Step
-
డాకు మహారాజ్లో ఊర్వశి రౌతేలా.. బాలయ్యతో మరోసారి చిందులు!
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాకుండా దబిడి దిబిడి అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో బాలయ్య సరసన మెప్పించింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.పట్టించుకోని ఊర్వశి రౌతేలా..అయితే సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వస్తున్నా పిచ్చ లైట్ అంటోంది బాలీవుడ్ భామ. తాజాగ ఇన్‌స్టా వేదికగా మరో వీడియోను పోస్ట్ చేసింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఊర్వశి రౌతేలాపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాలో రాస్తూ..' డాకు మహారాజ్ సక్సెస్ బాష్. దబిడి దిబిడి సాంగ్ 20 మిలియన్ల వ్యూస్ సాధించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ న్యూయర్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది?
హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ నిత్యం వార్తల్లో కనిపిస్తోంది. దీంతో చాలామంది ఈ చిన్న దేశం గురించి, అక్కడి పౌరుల గురించి, అంటే యూదుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆ వివరాలతో పాటు ఇక్కడి జెరూసలేంలో ఉన్న ఒక విచిత్రమైన నిచ్చెన గురించి తెలుసుకుందాం. ఆ నిచ్చెన 273 ఏళ్లుగా ఒక్క అంగుళం కూడా పక్కకు కదలలేదట. అందుకే దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఏదేనా వివాదాస్పద స్థలం గురించి చర్చ జరిగినప్పుడు జెరూసలేం పేరు కూడా వినిపిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ దీనిని తమ రాజధానిగా చెబుతుండగా, మరోవైపు పాలస్తీనా ఇది తమదేనని వాదిస్తుంటుంది. ఈ నగరం కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ స్థలం ఎందుకు అంత ముఖ్యమైనదనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. నిజానికి ఈ ప్రదేశం నుండే ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలైన క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం స్థాపితమయ్యాయని చెబుతారు. జెరూసలేం నగరంలో ‘చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్’ అనే క్రైస్తవ చర్చి ఉంది. ఏసుక్రీస్తుకు ఇక్కడే శిలువ వేశారని, తర్వాత ఇక్కడే తిరిగి అవతరించారని క్రైస్తవులు నమ్ముతారు. అయితే ఈ చర్చిలో క్రైస్తవ మతంలోని వివిధ వర్గాల సంప్రదాయరీతులు నడుస్తుంటాయి. క్రైస్తవ మతంలోని ఆరు వర్గాలు సంయుక్తంగా ఈ చర్చిని పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఈ చర్చిలో ఒక ప్రత్యేకమైన నిచ్చెన మెట్లు ఉన్నాయి. ఇవి వివాదాస్పదంగా నిలిచాయని చెబుతారు. ‘ది హోలీ సెపల్చర్ చర్చి’లోని ఒక ప్రాంతంలో 1750 నుంచి ఈ నిచ్చెన ఉంది. ఇప్పటి వరకు ఈ నిచ్చెనను ఒక్క అంగుళం కూడా కదపడానికి ఎవరూ సాహసించలేదు. దీనిని కదిపితే వివిధ వర్గాల మధ్య వివాదం తలెత్తవచ్చనే భావనతో దీనిని ఎవరూ ఇంతవరకూ ముట్టుకోలేదట. నేటికీ చర్చిలో ఎటువంటి మరమ్మతులు చేపట్టినా ఈ నిచ్చెనను ఈ స్థలం నుంచి కదపకపోవడం విశేషం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
చంద్రయాన్-3 ప్రయాణంలో కీలక దశ.. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు..
చంద్రుడిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన ‘చంద్రయాన్-3 నౌక కీలక దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈ నౌకకు ఐదో కక్ష్య పెంపును ఇస్రో మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు చంద్రయాన్-3 ప్రయాణం సాగిస్తోంది. క్రమంగా ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ చంద్రుడి దిశగా సాగిపోతోంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. భూమి చుట్టూ తిరిగే చంద్రయాన్-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య కాగా, అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆపరేషన్‌ను ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇప్పటివరకు దశలవారీగా ఐదుసార్లు పెంచారు. భూకక్ష్య పూర్తయిన అనంతరం ఈ నౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనుంది. కాగా, జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ఎల్వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగ్విజయంగా ప్రయాణం ప్రారంభించింది. చదవండి: చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం! ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకల్పించగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు. -
దారుణం.. నాలుగు రోజుల పసికందును తొక్కిన కానిస్టేబుల్..!
రాంచీ: జార్ఖండ్ గిరిడీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నాలుగు రోజుల పసికందును పోలీస్ కానిస్టేబుల్ తొక్కాడని ఓ కుటుంబం ఆరోపించింది. దీంతో నవజాత శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. చిన్నారి తాత భూషణ్ పాండే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారు. అయితే భూషణ్ పాండే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చాలా రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగుతున్నాడు. ఈక్రమంలోనే అతడ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. ఉదయం 3:20 గంటల సమయంలో లోనికి ప్రవేశించారు. వీరిని చూసి భూషణ్ పాండేతో పాటు ఇతర కుటుంబసభ్యులు పారిపోయారు. కానీ భూషణ్ కోసం వెతికే క్రమంలో ఓ గదిలో నిద్రిస్తున్న నాలుగు రోజుల పసికందును పోలీస్ కానిస్టేబుల్ పారపాటున తొక్కాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెళ్లిపోయాక లోపలికి వెళ్లి చూస్తే బిడ్డ చనిపోయి ఉందని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే భూషణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని పేరొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. సీఎం ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..! -
తొలి అడుగులు చెట్ల మీదే!
భూమిపై మానవ వికాసం జరిగిన తీరు మనకిప్పటికీ పెద్ద మిస్టరీయే. అందులో అత్యంత కీలకమైన ‘ముందడుగు’ నడక. వెన్నును నిటారు చేసి రెండు కాళ్లపై సాగడం మానవ పరిణామ క్రమంలో నిజానికి చాలా పెద్ద మలుపు. ఇతర చతుష్పాద జంతువులన్నింటి నుంచీ ఇదే మనిషిని పూర్తిగా వేరు చేసి అత్యంత ప్రత్యేకంగా నిలిపింది. ఇంత కీలకమైన నడకను మన పూర్వ మానవుడు ఎప్పుడు నేర్చాడన్నది మనకే గాక పరిశోధకులకు కూడా అత్యంత ఆసక్తికరమైన టాపికే. దీనిపై దశాబ్దాలుగా ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. అడవులు, తత్ఫలితంగా చెట్లు బాగా తగ్గి మైదాన ప్రాంతం పెరుగుతూ పోవడం వల్లే మనిషి రెండు కాళ్లపై నడక నేర్చుకోవాల్సి వచ్చిందని అవన్నీ దాదాపుగా ముక్త కంఠంతో చెప్పే మాట. కానీ అది పూర్తిగా తప్పంటోంది తాజా పరిశోధన ఒకటి. మన పూర్వీకులు చెట్లపై నివసించే రోజుల్లోనే రెండు కాళ్లపై నడవడం నేర్చారట. అదీ నిటారుగా! ఆ తర్వాతే పూర్తిస్థాయిలో నేలపైకి దిగారని వాదిస్తోంది! తెలివితేటల్లోనూ ఇతరత్రా కూడా జంతుజాలమంతటిలో మనిషికి అత్యంత సమీప జీవి అయిన చింపాంజీలపై 15 నెలల పాటు లోతుగా పలు కోణాల్లో పరిశోధనలు చేసి మరీ ఈ మేరకు తేల్చామంటోంది!! ఏం చేశారు? తూర్పు ఆఫ్రికాలో టాంజానియాలోని ఇసా లోయలో కొద్దిపాటి చెట్లు, కాస్తంత దట్టమైన అడవి, విస్తారమైన మైదాన ప్రాంతం మధ్య జీవిస్తున్న 13 అడవి చింపాంజీలను పరిశోధనకు ఎన్నుకున్నారు. మన పూర్వీకులు నడిచేందుకు దారి తీసిందని భావిస్తున్న చెట్ల లేమి, అపారమైన బయలు ప్రదేశం కారణంగా అవి కూడా అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తాయేమో గమనించడం అధ్యయనం ఉద్దేశం. ‘‘ఇందుకోసం చింపాంజీల ప్రవర్తనను అతి దగ్గరగా పరీక్షించి ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చాం. వాటి తాలూకు ఏకంగా 13 వేల రకాలుగా హావభావాలను లోతుగా గమనించాం’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్ట ర్ అలెక్స్ పీల్ వివరించారు. కానీ అవి అచ్చం అ త్యంత దట్టమైన అడవుల్లోని చింపాంజీల మాదిరిగానే అత్యధిక సమయం తమకందుబాటులో ఉన్న కొద్దిపాటి చెట్లపైనే గడుపుతూ వచ్చాయి నడిచే ప్రయత్నమే చేయలేదని చెప్పుకొచ్చారు. ‘‘కనుక దాదాపు 50 లక్షల ఏళ్ల క్రితం అటవీ సంపద తరిగిపోయి మైదాన ప్రాంతం ఎక్కువైన క్రమంలోనే ఆదిమ మానవుడు చెట్ల నుంచి నేలపైకి దిగి నిటారు నడక నేర్చాడన్న భావన తప్పు. దాన్నతను కచ్చితంగా చెట్లపైనే నేర్చుంటాడు. తర్వాత కూడా ఆహార వృక్షాల అన్వేషణలో చాలాకాలం పాటు చెట్లపై నిటారుగానే నడిచుండాలి. ఆ రకంగా మానవ వికాసానికి చెట్లే ఊతమిచ్చాయని భావించవచ్చు’’ అని ఆయన వివరించారు. ఈ అధ్యయనం జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో పబ్లిషైంది. కొసమెరుపు ఇంతా చేస్తే, తోకలేని కోతుల (ఏప్)న్నింట్లోనూ మన పూర్వీకులు మాత్రమే రెండు కాళ్ల నడకను ఎలా, ఎందుకు నేర్చారన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీయేనని అధ్యయనకర్తలు అంగీకరించారు! విస్తారమైన మైదాన ప్రాంతం అందుబాటులో ఉన్నా చింపాంజీలు చెట్లపైనే ఎందుకు అత్యధిక సమయం గడిపిందీ తేలితే బహుశా ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏమైనా క్లూ దొరకవచ్చంటున్నారు. అందుకే తమ తర్వాతి అధ్యయనం దీని మీదేనని ప్రకటించారు!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెట్ల బావుల్ని ‘చూద్దాం’ రండి
సాక్షి, హైదరాబాద్ : ఎంతటి కరువు కాటకాల్లోనూ ఎండిపోని ఘనత నాటి తెలంగాణ మెట్లబావుల సొంతం. ఊటల్ని పునరుద్ధరిస్తే చాలు, నిత్యం నీటితో కళకళలాడటం వీటి ప్రత్యేకత. పునరుద్ధరిస్తే ఒక్కో బావి ఒక్కో ఊరి దాహం తీర్చగలదంటున్నారు నిపుణులు. అలాంటి మెట్ల బావులు తెలంగాణలో ఎన్నున్నాయనే లెక్క ప్రభుత్వం వద్ద కూడా లేదు. ఎప్పుడో గుర్తించిన 35 బావుల పేర్లే పురావస్తు శాఖ వద్ద ఉన్నాయి. కానీ నిజానికి అవి 200కు పైగా ఉంటాయని స్పష్టమవుతోంది. ఓ ఆర్కిటెక్ట్ విశేష కృషి ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటికే 140 మెట్ల బావులు వెలుగులోకి వచ్చాయి. ఈ బావులు ఎన్నో ఊళ్ల తాగు నీటి కష్టాలను తీర్చగలవు. కాబట్టి వీటిని మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం పునరుద్ధరించాల్సిన అవసరముంది. ఈ మెట్లబావులను వెలికితీస్తున్న ‘హైదరాబాద్ డిజైన్ ఫోరం’ సంస్థ, తాను గుర్తించిన బావుల ఫొటోలతో వారం రోజుల ప్రద ర్శన ఏర్పాటు చేసింది. ‘హెరిటేజ్ తెలంగాణ’ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి స్టేట్ మ్యూజియంలో జూన్ 1 నుంచి 6 దాకా ఇది కొనసాగుతుందని సంస్థ నిర్వాహకుడు, ఆర్కిటెక్ట్ యశ్వంత్ రామమూర్తి చెప్పారు. రాష్ట్రంలోని మెట్ల బావులు గుజరాత్, రాజస్తాన్లలోని అద్భుత నిర్మాణాలకు ఏమీ తీసిపోవని పురావస్తు శాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులు చెబుతున్నారు. వీటిని పునరుద్ధరిస్తే భావి తరాలకు మంచినీటి వనరులనే గాక అద్భుత నిర్మాణాలను కూడా అందించినట్టు అవుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెట్ల బావులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఓ సామాజిక కార్యకర్త ఇటీవల ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్రంలో ఎన్ని బావులున్నాయి, వాటి పరిస్థితేమిటంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఎంవో ప్రశ్నించింది. దాంతో హైదరాబాద్ ఫోరం సేకరించిన వివరాలనే పీఎంవోకు పంపుతున్నారు. -
పిల్ల కాదు..మూడున్నర అడుగుల బుల్లెట్
-
9న జిల్లా యువజనోత్సవం
కడప కల్చరల్ : రాష్ట్ర యువజన సర్వీసులశాఖ, స్టెప్ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జిల్లా యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు స్టెప్ సీఈఓ మమత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పలు అంశాలలో యువతకు పోటీలు నిర్వహిస్తామని, మొదటి బహుమతి సాధించిన వారిని 2017 జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యువజనోత్సవ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈనెల 9న కడప నగరంలోని నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో యువజనులకు పోటీలను నిర్వహిస్తామన్నారు. ఫోక్ డ్యాన్స్ (గ్రూప్), ఫోక్సాంగ్స్ (గ్రూప్), ఏకపాత్రాభినయం (ఇంగ్లీషు, హిందీ), హిందూస్తానీ గాత్రం సోలో, కర్ణాటక గాత్రం (సోలో), సితార్, ఫ్లూట్, వీణా, తబల, మృదంగం విన్యాసాలు, వక్తృత్వ పోటీ (ఇంగ్లీషు, హిందీ), కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, మణిపురి, హార్మోనియం, గిటార్ వాయిద్యాల పోటీలు ఉంటాయని తెలిపారు. ఆసక్తిగల యువత ఉదయం 9.30 గంటలకు నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. -
కొనసాగుతున్న ఎయిర్‌ఫోర్స్ ర్యాలీ
కడప కల్చలర్: జిల్లా యువజన నర్వీసుల శాఖ, స్టెప్ ఆధ్వర్యంలో కడప నగరం మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ మంగళవారం కూడా కొనసాగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఐదు వేల మంది వరకు యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ అధికారులు రామకృష్ణమఠం నుంచి అభ్యర్థులకు పరుగుపందెం పోటీలను నిర్వహించి వారి శారీరక ధారుడ్యాన్ని పరిశీలించారు. వారిలో 374 మంది అర్హత సాధించారు. పూర్తి స్థాయి ఫలితాలను బుధవారం ప్రకటిస్తామని స్టెప్ సీఈఓ మమత తెలిపారు. -
కట్టుదిట్టంగా ఎయిర్‌ఫోర్స్ ర్యాలీ
కడప కల్చరల్: కడప నగరంలోని మున్సిపల్, ఇండోర్ స్టేడియాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ శనివారం రెండవరోజు కొనసాగింది. జిల్లా యువజన సర్వీసులశాఖ (స్టెప్) ఆధ్వర్యంలో మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ కోసం నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు రెండు వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఉదయం ఇండోర్ స్టేడియంలో వారికి రాత, అర్హత, శారీరక తదితర పరీక్షలను నిర్వహించారు. అనంతరం శారీరక ఆరోగ్య, ధారుడ్య పరీక్షలను కూడా నిర్వహించారు. ఇందులో మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు 35 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు అ«ధికారులు తెలిపారు. వీరికి మెదక్‌జిల్లా దుండిగల్‌లో 2017 జనవరిలో తుది విడత మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు స్టెప్ సీఈఓ మమత తెలిపారు. ఎంపిక కోసం వచ్చిన అభ్యర్థులు వారి బందుమిత్రులతోపాటు స్థానికంగా ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన యువతతో ఇండోర్ స్టేడియం పరిసరాలు రద్దీగా కనిపించాయి. -
గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకం
స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు ఆదిలాబాద్ రూరల్ : గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని యువజన సర్వీసుల శాఖ స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో యువదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో యువతను చైతన్యవంతం చేసేందుకు యువదర్శిని కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. యువజన సంఘాలు పొదుపు చేసుకుంటే రుణాలు ఇస్తామని తెలిపారు. అలాగే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై యువత స్పందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడప ఇస్రూబాయి, ఎంపీటీసీ శ్రీవాణి, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తూరాటి గంగన్న, గ్రామ యువజన సంఘం అధ్యక్షుడు రోషన్, స్వామి, స్టెప్ సిబ్బంది దశరథ్, మసూద్ పాల్గొన్నారు. -
ఎయిర్‌ఫోర్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కడప కల్చరల్ : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్మెంట్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని యువజన సర్వీసుల శాఖ, స్టెప్ సీఈఓ టి.మమత ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరులో నిర్వహించే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీని పురస్కరించుకుని జిల్లాలోని అవివాహితులైన నిరుద్యోగ యువకులు ముందస్తు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెక్యూరిటీ పోస్టులకు ఇంటర్మీడియేట్ లేదా తత్సమాన పరీక్ష కనీసం 50 శాతం మార్కులు, ఇంగ్లీషులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు చేసిన వారు కూడా అర్హులేనన్నారు. అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, తగిన బరువు, శ్వాస పీల్చినపుడు ఐదు సెంటీ మీటర్ల ఛాతి విస్తరణ కలిగిన వారు 1997, జనవరి 8వ తేది నుంచి 2000,జూన్ 28 మధ్యలో జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఉద్యోగానికి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
వైరా రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
వైరా : కురుస్తున్న భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్ నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. పల్లపు ప్రాంతాలైన ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలతో వస్తున్న వరదకు నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. ప్రస్తుతం వైరా రిజర్వాయర్ నీటి మట్టం 9.6 అడుగులకు చేరింది. ఈ నెల చివరి వరకు 14 అడుగులకు చేరుకుంటే రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో నారుమడులు పోసుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే ఈ ఏడాది రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రైతులు నాట్లు వేసే పరిస్థితి లేదు. శనివారం రాత్రి కురిసిన వర్షం 20 మిల్లీ మీటర్లుగా నమోదైంది. -
కళా ప్రేమికులకు గూగుల్ కొత్త యాప్!
న్యూఢిల్లీః ఇంటర్నెట్ దిగ్గజం.. గూగుల్ సెర్ష్ ఇంజిన్ మరో కొత్త యాప్ ను ప్రారంభించింది. భారత్ లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలనుంచి సేకరించిన ప్రసిద్ధ రచనలు, కళాఖండాల గురించి తెలుసుకునేందుకు గూగుల్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ కొత్త యాప్ ను కళా ప్రేమికులకు అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకోసం గూగుల్ కొత్తగా 'ఆర్ట్ అండ్ కల్చర్' యాప్ ను సృష్టించింది. యాప్ తో పాటు వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. ప్రపంచంలోని అనేక కళలకు సంబంధించిన సమాచారాన్ని అందులో పొందుపరచి కళాభిమానులకు దగ్గరయ్యేందుకు.. సెర్చ్ ఇంజన్ వినూత్న ప్రయత్నం చేసింది. విశ్వవ్యాప్తంగా 70 దేశాల్లోని మ్యూజియాల్లోని అనేక కళాఖండాలు, సుప్రసిద్ధ రచనలను గురించి తెలుసుకునేందుకు సహాయపడేట్లుగా ఈ కొత్త యాప్ ను గూగుల్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన అనువర్తనం ద్వారా.. ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ చరిత్ర వంటి ఏదైనా కళలు, సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు శోధించి తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రముఖ చిత్రకారులు, ఆధునిక భారతీయ చిత్రకళ వంటి అనేక విషయాలను కళా ప్రేమికులు గూగుల్ 'ఆర్ట్ అండ్ కల్చర్' యాప్ ద్వారా తెలుసుకోవచ్చని గూగుల్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ ప్రొడక్ట్ మేనేజర్ డంకన్ ఓస్బోర్న్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశం లోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను కూడా గూగుల్ కార్డ్ బోర్డ్ అందుబాటులోకి తెస్తోంది. ఈ హెడ్ సెట్ ద్వారా 1978 లో స్థాపించిన అతిపెద్ద భారత కళా, సాంస్కృతిక సంగ్రహాలయంలో వినియోగదారులు వాస్తవిక కళా, సాంస్కృతిక పర్యటన చేసే అవకాశం ఉంటుందని చెప్తోంది. అలాగే ఈ కొత్త గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ ను యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
కొత్త మలేరియా వ్యాక్సిన్ కనిపెట్టారు..
మెల్బోర్న్ః మలేరియా నివారణకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ ను కనిపెట్టారు. ఎర్ర రక్తకణాలను హరించి మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కొనేందుకు నూతన యాంటీ మలేరియా చికిత్సను అభివృద్ధి చేశారు. వాల్తేర్ అండ్ ఎలీజా హాల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ అలాన్ కౌమాన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో, ఎర్ర రక్తకణాల్లోకి కీ ప్రొటీన్లు పంపించడం ద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములు లోపలికి చొచ్చుకొని వెళ్ళలేవని తెలుసుకున్నారు. దోమకాటుద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 30 కోట్ల నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మలేరియా సోకినవారిలో ప్రతియేటా 4.5 లక్షలమంది దాకా చనిపోతున్నారు. అంతేకాక చిన్నపిల్లల్లో పెరుగుదలను కూడ దెబ్బతీసే ఈ వ్యాధి... గర్భిణీలకు మరింత ప్రమాదకరం. అటువంటి వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చని అధ్యయనకారులు చెప్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మలేరియా నివారణకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను అందించడమే కాక, పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రతపై కూడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా 5 ఏళ్ళలోపు వయసున్న పిల్లలపై మలేరియా ప్రభావం అధికంగా ఉంటోందని, దోమల్లో గ్రహణ శక్తి పెరగటంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న యాంటీ మలేరియల్ మందులు ప్రభావం తగ్గుతోందని, అందుకే కొత్త పరిశోధనలద్వారా మలేరియా క్రిములను ఎదుర్కొనే మందులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. కౌమాన్ బృందం తాజాగా ఆర్ హెచ్ 5, ఆర్ ఐపీఆర్, సీవై పీఆర్ ఏ మొదలైన మూడు ప్రొటీన్లను కలిపి, ఆరోగ్యంగా ఉన్న మానవ రక్త కణాల్లోకి పంపించడంద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కోవచ్చునని కనుగొన్నారు. ఇలా చేయడంవల్ల మలేరియా క్రిములు ఎర్ర రక్తకణాలను హరించలేకపోయాయని తమ పరిశోధనలద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రొటీన్లతో టీకాలు వంటివి అభివృద్ధి చేసి, వ్యాక్సిన్లుగా ఇవ్వొచ్చని కౌమాన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మలేరియాకు కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి పరిచే పరిశోధనలకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక వ్యాక్సిన్లకు మలేరియా క్రిములు అలవాటు పడిపోయాయని, ఈ పరిస్థితుత్లో కొత్త చికిత్సల అవసరం ఎంతైనా ఉందన్నారు. సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ జర్నల్ లో కౌమాన్ బృందం.. తమ తాజా పరిశోధనలను నివేదించారు. -
మరో ముందడుగు
గోదావరిఖని : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణలో మరో ముందడుగు పడింది. 1999లో మూసివేసిన ఈ కర్మాగారాన్ని గ్యాస్ ఆధారంగా పునరుద్ధరించే క్రమంలో ఇందుకు సంబంధించి బుధవారం కీలక ఘట్టం ముగిసింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) సంస్థలతో భాగస్వామ్య (జాయింట్ వెంచర్) సంస్థ ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల ఎఫ్‌సీఐఎల్ కార్యాలయంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేందర్ప్రధాన్తో పాటు ఆయా సంస్థల ఉన్నత స్థాయి అధికారులు సమావేశమై జాయింట్ వెంచర్‌పై చర్చించి సంస్థను ఏర్పాటు చేస్తూ ఆయా కంపెనీల అధికారులు సంతకాలు చేశారు. దీనికి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌గా నామకరణం చేశారు. ఈ ప్లాంట్‌కు కాకినాడ తీరంలోని మల్లవరం నుంచి గుజరాత్‌లోని బిల్వారాకు పైప్‌లైన్ ద్వారా తీసుకెళ్లే గ్యాస్‌ను సమీపంలోని పాయింట్ నుంచి సరఫరా చేయనున్నారు. 2018 నాటికి ఎరువుల ఉత్పత్తి లక్ష్యంగా కర్మాగారం పనులు పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అంగీకరించారు. రూ.5వేల కోట్ల పెట్టుబడి రూ.5వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పా టు చేస్తుండగా, ఇందులో 70 శాతం రుణంగా తీసుకోనున్నారు. మిగతా 30 శాతం ఈక్విటీని ప్రకటించనుండగా, ఎన్ఎఫ్ఎల్ 26 శాతం, ఈఐఎల్ 26 శాతం, ఎఫ్‌సీఐఎల్ 11 శాతం, మరో 37 శాతం షేర్‌హోల్డర్ల నుంచి సేకరించనున్నారు. ఈ రోజుకు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్లాంట్‌ను నిర్మించనున్నారు. పర్యావరణ అనుమతి రాగానే ప్రాథమికంగా పనులు చేపట్టనున్నారు. సంక్రాంతి పండుగ కానుగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు జాయింట్ వెంచర్‌ను ప్రారంభించినట్టైంది. ఎన్డీఏ హయాంలోనే మూసివేత.. పునరుద్ధరణ బొగ్గు ఆధారంగా రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణ పనులు 1970 అక్టోబర్ 2న ప్రారంభం కాగా.. 1980 నవంబర్ ఒకటిన యూరియాను ఉత్పత్తి చేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, నాణ్యతలేని బొగ్గు సరఫరా, నూతన టెక్నాలజీలో ఏర్పడిన లోపాలు, కేంద్రం సకాలంలో ఆర్థిక వనరులను సమకూర్చకపోవడం, ఉన్నతస్థాయి కమిటీలు చేసిన సిఫారసులను అమలు చేయకపోవడం, తదితర కారణాలు ఎరువుల కర్మాగారానికి నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో 1999 మార్చి 31న అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఎరువుల కర్మాగారాన్ని మూసివేసింది. అప్పటికి 16.89 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసింది. ఆనాటి నుంచి ఎరువుల కార్మాగారాన్ని తెరిపించాలని అనేక పార్టీలు, సంఘాలు చేసిన ఆందోళనల ఫలితంగా నూతన ప్లాంట్‌ను నిర్మించేందుకు కేంద్రం సమ్మతించింది. బీఐఎఫ్ఆర్ నుంచి విముక్తి కల్పించడంతో పాటు రూ.10,400 కోట్ల రుణాన్ని కేంద్రం మాఫీ చేసింది. నెలాఖరులోగా ప్రజాభిప్రాయసేకరణ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు మూడు కంపెనీలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు కాగా... జనవరి నెలాఖరులోగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశాలున్నాయి. స్థానికులతో చర్చించి వారి అభిప్రాయాన్ని సేకరించి ఏప్రిల్‌లో పనులు మొదలుపెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కర్మాగారం పునరుద్ధరణ కోసం మాజీ ఎంపీ జి.వివేక్ శాయశక్తులా కృషి చేయగా, ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్ పలుమార్లు లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, అధికారుల సంఘం, కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రతినిధులు ఎం.సుందర్రాజు, కంది శ్రీనివాస్ తదితరులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి ఎఫ్‌సీఐ పునరుద్ధరణ కోసం వినతిపత్రాలు అందజేశారు. -
ప్రశాంత్‌తో నర్గీస్ స్టెప్పులు
నటుడు ప్రశాంత్‌తో స్టెప్పు లేయడానికి బాలీవుడ్ హాట్బేబీ నర్గీస్ ఫక్రీ రెడీ అవుతున్నారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుంచి చార్మింగ్ హీరో అవతారం ఎత్తిన నటుడు ప్రశాంత్. ఈయన పొన్నార్ శంకర్, మంబట్టియాన్ వంటి సంచలన చిత్రాల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం సాహసం. తెలుగులో ఘన విజయం సాధించిన జులాయి చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం ద్వారా అరుణ్ రాజవర్మ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈయన దర్శకుడు మేజర్ రవి వద్ద పలు చిత్రాలకు సహ దర్శకుడిగా పనిచేశారు. స్టార్ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత త్యాగరాజన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం పలు ఆసక్తికరమైన విషయాలకు నెలవు కానుంది. చిత్ర విశేషాలకు నిర్మాత త్యాగరాజన్ తెలుపుతూ ప్రశాంత్ కెరీర్లో ఇదో మంచి చిత్రంగా మిగిలిపోతుందన్నారు. తెలుగులో హిట్ అయిన జులాయి చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అభిరుచికనుగుణంగా పలు చేర్పులు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. విదేశాలలో సాహసం చిత్ర షూటింగ్ గత నెలలో ప్రారంభమై ఢిల్లీ, ముంబాయి, చెన్నైలలో చిత్రీకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా దేశాల్లో ఉంటుందని వెల్లడించారు. బాలీవుడ్ బ్యూటీతో... బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నర్గీస్ సాహసం చిత్రంలో ప్రశాంత్‌తో కలిసి ఒక ప్రత్యేక పాటలో నటించనున్నట్లు నిర్మాత తెలిపారు. బాలీవుడ్లో రాక్‌స్టార్, మద్రాస్ కేఫ్, పటా పోస్టర్, కిక్లా హీరో, మే తేరా హీరో వంటి సూపర్‌హిట్ చిత్రాలతో హీరోయిన్గా ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం స్పైలో నటిస్తున్నారు. ఈ బ్యూటీ సాహసం, చిత్రంలోని పాట సన్నివేశాన్ని వివరించగానే ప్రశాంత్‌తో నటించడానికి ఓకే చెప్పారని తెలిపారు. ఈ పాట చిత్రంలో హైలెట్‌గా ఉంటుందన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీ అందించనున్నారు. ఈ పాట కోసం బ్రహ్మాండమైన సెట్స్ రూపొందించినట్టు తెలిపారు. జూన్‌లో ఈ పాట చిత్రీకరణ ఉంటుందని చెప్పారు. ప్రశాంత్ సరసన ఒక ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నాజర్, తులసి, తంబిరామయ్య, లిమా, ఎంఎస్ భాస్కర్, దేవదర్శిని, మలేషియ అభిత, స్వామినాథన్, సోనూసూద్, కోటాశ్రీనివాసరావు, రావ్ రమేష్ తదితరులు భారీ తారాగాణం నటిస్తున్నటు చెప్పారు. శరవణన్ చాయాగ్రహణం నెరుపుతున్న ఈ చిత్రానికి ఆగ స్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు త్యాగరాజన్ వెల్లడించారు. తదుపరి ద్విభాషా చిత్రం ఈ చిత్రం తర్వాత తమిళం, తెలుగు భాషల్లో ప్రశాంత్ హీరోగా భారీ చి త్రాన్ని నిర్మిం చనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు దర్శకత్వం వ హించనున్నార ని చెప్పారు. త్వ రలో ప్రశాంత్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేయనున్నట్లు త్యాగరాజన్ వెల్లడించారు.