Bus ticket
-
స్పెషల్ బస్సు పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీ
నల్గొండ, సాక్షి: ప్రత్యేక బస్సుల పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి నేటికి అమలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు రూ. 290 చార్జ్ ఉండగా.. దసరా సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా రూ. 70లను ఆర్టీసీ వసూలు చేసింది. ప్రస్తుతం మరో రూ. 40 పెంచి రూ. 110లు అదనంగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ. 400 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారులే అమలు చేయమన్నారని కండక్టర్లు సమాధానం ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రైతుల ద్రోహి కాంగ్రెస్: కేటీఆర్ -
బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే!
అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసు అందించే ఫ్లిక్స్‌బస్ సంస్థ ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నై మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించింది. కేవలం రూ.99కే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ రూట్లలో బస్సులను ప్రారంభించారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్యాసింజర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వారి ప్రయాణాలకు అనుగుణంగా కంపెనీ ఆఫర్ ప్రకటించింది. రూ.99కే ఈ రూట్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 10-అక్టోబరు 6 మధ్య ఉండాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఆశించినమేర వృద్ధి చెందడం లేదు. దాంతో చాలామంది ప్రయాణికులు దూర ప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఎంచుకుంటున్నారు. వారాంతాలు, సెలవులు, పండగల సమయాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలు అందుకు అనువుగా సర్వీసులు నడుపుతూ లాభాలు గడిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఫ్లిక్స్‌బస్ అనే జర్మన్ కంపెనీ దక్షణాది రాష్ట్రాల్లో సేవలు ప్రారంభించడం విశేషం. 2011లో స్థాపించిన ఈ కంపెనీ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి దాదాపు 40 దేశాల్లో సర్వీసులు నడుపుతోంది. 4 లక్షల రూట్లలో 5000 ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. -
ఓటర్లకు బస్ టికెట్లో రాయితీ.. ఎంతంటే..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదిత శాతం పెంచాలని ఎన్నికలసంఘం ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ కంపెనీలు ఓటు శాతం పెంచేలా తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘అభిబస్’ ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఈమేరకు సంస్థ సీఈఓ లెనిన్ కోడూరు, సీఓఓ రోహిత్ శర్మ మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో మే 11 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ABHIVOTE కూపన్ కోడ్ ఉపయోగించి టికెట్ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చు. దీంతోపాటు రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా పొందే వీలుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ గతంలో ఓటర్లకు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పింది. -
ఫ్రీ జర్నీ.. తెలంగాణ మహిళలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు అలర్ట్. నవంబర్ 15 అంటే రేపు శుక్రవారం నుంచి ప్రయాణాల్లో ఆధార్ సహా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిందే. కండక్టర్లకు ఆ కార్డుల్ని చూపించడంతో పాటు.. జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు సూచించింది. ఉదయం నుంచి ఈ నిబంధన అమలు అవుతుందని తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 9న ఈ స్కీమ్ ప్రారంభం అయ్యింది. అయితే తొలివారం గుర్తింపు కార్డు అక్కర్లేకుండానే ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత మాత్రం ఏదైనా గుర్తింపు కార్డు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పర్యవేక్షించారు. గురువారం వర్చువల్‌గా అధికారులతో సమావేశమైన ఆయన.. కండక్టర్లు జీరో టికెట్ జారీ చేయాలని, ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకం విజయవంతంగా అమలు అవుతోందని.. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేశారని అధికారుల్ని అభినందించారాయన. ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు @TSRTCHQ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో… pic.twitter.com/XgPKGPqtpf — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 14, 2023 మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్ కింద.. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు, సిటీలో ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే వీలు ఉంది. తెలంగాణ వాళ్లకు(గుర్తింపు కార్డు ఉండాల్సిందే) మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. -
ఆర్టీసీ కొత్త టికెట్! రూ.50 చెల్లించు.. 12 గంటలపాటు బస్సుల్లో ప్రయాణించు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు వారు తెలిపారు. (చదవండి: పెద్దపల్లిలో విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి) ఎక్కడ తీసుకోవాలంటే? ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 (గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుందని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. టి9-30 టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. (చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్) అందరికీ ‘టి9-60 టికెట్’ వర్తింపు ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. టి9-30 టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. -
TSRTC: ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టీ-9 టికెట్' సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబి టికెట్ వర్తిస్తుంది. టీ-9 టికెట్ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. అయితే, ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టి-9 టికెట్‌ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ టికెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. జూన్ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టీ-9 టికెట్ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబితో టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. సంస్థను ఆదరించాల’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: నవ్య ఎపిసోడ్.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్, కడియంపైన సంచలన ఆరోపణలు -
చార్జీ ఇవ్వలేదని బస్సులోనుంచి తోసేశారు
లావేరు : ఇటీవల బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై అనుమానాస్పద స్థితిలో లభ్యమైన యువకుడి మృతదేహానికి సంబంధించిన మిస్టరీ వీడింది. చార్జీ ఇవ్వలేదని బస్సులో నుంచి ప్రయాణికుడిని డ్రైవర్, క్లీనర్లు తోసేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు బాధ్యులైన ప్రైవేటు బస్సు డ్రైవర్ వెలమశెట్టి రామకృష్ణ, క్లీనర్ బొమ్మాళి అప్పన్నలను ఆదివారం జేఆర్‌పురం సీఐ ఎస్.ఆదాం అరెస్టు చేశారు. అనంతరం లావేరు పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన గేదేల భరత్‌కుమార్ ఈ నెల 2న రాత్రి తన స్నేహితులు వెంకటేష్, శివతో కలిసి శ్రీకాకుళం వచ్చాడు. 3వ తేదీ వేకువజామున 3.30 గంటల సమయంలో తాను మధురవాడ వెళ్లిపోతానని బస్సు ఎక్కించాలని స్నేహితులకు చెప్పడంతో వారు శ్రీకాకుళంలోని నవభారత్ జంక్షన్ వద్దకు తీసుకువచ్చి భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న గంగోత్రి అనే ప్రైవేటు బస్సును ఎక్కించారు. ఆ సమయంలో స్నేహితులు బస్సు చార్జీ ఫోన్‌పే చేస్తామని క్లీనర్‌కు చెప్పారు. బస్సు ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వచ్చినా ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించకపోవడంతో క్లీనర్ భరత్‌కుమార్‌ను చార్జీ డబ్బులు ఇవ్వమని అడిగాడు. ఈ విషయమై ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. లావేరు మండలం బుడుమూరు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ వెలమశెట్టి రామకృష్ణకు విషయం చెప్పగా బస్సు నుంచి తోసేయమని చెప్పాడు. దీంతో బస్సు వెళుతుండగానే భరత్‌కుమార్‌ను క్లీనర్ బస్సు నుంచి బయటకు తోసేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ దిశలో దర్యాప్తు చేయగా ఈ విషయం బయటపడింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా గంగోత్రి బస్సుగా గుర్తించి ఆ రోజు డ్యూటీలో ఉన్నడ్రైవర్ రామకృష్ణ, క్లీనర్ అప్పన్నలను అదుపులోకి తీసుకొని విచారించారు. చార్జీ డబ్బుల కోసం జరిగిన గొడవలో భరత్‌కుమార్‌ను బస్సులోని నుంచి బయటకు తోసేశామని డ్రైవర్, క్లీనర్ నేరం అంగీరించారని సీఐ అన్నారు. సమావేశంలో లావేరు స్టేషన్ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు, హెచ్‌సీ రామారావు, పీసీలు పాల్గొన్నారు. -
గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి!
చిన్నప్పుడూ తప్పు చేస్తే గుంజీలు తీసే పనిష్మెంట్ ఇచ్చేవారు మాష్టార్లు. ఇది అందరికి అనుభవమే. ఐతే ఇక్కడొక దేశంలో మాత్రం ప్రజలు గుంజీలు తీసి.. ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందుతారు. ఇదేంటి అని అనుకుంటున్నారా!. ఔను అక్కడ సుమారు 20 గుంజీలు తీస్తే.. ఫ్రీగా బస్సులో తిరిగేయవచ్చు. యూరప్‌లోని రొమానియా అనే నగరంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఇలాంటి మంచి ఆఫర్‌ని అందిస్తోంది. దీన్ని అక్కడి ప్రభుత్వం స్పోర్ట్స్ ఫెస్టివల్ అనే ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ని ప్రజలకు ఇస్తోంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీన్ని ప్రవేశపెట్టిందట అక్కడి ప్రభుత్వం. ఈ ఉచిత టిక్కెట్‌ను అక్కడి ప్రజలు హెల్త్ టిక్కెట్‌గా పిలుస్తారు. అంతేకాదండోయ్ కేవలం రెండు నిమిషాల్లో 20 గుంజీలు తీస్తేనే ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందగలరు. అందుకు సంబంధించిన వీడియోని అలీనా బ్జోల్కినా అనే వినియోగదారుడు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో... ఒక అమ్మాయి ఒక మిషన్ బూత్ ముందు నిలబడి 20 గంజీలు తీస్తుంది. అయిపోగానే టిక్కెట్ మిషన్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Алина Бжолка (@alinabzholkina) (చదవండి: అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్‌గా దొంగను బంధించాడు!) -
ఆర్టీసీ టికెట్ కొంటే శ్రీవారి దర్శన భాగ్యం
సాక్షి, హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం అంత సులభం కాదు. నిత్యం వేలాదిమంది భక్తులు పోటెత్తుతుంటారు. సిఫారసు లేఖలు పట్టుకుని పరుగులు పెడుతుంటారు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యేవారు కొందరే.. మిగతావారికి మిగిలేది నిరాశే. మరి అలాంటి తరుణంలో దర్శన టోకెన్లు సిద్ధంగా ఉన్నా, భక్తులు రాక వృథా అవుతున్నాయంటే నమ్మశక్యం కాకున్నా నిజమే. నిత్యం సగటున దాదాపు 600 టోకెన్లు భక్తులు తీసుకోక మిగిలిపోతున్నాయి. తిరుమల వెంకన్న దర్శనాన్ని సులభంగా కల్పించాలన్న ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ఆర్టీసీ బృహత్తర ప్రయత్నంతో ప్రయాణికుల ముందుకొచ్చింది. తిరుపతి వెళ్లే భక్తులు, ఆన్లైన్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్ బుక్ చేసుకుంటే వారికి తిరుమల శ్రీవారి దర్శన టోకెన్‌ను కూడా అందుబాటులో ఉంచుతోంది. ఆసక్తి ఉన్నవారు రూ.300 విలువైన ఆ దర్శన టోకెన్‌ను పొంది ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలోచన వచ్చిందే తడువు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పలుమార్లు చర్చించి దానికి ఆమోదం కల్పించారు. ఈమేరకు టీటీడీ నిత్యం తెలంగాణ ఆర్టీసీకి వేయి టోకెన్లు అందిస్తోంది. ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకునేప్పుడే, టీటీడీ టోకెన్ కావాలా అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి ఆ మేరకు ఛార్జి కూడా చెల్లించి ఆధార్ నమోదు చేస్తే బార్‌కోడ్‌తో ఉన్న టోకెన్ అందుతుంది. ఆ రోజు తిరుపతి వెళ్తే బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది దగ్గరుండి మరీ వారికి కొండమీదకు తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయిస్తారు. దర్శన టోకెన్ కోసం నానా ప్రయత్నాలు చేయాల్సిన శ్రమ లేకుండా సులభంగా వేంకటేశ్వరుడి దర్శనం కలుగుతుంది. మిగిలిపోతున్న టోకెన్లు గత కొన్ని రోజులుగా సగటున రోజుకు 400 టోకెన్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఆదిసోమవారాల్లో మాత్రం ఆ సంఖ్య 800 నుంచి 950 మేర ఉంటోంది. మిగతా రోజుల్లో దాదాపు 600 టోకెన్లు మిగిలిపోతున్నాయి.ఈనెల 1వ తేదీన 330, 2వ తేదీన 273, 3న 404, 4న 370 మాత్రమే అమ్ముడయ్యాయి. ఆదివారం అయిన 6వ తేదీన 882, 7న 607 అమ్ముడయ్యాయి. వారం రోజుల ముందే బుక్ చేయాల్సి రావటంతో.. టీటీడీ వారం రోజుల ముందు దర్శన టోకెన్లు విడుదల చేస్తోంది. అంటే తిరుమల వెళ్లాలనుకున్న రోజుకు వారం ముందు ఆర్టీసీ బస్ టికెట్తోసహా దర్శన టోకెన్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రయాణికులకు బస్ టికెట్ విషయంలో రెండుమూడు రోజుల ముందు మాత్రమే టికెట్ రిజర్వ్ చేసుకునే అలవాటు ఉంది. రైలు టికెట్ కోసం నెల రోజుల ముందు ప్రయత్నించేవారు కూడా బస్ టికెట్లు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో రెండుమూడు రోజుల ముందు రిజర్వ్ చేసుకుంటుంటారు. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. వారం కంటే తక్కువ వ్యవధిలో బుక్ చేస్తే తిరుమల దర్శన టోకెన్ ఉండదు. వారం ముందే బుక్ చేసుకోవాలన్న విషయం ఇంకా జనంలోకి బలంగా చేరలేదు. దానిపై చాలినంత ప్రచారం లేదు. నెలరోజులు ముందు నుంచి ప్రయత్నిస్తున్నా స్వామి దర్శన టోకెన్ దొరకని పరిస్థితిలో.. టీఎస్ఆర్టీసీ వద్ద నిత్యం వేయి దర్శన టోకెన్లు ఉంటున్నా.. చాలామంది భక్తుల దరి చేరటం లేదు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. -
హాట్సాఫ్ బామ్మ.. నువ్ చాలా గ్రేట్!
-
Viral Video: హాట్సాఫ్ బామ్మ.. నువ్ చాలా గ్రేట్!
చెన్నై: ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణమంటే ఎవరు కాదంటారు? ఎగిరి గంతేసి ఫ్రీగా చక్కర్లు కొడుతుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. టికెట్ కొనుక్కునే వెళ్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు ఈ వృద్ధురాలు. బస్సులో ఉచితంగా ప్రయాణించనని, తనకు టికెట్ ఇవ్వాలని కండక్టర్‌తో గొడవ పడుతున్న బామ్మ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికార డీఎంకే పార్టీ.. రాష్ట్రంలోని మహిళలు ప్రభుత్వ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. మధుకరాయ్ నుంచి పాలథురాయ్ వెళ్తున్న ఓ బస్సులో వృద్ధురాలు ఎక్కింది. బస్సులో పురుషుల వద్ద టికెట్లు తీసుకుంటున్నాడు కండక్టర్. తనకూ టికెట్ ఇవ్వాలని కండక్టర్ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వబోయింది వృద్ధురాలు. ముందుగా అందుకు నిరాకరించిన కండక్టర్.. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వెళ్లొచ్చని ఆమెకు వివరించే ప్రయత్నం చేశాడు. అయితే.. తాను ఫ్రీగా వెళ్లాలనుకోవట్లేదని, టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక టికెట్‌కు సరిపడ రూ.15 తీసుకుని టికెట్ ఇచ్చాడు. ఇదీ చదవండి: చైనీయులకు 2 రోజుల్లో అమెరికా వీసా.. భారతీయులకు రెండేళ్లు! -
కోడి పుంజుకు టికెట్ కొట్టిన బస్సు కండక్టర్
-
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై ఆధార్ కార్డు డిజిటల్ అయినా ఓకే!
