rtc bus
-
కదులుతున్న బస్సు.. కిటికీలో కాళ్లు
గుత్తి రూరల్: పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వ్యక్తి.. బస్సు కదిలాక కిటికీలో నుంచి కాళ్లు బయటకు పెట్టి దర్జాగా నిద్రపోయాడు. ఆదివారం సాయంత్రం గుత్తి నుంచి అనంతపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఖరి సీటులో కూర్చున్న మందుబాబు బస్సు కిటికీలో నుంచి తన రెండు కాళ్లు బయటకు పెట్టి నిద్రించి ప్రయాణించాడు. ఈ విషయాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలైంది. దీనిపై పలువురు నెటిజన్లు సెటైర్లు పేల్చారు. ‘మీకు పూర్తిగా కిక్ ఇస్తా, కంపెనీలతో మాట్లాడి నాణ్యమైన మద్యం అందిస్తా’ అంటూ గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఓ వ్యక్తి గుర్తు చేశారు. ‘కూటమి ప్రభుత్వానికి విద్య, వైద్యం మీద శ్రద్ధ లేదనడానికి ఉదాహరణ ఇది’ అంటూ ఒకరు.. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో మద్యం దొరుకుతోంది. నేడు ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఊరూరా బెల్టు దుకాణాల్లో మద్యం మాత్రం దొరుకుతోంది. చంద్రబాబు చెబుతున్న మంచి ప్రభుత్వం అంటే ఇదే’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. -
ప్రయాణం ఫ్రీనే.. బస్సే లేదు
సిరిసిల్ల: అది రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం.. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారులోని పెద్దమ్మ స్టేజీ.. అక్కడి నుంచి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర అడవి తప్ప ఒక్క ఊరు ఉండదు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో రెండు రోజుల క్రితం పాతిక మంది ప్రయాణికులు... అందులోనూ మహిళలు బస్సు(bus) కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. వీరంతా దమ్మన్నపేట, నాగంపేట, ముచ్చర్ల, సమీపంలోని గిరిజన తండాలకు చెందిన వారు. పెద్దమ్మ స్టేజీ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. మూడున్నర గంటల వరకూ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఎండలో గొంతులెండి అలమటించారు. ఒక్క బస్సు కూడా రాకపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కొందరైతే ప్రయాణం మానుకుని వెనుదిరిగారు. ఉచిత ప్రయాణం అనుకుంటే ఉన్న బస్సులు కూడా రావటంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఆర్డీనరీ బస్సుల బాట: కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి నిడివి 98 కిలోమీటర్లు. ఆర్డినరీ బస్సులు తప్ప ఒక్క ఎక్స్‌ప్రెస్ కూడా ఈ మార్గంలో లేవు. ఈ మార్గంలో సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ పుణ్యక్షేత్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, గంభీరావుపేట మండలాలు, అనేక గ్రామాలున్నాయి. అయినా ఆర్టీసీ అధికారులు అరకొరగా ఆర్డినరీ బస్సులతో నెట్టుకొస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆ రూట్ మా పరిధిలో లేదుఆ రూట్ మా పరిధిలో లేదు. కామారెడ్డి–కరీంనగర్ రూట్‌ను కరీంనగర్–1, కామారెడ్డి డిపోలు పర్యవేక్షిస్తాయి. బస్సులు రాకపోవడం, లేకపోవడంపై నాకు సమాచారం లేదు. ఆ రెండు డిపోల అధికారులను సంప్రదిస్తే కారణాలు తెలుస్తాయి. – ప్రకాశ్‌రావు, సిరిసిల్ల డిపో మేనేజర్. Ration Cards: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు -
‘ప్రైవేటు’ చేతికి ఆర్టీసీ డిపోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పెద్ద ఆర్టీసీ డిపోలు ప్రైవేటు సంస్థ పరిధిలోకి వెళ్లిపోతున్నాయి. అద్దె బస్సుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు కోతపడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆర్టీసీ ఉద్యోగులలో కలకలం రేపుతున్నాయి. ఇది ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడమేమీ కాకపోయినా.. ప్రైవేటీకరణకు దారితీసినట్టేననే ఆందోళనకు దారితీస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంలో భాగంగా.. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించటం, డీజిల్ భారాన్ని తగ్గించుకోవటం లక్ష్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటోంది. క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒలెక్ట్రా సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ నుంచి తీసుకుంటోంది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నరపైనే కావడంతో వాటిని కొనటం తలకుమించిన వ్యవహారమని భావిస్తున్న ఆర్టీసీ.. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో వాటిని అద్దెకు తీసుకుంటోంది. ఆ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి సమకూరిస్తే.. ఈ బస్సులు తిరిగిన దూరం ఆధారంగా కిలోమీటరుకు ఇంత అని నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ అద్దెగా చెల్లిస్తుంది. బస్సు నిర్వహణ, డ్రైవరు, మెకానిక్ సిబ్బందిని ఆ ప్రైవేటు సంస్థనే సమకూర్చుకుంటుంది. కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ తరఫున ఉంటారు. ఇలా జేబీఎం సంస్థ 500 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తుంది. అందులో ఇప్పటికే దాదాపు 150 బస్సులను సరఫరా చేసింది. మిగతావి విడతలవారీగా రానున్నాయి. ఈ బస్సులను ప్రస్తుతానికి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాలకు కేటాయించారు. త్వరలో హైదరాబాద్‌లోని ఓ డిపోకు అందనున్నాయి. తర్వాత నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాలకు కూడా సమకూర్చుతారు. ఇంతకాలం ఎలక్ట్రిక్ బస్సులు అనగానే ఏసీ బస్సులే ఉండేవి. ఇప్పుడీ సంస్థ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తోంది. వాటిని సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్, ఎక్స్‌ప్రెస్ కేటగిరీల్లో తిప్పుతున్నారు. ఈ బస్సుల కోసం డిపోలనే అప్పగిస్తూ.. అయితే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్ డిపోలను సదరు జేబీఎం సంస్థకే అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్–2 డిపోకు 75 ఎలక్ట్రిక్ బస్సులు అందాయి. మరో 40 బస్సులు రానున్నాయి. హైదరాబాద్‌లోని హైదరాబాద్–1 డిపోకు 75 బస్సులు సమకూరనున్నాయి. ఈ రెండు డిపోల నుంచి ఆర్టీసీ సొంత బస్సులను ఇతర డిపోలకు మార్చేసి... ఆ రెండు డిపోలను పూర్తిగా జేబీఎం సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వరంగల్ డిపో నుంచి సొంత బస్సులను ఇతర డిపోలకు తరలించేశారు. హైదరాబాద్–1 డిపో బస్సులను హైదరాబాద్–3 డిపోకు బదిలీ చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరిగితే వాటిని.. భవిష్యత్తులో మిగతా బస్సులు సరఫరా అయ్యాక ఆయా డిపోలను కూడా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారన్న ప్రచారం ఆర్టీసీ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. సిబ్బందిని కూడా తరలించేస్తూ... ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకిస్తున్న సంస్థ ఆ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు, వాటి మరమ్మతులు చేపట్టేందుకు మెకానిక్ సిబ్బందిని సొంతంగానే సమకూర్చుకుంటుంది. ఆ డిపోల్లో ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది అవసరం ఉండదు. వీరి వ్యవహారాలు చూసే డిపో అధికారులకూ పని ఉండదు. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ పక్షాన పనిచేస్తారు. కేవలం వీరి వ్యవహారాలు చూసేందుకు ఒకరిద్దరు ఆర్టీసీ సిబ్బంది, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మాత్రమే డిపోలలో ఉంటారు. డిపోలో కార్యకలాపాలన్నీ ప్రైవేటు సంస్థ అధీనంలోనే నడుస్తాయి. బస్సుల చార్జింగ్ కోసం ఆ సంస్థనే చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంటుంది. విద్యుత్ సరఫరా వ్యవస్థను మాత్రం ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది.ఇకపై నియామకాలు లేనట్టే! ప్రస్తుతం ఆరీ్టసీలో దాదాపు 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం గతంలో ప్రక్రియ ప్రారంభించినా నిలిచిపోయింది. అయితే ఆర్టీసీలోకి అద్దె బస్సులు భారీగా వస్తుండటం, వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థల సిబ్బందే ఉంటుండటంతో... ఆర్టీసీలో ఇకపై నియామకాలు ఉండకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ప్రైవేటీకరణకు దారితీసినట్టేనని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు.హైదరాబాద్‌లో డిపోలన్నీ ప్రైవేటు చేతికే!హైదరాబాద్ నగరంలో తిప్పుతున్న ఆర్టీసీ డీజిల్ బస్సులను వెలుపలికి తరలించి.. వాటి స్థానంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద కేంద్రానికి దరఖాస్తు చేసింది. ఆ బస్సులను కూడా జీసీసీ పద్ధతిలోనే నడుపుతారు. అంటే ఆ బస్సులు చేరే డిపోలన్నీ ప్రైవేటు సంస్థ అ«దీనంలోకి వెళతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని డిపోలు ప్రైవేటు నిర్వహణలోకి చేరుతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.వేల మంది డ్రైవర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం!హైదరాబాద్‌లో మొత్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుండటం, అవి అద్దె బస్సులు కానుండటంతో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 6,000 మంది ఆర్టీసీ డ్రైవర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. నగరంలో డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన కొద్దీ.. ఆర్టీసీ సొంత బస్సులతోపాటు డ్రైవర్లను కూడా ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల అవసరానికి మించి డ్రైవర్లు ఉంటే.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) దిశగా ఒత్తిడి చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్య రహిత, పర్యావరణహిత ప్రజారవాణా సదుపాయం ఆహా్వనించదగ్గదే అయినా.. ఆర్టీసీ సిబ్బంది భవిష్యత్తును దెబ్బతీయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వస్తోంది. ‘‘ప్రైవేట్ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీని సృష్టించుకోవడం కోసం ఆర్టీసీలను బలితీసుకుంటున్నాయి. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టదాయకం’’అని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సులో విషాదం
-
తిరుపతి: ఆర్టీసీ బస్సులో విషాదం
సాక్షి, తిరుపతి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందాడు. శ్రీకాళహస్తి-తిరుపతి మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ తెల్లవారు జామున ఘటన జరిగింది.బస్సులో వెనుక సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు రేణిగుంట వద్ద కండక్టర్ గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన యువకుడి వివరాలు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. -
50 కోట్లకు చేరిన ఉచిత బస్సు ప్రయాణ మహిళల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 50 కోట్లకు చేరింది. గృహిణులు సహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు తదితర రంగాల్లో పని చేసే చిరుద్యోగినులు, ఐటీ కారిడార్లలో పని చేసే హౌస్‌కీపింగ్ సిబ్బంది వంటి వివిధ కేటగిరీలకు చెందిన మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకుంటున్నారు. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆరీ్టసీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీని రెట్టింపు చేశారు. ఉచిత ప్రయాణ సదుపాయం వల్ల మహిళా ప్రయాణికులకు ఇప్పటివరకు రూ.1,152 కోట్లు ఆదా అయింది. అదే సమయంలో ‘జీరో’ టికెట్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో ఆరీ్టసీకి ఆదాయం పెరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ‘మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో 45 శాతం మహిళలు, 55 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. ఈ పథకం అమల్లోకి వచి్చనప్పటి నుంచి 70 శాతానికి పైగా మహిళలు, 30 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ అదరహో.. ప్రస్తుతం గ్రేటర్‌లోని 25 డిపోల పరిధిలో సుమారు 2,500 బస్సులు ప్రతి రోజు 7.67 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజుకు 21.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 14.70 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. 6.80 లక్షల మంది మాత్రమే మగవారు ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 65 నుంచి 70 శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 105 శాతానికి పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలే ఎక్కువగా ప్రయాణం చేస్తుండగా మగవారు మెట్రోడీలక్స్, ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. మెట్రో పాస్‌లపై రాకపోకలు సాగించిన విద్యారి్థనులు సైతం ఉచిత పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో 1.30 లక్షల బస్సు పాస్‌ల సంఖ్య 60 వేలకు తగ్గినట్లు అధికారులు చెప్పారు. అలాగే మహిళలు, ఎన్జీఓల పాస్‌లు కూడా సుమారు లక్ష వరకు తగ్గాయి. మెట్రోపై ప్రభావం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో గ్రేటర్లో ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. నిర్మాణ రంగానికి చెందిన కూలీలు, చిరుద్యోగులు, శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేవారు ఆటోలను ఎక్కువగా వినియోగించేవారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులంతా ఆర్టీసీ వైపు మళ్లారు. అలాగే మెట్రో ల్లోనూ ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రతిరోజూ 4.8 లక్షల మంది వరకు మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్పి ప్రవేశపెట్టిన తర్వాత కనీసం 10 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించినట్లు మెట్రో అధికారుల అంచనా. మొత్తంగా ఇతర రవాణా సదుపాయాల నుంచి సుమారు 6 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు. చిరుద్యోగులకు భరోసా... వస్త్ర దుకాణాలు షాపింగ్‌మాళ్లు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు, ఐటీ సంస్థలు తదితర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు ఆర్థికంగా ఈ పథకం భరోసా ఇచ్చింది. ప్రతినెలా సుమారు రూ.3500 వరకు చార్జీల రూపంలో చెల్లించే మహిళలు ఇప్పుడు ఆ డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ‘ఇంటి కిరాయిలు, కూరగాయల ధరలు, నిత్యావసరవ వస్తువుల ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం తగ్గడం కొద్దిగా ఊరటే కదా’ అని అశోక్‌నగర్‌కు చెందిన సునీత అనే ప్రయాణికురాలు అభిప్రాయపడ్డారు. -
నేను డ్రైవరన్నను..!
ఖమ్మంమయూరిసెంటర్: మహాలక్ష్మి పథకం అమలుతో పలు సమయాల్లో రద్దీ దృష్ట్యా ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కొందరు నిర్దేశిత ప్రాంతాల్లో ఆపడం లేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అక్కడకక్కడా ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఈ డ్రైవర్ మాత్రం అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికురాలి బిడ్డను లాలించి అభిమానం చూరగొన్నాడు. అంతేకాక అధికారుల నుంచి సన్మానం అందుకున్నాడు. వివరాలు.. ఇటీవల మణుగూరు నుండి హైదరాబాద్‌కు చంటి బిడ్డతో ఓ మహిళ బస్సులో వెళ్తోంది. ఆమె మార్గ మధ్యలోని ఓ బస్టాండ్‌లో వ్యక్తిగత అవసరాలపై దిగాల్సి రాగా వెంట ఎవరూ లేకపోవడంతో బిడ్డను ఎవరికి అప్పగించాలో తెలియక సందిగ్ధత ఎదుర్కొంది. చివరకు బస్సు డ్రైవర్ పి.మల్లయ్యను ఆశ్రయించగా ఆయన చంటి బిడ్డను ఎత్తుకుని ఆమె వెళ్లి వచ్చే వరకు లాలించాడు. ఈ విషయం తెలియడంతో ఆర్టీసీ ఆర్ఎం ఏ.సరిరామ్ సోమవారం మల్ల య్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భవాని ప్రసాద్, జీఎన్ పవిత్ర, పర్సనల్ ఆఫీసర్ ఎ.నారాయణ పాల్గొన్నారు. -
Hyderabad: నడిరోడ్డుపై హంగామా
చార్మినార్ : చార్మినార్ ఆర్టీసి బస్టాప్ రోడ్డులో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆదివారం సాయంత్రం హంగామా చేశారు. గంజాయి మత్తులో కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎవరు.. ఎవరిని.. ఎందుకు.. కొడుతున్నారో వారికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొంత మంది వాహన దారులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో వారిని సైతం నెట్టివేస్తు దుర్భాషలాడారు. కనిపించని పోలీసులు... ఇంత జరుగుతున్నా...సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలో రాకపోవడం గమనార్హం. అసలే వీకెండ్ అయిన ఆదివారం కావడంతో సహజంగానే సాధారణ రోజుల కన్నా..ఆదివారం సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. గతంలో తొలగించిన చారి్మనార్ ఆర్టీసి బస్టాండ్ భవనం ఎదురుగా ఉన్న ప్యారిస్ కేఫ్ రోడ్డులో ఈ గలాటా జరిగింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం విధినిర్వాహణలో కనిపించ లేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చారి్మనార్, హుస్సేనీఆలం, మొఘల్‌పురా లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ల సరిహద్దులో జరిగింది. అయితే సంఘటన జరిగిన ప్రదేశం మొఘల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
క్యూలైన్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఇదే క్రమాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు. అక్కడ అందరితోపాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. వార్డుమెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.చదవండి: హీరో ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ వద్దు -
పెళ్లి ఇంట విషాదం
జగిత్యాల: ఆర్టీసీ బస్సు కారు ను ఢీకొన్న సంఘటనలో నవవధువు సోదరుడు, ఆమె స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన వలిపిరెడ్డి రాజమల్లు, లక్ష్మి కూతురు సంఘవి పెళ్లి ఈనెల 8న జనగామకు చెందిన ఓ యువకుడితో హన్మకొండలో జరిగింది.శనివారం రాత్రి రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న సంఘవి సోదరుడు సంకీర్తన్ (30), హైదరా బాద్‌లో సంఘవితో కలిసి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన సాధు మునిరాజీ (25)తోపాటు తల్లి లక్ష్మి, తండ్రి రాజమల్లు కారులో జగిత్యాలకు వస్తున్నారు. ధరూర్ సమీపంలోకి రాగానే జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వీరి కారును ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సంకీర్తన్తోపాటు మునిరాజీ అక్కడికక్కడే చనిపోయారు. లక్ష్మి, రాజమల్లు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.రూరల్ సీఐ వై.కృష్ణారెడ్డి, ఎస్సై సుధాకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంకీర్తన్ మేనమామ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. పెళ్లైన రెండురోజులకే సోదరుడితో పాటు స్నేహితురాలు మృతి చెందడంతో సంఘవి తీవ్రంగా రోదించింది. గాయాలతోనే ఉన్న తండ్రి రాజమల్లు సంకీర్తన్ చితికి నిప్పంటించడం స్థానికులను కలచివేసింది. -
కాళ్ల పారాణి ఆరకముందే.. వధువు కుటుంబంలో విషాదం
సాక్షి, జగిత్యాల జిల్లా: పచ్చని పందిళ్లు..మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వధువు తల్లిదండ్రులు చావు బతుకులు మద్య కొట్టుమిట్టాడుతుంటే అన్న , అతని స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. వధువు వివాహం జరిగిన గంటల వ్యవధిలో ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయిజగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండలో రిసెప్షన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వధువు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అన్న సంకీర్త్, స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి,దండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్
సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే -
కండక్టర్‌కు కత్తిపోట్లు..బస్సులో ప్రయాణికుడి బీభత్సం
బెంగళూరు: నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు. కత్తి దాడిలో కండక్టర్ యోగేష్(45)కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కత్తిదాడికి పాల్పడ్డ యువకుడిని జార్ఖండ్‌కు చెందిన హరీశ్సిన్హా(28)గా గుర్తించారు. ఇతడు కాల్సెంటర్లో పనిచేస్తూ గత నెలలో ఉద్యోగం కోల్పోయాడు. మంగళవారం(అక్టోబర్1) జరిగిన ఈ ఘటనకు సంబంధించి హరీశ్సిన్హాపై వైట్‌ఫీల్డ్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Stabbing inside BMTC Bus Shocks #BengaluruBPO employee who was fired from his job, stabs a conductor inside BMTC bus near ITPL Whitefield Conductor Yogesh reportedly asked the accused not to stand near the door, in a fit of rage the accused stabbed the conductor multiple… pic.twitter.com/AhwqUoAYPZ— Nabila Jamal (@nabilajamal_) October 2, 2024 ఇదీ చదవండి: పుణెలో కుప్పకూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి -
వీడెవండీ బాబు... తాగిన మత్తులో ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు
నిర్మల్‌లో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సు చోరీకి ప్రయత్నించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వెనుక నుంచి ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖిని చెందిన గణేశ్.. లోపలికి చొరబడ్డాడు. డిపోలో నిలిపి ఉంచిన ఏపీ 01జెడ్ 0076 బస్సు ఎక్కి స్టార్ట్ చేశాడు. గేట్ బయటి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాడు. బస్సు వివరాలు బుక్‌లో ఎంటర్ చేయకపోవడంతో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వంశీకి అనుమానం కలిగింది. వెంటనే అక్కడున్న బైక్ తీసుకుని బస్సును వెంబడించాడు. పట్టణ శివారులోని సోఫీనగర్ వద్ద స్థానికుల సహాయంతో బస్సును అడ్డుకున్నాడు. దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని బస్సును డిపోకు తరలించారు. బస్సు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గణేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
చిన్నారికి జీవితకాలం ఉచిత బస్సు పాస్
గద్వాల క్రైం: గద్వాల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి స్టాఫ్‌నర్సు సహాయంతో కండక్టర్ సుఖ ప్రసవం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం, ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న ఈ చిన్నారికి జీవితకాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. గద్వాల మండలంలోని కొండపల్లికి చెందిన గర్భిణి సంధ్య సోమవారం రాఖీ పండుగ కోసం ఆర్టీసీ బస్సులో వనపర్తికి వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో మార్గమధ్యలోనే కండక్టర్ భారతి స్టాఫ్‌నర్సు అలివేలు సహాయంతో సుఖ ప్రసవం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్లో కండక్టర్ భారతి, స్టాఫ్‌నర్సు అలివేలు, బస్సు డ్రైవర్ అంజిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళకు ప్రసవం చేసేందుకు సహకరించిన స్టాఫ్‌నర్సు అలివేలుకు ఏడాదిపాటు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, సిబ్బంది మునిశేఖర్, కృష్ణకాంత్, శ్రీదేవి, జ్యోతి, గద్వాల డిపో మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
TG: ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాల ఫ్రీ పాస్
సాక్షి,హైదరాబాద్: రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ఈ చిన్నారికి ఉచిత బస్‌పాస్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.ప్రసవం చేసిన స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాదిపాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం (ఆగస్టు20) ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణీకి పురుటినొప్పులు రావడంతో కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతోపాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. -
ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న మహిళ
-
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. నడిరోడ్డుపై టైర్లు ఊడిపోయి..
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.కాగా, జగిత్యాల నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు ప్రమాదానికి గురైంది. అయితే, బస్సులో దాదాపు 150 మంది ప్రయాణీకులు ఎక్కారు. దీంతో, బస్సు కొంత దూరం వెళ్లగానే అధిక లోడ్ కారణంగా టైర్లు ఊడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన పరిణామంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బస్సును నిలిపాడు.మరోవైపు.. ఈ ప్రమాదం కారణంగా ఊడిపోయిన బస్సు వెనుక భాగంలోని రెండు చక్రాలు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాయి. కాగా, ఈ ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, వరుస సెలవుల కారణంగా ప్రయాణీకులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. -
Habsiguda: బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో.. విద్యార్ధి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు వెనుక నుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు అందులోని ఓ విద్యార్ధికి ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.అయితే వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దాంతో.. అదుపుతప్పిన ఆటో బస్సు వెనకాల నుంచి ఢీకొట్టి దాని కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీశారు. తీవ్రగాయాల పాలైన విద్యార్థినిని, ఆటో డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ పదో తరగతి విద్యార్థిని సాత్విక(15) మృతిచెందింది. తార్నాకకు చెందిన సాత్విక హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆటో డ్రైవర్ ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Student Dies in Uppal-Habsiguda Road AccidentA tenth class student died when a speeding truck hit the auto- rickshaw at Uppal in Secunderabad. The impact was big that the auto-rickshaw rammed into a RTC bus infront of it. Auto driver was also injured and battling for life.… pic.twitter.com/HPx4k6ZmVy— Sudhakar Udumula (@sudhakarudumula) August 17, 2024 -
టైమ్ కి బస్సు రాలేదని.. ముచ్చుమర్రి లో ఆసక్తికర ఘటన
-
HYD: కీచక కండక్టర్.. యువతి ట్వీట్‌కు ఆర్టీసీ రి‘యాక్షన్’
సాక్షి, రంగారెడ్డి: సిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టీజీఎస్ఆర్టీసీ ఎండీ, షీ టీమ్స్, హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది.‘ఈ నెల 15న (మంగళవారం)మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. ఆధార్ కార్డు లేకపోవడంతో రూ. 30 డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నా. బస్సు రద్దీగా ఉండటంతో అదే అదనుగా భావించిన కండక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకాడు. 2 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.తాజాగా ఈ ఫిర్యాదుపై టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. ఫరూక్ నగర్ కండక్టర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ‘ఫరూఖ్‌నగర్ డిపోకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది. టీజీఎస్ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా #TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ… pic.twitter.com/pCzfcZRUz4— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 16, 2024 -
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు దగ్ధం
సాక్షి,మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో సోమవారం(జులై 15) తెల్లవారుజామున 2 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై భూరెడ్డి పల్లి వద్ద ఏపీలోని ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొని దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బస్సు ధర్మవరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
HYD: సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణికులకు గాయాలు
సాక్షి,హైదరాబాద్: నగరంలోని సూరారంలో ఆదివారం(జులై 7) సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు మండిపడ్డారు. ఈ ఘటనతో బహదూర్‌పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు ట్రాఫిక్‌జామ్ అయింది.వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. జీడిమెట్ల డిపో బస్సు గండి మైసమ్మ నుంచి సికింద్రాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. -
Hyderabad: ఆర్టీసీ బస్సులో పురుడు పోశారు..
కాచిగూడ (హైదరాబాద్): పురిటి నొప్పులు పడుతున్న గర్భిణికి బస్సులోనే డెలివరి చేసి ఆర్టీసీ సిబ్బంది మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నగరానికి చెందిన శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్‌లో ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో (టీఎస్వో 2జెడ్ 0341) శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎక్కారు. ఆ బస్సులో డ్రైవర్ ఎం.అలీ, కండక్టర్ బి.సరోజ విధుల్లో ఉన్నారు. బస్సు బహదూర్‌పురా వద్దకు రాగానే శ్వేతారత్నంకు నొప్పులు రావడంతో బస్సు డ్రైవర్ బస్సును పక్కనే ఆపి ప్రయాణికులను దించాడు. బస్సు కండక్టర్ బి.సరోజ తోటి ప్రయాణికుల సహాయంతో శ్వేతారత్నంకు డెలివరీ చేశారు. శ్వేతారత్నం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని జజ్జిఖానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అడ్మిట్ చేశారు. మహిళకు పురుడు పోసిన కండక్టర్ సరోజను పలువురు ప్రయాణికులు అభినందించారు. ముషీరాబాద్ ఇన్చార్జి డీఎం రఘు అలీ, సరోజలను అభినందించారు. ఆర్టీసీ హైదరాబాద్ సిటీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎంఓ జగన్, కాచిగూడ డీఎం, ముషీరాబాద్ డిపో ఇన్చార్జి డీఎం రఘు, బర్కత్‌పుర డీఎం వేణుగోపాల్, ముషీరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ కళ్యాణి తదితరులు డ్రైవర్, కండక్టర్లను అభినందించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు తెలియజేశారు. -
ఆర్టీసీలో 3,035 పోస్టులు భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వివిధ స్థాయిల్లో 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో రద్దీ దాదాపు రెట్టింపైంది. దీంతో కొత్త బస్సుల అవసరం ఏర్పడింది. ప్రస్తుత రద్దీకి 4 వేల కొత్త బస్సులు అవసరమని ఆర్టీసీ తేల్చింది. అయితే అన్ని బస్సులు కాకున్నా, దశలవారీగా 1,500 బస్సులు సమకూరనున్నాయి. దీంతో భారీ సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్ల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కండక్టర్ల కొరత లేకున్నా, డ్రైవర్లకు కొరత ఉంది. కొత్త బస్సులు వచ్చే లోపే ఆ పోస్టుల భర్తీ అవసర మని ఆర్టీసీ నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి ముఖ్యమంత్రి ఓకే అనటంతో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2012లో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. నిజానికి భవిష్యత్తులో వచ్చే కొత్త బస్సుల దృష్ట్యా ఆర్టీసీలో 10 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి 3,035 పోస్టుల భర్తీతోనే సరిపెట్టనున్నారు. సాలీనా రూ.15 కోట్ల వ్యయం కొత్త నియామకాల వల్ల జీతాల రూపంలో సాలీనా రూ.15 కోట్ల వ్యయం కానుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణలతో సంవత్సరానికి అంతకు మూడు రెట్ల మేర జీతాల భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 200 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. సంవత్సరానికి దాదాపు 2,500 మంది రిటైర్ అవుతున్నారు. పదవీ విరమణ పొందేవారి జీతం గరిష్టంగా ఉంటుంది. ఆ మొత్తంతో ముగ్గురు కొత్త ఉద్యోగులను తీసుకోవచ్చు. అంటే కొత్త నియామకాలతో ఆర్టీసీపై అదనంగా పడే భారం ఏమీ లేదని స్పష్టమవుతోంది. ముందే అదనపు డ్యూటీల భారం ఆర్టీసీలో 12 సంవత్సరాలుగా నియామకాలు లేకపోవటంతో, రిటైర్మెంట్ల రూపంలో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొరత మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ల సంఖ్య సరిపోక, ఉన్నవారిపై అదనపు డ్యూటీల భారం మొదలైంది. వీక్లీ ఆఫ్‌లలో కూడా డ్రైవర్లు విధుల్లోకి రావాల్సి వస్తోంది. డ్రైవర్లు అలసి పోవడంతో బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిక్రూట్‌మెంటుకు అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు గత ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని అందుబాటులోకి తేవటంతో సిబ్బందిపై భారం మరింత పెరిగింది. దీంతో అధికారులు రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ ప్రతిపాదనలు పంపడమే కాకుండా తరచూ లిఖితపూర్వకంగా అభ్యరి్థస్తూ వచ్చారు. జనవరిలో ఆ ఫైలు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వద్దకు చేరింది. దాదాపు నెల విరామం తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. అక్కడ కూడా కొంతకాలం పెండింగులో ఉన్న తర్వాత ఎట్టకేలకు అనుమతి లభించింది. తాజా భర్తీ ప్రక్రియలో కండక్టర్ పోస్టుల ఊసు లేదు. భవిష్యత్తులో డ్రైవర్లే కండక్టర్ విధులు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతోనే డ్రైవర్ పోస్టుల భర్తీ జరగనుంది. టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం – త్వరలో 3,035 పోస్టుల భర్తీ – రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్: టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం కరీంనగర్లో పొన్నం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన ఏడు నెలల్లోనే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ వంద శాతం దాటిందని తెలిపారు. ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీగా తీర్చిదిద్ది ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామని అన్నారు. -
బొలేరో, ఆర్టీసీ బస్సు ఢీ: ఇద్దరి మృతి..
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం బొలేరో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్ని ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో ధర్మారం నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది.ఇదే సమయంలో కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వస్తున్న బొలేరో ట్రాలీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ట్రాలీ నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అన్వర్(25), అందులో ప్రయాణిస్తున్న అఫ్జల్(55) క్యాబిన్లో ఇరుక్కుని మరణించారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ట్రాలీలోని ఆవు కొవ్వు డబ్బాలు, చర్మం రోడ్డుపై పడిపోయాయి.పెద్దపల్లి సీఐ కృష్ణ, ధర్మారం ఎస్సై సత్యనారాయణలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాలను కట్టర్ల సాయంతో బయటకు తీశారు. అన్వర్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికాగా, అఫ్జల్ గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు రమాదేవి, ఆగవ్వకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.ఆవు కొవ్వు ఎందుకోసం?బొలేరో ట్రాలీలో ఆవు కొవ్వు, చర్మం తరలింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? రావాణాకు అనుమతి ఉందా? లేదా? ఆవు కొవ్వు, చర్మం దేనికి వినియోగిస్తారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ, మృతుల బంధువులు వస్తే పూర్తిసమాచారం తెలుస్తుందన్నారు. -
తన కొడుకుని బస్సులో ఎక్కించుకోలేదని మహిళ ఏం చేసిందంటే ?
-
బస్సులో రచ్చ రచ్చ..
-
ఆర్టీసీ ఉద్యోగిపై దాడి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఆన్‌డ్యూటీలో ఉన్న ఉద్యోగి(కంట్రోలర్)పై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేయడానికి వచ్చి ఇన్‌గేట్(అనుమతిలేని చోట) వద్ద కారు పార్కింగ్ చేసి వె ళ్తుండగా కంట్రోలర్ గమనించారు. కారును అక్కడ నుంచి తీసివేయాలని సూచించారు. దీంతో వారిద్ద రు ఉద్యోగి జమాల్పాషాపై పిడగుద్దులు గుద్దారు. స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్క ర్లు కొడుతోంది. ఆర్టీసీ కంట్రోలర్ జమాల్‌పాషా దాడి విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని సీఐ బన్సీలాల్ తెలిపారు. -
విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్
విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో విడిచిపెట్టి వెళ్లిన గంజాయితో కూడిన రెండు బ్యాగులను దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్‌కు ఆర్టీసీబస్సు డ్రైవర్ పి.గణపతి సోమ వారం అప్పగించారు. ఎస్ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సులో రామభద్రాపురం వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. పెదమానాపురం వద్దకు వచ్చేసరికి బస్సులో ఎంత మంది ఉన్నారో ఆర్టీసీ సిబ్బంది లెక్కిస్తున్న సమయంలో వారు టిక్కెట్లు తీయలేదని గమనించి నిలదీశారు. వారు వెంటనే బస్సుదిగి పారిపోయారు. ప్రయాణికులతో కలిసి వారు తెచ్చిన బ్యాగులు తెరిచి చూడగా గంజాయి ఉన్నట్టు గమనించారు. వెంటనే బస్సును స్టేషన్ వద్ద ఆపి గంజాయిని ఆర్టీసీ డ్రైవర్ అప్పగించారు. తహసీల్దార్ సుదర్శన్, వీఆర్వో ఆధ్వర్యంలో బ్యాగులో ఉన్న గంజాయిని తూకంవేసి 14.3 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆమనగల్ మండలం అయ్య సాగర్ సమీపంలో బస్సు-కారు ఢీకొని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికులు జేసీబీ సహాయంతో వెలికితీశారు. -
అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
ఖమ్మం: ఆర్టీసీ బస్సులో తలుపు వద్ద నిలుచున్న వివాహిత ప్రమాదవశాత్తు జారి వెనుక టైరు కింద పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మంలోని డీమార్ట్‌లో పనిచేస్తోంది. శనివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కొణిజర్లలో ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కింది. అప్పటికే ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆమె ఫుట్‌బోర్డ్‌పై నిలబడింది. బస్సు ఎంపీడీఓ కార్యాలయం సమీపానికి రాగానే మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ యత్నించాడు. ఇంతలోనే ఎదురుగా ద్విచక్రవాహనం రాగా డ్రైవర్ బ్రేక్ వేయడంతో తలుపు వద్ద నిలబడిన అనూష జారి రోడ్డుపై పడింది. అప్పటికే బస్సు కదలడంతో వెనుక టైరు ఆమె పైనుంచి వెళ్లగా నడుము భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతి చెందింది. మృతురాలికి భర్త అశోక్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న ఆమె మృతి చెందిందనే సమాచారంతో కుటుంబీకులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, అనూష మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం
మాడుగులపల్లి : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కుక్కడం గ్రామశివారులో అద్దంకి– నార్కట్‌పల్లి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన లారీడ్రైవర్ గంధం ప్రసన్నతేజ చైన్నె నుంచి మెంతుల లోడు లారీతో మహారాష్ట్రకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుక్కడం శివారుకు రాగానే లారీని రోడ్డు పక్కకు నిలుపుతుండగా పక్క నుంచి వేగంగా వచ్చిన ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రసన్నతేజ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు చిలకలూరిపేట ఆర్టీసీ డిపోకు చెందినదిగా తెలిసింది. అతివేగం, నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శోభన్‌బాబు తెలిపారు. -
జనగాం: ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి
సాక్షి, జనగాం: జనగాంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. ఓ మొబైల్ టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
Hyderabad: పగటిపూట సిటీ బస్సుల సంఖ్య తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లో బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా..
కరీంనగర్: దుబ్బపల్లి గ్రామశివారులో ఆర్టీసీ బస్సు శుక్రవారం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి మంథని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దుబ్బపల్లి శివారులోకి చేరుకుంది. ఇదే సమయంలో డ్రైవర్ రతన్ గుట్కా వేసుకుంటున్నాడు. పక్కనుంచి లారీ వెళ్తుంగా ఆర్టీసీ డ్రైవర్ స్టీరింగ్ రోడ్డువైపు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రాజీవ్ రహదారి పక్కన చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులు దాదాపు 40మందికి పైగా ప్రయాణుకులు ఉన్నారు. ఇందులో దేవిక(సెంటినరీకాలనీ), మల్లయ్య(మంథని), శ్రీరాముల స్వామి(కరీంనగర్) తలకు గాయాలు తీవ్రగాయాలు కాగా, మితాగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుడు శ్రీరాముల స్వామి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు. -
‘మహాలక్ష్మి పథకం’ అమలులో గ్రేటర్ ఆర్టీసీ టాప్‌గేర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మహాలక్ష్మి పథకం టాప్ గేర్‌లో పరుగులు తీస్తోంది. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల మందికి పైగా మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం విశేషం. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతేడాది డిసెంబర్ 9వ తేదీన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ప్రయాణికులు లేక సిటీ బస్సులు వెలవెలపోయాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగరంలోని అన్ని రూట్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. గతంలో 4 లక్షల మందే.. ప్రతి రోజు సుమారు 10 లక్షల మందికి పైగా మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. గతంలో కేవలం 4 లక్షల మంది సిటీ బస్సుల సేవలను వినియోగించుకొనేవారు. వారిలో విద్యార్థినులే ఎక్కువ. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనే మహిళలు ఎక్కువగా ఉండేవారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల మహిళలకు సిటీ బస్సు చేరువైంది. మెట్రో లగ్జరీ వంటి బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు సైతం ఉచిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల వైపు మళ్లారు. దీంతో ఈ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఒక్కసారిగా ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. సాధారణంగా ఉదయం, సాయంత్రం మాత్రమే కనిపించే ప్రయాణికుల రద్దీ కొంతకాలంగా అన్ని వేళల్లోనూ ఉంది. ‘ఆటోలు, క్యాబ్‌లు వంటి వాహనాలను వినియోగించే మహిళలు కూడా సిటీ బస్సుల్లోకి మారారు. ఇప్పుడు బస్సుల సంఖ్య పెరిగితే తప్ప ప్రయాణికుల డిమాండ్‌ను చేరుకోలేని పరిస్థితి నెలకొంది’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ప్రతి రోజు 10 లక్షల మంది ప్రయాణికుల చొప్పున మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 90 రోజుల్లో సుమారు 10 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గతంలో రోజుకు సుమారు 15 లక్షలు మాత్రమే ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు 25 లక్షలు దాటింది. అందులో 10 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరగడంతో సిటీ బస్సుల్లో సీట్ల కొరత పెద్దసవాల్‌గా మారింది. మహిళల కోసం కేటాయించిన సీట్లతో పాటు, ఇతర సీట్లను కూడా మహిళలే ఆక్రమించుకోవడంతో పురుషులు, వయోధికులకు ‘స్టాండింగ్ జర్నీ’ భారంగా మారింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేసింది. ఒకటి, రెండు రూట్లలో నాలుగైదు ట్రిప్పులు ప్రయోగాత్మకంగా నడిపారు. కానీ అంతగా స్పందన లేకపోవడంతో ‘జెంట్స్ స్పెషల్’ బస్సుల ప్రతిపాదనను విరమించుకొన్నారు. అరకొర బస్సులే... గతంలో రోజుకు రూ.కోటి నష్టంతో నడిచిన బస్సులు ఇప్పుడు లాభాల బాట పట్టాయి. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తున్న దృష్ట్యా నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీకి అవకాశం లభించింది. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ మహానగరం విస్తరణకు అనుగుణంగా సిటీ బస్సుల సేవలు విస్తరించుకోవడం లేదు. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణంగా నగర శివార్ల నుంచే వివిధ రకాల పనులపైన మహిళలు, అన్ని వర్గాల ప్రయాణికులు నగరంలోకి రాకపోకలు సాగిస్తారు. కానీ నగర శివార్ల నుంచి తగినన్ని బస్సులు అందుబాటులో లేవు. సుమారు 2500 బస్సులు మాత్రమే సిటీలో తిరుగుతున్నాయి. మెట్రోలగ్జరీ, మెట్రో డీలక్స్ వంటి బస్సులను మినహాయిస్తే కనీసం 2000 బస్సులు కూడా అందుబాటులో లేవు. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న మహిళల్లో 70 శాతం మంది నగర శివార్ల నుంచే ప్రయాణం చేస్తున్నారు. బెంగళూర్ వంటి మెట్రో నగరాల్లో 6 వేలకు పైగా సిటీ బస్సులు నడుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ ఆర్టీసీ కూడా కనీసం రెండు రెట్లు విస్తరించవలసి ఉంది. -
ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం
షాద్‌నగర్ (హైదరాబాద్)/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహ బూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ సంఘం సమావేశానికి వెళ్లేందుకు.. ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపో బస్సు ఎక్కిన మంత్రి మహిళా ప్రయా ణికులతో ముచ్చటించారు. డ్రైవర్ ఇయర్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని గమనించిన పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బస్సులోని మహిళా కండక్టర్‌ను ఈ విషయమై అడి గారు. డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని తమాషా చేస్తున్నాడా?.. అలా మాట్లాడితే సస్పెండ్ అవు తాడు తెలుసా?.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు కదా? అన్నారు. ‘కాంగ్రెస్ సర్కార్ ఆయా.. ఏ సబ్ కా సర్కార్ హై’.. అంటూ ఓ ముస్లిం ప్రయాణికురాలితో మంత్రి ముచ్చటించారు. పెన్షన్ వస్తుందా? అని ప్రశ్నించగా.. రావడం లేదని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నావా? అని అడిగారు. లేదని ఆమె చెప్పడంతో వెంటనే దరఖాస్తు చేసుకోమని మంత్రి పొన్నం సూచించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని.. అదేవిధంగా కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
విరిగిన స్టీరింగ్ రాడ్..
చెన్నారావుపేట: వరంగల్ జిల్లాలో స్టీరింగ్ రాడ్ విరగడంతో ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్ శివారులో ఆదివారం ఈ ఘటన జరిగింది. నర్సంపేట డిపో నుంచి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మండల పరిధిలోని బోజేర్వు గ్రామానికి వెళ్లింది. అక్కడి నుంచి 30 మంది ప్రయాణికులతో నర్సంపేటకు వస్తున్న క్రమంలో తిమ్మరాయినిపహాడ్ శివారుకు రాగానే బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. అందులో బురద ఉండటంతో బస్సు కూరుకుపోయి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి క్షతగాత్రులను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
మునగాల, మోతె (కోదాడ)/నంగునూరు (సిద్దిపేట): సూ ర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయా రు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతె మండ ల కేంద్రం శివారులో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన పది మంది, రేపాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా వ్యవసాయ కూ లీలు మోతె మండలం హుస్సేనాబాద్‌లోని మిర్చి తోటలో కాయలు ఏరేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్య లో ఖమ్మం జిల్లా మధిర నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు మోతె శివారులో యూటర్న్ తీసుకునే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ(55), చెవుల నారాయణమ్మ(56), రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూర్య (65) తీవ్ర గా యాలతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విజయరాఘవపురానికి చెందిన రెమిడాల సౌభాగ్యమ్మ(75) సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల గురువయ్య (65) ను హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. రేపాల గ్రామానికి చెందిన సొంపంగు లక్ష్మి తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌కు తరలించారు. విజయరాఘవపురం గ్రా మానికి చెందిన కత్తి విజయమ్మ, పాలపాటి మంగమ్మ సూ ర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ టో డ్రైవర్ పవన్‌తో పాటు మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. కోదాడ డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి, మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలో ముగ్గురు మృతి కారు బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంద గా మరో ఏడుగురికి గాయాలయ్యా యి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ వద్ద జరి గింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల అనిల్, భార్య మమత, అతని బావమరిది బాబురాజు, భార్య కీర్తన, పిల్లలు చర ణ్, భానుప్రసాద్, వైష్ణవి, హన్విక, నాన్సి, ప్రణయ్‌తో కలసి హుస్నాబాద్‌లో జరిగిన బంధువుల పెళ్లికి కారు లో వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొ ట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లింది. దీంతో పక్కనే ఉన్న కాల్వలో బైక్, కారు పడిపోయాయి. ఈ ప్రమాదంలో బద్దిపడగకు చెందిన కట్ట రవి (55), నాగరాజుపల్లికి చెందిన ముక్కెర అయిలయ్య (58), జక్కుల మమత (28) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిలో బాబురాజు పరిస్థితి విషమంగా ఉండగా గాయాలపాలైన చిన్నారులను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వచ్చి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Gachibowli: ఆర్టీసీ బస్సు కిందపడి టెక్కీ దుర్మరణం
హైదరాబాద్: బైక్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శోభన్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ, ఆటోనగర్‌కు చెందిన ఆకుల సాయికృష్ణ(26) గచ్చిబౌలి జనార్దన్హిల్స్లోని సునీతా రెడ్డి లగ్జరీ మెన్స్ హాస్టల్లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను బైక్‌పై డీఎల్ఎఫ్ వైపు వెళుతుండగా, రాయదుర్గం నుంచి డీఎల్ఎఫ్ వైపు వస్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందçపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు అతడి తలమీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ రికార్డు స్థాయి కిటకిట.. డ్రైవర్లకు దడదడ
సాక్షి, హైదరాబాద్: ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యం చేర్చి ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 106.02 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమో దైంది. సోమవారం ఈ రికార్డు నమోదైంది. ఈ అంశం గొప్పగా చెప్పుకోవడం కంటే, ప్రమాద ఘంటికలను మోగించడానికి సంకేతంగా భావించాల్సి రావటమే ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. ఆందోళన ఎందుకంటే..? ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అద్దె వాటితోపాటు మొత్తం 9,100 బస్సులున్నాయి. రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభించింది. ఆ పథకం మొదలైన తర్వాత ఆర్టీసీకి అదనంగా సమకూరిన బస్సులు 150 మాత్రమే. ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ అదనపు ప్రయాణికుల సంఖ్య 12 లక్షల నుంచి 15 లక్షల వరకు చేరింది. ఇందుకు 4 వేల అదనపు బస్సులు కావాల్సి ఉంది. కానీ, అన్ని బస్సులు ఇప్పట్లో సమకూరే పరిస్థితి లేదు. దీంతో బస్సులపై విపరీతమైన భారం పడుతోంది. రెండు బస్సుల్లో ఎక్కాల్సిన ప్రయాణికులు ఒక్క బస్సులో కిక్కిరిసిపోయి బస్సులను నడపటం డ్రైవర్లకు కష్టంగా మారింది. అసలే 30 శాతం బస్సులు బాగా పాతబడి ఉన్నందున, ఈ ఓవర్ లోడ్‌తో ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న భయం ఆర్టీసీని వెంటాడుతోంది. ఇంతగా కిక్కిరిసిన బస్సులను సోమవారం అతి జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. అధికారులు అనుక్షణం సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సులు నడపడం గమనార్హం. డ్రైవర్ల కొరత ప్రస్తుతం ఉన్న బస్సులను పరిగణనలోకి తీసుకుంటే 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. సోమవారం లాంటి రద్దీ ఉన్న సమయంలో అదనపు బస్సులు నడపాల్సి ఉంటుంది. అయితే, బస్సుల్లేక ఆ పనిచేయలేకపోతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా డ్రై వర్లు లేనందున వాటిని డిపోలకే పరిమితం చేయా ల్సి ఉంటుంది. కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. 2,000 మంది డ్రైవర్లను ఉన్నఫళంగా రిక్రూట్ చేసుకోవాలనీ ప్రతిపాదించారు. కానీ, ఇటీవలి బడ్జెట్ లో ఆర్టీసీకి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించలేదు. కేవలం మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతినెలా రూ.300 చొప్పున రీయింబర్స్ చేసే అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఇదిలాఉంటే, దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో విధులు నిర్వహించే డ్రైవర్లకు కచి్చతంగా చాలినంత విశ్రాంతి అవసరం. కానీ, డ్రైవర్ల కొరత ఫలితంగా కొందరికి సరిపడా విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా డబుల్ డ్యూటీలు చేయించాల్సి వస్తోంది. ఇలా విశ్రాంతి లేని డ్రైవర్లు, డొక్కు బస్సులను కొనసాగి స్తున్న నేపథ్యంలో ఒకే రోజు 65 లక్షల మంది బ స్సుల్లో ప్రయాణించటం కలవరానికి గురిచేస్తోంది. -
బస్సులో బల్మూరి.. ఆటోలో కౌశిక్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు వినూత్న రీతిలో అసెంబ్లీకి రావడం ఆసక్తిని కలిగించింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్నే ఈ ఇద్దరు ఎంచుకోవడం విశేషం. ఇటీవలే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన బల్మూరి వెంకట్ నాంపల్లిలో ఆర్టీసీ బస్ ఎక్కి అసెంబ్లీ గేట్ వరకు వచ్చారు. ఈ సందర్బంగా బస్‌లో మహిళా ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఉచిత ప్రయాణం అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందంటూ ఆయన ఆటోలో అసెంబ్లీ గేటు వద్దకు వచ్చారు. అయితే ఆటోకు పాస్ లేకపోవడంతో పోలీసు అధికారులు ఆటోను అసెంబ్లీలోకి అనుమతించలేదు. దీంతో ఆయన ఆటో దిగి కాలినడకన అసెంబ్లీలోకి వచ్చారు. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ తగ్గి ఇప్పటివరకు 21 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, సుమారు ఆరు లక్షల ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
భయపెట్టిన ఆర్టీసీ బస్సు
హయత్‌నగర్: రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక ఆటో స్వల్పంగా దెబ్బ తినగా ఓ మహిళకు గాయాలయ్యాయి. ఆర్టీసీ అధికారుల కథనం ప్రకారం...దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన బస్సు (టీఎస్ 07జెడ్4106) బుధవారం ఉదయం చౌటుప్పల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వస్తుంది. హయత్‌నగర్‌లోని భాగ్యలత సమీపంలోకి రాగానే రహదారిపై ఉన్న ఓ రాయి బస్సు కింది భాగంలో తగిలింది. దీంతో డ్రైవర్ ధర్మయ్య బ్రేకు వేసేందుకు ప్రయత్నించగా బస్సు ఆగలేదు. బ్రేకు పడకపోవడంతో బస్సు ఎడమ వైపునకు వెళ్లింది. దీంతో రోడ్డుకు ఎడమ వైపున ఉన్న వాహనాలపైకి వెళ్లింది. స్పందించిన డ్రైవర్ ముందు బ్రేకును వేయడంతో బస్సు అదుపులోకి వచ్చింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ మహిళతో పాటు మరికొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఆర్ఎం వరప్రసాద్, డీఆర్ఎంలు జగన్, సుచరిత, డీఎం శ్రీహరిలు సందర్శించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పిందని వారు తెలిపారు. -
హైదరాబాద్ జీడిమెట్ల పరిధి షాపూర్ లో బస్సులో మంటలు
-
మహిళా కండక్టర్ వెటకారం.. ‘బస్సుల్లో తిరగడం అమ్మాయిలకు ఫ్యాషనైపోయింది’
పరకాల: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించడం ఏమో కానీ ఓ విద్యార్థికి మహిళా కండక్టర్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. నడికూడ మండలం నర్సక్కపల్లెకు చెందిన విద్యార్థిని మేఘన పరకాల నుంచి హుజురాబాద్ వెళ్లే బస్సెక్కింది. అయితే ఉచిత ప్రయాణం కావడంతో విద్యార్థిని తన వద్ద ఉన్న ఆధార్ కార్డు చూపించింది.. దీంతో మహిళ కండక్టర్ ఫొటో మార్చుకుంటే ఏమవుతుంది.. చిన్నప్పటి కార్డు ఉందా అంటూ వెటకారంగా మాట్లాడింది. కాగా తాను అప్డేట్ చేసుకున్నానని చెప్పిన పట్టించుకోలేదని.. అలా మాట్లాడకండి అవసరమైతే డబ్బులు తీసుకొమ్మని చెప్పింది. పైసలు ఎక్కువైనాయా.. అయిన కాలేజీ అమ్మాయిలకు పనిపాట లేకుండా బస్సులో తిరగడం ఫ్యాషనైందనడంతో బస్సులోనే ఆ విద్యార్థి కంటతడి పెట్టుకుంది. ఈ విషయాన్ని తన తండ్రికి ఫోన్లో తెలియజేయగా అతను పరకాల ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు డిపోకు చేరుకున్నాడు. డీఎం కొత్త బస్సుల ప్రారంభోత్సవం బిజీగా ఉండటంతో అక్కడే ఉన్న కొందరు ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి అలా జరగకుండా చూసుకుంటామంటూ నచ్చజెప్పారు. అయితే ఓ వైపు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొత్త బస్సులు ప్రారంభిస్తుండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈ విషయంపై ఆర్టీసీ డీఎం రవిచంద్ర దృష్టికి సాక్షి తీసుకెళ్లగా ఆధార్ అప్డేట్ చేసుకొమ్మని చెప్పడంలో తప్పులేదన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. -
TSRTC: సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
సిద్దిపేట, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణం మూలంగా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీసీ సిబ్బందితో గొడవ పడడం దగ్గరి నుంచి ఆఖరికి మహిళలు వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం దాకా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహిళలు చెప్పులతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఆ గొడవను ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించగా.. అక్కడే ఉన్న కొందరు ఆ వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న దుబ్బాక డిపో బస్సులో.. తోగుట మండలం వెంకట్రావ్ పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమచారం. ఉచిత ప్రయాణ విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. -
సమస్యలకు టాటా సంతోషాల బాట
సాక్షి, మచిలీపట్నం: ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థే అయినా కార్మికులకు అడుగడుగునా అవస్థలు తప్పేవి కాదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా జీతభత్యాలు అన్న మాటే లేదు. సంస్థ నష్టాల్లో ఉన్నా, ఏవైనా ఒడుదొడుకులు ఎదురైనా సకాలంలో వేతనాలు అందేవి కావు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే జీతంలో కోతలు విధించేవారు. ఇదంతా గతం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది. విలీనమై నాలుగేళ్లు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆచరణలోకి పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే కమిటీ వేశారు. ఆరు నెలల్లోనే ఆచరణలో పెట్టారు. 2020 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తేవడంతో కార్మికులంతా ప్రజా రవాణా శాఖ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. దశాబ్దాల తరబడి ఎవరూ చేయని సాహసవంతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఉద్యోగుల కష్టాలు తొలగిపోయాయి. నాలుగేళ్లుగా వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, బెనిఫిట్స్, అలవెన్స్ అందుతున్నాయి. ఈ నిర్ణయంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5,308 కుటుంబాల్లో సంతోషాలు నిండాయి. నాడు సమ్మెలు చేస్తే జీతాలు కట్ ఆర్టీసీ ఇస్తున్న వేతనాలు చాలక డ్రైవర్లు, కండ క్టర్లు, ఇతర కార్మికులు ఎన్నోసార్లు సమ్మెలు, పోరాటాలు చేశారు. అయినా తగిన ప్రతిఫలం దక్కలేదు. గత టీడీపీ ప్రభుత్వం కార్మికులను వేధించి, సమ్మె కాలానికి జీతాలు కోసి ఉక్కు పాదం మోపింది. ఉద్యోగ భద్రత కరువై కార్మికులు రోజులు లెక్కపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే తమ సమస్యలకు పరిష్కారం లభించిందని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్‌లోనూ ఠంచన్‌గా జీతాలు కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా రెండేళ్లలో సుమారు నాలుగు నెలలకు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆ పరిస్థితులు గతంలో ఎదురైతే కార్మికుల వేతనాల్లో కోతలు పడేవి. అప్పటికే ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎన్ని కష్టాలు ఉన్నా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతాలు అందాయి. ఇలా జీతాలు చెల్లించడం చరిత్రలో మొదటి సారి అని ఉద్యోగులు పేర్కొన్నారు. మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీ విలీనం ప్రక్రియ పూర్తి చేసి మాట నిలుపుకొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీతాలకు బ్రేక్ లేకుండా చూశారు. ఆర్టీసీ కార్మికుల మేలు కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. – చల్లా చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానం ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులను ఎదు ర్కొన్నాం. చాలీచాలని వేతనాలు, అల వెన్సులు. జీతాల పెంపు కోసం సంఘాలు ఆందోళన చేసినా మాకు సరైన న్యాయం జరిగేది కాదు. అయితే ఇప్పుడు ప్రజా రవాణా శాఖలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, అలవెన్స్‌లు అందుతున్నాయి. – గొడవర్తి నరసింహాచార్యులు, కండక్టర్ భరోసా వచ్చింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులుగా ఉన్నప్పుడు మాకు ఉద్యోగ భద్రత ఉండేది కాదు. ఏదైనా పొరపాటు జరిగినా.. ఆర్టీసీ సంఘాలు చేపట్టే ఆందోళనలో పాల్గొన్నా ఒత్తిళ్లు, బెదిరింపులు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాలపై భరోసా వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది. – ఎ. వెంకటేశ్వరరావు, డ్రైవర్ -
సంక్రాంతి వేళ ‘మహాలక్ష్మి’!
సాక్షి, విశాఖపట్నం: తెలంగాణలో మహలక్ష్మి పథకం సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీకి కాసులు కురిపిస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఆ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అక్కడ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మునుపటిలా ఈ సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ దూర ప్రాంతాలకు తగినన్ని స్పెషల్ బస్సులను నడిపే అవకాశం టీఎస్ఆర్టీసీకి లేకుండా పోయింది. దీనిని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అవకాశంగా మలుచుకున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎక్కువ బస్సులను నడుపుతున్నారు. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి తదితర దూర ప్రాంతాలకు మరిన్ని బస్సులను తిప్పుతున్నారు. గత సంక్రాంతికి ఉత్తరాంధ్ర నుంచి 450 స్పెషల్స్ తిప్పగా, ఈ సంక్రాంతికి ఆ సంఖ్య దాదాపు 650 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిలో హైదరాబాద్ సర్వీసులే 150 వరకు ఉంటాయని చెబుతున్నారు. ఏటా సంక్రాంతి పండుగకు తెలంగాణలోని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు, తిరిగి 17 నుంచి 22 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. 10 నుంచి 14 వరకు హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. సంక్రాంతి తర్వాత 17 నుంచి 22 వరకు ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి వైపు నడిపేందుకు నిర్ణయించారు. 80 శాతం ఓఆర్ హైదరాబాద్ నుంచి ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అధికంగానే ఉంటోంది. దీంతో ఈ బస్సులు జనంతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. వీటిలో 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) ఉంటోంది. ఇది ఏపీఎస్ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. గత ఏడాదికంటే ఈ సంక్రాంతికి డిమాండ్ ఎంతో మెరుగ్గా ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో అక్కడ బస్సులు స్థానికుల అవసరాలకే సరిపోతున్నాయని, మునుపటిలా ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు సంక్రాంతికి అదనంగా బస్సులు నడిపే పరిస్థితి లేదని ఓ ఆర్టీసీ అధికారి శ్రీసాక్షిశ్రీకి చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ నుంచి గతంకంటే ఎక్కువ సర్వీసులను నడుపుతూ ప్రయాణికుల అవసరాలు తీరుస్తోందని వివరించారు. ఇప్పటికే పలువురు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు చేయించుకున్నారు. సమన్వయానికి అధికారులు.. మరోవైపు హైదరాబాద్‌లో ఉత్తరాంధ్ర సహా ఆంధ్ర ప్రాంతానికి నడిపే ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సమన్వయం చేయడానికి, ప్రయాణికులకు సహకరించడానికి యాజమాన్యం ప్రత్యేక అధికారులను నియమించింది. వివిధ స్థాయిల అధికారులు హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్లలో ఉంటూ స్పెషల్ సర్వీసులను పర్యవేక్షిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో హైదరాబాద్‌లో తగ్గిన ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుకనుగుణంగా అటు నుంచి బస్సులను పెంచిన మన ఆర్టీసీ గత సంక్రాంతికి ఉత్తరాంధ్ర నుంచి 450 సర్వీసులు ఈసారి ఆ సంఖ్య 650 వరకు పెంపు వీటిలో అధికంగా హైదరాబాద్ నుంచి నడుపుతున్న అధికారులు సమన్వయం కోసం ఆర్టీసీ ప్రత్యేక అధికారుల నియామకం -
కరీంనగర్ పందెం కోడి వేలంలో ట్విస్ట్..
సాక్షి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. మూడు రోజుల క్రితం కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని వేలం ముందు ట్విట్ నెలకొంది. కోడి వేలం పాటను ఆపాలంటూ ఓ వ్యక్తి.. ఆర్టీసీ డిపో అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఆ పందెం కోడి తనదేనని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మహేష్ అనే వ్యక్తి తెలిపాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అతడు సిరిసిల్లలోని రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నాడు. బంధువులు ఇచ్చిన పందెం కోడిని తీసుకొని రుద్రంగి నుంచి మహేష్ నెల్లూరుకి వెళ్తూ ఉండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్ చేరుకోగానే నిద్రమత్తులో బస్సు దిగి పోయానని తెలిపాడు. తన వెంట కోడి లేదన్న విషయాన్ని గ్రహించి వెంటనే బస్సు వద్దకు వెళ్లగా.. అప్పటికే బస్సు వెళ్లిపోయిందని బాధితుడు చెప్పాడు. ఆర్టీసీ అధికారులు పందెం కోడిని వేలం పాట వేస్తున్నారని తెలవడంతో ఆ కోడి తనదేనంటూ చెప్పాడు. అసలేం జరిగిందంటే...? ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు. కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్‌కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు ఈ లోపు కోడి తనదేనంటూ ఓ వ్యక్తి రావడంతో మరి దానిని అతనికి అందిస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది. -
సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. దాదాపు బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కూర్చునేందుకు సీట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుండటంతో పలుచోట్లా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే ఘటన చోటుచేసుకుంది. సీటు కోసం ఇద్దరు మహిళలు తిట్టుకోవడం తో పాటు జుట్టుపట్టుకుని మరీ కొట్టుకున్నారు. ఫ్రీ బస్ ఎఫెక్ట్!! జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు. pic.twitter.com/ah7wceH6vl — Telugu Scribe (@TeluguScribe) January 1, 2024 దీంతో బస్సులోని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కి చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు బస్టాండ్‌కు వచ్చింది. ఇప్పటికే ఎక్కువగా రష్ ఉంటుండటం, సీట్ల కోసం పోటీ ఏర్పడుతుండటంతో ఓ మహిళ బస్సు ఆగగానే కిటికీలో నుంచి కర్చీఫ్ వేసింది. బస్సు ఆగిన అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు బస్సులోకి ఎక్కారు. బస్సులోనే కొట్లాట ఇద్దరు తిట్టుకుంటూనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. బస్సులో ఉన్న మిగతా మహిళలు, పురుషులు సర్ది చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరూ సీటు కోసం కొట్లాడుకుంటుండటంతో బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సర్దిచెప్పినా వినకుండా గొడవ పడుతుండటంతో గందరగోళానికి గురయ్యారు. చివరకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఇద్దరి మధ్య కలగజేసుకుని సర్ది చెప్పడంతో గొడవకు ఫుల్ స్టాప్ పడింది. -
ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా?
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్తిపేట కమాన్ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఈర్ల ప్రేమ్‌కుమార్(28) కరీంనగర్లో ఉంటూ ఫ్లిప్‌కార్ట్ సంస్థలో డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి భూపాలపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రేగొండ మండలం భాగిర్తి పేట కమాన్ శివారులో భూపాలపల్లి నుంచి పరకాల వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రేమ్‌కుమార్ క్యాబిన్‌లోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లు వీరబోయిన రమేష్, మురళితో పాటు ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రేగొండ ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, తీగల మాధవ్ ఘటనా స్థలికి చేరుకుని ప్రేమ్‌కుమార్ మృతదేహాన్ని డీసీఎం క్యాబిన్ నుంచి బయటకు తీసి పరకాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈఘటనపై మృతుడి సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొగ మంచు, అతివేగమే కారణం? పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి పొగ మంచు, అతివేగమే కారణమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండడంతో వాహనాల వేగం ఎక్కువగా ఉంటుందని, దీనికి తోడు పొగ మంచుతో దారి, ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, భాగిర్తిపేట కమాన్ శివారు ప్రమాదాలకు అడ్డగా మారుతోంది. ఏటా కమాన్ సమీపంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి చదవండి: ఇద్దరు తీవ్ర నిర్ణయం! బావిలో దూకి.. -
HYD: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోరవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. నేడు 80 బస్సులు ప్రారంభించామని, త్వరలో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మే జూన్ కల్ల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 400 కోట్లతో ఈ కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణం తీసుకొచ్చిందన్న సజ్జనార్.. ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్లు విక్రయించినట్లు తెలదిపారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేoదుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. LIVE : Minister Ponnam Prabhakar Inaugurates 80 New RTC Buses https://t.co/C2TMl4o6rp — Telangana Congress (@INCTelangana) December 30, 2023 రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. లీజుకు ఆర్టీసీ భూములు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానించింది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్సైట్లో చూడాలని సూచించింది. టెండర్లకు వచ్చే ఏడాది జనవరి 18 చివరి తేదీగా పేర్కొంది. -
రోడ్డెక్కనున్న కొత్త బస్సులు
సాక్షి,హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు హాజరవుతారు. రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. -
డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చి రద్దీ పెరగడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ట్రామ్ తరహాలో రెండు కోచ్‌లుగా ఉండే వెస్టిబ్యూల్, డబుల్ డెక్కర్ బస్సు లు నగరం వెలుపల నడపడం, ప్రస్తుతం నడు స్తున్న బస్సులు కాకుండా 12 మీటర్ల పొడవుండే భారీ వెడల్పాటి బస్సులు కొనుగోలు చేయడం తదితర అంశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే దాదాపు 10 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగి మొత్తం ప్రయాణికుల సంఖ్య 40 లక్షలు దాటింది. సోమ వారాల్లో అయితే ఇది 50 లక్షలను మించుతోంది. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతం నమోదవుతోంది. మరోవైపు పురుషులకు చోటుండటం లేదు. ఈ నేపథ్యంలో పెరిగిన రద్దీని సులభంగా తట్టుకుని ఈ పథకాన్ని సజావుగా అమలు చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలని పేర్కొంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా కసరత్తు చేస్తున్న ఆ కమిటీ ప్రతినిధులు మరో రెండు రోజుల్లో నివేదిక అందించనున్నారు. అందులోని సిఫారసులకు అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది. నగరంలోనా? వెలుపలా? ప్రస్తుతం ఆర్టీసీలో 9,300 బస్సులున్నాయి. వీటిల్లో 3 వేలకు పైగా పాతబడి ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 4 వేల వరకు బస్సులు కొనాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ బస్సులకు బదులు పెద్ద బస్సులు కొంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆర్టీసీ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వాడుతున్న 11 మీటర్ల పొడవు బస్సులకు బదులు 12 మీటర్ల బస్సులు కొంటే అదనంగా నాలుగు సీట్లు కలిసి వస్తాయి. వెడల్పు ఎక్కువగా ఉండటంతో నిలబడే స్థలం పెరుగుతుంది. ఇక ఒకదాని వెనక మరొకటిగా రెండు కోచ్‌లతో ఉండే వెస్టిబ్యూల్ బస్సులు కొంటే ఒకేసారి ఎక్కువమందిని తరలించే వీలుంటుంది. డబుల్ డెక్కర్‌లో కూడా ఎక్కువమంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. వీటిని నగరం వెలుపల విశాలమైన రోడ్లు ఉండే ప్రాంతాల్లో తిప్పే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ నగరంలో అయితే ఏయే రూట్లు ఇందుకు యోగ్యంగా ఉంటాయో కూడా గుర్తిస్తున్నారు. 4 వేల బస్సులకు 10 వేల మంది సిబ్బంది కావాలి ఒక బస్సుకు సగటున 2.6 చొప్పున సిబ్బంది. అవసరమన్నది ఆర్టీసీ లెక్క. కొత్తగా 4 వేల బస్సులు కొంటే 10 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలి. ఒకవేళ అద్దె ప్రాతిపదికన బస్సులు తీసు కుంటే సిబ్బంది సంఖ్య అంత అవసరం ఉండదు. కాగా సిబ్బంది పెంపు ఎలా ఉండాలన్న అంశంపై ఓ కమిటీ నివేదిక సిద్ధం చేస్తోంది. అదే సమయంలో బస్సుల నిర్వహణపైనా సంస్థ దృష్టి సారించింది. షాక్ అబ్జార్బర్స్‌గా పనిచేసే కమాన్ పట్టీలు, టైర్లు, బ్రేక్ లైనర్స్ మన్నిక పెంచేందుకు ఏం చేయాలి? నిర్వహణ వ్యయం, అవసరమైన మెకానిక్‌లు తదితర అంశాలను మరో కమిటీ పరిశీలిస్తోంది. బస్స్టేషన్లు, ప్లాట్ ఫామ్స్‌పై దృష్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అన్నింటిలో టికెట్ జారీ యంత్రాలు వాడుతు న్నారు. వీటి చార్జింగ్కు ఇబ్బంది పడకుండా టిమ్స్‌ను బస్సుల్లోనే చార్జ్ చేసే సాంకేతికత సమకూర్చుకోవచ్చా? స్మార్ట్ కార్డుల జారీ, విచారణ కేంద్రాలలో ట్యాబ్స్ వినియోగం లాంటి అంశాలపై ఇంకో కమిటీ దృష్టి పెట్టింది. అదే సమయంలో పెరుగుతున్న బస్సులకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెంచటం, తదనుగుణంగా బస్టాండ్లు, బస్స్టేషన్లను విస్తరించటం, బస్టాండ్లలో వసతుల కల్పన, పెరిగిన దొంగల బెడదను అరికట్టేందుకు భద్రత పెంపు, మహిళా ప్రయాణికులకు టాయిలెట్లు, మంచినీటి వసతిని మెరుగుపరచటం లాంటి వాటిపై ఒక కమిటీ అధ్యయనం చేస్తోంది. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న పల్లె వెలుగు బస్సుకు కు బుధవారం తెల్లవారు జామున పెను ప్రమాదం తప్పింది . పాల్వంచ వాగు వద్ద దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో బస్సు రాంగ్ రూట్లో వెళ్ళి మరో బస్సును ఢీ కొట్టబోయింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 35 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు కామారెడ్డి డిపోకు చెందిందని బస్సు డ్రైవర్ తెలిపాడు. -
‘మహాలక్ష్మి’కి భద్రత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ వసతి కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనంగా 13 లక్షల ప్రయాణికులు పెరగటంతో బస్సులు చాలక ఆర్టీసీకి కొత్త సమస్య ఎదురుకాగా, అది చాలదన్నట్టు ఇప్పుడు మరో ఇబ్బంది తలెత్తింది. బస్సులతోపాటు బస్టాండ్లు కూడా బాగా రద్దీగా మారటంతో ఒక్కసారిగా దొంగల బెడద తీవ్రమైంది. రోజురోజుకు బస్టాండ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికుల బ్యాగులు, సెల్ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. బస్టాండ్లలో భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసు రక్షణ కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సొంతంగానే సెక్యూరిటీ.. గతంలో ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత ఉండేది. పోలీసు శాఖ హోంగార్డులను కేటాయించింది. కానీ ఆ తర్వాత పోలీసు శాఖలోనే సిబ్బంది కొరత ఏర్పడటంతో వారిని ఉపసంహరించుకుని సొంత అవసరాలకు వాడుకుంటోంది. అప్పటి నుంచి ఆర్టీసీ సొంతంగానే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటోంది. కానీ డిపోలు, బస్టాండ్లలో నియోగించేంత సంఖ్యలో సిబ్బంది లేరు. ఇప్పుడు కూడా పోలీసు శాఖ నుంచి హోంగార్డులను కేటాయించే పరిస్థితి ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్టీసీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు దొంగలు రెచ్చిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. పోలీసుకు ఫిర్యాదు చేస్తే ఆధారాల కోసం వారు సీసీటీవీ ఫుటేజీలు కోరుతున్నారు. కానీ అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు లేవు. ఇటీవల ఎండీ నిర్వహించిన సమావేశంలో అన్ని రీజియన్ల నుంచి దొంగతనాల అంశం చర్చకు వచ్చింది. దీంతో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు కావాలో కూడా అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లతోపాటు బస్సులు నిలిపే ప్రధాన రోడ్లలోని పాయింట్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. 60 కొత్త బస్సులు సిద్ధం మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రాకముందే కొన్ని కొత్త బస్సులకు ఆర్టీసీ ఆర్డరిచ్చింది. మార్చి నాటికి 2 వేల బస్సులు రానుండగా తొలివిడతలో 60 బస్సులు సిద్ధమయ్యాయి. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులు వీటిల్లో ఉన్నాయి. వీటిని బుధవారమే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఆ కార్యక్రమం రద్దయింది. మరో రెండుమూడు రోజుల్లో వాటిని ప్రారంభించనున్నట్టు తెలిసింది. -
100% మించిన ఆక్యుపెన్సీ రేషియో
సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుండటంతో టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతం దాటింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య పోటెత్తటంతో రికార్డు స్థాయిలో 100.09% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. కి.మీ.కు రూ.65.07 చొప్పున ఆదాయం నమో నమోదైంది. కిలోమీటరుకు నమోదయ్యే ఆదాయం ఆధారంగా ఆక్యుపెన్సీ రేషియోను లెక్కిస్తారు. రెండో శనివారం, ఆదివారం, క్రిస్మస్, బాక్సింగ్‌డే..ఇలా వరుస సెలవులు రావటంతో జనం ఊళ్ల బాట పట్టడంతో శనివారం ఒక్కరోజే 49,00,723 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండు, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఉప్పల్‌కూడలి తదితర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. ఒక్క ఎంజీబీఎస్ నుంచే దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణించినట్టు అంచనా. ఒక్క రోజులో రూ.21.24 కోట్ల ఆదాయం ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి, దసరా పండగల సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. పండగ సెలవుల్లో ఎక్కువ మంది ప్రయాణించటం ద్వారా రూ.20 కోట్ల వరకు ఆదాయం నమోదవుతుంది. సాధారణ రోజుల్లో అయితే, సోమవారం రద్దీ ఎక్కువగా ఉండి రూ.18 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సోమవారం కాకుండా, సంక్రాంతి, దసరా లాంటి పండగ సెలవులు లేనప్పటికీ శనివారం ఏకంగా రూ.21.24 కోట్ల ఆదాయం నమోదు కావటం విశేషం. క్రమంగా జనం పోటెత్తుతుండటంతో బస్సుల సంఖ్యను పెంచటంతోపాటు సిబ్బందిని ముఖ్య ప్రాంతాల్లో ఉంచి మానిటరింగ్ చేశారు. శనివారం ఒక్కరోజే సూపర్‌లగ్జరీ, డీలక్స్, గరుడ, రాజధాని బస్సులు రద్దీగా మారాయి. ఎక్కువ చార్జి ఉండే సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో సీట్లు నిండిపోవటంతో భారీగా ఆదాయం నమోదైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ఒక్కో గరుడ బస్సులో ట్రిప్పునకు రూ.లక్షన్నర చొప్పున ఆదాయం లభించింది. దీంతో ఆదాయం గరిష్ట స్థాయిలో నమోదై ఆక్యుపెన్సీ రేషియో పెరిగేందుకు కారణమైంది. -
మహా రద్దీ..
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. ‘మహాలక్ష్మి’తర్వాత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 13 లక్షల మేర పెరిగింది. గతంలో 66 శాతంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 90 శాతానికి చేరుకుంది. కొన్ని మార్గాల్లో అది వందశాతం కూడా దాటింది. అంటే సీట్ల సామర్థ్యం కంటే ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులు 70 శాతం సీట్లలో కూర్చుంటున్నారు. దీంతో మిగతా మహిళలు, పురుషులు నిలబడే ప్రయాణించాల్సి రావడం వివాదాలకు కారణమవుతోంది. బస్సులు సరిపోక... పెరిగిన రద్దీని క్రమబద్ధికరించాలంటే బస్సుల సంఖ్య భారీగా పెంచాలి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సగటున 41 లక్షల మంది, రద్దీ ఎక్కువగా ఉండే సోమవారాల్లో 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉంటోంది. మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంది. ఈ కేటగిరీ బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 7292 బస్సులు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఆర్టీసీ డిపోల్లో ఉన్న అన్ని బస్సులు రోజూ రోడ్డెక్కవు. వాటిల్లో కొన్ని బ్రేక్‌డౌన్‌లో ఉంటాయి. కొన్ని ఇతర అవసరాల కోసం స్పేర్‌లో ఉంటాయి. సాధారణ రోజుల్లోనే బస్సులు సరిపోక ట్రిప్పులకు ఇబ్బంది అవుతూ వస్తున్న తరుణంలో, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అమలులోకి రావటంతో బస్సులకు ఒక్కసారిగా తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వంద శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుండటంతో అదనపు ట్రిప్పు నడపాల్సి వస్తోంది. కానీ బస్సులు అందుబాటులో లేక సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఫలితంగా, ప్రయాణికులతో కిక్కిరిసి నడపాల్సి వస్తోంది. స్థలం సరిపోక కొందరు ప్రయాణికులు దిగిపోవాల్సి వస్తోంది. దీంతో అదనపు బస్సు నడపాలంటూ వారు సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు 4 వేల బస్సులు కావాల్సిందే.. ప్రస్తుత రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఇప్పటికిప్పుడు దాదాపు 4 వేల వరకు కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. గతంలోనే ఆర్టీసీ రెండు వేల బస్సులకు ఆర్డరిచ్చింది. వాటిల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు 1,500 వరకు ఉంటాయి. కానీ ఆ బస్సులు అందుబాటులోకి రావాలంటే ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది. వచ్చే మార్చి చివరి నాటికి అవి దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మరో 20 రోజుల్లో 50 బస్సులు అందనున్నాయి. కానీ అప్పటి వరకు ఈ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రయాణికులు–ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని సంతోషపడుతున్నా.. రోజూ నిలబడి ప్రయాణించటం ఇబ్బందిగా భావించేవారు మళ్లీ ఆటోల వైపు మళ్లుతారు. దీంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో కొంత పడిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే నాలుగు వేల బస్సులు కావాలి. కానీ, అన్ని బస్సులు సమకూర్చుకోవటానికి ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త బస్సుల అంశాన్ని ప్రస్తావించలేదు. ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా.. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. వాటిలో 500 బస్సులు సిటీ సర్వీసులుగా తిరుగుతాయి. నగరంలో ఓఆర్ 90 శాతాన్ని దాటింది. అంత లోడ్‌ను ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. లాగినా, బ్యాటరీలు ముందుగానే డిస్ఛార్జి అవుతాయని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అద్దె బస్సుల నోటిఫికేషన్ సమస్య నుంచి గట్టెక్కాలంటే వెంటనే కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఆర్టీసీ అధికారులు మరోసారి అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అద్దె బస్సులు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ప్రస్తుతం రద్దీ విపరీతంగా పెరిగినందున, పాత అద్దె రేట్లకు బస్సులు పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు సుముఖంగా లేరు. అద్దె చార్జీలు సవరించాలని కోరుతున్నారు. సవరిస్తే ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుంది. వారంలో 50 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్ కొత్తగా వచ్చే బస్సుల నమూనాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం పరిశీలించారు. వాటిల్లో లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. సంక్రాంతి నాటికి 200 బస్సులు రోడ్డెక్కుతాయని, వీటిలో 50 బస్సులు వారం రోజుల్లో అందుతాయని సజ్జనార్ వెల్లడించారు. నాలుగైదు నెలల్లో విడతలవారీగా 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని, 540 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు, నగరం వెలుపల తిరిగేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుతాయని వెల్లడించారు. -
గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా
కొత్తకోట రూరల్: గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట జాతీయ రహదారి 44పై చోటుచేసుకుంది. ఎస్ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఆలగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 21 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున కనిమెట్ట సమీపంలోకి రాగానే బస్సుకు గేదే అడ్డం రావడంతో బస్సు డ్రైవర్ గురుదేవ్ గేదెను తప్పించబోగా బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సు తక్కువ వేగంతో ఉండటంతో బస్సులోని ప్రయాణికులు సురక్షింతంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. -
పరారీలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్!
హైదరాబాద్: పబ్లిక్ న్యూసెన్స్‌కు కారకుడైన బిగ్‌బాస్ సీజన్–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్‌బాస్–7 విజేతగా ఎంపిక కాగా, అమర్దీప్ రన్నరప్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌రోడ్ నె.ం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్‌దీప్‌ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్‌పై చేరుకోవడంతో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. కారు డ్రైవర్ సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఆయన అనుచరుల ఫోన్ డేటాను సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువి్వన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను వడపోస్తున్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిస్తున్న జనం
నల్లగొండ రూరల్ : ప్రభుత్వం మహాలక్ష్మి గ్యారెంటీ కింద మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్ జారీ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్‌లలో మహిళలెందరు ప్రయాణించారో లెక్క తేలుతోంది. మొన్నటి వరకు ఆర్టీసీ కండక్టర్ల ఎస్ఆర్ ఆధారంగా లెక్కలు తీశారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సుల్లో మొత్తం 3,08,881 మంది ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వారిలో డబ్బులు చెల్లించిన ప్రయాణికులు 91,660 మంది ఉండగా.. 2,17,221 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఉచితంగా ప్రయాణించిన మహిళలు అత్యధికంగా నల్లగొండ డిపో నుంచి 50,652 మంది, అతి తక్కువగా నార్కట్‌పల్లి డిపో నుంచి 5,661 మంది ఉన్నారు. బస్సుల్లో పెరిగిన రద్దీ.. సాధారంగా ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల పరిధిలో రోజూ సగటున లక్షా 60 వేల మంది ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. ఉచిత ప్రయాణానికి జిల్లాలోని 7 డిపోల పరిధిలో 144 ఎక్స్‌ప్రెస్‌లు, 353 పల్లె వెలుగు బస్సులు నడుస్తున్నాయి. సహజంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆర్టీసీకి రద్దీ పెరుగుతుంది. అయితే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తుండడంతో బంధువుల నివాసాలకు, దూర ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలను చూసి వచ్చేందుకు కుటుంబ సభ్యులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం పేదలు, ఆస్పత్రులకు వెళ్లే వారికి ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. -
TS: నేటినుంచి జీరో టికెట్
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. మహిళలకు ఈ నెల 9 మధ్యాహ్నం నుంచి ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నా, వారికి ఎలాంటి టికెట్ జారీ చేయటం లేదు. అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయటం ద్వారా సమకూర్చనుంది. అందువల్ల ప్రతినెలా ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు, అందువల్ల ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయింది.. అన్న లెక్కలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. టికెట్‌పై చార్జీ సున్నా అని చూపించినా, ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్లో నమోదవుతుంది. అంతదూరం ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ జీరో టికెట్ విధానాన్ని సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావటంతో ప్రయోగాత్మకంగా గురువారం కొన్ని డిపోల్లో వీటిని జారీ చేసి పరిశీలించారు. శుక్రవారం నుంచి అన్ని డిపోల పరిధిలో జీరో టికెట్ జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గుర్తింపు కార్డు తప్పనిసరి తెలంగాణలో నివసించే మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. దీంతో శుక్రవారం నుంచి కండక్టర్‌కు మహిళలు కచ్చితంగా తెలంగాణ ప్రాంత నివాసితులుగా ధ్రువపరిచే ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా నివాస ప్రాంతాన్ని తెలిపే గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ చూపించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఎవరైనా గుర్తింపు కార్డు మరిచిపోతే, మళ్లీ మరిచిపోవద్దని హెచ్చరించి జీరో టికెట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత మాత్రం అనుమతించరని అధికారులు చెబుతున్నారు. నిధుల విడుదలపై హర్షం మహాలక్ష్మి పథకానికి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్టీసీకి రూ.374 కోట్లు విడుదల చేయటంపై కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బకాయి ఉన్న ఇతర మొత్తాలను కూడా అందించి ఆర్టీసీని ఆదుకోవాలని ఎన్ఎంయూ నేతలు నరేందర్, కమాల్‌రెడ్డి, చెన్నారెడ్డి, ఖదీర్ తదితరులు కోరారు. ఇక ప్రజావాణి మాదిరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు 15 రోజులకోసారి కార్మిక వాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కోరారు. -
'ఆర్టీసీ ఫుల్.. ఆటో నిల్' ఇదేమి ఖర్మరా మాకు! : ఆటో డ్రైవర్లు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ఆటో డ్రైవర్లకు ప్రయాణికుల్లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు. మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండటంతో.. కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి తదితర ప్రాంతాలకు గిరాకీలు దొరకక పూట గడవని పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాజీవ్ రహదారిలోని మొగ్ధుంపూర్ స్టేజీ వద్ద ఆటోలున్నా.. మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కారు. బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటో డ్రైవర్లు ఇదేమి ఖర్మరా మాకు అంటూ బిక్కమొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
హెల్మెట్ ధరించి గమ్యస్థానానికి..
దామరగిద్ద: బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించడం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు చూస్తున్నది నిజమే.. హైదరాబాద్ నుంచి నారాయణపేటకు ఆర్టీసీ బస్సు బయల్దేరగా.. కొడంగల్ సమీపంలో డ్రైవర్ ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. డ్రైవర్ తిరుపతయ్యతో పాటు కండెక్టర్ రఘువీర్‌కు గాజుముక్కలు తగిలి చేతివేళ్లకు గాయాలయ్యాయి. మరోవైపు ముసురు.. చల్లని గాలితో బస్సును నడపడం డ్రైవర్‌కు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో కొడంగల్ నుంచి బస్సు డ్రైవర్ హెల్మెట్ సహాయంతో బస్సు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. -
‘ఉచిత ప్రయాణానికి’ ఏర్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం ఎలా అమలవుతోంది, అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది..అన్న విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది. రెండు రోజుల పాటు అక్కడ పరిశీలించి నివేదికను సిద్ధం చేయనుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావటంతో అధికారులు పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో కూడా అమలు చేస్తే.. దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కానీ అక్కడ, కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లోనే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ, కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ప్రకటించింది. అధికారంలోకి రావటంతో దాన్ని అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ కర్ణాటక మోడల్‌ను అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్‌ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్లు అవుతుంది. పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రతినెలా దాదాపు రూ.185 కోట్లు .. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే, ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్ చేయాలి. అంటే ప్రతి నెలా రూ.185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. జీరో టికెట్ ప్రవేశపెడతారా..? ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెక్క తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. మహిళలకు రూ.సున్నా అని ఉండే జీరో టికెట్‌ను జారీ చేస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
కొండాపూర్ సర్పంచ్ ఆకస్మిక మృతి
గండేడ్: మండలంలోని కొండాపూర్ సర్పంచ్ చాకలి శ్రీనివాస్ శుక్రవారం రాత్రి మృతి చెందారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే శ్రీనివాస్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ముమ్మర ప్రచారం నిర్వహించారు. గురువారం ఓటు వేద్దామనే సమయానికి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఓటు వేయకుండానే మహబూబ్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లిపోయారు. అతడి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందారు. అతను గతంలో రెండు సార్లు ఎంపీటీసీగా పనిచేశారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య పుష్పలత స్టాఫ్‌నర్సుగా పనిచేస్తుంది. గ్రామంలో విషాదం సర్పంచ్ శ్రీనివాస్ మృతితో కొండాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ.. మూడు సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన శ్రీనివాస్‌కు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంత్యక్రియల్లో పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, జితేందర్‌రెడ్డి, నారాయణ, పెంట్యానాయక్, సర్పంచ్ పుల్లారెడ్డి, సునీత, మాజీ ఎంపీపీ శాంతి, మాజీ వైస్‌ఎంపీపీ రాధారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం నాగర్‌కర్నూల్ క్రైం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు యాదవ్ కథనం మేరకు.. ఖానాపూర్‌కు చెందిన రాములు (59) పాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇది చదవండి: రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్ -
short circuit: పొలంలో పని చేస్తుండగా వరికోత మిషన్ దగ్ధం
పెన్‌పహాడ్ : షార్ట్‌సర్క్యూట్‌తో వరికోత మిషన్ దగ్ధమైంది. ఈ ఘటన పెన్‌పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డికి చెందిన వరికోత చైన్ మిషన్ సింగారెడ్డిపాలెంలోని రైతు పేర్ల లింగయ్య పొలాన్ని కోస్తున్న సమయంలో విద్యుత్ తీగలకు తగిలి షార్ట్‌సర్క్యూట్‌కు గురై దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్‌తో వచ్చి మంటలను అదుపు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి మునగాల(కోదాడ): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందాడు. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు మాదాసు సైదులు(58) గురువారం ట్రాక్టర్ నడుపుకుంటూ ఆకుపాముల శివారులో గల కంకర మిల్లు నుంచి కోదాడ వైపు వెళ్లే రహదారిలో హైవే ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాకొట్టడంతో సైదులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సైదులును 108వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సైదులు శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు మునగాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో ఆవు మృతి నిడమనూరు: మండలంలోని రేగులడ్డ గ్రామంలో శుక్రవారం లింగాల రాజ మ్మకు చెందిన ఆ వు విద్యుదాఘాతంతో మృతిచెందింది. రోజు వారీగా ఆవులను మేత కోసం గ్రామ సమీపంలోకి తీసుకువెళ్లారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆవు గడ్డి మేస్తూ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిందని యజమానురాలు తెలిపింది. ఇది చదవండి: పొలం ఇప్పుడే ఇవ్వడం కుదరదన్న అత్తమామ.. మామపై అల్లుడి దారుణం! -
సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్.. బలైన కండక్టర్
భూదాన్‌పోచంపల్లి : ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్‌బ్రేక్ వేయడంతో ఫుట్‌బోర్డు నుంచి జారి కిందపడి కండక్టర్ మృతిచెందాడు. భూదాన్‌పోచంపల్లి జలాల్పురం గ్రామశివారులో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 50 మందికి పైగా ప్రయాణికులతో ఆదివారం సాయంత్రం 6.20గంటలకు పోచంపల్లి నుంచి సొంత డిపోకు బయలుదేరింది. బస్సులో బిహార్ రాష్ట్రానికి చెందిన కోళ్ల ఫారాల్లో పనిచేసే దాంజిరామ్ కూడా జలాల్పురం వరకు టికెట్ తీసుకున్నాడు.బస్సు జలాల్పురం దాటగానే కండక్టర్ దేవినేని సత్తిరెడ్డి(59) ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ ముందు ఫుట్‌బోర్డు వైపు వచ్చాడు. ఇదే క్రమంలో దాంజిరామ్ తాను దిగాల్సిన స్టేజీ దాటిపోతుందని భావించి వేగంగా కదులుతున్న బస్సులోంచి ఒక్కసారిగా కిందికి దూకాడు. గమనించిన బస్సుడ్రైవర్ పోచంపల్లికి చెందిన మక్తాల సాయి సడెన్ బ్రేక్ వేయడంతో ముందు ఫుట్‌బోర్డు సమీపంలో ఉన్న కండక్టర్ బస్సులోంచి జారి కిందరోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బస్సులోంచి దూకిన దాంజిరామ్ తలకు తీవ్రగాయాలు కాగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన కండక్టర్ సత్తిరెడ్డి హైదరాబాద్‌లోని మన్సురాబాద్‌లో స్థిరనివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. బస్సు డ్రైవర్ మక్తాల సాయి ఏడాది క్రితం భూదాన్‌పోచంపల్లి మండల శివారులో బైక్‌ను ఢీకొట్టి వాహనదారుడి మృతికి కారణమయ్యాడు. దాంతో అప్పుడు ఇతనిపై కేసు నమోదయ్యింది. ఈ మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...!
పాన్‌గల్: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం చెందిన గడ్డం బాలపీరు(29) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఇంటి నుంచి విధుల నిమిత్తం బైక్‌పై వనపర్తికి బయలుదేరాడు. అన్నారంతండా సమీపంలో శివారెడ్డి వ్యవసాయ పొలం వద్ద వనపర్తి నుంచి పాన్‌గల్ వైపు వస్తున్నా వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి బాలపీరు రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాతిపై పడటంతో తలకు బలమైన గాయంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడిపి మృతికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరిగెల కృష్ణయ్యపై తగు చర్యలు తీసుకొవాలని మృతుని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మందలించారనివిద్యార్థిని ఆత్మహత్య అమరచింత: స్నేహితుల ఎదుట మందలించారని మనస్థాపానికి గురైన విద్యార్థిని ప్రణవి(14) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌కు చెందిన నరేష్ కుతూరు ప్రణవి 8వ తరగతి చదువుతుంది. గురువారం ప్రణవిని అవ్వ స్నేహితుల ఎదుట తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. ఇది చదవండి: షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.! -
నాలుగు నెలల గర్భిణి.. చెకప్ కోసమని వెళ్ళి అక్కడి నుండి అదృశ్యం
ఆలేరురూరల్: ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆలేరు పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన యాస్మిన్ నాలుగు నెలల గర్భిణి. ఆదివారం సాయంత్రం చెకప్ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లిన యాస్మిన్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో యాస్మిన్ తండ్రి మహమ్మద్ లాల్‌బీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశ్రీను తెలిపారు. యాస్మిన్ తన భర్త గుడుమియాతో కలిసి సిద్దిపేటలో నివాసముంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ... ప్రయాణికులు సురక్షితం మిర్యాలగూడ టౌన్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ మండలంలోని ఆలగడప వద్ద చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు సోమవారం మిర్యాలగూడ మండలం ముల్కలకాలువకు వెళ్తూ ఆలగడప వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న లారీ బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది. బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్ పాండు మిర్యాలగూడ డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్‌కు తెలియజేయగా.. డీఎం ఆదేశాల మేరకు బస్సు డ్రైవర్ మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి
అల్లాదుర్గం(మెదక్): అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ స్టేజీ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాదుర్గం మండల పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన చిన్నోల సాయికుమార్ (13), విజయ్ (16), అజయ్ ముగ్గురూ ఒకే బైక్‌పై రాంపూర్ బ్రిడ్జి కింద నుంచి సొంత గ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాంపూర్ స్టేజీ వద్ద విద్యార్థుల బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్, విజయ్ అక్కడికక్కడే మృతి చెందగా, అజయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అజయ్‌ను స్థానికులు హైవే అంబులెన్స్‌లో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్ పెద్దశంకరంపేట ప్రభుత్వ పాఠశాలలో 9 తరగతి చదువుతుండగా, విజయ్ పెద్దశంకరంపేట మోడల్ స్కూల్లో 10 తరగతి చదువుతున్నారు. బస్సు డ్రైవర్ వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. బస్సు అద్దాలు ధ్వంసం రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు, మృతుల బంధువులు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. 161 హైవేకి చెందిన మరో వాహనాన్ని సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఘటన స్థలంలో వీడియో తీస్తున్న సీఐ కార్యాలయం రైటర్ ఫోన్‌ను లాక్కొని పగులగొట్టారు. అలాగే, రాంపూర్ వద్ద 161 జాతీయ రహదారిపై గంటపాటు వాహనాలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినా మూడు గంటలపాటు పోలీసులు రాకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. రెండు గంటలపాటు ఆయన ఘటనా స్థలంలోనే ఉన్నారు. అనంతరం పోలీసులు వచ్చి ఈ ఘటనపై కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
కొత్త బండికి పూజ.. కాసేపటికే ఆవిరైన ఆనందం
అనంతపురం: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగర శివారులోని రుద్రంపేటకు చెందిన హరినాథరెడ్డి (23), ప్రవీణ్‌తేజ (22) శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో హరినాథరెడ్డి కొనుగోలు చేసిన నూతన ద్విచక్ర వాహనానికి పూజ చేయించేందుకు సోమవారం ఉదయం ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇద్దరూ చేరుకున్నారు. పూజల అనంతరం తిరుగు ప్రయాణమైన వారు కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో వేగాన్ని నియంత్రించుకోలేక ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ప్రవీణ్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. హరినాథరెడ్డి తలకూ బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక సోమవారం రాత్రి ఆయన కూడా మృతి చెందాడు. ఘటనపై కూడేరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోజూ ఇదే తతంగం సార్ !
బాగేపల్లి: ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు నిర్వహణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అవి ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడం సహజమే. గురువారం ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తన కారులో వస్తూ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సును గమనించి అవాక్కయ్యారు. బాగేపల్లి తాలూకా పాతపాళ్య రోడ్డులో ఉదయం ఎమ్మెల్యే కారులో వస్తుండగా ఓ ఆర్టీసీ బస్సును ప్రయాణికులు తోస్తూ కనిపించారు. వెంటనే ఎమ్మెల్యే కారు దిగి బస్సు డ్రైవర్‌ను పిలిపించి మాట్లాడారు. బస్సుకు రంగులు వేసి కొత్తగా ఉన్నా ఇంజిన్‌లో పసలేదని డ్రైవర్ ఎమ్మెల్యే ఎదుట వాపోయాడు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. దీంతో ఎమ్మెల్యే సుబ్బారెడ్డి మాట్లాడుతూ త్వరలో డిపోకు వచ్చి బస్సుల పరిస్థితిలపై చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అవ్వా తాతలకు ‘ఆత్మియుడి’ అండ
సాక్షి, అమరావతి: జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, పిల్లల కోసం ఎంతో కష్టపడి వయస్సు మీద పడిన వృద్ధులకు కావాల్సింది ఓ ఆత్మీయ పలకరింపు. అవ్వా బాగున్నావా.. తాతా బాగున్నావా.. అంటూ మలి సంధ్యలో ఉన్న వారి అవసరాలను తీరిస్తే వారికి అదే ఆనందం. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని వయో వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వమే పెద్ద భరోసా అన్నట్లుగా వారికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తున్నారు. అవ్వా.. తాతా.. అంటూ ఆత్మీయతను అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల నుంచి వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సంక్షేమంతో పాటు భద్రత, హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. గతంలోలా వృద్ధులు పింఛను కోసం మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరెవరినో బతిమాలుకోవాల్సిన పని లేకుండా వారు ఉన్న చోటుకే వచ్చి పింఛను డబ్బు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు సీఎం వైఎస్ జగన్. గతంలో వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు అనేకం. సీఎం జగన్ ఆ కష్టాల నుంచి అవ్వా తాతలను గట్టెక్కించారు. ఇప్పుడు వలంటీర్లు స్వ యంగా వారు ఉన్న చోటుకు వచ్చి పింఛను డబ్బు అందిస్తున్నారు. వైద్యం కోసం ఆస్పత్రుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులే గ్రామాలకు వచ్చి, పరీక్షలు చేసి, మందులు కూడా ఇస్తున్నారు. సామాజిక భద్రతలో భాగంగా నెలకు రూ.2,750 చొప్పున వృద్ధాప్య పింఛన్లు అందిస్తోంది. గతంలో వృద్ధాప్య పింఛన్ 65 ఏళ్ల వయోపరిమితి ఉంటే దాన్ని 60 ఏళ్లకే కుదించి ఎక్కువ మందికి వైఎస్సార్ పెన్సన్ కానుక అందిస్తోంది. వృద్ధాప్య, ఇతరత్రా పింఛన్లతో మొత్తం 41,05,501 మంది వృద్ధులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి సగటున రూ.13,260.41 కోట్లు వృద్ధులకు పింఛన్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వం ఏపీఎస్‌ఆరీ్టసీ బస్సుల్లో టిక్కెట్ చార్జీ పై 25 శాతం రాయితీ ఇస్తోంది. బస్సుల్లో ముందు డోర్ సమీపంలోని మూడు సీట్లు వృద్ధుల కోసం కేటాయించింది. బస్టాండ్లలో వీల్చైర్లు అందుబాటులో ఉంచింది. వృద్ధుల కోసం మచిలీపట్నం, చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం 2 వృద్ధాశ్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) 68 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కర్నూలు, వైఎస్సార్, తిరుపతి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7 ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 47,490 మంది వృద్ధులు వీటిని ఉపయోగించుకున్నారు. వృద్ధుల సమస్యలు, అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టేందుకు 2021 డిసెంబర్ నుంచి ఎ ల్డర్ లైన్ 14567 (హెల్ప్‌లైన్) నిర్వహిస్తోంది. 26 జిల్లాల నుంచి 39,332 మంది దీని సేవలు ఉపయోగించుకున్నారు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 50,08,662 మంది వృద్ధులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధుల సంక్షేమంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మలి సంధ్యలో ఎవరూ అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. వయోవృద్ధుల సమస్యలు, అవసరాలు గుర్తించి సకాలంలో చర్యలు తీసుకునేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకులు, రాష్ట్ర వయోవృద్ధులు, దివ్యాగుల సంక్షేమ శాఖ 5న వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్ తొలి సమావేశం ఏపీ వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్ తొలి సమావేశం అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ట్రిబ్యునల్స్, అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల ఫిర్యాదుల పరిస్థితి, వారి వైద్య సంరక్షణ, జీవనం, వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకో వాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. -
బస్సు చోరీ చేసి.. ప్రయాణికుల్ని ఎక్కించుకుని..
రాజన్నసిరిసిల్ల జిల్లా: సిద్దిపేటలో చోరీకి గురైన ఆర్టీసీ అద్దె బస్సు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులో ప్రత్యక్షమైంది. పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్దిపేట డిపోకు చెందిన అద్దె బస్సు (టీఎస్ 36 టీఏ 3336)ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా సిద్దిపేట బస్టాండ్‌కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకొని వేములవాడకు వచ్చాడు. ఇక్కడి నుంచి హైదరాబాద్ బోర్డుతో ప్రయాణికులను ఎక్కించుకుని బయల్దేరాడు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, టికెట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు.. తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో సదరు వ్యక్తి బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. వెంటనే ప్రయాణికులు డయల్ 100కు కాల్చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడి పోలీసులు సిద్దిపేట పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గంభీరావుపేటకు చెందిన రాజుగా గుర్తించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
శోభ.. 'నిజాయితీ' కి మారుపేరు..!
మహబూబ్‌నగర్: ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు ఆభరణాల పర్సును బాధిత మహిళకు అందజేసి నిజాయితీ చాటుకుంది ఓ ప్రయాణికురాలు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పునుంతల మండలం కాంసానిపల్లికి చెందిన నెల్లోజు ప్రసన్న ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి కల్వకుర్తి నుంచి ఉప్పునుంతల వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఎక్కింది. ఉప్పునుంతలలో దిగి గ్రామానికి వెళ్లి హ్యాండ్‌బ్యాగ్‌లో చూడగా బంగారు ఆభరణాలు (సుమారు రూ.3 లక్షల విలువ)న్న పర్సు కనిపించలేదు. అదే బస్సులో ప్రయాణించిన సదగోడుకు చెందిన శోభకు బస్సులోనే ఆభరణాల పర్సు దొరకగా కండక్టర్ నారాయణమ్మకు అందజేసింది. సోమవారం అచ్చంపేట డిపో ఆవరణలో బాధితురాలు ప్రసన్నకు పర్సును అందజేసి నిజాయితీని చాటుకుంది. -
బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు
రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సుల్లో నారీ శక్తి ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులో సీటు కోసం ఓ మహిళ వినూత్నంగా తన శక్తియుక్తులను ప్రదర్శించిన ఘటన జిల్లాలో జరిగింది. సోమవారం లింగసూగూరు బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలు బస్సు రాగానే సీట్ల కోసం పోటాపోటీగా ఎగబడ్డారు. బాగల్కోటె నుంచి రాయచూకు వెళ్లే బస్సులో మహిళ బ్యాగ్ వేసినా సీటు దొరకదనే ఆందోళనతో మెదడుకు పని పెట్టారు. ఓ యువకున్ని వంగబెట్టి మరో మహిళ సాయంతో అతని వీపు పైకెక్కి కిటికీలో నుంచి బస్సులోకి దూరి సీటును దక్కించుకుంది. ఈ వీడియోలు, ఫోటోలు అందరినీ అబ్బురపరిచాయి. -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. క్షేమంగా తల్లీబిడ్డలు!
మెదక్: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సుఖ ప్రసవం జరిగిన సంఘటన జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. డిపో మేనేజర్ నారాయణ వివరాలు. పొట్పల్లి గ్రామానికి చెందిన హాజీ పాషా భార్య జరీనా బేగంకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం కోసం బీదర్ ఆసుపత్రికి వెళ్లడానికి శుక్రవారం రాత్రి సహాయకులతో కలిసి జహీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు పట్టణం దాటగానే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. బస్సు డ్రైవర్ ఆనందం, కండక్టర్ కరుణాకర్ మార్గమధ్యలో ఉన్న మిర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బస్సును తరలించారు. నర్స్ సుధారాణిని బస్సు వద్దకు తీసుకుని వచ్చేలోపు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. -
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితులు
సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్ లోయలో ఆర్టీసీ బస్సు దూసుకుపోయిన ఘటనలో గాయపడిన ప్రయాణికులు కోలుకుంటున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో 21 మందికి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన సేవలందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్లు.. కలెక్టర్, ఇతర వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్పర్సన్ గదల బంగారమ్మ, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కణితి వెంకటరావులు ఆస్పత్రికి వెళ్లి బాధిత ప్రయాణికులను పరామర్శించారు. తీవ్ర గాయాలపాలైన బోడిరాజు, చిన్నమ్మలకు విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పిందని పాడేరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు చెప్పారు. మెడికవర్ ఆస్పత్రిలో బాధితులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శంకరరావు సోమవారం పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, ఇతర సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి కలెక్టర్ సుమిత్‌కుమార్, ఇతర అధికారులు నివేదికలు పంపుతున్నారు. ప్రయాణికులు కొండన్న, నారాయణమ్మల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.