న్యూయార్క్: నిండు గర్భిణీని కత్తితో పొడిచి ఆమె కడుపులోని బిడ్డను ఎత్తుకెళ్లిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాలు వెల్లడించని పోలీసులు సంఘటన వివరాలు మాత్రం తెలియజేశారు. కొలరాడోలో నివాసం ఉంటున్న ఓ 26 ఏళ్ల మహిళ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా సహాయం చేయండంటూ గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసులు లోపలికి వెళ్లి చూడగా ఆమె కడుపులో కత్తితోపొడిచిన గాయాలతో పడి ఉంది. తనపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడని, కడుపులో పొడిచి తన బిడ్డను తీసుకొని వెళ్లాడని ఆమె పోలీసులకు తెలిపింది.
వస్త్ర వ్యాపారిలా తన ఇంటికి వచ్చిన వ్యక్తితో పుట్టబోయే తన బిడ్డకు మంచి బట్టలు చూపించండంటూ మాట్లాడుతుండగానే ఆ వ్యక్తి కత్తితో దాడి చేసి కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు మహిళ కోలుకుంది. ఇందులో కొసమెరుపేంటంటే.. సరిగ్గా పోలీసులు ఆస్పత్రిలో ఉండగానే ఓ 34 ఏళ్ల వ్యక్తి ఒక పసిగుడ్డును చేతిలో పట్టుకొని వచ్చింది. దీంతో ఆ పాపను ఆ వ్యక్తి వేరే వాళ్ల నుంచి ఎత్తుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పొడిచి.. కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లారు
Published Thu, Mar 19 2015 2:26 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement