
నల్గొండ, సాక్షి: ప్రత్యేక బస్సుల పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి నేటికి అమలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు రూ. 290 చార్జ్ ఉండగా.. దసరా సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా రూ. 70లను ఆర్టీసీ వసూలు చేసింది.
ప్రస్తుతం మరో రూ. 40 పెంచి రూ. 110లు అదనంగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ. 400 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారులే అమలు చేయమన్నారని కండక్టర్లు సమాధానం ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.