
ముంబై: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)లో ఇక నుంచి బస్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్ ఈ-టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ అభిబస్, ఐఆర్‌సీటీసీ మధ్య ఒప్పందం జరిగింది. దీంతో ఐఆర్‌సీటీసీ కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా అభిబస్‌లోని వివిధ మార్గాలలో ఎసీ, నాన్-ఏసీ టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కస్టమర్లు రైల్ టికెట్ బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే.. వెంటనే వారికి అదే గమ్యస్థానంలో బస్ మార్గాల లభ్యతను సూచిస్తుందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు లేని టికెట్ బుకింగ్ సేవలను అందుకోవచ్చని తెలిపింది. ప్రతి రోజు ఐఆర్‌సీటీసీ 9లక్షల ట్రెయిన్ టికెట్లను విక్రయిస్తుండగా.. అభిబస్.కామ్, యాప్‌ల ద్వారా 30 వేల బుకింగ్స్‌ను అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 45 మిలియన్ యూజర్లు అభిబస్ సేవలను వినియోగించు కున్నారని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శశాంక కూనా తెలిపారు.
చదవండి: