cut
-
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్‌ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
అమ్మవారికి నాలుక సమర్పించిన భక్తుడు
భింద్: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భక్తులు అమ్మవారికి కానుకలు చెల్లించుకోవడంతో పాటు, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఒక భక్తుడు అమ్మవారికి తన నాలుకను సమర్పించి, తన భక్తిని చాటుకున్నాడు.మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో గల రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారి సమర్పించాడు. ఈ విషయం తెలియగానే స్థానికులు ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు. రతన్గర్ దేవి ఆలయం భిండ్‌లోని లాహర్ నగర్లో ఉంది. ఈ ఆలయాన్ని 2015లో నిర్మించారు.నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చిన రామ్‌శరణ్ భగత్ తన నాలుకను తెగ్గోసుకుని, అమ్మవారికి సమర్పించాడు. తరువాత ఆ రక్తాన్ని ఆలయం వెలుపల ఉంచిన పాత్రలో పోశాడు. దీనిని చూసిన అక్కడివారంతా తెగ ఆశ్చర్యపోయారు. నాలుకను సమర్పించాక ఆ భక్తుడు ఆలయంలోనే కాసేపు నిద్రించాడు. ఇది కూడా చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా.. -
ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్ ఫైట్ .. వేలు కోసుకున్న యువకుడు
రాయ్‌పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.బలరాంపూర్‌కు చెందిన దుర్గేష్‌పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్‌లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్‌కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు. -
పాక్ ఎన్నికలకు 54 వేల చెట్ల నరికివేత!
ఇస్లామాబాద్: ఇదేందిది... ఎన్నికలకోసం చెట్లు నరకడం ఏమిటా అనుకుంటున్నారా? అవును ఇది ఇది నిజం.. పాక్ ఎన్నికల నిర్వహణకు 56 వేల చెట్లు నరికి వేయాల్సి వచ్చింది. పాక్‌లో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 2,179 టన్నుల కాగితం అవసరమయ్యింది. కాగితాన్ని చెట్ల నుంచే తయారు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఒక అంచనా ప్రకారం ఒక చెట్టు నుండి దాదాపు 16 రీమ్‌ల కాగితాన్ని తయారు చేయవచ్చు. అటువంటి స్థితిలో ఒక టన్ను కాగితం తయారు చేయడానికి 25 చెట్లు అవసరం. దాని ప్రకారం మనం లెక్కలు వేస్తే ఎన్నికల కోసం పాకిస్తాన్లో దాదాపు 54 వేల చెట్లను నరికివేశారు. 2018 ఎన్నికల్లో 22 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 800 టన్నుల ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను ఉపయోగించారు. నియోజక వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య పెరిగిన కారణంగానే బ్యాలెట్ పేపర్ల సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 కంటే ఈసారి అభ్యర్థుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఎన్నికల సంఘం పేపర్ల ముద్రణను సకాలంలో పూర్తి చేసింది. సోమవారం నాటికి బ్యాలెట్ పత్రాల పంపిణీ పూర్తి కానుంది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహించింది. ఈ మాక్ టెస్ట్ లో 859 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్‌ను బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. నవాజ్ మరోమారు ప్రధాని కాబోతున్నారని ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) చెబుతోంది. -
బరువు పెరిగితే సెలవులు కట్!
సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ అసెస్మెంట్ కార్డ్ (ఏపీఏసీ) ప్రవేశపెట్టనున్నారు. ఆర్మీలో తాజాగా రూపొందించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైనికులకు మెరుగుదల కోసం 30 రోజుల గడువు ఇవ్వనున్నారు. అప్పటికీ విఫలమైతే, ఆ సైనికుని సెలవులను తగ్గించనున్నారు. నూతన మార్పుల ప్రకారం త్రైమాసికానికి ఒకసారి జరిగే ట్రయల్స్‌లో కమాండింగ్ ఆఫీసర్‌కు బదులుగా బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త విధానంలో 30 రోజులలోపు మెరుగుదల కనిపించకపోతే అధిక బరువు కలిగిన ఆర్మీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న పరీక్షలతో పాటు అదనంగా మరికొన్ని పరీక్షలను కూడా నిర్వహించనున్నారు. ఈ కొత్త విధానం ఉద్దేశ్యం సైన్య సిబ్బంది పరీక్షల ప్రక్రియలో ఏకరూపతను తీసుకురావడం, శారీరకంగా అన్‌ఫిట్ లేదా స్థూలకాయంగా మారే ముప్పును తగ్గించడం, జీవనశైలి వ్యాధులు నివారణ. ప్రస్తుతం సైన్యం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (బీపీఈటీ), ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (పీపీటీ) నిర్వహిస్తోంది. బీపీఈటీ పరీక్షలో సిబ్బంది నిర్ణీత సమయంలో 5 కిలోమీటర్లు పరుగెత్తాలి. తాడు పైకి ఎక్కి తొమ్మిది అడుగుల గొయ్యిని దాటాలి. ఇక్కడ వయస్సు ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. పీపీటీలో 2.4 కిలోమీటర్ల రన్, 5 మీటర్ల షటిల్, పుష్ అప్స్, చిన్ అప్స్, సిట్ అప్స్, 100 మీటర్ల స్ప్రింట్ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని చోట్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లో పొందుపరుస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒక బ్రిగేడియర్ ర్యాంక్ అధికారితో పాటు ఇద్దరు కల్నల్లు, ఒక మెడికల్ ఆఫీసర్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. బీపీఈటీ, పీపీటీలు కాకుండా సైనికులకు కొన్ని ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రతి ఆరు నెలలకు 10 కిలోమీటర్ల స్పీడ్ మార్చ్ , 32 కిలోమీటర్ల రూట్ మార్చ్ ఉంటాయి. అదనంగా 50 మీటర్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు. -
LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్
LPG price by Rs 400/cylinder బీజేపీ సర్కార్ హయాంలో ఇటీవలి కాలంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగి సామాన్యుడికి పెనుభారంగా మారడంతో బీజేపీ సర్కార్ తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల ధరను రూ. 200 తగ్గించింది. అలాగే పిఎం ఉజ్వల పథకం లబ్ధిదారులకు అదనంగా రూ.200 లభించనుంది. దీంతో PMUY ఖాతాదారులకందే సబ్సిడీ రూ.400 అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ మహిళలకు అందించిన రక్షాబంధన కానుక అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఎల్పిజి సీలిండర్ ధర తగ్గింపు రాబోయే ఎన్నికలకు సంబంధించినదేనా అన్నదానిపై స్పందించిన ఠాకూర్ అలా అనుకుంటే ముందే తగ్గించే వాళ్లం అంటూ ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సౌదీ CP (కాంట్రాక్ట్ ధరలు) ధరలను పరిశీలిస్తే, ఏప్రిల్ 2022 నుండి 303 శాతం పెరిగింది. కానీ తాము మాత్రం 63 శాతం మాత్రమే పెంచి కొంత ఉపశమనం కలిగించామంటూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపు నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోట్లాది వినియోగదారుల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.6,100 కోట్లు కేటాయించామని, 2023-24 సంవత్సరానికి ఆర్థిక ప్రభావం రూ. 7,680 కోట్లుగా అంచనా వేశామన్నారు. కాగా ప్రస్తుతం న్యూఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ రూ. 1,103గా ఉంది. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సిలిండర్‌కు రూ. 50 పెరిగిన సంగతి తెలిసిందే. "Government has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders for all LPG consumers" -Union Minister @ianuragthakur#CabinetDecisions #LPGcylinder pic.twitter.com/sfwTyxUlsN — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 29, 2023 ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాల్లో 14.2 కేజీల వంట గ్యాస్ ధరలు హైదరాబాద్ రూ. 1,155.00 ముంబై రూ. 1,102.50 గుర్గావ్ రూ. 1,111.50 బెంగళూరు రూ. 1,105.50 చండీగడ్ రూ. 1,112.50 జైపూర్ రూ. 1,106.50 పాట్నా రూ. 1,201.00 కోలకత్తా రూ. 1,129.00 చెన్నై రూ. 1,118.50 నోయిడా రూ. 1,100.50 భువనేశ్వర్ రూ. 1,129.00 లక్నో రూ. 1,140.50 త్రివేండ్రం రూ. 1,112.00 -
శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే!
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో మూఢనమ్మకాలకు సంబంధించిన ఉదంతమొకటి సంచలనంగా మారింది. మహాశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆలయంలో ఒక యువకుడు వృక్షాలను కట్ చేసే యంత్రంతో తన గొంతు కోసుకున్నాడు. సమాచారం తెలియగానే అతని కుటుంబ సభ్యులు పరుగుపరుగున ఆలయానికి చేరుకుని, బాధితుడిని చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధిత యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన రఘునాథ్పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన పల్టూ రామ్ కుమారుడు దీపక్ కుశ్వాహ్(30) కూలీనాలీ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దీపక్ తండ్రి పల్టూరామ్ తెలిపిన వివరాల ప్రకారం దీపక్‌కు ఇద్దరు పిల్లలు. దీపక్ మహాశివుని భక్తుడు. గత కొంతకాలంగా దీపక్ ఉదయం, రాత్రివేళల్లో మహాశివునికి పూజలు చేస్తుంటాడు. ఇటీవల దీపక్ తాను మెడ కోసుకుని మహాశివుని ప్రసన్నం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పల్టూ రామ్ తన కుమారుతో అటువంటి పని చేయవద్దని చెప్పాడు. అయితే కుమారుడు అతని మాట వినలేదు. కాగా దీపక్ ఒక నోట్‌బుక్‌లో మహాశివుని మంత్రాలను, శివునితో సాగించిన సంభాషణను రాస్తుంటాడు. దానిలో దీపక్ మహాశివునికి తనను తాను అర్పించుకుంటానని రాశాడు. దానిలో పేర్కొన్న విధంగా ఉదయం 4 గంటలకు ఆలయానికి వెళ్లాడు. అక్కడ చెట్లు కట్ చేసే యంత్రంతో మహాశివుని సమక్షంలో తన మెడను కట్ చేసుకుని జయజయధ్వానాలు చేశాడు. దీనిని అక్కడున్నవారు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు వెంటనే ఆలయానికి చేరుకుని భాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీపక్ చిన్నాన్న ప్రసాద్ మాట్లాడుతూ దీపక్ మెడ కట్ చేసుకున్న సమయంలో ‘జై భగవాన్ శంకర్’ అనే నినాదాలు చేశాడని తెలిపారు. బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ సచిన్ మాహుర్ మాట్లాడుతూ దీపక్ అనే యువకుడు స్వయంగా తన మెడ కోసుకున్నాడని, అతనికి వైద్య చికిత్స జరుగుతున్నదని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. -
ఈ ఉల్లిపాయాలు కోస్తే కన్నీళ్లు రావు!..కానీ ధర వింటే కన్నీళ్లు ఖాయం!
ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి. ఉల్లి ధరలు పెరిగినప్పుడు వాటిని కోయకపోయినా కన్నీళ్లు వస్తాయి, అది వేరే విషయం! కోసినా కన్నీళ్లు తెప్పించని ఉల్లిపాయలు ఇటీవల ఆస్ట్రేలియా మార్కెట్లోకి వచ్చాయి. మిగిలిన కూరగాయల్లాగానే వీటిని కూడా సంతోషంగా తరుక్కోవచ్చని, వీటిని కోసినప్పుడు కళ్లుమండటం, కన్నీళ్లు రావడం జరగదని చెబుతున్నారు. ఈ రకం ఉల్లిపాయలను ‘హ్యాపీ చాప్స్’ బ్రాండ్ పేరుతో విడుదల చేశారు. తొలిసారిగా ఈ ఉల్లిపాయలను ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్ సపర్మార్కెట్లలోకి జూలై 12 నుంచి అందుబాటులోకి తెచ్చారు. జన్యుమార్పిడి ద్వారా ఉల్లిపాయల్లోని కన్నీళ్లు తెప్పించే రసాయనాలు లేకుండా చేసి, వీటిని ప్రత్యేకంగా పండించారు. వీటిని కోసిన తర్వాత వీటిలో కన్నీళ్లు తెప్పించే రసాయనాలు తగ్గిపోతాయి. రోజులు గడిచేకొద్దీ పూర్తిగా లేకుండాపోతాయి. సాధారణ రకాలకు చెందిన ఉల్లిపాయల్లో రోజులు గడిచేకొద్దీ ఈ రసాయనాలు ఎక్కువై, మరింతగా కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే, ఈ ఉల్లిపాయలను కోసినప్పుడు కన్నీళ్లు రాకున్నా, వీటి ధర వింటే కన్నీళ్లు రావడం ఖాయం. ‘హ్యాపీచాప్స్’ ఉల్లి కిలో ధర 5 డాలర్లు (ర.411) వత్రమే!. (చదవండి: పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్) -
నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు
జైలు అనగానే సినిమాలే గుర్తోస్తాయి. వాటిల్లో చూపించనంత అందంగా ఏమి ఉండవు. కానీ ఇప్పుడూ ఆ జైళ్లనే ఖైదీలలో పరివర్తన వచ్చేలా గొప్ప కేంద్రాలుగా మారుస్తున్నారు. అలాగే వారి శిక్షకాలం పూర్తి చేసుకున్న తదుపరి హాయిగా జీవించేలా నైపుణ్యాలు సంపాదించుకునేలా చేసేందుకు శ్రీకారం చుట్టింది బ్రిటన్ ప్రభుత్వం. మరోసారి ఎటువంటి నేరాలకు దిగకుండా ఉండి, వారి భవిష్యత్తును వారంతట వారే తీర్చిదిద్దకునేలా చేస్తున్నారు అక్కడి అధికారులు. అందుకోసం అని "హెచ్ఎంపీ ఫోస్సే వే" అనే పేరుతో అత్యాధునికి జైలుని నిర్మిస్తున్నారు. ఇందులో దగ్గర దగ్గరగా దాదాపు వెయ్యిమందికి పైగా అంటే 1,715 మంది దాక ఖైదీలు ఉండేంత స్థలం ఉంటుంది. ఖైదీలకు పునరావసం కల్పించడం తోపాటుగా ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడేందుకు ఈ కొత్త జైలుని ప్రారంభించారు. ఈ కొత్త జైలు నిర్మాణంలో 71 మంది ఖైదీలు, ఇద్దరు మాజీ నేరస్తులు పనిచేయాలనే ఒక నిబంధన కూడా ఉంది. ఇక్కడ మొత్తం 24 వర్కషాప్‌లు ఉంటాయి. నేరస్తులు ఇక్కడ నిర్మాణ వాహనాలను ఎలా నడపాలి, అద్దాలను ఎలా తయారు చేయాలి, జైలు నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్ విభాగాలు, లైటింగ్ పరికరాలు తదితరాలకు సంబంధించిన పనులు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో ఉన్న ఆరు అత్యాధునికి జైళ్లలో ఇది రెండోది. ఈ జైలుని.. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. అలాగే యూకేలో ఇప్పటి వరకు నిర్మించిన పచ్చటి జైలు కూడా అదే. బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నాలుగు బిలియన్ పౌండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ అత్యాధునిక జైలుని నిర్మించింది. అలాగే ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తి అయిన వెంటనే ఉపాధిని వెతుక్కోవడం ఈజీ అవ్వడమే గాక సమాజంలో ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా బతకగలగుతారని చెబుతున్నారు బ్రిటన్ అధికారులు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తే ఆ భారం కస్టమర్లపై పడే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ప్రస్తుతం ఫేమ్ (FAME) 2 పథకం కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న దానిపై చాలా కాలంగా అనేక పుకార్లు ఉన్నాయి. వీటి ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిందని, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను పూర్తిగా నిలిపివేయనుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారికంగా ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. అయితే తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీని నిర్ణయించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త ఫార్ములాను ప్రతిపాదించినట్లు ఫినాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంటోంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం 40 శాతం ప్రకారం కిలోవాట్‌కు ఇస్తున్న రూ.15,000 సబ్సిడీ రూ.10,000లకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. సబ్సిడీపై గరిష్ట పరిమితిని కూడా ప్రస్తుత 40 శాతం నుంచి ఎంఆర్పీలో 15 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు రూ.1.5 లక్షల ధర, 3.5 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రస్తుతం రూ.52,500 సబ్సిడీ వస్తుంది. కొత్త ఫార్ములా ప్రకారం సబ్సిడీ రూ.22,500 లకు తగ్గిపోతుంది. ఫేమ్ 2 పథకం కింద వచ్చే ఏడాది నాటికి పది లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మద్దతునిచ్చేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ వాహనాలపై సబ్సిడీ మాత్రం తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్ -
ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్.. కర్నాటకలోని బెంగుళూరు వద్ద ఉన్న బిదాడి ప్లాంట్–1 ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచేందుకు మూడవ షిఫ్ట్‌ను ప్రారంభించింది. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించాలన్నది కంపెనీ భావన. ఈ యూనిట్లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి కంపెనీ రూ.90 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టింది. ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు ప్లాంట్‌లో 3వ షిఫ్ట్ కోసం దాదాపు 1,500 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. ‘ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించాం. ఈ ఉత్పత్తులు చాలా విజయవంతం అయ్యా యి. అలాగే వీటికి వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉంది. వేచి ఉండే కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుదీప్ ఎస్ దాల్వి తెలిపారు. -
2024లో తగ్గనున్న వడ్డీ రేట్లు! నిపుణుల అంచనా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపు చర్య ఈ సంవత్సరం విరామంతో కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2024 ప్రారంభంలో రేట్లు తగ్గించే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ‘‘ఆర్బీఐ 2023 మిగిలిన సంవత్సరంలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని అలాగే మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గింస్తుందని మేము భావిస్తున్నాము‘ అని విదేశీ బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్తలు ఒక నోట్లో తెలిపారు. ఇదీ చదవండి: ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్.. ఎంతకు చేరాయంటే.. 4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో లేదని వారు పేర్కొంటూ, ద్రవ్యోల్బణం 4 శాతానికి తీసుకురావాలన్న ధ్యే యంతో వృద్ధి రేటును త్యాగం చేయాలని ఆర్బీఐ భావించబోదన్నది తమ అభిప్రాయమని కూడా వారు విశ్లేషించారు. జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అక్టోబర్ నుంచి 0.75 శాతం మేర రేటు తగ్గింపు అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
కేంద్ర పథకాల పేర్లు మారిస్తే నిధులు కట్!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ కొన్ని రాష్ట్రాలు తమకు లబ్ధి కలిగేలా కొత్త పేర్లు పెట్టడం ఇకపై కుదరదు. పార్లమెంట్ ఆమోదం పొందిన పథకాల పేర్లను మార్చడం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పాత్రను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేయడమే అవుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పథకాల పేర్లను మార్చే రాష్ట్రాలకు నిధులు నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై), ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు వివిధ రాష్ట్రాలు తమకు అనుకూల పేర్లను పెట్టి అమలు చేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను పంజాబ్ ప్రభుత్వం ‘ఆమ్ ఆద్మీ క్లినిక్’లుగా మార్చింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పీఎంఏవై పథకాన్ని బంగ్లా ఆవాస్ యోజనగా మార్చి ఆ రాష్ట్ర సీఎం ఫోటోతో ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీలో దీనిని న్యూఢిల్లీ ఆవాస్ యోజన అని పిలుస్తున్నారు. అలాగే తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌ల్లోనూ ఈ పథకం పేరు మార్చారంటూ పార్లమెంట్ సమావేశాల్లో కొందరు ఎంపీలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నిబంధనలు పాటిస్తేనే నిధులు.. ఈ క్రమంలో కేంద్ర పథకాల పేర్లను మార్చకుండా నిబంధనల మేరకు అమలు చేస్తున్న రాష్ట్రాలకే నిధులు పొందే అర్హత ఉంటుందన్న షరతును కచి్చతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం. ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్‌కు కేంద్రం పెట్టిన పేరు మార్చాయి. ఇది నిబంధనల ఉల్లంఘనే. ఈ పద్ధతి నిధుల విడుదల నిలిపివేయడానికి దారి తీస్తుంది’అని హెచ్చరించడం గమనార్హం. చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు -
7.2 శాతం నుంచి 7 శాతానికి డౌన్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 20 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టింది. క్రితం 7.2 శాతం అంచనాలను 7 శాతానికి తగ్గింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి విధానం కఠినతరం వంటి అంశాలు వృద్ధి అంచనాల తగ్గింపునకు కారణమని ఏడీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యిన నేపథ్యలో ఏడీబీ తాజా ‘‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ 2022’’ విడుదలైంది. ‘‘ధరల ఒత్తిళ్లు దేశీయ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అంచనా. మందగించిన గ్లోబల్ డిమాండ్, పెరిగిన చమురు ధరలు నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని అవుట్‌లుక్ రిపోర్ట్ పేర్కొంది. కోత రెండవసారి.. ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ ప్రతి ఏడాదీ ఏప్రిల్‌లో విడుదలవుతుంది. 2022 ఏప్రిల్‌లో 2022–23లో 7.5 శాతం, 2023–24లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. అయితే ఈ రేట్లను జూలైలో వరుసగా 7.2 శాతం, 7.8 శాతాలకు తగ్గించింది. తాజాగా 2022–23 వృద్ధి రేటును మరింతగా 7 శాతానికి తగ్గించింది. నివేదికలో మరికొన్ని అంశాలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కమోడిటీ ధరలను తీవ్రతరం చేసింది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2022–23 ఏప్రిల్–జూన్ మధ్య సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతంకన్నా ఇది ఎంతో అధికం. ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. వినియోగ బాస్కెట్లో ఆహార ఉత్పత్తుల వెయిటేజ్ దాదాపు 45 శాతం. కూరగాయల ధరలు భారీగా 35 శాతం వరకూ పెరిగాయి. ► చైనా 2022 వృద్ధి అంచనాలు 5 శాతం నుంచి 3.3 శాతానికి కోత. జీరో–కోవిడ్ వ్యూహంలో భాగంగా లాక్డౌన్లు దీనికి ప్రధాన కారణం. రియల్టీ రంగంలో ప్రతికూలతలు, అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు చైనా ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి. ► సెంట్రల్ బ్యాంకుల రేట్ల పెంపు నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు తొలి 5.2 శాతం అంచనాలు 4.3 శాతానికి కోత. ఈ ప్రాంతం వృద్ధికన్నా చైనా వృద్ధి రేటు తగ్గుదల మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. 2023 ఆసియా, పసిఫిక్ వృద్ధి రేటు అంచనా కూడా 5.3 శాతం నుంచి 4.9 శాతానికి కుదింపు. ► భారత్‌తో కూడిన దక్షిణ ఆసియా 2022 వృద్ధి రేటు అంచనా 7 శాతం నుంచి 6.5 శాతానికి కోత. 2023 విషయంలో ఈ రేటు అంచనా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు. -
పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ సీఎం సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలకు తొలి కానుక అందించారు. పెట్రోలుపై లీటరుకు రూ. 5 డీజిల్‌పై రూ. 3 చొప్పున తగ్గించినట్లు సీఎం షిండే ప్రకటించారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం షిండే విలేకరులకు వెల్లడించారు. సామాన్య పౌరులకు మేలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రజల సంక్షేమానికి శివసేన-బీజేపీ ప్రభుత్వ నిబద్ధతలో భాగమే ఈ నిర్ణయం అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. మరోవైపు షిండే నిర్ణయాన్ని అభినందిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి "స్వాగతించే నిర్ణయం" అని ట్వీట్ చేశారు. పెరుగుతున్న ధరల నుండి మన ప్రజలను రక్షించడానికి నవంబర్,మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గింపుతో పాటు మహారాష్ట్ర తాజా నిర్ణయం అక్కడి వినియోగదారులకు పెద్ద ఉపశమనం. మిగిలిన రాష్ట్రాలు కూడా ధరల తగ్గింపుపై ఆలోచించాలని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. Great relief to Maharashtrian & Marathi Manus ! Happy to announce that new Government under CM Eknathrao Shinde has decided to reduce Petrol & Diesel prices by ₹5/litre & ₹3/litre respectively.#CabinetDecision #PetrolDieselPrice #Maharashtra — Devendra Fadnavis (@Dev_Fadnavis) July 14, 2022 A welcome decision! In a big relief to consumers of #Maharashtra #PetrolPrice reduced by ₹5/ltr & #diesel by ₹3/ltr. This in addition to excise duty cut by centre in Nov & May to protect our people from rising prices. Hope opposition states also bring down #PetrolDieselPrices — Hardeep Singh Puri (@HardeepSPuri) July 14, 2022 -
రిలయన్స్‌కు భారీ దెబ్బ: బ్యారల్‌పై 12 డాలర్ల మార్జిన్ ఫట్!
న్యూఢిల్లీ: దేశీయ ముడి చమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై ప్రభుత్వం విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు (ఆర్ఐఎల్) రిఫైనింగ్ మార్జిన్లలో బ్యారెల్‌కు 12 డాలర్ల వరకూ కోత పెట్టనుంది (ప్రస్తుత మార్జిన్ 25 డాలర్లు). ఇక ఓఎన్జీసీ ఆదాయంపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త పన్నుల వల్ల ప్రభుత్వానికి రూ. 1.3 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను లేదా బ్యారల్‌కు 40 డాలర్లు (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధించింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్‌పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలనార్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీనితోపాటు పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.75 శాతం నుంచి 15 శాతానికి చేరింది. ఆయా అంశాలపై బ్రోకరేజ్ సంస్థల నివేదికలు పరిశీలిస్తే... రవాణా ఇంధనాలపై రూ.68,000 కోట్లు గత సంవత్సరంలో డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతి పరిమాణం ఆధారంగా 2022–23 అంచనాలను మేము లెక్కగట్టాం. మేము మూడు రవాణా ఇంధనాలపై (పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్) రూ. 68,000 కోట్ల అదనపు ఆదాయాలను అంచనా వేస్తున్నాము. అదేవిధంగా, ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నులు అదనపు ఆదాయాలలో రూ. 70,000 కోట్లను పెంచే వీలుంది. దీనివల్ల రిలయన్స్ మార్జిన్ల విషయంలో బ్యారెల్‌కు 12 డాలర్ల మేర (వార్షిక ప్రాతిపదికన రూ. 47,000 కోట్లు) ప్రభావం చూపగలవని అంచనా. – నోమురా లోటు భర్తీ లక్ష్యం... : 2022 మేలో ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కేంద్రం ఆదాయాలు ఒక లక్ష కోట్లు తగ్గాయని అంచనా. అదనపు ఎక్సైజ్ సుంకం (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధింపు ప్రకటన ఇప్పుడు వెలువడింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 మేలో తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆదాయ అంతరాన్ని పూరించడమే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. తాజా నిర్ణయం వల్ల రూ. 1.2 లక్షల కోట్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందని భావిస్తున్నాం. దీనితోపాటు దేశీయ మార్కెట్ నుండి ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిరుత్సాహపరచడానికి కూడా తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాము. క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై పన్నులు ఏడాది పాటు కొనసాగితే మరో రూ.52,700 కోట్ల ఆదాయం సమకూరుతుందని మా అంచనా. కొత్త పన్ను వల్ల ఓఎన్జీసీ ఆదాయాలు ఒక్కో షేరుకు రూ.30 తగ్గే అవకాశం ఉంది. ఆర్‌ఐఎల్‌పై దీని ప్రభావం రూ.36గా ఉంటుందని అంచనా. అయితే ఆర్ఐఎల్ దేశీయ మార్కెటింగ్ మార్జిన్లో నష్టం... ఎగుమతి పన్ను కంటే ఇంకా ఎక్కువగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల ఆర్ఐఎల్ గణనీయమైన మొత్తాలలో ఎగుమతి చేయడాన్ని కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాము. – హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ భారీ పన్ను రాబడులు: ఇదే నిర్ణయం ఇకముందూ కొనసాగితే, పన్నుల వల్ల వార్షిక ప్రాతిపదికన కేంద్రానికి రూ. 1.3 లక్షల కోట్ల అదనపు పన్ను రాబడులు వస్తాయని భావిస్తున్నాం. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం ఒనగూడుతుందని అంచనా. - కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ 1.38 లక్షల కోట్ల అదనపు పన్ను : అదనపు పన్నుల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 1.38 లక్షల కోట్లను సేకరించవచ్చన్నది మా అంచనా. – యూబీఎస్ అంచనా -
మరో 300మందికి ఉద్వాసన పలికిన నెట్‌ఫ్లిక్స్
సాక్షి, ముంబై: మార్కెట్లో ప్రత్యర్థుల పోటీ, విపరీతంగా సబ్స్క్రైబర్లను కోల్పోతున్న స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కాస్ట్ కటింగ్‌లో భాగంగా రెండో విడత ఉద్యోగాల్లో కోత విధించింది నెట్‌ఫ్లిక్స్. ఉద్యోగుల్లో 4శాతం లేదా దాదాపు 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత నెలలో చేసిన కట్ కంటే రెండు రెట్లు ఎక్కువ. వ్యాపారంలో గణనీయంగా పెట్టుబడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని సర్దుబాట్లు, ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయమని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ వృద్ధికి వారు చేసిన కృషికి కృతజ్ఞులం, ఈ కష్టకాలలో వారికి మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మార్కెటింగ్ బడ్జెట్‌ను తగ్గించడంలో భాగంగా మేలో కొంత మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. దీంతోపాటు, ఏప్రిల్‌లో కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర కీలక సిబ్బందిని కూడా తొలగించింది. కాగా 2022 తొలి త్రైమాసికంలో 2 లక్షల సబ్స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. తదుపరి త్రైమాసికంలోనూ ఇదే కొనసాగు తుందని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే సబ్స్క్రిప్షన్ ఆధారిత రాబడి మోడల్‌ను పెంచి, సంస్థ కార్యకలాపాలను రీటూల్ చేస్తోంది. జనవరిలో ధరల పెంపు కారణంగా నెట్‌ఫ్లిక్స్ కష్టాలు కొద్దిగా తగ్గాయి. అయితే అమెజాన్, వాల్డిస్నీ, హులూ స్ట్రీమింగ్ కంటెంట్‌తో అధిక పోటీసంస్థ ఆదాయాన్ని దెబ్బ తీస్తోంది. మరోవైపు వరుస తొలగింపులు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు ఉద్యోగులను ఆందోళనలోకి నెడుతున్నాయి. -
ఈలాన్ మస్క్ మరో సంచలనం: షాక్‌లో ఉద్యోగులు
శాన్ఫ్రాన్సిస్కో: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఈలాన్ మస్క్ మరోసారి సంచలచన వ్యాఖ్యలు చేశారు. ఇక వర్క్ ఫ్రం హోం ఇక చాలు.. ఆఫీసులకు రండి.. లేదంటే కంపెనీని వీడండి అంటూ తన ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్ తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుత తరుణంలో ఆర్థికవ్యవస్థపై "సూపర్ బ్యాడ్ ఫీలింగ్" ఉందని, ఈ నేపథ్యంలో దాదాపు 10శాతం సిబ్బందిని తగ్గించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు రాయిటర్స్ పేర్కొంది. అంతేకాదు ‘‘ప్రపంచవ్యాప్త నియామకాలన్నింటినీ నిలిపివేయండి’’ అంటూ టెస్లా ఎగ్జిక్యూటివ్‌లకు మస్క్ నిన్న (గురువారం) ఈ ఇమెయిల్ పంపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై టెస్లా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇంటినుంచి పనిచేస్తున్న టెస్లా ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని లేదా ఉద్యోగాలు మానెయ్యొచ్చని పేర్కొన్నారు. టెస్లాలో ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 40 గంటలు కార్యాలయంలోనే పనిచేయాల్సి ఉంటుందని మస్క్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఆదేశించారు. లేదంటే రిజైన్ చేసినట్టుగా భావిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆర్టీసీ బస్సులో నిద్రలోకి జారుకున్న మహిళ.. తెగిపడిన చేయి..
వీరఘట్టం(పార్వతీపురం మన్యం జిల్లా): అతివేగంతో వస్తున్న ఆటో బస్సును రాసుకుంటూ వెళ్లిపోవడంతో ఓ ప్రయాణికురాలి చేయి తెగి పడిపోయిన సంఘటన వీరఘట్టంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి శనివారం ఉదయం శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు త్రీ స్టాప్ బస్సులో వచ్చింది. చదవండి: ఎస్ఐ మృతిపైనా ‘పచ్చ’ రాజకీయమే! అక్కడ నుంచి పార్వతీపురం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు ఎక్కి డ్రైవర్ వెనుక ఉండే మూడో సీట్లో విండో పక్కన కూర్చుంది. బస్సు వీరఘట్టం వట్టిగెడ్డ వంతెన దాటిన తర్వాత పైడితల్లి చేయిని బయటకు పెట్టి నిద్రలోకి జారుకుంది. అక్కడకు కొద్దిసేపటికి బస్సు జిల్లా పరిషత్ హైసూ్కల్‌కు చేరుకునే సరికి ఎదురుగా అతివేగంతో వస్తున్న ఆటో.. బస్సును రాసుకుంటూ పోవడంతో ఆటో పైనుండే రాడ్ తగిలి పైడితల్లి చేయి తెగి పడిపోయింది. వెంటనే బాధితురాలు కేకలు వేయడంతో బస్సుని నిలిపివేశా రు. సహచర ప్రయాణికులు బాధితురాలిని వీరఘట్టం సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అ నంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. -
ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ
నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్) ఆపరేటర్ ఒకరు ధృవీకరించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో చేరేందుకు ఫిన్లాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆలస్యం చేయకుండా తమకు సభ్యత్వం ఇవ్వాలంటూ నాటోకు విజ్ఞప్తి చేసింది ఫిన్లాండ్. ఈ పరిణామం రష్యాకు మంట పుట్టించింది. దీన్నొక ‘బెదిరింపు’ చర్యగా అభివర్ణిస్తూనే.. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా. ఈ మేరకు మే 14 నుంచి(శనివారం) విద్యుత్ సరఫరాను ఫిన్లాండ్కు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రష్యా విద్యుత్ సరఫరాదారు కంపెనీ రావో నోర్డిక్ మాత్రం చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంతోనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చెల్లింపుల వ్యవహారంపై స్పష్టత ఏంటన్నది ఇటు రావో నోర్డిక్ కంపెనీగానీ, అటు ఫిన్గ్రిడ్ మాత్రం వెల్లడించలేదు. ఫరక్ పడదు ఇరవై ఏళ్ల ఇరు దేశాల వర్తక వాణిజ్యంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే.. విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఫిన్లాండ్ స్పందించింది. రష్యా విద్యుత్ సరఫరా నిలిపివేసినంత మాత్రాన ఫరక్ పడదని ప్రకటించుకుంది. సరఫరా చేసుకునేది కొద్ది శాతమే కాబట్టి ఇబ్బంది ఏం ఉండబోదని ఫిన్నిష్ గ్రిడ్ ఆపరేటర్ ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఫిన్లాండ్కు సరఫరా అయ్యేది పది శాతం విద్యుత్ మాత్రమే. ఆ లోటును స్వీడన్ నుంచి దిగుమతి చేయడమో లేదంటే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమో చేస్తామని ఫిన్లాండ్ ప్రకటించుకుంది. కానీ, రష్యా విద్యుత్ చౌకదనంతో పోలిస్తే.. ఫిన్లాండ్ భరించాల్సిన ఖర్చు ఎక్కువే కానుంది. ఇదిలా ఉంటే.. రష్యా ఫిన్లాండ్తో 1,300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. నాటోలో చేరాలని ఫిన్లాండ్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కేవలం రష్యా బెదిరింపుల మేరకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యం, ప్రజా ఒత్తిడి నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. చదవండి👉🏼: ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కీలక నిర్ణయం -
నీతో శృంగారం నాకిష్టం లేదు.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య
భోపాల్: శృంగారంలో పాల్గొనాలని బలవంతం పెట్టినందుకు ఓ భార్య తన భర్త జననాంగాన్ని కోసేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టికామ్‌ఘడ్ పట్టణానికి చెందిన ఓ మహిళకి 2019లో పెళ్లైంది. అయితే వివాహం జరిగిన కొంత కాలానికే ఆ మహిళకు తను భర్తతో తరచూ గొడవలు జరిగేవి. దీంతో కలిసి ఉండలేక వారివురు కొన్నాళ్లు వేరువేరుగా ఉన్నారు. కుటుంబసభ్యుల జోక్యంతో కొంతకాలంగా రాజీపడి కలిసే ఉంటున్నారు. ఇటీవల ఓ రోజు సదరు భర్త తన భార్యతో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె ఏ మాత్రం అంగీకరించలేదు. దీంతో అతను తన భార్యను బలవంతం చేయగా కోపంతో ఆ మహిళ భర్త జననాగాన్ని కోసేసింది. చికిత్స అనంతరం కోలుకున్నాక ఆ వ్యక్తి .. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. -
వ్యాక్సిన్ వేసుకోకుంటే జీతం కట్! ఆ కంపెనీ సంచలన నిర్ణయం
కోవిడ్ థర్డ్ వేవ్ భయాలు ప్రపంచాన్ని చుట్టు ముడుతుంటే ఇంకా కొందరు వ్యాక్సిన్ వేసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తున్నారు. హేతుబద్దమైన కారణాలు లేకుండానే టీకా తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇటువంటి వారికి ఝలక్ ఇచ్చింది అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ అడోబ్. కంప్యూటర్‌తో పరిచయం ఉన్న వారికి, ఫోటోగ్రఫీ అంటే ఇంట్రస్ట్ ఉన్న వారికి అడోబ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఫోటో, వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి అనేక సాఫ్ట్వేర్ ఉత్పత్తులను అందించే ఆ సంస్థకు అనేక దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. తమ కంపెనీ ఉద్యోగులందరూ వ్యాక్సిన్లు వేసుకోవాల్సిందే అంటూ ఇప్పటికే పలు మార్లు అడోబ్ కోరింది. జీతం కట్ యాజమాన్యం విజ్ఞప్తిని కొందరు అడోబ్ ఉద్యోగులు పెడ చెవిన పెడుతున్నారు. లాజికల్ రీజన్స్ లేకుండానే వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అడోబ్ నిర్ణయించుకుంది. డిసెంబరు 8వ తేదిలోగా వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులను ఆన్ పెయిడ్ లీవ్ కింద పరిగణిస్తామని హెచ్చరించింది. మొదట ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులు పని చేసినా, లీవు పెట్టినా వారికి జీతం చెల్లించమని స్పష్టం చేసింది. ముందుగా ఈ నిబంధనను అమెరికాలోని ఉద్యోగులకు వర్తింప చేస్తామని అడోబ్ ప్రకటించింది. దశల వారీగా ఈ విధానం మిగిలిన దేశాల్లో ఉద్యగులకు విస్తరింప చేయనుంది. మినహాయింపు వ్యాక్సినేషన్‌కి సంబంధించిన కఠిన నిబంధనల నుంచి కొద్ది మందికి మినహాయింపు ఇచ్చింద అడోబ్ సంస్థ. ఆరోగ్యపరమై కారణాలు, మత పరమైన నమ్మకాలు ఉన్న వారు వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ రెండు కేటగిరీలలోకి రాని అడోబ్ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే. చదవండి : వర్క్‌ఫ్రం హోమ్ ఓల్డ్ మెథడ్... కొత్తగా ఫ్లెక్సిబుల్ వర్క్‌వీక్ -
ఫిర్యాదు తీసుకోవడం లేటైందని బ్లేడుతో కోసుకున్నాడు
సాక్షి, విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో వ్యక్తి గొంతుకోసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం భోజగుట్టలో నివసించే హరి (33) పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతనికి ముగ్గురు భార్యలు. అతని రెండో భార్య సెల్‌ఫోన్ లాక్కోవడంతో గొడవ జరిగింది. ఫిర్యాదు చేయడానికి ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు ఇతని మరో భార్యతో వచ్చాడు. ఫిర్యాదు తీసుకోవడం లేటవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం మత్తులో ఉన్న హరి తనతో తెచ్చుకున్న బ్లేడుతో గొంతు దగ్గర కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు అతనిని వైద్యసేవల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇతను గతంలో పలుమార్లు ఇదే విధంగా బ్లేడుతో శరీరం కోసుకోవడంతో శరీరమంతా కత్తిగాట్లు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Edible oil: వినియోగదారులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులుపడిన వినియోగదాడులకు ఊరట లభించింది. వంట నూనెల ఇంపోర్ట్స్‌పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర పరోక్ష పన్నులు , కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కొత్త రేట్లు 2021 జూన్ 17 వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొంది. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని టన్నుకు 87 డాలర్లు తగ్గి 1136 కు తగ్గించగా, ముడి సోయా చమురు దిగుమతి సుంకం టన్నుకు 37 డాలర్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర టన్నుకు 1415 డాలర్లుగా ఉంది. అటు ఆర్బిడి పామాయిల్ పై టన్నుకు 1148 డాలర్లకు దిగివచ్చింది. తాజా తగ్గింపుతో దేశీయంగా ఆవాలు, సోయాబీన్, వేరుశనగల రేట్లు కూడా దిగిరానున్నాయి. వంట నూనెల ధరలు కిలోకు పామాయిల్ రూ.115, (పాత ధర142, 19 శాతం తగ్గింది) పొద్దుతిరుగుడు నూనె రూ. 157 (పాత ధర రూ .188, 16 శాతం తగ్గింది) సోయా నూనె రూ.138 ( పాత ధర రూ. 162 , 15 శాతం తగ్గింది) ఆవ నూనె రూ.157 (పాత ధర రూ. 175 , 10 శాతం తగ్గింపు) వేరుశనగ నూనె రూ. 174,(పాత ధరరూ.190, 8 శాతం తగ్గింపు) వనస్పతి రూ. 141 (పాత ధర 184, 8 శాతం తగ్గింపు) -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి,ముంబై: నాలుగు రోజుల విరామం తరువాత మళ్లీ పెట్రోలు ధరలు స్వల్పంగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 30) స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గిస్తూచమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. పెట్రోలుపై లీటరుకు 22 పైసలు , డీజిల్‌పై లీటరుకు 23 పైసలు చొప్పున తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు 90.56 రూపాయలుగా ఉంది. డీజిల్ లీటరుకు 80.87 రూపాయలకు చేరింది. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.98, డీజిల్ ధర 87.96 కోల్‌కతాలో పెట్రోల్ రూ. 90.77 డీజిల్ ధర రూ 83.75 (సోమవారం ధర కంటే 23 పైసలు) చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.58(19 పైసలు తగ్గింది) డీజిల్ ధర రూ. 85.88 22 పైసలు తగ్గింది హైదరాబాద్ పెట్రోలు ధర రూ. 94.16, డీజిల్ రూ. 88.20 అమరావతి పెట్రోలు ధర రూ. 96.77, డీజిల్ ధర రూ. 90.28 -
వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. మార్చి 25, గురువారం పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు రంగ సంస్థలు నిర్ణయించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న(మార్చి24, బుధవారం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కూడా ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు. 90.99 నుండి లీటరుకు. 90.78 కు చేరింది. డీజిల్ 20 పైసలు తగ్గి 81.30 నుండి. 81.10 స్థాయికి చేరింది. వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోలు ధర రూ. 97.19, డీజిల్ ధర 88.20 చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10 కోల్‌కతాలో పెట్రోల్ రూ.90.98, డీజిల్ రూ.83.98 బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.39 డీజిల్ రూ.88.45 అమరావతి పెట్రోల్ రూ.96.99, డీజిల్ రూ.90.52 -
వాహనదారులకు ఊరట : దిగొచ్చిన పెట్రోలు ధర
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి కాలం దాకా వాహనదారులకు చుక్కలు చూపించిన ఇంధన ధరలు దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పడిపోవడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ఊరటనిస్తున్నాయి. వరుసగా 24 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోలు ధర నేడు (మార్చి 24 బుధవారం) లీటరుకు18 పైసలు,డీజిల్‌పై 17 పైసలు చొప్పున తగ్గాయి. ఫిబ్రవరి 27 న పెట్రోలు ధర దేశ రాజధానిలో 91.17 వద్ద ఆల్ టైమ్ హైని తాకిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర.91.17 నుండి. 90.99 కు , డీజిల్ 17 పైసలు తగ్గి లీటరుకు. 81.47 నుండి. 81.30కు చేరింది. వివిధ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి ముంబైలో పెట్రోలు ధర రూ. 97.40 డీజిల్ ధర 88.42 చెన్నైలో పెట్రోలు ధర 92.95 డీజిల్ ధర86.29 కోల్‌కతాలో పెట్రోలు ధర 91.18 డీజిల్ ధర 84.18 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.61 , డీజిల్ ధర రూ.88.67 అమరావతిలో పెట్రోల్ ధర రూ.97.14 , డీజిల్ ధర రూ.90.67 కాగా ముడి చమురు ధరలు దాదాపు రెండు వారాల నుంచి సుమారు 10 శాతం తగ్గాయి. అయితే బుధవారం మాత్రం పైకి చూస్తున్నాయి. బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ 27 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగి, బ్యారెల్ 61.06 డాలర్లకు చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి ఫ్యూచర్స్ 19 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.95 డాలర్లకు చేరుకుంది. -
ముడి పామాయిల్ దిగుమతి సుంకం కోత
సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించేందుకు కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్ (సీపీఓ) దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ముడి పామాయిల్ దిగుమతిపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నును 37.5 శాతం నుంచి భారత్ 27.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌ను ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేసుకునేది భారత్. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుండి సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. -
రికార్డు కనిష్టానికి నేచురల్ గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సహజ వాయువు రేటును కేంద్ర ప్రభుత్వం 25 శాతం మేర తగ్గించింది. దీనితో యూనిట్ (ఎంబీటీయూ) రేటు ధర 1.79 డాలర్లకు దిగివచ్చింది. ఇది రికార్డు కనిష్ట స్థాయి. విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ మొదలైన వాటికి ఉపయోగించే గ్యాస్ రేటును అక్టోబర్ 1 నుంచి 1.79 డాలర్లకు తగ్గిస్తున్నట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) వెల్లడించింది. ఇప్పటిదాకా దీని రేటు 2.39 డాలర్లుగా ఉంది. ఏడాది కాలంలో గ్యాస్ రేటును తగ్గించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా 26 శాతం మేర కోత విధించడంతో ధర 2.39 డాలర్లకు తగ్గింది. మరోవైపు, సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును సైతం యూనిట్‌కు 5.61 డాలర్ల నుంచి 4.06 డాలర్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సహజ వాయువు ధరను ప్రతి ఆర్నెల్లకోసారి .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న ప్రభుత్వం సవరిస్తోంది. గ్యాస్ ఎగుమతి దేశాలైన అమెరికా, కెనడా, రష్యాల్లోని రేట్లను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. -
రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్ ధర!
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చాయి. లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మంగళవారం వెల్లడించాయి. ఈ తగ్గింపుతో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 84.75కు డీజిల్ ధర రూ. 79.08 గా ఉది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 22 పైసల మేరకు ధరలు తగ్గాయి. గత రెండు రోజులలో, పెట్రోల్ డీజిల్ ధర ఢిల్లీలో వరుసగా 31 పైసలు 37 పైసలు తగ్గింది. అమరావతిలో పెట్రోలు ధర రూ. 86.34 డీజిల్ ధర 80.27 రూపాయలు ఢిల్లీ పెట్రోల్ ధర లీటరు రూ .81.55, డీజిల్ లీటరు రూ .72.56 ముంబైలో పెట్రోల్ రూ. 88.21 డీజిల్ ధర 79.05 రూపాయలు చెన్నైలో పెట్రోల్ రూ. 84.57 డీజిల్ 77.91 రూపాయలు మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ క్షీణించడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3 సెంట్లు లేదా 0.1 శాతం తగ్గి 39.58 డాలర్ల వద్ద ఉంది. దీంతో దేశీయంగా పె ట్రోలు ధరలు మరింత దిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. (ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత) -
డబ్ల్యూహెచ్ఓతో అమెరికా కటీఫ్
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని ఆ సంస్థ తప్పుదోవ పట్టించిందనీ, వైరస్ విషయంలో చైనాను బాధ్యునిగా చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ‘కోవిడ్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని మేం చేసిన వినతిని డబ్ల్యూహెచ్ఓ పట్టించుకోలేదు. డబ్ల్యూహెచ్ఓకు అత్యధికంగా 45కోట్ల డాలర్ల నిధులు సమకూర్చుతుండగా చైనా 4కోట్ల డాలర్లిచ్చి పెత్తనంచేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ముందుగానే అప్రమత్తం చేసి ఉంటే, చైనా నుంచి ప్రయాణాలపై నిషేధం విధించి ఉండేవాడిని. చైనా ఒత్తిడి వల్లే అలా చేయలేదు. అందుకే ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుంటున్నాం’అని తెలిపారు. ‘కోవిడ్‌తో అమెరికాలో లక్ష ప్రాణాలు బలయ్యాయి. వైరస్ తీవ్రతను చైనా దాచిపెట్టడంతో అది ప్రపంచంలో లక్షలమరణాలకు కారణమైంది’అంటూ చైనాపై మండిపడ్డారు. కొందరు చైనా జాతీయుల ప్రవేశంపై నిషేధంతోపాటు చైనీయులు పెట్టుబడులపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. హాంకాంగ్‌పై పట్టు సాధించేందుకు ఇటీవల చైనా తీసుకువచ్చిన చట్టంపై ఆయన మండిపడ్డారు. దశాబ్దాలుగా ఏ దేశమూ చేయనంతగా అమెరికాను చైనా దోచుకుందని తీవ్రంగా ఆరోపించారు. చైనాతో సంబంధాల విషయంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర విచారం కలిగిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘కరోనా పుట్టుక విషయంలో దర్యాప్తునకు సహకరించాలని చైనాను కోరాం. కానీ, తిరస్కరించింది. తమ దేశంలో కోవిడ్‌ను కట్టడి చేసుకున్న చైనా.. ఇతర దేశాలకు పాకకుండా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రపంచమంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది’అని విమర్శించారు. -
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత
సాక్షి, న్యూఢిల్లీ : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రా (కెవీపీ) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి) లాంటి ఏడు ప్రజాదరణ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ పథకాలపై చెల్లించే వడ్డీరేను 70 నుంచి 140 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మధ్య, పేద తరగతి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకునే లక్షల మంది ప్రభావితం కానున్నారు. ఈ సవరించిన రేట్లు నేటి (ఏప్రిల్ 1 ) నుంచి అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2016 నుండి, అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ దిగుబడులతో అనుసంధానించిన నేపథ్యంలో ప్రతి త్రైమాసికంలో వడ్డీరేట్ల సమీక్ష వుంటుంది. పీపీఎఫ్ పథకంపై ప్రస్తుతం 7.9 శాతం వర్తిస్తుండగా, తాజా నిర్ణయం ప్రకారం ఇది 7.1 శాతానికి దిగి వచ్చింది. ఐదేళ్ల జాతీయ పొదుపు ధృవీకరణ (ఎన్ఎస్సి) పత్రంపై 7.9 శాతానికి బదులు ఇపుడు 6.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే కేవీపీ 6.9 శాతంగా వుంది. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. సుకన్య సమృద్ది ఖాతా లకు 8.4 శాతానికి బదులుగా 7.4 శాతంగా వుంటుంది. ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 7.6 శాతంగా వుంది. అంతకు ముందు ఇది8.శాతం. ఐదేళ్ల నెలవారీ ఆదాయ పథకం 6.6శాతం. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. అలాగే 1-5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లుపై వడ్డీ 5.5-6.7శాతం. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ముందస్తు పాలసీ సమీక్షలొ రెపో రేటు కోతకు మొగ్గు చూపిన అనంతరం, తాజాగా చిన్న పొదుపు పథకాల వడ్డీరేటుపై కోత పడింది. అయితే ఊహించిన దానికంటే ఈ తగ్గింపు ఎక్కువగా వుందని డిపాజిట్ రేట్లను మరింత తగ్గించడానికి ప్రభుత్వం ఇలా చేసి ఉండవచ్చని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పథకాల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రధానంగా ఆధారపడే వారు ఇప్పుడు వారి పోర్ట్‌ఫోలియోను తిరిగి సందర్శించాల్సి ఉంటుందని వైజెన్‌వెస్ట్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమంత్ రుస్తాగి తెలిపారు. తాజా నిర్ణయంతో సాంప్రదాయ పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.నేరుగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టాలని సూచించలేనప్పటికీ, మ్యూచువల్ ఫండ్లలో హైబ్రిడ్ ఫండ్స్ ను పరిశీలించాలని సూచించారు. కాగా కోవిడ్ -19 వ్యాప్తి, ఆర్థికవ్యవస్థపై ప్రభావం నేపథ్యంలో ఆర్బీఐ గత వారం రెపో రేటును 75 బీపీఎస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఫెడ్ నిర్ణయంతో భగ్గుమన్న బంగారం..
ముంబై : అంతర్జాతీయ మహమ్మారి కరోనా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న క్రమంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడం బంగారాన్ని పరుగులు పెట్టించింది. ఫెడ్ వడ్డీరేట్లలో కోత విధించడం పసిడికి కలిసివచ్చింది. ఎంసీఎక్స్‌లో సోమవారం ఉదయం పది గ్రాముల బంగారం ఏకంగా రూ 700 భారమై రూ 41,068కి పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం కూడా బంగారం మరింత ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ స్వర్ణం ధరలు పైపైకి ఎగబాకాయి. ఇక వెండి ధరలు సైతం బంగారం బాటలోనే భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ 338 పెరిగి రూ 40,825కు ఎగబాకింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో రానున్న రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : బిగ్ రిలీఫ్ : భారీగా తగ్గిన బంగారం -
ఆర్బీఐ రివ్యూ, ఎస్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజా మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం తన ఎంసీఎల్ఆర్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గింపును శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్ఆర్లో ఎస్బీఐ ప్రకటించిన వరుసగా తొమ్మిదవ కోత ఇది. ఈ తగ్గింపుతో, ఫండ్-బేస్డ్ రేట్ (ఎంసిఎల్ఆర్) ఒక సంవత్సరం ఉపాంత వ్యయం 7.90 శాతం నుండి సంవత్సరానికి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు ప్రకటన తెలిపింది. ఆర్బీఐ రెపో రేటును 5.15 శాతం, రివర్స్‌రెపోను 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే బ్యాంకుల రుణాల రేట్లను తగ్గించేందుకు వీలుగా రూ. లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్‌ను ప్రకటించడంతో ఈ ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మిగులు ద్రవ్యత దృష్ట్యా, టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత విధించింది. టర్మ్ డిపాజిట్ల రేట్లను రిటైల్ విభాగంలో 10-50 బీపీఎస్ పాయింట్లు, బల్క్ విభాగంలో 25-50 బిపిఎస్ తగ్గించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల కన్నా తక్కువ), బల్క్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ) పై సవరించిన వడ్డీ రేటున ఫిబ్రవరి 10నుంచి అమలవుతుందని తెలిపింది. చదవండి : రియల్టీకి భారీ రిలీఫ్: వడ్డీరేట్లు యథాతథం మారని రేట్లు.. వృద్ధికి చర్యలు -
లక్షల ఉద్యోగుల జీతం పెరగనుంది.. కానీ,
సాక్షి, న్యూఢిల్లీ : దేశ జీడీపీ పాతాళానికి పడిపోతున్న నేపథ్యంలోనరేంద్రమోదీ సర్కార్ కొత్త చర్యను చేపట్టబోతోంది. ముఖ్యంగా వినియోగ డిమాండ్ భారీగా క్షీణిస్తున్న తరుణంలో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం శాతాన్ని పెంచాలని యోచిస్తోంది. ఈ కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ద్వారా ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు పెరగనున్నాయి. అంటే ఉద్యోగి జీతంనుంచి కట్ అయ్యే పీఎఫ్ వాటాలో కోత పడనుంది. ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే సామాజిక భద్రత కోడ్ బిల్లు 2019 లో మారనున్న నిబంధనల ప్రకారం, పీఎఫ్‌లో ఉద్యోగి వాటా ప్రస్తుత 12 శాతానికి కంటే తక్కువగా ఉండనుంది. అయితే యజమాని భాగంలో మాత్రం ఎలాంటి మార్పు చేయడంలేదు. ఎంపిక చేసిన రంగాల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ కటింగ్స్లో చట్టబద్ధమైన తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని చూస్తోంది. తద్వారా వ్యవస్థీకృత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగుల టేక్ హోమ్ జీతం స్వల్పంగా పెరగనుంది. ప్రస్తుత నిబంధనల మేరకు ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం, సంస్థ నుంచి 12 శాతం పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. కొత్తగా రానున్న నిబంధనల ప్రకారం ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్లోకి జమ అయ్యే మొత్తాన్ని తగ్గించనుంది. ఇదే కాకుండా ఈఫీఎఫ్ఓలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. కనీస వేతన నిబంధనలతో పాటు ఉద్యోగి పెన్షన్ విధానంలో కూడా మార్పులు చేయనుంది. గత ఐదేళ్లుగా ఈ ప్రతిపాదనులు ఉన్నాయి. ఈక్రమంలోనే ఈపీఎఫ్ సవరణ బిల్లు 2019 డ్రాఫ్ట్‌ను కేంద్ర కార్మిక శాఖ రూపొందించిన సంగతి తెలిసిందే. మరోవైపు దీర్ఘకాలంలో ఈ చర్య దుష్ప్రభావం చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కార్మికుల పదవీ విరమణ తరువాత అందుకునే నగదు భారీగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. -
లాభాల మెరుపులు : ఆటో కంపెనీలకు ఊరట
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రినిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ పన్ను కోత స్టాక్‌మార్కెట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను భారీగా ప్రభావితం చేసింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు లాభాలను నమోదు చేసేంత. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ వారంతాంలో ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగిసి స్థిరంగా ముగిసాయి. బెంచ్ మార్క్ సూచీలు శుక్రవారం 6 శాతానికి పైగా పెరిగాయి. సెన్సెక్స్ 38,350 మార్కుకు చేరగా, నిఫ్టీ 11,370 స్థాయిని టచ్ చేసింది. కేవలం ఐటీ, జీ ఎంటర్టైన్ మెంట్ తప్ప అన్నీ లాభాల్లోనే ముగిసాయి. ప్రధానంగా ఆటో కంపెనీలకు ఆర్థికమంత్రి ప్రకటన ఊరట నిచ్చింది. ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్‌బ విన్నర్స్‌గా ఉన్నాయి. 'ఎ కేటగిరీ' గ్రూపులోని 10 శాతానికిపైగా ఎగిసిన వాటిల్లో షేర్లలో ఐషర్ మోటార్స్ (16 శాతం), హీరో మోటో కార్ప్ 13 శాతం , జామ్నా ఆటో (11శాతం), అశోక్ లేలాండ్ (11 శాతం), మారుతి సుజుకి (11 శాతం) ఉన్నాయి. మారుతి సుజుకి షేర్ ధర అంతకుముందు రూ .5,938.30 తో పోలిస్తే 11శాతం పెరిగి రూ .6,626 కు చేరుకుంది. ఈ స్టాక్ 6,001 నుంచి ఇంట్రాడేలో 6,640 స్థాయికి చేరుకుంది. గత ఏడేళ్లలో లేని లాభాలతో మారుతి మార్కెట్ క్యాపిటలైజేషన్ బిఎస్ఇలో రూ .1.99 లక్షల కోట్లకు పెరిగింది.ప్రభుత్వం అకస్మాత్తుగా ఉత్పత్తి రంగా మీద , పెట్టుబుడల ప్రాముఖ్యతపై దృష్టిపెట్టిందని, ఇది చాలా వినూత్నమైన, ముఖ్యమైన నిర్ణయమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ పేర్కొనడం విశేషం. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్(విలువ)కు రూ. 7 లక్షల కోట్లకు చేరగా, వెరసి మార్కెట్ విలువ రూ. 1.45 ట్రిలియన్లను దాటేసింది. -
కార్పొరేట్ పన్నుకోత : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్నురేటు తగ్గింపు నిర్ణయంపై స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్నినింపింది. ఏకంగా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 2250 పాయింట్లు ఎగిసింది. అటు దేశీయ వ్యాపార దిగ్గజాలు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది చాలా ఉన్నతమైన చర్య అని అభివర్ణించారు. పన్ను తగ్గింపు వల్ల ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ముఖ్యంగా వృద్ధి చర్యలు లోపించాయని ట్విటర్లో బహిరంగంగా విమర్శించిన బయోకాన్ ఎండీ, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఆర్థికమంత్రి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ఆర్థిక వృద్ధితోపాటు పెట్టుబడులను పునరుద్ధరిస్తుందన్నారు. ఇది గొప్ప చర్య. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆమెకు నా హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు. కార్పొరేట్ పన్ను రేటును 25 శాతానికి తగ్గించే నిర్ణయం ధైర్యమైన, ప్రగతిశీల అడుగు. ఇదో బిగ్ బ్యాంగ్ సంస్కరణ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి భారతీయ కంపెనీలకు ఊతమిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతానిస్తోందన్నారు. పిరమల్ ఎంటర్ప్రైజ్ చైర్మన్ అజయ్ పిరమల్ మాట్లాడుతూ దీనికోసమే తామంతా ఎదురుచూస్తున్నామన్నారు. ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసినందుకు ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి అభినందనలు తెలిపారు. ఇది ఉత్పాదక రంగానికి పునరుజ్జీవనమిచ్చే నిర్ణయమని ఫిక్కీ చైర్మన్ సందీప్ సోమనీ తెలిపారు. ఈ ప్రకటన కార్పొరేట్ భారతానికి మంచి ఊతం, ముఖ్యంగా కష్టతరమైన దశలో ఉన్న ఉత్పాదక రంగాన్ని కొత్త శక్తి వస్తుందన్నారు. కార్పొరేట్లపై ఆదాయపు పన్నును తగ్గించాలని తాము చాలాకాలంగా అభ్యర్థిస్తున్నామని గుర్తు చేశారు. కేపీఎంజీ కొర్పొరేట్ హెడ్ హితేష్ డి గజారియా స్పందిస్తూ ఇది చాలా సానుకూల దశ, మరిన్ని ఉద్యోగావకాశాలు లభించనున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్థికమంత్రి ఎట్టకేలకు బలమైన చర్యలు తీసుకున్నారని రెలిగేర్ బ్రోకింగ్‌లోని విపి రీసెర్చ్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత కొన్ని త్రైమాసికాలలో కార్పొరేట్ ఆదాయాలు దిగజారిపోయాయి, ప్రధానంగా కొనసాగుతున్న మందగమనం కారణంగా కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు అంటే కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకమే. మరోవైపు కార్పొరేట్ పన్నుకోత నిర్ణయంపై కాంగ్రెస్ తప్పుబడుతోంది. ఇది హౌడీమోదీ ఈవెంట్ కోసం తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ విమర్శించారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందే అయినప్పటికీ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న కునారిల్లుతున్న ఆర్థికవ్యవస్థను రానున్న పెట్టుబడులు పునరుద్ధరాస్తాయా అనేది సందేహమేనని ఆయన ట్వీట్ చేశారు. అటు ఆర్థికమంత్రి ఇంటిముందు కాంగ్రెస్శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. Timing of FM announcement dictated by #HowdyModi event. PM can now say, "I have come to Texas promising lower Taxes". Is this his 'trump card'? — Jairam Ramesh (@Jairam_Ramesh) September 20, 2019 దేశీయ సంస్థలకు, కొత్త దేశీయ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తామని, కొత్త తయారీ సంస్థలకు ప్రస్తుతం ఉన్న రేట్లు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పండుగ సీజన్ : రుణాలపై గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి వినియోగదారులకు ఊరటనిచ్చింది. గృహ, వాహన రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 10 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు రేపటి (సెప్టెంబరు 10) నుంచి అమల్లోకి రానున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎస్బిఐ నుండి ఎంసిఎల్ఆర్ కోత పెట్టడం వరుసగా ఇది మూడవసారి. దీంతో ఒక ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 20-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అన్ని బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటులో 10-20 శాతం కోత పెట్టింది. గృహ రుణాలు , ఆటో రుణాల వాటా వరుసగా 35, 36 శాతంగా ఉందని ఎస్బీఐ తెలిపింది. -
మారుతి సుజుకి వరుసగా ఏడోసారి ఉత్పత్తి కోత
సాక్షి, ముంబై : డిమాండ్ క్షీణించి , అమ్మకాలు లేక విలవిల్లాడుతున్న దేశీయ అతిపెద్ద కార్ల తయారీ మారుతి సుజుకి ఇండియాకు వరుస షాక్‌లు తప్పడం లేదు. తీవ్ర మందగమనంలో ఉన్న మారుతి సుజుకి వరుసగా 7వ నెలలో కూడా ఉత్పత్తిని నిలిపివేసినట్టు ప్రకటించింది. ఆగస్టులో మాసంలో ఉత్పత్తిని 33.99 శాతం తగ్గించగా, గత నెలలో మొత్తం అమ్మకాలు 33 శాతం క్షీణించాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులోని 1,58,189 యూనిట్లతో పోలిస్తే 1,06,413 యూనిట్ల విక్రయాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపింది. ఆగస్టులో కంపెనీ మొత్తం 1,11,370 యూనిట్లను ఉత్పత్తి చేయగా, అంతకుముందు నెలలో 1,68,725 యూనిట్లు ఉత్పత్తి చేశామని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) సెప్టెంబర్ 2 న బీఎస్సీ ఫైలింగ్‌లో తెలిపింది. గత నెలలో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 1,10,214 యూనిట్లు కాగా, 2018 ఆగస్టులో 1,66,161 యూనిట్లగా ఉంది. అంటే 33.67 శాతం క్షీణత. ఆల్టో, న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్లతో సహా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్ల ఉత్పత్తి 80,909 యూనిట్లు కాగా, గత ఏడాది ఆగస్టులో 1,22,824 యూనిట్లు మాత్రమే. 34.1 శాతం తగ్గింది. విటారా బ్రెజ్జా, ఎర్టిగా, లాంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 34.85 శాతం క్షీణించి 15,099 యూనిట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది 23,176 యూనిట్లు. మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ ఉత్పత్తి ఆగస్టులో 2,285 యూనిట్లకు తగ్గింది, గత ఏడాది ఇదే నెలలో 6,149 యూనిట్లు. -
రుణాలపై ఎస్బీఐ శుభవార్త
సాక్షి, ముంబై : రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ దీనికనుగుణంగా స్పందించింది. అన్ని రకాల రుణాలపై 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఆగస్టు 10నుంచి అమల్లోకి వస్తాయని బుధవారం తెలిపింది. దీంతో ఒక సంవత్సర కాలపరిమితి కల రుణంపై బ్యాంకు వసూలు చేసే వడ్డీరేటు 8.40 శాతంనుంచి 8.25 శాతానికి దిగి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ కూడా వరుసగా నాలుగో సారి ఎంసీఎల్ఆర్ను కోత పెట్టినట్టయింది. కాగా రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షలో ఎనలిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువగా రెపో రేటుపై అనూహ్యంగా కోత విధించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలను చేపట్టిన తరువాత వరుసగా నాలుగోసారి రెపో రేటును తగ్గించడమే కాకుండా, తొలిసారిగా 35 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. అంతేకాదు తాజా తగ్గింపుతో ఆర్బీఐ రెపో రేటు తొమ్మిదేళ్ల కనిష్టానికి చేరింది. -
ఫిక్స్డ్ డిపాజిట్లు : ఎస్బీఐ బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంకు ఆఫ్ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు షాకిచ్చింది. వివిధ ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటును తగ్గించింది. 45 రోజుల -10 ఏళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను భారీగా కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. దాదాపు అన్ని కాలపరిమితి గత ఫిక్స్డ్ డిపాజిట్లపై రేటును తగ్గించింది. 2-3 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. 3-5 ఏళ్ల డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్లను తగ్గింపు అనంతరం వడ్డీరేటు 6.60 శాతంగా ఉంది. 7 రోజుల నుండి 45 రోజుల డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. 46-179 రోజుల ఎఫ్‌డిలపై వడ్డీ రేటు మే 6.25 శాతం నుండి 5.75 శాతానికి తగ్గించింది. 180-210 కాలపరిమితిగల డిపాజిట్లపై వడ్డీరేటు 6.25గా ఉంటుంది. 2 కోట్ల రూపాయలకు మించిన బల్క్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును తగ్గించింది. రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో చేపట్టనున్న పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీరేటు కోతకు కేంద్ర బ్యాంకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తాజాగా ఇలాంటి సంకేతాలను అందించారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్బీఐ మరో సారి వడ్డీ రేట్ల తగ్గింపు అవసరమని భావిస్తున్నానని ఆమె పేర్కొనడం గమనార్హం. -
ఓటేస్తానంటనే పింఛన్!
ఓటమి భయంతో టీడీపీ నేతలు దౌర్జన్య ప్రచారానికి దిగజారారు. ఇప్పటికే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రభుత్వం పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అంతకు ముందు నెల వరకు వెయ్యి రూపాయలే ఇస్తున్న పింఛన్‌ను రెండు వేలకు పెంచిన ప్రభుత్వం తాజాగా ఎన్నికల తేదీ దగ్గర పడే సమయంలో పింఛనర్లను భయభ్రాంతులకు గురి చేసింది. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామంటేనే పింఛన్ ఇస్తామంటూ బెదిరింపులకు దిగారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు చేరి వారి సమక్షంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజకీయ పార్టీల నేతలను దూరంగా ఉంచాల్సిన పంచాయతీ కార్యదర్శులు మౌన పాత్ర వహించారు. కొన్ని చోట్ల టీడీపీ నేతలే స్వయంగా పింఛన్లు పంపిణీ చేయడం కూడా కనిపించింది. పింఛన్ తీసుకునేందుకు ప్రతి లబ్ధిదారులతో ప్రమాణాలు చేయించిన ఘటనలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. నెల్లూరు(పొగతోట): ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో అధికార పార్టీ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 46 మండల్లాలోని 940 పంచాయతీలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో 261 డివిజన్లు, వార్డుల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్థానికంగా రాజకీయ పెత్తనం చేస్తున్న టీడీపీ నేతలు, మాజీ సర్పంచ్‌లు, జన్మభూమి సభ్యులు పింఛన్ల పంపిణీ కేంద్రాల్లో చేరి, లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సమయంలో ఇంకో పది రోజుల్లో జరిగే ఎన్నికల్లో మీకు రూ.2 వేల పింఛన్ ఇస్తున్న చంద్రబాబు టీడీపీకి ఓటు వేయ్యాలని పింఛన్ల లబ్ధిదారులపై ఒత్తిడి చేశారు. ఎవరు ఓటు వేయలేదో మాకు తెలిసిపోతుందని బెదిరింపులకు పాల్పడ్డారు. మాకు ఇష్టమొచ్చిన పార్టీకే ఓటేస్తామన్న కొందరు లబ్ధిదారులపై టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లు తీసుకుని ఎందుకు ఓటేయ్యరంటూ దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పింఛన్ల పంపిణీని పంచాయతీ కార్యదర్శులే చేపట్టాల్సి ఉండగా అందుకు భిన్నంగా టీడీపీ నేతలు పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పంచాయతీ కార్యదర్శులు సైతం వీరి దౌర్జన్యకర ప్రచారాన్ని కూడా అడ్డుకోకుండా టీడీపీ నేతలు చెప్పినట్లు ఓటేస్తేనే మీకు మళ్లీ పింఛన్లు ఇస్తారంటూ బెదిరించారని లబ్ధిదారులు బయటకు వాపోయారు. 3.15 లక్షల పింఛన్లు జిల్లాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతకా ర్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు తదితర పింఛన్లు 3.15 లక్షలు ఉన్నాయి. సోమవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల ముందు వరకు పింఛన్లు 5వ తేదీపై నుంచి పంపిణీ చేసేవారు. ఎన్నికలు రావడంతో పింఛనర్లను ప్రలోభ పెట్టేందుకు 1వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో టీడీపీ నేతలు పింఛన్ తీసుకున్న లబ్ధిదారులకు టీడీపీ కరపత్రం ఇచ్చి చంద్రబాబునాయుడు పింఛన్లు రెండు వేలు చేశాడు. ఓటర్ల జాబితా చూడడం మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి తప్పకుండా చంద్రబాబుకే వేయాలని హుకుం జారీ చేశారు. కావలి, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో లభ్ధిదారులను అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేశారు. టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. ఐదేళ్లుగా వెయ్యి రూపాయలే.. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా పింఛన్‌ను రూ.75లే ఇచ్చేది. అదీ ప్రతి ఆరు నెలలకొకసారి, పరిమిత సంఖ్యలో ఇస్తుండేది. వీరి కష్టాలు గుర్తించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాగానే పింఛన్ ఏకంగా రూ.200లకు పెంచారు. ప్రతి నెలా 1వ తేదీ లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చే విధంగా అమలు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఇతర సీఎంలు కొనసాగించారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే వృద్ధులు, వింతవులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తానని ప్రకటించారు. ఇదే హామీని కాపీ కొట్టిన చంద్రబాబు తాను అంతే మొత్తంలో ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించారు. రాష్ట్రంలో పరిస్థితులను గమనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హత కలిగిన ప్రతి పేదకు రూ.2 వేలు పింఛన్ ఇస్తానని 2017 జూలై 8న జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో ప్రకటించారు. అయితే వెయ్యి రూపాయలే ఇస్తూ వచ్చిన చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడడంతో వైఎస్ జగన్ హామీతో ఓటర్లు మారిపోతారని మరో సారి జగన్ హామీని కాపీ కొట్టి జనవరిలో పేదల పింఛన్ మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతున్న ప్రకటించారు. రెండు నెలలుగా పెంచిన రూ.2 వేల పింఛన్ ఇస్తూ ఎప్పటి నుంచో ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ లబ్ధిదారులను ఉద్దరించినట్లు ప్రచారం చేసుకోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే రూ.3 వేలు ఇస్తారులే చెబుతుండడంతో టీడీపీ వారిని బెదిరించినట్లు తెలిసింది. -
రేషన్ కోట.. సరుకుల కోత
కెరమెరి: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం ప్రస్తుతం కనుమరుగైంది. రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు 9 రకాల సరుకులను అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కొంత కాలం పాటు సజావుగా సాగిన సరుకుల పంపిణీ ప్రత్యేక రాష్ట్రం తర్వాత ఆగిపోయింది. అప్పుడు పంపిణీ చేసిన 9 రకాల సరుకుల్లో ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా అవుతున్నాయి. మూడు మాసాల క్రితం వరకు ఇచ్చిన పంచదార కూడా నిలిచి పోవడంతో ప్రధానంగా రేషన్ దుకాణాలు బియ్యానికే పరిమితమయ్యాయి. వాస్తవ పరిస్థితి ఇలా.. మండలంలోని 16 చౌరధరల దుకాణాల్లో నాలేగళ్ల క్రితం వరకు రేషన్ దుకాణాల్లో అన్ని రకాల సరుకులు దొరిగేవి. పేదలకు 9 రకాల సరుకులు ఇచ్చేవారు. తెలంగాణేర్పడిన తర్వాత బియ్యం. కిరొసోన్ తప్ప మరే ఇతర నిత్యావసర వస్తువులు అందడం లేదు.మండలంలో 16 చౌకధరల దుకాణాలున్నాయి. 8,446 రేషన్ కార్డులుండగా.. 194.568 క్వింటాళ్ల బియ్యంతో పంపిణీ అవుతుంది. కాగా 8,446 లీటర్ల కిరోసిన్ అందజేస్తున్నారు. వీరంతా పేదలు. ప్రభుత్వం కల్పించే నిత్యావసర సరుకులపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో బియ్యం, గోధుములు, చక్కెర, కందిపప్పు, ఉప్పు, మంచినూనె, కారంపొడి, పసుపు, చింతపండు, ఉప్పు, తదితర నిత్యావసర వస్తువులు ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం. లీటరు కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు. పోరాగి సిద్ధించుకున్న తెలంగాణలో పూర్తి స్థాయి సరుకులు ఎందుకు సరఫరా చేయడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం కూడా నాణ్యతగా లేవని మహిళలు అంటున్నారు. కాగా ఒక బియ్యం బస్తాలో 3 నుంచి 4 కిలోల వరకు కోత వస్తుందని పలువురి ద్వారా తెలిసింది. లబ్ధిదారుల ఆందోళన అయితే ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఉన్న వారికి రేషన్ సరుకులు నిలిపి వేయనున్నట్లు ప్రకటించడంతో అనేక మందిలో ఆందోళన మొదలైంది. మండలంలో వివిధ గ్రామాల్లో అనేక మందికి 10 ఎకరాలు పైగానే సాగు భూముల పట్టాల ఉన్నాయని, అయినా వారందరు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న ప్రకారంగానే 10 ఏకరాలు ఉన్నవారికి రేషన్ సరుకులు నిలిపి వేస్తే సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు చెందిన రేషన్ సరుకులు అందకుండా పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చేది బియ్యం, కిరోసిన్ అదికూడా నిలిపి వేస్తే ఏం తిని బతకాలని వారు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. రేషన్ బియ్యం జోకుతున్న డీలర్ , కిరోసిన్ పోస్తున్న సిబ్బంది -
వంట గ్యాస్ ధర తగ్గింది
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ఊరటనిచ్చాయి. దేశీయంగా వంట గ్యాస్ ధర తగ్గింది. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 1.46 రూపాయల మేర తగ్గింది. దీని ప్రకారం సబ్సిడీ సిలిండర్ ధర రూ. 493.53లుగా ఉంది. సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.30 తగ్గింది. దీంతో దీని రూ.659గా ఉండనుంది. గురువారం అర్థరాత్రి నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం వరుసగా ఇది మూడవ సారి. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31న వంటగ్యాస్ సిలిండర్ పై రూ.5లను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ లేని సిలిండర్ రూ.120లను తగ్గించింది. అంతకుముందు ఇదే నెలలో (డిసెంబర్ 1న) సబ్సిడీ సిలిండర్ ధర రూ.6.52 పైసలు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, డాలరు మారకంలో రూపాయి విలువ బలపడడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. -
తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై: వరుసగా చమురు ధరలు దిగి రావడంతో దేశీయంతో పెట్రోలు ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం నాటి ఇంధన ధరలను ఒకసారి పరిశీలిద్దాం. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు 25-30పైసలు దిగి వచ్చాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతాతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లోని ధరలను చూద్దాం. ఢిల్లీ : పెట్రోలు ధర రూ.70.77 డీజిల్ రూ. 65.30 ముంబై: పెట్రోలు ధర రూ.76.28 డీజిల్ రూ. 68.32 చెన్నై: పెట్రోలు ధర రూ.73.33.డీజిల్ రూ. 68.93 కోలకతా: పెట్రోలు ధర రూ.72.75 డీజిల్ రూ. 67.03 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.74.95 డీజిల్ రూ.70.94 విజయవాడ : పెట్రోలు రూ.74.38 డీజిల్ రూ. 70.02 -
ఆరోగ్య రక్షకు కత్తెర..!
-
ఆ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధర రూ.1 తగ్గింపు
సాక్షి, తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. ఇంధన ధరలకు చెక్ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనంపై రీటైల్ వాట్‌ను తగ్గించనుంది. దీంతో ఇటీవల అడ్డూ అదుపులేకుండా పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డుకట్ట వేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా మాత్రం పెట్రో ధరల వాత తప్పడంలేదు. ఈ నేపథ్యంలో వామపక్ష పాలక రాష్ట్రం కేరళలో పెట్రోల్, డీజిల్ ధరల స్వల్పంగా నైనా శాంతించనుండటం విశేషం. జూన్ 1వ తేదీ శుక్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ లీటర్ ధరపై ఒక రూపాయి తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. పెట్రోల్‌పై పన్నుపై కోత పెట్టడం ద్వారా వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేరళ క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ .2 రూపాయల మేర ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించగా, నాలుగు రాష్ట్రాలు కేవలం వాట్ కట్‌ను ప్రకటించాయి. కాగా గత 16 రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే గ్లోబల్‌గా చమురు ధరలు శాంతించడంతో దేశీయంగా బుదవారం 1 పైసా ధర తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ భగ్గుమన్న ధరలను భరిస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా మండిపడ్డారు. చమురు ధరలు చల్లబడిన తరువాత కూడా లీటరుకు కేవలం ఒక పైసా తగ్గింపుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. -
10,122 ఇంజనీరింగ్ సీట్ల కోత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో 10,122 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కోత పెట్టింది. 14 కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం ఇవ్వలేదు. ఇందులో కొన్ని స్వచ్ఛందంగా మూసివేత కోసం దరఖాస్తు చేసుకోగా, మరికొన్నింటికి ఏఐసీటీఈ అనుమతి నిరాకరించినట్టు తెలిసింది. గతేడాది రాష్ట్రంలోని 242 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,24,239 సీట్లకు అనుమతి ఇచ్చిన ఏఐసీటీఈ.. ఈసారి 228 కాలేజీల్లోని 1,14,117 సీట్లకే అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చిన కాలేజీలు, సీట్ల వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు పంపించింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో కాలేజీల మూత రాష్ట్రంలో పాత రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 14 కాలేజీలు మూతపడ్డాయి. గతేడాది ఈ కాలేజీలు కొనసాగినా.. ఈసారి అనుమతులు రాలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది 26 ఇంజనీరింగ్ కాలేజీలుంటే ఈసారి 21 కాలేజీలకే అనుమతులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో కాలేజీల సంఖ్య 119 నుంచి 113కు, ఖమ్మం జిల్లాలో 18 నుంచి 15 కాలేజీలకు పరిమితమయ్యాయి. మిగతా జిల్లాల్లో అన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినా సీట్ల సంఖ్యలో మాత్రం కోత పడింది. జేఎన్టీయూ ‘గుర్తింపు’లో మరింత కోత! ఇంజనీరింగ్ కాలేజీల్లో పది వేల సీట్లకు ఏఐసీటీఈ కోత విధించగా... రాష్ట్రంలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన జేఎన్టీయూ చర్యలతో మరిన్ని సీట్లు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల పరిధిలో 1.24 లక్షల సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతించినా... జేఎన్టీయూ సహా రాష్ట్ర వర్సిటీలు 97,961 సీట్ల భర్తీకే అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. అయితే కాలేజీల్లో వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలకు గుర్తింపు రద్దు చేస్తామని జేఎన్టీయూ ఇటీవల ప్రకటించింది. దీంతో మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జేఎన్టీయూ ఇప్పటికే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ)’ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలు చేపట్టి.. నివేదికలను క్రోడీకరించింది. అందులో ఏయే కాలేజీల్లోని, ఏయే బ్రాంచీల్లో 25 శాతంలోపు సీట్లు భర్తీ అయ్యాయని పరిశీలిస్తోంది. అలా గుర్తించిన బ్రాంచీలను రద్దు చేయనుంది. మొత్తంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఈనెల 15వ తేదీలోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించనుంది. పాలిటెక్నిక్‌లో 4వేల సీట్ల తగ్గింపు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ నాలుగు వేల సీట్లకు ఏఐసీటీఈ కోత విధించింది. పలు కాలేజీలకు అనుమతులు కూడా రద్దు చేసింది. గతేడాది రాష్ట్రంలో 201 కాలేజీల్లో 51,625 సీట్లు అందుబాటులో ఉండగా... ఈసారి 187 కాలేజీల్లో 47,264 సీట్లకు అనుమతులు వచ్చాయి. డి.ఫార్మసీలో మాత్రం గతేడాది అనుమతించిన 15 కాలేజీల్లోని 830 సీట్లకు ఈసారి కూడా పూర్తిగా అనుమతి ఇచ్చింది. -
తగ్గిన వంటగ్యాస్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అటు పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టాన్ని తాకితే ఇటు వంట గ్యాస్ ధరలు దిగి వచ్చాయి. సబ్సిడీ ఎల్పీజీ (ద్రవీకృత పెట్రోలియం వాయువు), నాన్ సబ్సిడీ వంటగ్యాస్ ధరలు తగ్గాయి. సబ్సిడీ సిలిండర్ రూ. 1.77 తగ్గగా, సబ్సిడీ లేని సిలిండర్ ధర (14.2 కిలోల) రూ.35.36 లు తగ్గింది. అన్ని మెట్రో నగరాల్లో ఏప్రిల్ 1 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సిలిండర్ ధరలను తగ్గించడం ఇది నాలుగవ సారి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం వంటగ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీ- రూ.653.5 కోలకతా - రూ.676 ముంబై - రూ.625 చెన్నై- రూ. 663.5 హైదరాబాద్ - 705.00 సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీ - రూ. 491.35 కోలకతా - రూ. 494.33 ముంబై - రూ. 489.04 చెన్నై- 479.44 హైదరాబాద్ - 489.50 మరోవైపు ప్రభుత్వ రంగ ఇంద్రప్రస్థ గ్యాస్ ఢిల్లీలో సిఎన్జీ పీఎన్జీ (పైప్డ్ సహజ వాయువు) ధరలను పెంచేసింది. ఏప్రిల్ 2 నుంచి సీఎన్జీ కిలోకు 90 పైసలు, స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సిఎం) కు 1.15 రూపాయలు పెంచింది. -
పాతకక్షలతో మర్మాంగాన్ని కోశాడు
నంగునూరు(సిద్దిపేట): పాత కక్షలతో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి మర్మాంగాన్ని కోసిన ఘటన నంగునూరు పరిధిలోని రాంచంద్రాపూర్‌లో జరిగింది. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం..రామచంద్రాపూర్‌కు చెందిన మతిస్థిమితం సరిగా లేని పందిల్ల రవీందర్‌రెడ్డిని అదే గ్రామానికి చెందిన నారాయణరెడ్డి మూడు రోజుల కిందట ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి పురుషాంగాన్ని కత్తితో కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు రవీందర్‌రెడ్డిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మొదట పరిహారం ఇస్తానని చెప్పిన నారాయణరెడ్డి తరువాత మాటమార్చడంతో శనివారం బాధితుడి బంధువు నాయిని రాజిరెడ్డి రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
ప్రమాదంలో కాళ్లు తెగిపడి...
నెలమంగల (దొడ్డబళ్లాపురం): రోడ్డు ప్రమాదంలో కాళ్లు తెగిపడి ఇద్దరు యువకులు నడిరోడ్డు మీదే నరకయాతన పడిన సంఘటన నెలమంగల సమీపంలోని మాదావర వద్ద చోటుచేసుకుంది. వసంత్ (28), రాహుల్ (24) మాదావర వద్ద బైక్‌పై వెళ్తుండగా వెనుకగా వచ్చిన క్యాంటర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో క్యాంటర్ చక్రాల కింద చిక్కుకున్న ఇద్దరి కాళ్లూ దాదాపు తెగిపోయాయి. జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న కారణంగా అంబులెన్స్ రావడం ఆలస్యమైంది. దీంతో స్థానికులు ఇద్దరినీ నవయుగ టోల్‌కు చెంందిన వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు క్యాంటర్ డ్రైవర్‌ను వాహనంతో సహా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. -
ఆ కంపెనీలో 12వేల ఉద్యోగాలు కట్
జనరల్ ఎలక్ట్రిటీ (జీఈ) కంపెనీ భారీగా ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా జీఈ పవర్ విభాగంలో వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు పథకాలు రచించింది. అమెరికా బయట సుమారు 12వేలమంది ఉద్వాసన పలకనుంది. గ్యాస్, పవర్ , కోల్ మార్కెట్ నష్టాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అతి పెద్ద గ్యాస్ టర్బైన్లు ఉత్పత్తిదారుగా ఉన్న జీఈ పవర్ గ్యాస్-టర్బైన్ తయారీదారు పునరుత్పాదక లాభాల క్షీణత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పవర్బిజినెస్లో 12వేల ఉద్యోగాలను కట్ చేయాలని ప్రణాళిక వేసింది. ఈ క్రమంలో జీఈ పవర్ కార్పోరేషనులో 18 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించనున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ అండ్ ప్రొడక్ట్ రెండింటిలోనూ ఈ కోత ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కంపెనీ కొత్త సీఈవోగా ఎన్నికైన జాన్ ఫ్లాన్నెరీ సంస్థ ఖర్చులను తగ్గించడంతోపాటు, కష్టాల్లో ఉన్నసంస్థను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం బాధాకరమైనది. కానీ అవసరమైనదని డివిజన్ చీఫ్ రస్సెల్ స్టోక్స్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో సవాళ్లు కొనసాగినప్పటికీ 2018 లో జీఈ పవర్ పురోగతిని సాధిస్తుందని తాము భావిస్తున్నామన్నారు. మరోవైపు ఇప్పటికే కార్పొరేట్ జెట్లను ఉపయోగించడాన్ని కంపెనీ సీఈవో వదులుకున్నారు. అలాగే త్రైమాసిక డివిడెండ్ చెల్లింపును ఆలస్యం చేయడంతోపాటు కొన్ని వ్యాపారాలను విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా వచ్చే ఏడాది పవర్ డివిజన్లో నిర్మాణాత్మక ఖర్చులు 1 బిలియన్ డాలర్లు తగ్గుతుందని ఆశిస్తోంది. మొత్తంగా 2018 నాటికి సంస్థ అంతటా 3.5 బిలియన్ల డాలర్ల ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వార్తలతో న్యూయార్క్ రెగ్యులర్ ట్రేడింగ్‌లో బుధవారం దాదాపు ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. -
గుజరాత్ ఎన్నికలకు కేంద్రం కీలక నిర్ణయం
-
జీఎస్టీ రేట్ కట్: చౌకగా 177 వస్తువులు
సాక్షి, గౌహతి: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో అసోంలో జరిగిన జీఎస్టీ 23వ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ రేట్ల స్లాబ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. గౌహతిలో శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో నిత్యావసరమైన పలు వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. ఇప్పటి వరకు 227 వస్తువులపై 28శాతం పన్ను రేటు వుండగా ప్రస్తుతం కేవలం 50 వస్తువులపై మాత్రమే 28శాతం పన్ను నిర్ణయించినట్టు బిహార్ ఆర్థికమంత్రి సుశీల్ మోడీ ప్రకటించారు. పొగాకు, లగ్జరీ వస్తువలపై మాత్రమే అధిక రేట్లను నిర్ణయించామని చెప్పారు. చూయింగ్ గమ్స్, చాకోలెట్స్, ఆఫ్టర్ షేవ్, వాషింగ్ పౌడర్ తదితర వస్తువులపై జీఎస్టీని 18 శాతంగా నిర్ణయించింది. టెక్నాలజీ సంబంధిత అంశంపై వడ్డీరేటును నిర్ణయించేందుకు ఐదుగురు సభ్యుల మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మోడీ అత్యధిక పన్నుల స్లాబ్ 28శాతం కేటగిరీ లో 177 వస్తువుల ధరలను తగ్గించేందుకు కౌన్సిల్ అంగీకరించినట్టు తెలిపారు. నాన్ ఎసీ రెస్టారెంట్లపై 18శాతం నుంచి జీఎస్టీ పన్నులను 12శాతానికి తగ్గించింది. వ్యాపారులు, తయారీదారులు & వినియోగదారులకు అనుకూలంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 వస్తువులపై పన్ను రేటును 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకున్నామన్నారు. -
షాకింగ్: నోట్ల ముద్రణను తగ్గిస్తున్న ఆర్బీఐ?
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాగా తగ్గించిందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్లను ముద్రించడం కోసం ఆర్డరును తగ్గించింది. ముఖ్యంగా కేంద్ర బ్యాంకు సహా ఇతర వాణిజ్య బ్యాంకుల్లో కరెన్సీ ఖజానా గది పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డీమానిటైజ్ చేసిన పాత రూ.500, రూ.1000నోట్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో ...కొత్త కరెన్సీ ఖజానా గదులు ఖాళీ లేకపోవడంతో ప్రింటింగ్ ఇండెట్‌ను తగ్గించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయిదేళ్ల కనిష్ట స్థాయికి ప్రింటింగ్ ఆర్డర్లపై ఆర్బీఐకోత పెట్టిందని మింట్ రిపోర్ట్ చేసింది. విశ్వసనీయ వర్గాలకు చెందిన ఇద్దరు ప్రముఖుల ద్వారా ఈ సమాచారం అందినట్టు రిపోర్ట్ చేసింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఇండెంట్ 21 బిలియన్లు ఉండనుందని, ఇది గత ఏడాది 28 బిలియన్లతో పోలిస్తే చాలా తక్కువ అని భావిస్తున్నారు. గత ఐదేళ్లలో బ్యాంకు నోట్ల సగటు వార్షిక ఇండెంట్ 25 బిలియన్లుగా ఉంది. 50-60శాతం రద్దైన నోట్లను ఆర్బీఐకి బదలాయించినప్పటికీ తమ వద్ద చాలా తక్కువ స్థలం ఉందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. పాత రూ.500, 1000నోట్లు కుప్పలుతెప్పలుపేరుకుపోవడం, వీటిని నాశనం చేయడాకంటే ముందు లెక్కింపు పూర్తికావడంతో ఈ పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. ఇండెంట్ తగ్గింపు అనేది ఉత్పత్తి సామర్థ్యాలు, పరిమితులకు లోబడి ఆర్బీఐ సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపు చీఫ్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా చిరిగిపోయిన నోట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అయితే ప్రింటింగ్ ఇండెంట్ కోత నగదు లావాదేవీలపై మరింత భారం పెంచుతుందని చెప్పారు. అయితే ఈ అంచనాలపై వ్యాఖ్యానించేందుకు ఆర్బీఐ నిరాకరించినట్టు తెలుస్తోంది. -
ఎస్బీఐ బేస్ రేటు కోత
others cuttheir సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు పండుగ శుభవార్త అందించింది. బేస్ రేటులో 5 బేసిస్ పాయింట్లమేర కోత పెట్టింది. ఇప్పటివరకు 9శాతంగా ఉన్న బేస్టు తాజా తగ్గింపుతో ప్రస్తుతం ఎస్బీఐ బేస్ రేటు 8.95 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ 2016కు ముందు హౌస్‌లోన్ తీసుకున్నవారికి లబ్ధి చేకూరనుంది. ఈ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలుకానున్నాయని ఎస్బీఐ ప్రకటించింది. అయితే ఎంసీఎల్ఆర్ రేటు ఎలాంటి మార్పులేదు. అక్టోబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చర్యకు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రివ్యూలో బేస్‌రేటులోకోత పెడుతుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. అయితే మైక్రో ఎకానమిక్ డాటా ఆధారంగా రేట్ ఉండకపోవచ్చని ఎస్బీఐ అభిప్రాయపడింది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు బేస్ రేటులో కోతలను అమలు చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా బేస్ రేటును 35 బేసిస్ పాయింట్లమేర కుదించి 9.15 శాతానికి తగ్గించింది. ఈ బాటలో ఆంధ్రా బ్యాంకు సైతం 15 బేసిస్ పాయింట్లు తగ్గించి బేస్ రేటును 9.55 శాతంగా ప్రకటించింది. బ్యాంకులు బేస్ రేటు ఆధారంగా రుణాల మంజూరీని చేపట్టే విషయం విదితమే. -
ఐఫోన్ల ధరల భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఐఫోన్ల ధరల్లో కోత పెడుతూ స్మార్ట్‌ఫోన దిగ్గజం ఆపిల్ పాత సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా ఐఫోన్ X , ఐఫోన్ 8 మోడళ్ల ప్రారంభం అనంతరం పాత ఐఫోన్ మోడళ్ల ధరలను అమెరికా, ఇండియాలోనూ తగ్గించింది. సాధారణంగా కొత్త ఐఫోన్ లాంచింగ్ తరువాత ఐఫోన్లనుడిస్కౌంట్ ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రావడం ఆపిల్ ఆనవాయితీగా మార్చుకుంది. భారతదేశంలో ఐఫోన్ 6 , ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ ధరలను తగ్గించింది. దాదాపు రూ. 7 వేల దాకా కోత పెట్టింది. వీటితోపాటు అమెరికాలో ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌పై 50డాలర్ల తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఐ ఫోన్ 6 ఎస్ 32 జీబీ స్టోరేజ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరలు వరుసగా రూ. 46,900, రూ. 55,900 ఉండగా ప్రస్తుతం రూ. 40వేలు, రూ.49వేలకే లభించనుంది. 6ఎస్‌ప్లస్ 32జీబీ, 128జీబీస్టోరేజ్ ధరలు ప్రస్తుత తగ్గింపు అనంతరం రూ. 49వేలు, రూ.58వేలుగా ఉండనున్నాయి. వీటి అసలుధర 32 జీబీ రూ.56,100, రూ. 65, 100లు. ఐ ఫోన్ 7 32 జీబీ వేరియంట్ పై రూ.6 వేల తగ్గింపు తరువాత రూ.49 వేలకు లభ్యం. 128 జీబీ వేరియంట్ రూ.58వేలకు అందుబాటులోఉంది. ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ వేరియంట్‌పై రూ.8300 వరకు తగ్గింపు తర్వాత రూ. 59వేలకు లభ్యమవుతోంది. అదే 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ఫై రూ.8200తగ్గింపుతో రూ.68వేలకు ఆఫర్ చేస్తోంది. అయితే అమెరికాలో ఎస్ఈ మోడల్ ధరపై దాదాపు 3వేల దాకా తగ్గించిన ఆపిల్ ఇండియాలో మాత్రం ఎలాంటి తగ్గింపు ప్రకటించకుండా యథాతథరేట్లను కొనసాగించేందుకు నిర్ణయించింది. ఐ ఫోన్ ఎస్ఈ 32జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ ధరలు వరుసగారూ. 26,000, రూ. 35,000 గా ఉంటాయి. -
జీఎస్టీ ఎఫెక్ట్:కోల్గేట్ ధరలు తగ్గాయ్
ముంబై: ఓరల్ కేర్ ఉత్పత్తుల్లో లీడర్ గా ఉన్నకోల్గేట్ జీఎస్టీ అమలు తరువాత తన అనేక ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది. దంత ఉత్పాదనల్లో అగ్రగామి కోల్గెట్ సంస్థ తన ఉత్పత్తులపై 8 నుంచి 9 శాతం మేర ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌లపై ఈ తగ్గిపు వర్తించనుంది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోల్గేట్ తెలిపింది. జీఎస్టీ పరిధిలో టూత్ పేస్టులపై పన్ను రేటు 18శాతంగా నిర్ణయించడంతో ఈ తగ్గింపు. ఇప్పటివరకు ఇది 24శాతంగా ఉంది. మారిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయని కోల్గెట్-పామోలివ్(ఇండియా) అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ తగ్గింపు ధరల వల్ల కోల్గెట్ స్ట్రాంగ్ టూత్‌పేస్ట్(100 గ్రా.) ధర రూ. 52 నుంచి రూ.46కు అందుబాటులో ఉండనుంది. కోల్గెట్ స్లిమ్సాఫ్ట్ టూత్‌బ్రష్ ధర రూ.65 నుంచి రూ.60కి దిగి వచ్చింది. ఎడెల్వీస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అత్యధిక శాతం టోకు వర్తకం చేస్తున్న కంపెనీలు జీఎస్టీపన్నురేటుకు ప్రభావితంకానున్నాయి. చాలా కొద్దిమంది మాత్రమే టోకువ్యాపారులు కింద నమోదు కానందువల్ల హోల్‌సేల్ మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన కాల్గేట్ వాల్యూమ్ 7-8 శాతం తగ్గిపోతుందని భావిస్తున్నారు.కాగా ఓరట్ కేర్ మార్కెట్ లో కోల్గేట్ వాటా సుమారు 56 శాతం. కాగా జీఎస్టీ అమలు తరువాత దాదాపు అన్ని కంపెనీలూ తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ ఇప్పటికే వస్తువుల ధరలను తగ్గించగా..ఇమామి కూడా తన ఉత్పత్తులపై ధరలను తగ్గించింది. -
కేటీఎం బైక్స్ లవర్స్‌కి బంపర్ ఆఫర్
స్పోర్ట్స్ బైక్స్ అంటే ప్రాణం పెట్టే యూత్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్. జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమల్లోకిరావడంతో భారత్‌లో టాప్ గేర్‌లో దూసుకెళుతున్న కేటీఎం బ్రాండ్ బైక్‌ల ధరలు కూడా తగ్గాయి. ఆస్ట్రియా కంపెనీ కెటిఎం కంపెనీ భారత్‌లో బైక్‌ల ధరలను భారీగా తగ్గించిందని బజాజ్ ఆటో గురువారం ప్రకటించింది. సుమారు రూ.8,600 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. 350 సీసీ ఎటిఎఫ్ కెటిఎమ్ పరిధిలో 200 డ్యూక్, ఆర్సీ 200, 250 డ్యూక్ ఎక్స్ షోరూమ్ ధరలపై రూ.8,600ల మేరకు తగ్గాయని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అదనపు సెస్ కారణంగా 350 సీసీ పరిధిలోని 390 డ్యూక్ , ఆర్సి 390 ల ఎక్స్-షోరూమ్ ధరల్లో రూ. 5,900 మేర తగ్గించింది.ఆయా ప్రాంతాలల్ లోవర్తించే వ్యాట్ రేట్ల ఆధారంగా తగ్గింపు రేటు వేర్వేరుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ముంబైలో 200 డ్యూక్ ఎక్స్-షోరూమ్ లో దీని అసలు ధర రూ.1,44,751గా ఉంది. మరోవైపు ఇటీవలే దేశంలో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ప్రవేశపెట్టిన కేటీఎం తన ఔట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇండియలో నెం.1 స్థానంపై కన్నేసిన కంపెనీ ఈఏడాది దాదాపు 50వేల బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటు కేటీఎం బ్రాండ్‌లో బజాజ్ ఆటో కంపెనీకి 49 శాతం వాటా ఉంది. కాగా ఇప్పటికే ద్విచక్ర వాహన తయారీదారులైన టీవీఎస్ మోటార్ , హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, సుజుకి కంపెనీలు తమ బైక్‌ల ధరలను తగ్గించాయి. -
నిస్సాన్ కార్ల ధరలు కూడా తగ్గాయి
ముంబై : ఎస్టీ ఎఫెక్ట్‌తో వాహన దిగ్గజ కంపెనీలన్ని వరుసపెట్టి తన వాహనాల రేట్లను తగ్గించడంలో క్యూ కడుతున్నాయి. తాజాగా నిస్పాన్ ఇండియా కూడా తన వాహనాలపై రేట్లను తగ్గిస్తున్నట్టుప్రకటించింది. నిస్సాన్ తన ఎక్స్-షోరూమ్ వాహనాల ధరలు సగటున 3 శాతం తగ్గించింది. నిస్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్ర మాట్లాడుతూ, ఆటోమొబైల్ తయారీదారులు, కస్టమర్లకు జీఎస్టీ అమలు సానుకూలమని చెప్పారు. లాభాలను తమ వినియోగదారులకు లాభాలను అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. జూలై 1 జీఎస్టీ పరిధిలో ఆటోమొబైల్స్ ప్రభుత్వం 28 పన్నురేటును నిర్ణయించింది. దీంతో ఈ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో ఆటోమొబైల్ కంపెనీలు బైక్‌లు,కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, ఫోర్డ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూలు వంటి కార్ల కంపెనీలు ఇటీవలే కార్ల ధరలు తగ్గుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ ఒప్పందంతో 2 వేల ఉద్యోగాలు ఢమాల్
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా వెలిగిన యాహూను సొంతం చేసుకున్న వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్ ఉద్యోగులపై భారీ వేటు వేయనుంది. యాహూ కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో రెండు కంపెనీలకు చెందిన దాదాపు 2 వేల మందిని ఇంటికి పంపించనుందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం 2 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంక్ తొలగించనుంది. మొత్తం 4.48 బిలియన్ డాలర్లు ఒప్పందం పూర్తయిన అనంతరం ఈ తొలగింపులను చేపట్టనుంది. రెండు యూనిట్లకు చెందిన 15శాతం ఉద్యోగులను తగ్గించనుంది వీటిలోముఖ్యంగా కాలిఫోర్నియా సహా, అమెరికా వెలుపల ఉద్యోగులు ఇందులో ఉన్నారు. మరోవైపు యాహూ- వెరిజోన్ విలీనానికి వాటాదారుల సాధారణ సమావేశం గురువారం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం కంపెనీ విక్రయ ప్ర్రకియ మంగళవారం పూర్తి కానుంది. వెరిజోన్ , యాహూ విలీనంతో కొత్త వెంచర్ ఓథ్ ఉనికి లోనికి రానుంది. వెరిజోన్‌కు చెందిన అమెరికన్ మల్టీనేషనల్ మాస్ మీడియా కార్పొరేషన్ ఏఓఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ ఆర్ స్ట్రాంగ్ నేతృత్వంలోని ఓథ్ అనే నూతన సంస్థగా రీబ్రాండ్ అయింది. కాగా 2012లో యాహూ సీఈవోగాఎంపికైన మెరిస్సా మేయర్ పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడంతో వివాదం రగిలింది. ఈ క్రమంలోనే 2015లో యాహూ, తన వ్యాపారంలోని ముఖ్య విభాగాలైన డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఈ-మెయిల్, మీడియా విభాగాలను వేరిజోన్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
నరికేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పతనమవుతున్న ఆయిల్‌పామ్ గెలల ధరలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక.. మరోవైపు సబ్సిడీ అందక ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను నరికివేయడానికి సైతం రైతులు వెనకాడటం లేదు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే సుమారు 600 ఎకరాల్లో తోటలను తొలగించారు. దేశంలోనే ప్రథమం.. ధర అథమం దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఆయిల్‌పామ్ పంట సాగవుతోంది. దేశవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. అందులోనూ మన జిల్లాలో అత్యధికంగా 1.30 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తున్నారు. ఏటా రాష్ట్రంలో 10 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తున్నట్టు అంచనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చి సెంటర్ అంచనా ప్రకారం టన్ను అయిల్‌పామ్ గెలల ఉత్పత్తికి రూ.8,145 ఖర్చవుతోంది. ఇది నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. ప్రస్తుతం చెల్లిస్తున్న ధర మాత్రం చెల్లిస్తున్న ధర మాత్రం రూ.7,400 లోపే ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించడంతో దిగుమతులు పెరిగాయి. ఈ పోటీని తట్టుకోలేక దేశీయంగా ధర తగ్గించారు. గతేడాది మార్చిలో టన్ను గెలల ధర రూ.8,400 వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.7,376కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గెలల దిగుబడి జూన్ నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ వరకూ ఉంటుంది. ఈ సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నష్టాలను తట్టుకోలేక రైతులు తోటలను నరికేస్తున్నారు. ఎకరానికి ఏటా రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, రవాణా ఖర్చులు కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరుగుతోంది. అయితే, ఎకరానికి 7 టన్నుల దిగుబడి కూడా రావడం లేదు. పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. అంతర పంటగా వేసిన కోకోకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. ఆయిల్‌పామ్ రైతులు తమ ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామ¯ŒS ఈ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ఆ దిశగా అడుగులు పడటం లేదు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై సుంకం విధించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సబ్సిడీ ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు సైతం ఆయిల్‌పామ్‌కు గిట్టుబాటు ధర పెంచుతామని ప్రకటించినా వాస్తవ రూపం దాల్చలేదు. ఒకవైపు గిట్టుబాటు ధరరాక, మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతులు నష్టాలతో ఈ పంటను పండించడానికి అంతగా ఇష్టపడటం లేదు. తోటలను తొలగించాలన్నా లక్షలాది రూపాయల ఖర్చవుతుండటంతో భరించలేక ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారు. టన్ను గెలలకు మద్దతు ధర రూ.10 వేలు ఇస్తేనే గట్టెక్కుతామని, ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.8,900 కూడా తమకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా బిళ్లనపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కాకుమాను శ్రీనివాసరావు. కొన్నేళ్లుగా ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో 20 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, కూలి ఖర్చులు దీనికి అదనం. ఎకరానికి గెలల దిగుబడి 7 టన్నులు కూడా రావడం లేదు. గెలలను కోయించి అమ్మితే ఖర్చులు కూడా దక్కడం లేదు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక చివరకు తోటల్లోని చెట్లను పొక్లెయిన్ సాయంతో ఇలా తొలగిస్తున్నారు. ఆయన స్వగ్రామమైన బిళ్లనపల్లిలో 15 ఎకరాల్లో వేసిన ఆయిల్‌పామ్ తోటను ఇప్పటికే తొలగించిన శ్రీనివాసరావు.. ఇప్పుడు సీహెచ్.పోతేపలి్లలోని తోటలను సైతం నరికిస్తున్నారు. ఎకరం తోట తొలగించడానికి రూ.4 వేల వరకు ఖర్చవుతోంది. ఈ పరిస్థితి శ్రీనివాసరావు ఒక్కరికే పరిమితం కాలేదు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులందరి దుస్థితి ఇలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు ఆయిల్‌పామ్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనివల్లే తోటలను తొలగిస్తున్నాం. నాకున్న 6 ఎకరాల తోటను తొలగించేందుకు నిర్ణయించుకున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి పరిష్కారాన్ని చూపకుంటే రాబోయే రోజుల్లో ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకమవుతుంది. – బసివిరెడ్డి వెంకటరామయ్య, సాయన్నపాలెం, ద్వారకాతిరుమల మండలం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతుల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. ప్రభుత్వ తీరుతో కక్కలేక మింగలేక సతమతమవు తున్నారు. మద్దతు ధర కల్పించకుంటే నష్టాలు భరిస్తూ ఎన్నాళ్లు సాగు చేస్తాం. చంద్రబాబు ఈ జిల్లాపై కపటప్రేమ నటిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. – నెక్కంటి రమేష్, రైతు, సీహెచ్.పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం -
యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు కోత
దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లపై గుడ్ న్యూస్ చెప్పింది. గృహరుణాలపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అఫార్డబుల్ హౌజింగ్ ఫైనాన్స్ ను అందించే లక్ష్యంతో రేట్లను సమీక్షించినట్టు బ్యాంకు చెప్పింది. దీంతో 30 లక్షల వరకున్న శాలరీ సెగ్మెంట్లో గృహరుణాలపై వడ్డీరేటు 8.35 శాతానికి దిగొచ్చింది. ఇండస్ట్రీలోనే ఇవే అత్యంత కనిష్టస్థాయి. 2017 మే 16 నుంచి ఈ సమీక్షించిన వడ్డీరేట్లు అందుబాటులోకి వస్తున్నాయని బ్యాంకు చెప్పింది. ఇప్పటివరకు 75 లక్షల వరకున్న గృహరుణాలపై 8.65 శాతం వడ్డీరేట్లున్నాయి. ప్రస్తుతం ఈ వడ్డీరేట్లను 8.35శాతానికి తగ్గించింది. ఈ బ్యాంకు ప్రత్యర్థులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా గతవారంలోనే తమ వడ్డీరేట్లను తగ్గించాయి. యాక్సిస్ బ్యాంకు రుణాలు సమీక్షించిన వడ్డీరేట్లు సెగ్మెంట్ 30లక్షల వరకు 30-75 లక్షలు 75 లక్షలకు పైబడి శాలరీ 8.35శాతం 8.65 శాతం 8.70శాతం సెల్ఫ్ ఎంప్లాయిడ్ 8.40శాతం 8.70 శాతం 8.75శాతం -
రైలు కింద పడి చేతిని కోల్పోయాడు
రాజమహేంద్రవరం క్రైం : ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఒక వ్యక్తి చేతిని కోల్పోయాడు. కాకినాడకు చెందిన విస్సాకోటి శ్రీనివాస్ కొంతకాలంగా రాజమహేంద్రవరంలోని అన్నపూర్ణమ్మ పేటలో ఉంటూ వడ్రంగి పని చేస్తుంటాడు. బుధవారం తునిలోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి రైలులో వెళ్లేందుకు స్థానిక గోదావరి రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఎక్కుతుండగా రైలుకు, ఫ్లాట్‌ఫాంకు మధ్య పడి చేతిని కోల్పోయాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్‌ను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు ఒక బాబు, పాప ఉన్నారు. వడ్రంగి పనికి ప్రధానమైన చేతిని కోల్పోవడంతో కుటుంబ పోషణ అగమ్యగోచరంగా మారింది. కళ్ల ముందు జరిగిన దుర్ఘటనను కుటుంబీకులు జీర్ణించుకోలేపోతున్నారు. -
ప్రేయసి కోసం నాలుక, మర్మాంగం కోసుకున్నాడు
కృష్ణరాజపుర(కర్ణాటక) : గుర్తు తెలియని వ్యక్తులు ఒరిస్సా యువకుడి నాలుక, మర్మంగాన్ని కోసేసిన ఘటనకు సంబంధించి కొత్తకోణం వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకోవడానికి అమ్మవారికి మొక్కుకున్న ప్రకారం నాలుక, మర్మంగాన్ని తానే కోసుకున్నట్లు యువకుడు బిజుకుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. వివరాలు.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బిజుకుమార్ తమ సొంత గ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే యువతి బిజుకుమార్ ప్రేమను తిరస్కరించడంతో మద్యానికి బానిసైన బిజుకుమార్‌ను తల్లితండ్రులు బెంగళూరులోని తమ సంబధీకుడి వద్దకు పంపించారు. కొద్ది రోజుల క్రితం నగరంలోని ఇమ్మడిహళ్లిలో తన మామయ్య వద్దకు వచ్చిన బిజుకుమార్కు స్థానికంగా నివాసముండే పశ్చిమబెంగాల్‌కు చెందిన యువకులతో పరిచయమైంది. తన గతం గురించి స్నేహితులకు చెప్పడంతో అమ్మవారికి నాలుకను,మర్మంగాన్ని కానుకగా సమర్పిస్తే వశీకరణ శక్తులు సిద్ధిస్తాయని తద్వార ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకోవచ్చంటూ సూచించారు. ఇది నమ్మిన బిజుకుమార్ చాకుతో నాలుకను, మర్మాంగాన్ని కోసుకున్నాడు.అయితే ఎటువంటి వశీకరణ శక్తులు సిద్ధించకపోవడంతో తప్పు తెలుసుకున్న బిజుకుమార్ విషయం మామయ్యకు తెలియకూడదనే ఉద్దేశంతో ఎవరో తనను అపహరించి నాలుక, మర్మాంగాన్ని కోసినట్లు కట్టుకథ వినిపించాడు. కానీ బిజుకుమార్ మామయ్య బిజుకుమార్‌ను ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులు బిజుకుమార్ చెప్పిన విధంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో బిజుకుమార్పై అనుమానంతో నిజం చెప్పాలని లేదంటే తమదైన శైలిలో విచారణ చేస్తామనేసరికి బిజుకుమార్ ఆదివారం నిజం అంగీకరించాడు. -
నేడు నగరంలో విద్యుత్ కోతలు
కర్నూలు(రాజ్‌విహార్): నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ కోతలు విధించనున్నట్లు ఆపరేషన్స్ డీఈ పీవీ రమేష్, టౌన్ ఏడీఈ-2 జి. రంగస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శరీన్ నగర్ ఏరియా విద్యుత్ ఫీడర్లో మరమ్మతుల కారణంగా శరీన్ నగర్, గట్టయ్య నగర్, రాఘవేంద్ర నగర్, శరీఫ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. -
మెడిసిన్ల ధరలు తగ్గాయ్!
న్యూఢిల్లీ : 33 ముఖ్యమైన మెడిసిన్ల ధరలను డ్రగ్ ప్రైస్ రెగ్యులేటరీ తగ్గించేసింది. వీటి రిటైల్ ధరలు 30-50 శాతం తగ్గిస్తున్నట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) పేర్కొంది. తగ్గిన మెడిసిన్ ధరల్లో జలుబు, దగ్గు, యాంటీ బయోటిక్స్లతో పాటు పలు రకాల ముఖ్యమైన మందులున్నాయి. మ్యానుఫాక్చర్స్ నిర్ణయించిన ధరలను పాటించని కంపెనీలు, డ్రగ్స్ ఆర్డర్,2013 ప్రొవిజన్స్ కింద ఎక్కువ మొత్తంలో రెగ్యులేటరీ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. క్రిటికల్ వ్యాధులకు సాధారణంగా వాడుతున్న మందుల ధరలు తగ్గించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, మరికొన్ని కొత్త డ్రగ్‌లను కూడా ప్రైస్ రెగ్యులేషన్ కిందకు తీసుకొస్తామని అథారిటీ పేర్కొంది. 33 రకాల మందులను డ్రగ్ ప్రైస్ రెగ్యులేటరి రెండు కేటగిరీల్లో విభజించింది. 11 కొత్త రకం మందులను ప్రైస్ కంట్రోల్ కిందకు తీసుకొచ్చింది. సమీక్షించిన ఈ 33 మందుల వివరాలను నేషనల్ లిస్టు ఆఫ్ ఎసెన్సియల్ మెడిసిన్లు, 2015లోకి చేర్చింది. -
హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లు కోత!
న్యూఢిల్లీ : హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొ(హెచ్డీఎఫ్సీ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన ప్రస్తుత కస్టమర్లు తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షల వరకు రుణం తీసుకున్న మహిళా రుణగ్రహీతలు ఇక నుంచి తమ గృహ రుణాలపై 8.65 శాతం వడ్డీరేటు చెల్లిస్తే సరిపోతుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఇతర రుణగ్రహీతలు 8.70 శాతం చెల్లించాల్సి ఉంటుందని హెచ్డీఎఫ్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోజనం తమ ప్రస్తుత ఖాతాదారులందరికీ కల్పించనున్నట్టు హెచ్డీఎఫ్ వెల్లడించింది. ఈ నెల మొదట్లో కొత్త కస్టమర్లకు రుణ రేటును 45 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు నాన్-రెసిడెంట్ ఇండియన్స్(ఎన్ఐఆర్లు)/ భారతీయ సంతతికి చెందిన కార్డు హోల్డర్స్‌కు(పీఐఓ) వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తం మహిళలు ఇతరులు రూ.75 లక్షల వరకు 8.65 శాతం(ఏడాదికి) 8.70 శాతం(ఏడాదికి) రూ.75 లక్షలకు పైగా 8.70 శాతం(ఏడాదికి) 8.75 శాతం(ఏడాదికి) -
ఆపిల్ సీఈవోకు జీతం కట్!
-
ఆపిల్ సీఈవోకు జీతం కట్!
టెక్ దిగ్గజం ఆపిల్ తన టాప్ ఎగ్జిక్యూటివ్, సీఈవో టిమ్ కుక్కు ఝలకిచ్చింది.. రెవన్యూలు, లాభాలు లక్ష్యాలను చేధించలేకపోవడంతో 2016లో ఆయనకు అందించే పరిహారాలను తగ్గించేసింది. సెక్యురిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించిన ప్రకటనలో టిమ్ కుక్ గతేడాది 2016లో ఆర్జించిన మొత్తం పరిహారం 8.75 మిలియన్ డాలర్ల(రూ.59 కోట్లకుపైగా)గా ఆపిల్ పేర్కొంది. ఆయన జీతం 1 మిలియన్ డాలర్లు పెరిగినప్పటికీ, ఏడాదికి ఆయనకు అందే పరిహారం మాత్రం తగ్గిపోయినట్టు చెప్పింది. 2015లో టిమ్ కుక్ 10.28 మిలియన్ డాలర్ల(రూ.69 కోట్లకు పైగా) ఆదాయన్ని ఆర్జించారు. వారి టార్గెట్ వార్షిక ప్రోత్సహకాల్లో భాగంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు 89.5 శాతం పొందుతారు. కానీ కంపెనీ వార్షిక విక్రయాలు దాదాపు 4 శాతం మందగించాయి. 223.6 బిలియన్ డాలర్లగా పెట్టుకున్న లక్ష్యాన్ని కంపెనీ చేధించలేకపోయింది. నిర్వహణ ఆదాయం 0.5 శాతం పడిపోయింది. మొత్తంగా 2016లో కంపెనీ నికర విక్రయాలు, నిర్వహణ ఆదాయాలు 7.7 శాతం, 15.7 శాతం పడిపోయినట్టు ఆపిల్ పేర్కొంది. ఇది ఎగ్జిక్యూటివ్ పరిహారంపై పడినట్టు తెలిపింది. గత 15 ఏళ్లలో మొదటిసారి ఆపిల్ తన రెవెన్యూలను కోల్పోయింది. -
జనవరిలోనే వడ్డీరేట్లపై గుడ్ న్యూస్!
-
జనవరిలోనే వడ్డీరేట్లపై గుడ్ న్యూస్!
ముంబాయి : కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త కార్లు, ఇళ్లు కొనుకోవాలనుకునే వారు శుభవార్త వినిబోతున్నారట. 2017 మొదటినెలలోనే ప్రముఖ అగ్రగామి బ్యాంకులన్నీ వడ్డీరేట్లలో కోత విధించబోతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. ఈ రేట్లు తగ్గించే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులు ఉండనున్నాయని తెలుస్తోంది. పెద్దనోట్లను రద్దు చేసిన అనంతరం ఏర్పడిన నగదు కొరతకు వినియోగత్వం దెబ్బతిన్నది. నిత్యావసరం కాని వస్తువుల కొనుగోళ్లకు గండికొట్టింది. ఈ నేపథ్యంలో వినియోగత్వాన్ని పెంచడానికి బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించబోతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కొత్త ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి చౌకైన వడ్డీరేట్లు లభించనున్నాయని సమాచారం. అయితే ఈ విషయంపై ఎస్బీఐ స్పందించడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకి భారీ మొత్తంలో డిపాజిట్లు సమకూరాయి. బ్యాంకుల లిక్విడిటీ కూడా భారీగా పెరిగింది. గతవారం ఇండియన్ బ్యాంకు అసోసియేషన్‌తో భేటీ అయిన బ్యాంకులు వడ్డీరేట్ల కోత విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. దేశీయ అగ్రగామి బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమయ్యే మార్గాలను వారు చర్చించారని, ఆర్థికమంత్రిత్వశాఖతో కూడా రుణాలపై వడ్డీరేట్లు తగ్గించే విషయంపై చర్చించారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. డీమానిటైజేషన్‌తో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో సెంటిమెంట్‌ను పునరుద్ధరించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. మరోవైపు డిసెంబర్ 30 తర్వాత కూడా నగదు విత్‌డ్రాలపై విధించిన పరిమితులు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. -
10 శాతం ఉద్యోగులపై ఆ బ్యాంకు వేటు!
బ్రిటీష్ బహుళ జాతీయ బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ స్టాండర్డ్ చార్టడ్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోబోతుందట.. తన గ్లోబల్ కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయాలని బ్యాంకు నిర్ఘయించినట్టు సంబంధిత వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. వ్యయాలను తగ్గించుకోవడానికి బ్యాంకు ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగులపై కోత విధించినున్నట్టు తెలిపాయి. ఈ ఉద్యోగాల కోత ప్రక్రియ ఈ వారం మొదటి నుంచే సింగపూర్, హాంగ్‌కాంగ్ వంటి అన్ని మేజర్ బ్యాంకింగ్ సెంటర్లలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే తమ కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ డివిజన్‌ను మరింత సమర్థవంతంగా తయారుచేస్తామని స్టాండర్డ్ చార్టడ్ అధికార ప్రతినిధి చెప్పారు. వృథాగా ఉన్న ఉద్యోగాలను తీసివేసి, టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ఈ చర్యలతో బ్యాంకు వ్యయాలను తగ్గించుకోనున్నట్టు తెలిపారు. కొన్ని ఉద్యోగాలపైనే ఈ ప్రభావం పడుతుందని ప్రకటించిన ఆయన ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారో తెలుపలేదు. ఈ బ్యాంకులో జూన్ ముగింపుకు మొత్తం 84,477 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగ, ఈ బ్యాంకు అంచనావేసిన దానికంటే తక్కువగా మూడో త్రైమాసిక ఫలితాలను నమోదుచేసింది. బ్యాంకు రాబడి, లాభాలు ఆశించదగ్గ స్థాయిలో లేవని ప్రకటించిన ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ వింటర్స్, సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉద్ఘాటించారు. -
ఇపుడు హెచ్డీఎఫ్సీ కూడా
ముంబై: ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజాలు గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించడంలో వరుసగా క్యూ కడుతున్నాయి. వరుసగా ప్రభుత్వరంగ మేజర్ ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ వార్షిక ఎంసీఎల్ఆర్ పై కోత పెడుతూ ప్రకటించగా ఇపుడు ఈ కోవలోకి మరో దిగ్గజ బ్యాంక్ చేరింది. ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా హోం లోన్లపై 0.15 శాతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా బ్యాంకులన్నీ మహిళా రుణ గ్రహీతలకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. హోం రుణాలను 9.15 శాతం వడ్డీరేటుతో మహిళా రుణగ్రహీతలకు రూ .75 లక్షల వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే ఇతరులకు తగ్గింపు రేటులో అంటే 9.20శాతాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎప్పటిలాగానే గత రెండు నెలలుగా తమ ఫండ్స్ మార్జినల్ కాస్ట్ (ఉపాంత వ్యయాలు)తగ్గుముఖం పట్టాయని, ఈ ప్రయోజనాలను వినియోగదారులకు పంచడమే తమ లక్ష్యమని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ చెప్పారు. కాగా ఆర్ బీఐ సూచనలమేరకు ఎస్ బీఐ తో పాటు మరిన్ని బ్యాంకులు రుణ వడ్డీరేటును తగ్గించక తప్పదని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే ఈ పరిణామం మిగతా చిన్న బ్యాంకులపై పడనుందని కూడా విశ్లేషించారు. -
ఆ ఐటీ కంపెనీలో 2000 ఉద్యోగాలు కట్
కంప్యూటర్ల తయారీలో ప్రపంచపు అగ్రగామి సంస్థ డెల్ టెక్నాలజీస్ రెండు వేల నుంచి మూడు వేల ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ప్రపంచ సాంకేతిక రంగంలో అతిపెద్ద విలీనానికి తెరలేపిన డెల్, ఈఎంసీ కార్పొరేషన్‌ను తనలో విలీనం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో వ్యయ భారాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేయనుందని కంపెనీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యధిక ఉద్యోగాల కోత అమెరికాలోనూ, సప్లైచైన్, అడ్మిన్‌స్ట్రేషన్, మార్కెటింగ్ ఉద్యోగాల్లో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ కొనుగోలు లావాదేవీ పూర్తైన అనంతరం మొదటి 18 నెలలు 1.7 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోవాలని డెల్ యోచిస్తోంది. ఈ డీల్‌తో ఆ మొత్తానికి అత్యధిక రెట్ల అమ్మకాలు జరపాలని కంపెనీ దృష్టిసారిస్తోంది. ఈ కొత్త కంపెనీలో మొత్తం 140,000 ఉద్యోగులున్నారు. ఈ కామెంట్లపై డెల్ అధికార ప్రతినిధి డేవ్ ఫార్మర్ మాత్రం స్పందించలేదు. ఒప్పందం ప్రకారం ఈఎంసీ కార్పొరేషన్‌ను రూ.4.50 లక్షల కోట్లకు(67 బిలియన్ డాలర్లకు) డెల్ కొనుగోలు చేస్తోంది. కొత్తగా ఏర్పడే సంస్థ తక్షణమే డెల్ టెక్నాలజీస్ పేరుతో కార్యకలాపాలు కొనసాగించనుంది. ఈ విలీనానికి గత జూలైలోనే ఈఎంసీ వాటాదార్లు అంగీకారం తెలిపారు.క్లౌడ్ సర్వీసుల్లో ప్రత్యర్థి కంపెనీలు అమెజాన్.కామ్, మైక్రోసాప్ట్, గూగుల్ వంటి నుంచి వస్తున్న పోటీని తట్టుకుని, విస్తరించే క్రమంలో ఈ రెండు కంపెనీలు జతకట్టి ముందుకు సాగనున్నాయి. ఈఎంసీ కార్పొరేషన్ తమలో విలీనం కానున్నట్టు గతేడాది అక్టోబర్‌లోనే డెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
పింఛన్లకు కోత!
* సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు * వేలిముద్రలు, కంటిచూపు మ్యాచ్ అయితేనే చెల్లించాలని ఉత్తర్వులు * ఆధార్ ఆధారమే కాదంటూ నిర్ణయం తీసుకున్న పాలకులు * ఆందోళనలో లబ్ధిదారులు చిలకలూరిపేట రూరల్ : ఎన్టీఆర్ భరోసా పేరుతో అర్హులకు అందించే పింఛన్లలో కోతలు విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆధార్ కార్డుల ఆధారంగా ఇస్తున్న పింఛన్లను తగ్గించే ప్రయత్నాలకు తెరలేపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న సీఎం కార్యాలయం నుంచి సీఎంపీ నంబర్ 2809– జేఎస్–2016తో ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్న సెర్ప్ సీఈవో పి.కృష్ణమోహన్ జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ల అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు పంపారు. దీనివల్ల వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్లకు కోత పడనుంది. ఇప్పటివరకు ఇలా... జిల్లా వ్యాప్తంగా 57 మండలాలు, 12 పురపాలక సంఘాలు, ఒక కార్పొరేషన్లో 63,616 మంది లబ్ధిదారులు రూ.7 కోట్ల 2 లక్షల 73 వేల 500 పింఛను పొందుతున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు, కంటిచూపు (ఐరిష్) ట్యాబ్‌లకు అనుసంధానం కాకపోవటంతో పింఛను పంపిణీ చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు వారి వేలిముద్రలు సేకరించి, ఆధార్ కార్డుల నంబర్లను నమోదు చేసుకుని సొమ్ము అందజేస్తున్నారు. ప్రస్తుత ఆదేశాల్లో ఈ నెల నుంచి తప్పనిసరిగా వేలిముద్రలు, ఐరిష్‌లు వేయించాలని పేర్కొన్నారు. దీంతో పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. మండిపడుతున్న ఉద్యోగులు... లబ్ధిదారులందరికీ పింఛను అందిస్తున్నామని, వృద్ధుల్లో చేతి వేలిముద్రలు, కంటిచూపు కోల్పోయిన వారికి మాత్రమే తమ వేలిముద్రలు వేసి వారి ఆధార్ ఆధారంగా పంపిణీ చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ట్యాబ్ ఆమోదించేవరకు పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని, అలాగైతే గంటలతరబడి వేలాదిమంది ప్రజలు నిరీక్షించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి వాస్తవాలను గుర్తించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఇలాగైతే సమస్యలే.. వృద్ధుల వేలిముద్రలను ట్యాబ్ ఆమోదిస్తేనే పింఛను చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తే వేలాది మంది ఇబ్బందులు పడతారని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రజలు తమను నిలదీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే సక్రమంగా పింఛను అందక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ఇకపై కొత్త నిబంధనలతో మరింత కష్టాల్లో పడతామని ఆందోళన చెందుతున్నారు. దీనిపై చిలకలూరిపేట ఎంపీడీవో వి.వసంతలక్ష్మిని వివరణ కోరగా, పింఛన్ల పంపిణీ త్వరగా ముగించేందుకు సిబ్బంది వారి వేలిముద్రలే ఎక్కువగా వేస్తున్నారని తెలిపారు. అర్హులు ఉన్నప్పటికీ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారని చెప్పారు. వీటిని నియంత్రించేందుకే ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకుందని వివరించారు. -
ఆ సేవలకు ఓలా మంగళం
ముంబై : ప్రముఖ టాక్సీ సర్వీసు సంస్థ ఓలా క్యాబ్స్, 2015లో దక్కించుకున్న టాక్సీ ఫర్ స్యూర్ కంపెనీని మూసివేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూసివేతతో దాదాపు 1000 ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నట్టు వెల్లడవుతోంది. కాల్ సెంటర్లో పనిచేసే వర్కర్లు, డ్రైవర్ సంబంధాల్లో, బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లలో పనిచేసే టాక్సీ ఫర్ స్యూర్ వర్కర్లను కంపెనీ తొలగించనుందని వీసీసీ సర్కిల్ రిపోర్టు చేసింది. అయితే ఓలా వెంటనే దీనిపై స్పందించలేదు. 18 నెలల క్రితమే ఓలా క్యాబ్స్, తన ప్రత్యర్థి సంస్థ టాక్సీ ఫర్ స్యూర్ ను 200 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. క్యాష్, ఈక్విటీ రూపంలో ఈ డీల్ జరిగింది. ఉబర్‌కు వ్యతిరేకంగా మార్కెట్ లీడర్షిప్ను దక్కించుకోవడానికి ఈ డీల్‌ను ఓలా కుదుర్చుకుంది. టాక్సీ ఫర్ స్యూర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఓలా, ఆ కంపెనీ కార్యకలాపాలను మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తోంది. ఆ కంపెనీకున్న స్వతంత్ర హక్కులు హరిస్తూ వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఆ సంస్థను పూర్తిగా మూసివేసే ప్రక్రియలో ఓలా ఉన్నట్టు కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల తొలగింపుతో నెలకు రూ.30 కోట్ల వ్యయాన్ని ఓలా తగ్గించుకోనుందని కంపెనీకి చెందిన ఒక ఇన్వెస్టర్ చెప్పారు. -
మరో 2,850మంది ఉద్యోగులు ఔట్!
న్యూయార్క్: నోకియా సంస్థకు ఉన్న విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్‌ను వాడుకొని మార్కెట్లో ఎదగాలన్న మైక్రోసాఫ్ట్ వ్యూహం బెడిసికొట్టిన నేపథ్యంలో క్రమంగా ఉద్యోగులను తొలగిస్తోంది. స్మార్ట్ ఫోన్ హార్డ్ వేర్ వ్యాపార విభాగంలో పెరుగుతున్న నష్టాలతో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల్లో కోత పెడుతోంది నోకియా ప్రయోగం ద్వారా 7.6 బిలియన్ల డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ స్మార్ట్ ఫోన్ సెక్టార్ లో మరో 2,850మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్టు మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. దీంతోపాటుగా 2017 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 4,700 ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ఈ వివరాలను పీసీ వరల్డ్ శుక్రవారం నివేదించింది. అలాగే నోకియా ప్రయోగం తర్వాత చాలామంది నోకియా ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ ను వీడినట్టు వెర్జ్ రిపోర్టు చేసింది. మే నెలలో 1,850 ఉద్యోగులు తొలగిస్తున్న ప్రకటించిన సంస్థ నోకియా ప్రయోగానికి స్వస్తి పలుకుతున్న సంకేతాలిచ్చింది. మరోవైపు స్మార్ట్ ఫోన్ రంగంలో నెలకొన్న భారీ అంచనాలు, ప్రత్యర్థుల పోటీ, లూమియా, విండోస్ ఫోన్ల వైఫ్యలం కంపెనీని బాగా దెబ్బ తీసింది. దీంతో స్మార్ట్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ప్రకటించారు. ఇకమీదట సాఫ్ట్‌వేర్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. విండోస్-10 మొబైల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, క్లౌడ్ సేవలకు ఇక ప్రాధాన్యమివ్వనున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ వ్యాపారానికి సంబంధించి గత జూన్ లో సుమారు 7,400 ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నగరంలో రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్‌సిటీ: గ్రీన్‌ల్యాండ్స్ సబ్‌డివిజన్ ఆల్విన్, ఐడీపీఎల్, కుందన్‌బాగ్, హెచ్‌పీఎస్ విద్యుత్ ఫీడర్ లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ మహేష్‌కుమార్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సనత్‌నగర్ ఎస్ఆర్టీ, 2ఆర్టీ, 3ఆర్టీ క్వార్టర్స్, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, అశోక్ లేబర్ కాలనీ, డీఎన్ఎం కాలనీ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, సనత్‌నగర్, ఆంధ్రాబ్యాంక్ లేన్, టయోటా షోరూం ఏరియా, సనత్‌నగర్ మెయిన్‌రోడ్డు, టోపాజ్ బిల్డింగ్, మా టీవీ లేన్, పంజగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్, బేగంపేట్ ఆర్బీఐ క్వార్టర్స్, మూసాపేట్ హెచ్‌పీ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు. -
1600 ఉద్యోగాలకు కోత
పర్సనల్ కంప్యూటర్ల డిమాండ్ పడిపోవడం హార్డ్ డిస్క్ డ్రైవ్ తయారీ కంపెనీలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. అమెరికాకు చెందిన డేటా స్టోరేజ్ కంపెనీ సీగేట్ టెక్నాలజీ 1600 ఉద్యోగాలకు కోత విధించనున్నట్టు తెలుస్తోంది. లేదా 3శాతం వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోనుంది. పునర్ నిర్మాణ ప్రణాళికలో భాగంగా తన కాస్ట్ ను తగ్గించే నేపథ్యంలో సీగేట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే లోపల తన ప్లాన్ ను పూర్తిచేసేందుకు సీగేట్ సిద్ధమైంది. 620 లక్షల డాలర్ల ముందస్తు పన్ను చార్జీలపై ఈ పునర్ నిర్మాణ ఫలితం ప్రభావం చూపించనున్నట్టు సీగేట్ పేర్కొంది. ఈ పునర్ నిర్మాణ ఫలితాలు తన కాస్ట్ ను తగ్గించుకోవడంతో పాటు వార్షిక రన్ రేట్ బేసిస్ లో 1000లక్షల డాలర్ల వరకూ పొదుపుకు సహకరిస్తాయని కంపెనీ వెల్లడించింది. సీగేట్ కంపెనీ ప్రపంచమంతటా 52 వేల ఉద్యోగులను కల్గి ఉంది. సెప్టెంబర్ వరకు 1,050 ఉద్యోగాలకు కోత విధించనుంది. వర్జినల్ ఈక్విప్ మెంట్ తయారీదారులకు, పర్సనల్ కంప్యూటర్ తయారీదారులకు డిమాండ్ క్షీణించడంతో, గత ఐదేళ్లగా సీగేట్ రెవెన్యూలు పడిపోతూ నష్టాలను నమోదుచేస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 35 శాతం వరకు కంపెనీ స్టాక్స్ పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో సీగేట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.