సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి గరిష్టంగా రూ.500 జరిమానా విధించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గతంలో బస్సుల్లో టికెట్‌లేని ప్ర యాణికులు దొరికితే కండక్టర్లపై కూడా బాధ్యతారాహిత్యం పేరుతో క్రమశిక్షణ చర్యలు తీసుకునేవారు. ఇది తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉం దని, దాన్ని తొలగించాలని చాలా కాలంగా కండక్టర్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు టికెట్ లేకుంటే పూర్తి బాధ్యత ప్రయాణికులపైనే ఉండనుంది. అయితే డబ్బులు వసూలు చేసి టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో మాత్రం కండక్టర్లను బా ధ్యులను చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment