కొనసాగుతున్న ఎయిర్‌ఫోర్స్ ర్యాలీ
కడప కల్చలర్:
జిల్లా యువజన నర్వీసుల శాఖ, స్టెప్ ఆధ్వర్యంలో కడప నగరం మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మంగళవారం కూడా కొనసాగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఐదు వేల మంది వరకు యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ అధికారులు రామకృష్ణమఠం నుంచి అభ్యర్థులకు పరుగుపందెం పోటీలను నిర్వహించి వారి శారీరక ధారుడ్యాన్ని పరిశీలించారు. వారిలో 374 మంది అర్హత సాధించారు. పూర్తి స్థాయి ఫలితాలను బుధవారం ప్రకటిస్తామని స్టెప్ సీఈఓ మమత తెలిపారు.