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సాక్షి కార్టూన్ 10-02-2022
చికెన్ బిర్యానీ తినొచ్చావా..! అయితే డబుల్ టికెట్ తీసుకో! -
కోడిపుంజుకు టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆర్టీసీ బస్సులో కోడిపుంజుకు టికెట్.. అదీ ఫుల్ టికెట్ కొట్టిన ఘటన సోషల్ మీడియా ద్వారా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై ఇంటర్నెట్లో సెటైర్లు పేలుతున్నాయి. అలా విషయం తన దాకా రావడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌కు వెళ్తోంది. దారిలో రామగుండం బి పవర్‌హౌస్ వద్ద మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సెక్కాడు. కూడా ఓ కోడిని సంచితో దాచిపెట్టుకుని వెళ్తున్నాడు. బస్సు సుల్తానాబాద్‌కు చేరుకోగానే బస్సు కుదుపులకు పుంజు ఒక్కసారిగా అరిచింది. గమనించిన కండక్టర్ తిరుపతి కోడిపుంజుకు కూడా రూ. 30 టికెట్ తీసుకోవాలని గద్దించాడు. దీంతో చేసేది లేక అలీ టికెట్ తీసుకున్నాడు. ఈ విషయం టికెట్ ద్వారా సామాజిక మాధ్యమాలకు ఎక్కింది. ఇది చూసిన నెటిజన్లు ఆర్టీసీపై దుమ్మెత్తి పోశారు. ఏం జరిగిందంటే.. ఈ ఘటనలో ఏం జరిగిందో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సుల్లో పశుపక్ష్యాదులకు అనుమతి లేదు. సుల్తాన్‌బాద్ దగ్గర కోడిపుంజును గుర్తించాక కండక్టర్ ఆ ప్రయాణికుడ్ని ప్రశ్నించాడు. అయితే అదే బస్సులో ఉన్న శ్రీ కుమార్ అనే ఓ న్యూస్ రిపోర్టర్.. కండక్టర్‌ను టికెట్ కొట్టమని వుసిగొల్పాడట. హాట్ న్యూస్ కోసం ఆ రిపోర్టర్ అలా ప్రోత్సహించగా.. కండక్టర్ ఆ ప్రభావంతో కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. కండక్టర్ ఆ రిపోర్టర్ చెప్పినట్లు.. అలా ప్రవర్తించాల్సింది కాదు. కండక్టర్ మీద చర్యలు తీసుకుంటాం అని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఘటనపై స్పందించిన డిపో మేనేజర్ వెంకటేశం చర్యలకు ఆదేశించినట్లు ప్రకటించగా.. ట్విటర్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. pic.twitter.com/kVdLhLzy86 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 9, 2022 సంబంధిత వార్త: పదేళ్లు కూడా బతకని కోడికి ఫుల్ టికెట్?? -
వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 భయంతో ప్రయాణాలు అంటేనే జంకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ‘వ్యాక్సినేటెడ్ బస్’ సర్వీసులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 600 ప్రధాన మార్గాల్లో ఈ సేవలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ఈ బస్‌లలో ప్రయాణిస్తారు. సిబ్బంది, ప్రయాణికులకు కనీసం ఒక డోస్ అయినా అందుకోవాల్సి ఉంటుంది. బస్ ఎక్కే సమయంలో తప్పనిసరిగా రుజువు చూపించాల్సిందే. కస్టమర్ల రేటింగ్ నాలుగు స్టార్స్ కంటే ఎక్కువగా పొందిన బస్ ఆపరేటర్ల సహకారంతో వ్యాక్సినేటెడ్ బస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. సిబ్బంది, తోటి ప్రయాణికులు కనీసం ఒక డోస్ అయినా తీసుకుంటే వారితో ప్రయాణించేందుకు తాము సిద్ధమని 89 శాతం మంది తమ సర్వేలో వెల్లడించారని రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం తెలిపారు. స్పందననుబట్టి ఇతర మార్గాల్లోనూ ఈ సేవలను పరిచయం చేస్తామన్నారు. -
ఐఆర్సీటీసీలో బస్ టికెట్ల బుకింగ్
ముంబై: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో ఇక నుంచి బస్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్లైన్ ఈ-టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ అభిబస్, ఐఆర్సీటీసీ మధ్య ఒప్పందం జరిగింది. దీంతో ఐఆర్సీటీసీ కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా అభిబస్లోని వివిధ మార్గాలలో ఎసీ, నాన్-ఏసీ టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కస్టమర్లు రైల్ టికెట్ బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే.. వెంటనే వారికి అదే గమ్యస్థానంలో బస్ మార్గాల లభ్యతను సూచిస్తుందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు లేని టికెట్ బుకింగ్ సేవలను అందుకోవచ్చని తెలిపింది. ప్రతి రోజు ఐఆర్సీటీసీ 9లక్షల ట్రెయిన్ టికెట్లను విక్రయిస్తుండగా.. అభిబస్.కామ్, యాప్‌ల ద్వారా 30 వేల బుకింగ్స్‌ను అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 45 మిలియన్ యూజర్లు అభిబస్ సేవలను వినియోగించు కున్నారని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శశాంక కూనా తెలిపారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు! -
ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించడానికి 48 గంటల ముందు టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్ జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈ రాయితీ సౌకర్యం విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. మాట్లాడుతున్న జితేంద్రనాథ్‌రెడ్డి రాయితీ పొందేందుకు 48 గంటల ముందు రిజర్వు చేసుకోవాలని తెలిపారు. తొలి నాలుగైదు సీట్లకు మాత్రమే రాయితీ ఉంటుందని తెలిపారు. డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, అమరావతి బస్సులో 49 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, ఇంద్ర బస్సులో 40 సీట్లు ఉంటే నలుగురు, సూపర్ లగ్జరీలో 35 సీట్లకుగాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకుగాను నలుగురు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 49 సీట్లు ఉంటే ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశం మార్చి 31వ తేది వరకు అమలులో ఉంటుందని ఆయన వివరించారు. చదవండి: తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు -
తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు
సాక్షి, అమరావతి: తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకునే భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. గతేడాది కోవిడ్‌కు ముందు ఉన్న ఈ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి తిరుపతికి వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిత్యం వెయ్యి శీఘ్రదర్శన టికెట్లను అందుబాటులో ఉంచేలా టీటీడీ అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు చార్జీలతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు. రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు పొందే ప్రయాణికులకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారికి ఆర్టీసీ సూపర్వైజర్లు సహాయం చేస్తారు. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ టికెట్లు పొందే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి 650 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 650 బస్సుల్ని తిరుపతికి నడుపుతోంది. ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బెంగళూరు, చెన్నై, కంచి, నెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు అడ్వాన్స్డ్ రిజర్వేషన్‌తో పాటు శీఘ్రదర్శన టికెట్లు పొందవచ్చు. తొలి రోజు ప్రారంభించిన ఈ శీఘ్రదర్శన టికెట్ల సౌకర్యాన్ని 550 మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. ఈ సౌకర్యాన్ని కల్పించడంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డిలకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
టికెట్ల బాధ్యత ప్రయాణికులదే
సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడో ఒక చోట విజిలెన్స్ సిబ్బంది మాటు వేసి ఉంటారు. ఆ మార్గంలో వెళ్లే బస్సును ఆకస్మాత్తుగా నిలిపేస్తారు. అంతే ఇక కండక్టర్‌కు ముచ్చెమటలు పట్టేస్తాయి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటారు. ఆ క్షణం లో ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియ ని ఆందోళన, ఏ ఒక్క ప్రయాణికుడు టిక్కెట్ తీసుకోకపోయినా అందుకు బాధ్యత వహించవలసిన దుస్థితి. ఇదంతా నిన్నటి సంగతి. ఇప్పుడు కండక్టర్లకు ఆ భయం లేదు. నిశ్చింత గా, నిర్భయంగా విధులు నిర్వహించవచ్చు. టిక్కెట్ తీసుకోవలసిన బాధ్యత ఇక పూర్తిగా ప్రయాణికుడిదే. ఈమేరకు ఆర్టీసీ సైతం విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. ఇటీవల కార్మికులు చేపట్టిన సుదీర్ఘమైన సమ్మెలోనూ టిక్కెట్ తీసుకోవలసినబాధ్యత ప్రయాణికులదేనని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపైన సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కండక్టర్లకు ఉద్యోగభద్రతను కల్పిస్తూ టిక్కెట్ల బాధ్యతను ప్రయాణికులపైనే మోపింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 178 ప్రకారం ప్రయాణికులు తప్పనిసరిగా టిక్కెట్తీసుకొని ప్రయాణం చేయాలని, టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంటూ ఆర్టీసీ ముమ్మర ప్రచారం చేపట్టింది. కొత్త ఏడాది నగరంలోని అన్ని అలైటింగ్ పాయింట్ వద్ద తనిఖీలను ఉధృతం చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితం... నిజానికి టిక్కెట్ల అంశం కండక్టర్లకు కత్తిమీద సాములా మారింది. వివిధ రూట్లలో అత్యధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందజేస్తూనే టిక్కెట్లపైన వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి తక్కువగా ఉన్నా కఠిన చర్యలు తీసుకోవడం వేలాది మంది కండక్టర్ల ఉద్యోగభద్రతకు ముప్పుగా పరిణమించింది. అలా ఎంతోమందిపైన సస్పెన్షన్ వేటు పడింది. ఉద్యోగాలకు దూరమై ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్లు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో సుమారు 8 వేల మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఒక బస్టాపులో ఎక్కి ఆ తరువాత బస్టాలోనే దిగే ప్రయాణికులు, ఒకటి,రెండు బస్టాపులకు టిక్కెట్ తీసుకొకుండా తప్పించుకొనేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఈ క్రమంలో విజిలెన్స్ తనిఖీల కారణంగా కండక్టర్లు మూల్యం చెల్లించవలసి వచ్చేది. నగరంలోని 29 డిపోల పరిధిలో ఎక్కడో ఒక చోట కండక్టర్లపైన వేటు పడడం పరిపాటిగా మారింది. మరోవైపు తాము టిక్కెట్ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కండక్టర్లు తమ వద్దకు రాకుండానే ఉండిపోయారని తరచుగా ప్రయాణికులు బుకాయించేవారు. గతంలో పావలా పైసల టిక్కెట్ తీసుకోకపోయినా కండక్టర్లే మూల్యం చెల్లించవలసి వచ్చేది. ఇలాంటి పరిణామాల బారి నుంచి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని టిక్కెట్ బాధ్యతను ప్రయాణికులపైన మోపడంతో ఆర్టీసీ కండక్టర్లకు ఊరట లభించినట్లయింది. బస్టాపుల్లోనే తనిఖీలు మరోవైపు ఇక నుంచి బస్టాపుల్లోనే తనిఖీలను నిర్వహిస్తారు. రోడ్లపైన బస్సులను నిలిపేసి మార్గమధ్యలో తనిఖీలు చేయడం వల్ల ప్రయాణికులు తమ సమయాన్ని తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. అప్పటికే బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాసిన వాళ్లు మరో గంట పాటు టిక్కెట్ల తనిఖీల కోసం నిరీక్షించవలసి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు బస్సు దిగే బస్టాపుల్లో మాత్రమే విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. లాస్ట్ బస్టాపుల్లో బస్సులు ఆగిన తరువాత రెండు వైపులా ఫుట్‌బోర్డుపైన నించొని తనిఖీలు చేస్తారు. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే ఈ పద్ధతి అమల్లో ఉంది, త్వరలో పూర్తిస్థాయిలో ఆన్‌రోడ్ తనిఖీలకు స్వస్తి చెప్పాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. -
టికెట్ లేకుంటే రూ.500 జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి గరిష్టంగా రూ.500 జరిమానా విధించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గతంలో బస్సుల్లో టికెట్లేని ప్ర యాణికులు దొరికితే కండక్టర్లపై కూడా బాధ్యతారాహిత్యం పేరుతో క్రమశిక్షణ చర్యలు తీసుకునేవారు. ఇది తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉం దని, దాన్ని తొలగించాలని చాలా కాలంగా కండక్టర్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు టికెట్ లేకుంటే పూర్తి బాధ్యత ప్రయాణికులపైనే ఉండనుంది. అయితే డబ్బులు వసూలు చేసి టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో మాత్రం కండక్టర్లను బా ధ్యులను చేయనున్నారు. -
అన్యమత ప్రకటనలపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, తిరుమల: ఆర్టీసీ బస్ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనలు ముద్రించడం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను గత మార్చిలో ముద్రించిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ఈ ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. కాగా, ఈ ప్రకటనలను కొనసాగించిన అధికారుల పై ప్రభుత్వం వేటు వేసింది. దీనికి సంబంధించి నెల్లూరు జోనల్ స్టోర్స్ కంట్రోలర్ జగదీష్‌బాబును సస్పెండ్ చేసింది. -
కోళ్లకు టికెట్ లేదా.. అయితే ఫైన్ కట్టు !
బొమ్మనహళ్లి : కోళ్లకు టికెట్ తీసుకోలేదని జరిమానా విధించిన ఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం ఉదయం ఓ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని కోడు నుంచి మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. నిజాయితీగా టికెట్ తీసుకున్నాడు. ఇంతలో కొంత దూరం ప్రయాణం అనంతరం తనిఖీ బృందం వచ్చి టికెట్లు తనిఖీ చేస్తుండగా కోళ్లకు టికెట్ తీసుకోలేదని గుర్తించి సదరు ప్రయాణికుడికి రూ. 500 జరిమానా విధించారు. కేఎస్ఆర్టీసీలో ప్రాణులు, ఇతర పక్షులను తీసుకువెళ్లే సమయంలో తప్పకుండా అర టికెట్ తీసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో విషయం తెలియని వ్యక్తి జరిమానా కట్టి కోళను వెంట తెచ్చుకున్నాడు. -
బస్సులో కోడికీ టికెట్!
గౌరిబిదనూరు: బస్సు లో ప్రయాణించాలనుకునే వారు టికెట్ కొనక తప్పదు. మరి కోళ్లు కూడా టికెట్ తీసుకోవాలా? అంటే అవుననే కర్ణాటక అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఆదివారం బెంగళూరు సమీపంలో గౌరిబిదనూరు తాలూకా ముదలోడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన రెండు కోళ్లను తీసుకుని కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కాడు. బస్‌కండక్టర్ అతనికి రూ.24 టికెట్, రెండు కోళ్లకు రెండు హాఫ్ టికెట్లు ఇచ్చాడు. ఆ టికెట్లపై పిల్లలకు అని రాసి ఇచ్చాడు. కానీ ప్రయాణికుడు.. పిల్లలకని ఎందుకు, కోళ్లకు అనే రాసివ్వు అని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. కోళ్లు, గువ్వలు, చిలుకలకు అర టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా స్పష్టం చేయడం గమనార్హం. -
ఆర్టీసీ బస్సులో పేలిన టికెటింగ్ మెషిన్
సాక్షి, లక్నో : ఓ ఆర్టీసీ బస్సులో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్(ఈటీఎమ్) పేలిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో యూపీ ఆర్టీసీ కండక్టర్ నేత్రాపాల్ తీవ్రంగా గాయపడ్డారు. అతని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఈటీఎమ్ పేలడానికి గల కారణాలు తెలియరాలేదని, బస్సులో ప్రయాణీకులున్నప్పటికీ కండక్టర్‌కు మాత్రమే గాయలైనట్లు పోలీసులు తెలిపారు. ఈటీఎమ్ మాత్రం పూర్తిగా ధ్వంసమైందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.