LPG price
-
గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎక్కడ.. ఎంత?
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల ధోరణులకు అనుగుణంగా నెలవారీ సవరణలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధరను రూ. 6.5 పెంచినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు తెలియజేశారు.రేట్ల సవరణ తర్వాత కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 1,646, ముంబైలో రూ.1,605, కోల్‌కతాలో రూ.1,764.50, చెన్నైలో రూ.1,817, హైదరాబాద్‌లో రూ.1,872 గా ఉంది. నాలుగు నెలలుగా వరుస తగ్గింపుల తర్వాత ఈ నెలలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచారు. చివరిసారిగా జూలై 1న రూ. 30 మేర ధర తగ్గింది. నాలుగు నెలల్లో మొత్తంగా రూ.148 తగ్గింది. స్థానిక పన్నులకు అనుగుణంగా వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అయితే, గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్ ధర మాత్రం రూ.803 వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ఇంధనం, సగటు ధర, విదేశీ మారక విలువ ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన ఏటీఎఫ్, వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. -
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర
సాక్షి, ముంబై: వంట గ్యాస్ వినియోగదారులకు మరో సారి ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. దీంతో ఎల్పిజి సిలిండర్ల ధరలు వివిధ మెట్రో నగరాల్లో దిగి వచ్చాయి. సవరించిన రేట్లు ఈ రోజు నుంచే (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా ఇది వరుసగా మూడవ తగ్గింపు హైదరాబాదులో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 207 తగ్గి రూ. 589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది. న్యూఢిల్లీలో ఎల్పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర 744 నుంచి తగ్గి రూ. 581.50 గా వుంటుంది. ముంబైలో 714.50 తో పోలిస్తే తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్‌కతాలో రూ. 190 తగ్గి రూ. 584.50, చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ వుంటాయి. చదవండి: కరోనా : అయ్యయ్యో మారుతి! ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి -
వంట గ్యాస్ ధర తగ్గింది
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ఊరటనిచ్చాయి. దేశీయంగా వంట గ్యాస్ ధర తగ్గింది. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 1.46 రూపాయల మేర తగ్గింది. దీని ప్రకారం సబ్సిడీ సిలిండర్ ధర రూ. 493.53లుగా ఉంది. సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.30 తగ్గింది. దీంతో దీని రూ.659గా ఉండనుంది. గురువారం అర్థరాత్రి నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం వరుసగా ఇది మూడవ సారి. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31న వంటగ్యాస్ సిలిండర్ పై రూ.5లను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ లేని సిలిండర్ రూ.120లను తగ్గించింది. అంతకుముందు ఇదే నెలలో (డిసెంబర్ 1న) సబ్సిడీ సిలిండర్ ధర రూ.6.52 పైసలు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, డాలరు మారకంలో రూపాయి విలువ బలపడడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. -
సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.7 పెంపు
-
సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.7 పెంపు
న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర శుక్రవారం రూ.7కు పైగా పెరిగింది. వచ్చే మార్చి నాటికి సబ్సిడీలను పూర్తిగా ఎత్తేయడానికి ఎల్పీజీ ధరలను ప్రతినెలా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.479.77 నుంచి రూ.487.18కి చేరింది. ఇక సబ్సిడీయేతర సిలిండర్ ధర కూడా రూ.73.5 పెరిగి రూ.597.50కి చేరుకుంది. విమానాల్లో ఇంధనంగా వినియోగించే ఏటీఎఫ్ ధరను కూడా కిలోలీటరుకు రూ. 1,910 పెంచారు. ప్రజా పంపిణీ దుకాణాల ద్వారా అమ్మే కిరోసిన్ ధర లీటర్‌కు 25 పైసలు పెరిగింది. ప్రతినెలా రూ.2 చొప్పున పెంచుతూ గతేడాది జూలైలో ప్రారంభమైన విధానం ద్వారా ఇప్పటి వరకు సబ్సిడీ సిలిండర్ ధర రూ.68 పెరిగింది. తొలుత నెలకు రూ.2 చొప్పున మాత్రమే పెంచాలని ఆదేశించిన కేంద్రం మే 30న దాన్ని రూ.4గా మార్పు చేసింది. -
గ్యాస్ బాంబు!
ఉరుము లేకుండా పడిన పిడుగులా వంటగ్యాస్ సిలెండర్ల సబ్సిడీకి భవిష్యత్తులో మంగళం పాడదల్చుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా ధరల నియంత్రణ వ్యవస్థను ఎత్తేసినట్టే ఇకపై వంటగ్యాస్‌పై కూడా తొలగించబోతున్నట్టు తెలిపింది. వాస్తవానికి నిరుడు జూలైలోనే సబ్సిడీ సిలెండర్ ధరను నెలకు రూ. 2 చొప్పున పెంచమని చమురు సంస్థలను కేంద్రం ఆదే శించింది. దాన్ని ఇప్పుడు నెలకు రు. 4 చేసింది. సబ్సిడీ పూర్తిగా పోయేవరకూ లేదా వచ్చే ఏడాది మార్చి వరకూ ఇలా పెంచుకుంటూ పోవాలని కూడా కోరింది. ఒక్కసారిగా ధర పెంచితే అందువల్ల జనంలో ఎలాంటి స్పందన వస్తుందో ప్రభుత్వాలకు అర్ధమై చాలా కాలమైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ‘కాలజ్ఞానం’ మొదలైంది. 2010లో తొలిసారి పెట్రోల్ ధరపై నియంత్రణ ఎత్తేసింది. సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉండే డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌ల జోలికి మాత్రం వెళ్లబోమని వాగ్దానం చేసింది. 2013లో ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించి డీజిల్‌పై ‘పాక్షికం’గా నియంత్రణ ఎత్తేస్తున్నట్టు ఆనాటి కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ప్రకటించారు. ఎన్డీఏ సర్కారు వచ్చాక 2014లో ఆ ముచ్చట కూడా ముగిసిపోయింది. ఈసారి వంటగ్యాస్ వంతు వచ్చింది. ముందూ మునుపూ కిరోసిన్‌ను సైతం ధరల నియంత్రణ వ్యవస్థ నుంచి తొలగించినా ఆశ్చర్యం లేదు. నిరుడు మే నెలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దారిద్య్ర రేఖకు దిగువునున్న కుటుంబాలకు మహిళల పేరిట ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. ఇప్పటికే ఈ పథకంలో 2.5 కోట్ల మంది మహిళలు వంటగ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సంప్రదాయ పొయ్యిల వల్ల వాతా వరణ కాలుష్యం, మహిళల ఆరోగ్యం దెబ్బతినడం వగైరా జరుగుతున్నాయి గనుక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది. నిజానికి యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి తోడ్పడిన అంశాల్లో ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ల అంశం కూడా ప్రధానమైదని అంటారు. ఈ పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్ లభించిన కుటుంబాలు సెక్యూరిటీ డిపాజిట్గానీ, కనెక్షన్‌కి సంబంధించిన ఇతర చార్జీలుగానీ చెల్లించనవసరం లేదు. మొదటి సిలెండర్ ధరనూ, స్టౌ ధరనూ వాయిదాల్లో కట్టొచ్చునన్న నిబంధన కూడా ఉంది. కనుక ఉచిత వంటగ్యాస్ కనె క్షన్లు చాలా కుటుంబాలే తీసుకున్నాయి. కానీ రెండో సిలెండర్ నుంచి వాయిదాల పద్ధతి ఉండదు. పర్యవసానంగా కనెక్షన్ తీసుకున్నవారిలో చాలామంది కొత్త సిలెండర్ కోసం రాలేదని ఒక సర్వేలో తేలింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు సబ్సిడీ సిలెండర్ ధర రూ. 450 చెల్లించలేని స్థితిలో ఉన్నారని దీన్నిబట్టే అర్ధమ వుతోంది. ఇప్పుడు ఆ సబ్సిడీని కాస్తా ఎత్తేస్తే సహజంగానే ఆ ధర మరింత పెరు గుతూ పోతుంది. ఏతావాతా అలాంటి కుటుంబాలన్నీ వంటగ్యాస్ సౌకర్యానికి దూరం కాక తప్పదు. ఆర్ధిక సంస్కరణలు మొదలైనప్పటినుంచీ సంక్షేమ భావన క్రమేపీ కొడిగడుతోంది. దేనికైనా ‘తగిన ధర’ చెల్లించి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే వంటగ్యాస్ జోలికి ప్రభుత్వాలు చాలా ఆలస్యంగా వచ్చినట్టే లెక్క. దేశంలో సబ్సిడీ సిలెండర్లు ఉపయోగించే వారి సంఖ్య 18.11 కోట్లు. సబ్సిడీయేతర సిలెండర్ల వినియోగదారులు 2.66 కోట్లున్నారు. అసలు వంటగ్యాస్‌లో సబ్సిడీ, సబ్సిడీయేతర తరగతుల్ని తీసుకొచ్చింది యూపీఏ సర్కారే. రెండింటికీ రెండు రకాల ధరలు నిర్ణయించి... పెంచినప్పుడు చెరో రకంగా పెంచుతూ జనాన్ని అయోమయంలోకి నెట్టడం అప్పుడే మొదలైంది. వంటగ్యాస్ కనెక్షన్లలో 89 శాతం మంది ఏడాదికి 9 సిలెండర్లు మాత్రమే వాడతారని... తాము వారి జోలికి పోకుండా అంతకుమించి వాడేవారిపై భారం పడేలా పదో సిలెండర్ నుంచి సబ్సిడీని తీసేస్తున్నట్టు ఆనాటి ప్రభుత్వం చెప్పింది. దీని ప్రభావమేమిటో త్వరలోనే వారికి అర్ధమైంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్ర హావేశాలు రగిలాయి. దాంతో 2014 ఎన్నికలకు ముందు దాన్ని కాస్తా సవ రించారు. ఏడాదికి 12 సిలెండర్లను సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రక టించారు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో మూడేళ్లక్రితం చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా తగ్గాయి. నిరుడు ఇందులో స్వల్ప పెరుగుదల కనిపించినా అది 2014కి ముందున్న ధరలతో పోలిస్తే చాలా తక్కువే. నిజానికి దీన్ని ఆసరా చేసుకునే ప్రస్తుతం వంటగ్యాస్కిచ్చే సబ్సిడీని భవిష్యత్తులో ఎత్తేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఉదాహరణకు సబ్సిడీయేతర సిలెండర్ ధర ప్రస్తుతం రూ. 737. 2013లో దాని ధర రూ. 1,250. మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పుంజుకుంటే ఇది తారుమారు కావొచ్చు. ఆ పరిస్థితే తలెత్తితే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెను ప్రభావం చూపే వంటగ్యాస్ సబ్సిడీ జోలికి వెళ్లడం ధర్మం కాదు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గాయని సంబరపడి ధరల నియంత్రణ వ్యవస్థ నుంచి వంటగ్యాస్‌ను తొలగిస్తే రేపన్న రోజున పరిస్థితులు వేరే రకంగా ఉండొచ్చు. నిజానికి చమురు సంస్థలపై కేంద్రం విధిస్తున్న అమ్మకం పన్ను, దిగుమతి సుంకం... ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ వగైరాలు లేనట్టయితే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఈ స్థాయిలో ఉండవు. వీటి ధరలు పెంచాల్సి వచ్చినప్పుడల్లా ప్రభుత్వం తామిస్తున్న సబ్సిడీల గురించి మాట్లాడుతుంది తప్ప ఈ పన్నుల ఊసెత్తదు. మన దేశంలో వంటిల్లు భారం మోస్తున్నది మహిళలే. వంటగ్యాస్ సబ్సిడీ తీసేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలకు అది పెను భారమవుతుంది. పర్యవసానంగా ఆ కుటుంబాలు తిరిగి పాత పద్ధతుల్లో పొయ్యి రాజేసుకుంటాయి. అందువల్ల ప్రధానంగా దెబ్బతి నేది మహిళల ఆరోగ్యమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. -
పెరిగిన ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్ ధరలు
న్యూఢిల్లీ : సబ్సిడైజ్డ్ వంట గ్యాస్(ఎల్పీజీ) ధరలు పెరిగాయి. సిలిండర్ కు రెండు రూపాయల పెరిగినట్టు తెలిసింది. అదేవిధంగా కిరోసిన్ రేటు కూడా లీటరుకు 26 పైసలను పెరిగింది. చిన్న చిన్నగా ధరలు పెంచుతూ ప్యూయల్ పై అందిస్తున్న సబ్సిడీలను ప్రభుత్వం తొలగించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల సమాచారం మేరకు ఎల్పీజీ ధరలు ఢిల్లీలో 14.2కేజీల సిలిండర్ కు రూపాయి 87 పైసలు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో ఒక్కో సిలిండర్ రూ.442.77కు చేరింది. ఏప్రిల్ 1నే ఆయిల్ కంపెనీలు సబ్సిడీ గ్యాస్ ఎల్పీజీపై ధరలను పెంచాయి. అప్పుడు రూ.5.57 పెంచుతూ 14.2కేజీల సిలిండర్ ధరను రూ.440.90గా నిర్ణయించాయి. ప్రతినెలా క్రమానుగుణంగా సిలిండర్ రేట్లను పెంచుతూ సబ్సిడీలను తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నాన్-సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ పై అంతర్జాతీయ ట్రెండ్ ల ప్రకారం 92 రూపాయలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆ సిలిండర్ పై రేటు రూ.14.50 తగ్గింది. ప్రస్తుతం కిరోసిన్ పై పెంచిన 26 పైసలతో ముంబైలో లీటరు కిరోసిన్ ధర రూ.19.55గా ఉంది. ప్రతినెలా కిరోసిన్ పై కూడా ప్రభుత్వం 25పైసలు చొప్పున సబ్సిడీకి కోత పెట్టాలని యోచిస్తోంది.