suddenly
-
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా..
కరీంనగర్: దుబ్బపల్లి గ్రామశివారులో ఆర్టీసీ బస్సు శుక్రవారం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి మంథని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దుబ్బపల్లి శివారులోకి చేరుకుంది. ఇదే సమయంలో డ్రైవర్ రతన్ గుట్కా వేసుకుంటున్నాడు. పక్కనుంచి లారీ వెళ్తుంగా ఆర్టీసీ డ్రైవర్ స్టీరింగ్ రోడ్డువైపు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రాజీవ్ రహదారి పక్కన చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులు దాదాపు 40మందికి పైగా ప్రయాణుకులు ఉన్నారు. ఇందులో దేవిక(సెంటినరీకాలనీ), మల్లయ్య(మంథని), శ్రీరాముల స్వామి(కరీంనగర్) తలకు గాయాలు తీవ్రగాయాలు కాగా, మితాగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుడు శ్రీరాముల స్వామి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు. -
సిలిండర్ నుంచి మంటలు.. ఆపద్బాంధవుడు వచ్చి..
‘జ్ఞానం ఉంటే సరిపోదు.. అనుభవం ఉండాలి’ అని చాలామంది అంటుంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌ను తీసుకువెళుతుండటాన్ని చూడవచ్చు. మరి ఆ తరువాత ఏం జరిగిందంటే.. అకస్మాత్తుగా ఆ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి మంటలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా ఆ మంటలు చల్లారవు. దారినపోయేవారు కూడా ఆ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే ఎట్టకేలకు ఒక వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి, మంటలను అదుపులోకి తీసుకువస్తాడు. వీడియోలో ఉన్న కంటెంట్ గమనిస్తే.. ఒక వ్యక్తి సిలిండర్ నుంచి మంటలు రాగానే సైకిల్‌ను పక్కన పడేసి, ఆపై మంటలను నీటితో ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. మరో నలుగురు కూడా అక్కడికి వచ్చి, సిలిండర్‌పై నీళ్లు చల్లడం మొదలుపెడతారు. అయితే మంటలు అంతకంతకూ పెరుగుతుంటాయి తప్ప చల్లారవు. దీంతో ఆ సిలిండర్‌ను పక్కనే ఉన్న చెరువులో ముంచుతారు. అయినా ఆ మంటలు చల్లారవు. దీంతో ఆకుల సాయంతో ఆ మంటలను ఆర్పేందుకు వారంతా ప్రయత్నిస్తారు. అయినా మంటలు ఆరిపోకపోవడంతో వారంతా కూలబడతారు. అప్పుడు అక్కడికి ఆపద్బాంధవునిలా వచ్చిన ఒక వ్యక్తి తన తెలివితేటలను ప్రదర్శిస్తాడు. చేతిలో తడి సంచితో వచ్చిన అతను దానిని సిలిండర్‌పైన కప్పుతాడు. దీంతో నిప్పుకు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోతుంది. అంతే ఆ సిలిండర్లోని మంటలు ఆరిపోతాయి. @ScienceGuys_ అనే పేరు గల ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. Experience is stronger than knowledge. 👍pic.twitter.com/OtXvLhjvYQ — Science (@ScienceGuys_) March 1, 2024 -
డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు!
జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్‌కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది. నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్‌లోని హోషియార్పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్‌పూర్‌లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్‌పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. #WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr — ANI (@ANI) February 25, 2024 ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్‌గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్‌పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది. -
Viral Video: ఉన్నపలంగా లారీ డోర్ తీసాడు.. తర్వాత ఏమైందంటే..!
-
పుతిన్ మిత్రుడు గుండెపోటుతో ఆకస్మిక మృతి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత సన్నిహిత మిత్రుడు వ్లాదిమిర్ సుంగోర్కిన్ నికోలెవిచ్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన ఖబరోవ్స్క్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతను మృతి చెందే సమయంలో తన సహచరుడు లియోనిడ్ జఖారోవ్తో కలిసి ఉన్నట్లు సమాచారం. రష్యన్ అన్వేషకుడు, ఫార్ ఈస్ట్ పుస్తక రచయిత అయిన వ్లాదిమిర్ అర్సెనీవ్కి సంబంధించిన ఒక పుస్తకాన్ని సేకరించడం కోసం ఖబరోవ్స్క్ పర్యటిస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసకుంది. సుంగోర్కిన్ రష్యన్ ప్రభుత్వ పత్రిక ప్రావ్దా ఎడిటర్ ఇన్ చీఫ్. ఈ మేరకు సుంగోర్కిన్ మిత్రుడు జఖారోవ్ మాట్లాడుతూ...ఆ రోజు భోజనం చేద్దాం అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా సుంగోర్కిన్ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతుంటే...గాలిలోకి తీసువెళ్లాం. కానీ కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తాము హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. ఐతే డాక్టర్లు సుంగోర్కిన్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆయన మరణం రష్యన్ జర్నలిజానికి తీరని లోటు అని అన్నారు. సంగోర్కిన్ తన వృత్తిపరమైన నీతికి, విధేయతకు కట్టుబడి ఉన్న గొప్ప వ్యక్తి అని కన్నీటి పర్యంతమయ్యారు. సుంగోర్కిన్1997 నుంచి ఎడిటర్ ఇన్ చీఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఇటీవలే రష్యన్ వ్యాపరవేత్త, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ ఇవాన్ పెచోరిన్ అనుమానస్పద స్థితిలో మరణించిన కొద్దిరోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పుతిన్ పై హత్య ప్రయోగం జరిగిందంటూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇలా ప్రముఖులు వరుసగా హఠాత్తుగా మృతి చెందడం బాధాకరం. -
షాకింగ్ ఘటన: స్టేజ్‌పై ఉన్నట్టుండి పాడటం ఆపేసిన సింగర్
కొత్త గొంతుకలను వెలుగులోకి తీసుకొచ్చే షో ఇండియన్ ఐడల్. ఈ ప్రఖ్యాత పాటల పోటీల్లో పాల్గొన్న వారు భావి గాయకులుగా మారి సంగీతప్రియుల మది దోచుకుంటున్నారు. మన తెలుగు సినీ గాయకుడు రేవంత్ కూడా ఆ కోవకు చెందిన వాడే. తాజాగా హిందీ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ కొనసాగుతోంది. ఈ పోటీల్లో తన పాటలతో మెస్మరైజ్ చేస్తున్న పవన్‌దీప్ రాజన్ అనూహ్యంగా ప్రేక్షకులతో పాటు జడ్జిలను షాక్‌కు గురి చేశాడు. తన్మయత్వంతో పాట పాడుతుండగా అందరూ మరో లోకంలో తేలుతున్న సమయంలో హఠాత్తుగా పవన్‌దీప్ అర్ధాంతరంగా పాట ఆపేసి.. ఇక చాలు అని వెళ్లిపోయాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను సోనీ టీవీ విడుదల చేసింది. పవన్‌దీప్ ‘హోతన్ సే చులో తుమ్’ పాట పాడుతూ అకస్మాత్తుగా ఆపేశాడు. అంతసేపు ఆసక్తిగా వింటున్న జడ్జిలు ఒకప్పటి నటీనటులు ధర్మేంద, అనితా రాజ్ పాట ఆగిపోవడంతో జడ్జిలు, తోటి పోటీదారులు షాకయ్యారు. మైక్ ఆపేసి వెళ్తున్న పవన్‌దీప్‌ను మరో పార్టిస్పెంట్ నిలువరించి పాటను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రేమ్‌గీత్ సినిమాలో ఆ పాటను గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ పాడారు. ఆయనను మరిపించేలా పాడుతున్న పవన్‌దీప్ ఇలా చేయడంతో ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్ దీప్ సీజన్ మొదటి నుంచి ప్రేక్షకులను తన పాటలతో రంజింపజేస్తున్నారు. అతడి మధురమైన గాత్రానికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. ఇండియన్ ఐడల్ 12వ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజన్ అకస్మాత్తుగా ఇలా చేయడంతో షోలో అతడిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న పవన్‌దీప్ గతంలో కరోనా బారినపడ్డాడు. దీంతో పవన్‌దీప్ వర్చువల్‌గా ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. #IdolPawandeep ki iss performance se kya rang layega iss shaam ka mausam? Dekhiye #DharmendraAndAnitaRajSpecial #IndianIdol2020 aaj raat 9:30 baje, sirf Sony par! pic.twitter.com/YxptSJS1QO — sonytv (@SonyTV) July 18, 2021 -
అకాల బీభత్సం
నెల్లూరు(పొగతోట): జిల్లాలో శనివారం గంటల వ్యవధిలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. ఆత్మకూరు, మర్రిపాడు, వింజమూరు, వెంకటగిరి, ఎస్ఆర్పురం, వరికుంటపాడు, ఉదయగిరి, మర్రిపాడు, జలదంకి, కొండాపురం, దుత్తలూరు, వింజమూరు, కలువాయి, ఏఎస్‌పేట, ఆత్మకూరు, పొదలకూరు, రాపూరు, చేజర్ల, ముత్తుకూరు, అల్లూరు, కొడవలూరు, మనుబోలు, సంఘం, కలిగిరి, అనంతసాగం, డక్కిలి, వెంకటగిరి, ఓజిలి తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కుడిన వర్షం కురిసింది. మెట్టప్రాంతంలోని కొన్నిచోట్ల పిడుగులుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. అకాల వర్షాలతో మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి. ఉరుములు, ఈదురుగాలులుతో వర్షాలు పడడంతో మామిడి, నిమ్మ, బత్తాయి కాయలు రాలిపోయాయి. ఈ వర్షాల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. నెల్లూరు నగరంలో చిరుజల్లులు కురిశాయి. వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో ప్రజలకు ఉపశమనం లభించింది. నాయుడుపేటలో రాత్రి 9 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు వ్యక్తి మృతి మర్రిపాడు: మర్రిపాడు మండలంలోని పొంగూరు గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగుపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పొంగూరు గ్రామానికి చెందిన సత్యాల చిన్నయ్య(46) పొలానికి వెళ్లి ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై పిడుగులు, గాలివాన వచ్చింది. ఈ సమయంలో గ్రామంలోని పొలంలో పిడుగుపడడంతో సమీపంలో ఉన్న చిన్నయ్య షాక్‌కు గురై పడిపోయాడు. స్థానికులు ఆయనను హుటాహుటిన ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో పొంగూరు గ్రామ ఎస్సీకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే తిక్కవరం గ్రామానికి చెందిన ఉప్పల మస్తాన్‌కు చెందిన 10 గొర్రెలు పిడుగుపాటుకు మృతిచెందాయి. ఖాదర్పూర్ గ్రామంలో చెట్టు కూలి ఒక ట్రాక్టర్ దెబ్బతింది. దుత్తలూరులో వర్ష బీభత్సం దుత్తలూరు: దుత్తలూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. బలమైన గాలులు వీయడంతో చెట్ల కొమ్మలు బంకులు, ఇళ్లు, రోడ్లపై విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నందిపాడులో పొలాల్లో భారీగా వర్షపునీరు చేరింది. ధాన్యం రైతుల ఆందోళన ఆత్మకూరు: అకాల వర్షంతో పొలాలు, రోడ్లపై ధాన్యం ఉంచిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓ వైపు గిట్టుబాటు ధర లేక, దళారులకు అమ్ముకోలేక ఎప్పటికైనా ధర పెరగకపోతుందా అన్న ఆశతో అందుబాటులో ఉన్న స్థలాల్లో, రోడ్లపైన రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. అకాల వర్షంతో రోడ్లపై ఆరబోసుకున్న ధాన్యం ఎక్కడ దెబ్బతింటుందోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని ఓ చోట రాసులుగా పోసుకుని తడవకుండా పట్టలు కప్పుకోవడంలో తలమునకలవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తడిసి మొలకలు ఎత్తితే తమ కష్టం వర్షార్పణం అవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
లారీలోనే డ్రైవర్ హఠాన్మరణం
రంగారెడ్డి: ఓ లారీ డ్రైవర్ తన సీటులోనే హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు ప్రాంతానికి చెందిన ఓ లారీని డ్రైవర్ కోకాపేట్ ప్రాంతంలో రోడ్డు ప్రక్కనే ఆపి స్టీరింగ్ పైనే పడిపోయాడు. విషయాన్ని గమనించిన వాహనాదారులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరీశీలించే సరికి అతడు మృతి చెంది ఉన్నాడు. మృతుని వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా తమిళనాడులోని బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.