సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ఊరటనిచ్చాయి. దేశీయంగా వంట గ్యాస్ ధర తగ్గింది. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 1.46 రూపాయల మేర తగ్గింది. దీని ప్రకారం సబ్సిడీ సిలిండర్ ధర రూ. 493.53లుగా ఉంది. సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.30 తగ్గింది. దీంతో దీని రూ.659గా ఉండనుంది. గురువారం అర్థరాత్రి నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాగా వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం వరుసగా ఇది మూడవ సారి. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31న వంటగ్యాస్ సిలిండర్ పై రూ.5లను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ లేని సిలిండర్ రూ.120లను తగ్గించింది. అంతకుముందు ఇదే నెలలో (డిసెంబర్ 1న) సబ్సిడీ సిలిండర్ ధర రూ.6.52 పైసలు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, డాలరు మారకంలో రూపాయి విలువ బలపడడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment