చెట్లపోదల్లోకి వెళ్లిన ఆర్టీసీ బస్సు
కరీంనగర్: దుబ్బపల్లి గ్రామశివారులో ఆర్టీసీ బస్సు శుక్రవారం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి మంథని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దుబ్బపల్లి శివారులోకి చేరుకుంది. ఇదే సమయంలో డ్రైవర్ రతన్ గుట్కా వేసుకుంటున్నాడు. పక్కనుంచి లారీ వెళ్తుంగా ఆర్టీసీ డ్రైవర్ స్టీరింగ్ రోడ్డువైపు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రాజీవ్ రహదారి పక్కన చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది.
ఆ సమయంలో బస్సులు దాదాపు 40మందికి పైగా ప్రయాణుకులు ఉన్నారు. ఇందులో దేవిక(సెంటినరీకాలనీ), మల్లయ్య(మంథని), శ్రీరాముల స్వామి(కరీంనగర్) తలకు గాయాలు తీవ్రగాయాలు కాగా, మితాగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుడు శ్రీరాముల స్వామి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment