ప్రశాంత్‌తో నర్గీస్ స్టెప్పులు
నటుడు ప్రశాంత్‌తో స్టెప్పు లేయడానికి బాలీవుడ్ హాట్‌బేబీ నర్గీస్ ఫక్రీ రెడీ అవుతున్నారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుంచి చార్మింగ్ హీరో అవతారం ఎత్తిన నటుడు ప్రశాంత్. ఈయన పొన్నార్ శంకర్, మంబట్టియాన్ వంటి సంచలన చిత్రాల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం సాహసం. తెలుగులో ఘన విజయం సాధించిన జులాయి చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం ద్వారా అరుణ్ రాజవర్మ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈయన దర్శకుడు మేజర్ రవి వద్ద పలు చిత్రాలకు సహ దర్శకుడిగా పనిచేశారు.
స్టార్ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత త్యాగరాజన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం పలు ఆసక్తికరమైన విషయాలకు నెలవు కానుంది. చిత్ర విశేషాలకు నిర్మాత త్యాగరాజన్ తెలుపుతూ ప్రశాంత్ కెరీర్‌లో ఇదో మంచి చిత్రంగా మిగిలిపోతుందన్నారు. తెలుగులో హిట్ అయిన జులాయి చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అభిరుచికనుగుణంగా పలు చేర్పులు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.
విదేశాలలో సాహసం
చిత్ర షూటింగ్ గత నెలలో ప్రారంభమై ఢిల్లీ, ముంబాయి, చెన్నైలలో చిత్రీకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా దేశాల్లో ఉంటుందని వెల్లడించారు.
బాలీవుడ్ బ్యూటీతో...
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నర్గీస్ సాహసం చిత్రంలో ప్రశాంత్‌తో కలిసి ఒక ప్రత్యేక పాటలో నటించనున్నట్లు నిర్మాత తెలిపారు. బాలీవుడ్‌లో రాక్‌స్టార్, మద్రాస్ కేఫ్, పటా పోస్టర్, కిక్లా హీరో, మే తేరా హీరో వంటి సూపర్‌హిట్ చిత్రాలతో హీరోయిన్‌గా ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం స్పైలో నటిస్తున్నారు. ఈ బ్యూటీ సాహసం, చిత్రంలోని పాట సన్నివేశాన్ని వివరించగానే ప్రశాంత్‌తో నటించడానికి ఓకే చెప్పారని తెలిపారు. ఈ పాట చిత్రంలో హైలెట్‌గా ఉంటుందన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీ అందించనున్నారు. ఈ పాట కోసం బ్రహ్మాండమైన సెట్స్ రూపొందించినట్టు తెలిపారు. జూన్‌లో ఈ పాట చిత్రీకరణ ఉంటుందని చెప్పారు. ప్రశాంత్ సరసన ఒక ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నాజర్, తులసి, తంబిరామయ్య, లిమా, ఎంఎస్ భాస్కర్, దేవదర్శిని, మలేషియ అభిత, స్వామినాథన్, సోనూసూద్, కోటాశ్రీనివాసరావు, రావ్ రమేష్ తదితరులు భారీ తారాగాణం నటిస్తున్నటు చెప్పారు. శరవణన్ చాయాగ్రహణం నెరుపుతున్న ఈ చిత్రానికి ఆగ స్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు త్యాగరాజన్ వెల్లడించారు.
తదుపరి ద్విభాషా చిత్రం
ఈ చిత్రం తర్వాత తమిళం, తెలుగు భాషల్లో ప్రశాంత్ హీరోగా భారీ చి త్రాన్ని నిర్మిం చనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు దర్శకత్వం వ హించనున్నార ని చెప్పారు. త్వ రలో ప్రశాంత్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేయనున్నట్లు త్యాగరాజన్ వెల్లడించారు.