నప్పుడు అవి వ్యక్తిత్వవికాసానికి మేలైన పాఠంలా అనిపించాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పాదయాత్ర సాగింది. రకరకాల సమస్యల గురించి తెలుసుకొని ‘మీకు తోచిన పరిష్కారాన్ని సూచించండి’ అని అడిగినప్పుడు ‘గవర్నమెంటోళ్ల వల్లే ఏమి కావడం లేదు. మనమెంతమ్మా’ అనే ప్రతికూల ఆలోచనలే మొదట వినిపించేవి. ‘అందరూ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపే వాళ్లే. ఆ వేలు మన వైపు కూడా తిరగాలి. అప్పుడు మనలో కూడా మార్పును ఆహ్వానించగల స్పృహ ఏర్పడుతుంది’ అంటారు శ్రిష్టి. ‘మన ఇండియాలో ఎన్నో ఇండియాలు ఉన్నాయి’ అంటున్న శ్రిష్టి బక్షి బృందం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కి.మీ పాదయాత్ర చేసింది. 240 రోజులు పట్టింది. తాము నడిచే దారిలో కలెక్టర్ నుంచి కార్మిక, కర్షకవర్గాల వరకు అందరినీ కలిసేవారు. స్వయంసహాయక బృందాలతో సమావేశం అయ్యేవారు. తమ దగ్గర ఉన్న స్టడీమెటీరియల్‌ను షేర్ చేసేవారు. వర్క్‌షాప్‌లు నిర్వహించేవారు. మహిళా సాధికారతకు డిజిటల్ అక్షరాస్యత అనేది కీలకం అనే విషయాన్ని గుర్తు చేస్తూ రాయడం, చదవడం రానివారికి కూడా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే విషయంలో శిక్షణ ఇచ్చారు. ఎవ్రీ డే హీరోస్‌ను ఎంతోమందిని కలిసారు. శ్రిష్టి బక్షి బృందం చేసిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ డాక్యుమెంటరి ఫీచర్ ఫిల్మ్ మెల్బోర్న్ ఫిల్మ్‌ఫెస్టివల్–2021కు ఎంపికైంది. పాత్ బ్రేకింగ్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పాదయాత్ర ఒక సందేశాన్ని మోసుకెళుతుంది.. స్త్రీ వంటింటికే పరిమితం కాదు ఒంటరిగా ఈ ప్రపంచాన్ని చుట్టిరాగలదు అని. ఈ పాదయాత్ర ఒక పలకరింపు అవుతుంది...‘మీ సమస్యలు ఏమిటి?’ అని స్త్రీలను అడుగుతుంది. వాటిని రికార్డ్ చేస్తుంది. ఈ పాదయాత్రలో అడుగడుగునా జీవితం అనే బడి ఉంది. ఆ బడి నుంచి ఒక పరిష్కార పాఠాన్ని వెంట తీసుకొస్తుంది. పదిమందికి పరిచయం చేస్తుంది. -
తల్లి ద్వారా కడుపులో బిడ్డకు కోవిడ్?
సాక్షి, హైదరాబాద్: కరోనా ఏడాదిగా మనిషికి ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. వ్యాధి లక్షణాలు మొదలుకొని వైరస్ వ్యాప్తి వరకూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ మహమ్మారి తల్లి నుంచి గర్భస్థ శిశువుకూ సోకుతుందని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఘంటా సతీశ్. లిటిల్‌స్టార్స్ పిల్లల ఆస్పత్రిలో పని చేస్తున్న ఆయన ఇటీవలే ఇలాంటి ఓ కేసును గుర్తించడమే కాకుండా.. కరోనాతో పుట్టిన పసిబిడ్డకు విజయవంతంగా చికిత్స అందించారు కూడా. ఇలా తల్లి మాయ ద్వారా బిడ్డకు వ్యాధి వ్యాపించడాన్ని కోవిడ్ 19 నియోనాటల్ మిస్–సి అని పిలుస్తారు. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెలలు నిండిన శిశువుల్లోనే యాంటీబాడీలు.. కోవిడ్–19 గురించి తెలిసినప్పటి నుంచి వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఈ వ్యాధి తల్లి నుంచి గర్భంలో ఉన్న బిడ్డకు సోకే అవకాశం లేదు. కానీ గతేడాదిగా కోవిడ్‌తో బాధపడుతున్న గర్భిణులకు వైద్య సాయం అందిస్తున్న డాక్టర్ ఘంటా సతీశ్ మాత్రం ఈ అంశంతో ఏకీభవించలేదు. పుట్టిన బిడ్డల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నా.. శరీరంలో యాంటీబాడీలు లేకపోవడాన్ని కొందరిలో గుర్తించారు. కొంతకాలం కింద కొంచెం అటు ఇటుగా జరిగిన నాలుగు కాన్పులతో ఈ అంశంపై ఆయన కొంత స్పష్టత సాధించగలిగారు. పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకరు పూర్తిగా నెలలు నిండిన తర్వాత బయటికి రాగా.. మిగిలిన వారిని 32 వారాల్లోపే బయటకు తీశారు. నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డలో మాత్రమే యాంటీబాడీలు ఉండటాన్ని గుర్తించిన సతీశ్.. ఇది కచ్చితంగా తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు వైరస్ సోకడం వల్ల మాత్రమే సాధ్యమైందన్న నిర్ధారణకు వచ్చారు. మిగిలిన ముగ్గురు బిడ్డల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ‘గర్భస్థ శిశువులకు తల్లి నుంచి ఉమ్మ నీరు దాటుకుని మరీ యాంటీబాడీలు చేరాలంటే కనీసం 32 వారాలు పూర్తయి ఉండాలి. నలుగురు పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు 32 వారాలు పూర్తి కాకముందే పుట్టగా.. మిగిలిన ఇద్దరు 28, 31 వారాల తర్వాత పుట్టిన వారు’అని డాక్టర్ సతీశ్ వివరించారు. చికిత్స పద్ధతులు మారాలి గర్భంలో ఉన్న పిల్లలకు తల్లి ద్వారా కోవిడ్ సోకిన కేసులు ఇటీవల చాలా అరుదుగా కనిపిస్తున్నాయని డాక్టర్ ఘంటా సతీశ్ తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌తో ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ పరిశోధన ద్వారా కోవిడ్ సోకిన గర్భిణుల విషయంలో తీసుకునే జాగ్రతలు, అనుసరించాల్సిన వైద్య పద్ధతుల్లో మార్పులు జరగొచ్చని, తద్వారా తల్లి, పిల్లలు ఇద్దరికీ మేలు జరుగుతుందని వివరించారు. -
తల్లి ప్రాణం గిలగిల.. గర్భంలో బిడ్డ మృతి
ఖమ్మం వైద్య విభాగం: వైద్యుల నిర్లక్ష్యానికి గర్భస్థ శిశువు బలైంది. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా వ్యవహరించడం.. ఆ తల్లికి కడుపు కోతను మిగిలి్చంది. గురువారం ఖమ్మంలో ఈ అమాననీయ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన ముసుకుల అశ్విని నిండు గర్భిణి కావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచి్చంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కాన్పు చేసేందుకు కొన్ని టెస్టులు రాశారు. దీంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి డాక్టర్‌కు చూపించారు. పరీక్షల్లో ఆమెకు కామెర్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆపరేషన్ చేయడం కుదరదని, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారు. తాము నిరుపేదలమని, లాక్డౌన్లో అంతదూరం తీసుకెళ్లలేమని అశ్విని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అశ్విని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడుపులో ఇబ్బందిగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో డాక్టర్లు మరోసారి పరీక్షించారు. ఈ దశలో ఆమె కడుపులో బిడ్డ మృత్యువాత పడింది. దీంతో కుటుంబ సభ్యులు, అశ్విని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం కడుపులోని మృత శిశువును అయినా తీయాలని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా కనికనించలేదు. దీంతో చేసేది లేక నగరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించారు. అయినా ఎవరూ వైద్యానికి అంగీకరించకపోవడంతో చివరి ప్రయత్నంగా మమత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు తీవ్రంగా శ్రమించి మృత శిశువును బయటకు తీశారు. కాగా తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కామెర్లు ఉండడంతో ఎంజీఎంకు వెళ్లమన్నాం ఈ సంఘటనపై ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ బి. శ్రీనివాసరావు వివరణ కోరగా.. ఆమెకు కామెర్లు ఉం డటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారన్నారు. కానీ కడుపులో శిశువు మాత్రం ఆస్పత్రిలో మృతి చెందలేదని స్పష్టం చేశారు. దానికి తమ వైద్యులు బాధ్యులు కాదని తెలిపారు. చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. చదవండి: ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవడం ఇలా.. -
గర్భిణిని హత్య చేసి బిడ్డను దొంగిలించారు
వాషింగ్టన్ : 19 ఏళ్ల మార్లేన్ ఓచోయో లోపెజ్ కనిపించకుండా పోయి నెల రోజులు అవుతుంది. కనిపించకుండా పోయిన నాటికే తను నిండు గర్భవతే కాక ఆమెకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. సరిగ్గా నెల రోజుల క్రితం మార్లేన్.. డే కేర్ సెంటర్లో ఉన్న కుమారున్ని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఓ రోజు గడిచింది. కానీ మార్లేన్ జాడ లేదు. ఈ లోపు డేకేర్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది. నిన్నటి నుంచి మార్లేన్ కుమారుడు డేకేర్ సెంటర్లోనే ఉన్నాడని.. అతన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని తెలిపారు. దాంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. కొడుకును తీసుకొస్తానని చెప్పిన మార్లేన్ ఎక్కడికి వెళ్లిందో వారికి అర్థం కాలేదు. దాంతో తెలిసిన వారందరికి ఫోన్ చేసి.. మార్టేన్ గురించి ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు నుంచి నిన్నటి వరకూ మార్లేన్ ఇంటికి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగిలింది. మార్లేన్ బదులు ఆమె బూడిద ఇంటికి చేరింది. అది చూసి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జరిగిన ఘోరం గురించి విన్న తర్వాత ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. లోకంలో ఇంతటి దుర్మార్గులు కూడా ఉన్నారా అని వాపోతున్నారు. మార్లేన్ ఇంటి నుంచి వెళ్లిన రోజు ఏం జరిగిందో పోలీసులు తెలిపిన వివరాలు. గర్భవతిగా ఉన్న మార్లేన్ ఆర్థిక పరిస్థితులు మాత్రం అంత బాగాలేవు. దాంతో తనకు పుట్టుబోయే బిడ్డకు ఏదో ఓ సాయం చేయాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో మార్లేన్ గర్భవతి అనే విషయం చాలా మందికి తెలిసింది. మార్లేన్ అభ్యర్థనకు చాలా మంది స్పందించారు. ఇలా స్పందించిన వారిలో క్లారిస్సా ఫిగ్యురోవా(46) కూడా ఉంది. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలో కొడుకును డేకేర్ సెంటర్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్న మార్లేన్కు, క్లారిస్సా ఫోన్ చేసింది. తన ఇంట్లో చిన్న పిల్లల బట్టలు ఉన్నాయి.. వచ్చి తీసుకెళ్లమని చెప్పింది. దాంతో మార్లేన్ డేకేర్ సెంటర్ దగ్గరకు వెళ్లకుండా క్లారిస్సా ఇంటికి వెళ్లింది. అదే ఆమె చేసిన తప్పు. బట్టల కోసం ఇంటికి వచ్చిన మార్లేన్‌ను.. క్లారిస్సా, ఆమె కూతురు, కుమార్తె బాయ్‌ఫ్రెండ్ కలిసి హత్య చేశారు. అనంతరం మార్లేన్ గర్భం నుంచి బిడ్డను బయటకు తీసి.. ఆమె బాడీని కాల్చేశారు. ఆమె కారును ఆ ప్రాంతంలోని ఓ పార్కింగ్ ఏరియాలో భద్రపరిచారు. బలవంతంగా బిడ్డను బయటకు తీయడంతో ఆ చిన్నారి అస్వస్థతకు లోనయ్యింది. బిడ్డ శరీరం తెల్లగా పాలిపోయింది. దాంతో 911 నంబర్‌కు ఫోన్ చేసి.. తనకు, తన బిడ్డకు సాయం చేయాల్సిందిగా కోరింది క్లారిస్సా. ఆమె సంభాషణ మొత్తం వారి దగ్గర రికార్డయ్యింది. ఈ లోపు మార్లేన్ కనిపించడం లేదనే ఫిర్యాదు వచ్చిది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు క్లారిస్సా మీద అనుమానం వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లి చెక్ చేయగా.. అక్కడ మార్లేన్ గురించి ఆనవాలు లభ్యమయ్యాయి. అంతేకాక క్లారిస్సా ఇంటికి కొద్ది దూరంలో మార్లేన్ కార్ పార్క్ చేసి ఉన్న విషయం కూడా వారి దృష్టికి వచ్చింది. క్లారిస్సాను విచారించగా.. తన కొడుకు పురిట్లోనే చనిపోయాడని.. అప్పటి నుంచి ఎవరైనా చిన్న బాబును పెంచుకోవాలని అనుకున్నానని.. కానీ సాధ్యపడలేదని క్లారిస్సా తెలిపింది. ఇంతలో సోషల్ మీడియాలో మార్లేన్ తన బిడ్డకు సాయం చేయమని కోరడంతో.. ఆమె బిడ్డను దొంగతనం చేయాలని భావించినట్లు ఒప్పుకుంది. ఈ క్రమంలో బట్టలు ఇస్తానని చెప్పి మార్లేన్‌ను ఇంటికి పిలిచి ఆమెను హత్య చేసినట్లు వెల్లడించింది. ఇందుకు తన కూతురు, ఆమె బాయ్‌ఫ్రెండ్ సాయం చేశారని తెలిపింది. ప్రస్తుతం క్లారిస్సా, ఆమె కుమార్తె జైలులో ఉన్నారు. మార్లెన్ బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి.. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి
కరీంనగర్: ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. వైద్యులు సరిగా పట్టించుకోక పోవడంతో శిశువు గర్భంలోనే మృతిచెందింది. ఈ సంఘటన జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం శ్రీరామ కాలనీకి చెందిన అంజలి అనే గర్భిణీని నిన్న రాత్రి బంధువులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. నొప్పులు రాకపోవడంతో వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తరువాత ఉదయం 9 గంటల వరకు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. చివరకు 11 గంటలకు అంజలి చనిపోయిన బిడ్డను ప్రసవించింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ గర్భంలోనే చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. -
పొడిచి.. కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లారు
న్యూయార్క్: నిండు గర్భిణీని కత్తితో పొడిచి ఆమె కడుపులోని బిడ్డను ఎత్తుకెళ్లిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాలు వెల్లడించని పోలీసులు సంఘటన వివరాలు మాత్రం తెలియజేశారు. కొలరాడోలో నివాసం ఉంటున్న ఓ 26 ఏళ్ల మహిళ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా సహాయం చేయండంటూ గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసులు లోపలికి వెళ్లి చూడగా ఆమె కడుపులో కత్తితోపొడిచిన గాయాలతో పడి ఉంది. తనపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడని, కడుపులో పొడిచి తన బిడ్డను తీసుకొని వెళ్లాడని ఆమె పోలీసులకు తెలిపింది. వస్త్ర వ్యాపారిలా తన ఇంటికి వచ్చిన వ్యక్తితో పుట్టబోయే తన బిడ్డకు మంచి బట్టలు చూపించండంటూ మాట్లాడుతుండగానే ఆ వ్యక్తి కత్తితో దాడి చేసి కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు మహిళ కోలుకుంది. ఇందులో కొసమెరుపేంటంటే.. సరిగ్గా పోలీసులు ఆస్పత్రిలో ఉండగానే ఓ 34 ఏళ్ల వ్యక్తి ఒక పసిగుడ్డును చేతిలో పట్టుకొని వచ్చింది. దీంతో ఆ పాపను ఆ వ్యక్తి వేరే వాళ్ల నుంచి ఎత్తుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
సైనిక దాడిలో గర్భిణి మృతి.. శిశువును కాపాడిన వైద్యులు
గాజా: ఇజ్రాయెల్ దాడుల్లో గాజా నగరం శిథిలాల దిబ్బగా మారుతోంది. తాజా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కనీసం 85 మంది పాలస్తీనీయుల మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాలకు, పాలస్తీనాలోని హమాస్ వర్గానికి మధ్య జరుగుతున్న పోరులో దాదాపు 1000 మంది చనిపోయారు. గాజా నగరంలో ఎటు చూసినా హృదయ విదారక సంఘటనలే. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 23 ఏళ్ల గర్భిణి మరణించింది. ఇంటి శిథిలాల కింద పడిఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి మహిళ గర్భంలో ఉన్న శిశువును రక్షించారు.