జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్‌లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్‌కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది.
నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్‌లోని హోషియార్‌పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది.
దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్‌పూర్‌లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్‌పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు.
#WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr
— ANI (@ANI) February 25, 2024
ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్‌గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్‌పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment