Remake
-
ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్
భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్-2 ఈ నెలలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారాయన. మరోవైపు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా.... శంకర్ ఇండియన్ 3పైనా ఫోకస్ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్ అప్‌కమింగ్ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్’(అపరిచితుడు) రీమేక్.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్ షూట్ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్ 2 ప్రమోషన్లో శంకర్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021‘‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్‌తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్వీర్తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్ ప్రకటించారు. -
నేకెడ్ గన్ రీమేక్‌లో...
హాలీవుడ్ హాట్ తార పమేలా ఆండర్సన్ అభిమానులకు ఓ శుభవార్త. ఈ గ్లామరస్ స్టార్ తాజాగా ‘నేకెడ్ గన్’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాల్లోకన్నా ఈ చిత్రంలో పమేలా పాత్ర నిడివి ఎక్కువ కావడం, హీరోయిన్ పాత్ర కావడం అనేది అభిమానులు ఆనందించే విషయమే. 1980 చివర్లలో 1990 ఆరంభంలో వచ్చిన క్రైమ్ కామెడీ ‘నేకెడ్ గన్’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మూడో భాగం 1994లో వచ్చింది. 30 ఏళ్లకు ‘నేకెడ్ గన్’ మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అకీవా షాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రీమేక్‌లో లీడ్ రోల్లో లియామ్ నీసన్ నటించనుండగా, అతని సరసన పమేలా ఆండర్సన్ నటించనున్నారు. గత మూడు భాగాల్లో డిటెక్టివ్ పాత్రను లెస్లీ నీల్సన్ చేయగా అతని ప్రేయసిగా ప్రిసిల్లా ప్రెస్లీ నటించారు. రీమేక్‌లో డిటెక్టివ్‌గా లియామ్ నీసన్, అతని ప్రేయసిగా పమేలా ఆండర్సన్ నటించనున్నారు. వచ్చే ఏడాది జూలై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక పమేలా గురించి చె΄్పాలంటే... 1990లలో హాటెస్ట్ స్టార్ అంటే పమేలానే. ‘ప్లే బాయ్’ మ్యాగజీన్ మోడల్‌గా అప్పట్లో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారామె. అలాగే బుల్లితెర కోసం ‘బేవాచ్’ సిరీస్ (1992–1997)లో చేసిన సీజే పార్కర్ పాత్ర కూడా హాట్ స్టార్‌గా పమేలాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాల పరంగా ‘రా జస్టిస్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్’ వంటివి పమేలా క్రేజ్ కొనసాగడానికి ఉపయోగపడ్డాయి. -
మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మలయాళ సినిమాల హవా నడుస్తోంది. మిగతా ఇండస్ట్రీల్లో సరైన మూవీ లేక నీరసంగా ఉండగా.. మలయాళంలో మాత్రం వరసపెట్టి బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి. దీంతో అందరూ ఈ చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఓ క్రేజీ మలయాళ సినిమా తెలుగులో రీమేక్ కానుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి) లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలా అన్ని భాషా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అలా 2022లో 'జయజయజయహే' చిత్రాన్ని చూసి అరె భలే ఉందే అనుకున్నారు. ఎలాంటి అంచనాలకు లేకుండా రిలీజై దాదాపు రూ.45 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ దీని తెలుగు వెర్షన్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఇందులో ప్రముఖ నటుడు-దర్శకుడు తరుణ్ భాస్కర్.. లీడ్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి) -
'ఉప్పెన' రీమేక్.. స్టార్ హీరోయిన్ చెల్లెలుకు ఛాన్స్
తెలుగు చిత్రం 'ఉప్పెన' పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంతోనే కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్ల కొత్త ప్రాజెక్ట్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు డైరెక్టర్‌గా ఉన్నారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారట. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్‌ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో హీరోయిన్గా ఖుషి కపూర్‌ను సెట్ చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్‌గా సెట్ అవుతుందని బోనీకపూర్ ప్లాన్‌లో ఉన్నారట. మరీ ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే బోనీ కపూర్‌నే క్లారిటీ ఇవ్వాలి. (అక్క జాన్వీ కపూర్‌తో ఖుషి కపూర్) మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్‌లో కూడా రీమేక్ చేయాలనే ప్లాన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుందట. విజయ్ వారసుడు సంజయ్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్లో ఉప్పెన రీమేక్ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్‌లో కృతి శెట్టి బిజీగా ఉంది. ఉప్పెన రీమేక్ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో రూమర్స్ భారీగానే కొనసాగుతున్నాయి. -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యే మోకాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని, కొత్త ప్రాజెక్ట్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన చిరు.. కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్‌ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ వల్ల మెగాస్టార్ చిరు.. తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని కంప్లీట్ యాక్టర్ అనొచ్చు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఆయన సినిమాలు చేస్తున్నారు. హిట్, బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాటే ఫ్లాప్స్‌ని కూడా చూశారు. అయితే అప్పట్లో అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ 'ఆచార్య', 'భోళా శంకర్' చిత్రాలు మాత్రం ఫ్లాప్ కావడంతో పాటు విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యాయి. (ఇదీ చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు.. సినిమా కన్ఫర్మ్) రీఎంట్రీలో తప్పటడుగులు వేస్తున్న చిరు.. 'ఖైదీ నం.150', 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' రీమేక్స్‌లో నటించారు. కానీ వాటి ఫలితం ఏంటనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా రీమేక్స్ దెబ్బకొడుతున్నా సరే.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బ్రో డాడీ' రీమేక్ చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఇప్పటివరకు లేదు. అయితే 'భోళా శంకర్' రిజల్ట్ చిరుని ఆలోచనలో పడేసిందట. దీంతో ఇకపై రీమేక్స్ చేయకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ నిర్మాత.. మలయాళ చిత్ర రీమేక్స్ రైట్స్ పట్టుకుని మెగాస్టార్‌కి దగ్గరకి వెళ్తే.. సున్నితంగా నో చెప్పేశారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే కాస్త లేట్ అయినా సరే చిరు.. స్ట్రెయిట్ సినిమాలే చేస్తారనమాట. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
మెగా బ్రదర్స్‌కు రీమేక్స్ నేర్పుతున్న పాఠాలు!
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం 'రీమేక్'. మంచి కథ చెప్పాలనో లేదా పని ఈజీ అయిపోతుందనో తెలీదు కానీ స్టార్ హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు రీమేక్స్‌పై అప్పుడప్పుడు మోజు పడుతుంటారు. అయితే ఈ మధ్య ఆ సరదా కొంచెం ఎక్కువైంది. మెగాబ్రదర్స్నే తీసుకుంటే.. ఈ మధ్యే వారాల వ్యవధిలో తలో రీమేక్ సినిమాని రిలీజ్ చేశారు. వీటికి పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువొచ్చింది. చిరంజీవి-పవన్ ఈ రీమేక్స్‌లో నటించడం ఓ కారణమైతే, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడం మరో కారణం. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) చిరంజీవి 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమాకు రీమేక్. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడే మెగా అభిమానులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ వాళ్ల బాధ పట్టించుకునే నాథుడు ఎవరు? ఇక మెహర్ రమేశ్ దర్శకుడు అని తెలియగానే గగ్గోలు పెట్టారు. ఏం చేస్తాడో ఏంటో అని భయపడ్డారు. ఇప్పుడు వాళ్లు అనుకున్నదే నిజమైంది. ఎప్పుడో జమానా కాలంలో తీయాల్సిన మూవీ ఇప్పుడు తీశారని, చిరు ఇమేజ్ డ్యామేజ్ చేశాడని బండ బూతులు తిడుతున్నారు! మెగాస్టార్ చిరంజీవి అసలు 'భోళా శంకర్' ఎందుకు చేశారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే కమల్‌హాసన్, రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టి.. చిరుతో పాటు దక్షిణాదిలో ఆయా భాషల్లో పేరు తెచ్చుకున్న స్టార్ హీరోలు. వాళ్లందరికీ రియాలిటీ అర్థమై, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరు కూడా ఆ తరహా కథలను ఎంచుకుంటే బెటర్. భోళా.. లాంటి సినిమాలు ఒకప్పుడు ఆడేవేమో కానీ ఇప్పుడు అయితే చాలా కష్టం. ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. ఏ చిన్న తప్పు దొరికినా ఏకిపారేస్తారు. ఇప్పుడు వాళ్లకు 'భోళా శంకర్' దొరికింది. ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!) చిరు సంగతి ఇలా ఉంటే పవన్ పరిస్థితి ఇంకా విచిత్రం! రీఎంట్రీ తర్వాత పవన్ మూడు సినిమాలు చేస్తే.. అవన్నీ హిందీ, మలయాళ, తమిళంలో వచ్చిన చిత్రాలకు రీమేక్స్. పని తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందనే ఆలోచనతో సినిమాలు చేశాడు! ఫ్యాన్స్ ఏమో దీన్ని 'మహా ప్రసాదం' అన్నట్లు హడావుడి చేశారు. కట్ చేస్తే సాధారణ ప్రేక్షకుడు మాత్రం 'మాకేంటి ఈ ఖర్మ' అని తనలో తానే తిట్టుకున్నాడు. అయితే మెగా బ్రదర్స్ చేస్తున్న రీమేక్స్ మెగా అభిమానులని ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుడి మాత్రం వీళ్లకు మెల్లగా దూరమైపోతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కాస్త లేటయినా సరే స్ట్రెయిట్ కథలతో సినిమాలు చేస్తే పర్లేదు. అలా కాదు మేం రీమేక్స్ చేస్తాం అనుకుంటే మాత్రం మెగాస్టార్, పవర్‌స్టార్ అనే ట్యాగ్స్ హిస్టరీలో తప్ప రియాలిటీలో కనిపించవు! అభిమానులకు బాధగా అనిపించినా సరే ఇదే నమ్మలేని నిజం. (ఇదీ చదవండి: జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు) -
వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
మెగా అభిమానులని ఈ మధ్య కాలంలో బాగా బాధపెడుతున్న విషయం ఒక్కటే. అది రీమేక్స్. మెగా బ్రదర్స్ ఇద్దరూ వరసగా రీమేక్ చిత్రాలు చేస్తున్నారు. వాళ్ల వైపు నుంచి రీజన్ ఏంటనేది పక్కనబెడితే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై వచ్చే ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విమర్శలు ఏకంగా మెగాస్టార్ చెవిన పడ్డట్లు ఉన్నాయి. దీంతో అసలు రీమేక్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఫుల్‌గా క్లారిటీ ఇచ్చేశారు. నచ్చి చేశాను 'అమ్మ ప్రేమ.. అభిమానుల ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదు. అది చల్లగా మదిని హత్తుకుంటుంది. అందుకే మీరందరూ గర్వపడేలా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటాను. ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నాను. నా మనసుకు నచ్చి చేసిన సినిమా ఇది. రీమేక్స్ చేస్తుంటారేంటని కొందరు తరుచూ అడుగుతున్నారు.' (ఇదీ చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్) రీమేక్.. తప్పేంటి? 'ఓ మంచి కథ దొరికినప్పుడు.. దాన్ని మన ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్ చేస్తే తప్పేంటనేది నాకు అర్థం కాదు. ఈ 'భోళా శంకర్' ఒరిజినల్ 'వేదాళం' ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. ఎవరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ మూవీ చేసేందుకు ముందుకొచ్చాను. ఇది కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇది సూపర్‌హిట్ అవుతుందనే భరోసా అందరిలో కనిపించింది' అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇది మూడో రీమేక్ మెగాస్టార్ చిరంజీవి.. 2007 తర్వాత దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఇక రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నం.150'.. తమిళ సినిమా 'కత్తి'కి రీమేక్. ఇది బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. దీని తర్వాత 'సైరా', 'ఆచార్య' చిత్రాలు చేసిన చిరుకు నిరాశే మిగిలింది. దీంతో మళ్లీ రూట్ మార్చారు. మలయాళ 'లూసిఫర్' రీమేక్‌తో 'గాడ్ ఫాదర్'గా వచ్చారు. ఇది ఓ మాదిరి హిట్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' స్ట్రెయిట్ మూవీ కానీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు చేస్తున్న 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం'కి రీమేక్. మరి దీని టాక్ ఏంటో తెలియాలంటే ఆగస్టు 11 వరకు వెయిట్ చేయాల్సిందే. (ఇదీ చదవండి: వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది.. కానీ: హీరోయిన్‌పై మెగాస్టార్ కామెంట్స్) -
'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' విడుదలకు రెడీ అయిపోయింది. తెలుగులో పెద్దగా బజ్ లేదు. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు కాస్త పెరిగాయి. రజినీ స్టైల్, స్వాగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఎందుకంటే తలైవాకు సరైన హిట్ పడి చాలా కాలమైపోయింది. ఇలాంటి టైంలో 'జైలర్' ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓ వివాదం 'జైలర్' ఎలా ఉండబోతుందో అనే విషయం ఆగస్టు 10న తెలిసిపోతుంది. కాపీ అనేది పక్కనబెడితే ఇప్పటికే టైటిల్ విషయమై ఓ వివాదం నడిచింది. 'జైలర్' టైటిల్ తమదని మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు. మార్కెట్ పరంగా తమ చిత్రానికి నష్టం రాకూడదని సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. ఆగస్టు 2న హియరింగ్ జరగ్గా.. తీర్పు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) కథ కాపీ కొట్టారా? ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం.. 'జైలర్' ఫస్టాప్‌లో ఓ అమాయకుడిలా కనిపిస్తాడు. ఇంట్లో కొడుకు, మనవడు, భార్య.. ఇలా ప్రతి ఒక్కరూ అతడితో ఆడేసుకుంటూ ఉంటారు. అయితే అతడు బయటకు కనిపిస్తున్నది వేరు, గతం వేరే అనే విషయం తెలుస్తుంది. తనలో అసలు సిసలు యాక్షన్ ని బయటకు తీస్తాడు. తర్వాత ఏం జరిగింది? అనేది స్టోరీ అని తెలుస్తోంది. కథ ఒకేలా ఉందే? అయితే 'జైలర్' సినిమాకు 2021లో వచ్చిన హాలీవుడ్ మూవీ 'నోబడీ'తో పోలికలు కనిపిస్తున్నాయి. ఇందులోనూ ఓ వయసైపోయిన వ్యక్తి.. భార్యబిడ్డలతో బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రష్యన్ మాఫియాతో తలపడతాడు. తనని 'నోబడీ' అనుకున్న వాళ్లందరికీ షాకిస్తాడు. 'జాన్ విక్' టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోలికలు కనిపిస్తుండడంతో కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి 'జైలర్' వస్తే గానీ దీనిపై క్లారిటీ రాదు. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
'నాయట్టు' రీమేక్.. తెలుగులో ఇన్నాళ్లకు
2021లో మలయాళంలో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న మరో హిట్ సినిమా తెలుగులో రీమేక్‌కు రెడీ అయిపోయింది. చాలారోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ ఇన్నాళ్లకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అనే వివరాలతో పాటు ఇతర విషయాల్ని ఇన్నాళ్లకు వెల్లడించారు. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) ఈ ప్రాజెక్ట్‌కు 'కోటబొమ్మాళి PS' అనే పేరు ఖరారు చేశారు. రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల ఆధారంగా నడిచే కథ ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో, వరలక్ష్మి శరత్‌కుమార్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. రంజిన్ రాజ్-మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. 'నాయట్టు' కథేంటి? రాష్ట్రంలో ఎన్నికల జరిగే టైమ్. ఓ చిన్న ఊరిలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు ఓ కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న ఘర్షణ జరుగుతుంది. దానికి రాజకీయం తోడవడంతో పరిస్థితులు మారపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సై, కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు ఢీకొని.. గొడవలో ప్రధాన వ్యక్తి స్నేహితుడు చనిపోతాడు. దీంతో వీళ్ల ముగ్గురిని బంధించి హత్య కేసు పెట్టమని ఆర్డర్స్ వస్తాయి. దీంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ తప్పించుకుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
టమాటా చిత్ర కథ: అహ నా టమాటంట
‘చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే తిననక్కర్లేదు. గాల్లో వేలాడుతున్న కోడిని చూస్తూ, ఊహించుకుంటూ బ్రహ్మాండంగా తినవచ్చు’ అనే గొప్ప సత్యాన్ని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) జనులకు చెప్పకనే చెప్పారు. ‘ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే గాలిలో వేలాడుతున్న కోడికి బదులు టమాటాలు ఉంటాయి’ అని నెటిజనులు ఒకటే జోకులు! ఒక మహిళ దుబాయ్‌కి వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే ముందు...‘నీ కోసం ఏం తీసుకురమ్మంటావు?’ అని తల్లిని అడిగింది. ‘బంగారు నగలో, లగ్జరీ గిఫ్టో అడిగి ఉంటుంది’ అని అనుకుంటారు చాలామంది. కానీ ఆ తల్లి బంగారం కంటే విలువైన టమాటాలను అడిగింది. ఒకటి కాదు రెండు కాదు...‘పది కిలోల టమాటాలు తీసుకురామ్మా’ అని కూతురిని అడిగింది. పదికిలోల టమాటాలను పెరల్పెట్ స్టోరేజ్ జార్లలో ప్యాక్ చేసి ఇండియాకు తీసుకువచ్చింది కూతురు. ఈవిడ సోదరి ట్విట్టర్లో షేర్ చేసిన దుబాయ్ టమాటాల స్టోరీ వైరల్ అయింది. ∙∙ బంగారు నగలు అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు? అయితే టమాటాలేమో బంగారం కంటే విలువైపోయాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ‘యూరేకా... టమాటాలతో ఆభరణాలు’ అని అరిచింది. టమాటాలను చెవిరింగులుగా ధరిస్తూ ‘న్యూ గోల్డ్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది. ∙∙ శిల్పాశెట్టి షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వీడియో విషయానికి వస్తే... టమాటాల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళుతుంది శెట్టి. టమాటాలన్నీ కూడబలుక్కొని ‘టచ్‌మీ నాట్’ అన్నట్లుగా చూస్తుంటాయి. టమాటాలను చేతిలో తీసుకున్న ప్రతిసారీ ఆమె నటించిన ‘దడ్కన్’ సినిమాలోని ‘ఖబడ్దార్. హౌ డేర్ యూ’ అనే డైలాగ్ ప్లే అవుతుంటుంది! -
అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!
ఒకప్పుడు బాలీవుడ్ అంటే మెలోడీ సాంగ్స్, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఆ పరిస్థితి తలకిందులైంది. ఇటీవల పఠాన్ సినిమా మినహాయిస్తే వరుస ఫ్లాప్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ రీమేక్‌లపై ఆధారపడిందంటూ పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో రోజు రోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి మరింత దిగజారిపోతోంది. (ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతుంటే.. బాలీవుడ్ మాత్రం ఇంకా రీమేక్‌లపైనే ఆధారపడుతోంది. అయితే ఈ సారి ఏకంగా ఓ పాకిస్థానీ పాటను రీమేక్ చేయడంతో బాలీవుడ్ రేంజ్ మరింత దిగజారింది. యంగ్ హీరో ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో 'షెహజాదా' పేరుతో రీమేక్ చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన సత్యప్రేమ్ కీ కథ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన పాకిస్థానీ పాట 'పసూరి'ని రీమేక్ చేశారు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో ఈ సాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' చిత్రంలో వాడేశారు. ఇప్పటికే చిత్రబృందం ఈ సాంగ్ రిలీజ్ చేయగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. అసలేంటీ ఈ డిజాస్టర్ అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ కూడా అదేస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!) కాగా.. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిస్తోన్న సత్య ప్రేమ్ కి కథ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. భూల్ భూలయ్యా- 2 తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. Aye ki pasoori paayi ay. — Shoaib Akhtar (@shoaib100mph) June 27, 2023 -
పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!
ఒకప్పుడు బాలీవుడ్ పేరు చెప్పగానే మెలోడీ పాటలు, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. ఇప్పుడేమో ఘోరమైన ఫ్లాప్ సినిమాలే కనిపిస్తున్నాయి. రోజురోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎంతలా అంటే అక్కడి ప్రేక్షకులు.. దక్షిణాది చిత్రాల కోసం ఎదురుచూసేంతలా. ఇప్పుడు అదంతా కాదన్నట్లు ఓ పాట వల్ల కొత్త విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ లోని ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ఇతడు చేసిన సినిమాల్లో కొన్ని రీమేక్స్ ఉన్నాయి. అయినా వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇతడి సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ పలు చిత్రాల్లో నుంచి కాపీ కొట్టి తీసినట్లు అనిపిస్తాయి. ఈ ఏడాది 'షెహజాదా'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. ఇది 'అల వైకుంఠపురములో' చిత్రానికి రీమేక్. (ఇదీ చదవండి: 'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్‌బాబు!) ఇలా పలు మూవీల్ని రీమేక్ చేయడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న పాటని కూడా రీమేక్ చేసి పడేశాడు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో పాకిస్థానీ పాట 'పసూరి' అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తిక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' కోసం వాడేశారు. తాజాగా ఈ గీతాన్ని రిలీజ్ చేయగా నెటిజన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం దక్షిణాది సినిమాల డామినేషన్ కనిపిస్తోంది. మన దర్శకులు, హీరోలు కొత్త సినిమాలతో నార్త్ ఆడియెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు హిందీ హీరోలేమో పరాయి దేశాల పాటల్ని కూడా వదలట్లేదు. నిర్ధాక్షణ్యంగా రీమేక్ చేసి పడేస్తున్నారు. ఇదంతా చూస్తున్న నెటిజన్స్ కి బాలీవుడ్ పై రోజురోజుకీ విరక్తి కలుగుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు! (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) -
రీమేక్ మూవీలో నాగ చైతన్య.. క్లారిటీ ఇదే!
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తమిళ, తెలుగులో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. అయితే తాజాగా నెట్టింట్లో ఓవార్త చక్కర్లు కొడుతోంది. (ఇది చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!) ఇటీవల హిందీలో విడుదలైన కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన చిత్రం భూల్ భూలయ్యా-2. హిందీలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా ఈ చిత్రంలో టబు పాత్రలో జ్యోతిక కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలైంది. (ఇది చదవండి: చిన్న సూట్‌కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) తాజాగా ఈ వార్తలపై నాగచైతన్య టీం స్పందించింది. నాగ చైతన్య ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించడం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. భూల్ భూలయ్య-2 రీమేక్‌పై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. గతంలో అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్‌లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్‌లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్‌లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
స్పెషల్ ఫోకస్
బాలీవుడ్‌పై జ్యోతిక స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. వరుసగా ఆమె హిందీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీ చిత్రం ‘శ్రీ’లో నటించారు జ్యోతిక. వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు టైటిల్ రోల్ చేశారు. అలాగే ఓ హిందీ వెబ్ సిరీస్‌కు జ్యోతిక సైన్ చేశారనే టాక్ కొన్ని నెలల క్రితం బీటౌన్‌లో బలంగా వినిపించింది. తాజాగా మరో హిందీ ప్రాజెక్ట్‌కు జ్యోతిక సై అన్నారు. వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అజయ్ దేవగన్ భార్య పాత్రలో జ్యోతిక కనిపిస్తారట. గుజరాతీ ఫిల్మ్ ‘వష్’కు ఈ చిత్రం రీమేక్ అని భోగట్టా. -
'ప్రాజెక్ట్-k' ఆ హాలీవుడ్ మూవీకి రిమేకా! షాక్ లో ప్రభాస్ ఫ్యాన్స్
-
ఈ నెలలోనే ఛత్రపతి
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఛత్రపతి’. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. నుష్రత్ బరుచ్చా హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ (2005)ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో పెన్ స్టూడియోస్‌పై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘‘తెలుగు ‘ఛత్రపతి’ సినిమా బ్యాక్‌డ్రాప్‌ని మార్చి, యాక్షన్ ఎంటర్టైనర్గా హిందీ ‘ఛత్రపతి’ని తెరకెక్కించారు వినాయక్. శ్రీనివాస్ రగ్డ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిజార్ అలీ షఫీ, సంగీతం: తనిష్క్ బాగ్చి, వరల్డ్ వైడ్ విడుదల: పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్. -
ఓటీటీకి వచ్చేసిన 'అల వైకుంఠపురములో'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్డే హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. టాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాను హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్లో 'షెహజాదా' పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టులేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రీమేక్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ కెరీర్ క్లోజ్ అయినట్టే
-
కలెక్షన్స్ లో షాక్ ఇస్తున్న రీమేక్ సినిమాలు
-
సౌత్ సినిమాలతో హిట్ కొడుతున్న జాన్వీ కపూర్
-
హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ
ట్రెండ్ అనేది ఉందా? నో అంటారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిందా? అస్సలు కానే కాదు అంటారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ మార్తాండ’. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఇక కృష్ణవంశీ ఇంటర్వ్యూలోకి వెళదాం... ► మీ కెరీర్లో ‘రంగ మార్తాండ’ రెండో రీమేక్ (నాగార్జునతో తీసిన ‘చంద్రలేఖ’ మలయాళ రీమేక్ ). మళ్లీ రీమేక్ సినిమా చేయాలని ఎందుకనుకున్నారు.. కథలు రాయలేకపోతున్నారా? కృష్ణవంశీ : (నవ్వుతూ)... కథలు రాయలేకపోవడం కాదు. ‘రంగ మార్తాండ’ నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ రీమేక్‌లో నటించడంతో పాటు డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రకాశ్‌రాజ్. ‘ఈ సినిమాని రీమేక్ చేయా లనుకుంటున్నాను. నాకు స్క్రీన్ ప్లేలో సహాయం చెయ్’ అని అడిగాడు. ఒకరోజు రాత్రి కూర్చుని చూడటం మొదలెట్టా.. ఒకచోట కాదు ఐదార్లు చోట్ల ఏడుపొచ్చేసింది. ‘ఇది ఎక్స్ట్రార్డినరీ సినిమా. రీమేక్ చెయ్, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను’ అని ప్రకాశ్‌తో అన్నాను. ‘నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం కంటే నువ్వెలాగూ ఎమోషన్స్‌ని అద్భుతంగా డీల్ చేస్తావు. నన్ను కూడా బాగా డీల్ చేస్తావు. నువ్వు డైరెక్ట్ చేస్తే బావుంటుంది. నాకోసం చెయ్’ అన్నాడు. సరే అన్నాను. అలా ‘రంగ మార్తాండ’ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ► ‘నట సామ్రాట్’లో మిమ్మల్ని అంతగా కదిలించినదేంటి? ఇది మన తల్లిదండ్రుల కథ. మన తల్లిదండ్రులకు కావాల్సినంత విలువ ఇస్తున్నామా? లేదా గౌరవించి తప్పుకుంటున్నామా? అనే పాయింట్ ఉంది. సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మారుతోంది. సక్సెస్ సాధించాలని పరుగు తీయడంలోనో, అందరితో పొగిడించుకోవాలనే ప్రయత్నంలోనో, అందరికంటే అధికుణ్ణి అనిపించుకోవాలనే తపనలోనో మనల్ని మనం కోల్పోతున్నాం. అది ‘నట సామ్రాట్’లో నాకు కనిపించింది. ఇది ఒక స్టేజ్ యాక్టర్ కథ. అతను స్టేజ్ మీద విలువలతో బతికినవాడు.. బ్రహ్మాండమైన నటుడు. అందుకే ‘రంగ మార్తాండ’ అనే బిరుదు ఇస్తారు. ఆ బిరుదు వచ్చిన రోజునే అతను నటనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. అప్పటివరకూ నటుడిగా రంగుల ప్రపంచం, నిరంతరం చప్పట్ల మధ్య ఉండే అతను నిజ జీవితంలో తండ్రిగా, తాతగా, భర్తగా, స్నేహితుడిగా తన పాత్ర పోషించే సమయంలో లైఫ్‌లో ఎంతమంది నటులున్నారో తెలుస్తుంది. అతను నమ్మిన ఆదర్శాలకు, బయట నిజాలకు క్లాష్ అవుతుంది. తల్లిదండ్రులు స్వార్థపరులయిపోయారు. పిల్లలు స్వార్థపరులయిపోయారు అని నిందించకుండా ఎవరి పాయింట్లో వాళ్లే కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ, వాళ్ల మధ్య క్లాష్ ఎలా వస్తుంది? అనేదే ఈ కథ. ► ‘రంగ మార్తాండ’ మళ్లీ మిమ్మల్ని హిట్ ట్రాక్‌లోకి తీసుకుని వస్తుందనుకుంటున్నారా? నేను ఇలా చెబితే నమ్మశక్యంగా ఉంటుందో లేదో తెలియదు కానీ హిట్ కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ఇదెందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమయిందేంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి... అంతే. ► ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా సాగుతోంది. ఈ ట్రెండ్‌ని మీరెలా చూస్తారు? నా చిన్నప్పటినుంచి మా ఊర్లో హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమా (తెలుగు) దేశం నలు మూలలకు వెళుతోంది. అన్ని ప్రాంతాల వాళ్లు ఆదరిస్తున్నారు. ఇది కేవలం సౌత్ సినిమాలా కాకుండా సౌత్ సినిమాని కూడా ఇండియన్ సినిమాగా చేయొచ్చు అనే అర్థంతో పాన్ ఇండియా సినిమా అంటున్నారని అనుకుంటున్నాను. ► మీరు పాన్ ఇండియా సినిమా ట్రై చేస్తారా? ఏమో చెప్పలేం. అది సినిమాను బట్టి ఉంటుంది. ► కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కానీ దానికంటే ముందే మీకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం? ఆటోమేటిక్‌గా వచ్చేసింది అలా. ఫ్లాప్ అయిన తర్వాత పుంజుకోవడం కష్టం. హిట్.. ఫ్లాప్ అనేది నేను తీసుకోను. కానీ ఆ ఎఫెక్ట్ నా మీదుంటుంది. హిట్ కోసమని మెట్టు దిగి, దిగజారి ప్రజల్ని మభ్యపెట్టి సినిమా తీయలేను. రాజీ పడలేను. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు కదా. గ్యాప్ అయితే ఫ్లాప్స్ వల్లే వచ్చింది. హిట్ ఇస్తుంటేనే ఇండస్ట్రీలో ఫాస్ట్‌గా ఉంటాం. ► ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని కొంత వల్గర్ కామెడీ, రేంజ్‌కి మించిన వయొలెన్స్ తీస్తున్నారు కొందరు... దీని గురించి మీరేం అంటారు? ప్రేక్షకుల మైండ్ సెట్ మారలేదని నా అభిప్రాయం. అయినా ఇదో ఫేజ్ అనుకుంటున్నాను. మనం ఆ తరం (పాత సినిమాలు) చూశాం కాబట్టి ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం. కానీ ఇప్పటివాళ్లు ఇవే చూశారు కాబట్టి వారికి ఇదే కరెక్ట్ అనిపిస్తుందేమో. ► ఫార్ములా ఫాలో కాకపోతే మీరు పోటీలో ఎలా నిలబడతారు? సినిమా తీసే ఫార్మాట్ ఒక్కటే మారింది. బేసిక్ ఎమోషన్స్ అన్నీ అవే. అదే లవ్, అదే ఫ్యామిలీ, అదే విలనిజం అన్నీ అవే. మంచి మీద చెడు గెలుస్తుంది అని చివర్లో చెప్పడం. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. అలా అని ప్రయాణం మానేస్తామా? మన ప్రయాణం మనది. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా, వీలైతే మన వల్ల కొందరైనా పాజిటివ్‌గా ఉండగలుగుతున్నారా అనేదే మనం పట్టించుకోవాల్సింది. సో.. పోటీ గురించి భయపడటం, బాధపడటం నాకు రాదు. ► అలాగే ఒకప్పుడు ఎమోషన్ అంటే బలంగా చూపించేవారు. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో లైటర్‌వీన్‌గా కనిపిస్తోంది. అదేమంటే ట్రెండ్ మారిందంటున్నారు... ఎమోషన్ని స్ట్రాంగ్‌గా చూపించడానికి ఇష్టపడటంలేదా? తెలియడం లేదా? చేతకావడం లేదా? దాసరిగారిలా, కేవీ రెడ్డిగారిలా, విశ్వనాథ్‌గారిలా సినిమాలు తీయలేం. అలా ఎవ్వరూ తీయలేరు కాబట్టి ట్రెండ్ మారింది అనుకుందామా? కరెక్ట్‌గా తీయగలిగితే అలా అనుకోనక్కర్లేదా? మరి.. కరెక్ట్‌గా తీయడం అంటే ఏంటని నన్ను అడగకండి. నాక్కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమాను ప్రపంచం ఆదరించింది కదా? ట్రెండ్ అంటూ ఏదీ లేదు. ట్రెండ్ అంటే నా దృష్టిలో బూతు. మనకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అందర్నీ నీతిగా నిజాయితీగా సామరస్యంగా ఉండాలనే బోధించాయి. ఏ మతమయినా ఇదే చెప్పింది. ఇప్పటికీ మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఒక మతంలా అయిపోయింది. ఏం మాట్లాడాలి? ఏం బట్టలు వేసుకోవాలి? అన్నీ సినిమా చెబుతుంది. సో... అలాంటి మీడియమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేసినా సోషల్ బెనిఫిట్ ఉండాలి. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్.. ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా తీయాలి. ► ‘రంగ మార్తాండ’కి చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ గురించి? ఒక నటుడు తనని తనెలా అర్థం చేసుకుంటాడు? అనేది ఓ కాన్సెప్ట్‌లా అనుకుని, వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నాను. రచయిత లక్ష్మీ భూపాల్‌తో రెగ్యులర్ పాటలా.. మాటాలా వద్దు.. షాయిరీలా చెప్పిద్దాం.. అలా రాయమని అన్నాను. ఇదే మాట ఇళయరాజాగారికి చెబితే ‘నువ్వు రాయించుకుని తీసుకురా చేద్దాం’ అన్నారు. బ్రహ్మాండంగా వచ్చింది. ఈ వాయిస్ ఓవర్‌ని ఏదైనా పెద్ద యాక్టర్‌తో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తట్టినవి రెండే పేర్లు. సీనియర్ ఎన్టీఆర్‌గారు... చిరంజీవిగారు. చిరంజీవిగారికి ఫోన్ చేస్తే, రమ్మన్నారు. వెళ్లి, వివరించాను. షాయరీ ఐడియా విని ఆయన థ్రిల్లయ్యారు. ‘నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంది’ అన్నారు. ► అన్నం’ సినిమా అనౌన్స్ చేశారు? ‘రంగ మార్తాండ’ తర్వాత అదే చేస్తాను. ‘సింధూరం, ఖడ్గం, మహాత్మ’ ఆ జోన్ ఫిల్మ్ ఇది. ఫుడ్ మాఫియా, వ్యవసాయం, అన్నం, మనిషి తన స్వార్థం కోసం ఆవుల్ని, కోళ్లను ఎలా వాడుకుంటున్నాడు? అనేది కాన్సెప్ట్. ► ‘రంగ మార్తాండ’ సినిమాలో ఒక నటుడు తన రియల్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడో చూపిస్తున్నారు. మరి.. మీ లైఫ్‌ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది? నా అర్హతకి కొన్ని వేల రెట్లు ఎక్కువే ఇచ్చింది ఈ జీవితం. ఇప్పుడు నా మనసిక స్థితి ఎలా ఉందంటే.. ఏం చేసినా అది నేను చేయలేదు. అది (విధి) చేయించింది నాతో. ఎంత కాలం చేయించదలచుకుంటే అంత కాలం చేయిస్తుంది. నేనంటూ ఏం కోరుకోవడం లేదు. మన పుట్టుక మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మా ఊరి నుంచి మద్రాస్ తోసింది, అక్కడి నుంచి వర్మగారి దగ్గరకు తోసింది హైదరాబాద్‌కు. అక్కడ నుంచి దర్శకుడిని అయ్యాను. అన్నీ అలా జరుగుతూ వచ్చేశాయి.. అంతే. ► చాలామంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.. మీకు ఆ ఉద్దేశం లేదా? వచ్చే ఏడాది చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు. ► మీ సినిమాల్లో హీరోలతో బ్రహ్మాండంగా నటింపజేశారు. మీ అబ్బాయి రిత్విక్తో సినిమా చేస్తారా? వాడేం అవ్వాలనుకుంటాడో అది వాడి ఇష్టం. కాసేపేమో ఫుట్‌బాల్ అంటాడు. రేసర్ అంటాడు. యాక్టర్ అంటాడు. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్నాడు కదా. కొత్తది ఏది చూసినా దాని మీదకు ధ్యాస వెళ్లిపోతుంది. ► మీ అబ్బాయి ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవడంలేదు. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు, రమ్యకృష్ణకి బిడ్డ అయ్యాడంటేనే వాడి అదృష్టం మీకు అర్థం అవుతుంది కదా (నవ్వుతూ). – డి.జి. భవాని -
రీమేక్‌గా వస్తున్న వెబ్ సిరీస్‌లు..
ఒక భాషలో హిట్టయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి ఇప్పుడు వెబ్ సిరీస్‌ల విషయంలోనూ కనిపిస్తోంది. హిట్ వెబ్ సిరీస్‌లు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్నాయి. వెబ్ తెరపై వ్యూయర్స్‌ను ఎట్రాక్ట్ చేసేందుకు ఇంగ్లిష్ కథలను మన భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ ఇంగ్లిష్ కథల్లో నటిస్తున్న ఇండియన్ తారలెవరో చూద్దాం. వెంకటేశ్ కెరీర్లో దాదాపు పాతిక రీమేక్ సినిమాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు వెంకీ వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ అనే వెబ్ సిరీస్‌కి అడాప్షన్ ఈ ‘రానా నాయుడు’. అంటే.. రీమేక్. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేశ్‌తో పాటు రానా, ప్రియా బెనర్జీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ ద్వయం దర్శకత్వం వహించారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఏడాదే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ‘రే డోనోవన్’ కథ విషయానికి వస్తే... బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ వంటి వారికి ఎదురైన సమస్యలను పరిష్కరిస్తుంటాడో వ్యక్తి. కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా సెలబ్రిటీలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాటి జోలికి మాత్రం వెళ్లడు. కుటుంబసభ్యులతో అతనికి ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి? అతని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా జైలుకు వెళ్లారా? అనే అంశాల నేపథ్యంలో సాగుతుందీ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌కి రీమేక్‌గా వస్తున్న ‘రానా నాయుడు’ ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మరోవైపు బ్రిటిష్ వెబ్ సిరీస్ ‘ప్రెస్’ అడాప్షన్ ‘ది బ్రోకెన్ న్యూస్’లో నటించారు సోనాలీ బెంద్రే. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన తర్వాత సోనాలీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చింది ఈ వెబ్ సిరీస్ కోసమే. వినయ్ వైకుల్ డైరెక్ట్ చేసిన ‘ది బ్రోకెన్ న్యూస్’లో సోనాలీతో పాటు జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గొన్కర్ ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్‌లో అమీనా ఖురేషీ పాత్రలో కనిపిస్తారు సోనాలి. స్క్రిప్ట్ ప్రకారం.. ముంబైలో ‘ఆవాజ్ భారత్’, ‘జోష్ 24/7’ అనే రెండు న్యూస్ చానల్స్ ఉంటాయి. ‘ఆవాజ్ భారత్’ చానెల్ హెడ్‌గా ఉంటారు అమీనా. ఈ రెండు న్యూస్ చానెల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఎలా పోటీ పడ్డాయి? టీఆర్పీని పెంచే క్రమంలో ఈ న్యూస్ చానెల్స్‌లోని సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనయ్యారు? వాటి పరిణామాలు, పరిస్థితుల సమాహారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ‘ది బ్రోకెన్ న్యూస్’ ఈ నెల 10 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బ్రిటిష్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్‌లో నటిస్తున్నారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. సందీప్ మోడి దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో శోభితా ధూళిపాళ్ల, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రధారులు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఉన్న ఓ వ్యక్తి ఒక ప్రముఖ హోటల్లో నైట్ మేనేజర్ డ్యూటీ చేస్తుంటాడు. ఇదే సమయంలో వ్యాపారవేత్త ముసుగులో చట్టవిరుద్ధంగా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తుంటాడు మరో వ్యక్తి. ఈ వ్యాపారవేత్తను గమనించేందుకు ప్రభుత్వం కూడా అతని కదలికలపై ఓ స్పై టీమ్‌ను నియమిస్తుంది. ఇదే సమయంలో నైట్ మేనేజర్‌తో పరిచయం ఉన్న ఓ యువతి హత్యకు గురవుతుంది? ఈ హత్యకు కారకులు ఎవరు? ఆమెను ఎందుకు హత్య చేశారు. స్పై టీమ్‌కు, నైట్ మేనేజర్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. నిజానికి ఇందులో హృతిక్ రోషన్ చేయాల్సింది కానీ ఫైనల్‌గా ఆదిత్యా రాయ్ చేతికి వచ్చి చేరింది. పైన పేర్కొన్న వెబ్ సిరీస్‌లే కాదు.. మరికొన్ని హాలీవుడ్ సిరీస్‌లు రీమేక్ కానున్నాయి. -
'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ రీమేక్
Yoo Ji-tae As The Professor In Money Heist: Korea Joint Economic Area: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. దేశాలు, భాషలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లకు మోస్ట్ పాపులారిటీ వస్తోంది. అలా మోస్ట్ పాపులర్ అయిన వెబ్ సీరీస్లలో 'మనీ హెయిస్ట్' ఒకటి. ముందుగా ఈ సిరీస్ స్పానిష్‌లో 'లా కాసా డె పాపెల్ (ది హౌజ్ ఆఫ్ పేపర్)' అనే టైటిల్‌తో వచ్చింది. తర్వాత యూఎస్‌లో ఇదే సిరీస్‌ను 'మనీ హెయిస్ట్' టైటిల్‌తో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. బ్యాంకుల దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన 5 సీజన్లు మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్‌కు రీమేక్ రాబోతుంది. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ కొరియన్ భాషలో రీమేక్ కానుంది. 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1' టైటిల్‌తో కొరియాలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తూ ఇందులోని ప్రొఫెసర్ పోస్టర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. కొరియన్ 'మనీ హెయిస్ట్‌లో ప్రొఫెసర్‌గా 'యూ జి-టే' నటించనున్నాడు. ఈ పోస్టర్లో జాకెట్‌తో పాటు ఫార్మల్ దుస్తులు ధరించి, స్పెక్ట్స్ పెట్టుకుని ప్రొఫెసర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఈ సిరీస్‌ను జూన్ 24 నుంచి ప్రదర్శించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. చదవండి: స్పానిష్ టీవీ సిరీస్‌కు ఫుల్ క్రేజ్ ఎందుకంటే.. Get ready to go back to class, The Professor arrives in just 6 weeks 🥳 MONEY HEIST: KOREA - JOINT ECONOMIC AREA ARRIVES ON JUNE 24th 🕺🏻💃 pic.twitter.com/fBtWRU4FQJ — Netflix India (@NetflixIndia) May 13, 2022 ఇదివరకు వచ్చిన 'మనీ హెయిస్ట్'లో ప్రొఫెసర్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సిరీస్‌లోనే కేవలం ప్రొఫెసర్ పాత్రకే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ప్రొఫెసర్‌గా అల్వారో మోర్టే నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే ప్రస్తుతం వస్తున్న 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1'పై అందులోని ప్రొఫెసర్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఇందులో ప్రొఫెసర్‌గా నటిస్తున్న 'యూ జి-టే' ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా వెన్ మై లవ్ బ్లూమ్స్, హీలర్, మ్యాడ్ డాగ్ చిత్రాల్లో అలరించాడు 'యూ జి-టే'. అలాగే దక్షిణ కొరియా సిరీస్ స్క్విడ్ గేమ్ కూడా పాపులర్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });