తమిళ హిట్‌ మూవీ రీమేక్‌లో యంగ్‌ హీరో! | Bellamkonda srinivas May Act in Remake Of Tamil Hit movie Rakshasan | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 12:05 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Bellamkonda srinivas May Act in Remake Of Tamil Hit movie Rakshasan - Sakshi

పక్క భాషల్లో హిట్‌ అయిన సినిమాలను తెరకెక్కించడానికి అందరూ ముందుంటారు. అయితే ఈ ఏడాది తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన రాచ్చసన్‌ మూవీని తెలుగులో కూడా రీమేక్‌ చేయడానికి సిద్దమయ్యారు. అయితే ఈ సినిమా హక్కులను నితినే కొన్నాడని, ఆయనే హీరోగా నటించనున్నాడని అప్పట్లో టాక్‌ వినిపించింది. అయితే దీనికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. 

ఇటీవలె కవచం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఈ రీమేక్‌లో నటించనున్నాడనే వార్త వినిపిస్తోంది. క్రైమ్‌ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించాలనే లక్ష్యంతో డైరెక్టర్‌గా ట్రై చేస్తూ ఉండే యువకుడు.. తప్పని పరిస్థితుల్లో పోలీస్‌ ఆఫీసర్‌గా మారడం.. మిస్టరీగా మారిన ఓ కేసును చేధించే కథతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట రికార్డులు సృష్టించింది. మరి ఇదే కథ తెలుగు ప్రేక్షకులకు ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement