పెరిగిన ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్ ధరలు
పెరిగిన ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్ ధరలు
Published Mon, May 1 2017 8:18 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
న్యూఢిల్లీ : సబ్సిడైజ్డ్ వంట గ్యాస్(ఎల్పీజీ) ధరలు పెరిగాయి. సిలిండర్ కు రెండు రూపాయల పెరిగినట్టు తెలిసింది. అదేవిధంగా కిరోసిన్ రేటు కూడా లీటరుకు 26 పైసలను పెరిగింది. చిన్న చిన్నగా ధరలు పెంచుతూ ప్యూయల్ పై అందిస్తున్న సబ్సిడీలను ప్రభుత్వం తొలగించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల సమాచారం మేరకు ఎల్పీజీ ధరలు ఢిల్లీలో 14.2కేజీల సిలిండర్ కు రూపాయి 87 పైసలు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో ఒక్కో సిలిండర్ రూ.442.77కు చేరింది.
ఏప్రిల్ 1నే ఆయిల్ కంపెనీలు సబ్సిడీ గ్యాస్ ఎల్పీజీపై ధరలను పెంచాయి. అప్పుడు రూ.5.57 పెంచుతూ 14.2కేజీల సిలిండర్ ధరను రూ.440.90గా నిర్ణయించాయి. ప్రతినెలా క్రమానుగుణంగా సిలిండర్ రేట్లను పెంచుతూ సబ్సిడీలను తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నాన్-సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ పై అంతర్జాతీయ ట్రెండ్ ల ప్రకారం 92 రూపాయలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆ సిలిండర్ పై రేటు రూ.14.50 తగ్గింది. ప్రస్తుతం కిరోసిన్ పై పెంచిన 26 పైసలతో ముంబైలో లీటరు కిరోసిన్ ధర రూ.19.55గా ఉంది. ప్రతినెలా కిరోసిన్ పై కూడా ప్రభుత్వం 25పైసలు చొప్పున సబ్సిడీకి కోత పెట్టాలని యోచిస్తోంది.
Advertisement
Advertisement