Running
-
పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో
సూపర్ స్టార్ 'రజనీ కాంత్' రోబో సినిమా వచ్చిన తరువాత.. బహుశా రోబోలు ఇలాగే ఉంటాయేమో అని చాలామంది భావించారు. అయితే ఇటీవల టెస్లా రూపొందించిన నడిచే రోబోకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు చైనా కంపెనీ ఏకంగా పరుగెత్తే రోబోను తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.చైనీస్ కంపెనీ ‘రోబో ఎరా’ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘స్టార్1’ పేరుతో రూపొందించిన ఈ రోబో శరవేగంగా పరుగులు తీయగలదు. ఇది గంటకు 8 మైళ్లు (12.98 కి.మీ.) వేగంతో పరుగెడుతోంది. ఈ రోబోకు హైటార్క్ మోటార్లు, ఏఐ సెన్సార్లు అమర్చడం వల్ల.. ఇది ఎలాంటి ఎగుడు దిగుడు దారుల్లోనైనా అదే వేగంతో పరుగెతూనే దాటేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు‘రోబో ఎరా’ చూడటానికి సగటు మనిషి పరిమాణంలోనే 5.6 అడుగుల ఎత్తు, 64.86 కేజీల బరువుతో ఉంటుంది. ఇలాంటి పరుగుల రోబోలను ‘టెస్లా’ కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతోను, ‘బోస్టన్ డైనమిక్స్’ కంపెనీ ‘అట్లాస్’ పేరుతోను రూపొందించాయి. అయితే, ‘రోబో ఎరా’ తాజాగా రూపొందించిన ‘స్టార్ 1’ వాటి కంటే వేగంగా పరుగులు తీయగలగడంతో, అత్యంత వేగవంతమైన రోబోగా రికార్డు సాధించింది. -
ఫిట్.. బాడీ సెట్..
కండలు తిరిగే దేహం అంటే యువతకు యమ క్రేజ్ ఉంటుంది. దీనికోసం జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. కొందరు రెగ్యులర్‌గా వెళ్లి సిక్స్ ప్యాక్ వచ్చేంత వరకూ కష్టపడుతుంటారు. కండలు పెరిగేందుకు ప్రొటీన్ పౌడర్ వంటివి తీసుకుంటుంటారు. వీటివల్ల దుష్పరిణామాలు చాలానే ఉంటాయి. అయితే అథ్లెటిక్ బాడీ అంటే గత కొంతకాలంగా యువతలో క్రేజ్ పెరిగిపోతోంది. విల్లులా దేహాన్ని మలుచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ దేహాన్నే మీసోమార్ఫ్ దేహం అని అంటుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రౌండ్స్‌లో పరుగులు పెడుతూ.. వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో ఫిట్నెస్తో పాటు మానసిక ఉల్లాసం, చక్కటి దేహాన్ని సొంతం చేసుకుంటున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లోని గ్రౌండ్స్‌లో యువత ఇటీవల ఫిట్నెస్ కోసం వ్యాయామాలు, కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. దీనికి పోటీ పరీక్షలైన ఆర్మీ, పోలీసులు, ఆరీ్పఎఫ్ వంటి నియామకాలు ఒక కారణమైతే.. స్పోర్ట్స్‌పై ఇంట్రెస్ట్‌తో కొందరు.. ఫిట్నెస్ మీద పెరిగిన అవగాహనతో మరికొందరు వ్యాయామాల భాటపడుతున్నారు. దీంతో ఉదయాన్నే లేచి గ్రౌండ్లో పరుగులు పెడుతున్నారు. అయితే గ్రౌండ్లో కసరత్తుల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలాంటి కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..? ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం..శరీర భాగాలపై సమానంగా.. జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా రోజూ రన్నింగ్ చేయడం వల్ల శరీరం ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో ఒకే శరీర అవయవంపై మాత్రమే వర్క్‌లోడ్ పడుతుంటుంది. అదే గ్రౌండ్లో వర్కవుట్స్ వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ఒకే విధంగా పనిచేస్తుంది. హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల కండరాలకు గాయమయ్యే ప్రమాదం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలూ ఎక్కువే. అయితే గ్రౌండ్లో వర్కవుట్స్ ద్వారా వచ్చిన ఫలితాలు చాలా కాలం వరకూ ఉంటాయి. అంటే కొంత కాలం కసరత్తులు ఆపేసినా కూడా పెద్దగా శరీరంలో మార్పులు రావు. అదే జిమ్ మధ్యలో ఆపేస్తే శరీరం మొత్తం మారిపోతుంది.ట్రైనింగ్ పద్ధతులు.. గ్రౌండ్లో చేసేందుకు సాధారణంగా పలు రకాల ట్రైనింగ్ పద్ధతులు ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, రెప్యుటేషన్ ట్రైనింగ్, క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అనే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా చక్కటి శరీరాకృతి పొందవచ్చు. బర్ఫీ, జంపింగ్ జాక్స్ వంటి ఎక్సర్సైజ్ల ద్వారా శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. వీటి వల్ల కొవ్వు తగ్గి బరువు తగ్గుతుంది. రన్నింగ్‌తో జీవక్రియలు మెరుగుపడటమే కాకుండా, శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్రౌండ్లో వర్కవుట్స్ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం తప్పనిసరి. దీంతో రన్నింగ్ చేసే స్టామినా పెరుగుతుంది.ఎత్తు పెరిగే అవకాశం.. గ్రౌండ్లో కసరత్తులు, రన్నింగ్ చేయడం వల్ల 18 ఏళ్ల లోపు పిల్లల్లో ఎత్తు పెరుగుతారని చెబుతున్నారు. అదే ఆ వయసులో ఉన్న వారు జిమ్ చేస్తే ఎత్తు పెరగడం ఆగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్‌లో ఉండే పరికరాలు అందరూ వాడటం వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూల్‌డౌన్ పద్ధతులు తప్పనిసరి.. గ్రౌండ్లో రన్నింగ్ లేదా కసరత్తులు చేసిన తర్వాత బాడీ కూల్‌డౌన్, స్ట్రెచ్ ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. ఇది అలసిపోయిన కండరాలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు పనికొస్తుంది. 30 ఏళ్లు దాటిన వాళ్లు ఎక్కువ కఠినమైన ఎక్సర్సైజులు చేయకపోవడం మంచిది. కండరాలపై స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. – కె.ధర్మేందర్, ఫిజికల్ డైరెక్టర్డైట్ చాలా ముఖ్యం.. గ్రౌండ్లో వర్కవుట్ చేసే వారికి డైట్ చాలా ముఖ్యం. శరీర తీరు, బరువు, చేసే వర్కవుట్‌ను బట్టి ఆహారం తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ఉన్న ఆహారపదార్థాలు తగ్గించాలి. ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కండరాలు పెరుగుతాయి. ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరిగి, బరువు పెరగదు. నీరు కూడా అధికంగా తీసుకుంటుండాలి. వర్కవుట్ కన్నా ముందు కనీసం ఒక లీటర్ నీళ్లు (గోరు వెచ్చటి నీరు) తాగాలి. – వసుధ, క్లినికల్ న్యూట్రిషనిస్టు -
ఆ గుర్రం పరుగు గంటకు 100 కి.మీ.. రోజూ నెయ్యితో మాలిష్
సోన్ పూర్ : బీహార్‌లో సోన్పూర్ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ జంతు మేళాకు పలు ప్రత్యేకతలు కలిగిన జంతువులను వాటి యజమానులు తీసుకువచ్చారు. వాటిలో ఒకటి అనంత్ సింగ్ అలియాస్ ఛోటే సర్కార్‌కు చెందిన గుర్రం. దీని పేరు డార్లింగ్. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ గుర్రం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ గుర్రం ఎంత వేగంతో పరిగెడుతుంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే దీని ధర వింటే ఒకపట్టాన ఎవరూ నమ్మలేరు.గుర్రపు యజమాని రుడాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ గుర్రం ఏకే 56 సింధీ జాతికి చెందినదనని తెలిపారు. ఇది యజమాని దగ్గర ఎంతో విధేయంగా మెలుగుతుందన్నారు. ఈ జాతికి చెందిన గుర్రాల సగటు ఎత్తు 64 అంగుళాలు. అయితే ‘డార్లింగ్’ ఎత్తు 66 అంగుళాలు. సాధారణ గుర్రాల నిర్వహణకు ప్రతినెలా రూ. 10 వేల వరకూ ఖర్చు అవుతుంది. అయితే ఈ ప్రత్యేక గుర్రం సంరక్షణకు ప్రతినెలా రూ.35 వేలు ఖర్చవుతుంది.ఈ గుర్రాన్ని సంరక్షణలో దాని యజమాని రుడాల్ యాదవ్ ప్రత్యేక మెళకువలను అవలంబిస్తుంటాడు. ఈ గుర్రానికి ప్రతీరోజు ప్రత్యేకమైన నెయ్యితో మాలిష్ చేస్తుంటాడు. ఈ గుర్రం వేగం విషయానికి వస్తే రికార్డులు తీరగరాయాల్సిందే. ఈ గుర్రానికి ఏడాది వయస్సు నుంచే పరుగులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రుడాల్ యాదవ్ తెలిపారు. ఈ గుర్రం సాధారణంగా గంటకు 45 కి.మీ వేగంతో పరిగెడుతుంది. అయితే దీని పూర్తి వేగం గంటకు 100 కి.మీ.నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సింధీ జాతి గుర్రాలు ఓర్పు, చురుకుదనానికి ప్రసిద్ధి చెందాయి. గుర్రపు ప్రేమికులు ఈ జాతి గుర్రాలను అమితంగా ఇష్టపడుతుంటారు. దీని ధర విషయానికొస్తే గుర్రం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏకే 56’ ధర సుమారు రూ.1.11 కోట్లు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
Kargil Vijay Diwas: 4 రోజులు.. 160 కి.మీ.లు
ముంబై: కార్గిల్ విజయ్ దివస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ మాజీ అధికారిణి సాహసోపేతమైన ఫీట్ చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ వర్షారాయ్ 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. రన్ జూలై 19న ప్రారంభమై జూలై 22న ముగిసింది. శ్రీనగర్ నుండి ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు ఆమె సగటున రోజుకు 40 కి.మీ. పరుగెత్తారు. పరుగు పూర్తయిన సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అరి్పంచారు. ఆమెతో పాటు చినార్ వారియర్స్ మారథాన్ జట్టు కూడా ఉంది. లెఫ్టినెంట్ కల్నల్ వర్షా రాయ్ భర్త కశ్మీర్లో ఆర్మీ అధికారిగా ఉన్నారు. -
పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో కుప్పకూలి.. యువకుడు మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. పుణెలో జరిగిన పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో కుప్పకూలి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడిని 27 ఏళ్ల తుషార్ బాబన్గా గుర్తించారు.శివాజీనగర్ ఏరియాలోని పోలీస్ గ్రౌండ్లో శనివారం పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఫిజికల్ టెస్ట్‌లలో భాగమైన పరుగు పందెంలో పరుగెత్తుతూ అహ్మద్ నగర్‌లోని సంగమ్‌నేర్‌కు చెందిన తుషార్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడువెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో యువకుడికి గుండెపోటు వచ్చినట్లు తేలిందని, దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. -
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్‌లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్‌తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్‌లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్‌లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్‌షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్‌కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్‌లో జరిగిన పారా ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్‌కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
లక్నో: దేశంలో సాధారణ ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల పర్వంలో పలువురు నేతలు ప్రజలకు వినోదం పంచుతుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఒక నేత నామినేషన్ దాఖలుకు గడువు మించిపోతున్నా ప్రచార కార్యక్రమంలో పాల్గొని చివరి నిమిషంలో పరుగందుకున్నారు.దాదాపు 100 మీటర్ల దూరం పరుగులు పెట్టి చివరకు గడువు లోపల నామినేషన్ ఫైల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ డేరియా నియోజకవర్గంలో గురువారం జరిగింది. ఇక్కడి బీజేపీ అభ్యర్థి త్రిపాఠి తన నామినేషన్‌కు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య హాజరయ్యారు. దీంతో ఆ ప్రోగ్రామ్ బిజీలో ఉండిపోయి తన నామినేషన్నే రిస్కులో పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే చివరి 15 నిమిషాల్లో ఎలాగోలా పరుగెత్తి నామినేషన్ ఫైల్ చేయగలిగారు. 54 ఏళ్ల త్రిపాఠి తన కాలేజీ రోజుల్లో మంచి రన్నర్‌గా పేరుతెచ్చుకున్నారు. అది ప్రస్తుత ఎన్నికల్లో ఇలా ఆయనకు కలిసి రావడం విశేషం. ‘ఐఐటీలో చదివే రోజుల్లో నేను మంచి రన్నర్‌ను అది ఇప్పుడు నాకు గడువులోపల నామినేషన్ వేసేందుకు కలిసి వచ్చింది’అని త్రిపాఠి చెప్పారు. -
డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు!
జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్‌కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది. నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్‌లోని హోషియార్పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్‌పూర్‌లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్‌పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. #WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr — ANI (@ANI) February 25, 2024 ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్‌గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్‌పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది. -
గుడ్లగూబ పరుగులు చూశారా?
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవేంలేదు. తాజాగా గుడ్లగూబకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గుడ్లగూబ పరిగెత్తడాన్ని చూడవచ్చు. నేటి రోజుల్లో గుడ్లగూబను చూడటమే అంత్యంత అరుదు. ఎప్పుడైనా కనిపించినా అది చెట్టుపైనే కనిపిస్తుంది. అయితే ఒక గుడ్లగూబ నేలపై పరిగెత్తడాన్ని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఓ ఇంటిలోపల గుడ్లగూబ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ గుడ్లగూబను చూసిన తర్వాత అది ఆ ఇంటిలోని వారి పెంపుడు జంతువు అని అనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా చాలామంది జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఇష్టపడతారు. ఈ వీడియోను అమేజింగ్ నేజర్ అనే పేరుగల ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఒక యూజర్ ‘ఇది అద్భుతమైన వీడియో’ అని రాయగా, మరొకరు ‘నేను మొదటిసారిగా గుడ్లగూబ నడవటాన్ని చూస్తున్నాను’ అని రాశారు. ఇది కూడా చదవండి: లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం? Have you ever seen a owl run ? pic.twitter.com/roSdhAUSyX — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 30, 2023 -
ఈ రాంబాబు కథ స్పూర్తిదాయకం.. దినసరి కూలీ నుంచి ఏషియన్ గేమ్స్ పతాకధారిగా..!
హాంగ్ఝౌ వేదికగా జరిగిన 2023 ఏషియన్ గేమ్స్‌లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్ విభాగంలో మెజార్టీ శాతం పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఈసారి పతకాలు సాధించిన వారిలో చాలామంది దిగువ మధ్యతరగతి, నిరుపేద క్రీడాకారులు ఉన్నారు. ఇందులో ఓ అథ్లెట్ కథ ఎంతో సూర్తిదాయకంగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామ్ బాబు దినసరి కూలీ పనులు చేసుకుంటూ ఏషియన్ గేమ్స్ 35కిమీ రేస్ వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మంజూ రాణితో కలిసి కాంస్య పతకం సాధించాడు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని రామ్ బాబు తన అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమయ్యే డబ్బు సమీకరించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినసరి కూలీగా పనులు చేశాడు. కూలీ పనుల్లో భాగంగా తన తండ్రితో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఈ పని చేసినందుకు రామ్ బాబుకు రోజుకు 300 కూలీ లభించేది. Daily wage worker to Asian Games Medallist. Unstoppable courage & determination. Please give me his contact number @thebetterindia I’d like to support his family by giving them any tractor or pickup truck of ours they want. pic.twitter.com/ivbI9pzf5F — anand mahindra (@anandmahindra) October 14, 2023 ఈ డబ్బులో రామ్ బాబు సగం ఇంటికి ఇచ్చి, మిగతా సగం తన ట్రైనింగ్‌కు వినియోగించుకునే వాడు. రామ్ బాబు తల్లితండ్రి కూడా దినసరి కూలీలే కావడంతో రామ్ బాబు తన శిక్షణ కోసం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడ రామ్ బాబు ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు ఎదిగాడు. ఇతను పడ్డ కష్టాలు క్రీడల్లో రాణించాలనుకున్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన రామ్ బాబు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పేదరికం అడ్డురాదని రుజువు చేశాడు. అతి సాధారణ రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల్లో అపురూపమైన ఘనత సాధించడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకుని అందరిలో స్ఫూర్తి నింపాడు. తాజాగా ఈ రన్నింగ్ రామ్ బాబు కథ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రను కదిలించింది. రామ్ బాబు కథ తెలిసి ఆనంద్ మహీంద్ర చలించిపోయాడు. అతని పట్టుదలను సలాం కొట్టాడు. నీ మొక్కవోని ధైర్యం ముందు పతకం చిన్నబోయిందని అన్నాడు. రామ్ బాబు ఆర్ధిక కష్టాలు తెలిసి అతన్ని ఆదుకుంటానని ప్రామిస్ చేశాడు. అతని కుటుంబానికి ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించి ఆదుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. Follow the Sakshi TV channel on WhatsApp: -
Asian Games 2023: భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. ఆల్‌టైమ్ రికార్డు
ఏషియన్ గేమ్స్ 2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్ (ముహమ్మద్ అనాస్ యహియా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్) 4X400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 81కి (18 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. ఇవాళ ఉదయమే పతకాల సంఖ్య విషయంలో గత రికార్డును (2018 జకార్తా గేమ్స్‌లో 70 పతకాలు) అధిగమించిన భారత్.. నీరజ్, ఫురుషుల రిలే టీమ్ స్వర్ణాలతో ఏషియన్ గేమ్స్ ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ క్రీడల్లో స్వర్ణాల విషయంలో భారత్ గత రికార్డు 16గా ఉండింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ అత్యధికంగా 16 పతకాలు సాధించింది. తాజా క్రీడల్లో భారత్ స్వర్ణాల విషయంలో ఆల్‌టైమ్ రికార్డు (18) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ ఇదే జోరును కొనసాగిస్తే 100కు పైగా పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, మెన్స్ రిలే టీమ్ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్యను 81కి పెంచుకుని, పతాకల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 316 పతకాలతో (171 గోల్డ్, 94 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 147 మెడల్స్‌తో (37, 51, 59) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 148 పతకాలతో (33, 45, 70) మూడో స్థానంలో ఉన్నాయి. -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్.. మరో 2 స్వర్ణాలు
ఏషియన్ గేమ్స్ 2023లో పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. ఆదివారం టీమిండియా ఖాతాలో మరో 2 స్వర్ణ పతకాలు చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే.. షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తూర్ స్వర్ణాలతో మెరిశారు. ఈ రెండు మెడల్స్‌తో ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 బంగారు పతకాలు చేరాయి. మొత్తంగా ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 45కు (13 గోల్డ్, 16 సిల్వర్, 16 బ్రాంజ్) చేరింది. 13th Gold Medal for India 🇮🇳 in Asian Games. - Tajinderpal Singh Toor is a hero.pic.twitter.com/dIfl9NN0DB — Johns. (@CricCrazyJohns) October 1, 2023 పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 233 పతకాలతో (124 గోల్డ్, 71 సిల్వర్, 38 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 122 పతకాలతో (30, 34, 58) రెండో స్థానంలో, జపాన్ 110 మెడల్స్‌తో (29, 40, 41) మూడో స్థానంలో ఉన్నాయి. Avinash Sable - the hero of India today in Asian Games!A Gold Medal in record time in 3000m Steeplechase.pic.twitter.com/EpLjVD83YF— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2023 రికార్డు బద్దలు కొట్టిన సాబ్లే.. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణ పతకం సాధించిన అవినాశ్ సాబ్లే 8:19:50 సెకెన్లలో పరుగును పూర్తి చేసి ఏషియన్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. రేస్ పూర్తియ్యే సరికి సాబ్లే దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం విశేషం. ఈ పతకం ప్రస్తుత ఎడిషన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం. నాలుగో షాట్‌పుటర్.. షాట్‌పుట్‌లో స్వర్ణంతో మెరిసిన తజిందర్ పాల్ సింగ్ తూర్ వరుసగా రెండో ఏషియన్ గేమ్స్‌లో (2018, 2023) గోల్డ్ మెడల్స్ సాధించిన నాలుగో షాట్‌పుటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పర్దుమాన్ సింగ్ బ్రార్ (1954, 1958), జోగిందర్ సింగ్ (1966, 1970), బహదూర్ సింగ్ చౌహాన్ (1978, 1982) ఈ ఘనత సాధించారు. ప్రస్తుత క్రీడల్లో తూర్ సాధించిన పతకం భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో రెండోది. దీనికి కొద్దిసేపటి ముందే అవినాశ్ సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణ పతకం సాధించాడు. -
నేరం చేస్తే అంతే సంగతులు!
20 నెలల్లోనే ఉరి శిక్ష అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ మౌలాలి అదే గ్రామానికి చెందిన సరళమ్మ, గంగులమ్మలను హత్య చేసి అనంతరం 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో కేవలం 20 నెలల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన న్యాయస్థానం సయ్యద్ మౌలాలికి ఉరి శిక్ష విధించింది. ఆ ఇద్దరికీ 20 ఏళ్ల జైలు 2022లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో 2022లో ఓ యువతిపై పాలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసును కూడా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో దర్యాప్తు చేసిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్‌షిట్ దాఖలు చేశారు. తగిన ఆధారాలతో నేరాన్ని నిరూపించారు. దాంతో న్యాయస్థానం దోషులు పాలుబోయిన విజయ్ కృష్ణ, పాలుచూరి నిఖిల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సాక్షి, అమరావతి: ఎవరైనా నేరానికి పాల్పడితే శిక్ష పడాల్సిందే అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకోసం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ (నేరారోపణ ఆధారిత పోలీసింగ్) విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏళ్ల కొద్దీ దర్యాప్తు.. ఆధారాల సేకరణకు నానా తంటాలు.. సుదీర్ఘ కాలం విచారణ.. వెరసి నేరం జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులు దర్జాగా బయట తిరిగే పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. ఇలాంటి అస్తవ్యస్త విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకోవడం అసంభవం అన్నట్టుగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. దాంతో గతంలో ఎన్నడూలేని రీతిలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తున్నాయి. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. నేరాలకు పాల్పడే వారికి సత్వర శిక్షలు విధించేలా చేయడంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం 2022 జూన్ నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టింది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా కేసుల బాధ్యతలు అప్పగించింది. పోలీస్ జిల్లా యూనిట్ల అధికారులకు ఐదేసి కేసుల చొప్పున అప్పగించింది. ఆ కేసుల దర్యాప్తు, విచారణను వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు పదేసి చొప్పున కేసులు అప్పగించి దర్యాప్తును సత్వరం పూర్తి చేసి చార్జిషిట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించింది. దాంతో దోషులను గుర్తించి.. దోషులు చేసిన నేరాన్ని న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేస్తోంది. సత్వరమే శిక్షలు ఈ విధానం సత్పలితాలిస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందులోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయడం పోలీసు శాఖ సమర్థతకు అద్దం పడుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు కన్విక్షన్ బేస్డ్ విధానంలో 122 కేసులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వాటిలో ఏకంగా 109 కేసుల్లో తగిన ఆధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాలు శిక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే దాదాపు 90 శాతం కేసుల్లో నేరస్తులకు సత్వరమే శిక్షలుపడటం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. నేరాల తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్షలు విధించడం కూడా నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ ఏమాత్రం ఉదాసీనంగా లేదన్న సందేశాన్నిస్తోంది. -
వ్యాయామమే మంచి మందు
సాక్షి, అమరావతి: ప్రతి రోజూ అర గంటపాటు నడక, పరుగు, సైక్లింగ్, ఈత.. ఇలా ఏదో ఒకదాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నవారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా వరకు వ్యాధులను దరి చేరకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం వ్యాయామాన్ని మించిన మందు లేదని వివరిస్తున్నారు. ఈ మేరకు అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. మందుల కంటే కూడా వ్యాయామంతోనే 1.5 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శారీరకంగా చురుకుగా ఉంటే విచారం, ఆందోళన, బాధ తదితరాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు సౌత్ ఆ్రస్టేలియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా 1.28 లక్షల మందిని పరిశీలించారు. ఆయా మానసిక సమస్యలను అధిగమించడానికి మందులు, కౌన్సెలింగ్ కంటే కూడా శారీరక శ్రమ చేస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటోందని వెల్లడించారు. ఈ అధ్యయనం ఆధారంగా గుర్తించిన అంశాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో తాజాగా ప్రచురించారు. మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, నిరాశ, ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడేవారిని పరిశీలించారు. ఈ క్రమంలో శారీరక శ్రమ/వ్యాయామం చేసేవారిలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్న గర్భిణులు, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వ్యాయామంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నట్టు స్పష్టమైంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్ల వ్యయం చేస్తున్నారు. ఈ వ్యయం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. మంచి హార్మోన్లు పెరుగుతాయి నడక, వ్యాయామం, పరుగు, ఏరోబిక్స్ వంటివాటితో శరీరానికి మంచి చేసే హార్మోన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అడ్రినాలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించే ఎండారి్ఫన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటున్నారు. రోజూ అరగంట చేసినా మంచి ఫలితాలు.. ప్రస్తుతం అన్ని వయసులవారు తీవ్ర ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రోజూ కనీసం అరగంట పాటు నడక, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఏరోబిక్స్ వంటి వాటికి సమయం కేటాయించాలి. ఈ వ్యాయామం బీపీ, షుగర్, ఊబకాయం వంటివి రాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాలకు మేలు చేకూరుస్తుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి దూరం కావచ్చు. – డాక్టర్ రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, విజయవాడ -
చీరకట్టులో మారథాన్.. 80 ఏళ్లయినా తగ్గేదే లే.. బామ్మ వీడియో వైరల్
ముంబై: పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏమైనా సాధించవచ్చని మరోమారు నిరూపించారు మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ బామ్మ. 80 ఏళ్ల వయసులో మారథాన్‌లో పాల్గొన్నారు. స్నీకర్స్ ధరించి చీరకట్టులో పరుగులు తీశారు. చేతిలో జాతీయ జెండా కూడా పట్టుకున్నారు. 51 నిమిషాల్లో 4.2కిలోమీటర్లు పరుగెత్తి శభాష్ అనిపించుకున్నారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్ ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు 55,000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. 80 ఎళ్ల బామ్మ కూడా ఇందులో భాగమయ్యారు. ఆమె మనవరాలు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. दुनिया में कोई काम असंभव नहीं, बस हौसला और मेहनत की जरूरत है।#thursdayvibes #ThursdayMotivation #marathon #mumbai #grandmother pic.twitter.com/dDzvGxmFG9 — Dr. Vivek Bindra (@DrVivekBindra) January 19, 2023 ఈ బామ్మ చాలా మందికి స్ఫూర్తి. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని ఈమె నిరూపించారు. అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ మారథాన్‌లో పాల్గొనడం తనకు ఇది ఐదోసారి అని బామ్మ తెలిపారు. తాను భారతీయురాలినని సగర్వంగా చెప్పేందుకే చేతిలో జాతీయ జెండా పట్టుకున్నట్లు వివరించారు. చదవండి: పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన -
పరుగులోనే ఆగిన ప్రాణం
సూర్యాపేట: ఎస్ఐ కొలువుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడి కల నెరవేరకుండానే ఊపిరి ఆగిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ (24) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. తదుపరి నిర్వహించే శారీరక, దేహ దారుఢ్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో రోజూ ఉదయం పరుగు సాధన చేస్తున్నాడు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం పరుగు తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన మిత్రులు సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీకాంత్ చదువులో రాణిస్తూనే జనగాం క్రాస్ రోడ్డులో తల్లిదండ్రులు నిర్వహిస్తున్న వెల్కం దాబా హోటల్లో రాత్రి సమయంలో పనిచేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుని అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
కుక్క నోట్లో మనిషి తల.. అక్కడంతే!
చిమ్మ చీకట్లో.. మనిషి తల నోట కర్చుకుని రోడ్ల వెంట పరిగెడుతున్న ఓ కుక్క. సడన్‌గా ఆ దృశ్యం చూసిన ఎవరికైనా ఒళ్ళు జలదరించడం ఖాయం. అయితే ఆ వీడియోనే ట్విట్టర్ ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది. చివరికి.. రంగంలోకి దిగిన పోలీసులు దాని వెంటపడ్డారు. ఓ పోలీస్ అధికారి బలవంతంగా దాని నోటి నుంచి ఆ తలను బయటకు తీశాడు. అయితే.. ఆ వీడియో ఎక్కడిది అనే విషయంపై ఇప్పుడొక స్పష్టత వచ్చింది. మెక్సికో దేశంలోని జకాటెకాస్ స్టేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత బుధవారం ఈ ఘటన జరిగిందని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. క్రైమ్ సీన్ నుంచి తల తీసుకుని ఆ వీధి కుక్క పరిగెత్తిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మోంటే ఎస్కోబెడో టౌన్‌లోని ఓ బూత్‌లో ఆ తలను దుండగులు ఉంచినట్లు నిర్ధారించారు. అంతేకాదు.. అక్కడ ‘తర్వాతి తల నీదే’ అనే హెచ్చరికను సైతం గుర్తించారు. అయితే.. ఇలాంటి వ్యవహారాలను అక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కారణం.. అది అక్కడ సర్వసాధారణం కాబట్టి. కార్టెల్ జలిస్కో న్యుయెవ జెనెరసియాన్.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన డ్రగ్స్ ముఠాలకు అడ్డా. సినాలోవా, జలిస్కో డ్రగ్ కార్టెల్స్ అక్కడ అత్యంత శక్తివంతమైన గ్యాంగ్‌లను నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిలోనే సదరు మొండెం లేని తల పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తాజాగా.. కిందటి నెలలో గుర్రెరో స్టేట్‌లో రెండు ముఠాలు.. భారీ ఎత్తున హింసకు పాల్పడ్డాయి. ఈ ముఠా కక్షలో పద్దెనిమిది మంది మృతి చెందగా.. అందులో ఓ మేయర్, మాజీ మేయర్ కూడా ఉన్నారు. warning: some viewers may find the following video disturbing Dog running down the street with a human head. #dogs #head #mexico #running #crazyvideos #wtfvideos #lookatthis💩 #huemongrind pic.twitter.com/vob1vUAfKM — the HUEMON GRIND (@SuperHuemon) October 28, 2022 -
పతకాలు ‘దండి’గా!.. అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ మహిళల 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో రికార్డులు సృష్టిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి అండర్–23 అథ్లెటిక్ చాంపియన్ షిప్లో 53.05 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణంతో మెరిసి యావత్తు క్రీడాలోకం దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఏకంగా 18 పతకాలతో సత్తా చాటి భారత ఒలింపిక్ చాంప్ శిక్షణ జట్టులో స్థానం దక్కించుకుంది. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. 6 నెలలుగా త్రివేండ్రంలోని నేషనల్ అథ్లెటిక్ క్యాంపు (ఎన్ఏసీ)లో అంతర్జాతీయ కోచ్ గలీనా (రష్యా) పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన ఏషియన్స్లో గేమ్స్ వాయిదా పడటంతో జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ పోటీలపై దృష్టి సారించింది. ముందుగా జూన్‌లో జరిగే ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్ షిప్లో విజయం సాధించి, అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 రోజుల క్యాంపులో భాగంగా టర్కీలో మెలకువలు నేర్చుకుంటోంది. శాయ్ సెంటర్లో శిక్షణ.. జ్యోతికశ్రీ 2016 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సెంటర్లో చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షణలో రాటుదేలింది. ఈ క్రమంలో 2017 బ్యాంకాక్‌లో జరిగిన రెండో ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో నాల్గవ స్థానంలో నిలిచింది. అదే ఏడాది కెన్యాలోని నైరోబి నగరంలో జరిగిన ప్రపంచ అండర్–18 చాంపియన్‌షిప్‌లో, 2016 టర్కీ దేశంలోని ట్రాబ్జోన్ నగరంలో వరల్డ్ స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో పాటు జాతీయ పోటీల్లోనూ జూనియర్ విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత పరుగు, రిలే విభాగాల్లో కలిపి ఏకంగా 7 స్వర్ణాలు, 6 రజత, 3 కాంస్య పతకాలను ఒడిసిపట్టింది. ఏడాదిన్నర కిందట హైదరాబాద్‌లోని శాయ్ సెంటర్లో కోచ్ రమేష్ శిక్షణలో సీనియర్ విభాగంలోకి అడుగిడిన తర్వాత ఈ ఏడాది కాలికట్లో జరిగిన 25వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. తండ్రే తొలి గురువు.. జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు బీరువాలు తయారు చేసే వ్యాపారి. బాడీ బిల్డర్ కావాలని కలలు కన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాన్ని దూరం చేశాయి. అయితే పాఠశాల పరుగు పోటీల్లో చిన్న కుమార్తె జ్యోతికశ్రీలో ప్రతిభను గమనించి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయనే తొలి గురువుగా మారి నిత్యం దగ్గరుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. ఈ క్రమంలోనే 7వ తరగతిలోనే జ్యోతికశ్రీ రన్నింగ్‌పై మక్కువ పెంచుకుంది. తొలిసారిగా 2015 విశాఖలో జరిగిన జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్లో 1000 మీటర్ల విభాగంలో కాంస్యంతో అదరగొట్టింది. ఇక శాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న తరుణంలో జ్యోతికశ్రీ బయట హాస్టళ్లలో ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో తండ్రి శ్రీనివాసరావు తనకు వచ్చే ఆదాయంలో నెలకు రూ.20 వేలకుపైగా జ్యోతికశ్రీ శిక్షణకు ఖర్చు చేసేవారు. రైలు ప్రయాణం చేస్తే అలసిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తన కుమార్తె పోటీలకు వెళ్లేటప్పుడు శ్రీనివాసరావు అప్పుచేసి మరీ విమాన టికెట్లు తీసేవారు. అంతర్జాతీయ పతకమే లక్ష్యం జూలైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించటంతోపాటు పతకం గెలవటమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. 400, 100 మీటర్ల పరుగు విభాగంలో ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తున్న 8 మంది క్రీడాకారిణుల జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉండటం గర్వంగా ఉంది. ప్రస్తుతం నా టైమింగ్‌ను మరింత మెరుగుపరచుకుందేకు ప్రయత్నిస్తున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ -
ట్రెండ్ సెట్ చేశాడు.. భారత ఆర్మీ జాబ్ కోసం పెద్ద సాహసం
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యంలో చేరాలన్నది అతని కల. ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అధికారులు మాత్రం రిక్రూట్మెంట్ జరపకపోవడంతో ఓ యువకుడు పెద్ద సాహాసం చేశాడు. ఏకంగా 350 కిలోమీటర్లు పరుగెత్తి సోషల్ మీడియాలో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కోవిడ్ కారణంగా సుమారు 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వందలాది మంది యువకులు జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు రాజస్థాన్‌కు చెందిన సురేశ్ భిచార్(24).. రాజస్థాన్ నుంచి పరుగెత్తుకుంటూ ఢిల్లీ చేరుకున్నాడు. దాదాపు 350 కి.మీ పరుగెత్తి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరాడు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని 50 గంటల్లో 350 కి.మీ పరుగెత్తాడు. అనంతరం నిరసనల్లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా సురేశ్ మాట్లాడుతూ.. ‘‘మార్చి 29న పరుగు యాత్రను ప్రారంభించాను. ప్రతీరోజు ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభించి.. 11 గంటలకు ఎక్కడో ఓ చోట పెట్రోల్ బంకుకు చేరుకున్న తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుంటాను. సమీప ప్రాంతంలో ఉన్న ఆర్మీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థుల నుండి ఆహారం తీసుకుని తింటాను. ప్రతీ గంటకు దాదాపు 7 కి.మీలు పరిగెత్తుతాను. భారత సైన్యంలో చేరేందుకు యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలా పరుగు యాత్ర ప్రారంభించా’’ అని చెప్పాడు. #WATCH दिल्ली: भारतीय सेना में शामिल होने के लिए इच्छुक एक युवा राजस्थान के सीकर से दिल्ली में एक प्रदर्शन में शामिल होने के लिए 50 घंटे में 350 किलोमीटर दौड़कर पहुंचा। pic.twitter.com/rpRVH8k4SI — ANI_HindiNews (@AHindinews) April 5, 2022 -
పరుగుల ప్రదీప్ మెహ్రాకు ఊహించని సాయం
Midnight Runner Pradeep Mehra News: అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు.. అదీ సైన్యంలో చేరాలనే లక్ష్యంతో.. ఇంకేం ప్రదీప్ మెహ్రా ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. ఆపై ఆ కుర్రాడిని ఈ-సెలబ్రిటీని చేసేందుకు ప్రయత్నాలు సాగగా.. తన ప్రయాణాకి ఆటంకం కలిగించొద్దంటూ సున్నితంగా మీడియాను వేడుకున్నాడు ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు. ఈ తరుణంలో.. ప్రదీప్ మెహ్రాకు సాయం మాత్రం అందుతోంది. ప్రదీప్ తల్లి చికిత్స కోసం, అతని కల నెరవేరేందుకుగానూ రెండున్నర లక్షల రూపాయల చెక్ సాయం అందించింది షాపర్స్ స్టాప్. ఈ విషయాన్ని మొదటి నుంచి మెహ్రాకు తోడుగా ఉంటున్న జర్నలిస్ట్, దర్శకుడు వినోద్ కాప్రీ తెలియజేశాడు. తనకు సాయం అందిస్తున్న వాళ్లకు ప్రదీప్ సైతం కృతజ్ఞతలు చెప్తున్నాడు. చదవండి: అమ్మ అనారోగ్యం.. ఆర్మీ కల.. ప్రదీప్ పరుగుల కథ ఇది! నోయిడా సెక్టార్ 16 దగ్గర మెక్‌డొనాల్డ్‌లో పని చేసే ప్రదీప్ మెహ్రా.. తానుండే చోటుకి దాదాపు 10 కిలోమీటర్ల దూరం పరుగుల మీదే ప్రతీరోజూ చేరుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓరోజు ఆ కుర్రాడి గురించి ఆరా తీసిన వినోద్ కాప్రీ.. లిఫ్ట్ ఇస్తానని చెప్పినా వద్దంటూ తనమానాన తాను పరుగులతోనే వెళ్లిపోయాడు. ఆ వీడియో ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖులతో పాటు ఎంతో మందిని కదిలించింది కూడా. This is PURE GOLD❤️❤️ नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया मैंने सोचा किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu — Vinod Kapri (@vinodkapri) March 20, 2022 This morning @atulkasbekar took my address and with in few hours , a @PUMA sports kit with Running shoes, Apparels, backpack , socks was there at my door step for #PradeepMehra and with in no time we delivered it to him. Love you Atul ❤️ love you Tweeple❤️❤️ Thanks #Puma pic.twitter.com/MZws0nBd8L — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 -
‘డార్లింగ్’ ప్రదీప్.. ఆర్మీలో చేరేందుకు ఏం చేస్తున్నాడంటే.. వీడియో వైరల్
లక్నో: సోషల్ మీడియాలో ఓ యువకుడు చేసిన ఫీట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ప్రతీ రోజు రాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు. ఎందుకో కారణం తెలిస్తే మీరు ఫిదా అయిపోతారు. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ప్రదీప్(19) పట్టణంలోని వీధుల్లో రాత్రి వేళ పరిగెత్తుతుండగా ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ చూశాడు. ఇంతలో వినోద్.. ప్రదీప్ దగ్గరికి వెళ్లి ఎందుకిలా పరిగెత్తుతున్నావని ప్రశ్నించగా.. అతడు చెప్పిన సమాధానం విని ఫిదా అయిపోయాడు. తాను ప్రతీ రోజు ఇలాగే 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తానని ప్రదీప్ చెప్పాడు. ఎందుకని మళ్లీ ప్రశ్నించగా.. తన కల భారత ఆర్మీలో చేరడమేనని.. అందుకే తాను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో వినోద్.. ఉదయం సమయంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడగ్గా.. తాను మెక్‌డోనాల్డ్ సెక్టార్-16లో పని చేస్తున్నానని అన్నాడు. ఉదయాన్నే 8 గంటలకు లేచి వంట చేయాలని చెప్పాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా మంచానపడిందని చెప్పిన ప్రదీప్.. తన తమ్ముడికి సైతం వంట చేసిపెట్టాలని సమాధానం ఇచ్చాడు. అందుకే తాను రాత్రి సమయంలోనే ఇలా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానని వివరించాడు. ప్రదీప్ రన్నింగ్ కొనసాగిస్తూనే ఇలా సమాధానాలు చెప్పడం విశేషం. చివరకు.. ప్రదీప్‌ను వినోద్ కాప్రీ తన కారులో ఇంటి వద్ద దింపుతానని చెప్పగా.. అతను నో చెప్పాడు. కారులో వస్తే ఈరోజు ప్రాక్టీస్ మిస్ అవుతానని చెప్పడంతో వినోద్ మరోసారి ఫిదా అయిపోయాడు. కాగా, అతను రన్నింగ్ చేస్తున్న విషయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే నా #MondayMotivation ఏమిటో మీకు తెలుసా? అతను చాలా గ్రేట్, రైడ్ ఆఫర్‌ను తిరస్కరించడం వాస్తవం. అతనికి సహాయం అవసరం లేదు. ఆయనే ఆత్మనిర్భర్ అంటూ ట్విట్టర్లో వీడియోను షేర్ చేశాడు. Inspiring…all the best #Pradeep 👏🏼👏🏼👏🏼 https://t.co/Y1YMQBV5jW — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 21, 2022 ప్రదీప్ వీడియోపై టాలీవుడ్ హీర్ సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. స్పూర్తిదాయకం.. ఆద్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. The only impossible journey is the one you never begin 👍 Video Via @vinodkapri pic.twitter.com/ue5x482T2s — Defence Squad (@Defence_Squad_) March 20, 2022 టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ స్పందిస్తూ.. What an exemplary person 🌟 Run #Pradeep Run 🏃♂️ https://t.co/hAibkgRU7U — Krish Jagarlamudi (@DirKrish) March 20, 2022 -
రన్నింగ్‌లో రేసుగుర్రం.. సానబెడితే.. చిరుతే..
అనపర్తి(తూర్పు గోదావరి): ఆ యువకుడు పరుగెత్తాడంటే చిరుత కూడా వెనుకబడాల్సిందే. పరుగుల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవాలన్నదే అతడి ఆశయం. పేదరికం అడ్డుపడుతున్నా.. మెళకువలు నేర్పే కోచ్ లేకున్నా.. లక్ష్యాన్ని సాధించాలన్న కసితో ముందుకు దూసుకుపోతున్న ఆ యువకుడి పేరు ఉందుర్తి రమేష్. అనపర్తికి చెందిన ఈ యువకుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చనిపోయాడు. తల్లి లక్ష్మి కూలి పనులు చేస్తోంది. చిన్నప్పటి నుంచీ పరుగులో రమేష్‌ది ముందంజే. యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయిల్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించాడు. చదవండి: Extramarital Affair: వద్దన్నా వినకుండా.. ఆమె ఇంటివద్దకెళ్లి.. అథ్లెటిక్స్‌లో 10కే, 5కే ఆఫ్ మారథాన్ పూర్తి చేశాడు. నిత్యం స్థానిక జీబీఆర్ మైదానంలో నిరంతరం సాధన చేస్తూ కనిపిస్తాడు. ఇతడి సంకల్పానికి జీబీఆర్ యోగా, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, జీబీఆర్ విద్యాసంస్థల అధినేత తేతలి కొండబాబు తోడుగా నిలుస్తున్నారు. రెండేళ్ల క్రితం వంద కిలోమీటర్ల దూరాన్ని 9.20 గంటల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా 140 కిలోమీటర్ల దూరాన్ని 14 గంటల్లో పరుగెత్తాలనే లక్ష్యాన్ని 70 నిమిషాలు ముందే చేరుకుని అబ్బురపరిచాడు. బుధవారం రాత్రి జీబీఆర్ కళాశాల నుంచి, బలభద్రపురం, బిక్కవోలు, జి.మామిడాడ, పెదపూడి, ఇంద్రపాలెం లాకులు, కాకినాడ, జగన్నాథపురం వంతెన, కోరంగి మీదుగా యానాం సరిహద్దు చేరుకుని తిరిగి అదే దారిలో గురువారం ఉదయం సుమారు 7.30 గంటలకు అనపర్తి జీబీఆర్‌కు చేరుకున్నాడు. ఇతడి పరుగు ప్రతిభకు ముచ్చటపడిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తేతలి కొండబాబుతో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. రికార్డును తిరగరాస్తా.. జాతీయ స్థాయి రన్నింగ్ రేస్ పోటీల్లో పాల్గొని రికార్డులు నెలకొల్పడడమే తన లక్ష్యమని రమేష్ చెబుతున్నాడు. వికాస్ మాలిక్ అనే రన్నర్ 160 కిలోమీటర్ల దూరాన్ని 18.20 గంటల్లో పూర్తి చేసి నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని వివరించాడు. ప్రభుత్వ సహకారం లభిస్తే మరిన్ని రికార్డులు నెలకొల్పుతానని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. కనీసం ఈ రంగంలో తనకు కొంచెం మార్గదర్శకంగా నిలిస్తే అబ్బురపరిచే విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి!
Belly Fat: పొట్ట, బరువు తగ్గి, చక్కగా స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా తగ్గేవారు మాత్రం తక్కువే. కారణం... తగ్గడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం, ఒకవేళ ఎంచుకున్నా, ఆ నియమాలను పాటించకపోవడం. కొన్ని వ్యాయామాలు పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి, కానీ కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల లేదా కేవలం ఆహార నియమాలు మాత్రమే పాటించడం వల్ల పొట్ట తగ్గదు. ఆహార నియమాలతోపాటు వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతాం. ఆ మార్గాలేమిటో చూద్దాం. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైలు, మసాలాలు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్‌గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఉదయానే నిద్రలేవడం: కొన్ని అధ్యయనాల ప్రకారం తేలిందేమంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రన్నింగ్ : రోజూ ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీని వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. రన్నింగ్ చేయలేకపోతే కనీసం వేగంగా నడవడం మంచిది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. క్యారెట్: క్యారెట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి వాటిని స్మూతీ, సలాడ్, జ్యూస్‌గా తినవచ్చు. మీ డైట్ చార్ట్‌లో క్యారెట్లను చేర్చండి, ఇది మీ బరువును సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతులు: సహజంగా రక్తంలో చక్కెర స్థాయులను మెరుగుపరచడంలో మెంతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఔషధం. ఈ ప్రత్యేక ఔషధ గుణాలు మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆహార పానీయాలలో మొలకెత్తిన మెంతులను ఉపయోగించడం మంచి ఫలితాలనిస్తుంది. జామ: పేదల యాపిల్‌గా పేరుగాంచిన జామకాయకు అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. ఇది చలికాలంలో పుష్కలంగా లభించే పండు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెర్రీస్: బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. బెర్రీలు తినడం ద్వారా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. బెర్రీల్లో చాలా రకాలుంటాయి. అన్నిరకాల బెర్రీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి వాటిని ఉదయం లేచిన వెంటనే తినడం మంచిది. వేపుళ్లు, పాక్డ్ ఫుడ్ వద్దు: ఆయిల్‌తో డీప్ ఫ్రై చేసి తయారు చేసే ఆహారపదార్థాలను తినకండి. ఆయిల్‌తో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల కొవ్వు పేరుకు పోతుంది. అలాగే గుండె జబ్బులకు గురవుతారు. అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఆయిల్స్‌తో తయారు చేసిన ఆహారపదార్థాలను తినకండి. వివిధ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్: మనకు మార్కెట్లో తెల్లగా నిగనిగలాడే బ్రెడ్ దొరుకుతూ ఉంటుంది. అయితే దాన్ని తినకపోవడం మంచిది. కొన్ని రకాల బ్రెడ్ లు గోధుమ రంగులో ఉంటాయి. అలాంటి బ్రెడ్ తినడం మంచిది. వీటిలో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికి, అసలు కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఈ బ్రెడ్ ఉపయోగపడుతుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!
ఆరోగ్యంగా, చురుగ్గా... యవ్వనంగా కనిపించాలంటే బరువు సమానంగా ఉండాలి. అధిక బరువు వల్ల వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు. అలా కాకుండా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం అవసరం. బరువు తగ్గాలంటే ఆహారంపై అదుపుతోబాటు కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్ అంటారు. వీటిలో సైక్లింగ్, జాగింగ్ సులువైనవి. ఇప్పుడు జాగింగ్ గురించి చెప్పుకుందాం. ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం చాలా మందికి అలవాటు. శరీరం ఒత్తిడికి గురి కాకుండా, ఈ వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేమిటో చూద్దాం... జాగింగ్ చేయడానికి జిమ్‌లో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా జాగింగ్ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు. శారీరకంగా ఫిట్‌గా, క్యాలరీలను కరిగించుకుని బాడీ ఫ్రెష్‌గా కనబడేందుకు దోహదం చేసే వాటిలో జాగింగ్ మెరుగైనది. ఇది గుండె కండరాలను బలోపేతం చేసి గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్‌గ్లూకోజ్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. జాగింగ్ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ గ్రూప్ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఈ ఒక్క కారణం వల్ల శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది. ముఖ్యంగా ముఖం తేటగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు.. ►జాగింగ్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటం వల్ల కండరాలు కరిగి, బాడీ షేప్ మారి చూడటానికి అందంగా మారుతారు. ►బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ►ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్ మంచి మార్గం. ►జాగింగ్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వ్యాధులతో, ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి అధికంగా ఉండి శారీరక శక్తిని పెంచుతుంది. ►తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో స్ట్రెస్, డిప్రెషన్, అలసట తగ్గుతాయి. ►కండరాల శక్తిని మెరుగు పరుస్తుంది. వెన్నెముక, తొడల భాగాన్ని దృఢంగా మార్చుతుంది. ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికి చాలా మేలు చేస్తుంది. జాగింగ్ వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పాజిటివ్ శక్తి వస్తుంది. ►చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనబడుతారు. అయితే కేవలం జాగింగ్ ఒక్కటే చేస్తే సరిపోదు. ఆహారంపై అదుపు కూడా ఉండాలి. అప్పుడే పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలూ శరీరానికి సమకూరతాయి. చదవండి: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..