Bellamkonda Sai Sreenivas
-
'భైరవం' టీజర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ సందడి (ఫొటోలు)
-
పవర్ఫుల్ డైలాగ్స్‌తో భైరవం.. టీజర్ చూశారా?
హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భైరవం. ఇది తమిళ 'గరుడన్' సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి సోమవారం (జనవరి 20) టీజర్ రిలీజ్ చేశారు. రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. అంటూ జయ సుధ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. శీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే ప్రాణాలు తీస్తా అని మనోజ్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు. యాక్షన్‌కు ఢోకా లేదన్నట్లుగా ఉన్న ఈ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్‌తో పాటు ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు
హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు . ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. అల్లుడు అదుర్స్ మూవీ తర్వాత తెలుగులో ఆయన మరే సినిమాలో నటించలేదు. అయితే, ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు. ఆ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు పెట్టాడు కూడా.. కానీ, ఫలితం దక్కలేదు. దీంతో ఆయన టాలీవుడ్ వైపే సీరియస్‌గా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. అందులో 'హైందవ' (Haindava Movie) చిత్రం నుంచి తాజాగా టైటిల్ గ్లింప్స్ (Glimpse) విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు)బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో హైందవ చిత్రాన్ని మహేశ్ చందు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి కాన్సెప్ట్‌తో ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. హిందూ పురాణాల ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు శ్రీ మహా విష్ణువు దశావతారాల నుంచి హైందవ చిత్రం రానుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా ఉంది. 2.40 నిమిషాలు ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పురాతన ఆలయాన్ని కొందరు దుండగలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకోవడానికి ఓ బైకులో హీరో శ్రీనివాస్ పెద్ద సాహసమే చేస్తుంటాడు. ఇదే సమయంలో సింహం, వరాహం, గద్ద కూడా అతని బైకు వెంట వెళ్తూ ఉంటాయి. ఈ విజువల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కావచ్చింది. కమర్షియల్ అంశాలతో కూడిన శక్తివంతమైన, ఆసక్తికరమైన కథను లుధీర్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్ అందిస్తున్నారు.'భైరవం'లో శంకర్ కుమార్తె హీరోయిన్బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ కూడా విడుదలైంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. -
బెల్లంకొండ బర్త్ డే స్పెషల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం భైరవం. ఈ చిత్రంలో ఆదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఓ వెన్నెల అంటూ సాంగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన సాంగ్ ఓ వెన్నెల సాంగ్‌కు తిరుపతి జావన లిరిక్స్ అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, యామిని ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తోన్న ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదితి శంకర్‌తో పాటు దివ్యా పిళ్లై, ఆనంది కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.Happy to launch this soothing melody #OoVennela from #Bhairavam ▶️ https://t.co/BvAn6n84rt Happy Birthday @BSaiSreenivas, wish you all the luck and success this year.All the best @AditiShankarofl, @KKRadhamohan Garu , @DirVijayK, @sricharanpakala & Team pic.twitter.com/eZ9lNclFkK— Nani (@NameisNani) January 3, 2025 -
ఓ వెన్నెల...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ నెల 3న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘భైరవం’ మూవీ నుంచి ‘ఓ వెన్నెల..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘భైరవం’. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘భయం’తో బాక్సాఫీస్‌పై దాడి.. కాసుల వర్షం కురిసేనా?
హారర్ సినిమాలు ఏ మాత్రం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే కథాబలం ఉన్న భయపెట్టే కథలు తమ దగ్గరకి వస్తే చేసేందుకు భయపడరు హీరోలు, హీరోయిన్లు. కథలోని భయాన్నే భరోసాగా చేసుకుని, ప్రస్తుతం కొందరు నటీనటులు హారర్ సినిమాలు చేస్తున్నారు. ఆ స్టార్స్ చేస్తున్న హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.రాజా డీలక్స్ థియేటర్లో రాజా సాబ్ ప్రభాస్ కటౌట్ చాలు బాక్సాఫీస్ భయపడటానికి. కానీ వెండితెరపై ప్రభాస్ భయపడితే ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ను ప్రభాస్ భయపెడితే ఎలా ఉంటుంది? అనేది ‘రాజా సాబ్’ సినిమాలో చూడొచ్చు. ‘ప్రేమకథా చిత్రమ్’తో ఆడియన్స్‌ని నవ్విస్తూనే భయపెట్టి, బాక్సాఫీస్ కాసులను కురిపించిన దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పుడు సినిమాలోనూ... నాగచైతన్య కెరీర్లో ఇప్పటివరకూ హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు లేవు. అయితే హారర్ టచ్ ఉన్న ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్‌కు వీక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ హారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్‌వర్మ దండు ఆడియన్స్‌ను బాగా భయపెట్టి, బాక్సాఫీస్ వద్ద డబ్బులు రాబట్టుకున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించనున్న కొత్త సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ‘విరూపాక్ష’ను మించిన హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, కథకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కుతున్న నాగచైతన్యను ఓ పక్షి కన్నులో నుంచి చూపించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌కు ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. కొరియన్ కనకరాజు లవ్‌స్టోరీ, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు చేశారు వరుణ్ తేజ్. అయితే ఈసారి కొత్తగా ప్రయత్నించాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓ హారర్ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్. ‘రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్‌గా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మార్చిలో చిత్రీకరణ అంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఊహించవచ్చు. చీకటి–వెలుగుల మధ్యలో...! చీకటి వెలుగుల మధ్య దాగి ఉన్న ఓ మిస్టరీని చేధించే పనిలో పడ్డారట బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా కౌశిక్ పెగుళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. సాయి శ్రీనివాస్ కెరీర్‌లోని ఈ 11వ చిత్రంలో ‘కిష్కింధపురి’ అనే కల్పిత ప్రాంతం ఉంటుందని, అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఓ హారర్ కథను కౌశిక్ రెడీ చేసుకున్నారనీ భోగట్టా. ఈ సినిమాకు ‘కిష్కింధపురి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు. రహస్యాలను కనిపెట్టే యువతిగా∙ఈ ఏడాది ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) వంటి హారర్ సినిమాతో ఆడియన్స్‌ను ఆలరించారు తమన్నా. ఈ సినిమాలో ఓ పాజిటివ్ ఆత్మగానే కనిపించారు. అలాగే ఈ ఏడాదే విడుదలైన హిందీ బ్లాక్‌బస్టర్ హారర్ ఫిల్మ్ ‘స్త్రీ 2’లోనూ మెరిశారు తమన్నా. కానీ ఆమె పాత్రకు హారర్ టచ్ లేదు. ఓ స్పెషల్ సాంగ్‌తోనే సరిపోయింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ అనే మైథలాజికల్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగసాధువు శివశక్తి పాత్రలో కనిపిస్తారు తమన్నా. హెబ్బా పటేల్, వశిష్ఠ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి. మధు ఈ నిర్మిస్తున్నారు. మరోవైపు గాంధారి కోటలోని రహస్యాలను కనిపెట్టే యువతి పాత్రలో నటించారు హన్సిక. ‘శ్రీ గాంధారీ’ సినిమా కోసం హన్సిక ఈ పాత్ర చేశారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా సత్యం రాజేశ్ ‘పొలిమేర 3’, తిరువీర్ ‘మసూద 2’, వంటి హారర్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరికొందరు యువ దర్శకులు కూడా హారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. - ముసిమి శివాంజనేయులు -
బెల్లంకొండ 'భైరవం'.. శివరాత్రికి 'తమ్ముడు'
*'ఛత్రపతి' రీమేక్ ఫలితం దెబ్బకు సైలెంట్ అయిపోయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'భైరవం' టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన 'గరుడన్' చిత్రానికి ఇది రీమేక్ అని తెలుస్తోంది. మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడు. వచ్చే నెలలో అంటే డిసెంబరు 3వ వారంలో రిలీజ్ ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)*ప్రస్తుతం 'రాబిన్ హుడ్' చేస్తున్న నితిన్.. డిసెంబరు 20న ఈ సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. మరోవైపు 'వకీల్ సాబ్' తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' చేస్తున్నాడు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ కథతో తీస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.*అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటి' అనే సినిమా చేస్తోంది. క్రిష్ దర్శకుడు. చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా.. ఈనెల 7న అంటే గురువారం చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుందని ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
అంధులకు సాయం చేసిన తెలుగు హీరో.. మనసు బంగారం (ఫోటోలు)
-
BSS12: నాలుగువందల ఏళ్ల నాటి గుడి కథతో వస్తున్న బెల్లంకొండ హీరో!
ఓ పురాతన గుడి ముందు తుపాకీ పట్టుకుని నిల్చున్నారు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆ గుడి నాలుగువందల ఏళ్ల క్రితం నాటిది. ఆ గుడికి హీరో ఎందుకు వెళ్లాలనుకుంటాడు? అనేది తెలుసుకోవడానికి కాస్త సమయం ఉంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ 75వ జయంతి, హీరో శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి నటుడిగా వచ్చి పదేళ్లు పూర్తి కావడం... ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని ఈ సినిమాను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. జూలై 24న రెండో షెడ్యూల్‌ను మొదలు పెట్టనున్నాం. కమర్షియల్ అంశాలతో కూడిన శక్తివంతమైన, ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు లుధీర్’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్. -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసేందుకు అడుగులు వేస్తున్నారు. చివరిగా బాలీవుడ్లో ఛత్రపతి సినిమాలో నటించిన ఆయన కొన్ని రోజుల క్రితం టైసన్ నాయుడు చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, తాజాగా #BSS11 పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఆయన పట్టాలెక్కించారు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ సినిమాలో జోడిగా కనిపించనున్నారు. గతంలో వారిద్దరూ 'రాక్షసుడు' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నారు. 'చావు కబురు చల్లగా' అనే సినిమాను ఆయన డైరెక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8 పేరుతో సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో #BSS11 ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించేలా ఉంది. హారర్-మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో!
తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ సిక్స్ ప్యాక్ హీరో..ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.వీటి కోసం..మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తాయి అని అంటున్నారు. యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్ బ్యాక్ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. -
తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సొంతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్ పేరుతో రిలీజ్ చేశారు. సౌత్ డబ్బింగ్ మూవీస్‌లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #JayaJanakiNayaka 800M+ Views 💥👌@BSaiSreenivas @Rakulpreet #BellamkondaSrinivas #RakulPreetSingh #PenMovies pic.twitter.com/eC5M6cml89 — South Hindi Dubbed Movies (@SHDMOVIES) February 20, 2024 -
టైసన్ నాయుడి యాక్షన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 3న) సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘టైసన్ నాయుడు’గా ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. సాయి శ్రీనివాస్‌ను బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ అభిమానిగా ఈ చిత్రం వీడియో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యునిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘టైసన్ నాయుడు’. సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపిస్తున్నారు సాగర్ కె. చంద్ర. హై బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా. -
యాక్షన్ ఎంటర్టైనర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బీఎస్ఎస్ 10’(వర్కింగ్ టైటిల్). ‘భీమ్లా నాయక్’ మూవీ తర్వాత సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ పూర్తయింది. ‘‘యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘బీఎస్ఎస్ 10’. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ని గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు సాగర్ కె.చంద్ర. ఈ సినిమాలోని కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 3న శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్. -
ఓటీటీలోకి బెల్లంకొండ హిందీ మూవీ.. ఆరునెలల తర్వాత ఇప్పుడు
రీసెంట్ టైమ్స్‌లో థియేటర్లలో రిలీజైన ఎలాంటి సినిమా అయినా సరే నెల, నెలన్నరలోపే ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తోంది. అలాంటిది ఓ సినిమాని దాదాపు ఐదారు నెలల రిలీజ్ చేయకుండా అలా ఉంచేశారు. ఇప్పుడేమో చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? అసలు దీనికి కారణమేంటి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్‌కి తగ్గట్లు మన హీరోలు.. బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. 'ఛత్రపతి' రీమేక్‌తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులోనే ఒక్కటి తప్ప మరో హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది హిందీలో, అదీ కూడా ఓ రీమేక్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ అయితే మరీ దారుణం. ఈ ఏడాది మే 12న రిలీజైన ఈ సినిమాని థియేటర్లలో జనాలు చూడలేకపోయారు. దీనికి తోడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ మూవీ గురించి మర్చిపోయారు. ఓటీటీలో కూడా రిలీజ్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ ట్రోలర్స్ బెల్లంకొండ మూవీపై విరుచుకుపడుతున్నారు. థియేటర్లలో చూడటానికి చాలా కష్టపడ్డారు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి? (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ) -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టి, డైరెక్టర్ పరశురామ్‌తో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. శ్రీనివాస్ కెరీర్లో పదో చిత్రంగా రూపొందుతోంది. ఈ నెల రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: జిమ్షి ఖలీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
రాజమౌళి, ప్రభాస్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయిన హిందీ ఛత్రపతి లెక్కలు
-
ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు: వీవీ వినాయక్
‘నేటి యువతలో చాలామంది తెలుగు ‘ఛత్రపతి’ (2005) సినిమాను చూసి ఉండరు. వారికి హిందీ రీమేక్ ‘ఛత్రపతి’ (2023) ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక అప్పట్లో ‘ఛత్రపతి’ని చూసినవారు తెలుగు ‘ఛత్రపతి’ సినిమాను పాడు చేయకుండా బాగా తీశారని అనుకుంటారు. లొకేషన్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తగా ఉంటాయి. ఓ ప్రాపర్ హిందీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ) ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో జయంతి లాల్ గడ నిర్మించిన ఈ సినిమా మే 12న హిందీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో సాయి హీరోగా నటించిన సినిమాలు హిందీలో అనువాదమై, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం తను ఫిజిక్ బాగా మెయిన్టైన్ చేశాడు. హిందీ నేర్చుకున్నాడు. ఇంట్రవెల్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. (చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! ) ఈ చిత్రంతో సాయి బాలీవుడ్లో హీరోగా నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. రీమేక్ అంటే కొన్ని ఐకానిక్ షాట్స్‌ను టచ్ చేయకపోవడమే మంచిది. మేమూ అదే చేశాం. ఇక యాక్టింగ్ పరంగా ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు. అయితే ‘ఛత్రపతి’ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు సాయి న్యాయం చేశాడని మాత్రం చెప్పగలను. హిందీ ‘ఛత్రపతి’ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో వీవీ వినాయక్‌గారు ఒకరు. తెలుగులో ‘అల్లుడు శీను’తో మా అబ్బాయి (బెల్లంకొండ సాయి)ని ఇంట్రడ్యూస్ చేసిన వినాయక్‌గారు హిందీలోనూ పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయవచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాను హిందీ భాషలోనే ఆడియన్స్‌కు చూపిద్దామన్నారు వినాయక్‌గారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో పెన్ స్టూడియోస్ లాంటి నిర్మాణసంస్థ మా అబ్బాయితో సినిమా నిర్మించడం నాకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. -
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.. ఏడాదిన్నరపాటు ఇంట్లోనే ఉన్నా: హీరో
అల్లుడు శీను సినిమాతో హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ దాదాపు రెండేళ్ల తర్వాతే మళ్లీ వెండితెరపై కనిపించాడు. తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాలో చివరగా నటించిన బెల్లంకొండ ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన ఛత్రపతి హిందీ రీమేక్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో. 'నా తండ్రి నిర్మాత కావడం వల్లే నేను సినిమాల్లోకి చాలా సులభంగా రాగలిగానని అందరూ అనుకుంటారు. అది నిజమే, కానీ నేను హార్డ్ వర్క్ చేయడం వల్లే ఇక్కడ ఉన్నాను. నా తొలి సినిమా అల్లుడు శీను బ్లాక్‌బస్టర్ హిట్. ఆ సినిమాకు నాన్న నిర్మాత. ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. మరి నా తొలి సినిమాలో నటించేందుకు సమంత, తమన్నా ఎందుకు ఒప్పుకున్నారు? నేను వారికి 5 నిమిషాల డ్యాన్స్, 5 నిమిషాల యాక్టింగ్, 5 నిమిషాల యాక్షన్ వీడియోలన్నింటినీ కలిసి ఒక డెమో వీడియో క్రియేట్ చేసి వారికి పంపించాను. అది చూసిన తర్వాతే వాళ్లు సినిమా ఓకే చేశారు. ఆ సినిమా సక్సెస్ అయింది. కానీ అప్పటికే మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాన్న డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన 8 సినిమాలన్నీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ సమయంలో నాపై ఒత్తిడి పెరిగింది. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి, కానీ తిరస్కరించాను. అలా ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చుండిపోయాను. ఆ తర్వాత తక్కువ బడ్జెట్లో రెండో సినిమా చేశాను. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన జయ జానకీ నాయక చిత్రంతో అన్ని విధాలుగా నిలదొక్కుకున్నాను' అని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. చదవండి: ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది -
రష్మిక మందన్న డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు శ్రీనివాస్
-
రష్మికతో డేటింగ్.. స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్
ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ తరచూ ముంబై వెళ్లి వస్తున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో కొన్నిసార్లు ముంబై ఎయిర్‌పోర్టులో రష్మికతో కలిసి కనిపించాడు. దీంట్లో అనుమానించడానికేం ఉంది, వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అని సౌత్ మీడియా లైట్ తీసుకుంది. కానీ బాలీవుడ్ మాత్రం వాళ్లిద్దరి మధ్య ఇంకేదో ఉందని, బహుశా డేటింగ్ చేస్తున్నారేమోనని కథనాలు రాసేసింది. అంతేకాదు, బెల్లంకొండ కోసం విజయ్ దేవరకొండకు బ్రేకప్ చెప్పిందని వార్త అల్లేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రూమర్లపై స్పందించాడు. 'మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది.. అలాంటిది మీరు ఏకంగా డేటింగ్ అనేస్తున్నారేంటి? మేము ప్రేమలో ఉన్నామనేది పచ్చి అబద్ధం. మేము మంచి స్నేహితులం మాత్రమే! కాకపోతే మా వృత్తిరీత్యా మేము తరచూ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సి వస్తోంది. అయినా కూడా కలిసి ఎప్పుడూ ప్రయాణించలేదు. కానీ అనుకోకుండా చాలా సార్లు ఎయిర్‌పోర్టులో ఒకరికొకరం తారసపడ్డాం. ఈ క్రమంలో బహుశా ఒకటీ, రెండుసార్లు మీడియాకు కనిపించామనుకుంటా! అంతే' అని చెప్పుకొచ్చాడు. దీంతో బెల్లంకొండ- రష్మిక డేటింగ్ అంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలకు చెక్ పడినట్లైంది. చదవండి: బాక్సాఫీస్‌ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలు -
ఈ నెలలోనే ఛత్రపతి
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఛత్రపతి’. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. నుష్రత్ బరుచ్చా హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ (2005)ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో పెన్ స్టూడియోస్‌పై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘‘తెలుగు ‘ఛత్రపతి’ సినిమా బ్యాక్‌డ్రాప్‌ని మార్చి, యాక్షన్ ఎంటర్టైనర్గా హిందీ ‘ఛత్రపతి’ని తెరకెక్కించారు వినాయక్. శ్రీనివాస్ రగ్డ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిజార్ అలీ షఫీ, సంగీతం: తనిష్క్ బాగ్చి, వరల్డ్ వైడ్ విడుదల: పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్. -
ఊర మాస్ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ..
-
ఒకరితో బ్రేకప్!.. ఇంకొకరితో స్టార్టప్!.. ఏది నిజం..?
-
హిందీలో సినిమాలు చేస్తున్న తెలుగు స్టార్స్.. ప్రభాస్ ఒక్కడే కాదు, చరణ్, తారక్..
పాన్ ఇండియా ఫార్ములా భాషాపరమైన హద్దులను చెరిపేసింది. ఒక భాషలో రూపొందించిన చిత్రాలను ఇతర భాషల్లో అనువదించి, విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలకు కూడా హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ ‘ఆజా రాజా’ (రా రాజా) అంటూ తెలుగు హీరోలతో స్ట్రయిట్ హిందీ చిత్రాలు నిర్మించడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం తెలుగు స్టార్స్ చేస్తున్న హిందీ స్ట్రయిట్ ఫిలింస్ విశేషాలు తెలుసుకుందాం.. రవితేజ హీరోగా నటించిన పలు హిట్ సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి, అక్కడి బుల్లితెరపై అడపాదడపా ప్రదర్శితమవుతున్నాయి. ఆ విధంగా హిందీ ప్రేక్షకుల్లో రవితేజకు మంచి పాపులారిటీ ఉంది. ఇప్పుడు స్ట్రయిట్‌గా రవితేజ బాలీవుడ్‌కు వెళ్లనున్నట్లు టాలీవుడ్ టాక్. తమిళ హిట్ ఫిల్మ్ ‘మానాడు’ రీమేక్‌లో (హిందీ, తెలుగు) రవితేజ, బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ కలిసి నటించనున్నారట. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని హీరో రానా, ఏషియన్ సునీల్ నిర్మిస్తారట. ► ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాత ఆదిత్యా చోప్రా ఫస్ట్ సక్సెస్ అయ్యారు. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించనున్న స్పై మూవీ ‘వార్ 2’లో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం బీ టౌన్లో బలంగా వినిపిస్తున్న ఈ వార్తలు నిజమైతే ఎన్టీఆర్ నటించే తొలి స్ట్రయిట్ హిందీ చిత్రం ఇదే అవుతుంది. ► బాలీవుడ్లో అల్లు అర్జున్ ఎంట్రీ గురించిన టాక్ ఎప్పట్నుంచో ఉంది. అల్లు అర్జున్‌తో ఓ హిందీ సినిమా చేయాలని బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ ప్రయత్నించారు... కుదర్లేదు. ఆ తర్వాత దర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సమావేశమవగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ అల్లు అర్జున్‌తో స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ చేసే అవకాశం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌కు లభించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. టీ సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ► దేశభక్తి నేపథ్యంతో కూడిన చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్‌సింగ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, సోనీ పిక్చర్స్ ఇండియా, రెనైసాన్స్ పిక్చర్స్ పతాకంపై సందీప్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ జెట్ పైలెట్‌గా చేస్తున్నారు. ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ► బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు హిందీ వ్యూయర్స్‌లో క్రేజ్ ఉంది. శ్రీనివాస్ హీరోగా నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ వెర్షన్‌కు యూట్యూబ్‌లో 700 మిలియన్ వ్యూస్ రావడమే ఇందుకు నిదర్శనం. సాయి శ్రీనివాస్ నటించిన తెలుగు చిత్రాల హిందీ అనువాదాలకు అక్కడి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. దీంతో ‘ఛత్రపతి’గా బాలీవుడ్‌కు వెళ్తున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఛత్రపతి’ సినిమాకి రీమేక్ ఇది. అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ అయిన ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. జయంతి లాల్ గడ నిర్మించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. మరికొందరు తెలుగు స్టార్స్ కూడా హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్స్ చేసే చాన్స్ ఉంది. ‘బాహుబలి’ సక్సెస్‌తో లేటెస్ట్ జనరేషన్లో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న తొలి హీరోగా ప్రభాస్‌ను చెప్పుకోవచ్చు. ఆ చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాల బడ్జెట్స్ పెరిగాయి. బాలీవుడ్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. రామాయణంగా ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. అలాగే ప్రభాస్ హీరోగా కమిటైన మరో చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ భూషణ్‌కుమార్, భద్రకాళి పిక్చర్స్ సందీప్‌రెడ్డి వంగా, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. 2024 చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని టాక్. దాదాపు పదేళ్ల క్రితమే హిందీలో ‘జంజీర్’ (తెలుగులో ‘తుఫాన్’)తో ఎంట్రీ ఇచ్చారు రామ్‌చరణ్. ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితం అయ్యారు చరణ్. అయితే గత ఏడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’లో ఓ హీరోగా నటించిన రామ్‌చరణ్‌కు బాలీవుడ్లో సూపర్ క్రేజ్ దక్కింది. హిందీలో స్ట్రయిట్ చిత్రాలు చేసే దిశగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పదేళ్ల తర్వాత ఓ గెస్ట్ రోల్లో హిందీ తెరపై కనిపించనున్నారు చరణ్. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ నటించిన ‘కిసీ కా భాయ్ కీసీ కా జాన్’ చిత్రంలో రామ్‌చరణ్ గెస్ట్ రోల్ చేశారు. ఈద్ సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరోవైపు స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ చేసేందుకు కూడా చరణ్ కొన్ని కథలు విన్నారు. -
విజయ్ దేవరకొండకు బ్రేకప్ చెప్పిన రష్మిక మందన్నా?
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడం.. అదంతా తూచ్ అని ఇద్దరూ కొట్టిపారేయడం.. చివరికి జంటగా కనిపించడం సదా మామూలే! మేమిద్దరం మంచి ఫ్రెంట్స్ అంటారు వాళ్లు.. కాదు కాదు, మీరు కచ్చితంగా ప్రేమికులే అంటారు అభిమానులు. రీల్ లైఫ్‌లోని గీతాగోవిందం రియల్ లైఫ్‌లో కూడా ఒక్కటైతే చూడాలని ఉందని తహతహలాడుతుంటారు. కానీ వాళ్లు మాత్రం ఎప్పుడూ ఓపెన్ అయింది లేదు. అయితే తాజాగా రష్మిక.. విజయ్‌కు బ్రేక్ చెప్పిందని ఇప్పుడు మరో హీరోకు దగ్గరైందంటూ బీటౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఆ మరో హీరో ఎవరో కాదు, మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాసే! వీరిద్దరూ రెండుమూడు సార్లు కలిసి కనిపించడం పాపం.. ప్రేమ మొదలైందంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏకంగా విజయ్‌కే బ్రేకప్ చెప్పిందని వార్తలు ప్రచారం చేస్తున్నారు. రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మధ్య తరచూ కలుస్తున్న విషయం వాస్తవమే కానీ వారిది కేవలం స్నేహం మాత్రమే! అంతకు మించి అంటే ఒప్పుకునేది లేదంటున్నారు అభిమానులు. అయినా సరే కొందరు నెటిజన్లు మాత్రం వీరి వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రష్మిక చివరిసారిగా వారిసు చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో యానిమల్ మూవీ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే అతడు ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. -
రేర్ రికార్డ్ నెలకొల్పిన జయ జానకి నాయక
-
ప్రభాస్ సినిమా రీమేక్ కష్టాలు బెల్లంకొండపై తీవ్రంగా ట్రోల్
-
ముంబై ఎయిర్ పోర్ట్‌లో రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ సందడి
-
ప్రపంచ రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ మూవీ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన చిత్రం జయ జానకి నాయక. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 709 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 702 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
బాలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ.. ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తున్నాడు. వి.వి వినాయక్ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కండలు తిరిగిన దేహంతో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ సక్సెస్ అందుకుంటారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. The wait is over #Chatrapathi in cinemas on 12th May, 2023. Cannot wait to show you all our hardwork & this action-packed dhamaka.🔥 Written by the one and only #VijayendraPrasad, directed by #VVVinayak.@Penmovies #Bss9 pic.twitter.com/VSLYTWQkrT — Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 27, 2023 -
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
తిరుమల : తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్ట్‌ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. గదులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్‌లైన్‌లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీన గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్‌ల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 71,158 మంది స్వామిని దర్శించుకోగా.. 27,968 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.3.73 కోట్లు సమర్పించుకున్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మరోవైపు సోమవారం శ్రీవారిని సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్, సినీనటి మాళవిక నాయర్, హాస్య నటుడు బ్రహ్మానందం, నేషనల్ చెస్ చాంపియన్ గూకేష్ దర్శించుకున్నారు. (క్లిక్: అహ్మదాబాద్‌లో శ్రీవారి ఆలయానికి భూమి) -
శరణ్ది మా ఊరే.. కావాలనే చీటింగ్ కేసు : బెల్లంకొండ సురేశ్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్, అతని తనయుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చీటింగ్ కేసుపై బెల్లంకొండ సురేశ్ స్పందించారు. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగంగా చీటింగ కేసు నమోదైందని ఆయన ఆరోపించారు. శరణ్ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ‘కొంతమంది కావాలనే నాపై, నా కొడుకుపై కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరణ్ నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శరణ్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు . నాకు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా .బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటా. నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు. నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు.నా పై చేసిన ఆరోపణల పై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్ కు నోటీసులు ఇచ్చారు. శరణ్ది మా ఊరే. పదేళ్ల క్రితం పరిచయమయ్యాడు. సినిమా టికెట్ల కోసం అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇలా నాపై ఆరోపణలు చేస్తున్నాడు. అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు. అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’అని బెల్లంకొండ అన్నారు. -
కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ హీరో
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు (సోమవారం) తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. ఉదయం విఐపి దర్శనంలో కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ నేడు తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొన్నానని అన్నారు. ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారిన సినిమా టికెట్లు ధరలపై స్పందించడానికి నిరాకరించారు. -
గజదొంగ బయోపిక్‌లో బెల్లంకొండ.. టైటిల్ ఇదే
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో..తొలి మూవీతోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్‌కు సరైన హిట్ లభించలేదు. దీంతో ఈ యంగ్ మీరో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన `ఛత్రపతి` బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరో మరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అనే పేరుని ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ `టైగర్ నాగేశ్వర రావు` బయోపిక్ ఇది. నాగేశ్వరరావు తన జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా తప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వరరావు తప్పించుకున్న తీరుతో ఆయనకు `టైగర్` అనే పేరు వచ్చింది. పోలీసులను ముప్ప తిప్పలు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఈ విషయాలతో `స్టూవర్టుపురం దొంగ` సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ఎ.ఎస్. దర్శకత్వం వహించగా, ప్రెస్టీజియస్ బ్యానర్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ కోసం ప్రముఖ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. -
బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన రెజీనా!..హీరో ఎవరంటే
రెజీనీ కసాండ్రా.. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ చెన్నై చిన్నది ఈ మధ్యకాలంలో రేసులో వెనకబడింది. వరుస ఫ్లాపులతో టాలీవుడ్లో సినిమాలు తగ్టించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్లో బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో రెజీనాను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను ప్రస్తుతం హిందీలో వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగింది. ఇప్పటికే ఛత్రపతి రీమేక్ కోసం పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించినా వారు సున్నితంగా ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఆ మధ్య అనన్య పాండే హీరోయిన్గా ఫైనలైజ్ అయ్యిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇటీవలె హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. -
బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్.. లాంఛ్ చేసిన రాజమౌళి
అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ నటించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. 2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఛత్రపతి హిట్‌తో మాస్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హిందీ కోచింగ్‌కి వెళ్తున్న బెల్లంకొండ.. ఎందుకో తెలుసా?
Chatrapathi: యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ రీమేక్‌ని నిర్మిస్తున్నారు. 2005లో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సేమ్ రిజల్ట్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్ చేయాలని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సినిమా షూటింగ్ జూలై రెండో వారంలో ప్రారంభంకానుంది. అయితే లాక్డౌన్ సమయాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్లో పాల్గొనేందుకు మరింత బాగా సంసిద్దుడైయ్యాడు. సినిమాలో తన లుక్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలని డిసైడైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇందుకోసం ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్దతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మజిల్స్ విషయం స్పెషల్ కేర్ తీసుకున్నాడు. అంతే కాదు...‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో తన వాయిస్‌కు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉచ్ఛారణ పరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి ఫేమస్ హిందీ కోచ్ ఇంతియాజ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారట. బెల్లకొండ సాయి శ్రీనివాస్ కష్టానికి ఏ మేర ఫలితం లభిస్తుందో చూడాలి. -
అభిమానికి బెల్లంకొండ ఫ్యామిలీ సర్ప్రైజ్
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. తన నూతన ఇంటి గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించి సదరు అభిమాని ఫంక్షన్‌కు వెళ్లి అతడికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించాడు బెల్లంకొండ. అసలు విషయం ఎంటంటే.. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి బెల్లంకొండ శ్రీనివాస్‌కు వీరాభిమాని. అయితే ఇటీవల అతడు నూతన ఇంటిని నిర్మించుకున్నాడు. దీంతో గృహప్రవేశ వేడుకకు రావాల్సిందిగా శ్రీనివాస్‌కు ఆహ్వానం అందించాడు. దీంతో అభిమాని కోరిక మేరకు శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే తాను వెళ్లడమే కాకుండా తనతో పాటు తండ్రి బెల్లంకోండ సురేశ్, తల్లి పద్మ, సోదరుడు గణేశ్‌ను కూడా తీసుకుని హైదరాబాద్ నుంచి కర్నూలుకు పయనమయ్యాడు. కరోనా కారణంగా కాలు బయటక పెట్టలేని పరిస్థితిలో కూడా అభిమాని ఫంక్షన్‌కు కుటుంబ సమేతంగా హాజరవ్వడం అనేది సాధారణ విషయం కాదు. ఇలా ఆ అభిమాని కోరికను మన్నించి కుటుంబ సమేంతంగా ఆ ఫంక్షన్‌కు హాజరై అతడికి, అతడి కుటుంబానికి బెల్లంకొండ ఫ్యామిలీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించింది. అది చూసి నెటిజన్లు, అభిమానులు బెల్లకొండ శ్రీనివాస్, అతడి ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
‘ఛత్రపతి’ కోసం రూ.3 కోట్లతో ఆరు ఎకరాల్లో భారీ సెట్!
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో డా. జయంతి లాల్ గడ ఈ రీమేక్‌ని నిర్మించనున్నారు. తెలుగు ‘ఛత్రపతి’కి కథ అందించిన విజయేంద్రప్రసాద్ హిందీకి తగ్గట్టు కొన్ని మార్పులతో కథను తయారు చేస్తున్నారట. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్‌బాబు ఓ విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 22న షూటింగ్ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈలోపు అకాల వర్షాల వల్ల ఈ సెట్ బాగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ సెట్‌ని మళ్లీ సెట్ చేసి, కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. -
బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి మూవీ మేకర్స్‌కు భారీ నష్టం
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ రీమేక్ చిత్రం ‘ఛత్రపతి’ మేకర్స్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు రీమేక్ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి కోసం మేకర్స్ హైదరాబాద్‌లో 6 ఎకరాల స్థలంలో ఓ భారీ విలేజ్ సేట్ వేశారట. ఇప్పటికే కోవిడ్‌తో నష్టపోయిన నిర్మాతలకు ప్రస్తుతం కురుస్తున్న వరుస వర్షాల కారణంగా దాదాపు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అప్పడు షూటింగ్ కోసం వేసిన ఈ భారీ విలేజ్ సేట్ ఈ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినట్లు సమాచారం. ఇంకా సినిమా షూటింగ్ మొదలు కాకముందే మేకర్స్‌కు 3 కోట్ల నష్టం రావడం నిజంగా బాధించే విషయమే. ఇక ఈ సెట్ సినిమాకు చాలా కీలకం కానుండటంతో మరో ఆలోచన లేకుండా నిర్మాతలు దీనిని పున:నిర్మించే ఆలోచనలో పడ్డారట. ఈ వర్షాలు తగ్గిన వెంటనే తిరిగి సెట్‌ను నిర్మించే పనులు చేపట్టాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా అల్లుడు శీను సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో రీమేక్ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సరసన అనన్య పాండే నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్ -
బెల్లంకొండ రిక్వెస్ట్: అనన్య ఓకే చేస్తుందా?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట కానసాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే కొందరు స్టార్ హీరోయిన్లను కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే తాజాగా బెల్లంకొండకు జోడీగా హీరోయిన్ అనన్య పాండేను సంప్రదించారట చిత్ర బృందం. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారట. మరి ఈ ఆఫర్‌కు అనన్య గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనన్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తుంది. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లుడు శీను సినిమాతో వీవీ వినాయక్ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కనుండటం విశేషం. చదవండి : (ఆ నటుడితో బిగ్‌బీ మనవరాలు ప్రేమాయణం.. స్పందించిన తండ్రి) (కంగనాపై ఆర్జీవీ ట్వీట్, ఆ వెంటనే డిలీట్!) -
ఈ అల్లుడు బెదుర్స్!
చిత్రం: ‘అల్లుడు అదుర్స్’; తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్, ప్రకాశ్ రాజ్, సోనూసూద్, అనూ ఇమ్మాన్యుయేల్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కెమేరా: ఛోటా కె. నాయుడు; ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, స్టన్ శివ; ఎడిటింగ్: తమ్మిరాజు; నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం; దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్; రిలీజ్: జనవరి 14 అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్ ఎలిమెంట్. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? విలన్ మామ గారిని ఒప్పించి, హీరోయిన్‌తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది. కథేమిటంటే..: ఫ్యాక్షనిస్ట్ తరహా లీడర్ – నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాశ్ రాజ్). అతనికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి వసుంధర (అనూ ఇమ్మాన్యుయేల్). చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయంటే శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)కు ఇష్టం. కానీ, ఆమె రియల్ ఎస్టేట్ గజ (సోనూసూద్)ను ప్రేమిస్తుంది. ఇది ఇలా ఉండగా, తెలియకుండానే వసుంధర చెల్లెలు కౌముది (నభా నటేశ్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడతాడు హీరో. ఆ పెళ్ళి వద్దనే ఆడపిల్ల తండ్రిని మన హీరో ఎలా మెప్పించి, ఒప్పించాడన్నది కథ. సోనూసూద్‌కూ, ప్రకాశ్ రాజ్‌కూ మధ్య సినిమా కథలో సంబంధం ఏమిటి? సోనూసూద్ విఫల ప్రేమకథ ఎలా చివరకు సక్సెసైంది అన్నది ఓపిగ్గా చూడాల్సిన మెయిన్ కథలోని కీలక ఉపకథ. ఎలా చేశారంటే..: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటిలానే డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ ఉన్నందు వల్లనో ఏమో – ఒకటి రెండు హిందీ డైలాగులూ చెప్పారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ‘‘శీనుగాడు నా ఫ్రెండు. యాక్షన్ సీన్లలో వీడిది సెపరేట్ ట్రెండు’’ (హీరో గురించి వెన్నెల కిశోర్) లాంటి మాస్ డైలాగులూ పెట్టారు. ఫైట్స్‌తో పాటు కామెడీ పండించేందుకు హీరో తెగ ప్రయత్నించారు. నభా నటేశ్ ఓకే అనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ది నిడివి పరంగా చిన్న పాత్రే. ప్రకాశ్ రాజ్, సోనూసూద్ తదితరులు – ఈ పాత్రల్లో ప్రత్యేకించి చేయడానికీ, నిరూపించుకోవడానికీ ఇవాళ కొత్తగా ఏమీ లేదు. హీరో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ, హీరో ఇంట పనిమనిషి రత్తాలుగా హరితేజ లాంటి వాళ్ళూ ఉన్నారు. ఎలా తీశారంటే..: సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం వైపు వచ్చిన సంతోష్ శ్రీనివాస్‌కు దర్శకుడిగా ఇది నాలుగో సినిమా. తొలి చిత్రం ‘కందిరీగ’ విజయంతోనే ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఆయన... ఆ సక్సెస్ ఫార్ములాను ఇవాళ్టికీ వదులుకోలేకపోవడం అర్థం చేసుకోదగినదే. అందుకే, ఆ ఫార్ములానే వీలైనంత తిరగేసి, మరగేసి, బోర్లేసి... ‘అల్లుడు అదుర్స్’గా మరోసారి వండి వడ్డించారు. దానికి లారెన్స్ ‘కాంచన’ సినిమాతో పాపులరైన హార్రర్ కామెడీని కలిపారు. కానీ, ఎంత సక్సెస్ఫుల్ సూత్రమైనా, పదే పదే వాడితే చీకాకే. అది ఈ సినిమాకున్న పెద్ద ఇబ్బంది. దానికి తోడు ప్రేమకథను సాఫీగా కాకుండా, పలు పాత్రలు, సంఘటనల మధ్య అటూ ఇటూ తిప్పి, తిప్పి చెప్పే కథనం సహనానికి పరీక్ష పెడుతుంది. సెకండాఫ్‌లో వచ్చే హార్రర్ కామెడీ, ప్రకాశ్ రాజ్ – సత్యల ఊహా ప్రపంచం సీన్లు మాత్రం హాలులో అడపాదడపా బాగానే నవ్వులు పూయిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమాలో ఛోటా కె. నాయుడు కెమెరా వర్క్, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ప్రత్యేకించి స్పష్టంగా తెలుస్తాయి. సినిమాకు కొంత బలంగా నిలుస్తాయి. తెర నిండా సుపరిచితులైన నటీనటులు కనిపిస్తారు. వినోదం కోసం సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, చమ్మక్ చంద్ర – ఇలా చాలామందే వస్తూ పోతూ ఉంటారు. ఇటీవల కరోనా కాలంలో మరణించిన నటులు జయప్రకాశ్ రెడ్డి, కమెడియన్ వేణుగోపాల్ కోసూరి లాంటి వాళ్ళూ తెరపై తమ చివరి సినిమాల్లో ఒకటిగా ఇందులో ఎదురవుతారు. ‘బిగ్ బాస్4’ ఫేమ్ మోనాల్ గజ్జర్ చేసిన ఐటమ్ సాంగ్ ‘రంభ ఊర్వశి మేనక అందరు కలిసి నేనిక...’ లాంటివి మాస్‌ను ఆకర్షిస్తాయి. కాశ్మీర్‌లోని పహల్ గావ్ ప్రాంతాల్లో ఇటీవలే ఈ జనవరి చలిలో తీసిన హీరో, హీరోయిన్ల డ్యుయట్... మంచు కురిసే దృశ్యాలు విజువల్‌గా బాగున్నాయి. ఏ విదేశాల్లోనో తీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే, అన్నీ ఉన్నా... అల్లుడి... అదేదో అన్నట్టు స్క్రిప్టులోని బలహీనతలు ఈ సినిమాకు శాపం. కామెడీ చేస్తున్నాం అనుకొని దర్శక, రచయితలు కథన విధానంలో లేనిపోని కన్ఫ్యూజన్లు పెట్టుకున్నారు. ఎంత సక్సెస్ఫుల్ ఫార్ములా వాడుకున్నా, దాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి ప్రయత్నించకపోవడంలో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇది ‘కందిరీగ’కు మరో రీమేక్ అనే కామెంట్‌నూ భరించాల్సి వస్తుంది. వెరసి, రెండున్నర గంటల సాగదీతను భరించాలంటే... జనం బెదుర్స్ అనాలనిపిస్తుంది. కొసమెరుపు: ‘కందిరీగ’ ఫార్ములా + ‘కాంచన’ హార్రర్ కామెడీ = ‘అల్లుడు అదుర్స్’ బలాలు: ∙హీరో చేసిన డ్యాన్సులు, ఫైట్లు ∙తెర నిండా నటీనటులు, నిర్మాణ విలువలు ∙నేపథ్య సంగీతం, కెమెరా వర్కు బలహీనతలు: ∙చాలా ప్రిడిక్టబుల్ ఫార్ములా ∙పాత సినిమాలే చూస్తున్న ఫీలింగిచ్చే స్క్రిప్టు ∙సహనాన్ని పరీక్షించే సా....గ దీత కథనం ∙దర్శకత్వ లోపం ∙కన్ఫ్యూజింగ్... కామెడీ -రివ్యూ: రెంటాల జయదేవ -
అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ
టైటిల్ : అల్లుడు అదుర్స్ జానర్ : రొమాంటిక్ కామెడీ నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ నిర్మాణ సంస్థ : సుమంత్ మూవీస్ నిర్మాత : గొర్రెల సుబ్రహ్మణ్యం దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : చోటా కె. నాయుడు ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : జనవరి 14, 2021 వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'రాక్షసుడు' సినిమాతో కెరీర్లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్‌తో అతడు ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అల్లుడిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ శ్రీను( బెల్లం కొండ శ్రీనివాస్ ) చిన్నప్పుడే వసుందర ( అను ఇమాన్యుల్ )ను ప్రేమిస్తాడు. కాని ఆమె మాత్రం ఇతన్ని ఇష్టపడదు. తన తొలి ప్రేమ విఫలం అవడంతో శ్రీను ఇక అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ పెద్దవాడైన తర్వాత కౌముది ( నభనటేష్ )తో మరోసారి ప్రేమలో పడతాడు.ఇదే సమయంలో శ్రీను జీవితంలోకి గజా( సోనూసూద్ ) అడుగు పెడతాడు. మరోవైపు తన ప్రేమను దక్కించుకునే క్రమంలో కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావాల్సి వస్తుంది.అసలు శ్రీను చేసుకున్న ఒప్పందమేంటి? ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగత కథ. నటీనటులు గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. రియల్ హీరో సోనూ సూద్ తన నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రకాష్ రాజు ఎప్పటిలాగే తండ్రి పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రను చేజిక్కించుకుంది. కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమ్మక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలపరిధి మేరకు నటించారు. విశ్లేషణ 'కందిరీగ' లో కన్ఫ్యూజింగ్ కామెడీ చూపించి హిట్ కొట్టిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఈ సినిమాకు కూడా అలాంటి కామెడినే నమ్ముకున్నాడు. కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించాడు. కందిరీగ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు.సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అలాగే నవ్మశక్యం కాని సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులు తలలు పట్టుకునేలా చేశాడు. అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. ఎడిటింగ్ బాగున్నా, ఎడిటింగ్ బాగున్నా, సెకండాఫ్‌లోని సాగతీత సీన్లను తొలగిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. -
బాగా ఆకలి మీద ఉన్నాను: యంగ్ హీరో
‘‘తెలుగువాళ్లకు సినిమానే పండగ. సంక్రాంతికి తప్పకుండా సినిమాలు చూసి, పండగ జరుపుకుంటారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ బాగా ఆడాలి.. ఇండస్ట్రీ బాగుండాలి. హిందీ తర్వాత పెద్ద బడ్జెట్ సినిమాలు, ఎక్కువ సినిమాలు, ఎక్కువ వసూళ్లు, ఎక్కువ వ్యాపారం జరిగేది టాలీవుడ్లోనే.. హ్యాట్సాఫ్ టు తెలుగు సినిమా’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. రమేష్ కుమార్ గంజి సమర్పణలో గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ∙‘రాక్షసుడు’ వంటి హిట్ సినిమా తర్వాత మూడు నెలలు విరామం తీసుకున్నాను. మంచి కథ, కొత్తదనం ఉండాలి.. నన్ను నేను నిరూపించుకునేలా ఉండాలి. ఆ సమయంలో సంతోష్ శ్రీనివాస్ అన్న చెప్పిన పాయింట్ ఎగ్జయిటింగ్‌గా అనిపించి వెంటనే ఓకే చెప్పేశా. సెకండాఫ్ బాగా నచ్చింది. నా సినిమా ఫ్లాప్ అయితే వెంటనే మరో సినిమా చేస్తా.. హిట్ అయితే కొంచెం వెయిట్ చేసి, మళ్లీ మంచి కథతో మరో హిట్ సినిమా చేయాలనుకుంటాను. చదవండి: ‘ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇచ్చేస్తా’ ∙‘అల్లుడు అదుర్స్’ కామెడీ థ్రిల్లర్.. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. 2018 నుంచి నేను కమర్షియల్ సినిమా చేయలేదు.. బాగా ఆకలి మీద ఉన్నాను. ఆ లోటుని ‘అల్లుడు అదుర్స్’ తీర్చింది. ఈ సినిమా కోసం కశ్మీర్లో మూడు రోజులు విపరీతమైన మంచులో ఓ పాట చిత్రీకరించాం.. చాలా కష్టంగా అనిపించింది. అక్కడ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఆర్మీ వాళ్లు నన్ను గుర్తు పట్టి మాట్లాడటం చూస్తే నా కష్టాన్ని గుర్తించారనే సంతృప్తి కలిగింది. ఈ లాక్డౌన్లో నేను బాగా మిస్ అయింది పనిని మాత్రమే. ఇంట్లో రెండు నెలల పాటు అమ్మ, తమ్ముడి చేతి వంట తింటూ బాగా ఎంజాయ్ చేశాను. ► దేవుడి ఆశీర్వాదాల వల్లే బాలీవుడ్‌కి వెళుతున్నాను. బాలీవుడ్లో రెండు మూడు సినిమాలకు అడిగారు కానీ ‘ఛత్రపతి’ రీమేక్ అనడంతో రాజమౌళిగారి సినిమా అని వెంటనే ఓకే చెప్పేశా. ఈ సినిమాని ►బాహుబలి, కేజీఎఫ్’ చిత్రాల రేంజ్లో ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం. తెలుగు ‘ఛత్రపతి’లో ప్రభాస్‌గారు చేసిన పాత్రని చాలెంజింగ్‌గా తీసుకుని నా స్థాయిలో వంద శాతం కష్టపడతా.. నాకు చాలెంజ్‌లు అంటే ఇష్టం. నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు.. హైదరాబాద్ హిందీ మాట్లాడతాను. అయితే ఈ సినిమా కోసం ముంబయ్‌లో ట్యూటర్ని పెట్టుకుని పక్కా హిందీ నేర్చుకుంటున్నాను.. అన్నీ కుదిరితే హిందీలోనూ డబ్బింగ్ చెబుతా. ‘ఛత్రపతి’ రీమేక్ మినహా ఏ కొత్త సినిమాని ప్రస్తుతానికి అంగీకరించలేదు. -
కశ్మీరులో చిక్కుకున్న బెల్లంకొండ
బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న 'అల్లుడు అదుర్స్' బృందం చివరి పాట చిత్రీకరణ కోసం కశ్మీర్ కు వెళ్లారు. షూటింగ్ ముగించుకుని వస్తున్న క్రమంలో కశ్మీరులో మంచు తుఫాను కురుస్తున్న కారణంగా హీరోతో పాటు చిత్రబృందం అక్కడే చిక్కుకుంది. విమాన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా శ్రీనగర్, కశ్మీర్ లోని ఇతర ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుంది. ప్రత్యేక విమానం ద్వారా కూడా హీరో హైదరాబాద్‌కు చేరుకోలేని పరిస్థితి ఉంది. రేపు(జనవరి 8న) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా ఇప్పుడు హీరో వస్తాడా రాడా అనే విషయంలో పెద్ద సందేహం నెలకొంది. ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.(చదవండి: రికార్డుల మోత మోగిస్తోన్న స్టైలిష్ స్టార్) -
‘ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇచ్చేస్తా’
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అల్లుడు అదుర్స్’.. నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్‌ను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం అల్లుడు అదుర్స్ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 2 నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్లో డైలాగులు, కామెడీ, థ్రిల్లర్, యాక్షన్, పాటలు, లవ్ ట్రాక్ ఇలా నవ రసాలు కలిపి చూపించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలను మరింత పెంచేలా కనిపిస్తోంది. చదవండి: అంతకు మించిన కిక్ ఏముంటుంది? ట్రైలర్ అంతా పూర్తిగా అల్లుడైన బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర చుట్టే ఉండటంతో హీరో క్యారెక్టరైజేషన్ చూపించే ప్రయత్నం చేశారు. అయితే ‘ఒక్కసారి నాది అనుకుంటే నా ప్రాణం ఇచ్చేస్తా. జాన్ దేదూంగా... పద్దతిగా ట్రై చేస్తే ఏ అమ్మాయి అయినా పడాల్సిందే కదండి. నా కూతురు ప్రేమ వాడి పాలిట చావు. శీనుగాడు నా ఫ్రెండు.. యాక్షన్ సీక్వెన్స్‌లో వాడిది సెపరేట్ ట్రెండు.. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ లేవమ్మా’.. అని చెప్పే పలు డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని అనివార్యమైన కారణాల వల్ల లవ్ అంటే నాన్సెస్ అని ఫీలయ్యే అబ్బాయి.. ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది సినిమా. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి థియేటర్లలో జనాలకు కావాల్సినంత వినోదాన్ని అందించేందుకు ‘అల్లుడు’ సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు నచ్చుతుందో వేచి చూడాలి. -
సినిమా చూసి సంతోషంగా ఇంటికి వెళతారు
‘‘కరోనా లాక్డౌన్ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో మా అందరికీ ధైర్యం వచ్చింది. సంక్రాంతి అనేది అల్లుళ్ల పండుగ. అల్లుడు ఎలాంటివాడైనా అత్తమామలకు అదుర్సే.. అందుకే ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌తో వస్తున్నాం’’ అని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, నభానటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అల్లుడు అదుర్స్’ కథ చెప్పగానే బెల్లంకొండ సురేష్‌గారు ‘రాక్షసుడు’ తర్వాత సాయితో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమా చేయాలని చూస్తున్నాను. తప్పకుండా మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. నా ‘కందిరీగ’ సినిమాలో ఉన్నట్టే ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేసి సంతోషంగా ఇంటికెళ్తారు. కరోనా తర్వాత సోనూ సూద్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన పాత్రలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. దేవిశ్రీ ప్రసాద్‌గారి సంగీతంతో మా సినిమా రేంజ్ పెరిగింది. బేసిక్‌గా నేను సినిమాటోగ్రాఫర్‌ని కాబట్టి 150 రోజుల్లో తీసే సినిమాని 110 రోజుల్లో పూర్తి చేయగలను. ఈ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలూ మంచి విజయం సాధించి ఇండస్ట్రీకి మంచి రెవెన్యూ వస్తే ఫిబ్రవరిలో మరికొన్ని మంచి సినిమాలు వస్తాయి. ‘కందిరీగ’ సీక్వెల్ ‘కందిరీగ 2’ ఐడియా రెడీగా ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
అంతకు మించిన కిక్ ఏముంటుంది?
‘‘నేనెప్పుడూ ఏదీ ప్లాన్ చేసుకుని చేయలేదు. నా దారిలో వచ్చే బెస్ట్‌ని ఎంపిక చేసుకుంటూ ముందు కెళ్తాను. నా బాలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయలేదు. మంచి ఆఫర్ వచ్చింది. అందుకున్నాను’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇవాళ తన పుట్టినరోజు. సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు పంచుకున్నారు. ► కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసు కోవడంలాంటివేమీ పెట్టుకోను. గడచిన ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా సంతోషంగా ఉండాలి. గుర్తుండిపోయేలా చేసుకోవాలని మాత్రమే అనుకుంటాను. గత బర్త్‌డేకి సెట్లోనే ఉన్నాను. ఈ బర్త్‌డేకి కూడా పని చేస్తున్నాను. నాకు సినిమా అంటే ఇష్టం. పుట్టినరోజున నచ్చిన పని చేయడాన్ని మించిన కిక్ ఏముంటుంది? ► 2020లో షూటింగ్‌ని చాలా మిస్సయ్యాను. ఈ బ్రేక్‌ని సినిమాలు చూడటానికి ఎక్కువ ఉపయోగించుకున్నాను. నా వర్క్‌ని మళ్లీ సమీక్షించుకున్నాను. ఫ్రెండ్స్‌తో చాలా సమయం గడిపే వీలు దొరికింది. వేసవి సెలవుల్లా అనిపించాయి. ► కథలో భాగంగా ‘అల్లుడు అదుర్స్’ అని టైటిల్ పెట్టాం. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ నన్ను ఓ కొత్త కోణంలో చూపించాలనుకున్నారు. నాకు కథ నచ్చింది. చేసేశాను. ఇందులో సోనూ సూద్, ప్రకాశ్‌రాజ్ లాంటి భారీ తారాగణం ఉన్నారు. సినిమా కచ్చితంగా అందర్నీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది. ► ‘అల్లుడు అదుర్స్’ నా తొలి సంక్రాంతి రిలీజ్. జనవరి నెల నాకు స్పెషల్. చాలా ఇష్టం. కొత్త ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా విడుదలవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆరు రోజులు ఉంది. 10 రోజులుగా పగలు, రాత్రి పని చేస్తున్నాం. నిర్మాత (బెల్లంకొండ సురేశ్) అబ్బాయిని నేను. నిర్మాతకు నష్టం రాకూడదనుకుంటాను. అందుకే ఈ సినిమాను త్వరగా పూర్తి చేయడానికి కష్టపడుతున్నాం. ► బాలీవుడ్ ఆఫర్ (హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్‌ను వినాయక్ డైరెక్షన్లో చేస్తున్నారు శ్రీనివాస్) ఊహించలేదు. కానీ వచ్చింది. వచ్చిన మంచి అవకాశాన్ని అస్సలు పోగొట్టుకోను. మన పని పది మంది కాదు వెయ్యి మంది చూస్తారంటే ఏ యాక్టర్‌కి అయినా ఇష్టమేగా! రాజమౌళిగారి సినిమా రీమేక్ చేస్తే ఆయనతో సినిమా చేసినట్టే. మంచి ప్రొడక్షన్. భారీ స్థాయిలో చేయాలనుకుంటున్నారు. వినాయక్‌గారితో మళ్లీ వర్క్ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. ‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ చూసి నటుడిగా చాలా ఎదిగావని వినాయక్‌గారు మెచ్చుకున్నారు. ► ‘ఛత్రపతి’ రీమేక్ కోసం హిందీ డిక్షన్ మీద ఇంకా బాగా వర్క్ చేస్తాను. శారీరకంగా కూడా వర్కౌట్ చేస్తాను. తెలుగు సినిమా ప్రస్తుతం బెస్ట్ ఇండస్ట్రీ. ఎందులోనూ తక్కువ కాదు. ఏ కథ వస్తే ఆ సినిమా చేస్తాను. తొలి సినిమాలా కష్టపడతాను. బాలీవుడ్ ఆఫర్ వచ్చినప్పుడు నాన్న ముఖంలో చాలా సంతోషం చూశాను. ఆ ఆనందం ఎప్పటికీ చూడాలని ఇంకా ఇంకా కష్టపడాలనుంటుంది. ► ఓటీటీ వర్సెస్ థియేటర్స్ గురించి చెప్పాలంటే హోమ్ థియేటర్ ఇంటి భోజనంలాంటిది. థియేటర్ బిర్యాని. దేని టేస్ట్ దానిదే. కానీ థియేటర్స్ ఇచ్చే అనుభూతి ఏదీ ఇవ్వలేదు. హాలీవుడ్‌లోనూ చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతాయి. పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలే థియేటర్స్‌లో విడుదలవుతాయి. అది నమ్మే యాక్షన్ సినిమాలు చేస్తూ ఉంటాను (నవ్వుతూ). -
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. ఇక రచ్చ రచ్చే
2020.. చిత్ర పరిశ్రమకు భారీ నష్టాన్ని మిగిల్చింది. కరోనా మహమ్మారి వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడడంతో షూటింగ్ పూర్తయిన సినిమాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో గత ఏడాది మొత్తం సినీ ప్రియులకు నిరాశే మిగిలింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవడం, ఇటీవల థియేటర్లలో రిలీజైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా హిట్ కావడం దర్శకనిర్మాతలకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో ఈ సంక్రాంతికి థియేటర్లలో మోత మోగించడానికి స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. వరుసగా భారీ సినిమాలను విడుదల చేస్తూ ఇంత కాలం సినీ ప్రియులు కోల్పోయిన వినోదాన్ని వడ్డీతో సహా ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ సంక్రాంతిలో సందడి చేయనున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం. రచ్చ చేయనున్న మాస్ మహారాజ్ మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపిచంద్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ‘క్రాక్’పై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో పాఠాలు చెప్పనున్న ‘మాస్టర్’ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో ఆండ్రియా జెరెమియా, రమ్య సుబ్రమణియన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్, నాసర్, ధీనా, సంజీవ్, శ్రీనాథ్, శ్రీమాన్, సునీల్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 9 న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెడీగా ఉన్న ‘రెడ్’ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్’కు ఇది రీమేక్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలరించేందుకు రెడీ అంటున్న ‘అల్లుడు’ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్. అల్లుడు అదుర్స్ ను జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. వీటితో పాటు దాదాపు కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇలా వరుస సినిమాలను విడుదల చేస్తూ.. ఇన్ని రోజులు మిస్ అయిన వినోదాన్ని అందించేందుకు చిత్రపరిశ్రమ సిద్దమైంది. మరీ ఇందులో ఏ సినిమా ప్రేక్షకులను అలరించి సంక్రాంతి హిట్‌గా నిలుస్తుందో చూడాలి. -
సంక్రాంతికి మంచి వినోదం ఇస్తాం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 15న విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక తారాగణం పాల్గొనగా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ ప్రత్యేక పాటలో మోనాల్ గజ్జర్ నర్తిస్తున్నారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అల్లుడు శ్రీను’ తర్వాత నేను చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అల్లుడు అదుర్స్’. సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులందరినీ వినోదంతో అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్ ఫన్‌తో మా సినిమా విందుభోజనంలా ఉంటుంది’’ అన్నారు సంతోష్ శ్రీనివాస్. ‘‘నిర్మాత బెల్లంకొండ సురేశ్‌గారు చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాతో పాటు విడుదలయ్యే అన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లో చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ‘‘ఇంత మంచి సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు సోనూ సూద్. ‘‘దాదాపు ఐదేళ్ల తర్వాత నేను పెర్ఫామ్ చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు మోనాల్ గజ్జర్. -
మోనాల్ స్టెప్పుల్
‘బిగ్‌బాస్ 4’లో తన ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల మనసును షేక్ చేసిన మోనాల్ గజ్జర్ బిగ్ స్క్రీన్‌పై స్టెప్పులతో షేక్ చేయటానికి రెడీ అయ్యారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ïß రోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కాలు కదుపుతున్నారు మోనాల్. ‘సుడిగాడు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మోనాల్ ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించారు. గడచిన మూడేళ్లలో గుజరాతీ, మరాఠీ చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఓ హిందీ సినిమా, ఓ గుజరాతీ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’లో స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ పెప్పీ నెంబర్లో సినిమాలోని ప్రధాన తారాగణమంతా స్టెప్పులేస్తారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరకర్త. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 15న విడుదల కానుంది. -
బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్..
అప్పటి వరకు వాళ్ల ఫేమ్ ఎలా ఉన్నప్పటికీ ఒకసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి వచ్చాక ఏదైనా జరగవచ్చు. అవకాశాలు లేని వారికి తలుపుతట్టి మరి రావొచ్చు. బిజీగా ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోవచ్చు. కంటెస్టెంట్ల జీవితాల్లో బిఫొర్ బిగ్‌బాస్ ఆఫ్టర్ బిగ్‌బాస్ అనేంతలా మార్పు వస్తుంది. అయితే మిగతా సీజన్లతో పోలీస్తే బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లకు హౌజ్ నుంచి బయటొచ్చాక సినిమా ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే సోహైల్ ఓ సినిమాకు సైన్ చేయగా.. తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని మెగాస్టార్ మాటిచ్చాడు. ఇక అభిజిత్ ఎఫ్ 3లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చదవండి: విజయ్ ‘మాస్టర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ జాబితాలోకి తాజాగా మోనాల్ గజ్జర్ చేరిపోయింది. ఇప్పటికే బుల్లితెరలో ప్రసారమవుతున్న ఓ డ్యాన్స్ షోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తెలుగు సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ గుజరాత్ భామ. టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్, నభానటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా స్పెషల్ సాంగ్‌లో మోనాల్.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆడిపాడనుంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల సారథ్యంలో సెట్ వేసినట్లు, దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేయనున్నారని సమాచారం. ఇక మోనాల్ ఎంట్రీతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ కానుందనడంలో సందేహం లేదు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: అభిమానులకు రకుల్ గుడ్‌న్యూస్ #BiggBoss beauty #MonalGajjar shaking legs with @BSaiSreenivas for a special song in #AlluduAdhurs.🕺💃 Movie releasing on Jan 15th 2021.✨ #SanthoshSrinivas @ThisIsDSP @prakashraaj @SonuSood @NabhaNatesh @ItsAnuEmmanuel @shekarmaster #AvinashKolla #SumanthMovieProductions pic.twitter.com/7fFof5xE7u — Shreyas Group (@shreyasgroup) December 29, 2020 -
అల్లుడు వస్తున్నాడు
‘రాక్షసుడు’ వంటి హిట్ మూవీ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. పండగ సీజన్లలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. ఈ సంక్రాంతికి మా ‘అల్లుడు అదుర్స్’ చిత్రం ప్రేక్షకులకు సరైన ఎంపిక అని కచ్చితంగా చెప్పవచ్చు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ప్రకాష్ రాజ్, సోనూ సూద్, ‘వెన్నెల’ కిశోర్, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా కె. నాయుడు, సమర్పణ: రమేష్ కుమార్ గంజి. -
మళ్లీ కాంబినేషన్ షురూ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ‘అల్లుడు శీను’ తొలి సినిమా. డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ సినిమాతో శ్రీనివాస్‌ను హీరోగా తెలుగుకు పరిచయం చేశారు. మంచి సక్సెస్‌ను కూడా తనకు అందించారు. ఇప్పుడు మరోసారి తన తొలి దర్శకుడితో బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు సాయి శ్రీనివాస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’ హిందీలో రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్‌ను వీవీ వినాయక్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రభాస్ చే సిన రోల్‌ను సాయి శ్రీనివాస్ చేస్తారు. ఈ రీమేక్ సాయి శ్రీనివాస్‌కే కాదు వినాయక్‌కి కూడా హిందీలో తొలి సినిమా అవుతుంది. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మిస్తారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నా బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. ఈ పాత్ర చేయడం గొప్ప బాధ్యతలా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఛత్రపతి’ కథకు సాయి శ్రీనివాస్ కరెక్ట్. రీమేక్స్‌లో వినాయక్‌గారి నైపుణ్యం అందరికీ తెలిసిందే’’ అన్నారు జయంతిలాల్ గడ. -
ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లడు శీను సినిమాతో వీవీ వినాయక్ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కనుండటం విశేషం. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: (సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్) -
మమ్మమ్మాస్ ఎంట్రీ షురూ
ప్రభాస్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో ‘ఛత్రపతి’ (2005) ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించనున్నారు. ‘అల్లుడు శీను’ చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయిశ్రీనివాస్. తన ప్రతి చిత్రాన్ని హిందీలోకి డబ్బింగ్ చేసుకుంటూ వచ్చారు. అలా డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు శ్రీను. ఇప్పుడు డైరెక్ట్ సినిమాతో హిందీ తెరపై కనిపించాలనుకున్నారు. మంచి మాస్ కథాంశంతో రూపొందిన ‘ఛత్రపతి’ రీమేక్ అయితే బాగుంటుందనుకున్నారు. ఈ రీమేక్ కోసం ఓ ఫోటోషూట్ చేశారట సాయి. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. -
కాజల్ పెళ్లికి టాలీవుడ్ యంగ్ హీరో!
2014లో విడుదలైన అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆ హీరో తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు తనతోపాటు రెండు చిత్రాల్లో కలిసి నటించిన కాజల్ అగర్వాల్. చదవండి: పెళ్లి డేటు చెప్పిన కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ మంచి స్నేహితులు. కాబట్టి ఆమె పెళ్లికి హాజరుకాబోతున్న అతిథులలో తాను కూడా ఒకడిని అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ పెళ్లి నాటికి వీలు చేసుకొని తప్పక ముంబై వెళతానని స్పష్టం చేశారు. ‘కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. కాజల్‌కు మంచి జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్ గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. నేనిప్పుడు షూటింగ్లో ఉన్నాను. కానీ విరామం తీసుకుని కాజల్ పెళ్లికి హాజరు కావాలి. మిగిలిన పనుల కోసం తన పెళ్లి మిస్ చేయలేను’ అంటూ పేర్కొన్నారు. చదవండి: ఇల్లు సర్దుతున్నాం.. ఎనీ సజేషన్స్? కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ముంబైకు చెందిన బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లును వివాహామాడనున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అతితక్కువ మంది బంధువులు సమక్షంలో ముంబైలో ఈ వేడుక జరగనుంది. అంతేగాక కేవలం 20 మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత రెండు వారాల తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. చదవండి: ‘అల్లుడు అదుర్స్’లోకి సోనూ సూద్ ఎంట్రీ -
సోనూ సూద్ ఎంట్రీ
‘రాక్షసుడు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం ఆయన ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న నటుడు సోనూ సూద్ సోమవారం షూటింగ్లో ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌కు, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు చక్కని రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు. -
అల్లుడు షూటింగ్ షురూ
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో సోమవారం పునఃప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాష్ రాజ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గొర్రెల మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌కు, ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా కె. నాయుడు, సమర్పణ: రమేష్‌కుమార్ గంజి. -
అల్లుడు అదుర్స్
‘అల్లుడు శీను’తో కెరీర్ ప్రారంభించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఎనిమిదో సినిమా టైటిల్‌ను ‘అల్లుడు అదుర్స్’గా ఖరారు చేశారు. నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కందిరీగ’, ‘రభస’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించి, సాయి శ్రీనివాస్ లుక్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘వేసవిలో ప్రేక్షకులను అలరించే ఆహ్లాదకరమైన సినిమా ఇది’’ అని చిత్రబృందం తెలిపింది. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు. -
మరోసారి అల్లుడిగా వస్తానంటున్న బెల్లంకొండ
అల్లుడు శ్రీను సినిమాతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయినా పెద్దగా బ్రేక్ రాలేదు. కానీ అతడు ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘రాక్షసుడు’ హిట్ కావడంతో తిరిగి సక్సెస్ బాట పట్టాడు. ప్రస్తుతం ఆయన ‘కందిరీగ’, ‘హైపర్’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్రబృందం గురువారం వెల్లడించింది. ఈమేరకు టైటిల్తోతో పాటు హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. (హ్యాపీ బర్త్ డే బెల్లంకొండ శ్రీనివాస్) ‘అల్లుడు అదుర్స్’తో బెల్లంకొండ సాయి మరోసారి అల్లుడి సెంటిమెంట్‌ను నమ్ముకున్నాడు. అయితే రెండూ ఒకటి కావని, మొదటిది వినోదాత్మక చిత్రమని, కానీ ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అంటున్నాడీ హీరో. ఈ సినిమాలో ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోతో జోడీ కడుతున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. (నా సినిమా కథలను ముందు నాన్నగారే వింటారు) -
చిన్న గ్యాప్ తర్వాత
‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు అనూ ఇమ్మాన్యుయేల్. చిన్న గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్ ఓ కథానాయిక. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్‌ని మరో హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో అనూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘సినిమాలో ఇద్దరి కథానాయి కలకూ ప్రాధాన్యముంటుంది. వేసవిలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే సందడి
-
కత్తుల్ని దించే చూపులతో బెల్లంకొండ లుక్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటాడు. తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ‘అల్లుడు శ్రీను’తో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు చేసింది ఏడు సినిమాలే అయినా కావాల్సినంత గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ అతన్ని ఎక్కువగా పరాజయాలే పలకరించినా మొక్కవోని దీక్షతో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆయన నటించిన ‘రాక్షసుడు’ సూపర్ హిట్‌ను అందుకుంది. విమర్శకులు సైతం ఈ చిత్రానికి ప్రశంసలు కురిపించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నేడు బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బెల్లంకొండ శ్రీనివాస్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో బెల్లంకొండ కత్తుల్ని దించుతున్న చూపులతో వేడి పుట్టిస్తున్నాడు. ‘కందిరీగ’, ‘హైపర్’ వంటి హిట్ సినిమాలు అందించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీప్రసాద్. చదవండి: సవాళ్లంటే ఇష్టం -
సవాళ్లంటే ఇష్టం
‘‘కొత్త ఏడాది, పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. కాకపోతే కథల ఎంపికలో ఇకపై జాగ్రత్త వహిస్తా. ఏడాదికి ఒకటి రెండు సినిమాలైనా సరే మంచివి చేయాలనుకుంటున్నా. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తా’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘కందిరీగ, రభస’ చిత్రాల ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై జి.సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా నేడు తన పుట్టినరోజుని పురస్కరించుకుని సాయి శ్రీనివాస్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► నా తొలి చిత్రం ‘అల్లుడు శీను’ తర్వాత వినోదంతో కూడిన పాత్ర చేయలేదు. సంతోష్ శ్రీనివాస్ అన్న తెరకెక్కిస్తోన్న చిత్రంలో తొలి సారి పూర్తి స్థాయి వినోదం నిండిన పాత్ర చేస్తున్నా. ఇందులో కాస్త ప్రేమకథ, చివరి 20 నిమిషాలు భావోద్వేగాలుంటాయి. ఈ చిత్రంలో చాలామంది హాస్యనటులున్నారు. దాదాపు రెండు గంటల సేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సన్నివేశాలుంటాయి. నా పాత్ర కొత్తగా ఉంటుంది. వినోదం పండించడం కష్టమే.. కానీ చాలెంజింగ్ పాత్రలు చేయడం చాలా ఇష్టం. ► సంతోష్ అన్న మా బ్యానర్లో తీసిన ‘కందిరీగ, రభస’ చిత్రాల కథలు విన్నా.. ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నా.. చాలా ప్రతిభ ఉన్న దర్శకుడాయన. ఏ సినిమాకైనా కథే రాజు అని నా ‘రాక్షసుడు’ సినిమా నేర్పింది. పైగా ప్రేక్షకులు చాలా స్మార్ట్ అయ్యారు. అందుకే కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నా. ఇందులో నాది, నభా నటేశ్ పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. సంతోష్ శ్రీనివాస్ వర్కింగ్ స్టైల్ నచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌గారితో నాకిది మూడో సినిమా. ఈ చిత్రకథ పెద్దది. అందుకే ఇందులో 4 పాటలు మాత్రమే ఉంటాయి. మార్చి చివరికి షూటింగ్ పూర్తి చేస్తాం. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ► ఇప్పటి వరకూ 7సినిమాలు చేశా. వాటిలో కొత్త దర్శకులతో చేసిన సినిమాలూ ఉన్నాయి. నేనెప్పుడూ పాత, కొత్త దర్శకులకు అందుబాటులో ఉంటా. మంచి కథలు ఉంటే కొత్తవారితో చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నా సినిమా కథలను ముందు మా నాన్నగారు (బెల్లంకొండ సురేశ్) వింటారు.. ఆయనకు నచ్చింది నన్ను వినమంటారు. చివరగా ఇద్దరికీ నచ్చిన కథకి పచ్చజెండా ఊపుతా (నవ్వుతూ). ► నాన్నతో కలిసి నా తమ్ముడు గణేశ్ ప్రొడక్షన్ చూసుకునేవాడు.. రోజూ షూటింగ్స్‌కి వెళ్లేవాడు. అందుకే హీరోగా బాగా నటిస్తున్నాడు.. పైగా మంచి టీమ్ కుదిరింది. ఓ రోజు షూటింగ్‌కి వెళ్లినప్పుడు వాడు నటిస్తున్న భావోద్వేగ సన్నివేశం చూసి కన్నీళ్లొచ్చాయి. నటనలో వాడికి నేనేమీ సలహాలు ఇవ్వలేదు.. వాడే నాకు ఇచ్చేలా ఉన్నాడు (నవ్వుతూ). ► ఈ 2020 కొత్త దశాబ్దానికి ప్రారంభం. ఇప్పటి వరకూ నేను చేసినవి ఒక ఎత్తు.. ఈ పదేళ్లు మరో ఎత్తు. ఇప్పటి నుంచి నా మొదటి సినిమాలా భావిస్తా. యాడ్స్ అవకాశాలొస్తున్నాయి కానీ ప్రస్తుతానికి ఆసక్తి లేదు. నాకు పెళ్లి చేయాలని నాన్నగారు తొందర పెడుతున్నారు.. కానీ, నేను ఒప్పుకోవడం లేదు (నవ్వుతూ). సంతోష్ అన్న సినిమా తర్వాత ‘దిల్’ రాజుగారి బ్యానర్లో ఓ సినిమా చేస్తా. ఆ తర్వాత ఏ సినిమా అంగీకరించలేదు.. కథలు వింటున్నా. -
లవ్ అండ్ యాక్షన్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ఇందులో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నాం. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలో సాయి శ్రీనివాస్ కనిపిస్తాడు. తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. డిసెంబర్ 6న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, దుబాయ్‌లో చిత్రీకరణ జరపనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కందిరీగ’ సినిమా నుంచి సంతోష్ పరిచయం. తనతో పని చేయడం నా కుటుంబ సభ్యులతో చేసినట్టుగా ఉంది. నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో కొత్త తరహా పాత్ర పోషిస్తున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్న బెల్లంకొండ సురేష్, పద్మగార్లకి ధన్యవాదాలు. ఏ మాత్రం రాజీ పడకుండా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందిస్తాం’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ‘‘సాయిశ్రీనివాస్‌తో పని చేయడానికి ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. నటనకి ఆస్కారం ఉన్న పాత్ర పోషించనుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నభా నటేష్. ‘‘బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పని చేశాను. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు కెమెరామేన్ డుడ్లీ. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మాట్లాడారు. -
8 ప్యాక్ శ్రీనివాస్
ఒకరేమో బెల్లంకొండ సాయిశ్రీనివాస్.. మరొకరేమో సంతోష్ శ్రీనివాస్. ఈ ఇద్దరి శ్రీనివాస్‌ల కాంబినేషన్లో ఓ సినిమా షురూ అయింది. ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ, రభస, హైపర్’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందనుంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 29న హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. ‘‘బెల్లంకొండ శ్రీనివాస్ కోసం సంతోష్ శ్రీనివాస్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. అందుకోసం 8 ప్యాక్స్‌తో మేకోవర్ అయ్యారు. ‘అల్లుడు శీను, జయజానకి నాయక’ చిత్రాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం అవుతుంది’’ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి ‘సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రాల ఫేమ్ డూడ్లే కెమెరామేన్‌గా పనిచేయబోతున్నారు. -
వెరైటీ మాస్
‘రాక్షసుడు’ సినిమాతో ఈ ఏడాది సూపర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుని మంచి ఫామ్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇదే ఉత్సాహంలో తన తర్వాతి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే పనులను మొదలుపెట్టారు. ఈ కొత్త సినిమాకు ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారు. సాయి శ్రీనివాస్ కోసం ఓ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కథను సిద్ధం చేశారట సంతోష్. ఈ మాస్ కథ చాలా వెరైటీగా ఉంటుందట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. -
మా నమ్మకం నిజమైంది
‘‘రాక్షసుడు’ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సందేశాత్మకంగా చూపించిన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. ఆగస్టు 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మరో రెండు వారాల వరకూ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మా ‘ఏ స్టూడియోస్ బ్యానర్’పై తొలి చిత్రంగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది. ఒరిజినల్ కంటెంట్‌లోని అంశాలను మిస్ చేయకుండా మనకు తగ్గట్లు చేశాం’’ అన్నారు రమేష్ వర్మ. ‘‘ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కెరీర్లకు మంచి సినిమా ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి సినిమానే ‘రాక్షసుడు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. -
‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’
అవకాశాలు అంత తొందరగా రావు. వాటి కోసం పోరాడి సాధించుకుని నలుగురుని మెప్పిస్తే కలిగే సంతోషమే వేరు. మరో విషయం ఏమిటంటే కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే నప్పుతాయి. అందుకే ఒక భాషలో వచ్చిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేసినా, అందులో ఒరిజినల్ చిత్రంలో పాత్ర పోషించిన నటుడినే వరిస్తాయి. నటుడు వినోద్‌సాగర్ విషయంలోనూ అదే జరిగింది. తమిళంలో విష్ణువిశాల్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం రాక్షసన్. రామ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో వినోద్‌సాగర్ ఉపాధ్యాయుడి పాత్రలో నటించి విలనిజాన్ని రక్తికట్టించాడు. ఆ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా అదే చిత్రం తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఈ సినిమాలో విలన్ పాత్ర మాత్రం తమిళంలో నటించిన వినోద్సాగర్నే వరించింది. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. ఈ ఆనందాన్ని ఆయన పంచుకుంటూ తాను దుబాయ్‌లో రేడీయో జాకీగా పని చేసి ఆ తరువాత చెన్నైకి వచ్చానన్నారు. ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేరి ఆపై నటుడిగా మారానని తెలిపారు. తన సినీ జీవితంలో ఇంటిని, తల్లిదండ్రుల్ని చాలా మిస్ అయ్యానని చెప్పారు. అలాంటి సమయంలో రాక్షసన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. ఆ చిత్రం తెలుగులోనూ రీమేక్ కావడంతో అందులోని ఉపాధ్యాయుడి పాత్రను మీరే పోషించాలని అడిగారన్నారు. అందుకు అంగీకరించి నటించినట్లు తెలిపారు. అంతకు ముందు బిచ్చైక్కారన్ చిత్ర అనువాదంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తనకు రాక్షసుడు చిత్రం చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. ఇలాంటి చిత్రాల్లో నటించాలన్నది తనకు చిరకాల ఆశ అని చెప్పారు. రాక్షసుడు చిత్రం తనకు జీవితంలో మరచిపోలేనంతగా గుర్తింపు తెచ్చి పెట్టిందన్నారు. ప్రేక్షకుల స్పందన తెలుచుకోవడానికి థియేటర్లకు వెళ్లగా చిత్రం చూసిన వారు తనను తిట్టుకుంటున్నారని అన్నారు. తాను గడ్డం పెంచుకుని ఉండటంతో అక్కడ తననెవరూ గుర్తించలేదని అన్నారు. అలా వారి ఒక్కో తిట్టును అభినందనగా భావిస్తున్నానని అన్నారు. రాక్షసుడు చిత్రం తన జీవితానికి పెద్ద శక్తినిచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ చిత్రంతో తెలుగులో పలు అవకాశాలు వస్తున్నట్లు తెలిపారు. అయితే సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు వినోద్‌సాగర్ అంటున్నారు. -
‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’
‘‘రాక్షసుడు’ సినిమా బడ్జెట్ రూ.22 కోట్లు అయ్యింది. ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లు అమ్ముడు కాగా, హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రూ.5.90కోట్లు వ్యాపారం జరిగింది. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్‌కు పెట్టిన ఖర్చు రూ.12 కోట్లు సోమవారానికే వచ్చాయి’’ అని బెల్లంకొండ సురేశ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. మంగళవారం జరిగిన ప్రెస్మీట్లో బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘చాలా చోట్ల వర్షం వల్ల ‘రాక్షసుడు’ కలెక్షన్లకు అంతరాయం కలిగింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ సృష్టించేది. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ బాగున్నాయి. వైజాగ్, ఈస్ట్ హక్కులను నేనే కొన్నాను. వైజాగ్‌లో సోమవారానికే రూ.2 కోట్లు వచ్చాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన రమేశ్ వర్మగారికి, కోనేరు సత్యనారాయణగారికి, హవీశ్‌గారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాకు కథే హీరో.. ఆ తర్వాత పని చేసినవారందరూ హీరోలే. జీబ్రాన్ ఫస్ట్ హీరో, ఆ తర్వాతే మా అబ్బాయే హీరో. ఈ నెల 15 తర్వాత టూర్ ప్లాన్ చేస్తాం. ‘అల్లుడు శీను’కి మించిన వినోదం, పాటలుండి స్క్రిప్ట్ కుదిరితే మా అబ్బాయితో సినిమా చేస్తాను. గ్రాండ్ సినిమానే తీస్తాను. ‘జయజానకీ నాయకా’ భారీ బడ్జెట్‌తో తీశాం. కొంచెం నష్టపోయాం. మంచి కథ కుదరగానే మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి ఓ సినిమా చేస్తాను. అభిషేక్‌తో ‘సాక్ష్యం’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘కవచం, సీత’ లాంటి సినిమాలు కొని, నష్టపోయినవాళ్లతో మా అబ్బాయి సినిమా చేసేలా చూస్తాను. మా అబ్బాయిని స్టార్ హీరోని చేయాలనే పెద్ద సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఎవరైనా తమ పిల్లలు పెద్ద పొజిషన్లోనే ఉండాలనుకుంటారు కదా. ఇండస్ట్రీలో, యూ ట్యూబ్‌లో తనకు మంచి బిజినెస్ క్రియేట్ అయ్యింది’’ అన్నారు. ‘‘రాక్షసుడు’ సినిమాకి 10రోజుల్లోనే లాభాలు సాధించాం’’ అన్నారు నిర్మాత ‘మల్టీడైమన్షన్’ వాసు. ‘‘తొలివారంలో నాలుగో రోజు వసూళ్లు కాస్త డల్ కాగానే భయపడ్డా. రెండో వారంలో అద్భుతంగా ఉన్నాయి’’ అన్నారు రమేశ్ వర్మ. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సేఫ్ అయ్యారు. ఆర్టిస్ట్‌గా పేరు రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నను గర్వపడేలా చేయాలనుకున్నాను. అందరూ హీరోగా నా జాబ్ ఈజీ అనుకుంటారు. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇక్కడ పేరు తెచ్చుకుంటే నాన్నకు అది సంతోషం ఇస్తుంది. రీమేక్ సినిమా హిట్ చేయడం చాలా కష్టం. ఇందులో నేను చేసిన పాత్ర మిగతా సినిమాల్లా కాదు. చాలా అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్ నాది. అందుకే ప్రయోగాత్మక సినిమా అని చెప్పొచ్చు. ఇక పై కూడా మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ అలరిస్తాను’’ అన్నారు. ‘మా అబ్బాయి సినిమాల్లో నేనెక్కువగా ఇన్వాల్స్ అవుతానని అందరూ అనుకుంటారు. కానీ పెద్దగా జోక్యం చేసుకోను. సెట్‌కి కూడా తక్కువ వెళ్తాను. తమిళ ‘రాక్షసన్’లో ఓ ఎమోషనల్ సీన్ ఉంది. ఆ సీన్ మా అబ్బాయి ఎలా చేస్తాడా? అనుకున్నా. ఆ సీన్ తీశాక చూశాను. అప్పుడే హిట్ అవుతుందనుకున్నా. మా రెండో అబ్బాయి గణేశ్‌ని కూడా హీరోని చేయబోతున్నాను. కథ, డైలాగ్ వెర్షన్ రెడీ అయ్యాయి’ అని బెల్లంకొండ సురేష్ అన్నారు. -
రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది
‘‘తెలుగు రాష్ట్రాల్లో ‘రాక్షసుడు’ సినిమా పేరు మార్మోగుతోంది. కొన్ని థియేటర్స్ కూడా పెంచాం. అనుకున్న ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ నామా ఈ నెల 2న ఈ సినిమాని విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ–‘‘రాక్షసుడు’ బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సాయిశ్రీనివాస్ ఇదివరకు హీరోయిజం ఉన్న సినిమాలు చేశారు. ‘రాక్షసుడు’ లో హీరో పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. రమేష్ వర్మ నా పేరును నిలబెట్టాడని గర్వంగా చెప్పగలను. ఈ సినిమాను లెక్కలు వేసుకుని తీయలేదు. మంచి సినిమా తీశారని అందరూ ప్రశంసిస్తుంటే సంతృప్తిగా ఉంది. చేసే పనిలో మనం ఆనందం వెతుక్కుంటే డబ్బు దానంతటదే వస్తుంది’’ అన్నారు. ‘‘రాక్షసన్’కి ‘రాక్షసుడు’ పర్ఫెక్ట్ రీమేక్. రమేష్‌వర్మ సిన్సియర్‌గా తీశారు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘రాక్షసన్’ లాంటి సినిమాను ధైర్యంగా తెలుగులో రీమేక్ చేశారు రమేష్‌గారు. సాయి ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలి. ఈ సినిమా వందరోజుల వేడుకలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు నటి అమలా పాల్. ‘‘కొన్ని సినిమాలు కమర్షియల్‌గా హిట్ సాధిస్తాయి. మరికొన్ని విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంటాయి. మా సినిమాకు ఆ రెండూ వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సాయి శ్రీనివాస్. ‘ ‘తొలివారంలో ‘రాక్షసుడు’ చిత్రం దాదాపు 32కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. సెకండ్వీక్లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. బయ్యర్స్ హ్యాపీ’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘సాయితో నేను బాగా నటింపజేశానని అందరూ అంటున్నారు.. కానీ సాయి అంత బాగా నటించాడు’’ అన్నారు రమేష్‌వర్మ. ‘‘సత్యనారాయణగారిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు నిర్మాత భరత్ చౌదరి. నిర్మాత మల్టీడైమెన్షన్ వాసు, కెమెరామేన్ వెంకట్ పాల్గొన్నారు. -
ఫిట్ అవడానికే హీరోగా చేస్తున్నా
‘‘నేను హీరోగా పరిచయం చేసిన సాయి శ్రీనివాస్‌కి ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ రావడం చాలా ఆనందంగా ఉంది. తనకంటే కూడా నాకే ఎక్కువ సంతోషంగా అనిపించింది. దానికి కారణమైన రమేశ్ వర్మకి నా అభినందనలు’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా ఈ నెల 2న విడుదల చేశారు . ఆ సినిమా మంచి హిట్ కావడం సంతోషంగా ఉందని వినాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రాక్షసుడు’ నిర్మాత కోనేరు సత్యనారాయణగారి అబ్బాయి హవీష్ కూడా హీరోనే. అయినా కూడా ‘రాక్షసుడు’ కథకి సాయి కరెక్ట్‌గా సరిపోతాడని, నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా ఓ సూపర్‌హిట్ సినిమాని సాయికి అందించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ రీమేక్ చేయడం చాలా ఈజీ అంటారు.. కానీ చాలా కష్టం. ‘రాక్షసన్’ తమిళ సినిమా నేను చూశా. మొదటి నుంచి చివరి వరకు ఆ సినిమా టెంపోని ఎక్కడా మిస్ అవకుండా రమేశ్ చాలా బాగా తెరకెక్కించాడు. డైరెక్షన్ వైపు ఎందుకొచ్చావని రమేశ్‌ని అడిగితే.. దాదాపు 800 సినిమాలకు డిజైనర్‌గా పనిచేశాను.. బోర్ కొట్టి డైరెక్షన్ వైపు వచ్చానని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అయితే డైరెక్షన్ ఎప్పుడూ బోర్ కొట్టదు.. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. సాయితో మళ్లీ హిట్ సినిమా తీయాలి. సాయికి ఇంకా మంచి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.... ► ఓ కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే ఏ అంశాలు అవసరమో అవన్నీ సాయితో తీసిన ‘అల్లుడు శీను’లో ఉన్నాయి. కొన్ని కథకి అవసరం లేకున్నా యాడ్ చేశాం.. ఎందుకంటే హీరోని (సాయి శ్రీనివాస్) ఎలివేట్ చేయడానికి చేసిన మ్యాజిక్ అది.. సినిమాకి అది బాగా వర్కవుట్ అయింది. ► ఈ మధ్య పేపర్లో చదివా.. ‘మా అబ్బాయి శ్రీనుని ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకులు నటుడిగా గుర్తించారు’ అని బెల్లంకొండ సురేశ్‌గారు అన్నారు. అది అబద్ధం. ‘అల్లుడు శీను’ నుంచి ‘రాక్షసుడు’ వరకూ అన్ని సినిమాలకు సాయిని నటుడిగా గుర్తించారు ప్రేక్షకులు. ► తొలి సినిమా ‘అల్లుడు శీను’కే ది బెస్ట్ ఇచ్చాడు. వినోదం పండించడం చాలా కష్టం.. కానీ ఆ సినిమాలో బాగా చేశాడు. ‘రాక్షసుడు’లో కథ టెంపో ఏ మాత్రం తగ్గకుండా, బాగా ఇన్వాల్వ్ అయి నటించాడు.. దాంతో తనకు మంచి పేరొచ్చింది. తను ఏ పాత్ర అయినా చేయగలడు. ► ‘అల్లుడు శీను’ సినిమా వచ్చి ఐదేళ్లు అయిందంటే రోజులు ఎంత స్పీడుగా అయిపోతున్నాయా అనిపిస్తోంది. ఆ సినిమా నిన్నకాక మొన్ననే విడుదల చేసినట్లుంది నాకు. ప్రతి ఒక్కరూ సినిమా సినిమాకి కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. సాయి మాత్రం అనుభవం ఉన్నవాడిలా అన్నీ ఒకే టేక్‌లోనే చేసేవాడు. నాకు చాలా సంతోషంగా, పెద్ద హీరోతో చేసినట్టు అనిపించింది. అప్పటికీ ఇప్పటికీ తనలో నాకు తేడా కనిపించడం లేదు. కథకు ఏది అవసరమో దాన్ని చేస్తున్నాడు. నేను–సాయి కలిసి మళ్లీ సినిమా చేయాలనుంది. అయితే పెద్ద సినిమా తీయాలి. అందుకు మంచి కథ కుదిరితే చేస్తాం. ► నేను సినిమా చేస్తున్నదే ఫిట్ అవడానికి.. అంతేకానీ హీరో అయిపోవాలని కాదు (నవ్వుతూ). బాడీ ఫిట్ అవడానికి ఏదో ఓ కారణం కావాలి.. అందుకు సినిమాని కారణంగా పెట్టుకుని చేస్తున్నా’’ అంటూ హీరోగా తాను ఓ సినిమా కమిట్ అయిన విషయం గురించి చెప్పారు వినాయక్. -
వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది
‘‘నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లయింది. సినిమాలు నిర్మించడం ప్రారంభించి 21 సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో 25 స్ట్రయిట్ సినిమాలు నిర్మించా.. 8 చిత్రాలు డబ్బింగ్ చేశా. అవేవీ నాకు ఆనందం ఇవ్వలేదు. మా అబ్బాయి చేసిన ‘రాక్షసుడు’ సినిమాకి అందరి ప్రశంసలు దక్కడంతో చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకూ తను చేసిన ఆరు సినిమాలు ఒక ఎత్తయితే ‘రాక్షసుడు’ మరో ఎత్తు. ఫస్ట్ టైమ్ ఓవర్సీస్లో మా సినిమాకి 100 ప్రీమియర్ షోలు పడటం విశేషం’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసు డు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా గత శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న సందర్భంగా బెల్లంకొండ సురేశ్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.. ఆ విశేషాలు. ► మా అబ్బాయి ఈ ఐదేళ్లలో 7 సినిమాలు చేశాడు. ‘అల్లుడు శీను’ సినిమాకి చాలా మంది హీరోలకి తీసిపోని విధంగా ఎక్స్ట్రార్డినరీ ఓపెనింగ్స్‌తో 6 రోజుల్లో 34కోట్ల షేర్ వచ్చింది. అన్ని వాణిజ్య అంశాలతో వీవీ వినాయక్‌గారి దర్శకత్వంలో ఆ సినిమాలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేశా. ఆ తర్వాత బోయపాటి శ్రీనుగారి సినిమాని భారీ బడ్జెట్‌తో, భారీ నటీనటులతో నిర్మించాం. కానీ, వాటికి దర్శకులకు, తోటి నటీనటులకు పేరొచ్చింది. అయితే ‘రాక్షసుడు’ మాత్రం మా అబ్బాయికి మంచి పేరు తీసుకొచ్చింది. రెవెన్యూ సైడ్ కూడా సూపర్ హిట్ అయింది. మాకు ఇంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ► ‘రాక్షసుడు’ కచ్చితంగా హిట్ అవుతుంది.. తెలుగులో మంచి పేరు వస్తుందని నెలన్నర పాటు రమేశ్ వర్మ తమిళ ‘రాక్షసన్’ హక్కుల కోసం ప్రయత్నించాడు.. నేను కూడా తనకు సపోర్ట్‌గా ప్రయత్నించాను. ఈ రోజుల్లో స్ట్రయిట్ సినిమా తీయడం ఈజీ కానీ, రీమేక్ తీయడం చాలా కష్టం. సరిగ్గా తీయకపోతే మంచి సినిమాని చెడగొట్టారంటూ తిడతారు. రమేశ్ వర్మకి కోనేరు సత్యనారాయణ వంటి మంచి నిర్మాత కుదిరారు. మా అబ్బాయికి మంచి సినిమా ఇచ్చినందుకు నిర్మాతకి పాదాభివందనం. సాయిని అందంగా, యూత్‌ఫుల్‌గా చూపించిన కెమెరామేన్ వెంకట్‌కి హ్యాట్సాఫ్. ► మా అబ్బాయి ‘అల్లుడు శీను, జయ జానకి నాయక’ సూపర్ హిట్స్.. స్పీడున్నోడు, కవచం, సీత’ వంటి ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మరచిపోయేలా ‘రాక్షసుడు’ హిట్ కొట్టింది. సౌత్ నుంచి హిందీలో డబ్బింగ్ అయిన íహీరోల సినిమాల్లో నంబర్ వన్‌గా ఉన్నవన్నీ మా అబ్బాయి సినిమాలే. కావాలంటే యూ ట్యూబ్‌లో చూసుకోవచ్చు. ‘జయ జానకి నాయక’ సినిమాకి సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్కపోవడం వల్ల కొంచెం నష్టం జరిగింది. లేకుంటే ఆ సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సింది.. దీంతో హిట్‌తోనే సరిపెట్టుకున్నాం. ► సాయితో బాలీవుడ్లో స్ట్రయిట్ హిందీ సినిమా చేస్తామంటూ హాలీవుడ్ సినిమాలు తీసే ఓ పెద్ద కంపెనీ నుంచి సోమవారమే మెయిల్ వచ్చింది. మేమింకా ఓకే చెప్పలేదు. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాం. లేదంటై వచ్చే ఏడాది మా సొంత బ్యానర్లో తెలుగులో హిట్ అయిన ఓ సినిమాని హిందీలో రీమేక్ చేస్తాం. ఇప్పటి వరకూ మా అబ్బాయి ఫైట్స్, డ్యాన్సులు బాగా చేయగలడనే పేరుంది.. ‘రాక్షసుడు’తో బాగా నటించగలడని పేరొచ్చింది. ► హీరో అవ్వాలని ఐదో తరగతిలోనే సాయి అనుకున్నాడు. అప్పటి నుంచే ఓ వైపు చదువుతూనే మరోవైపు డ్యాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ నేర్చుకున్నాడు. నిర్మాత కొడుకు హీరోగా ఎదగడం చాలా కష్టం. కానీ, మా అబ్బాయిది ఎంతో కష్టపడే తత్వం.. దానికి దేవుడి ఆశీర్వాదం, ప్రేక్షకులు అభిమానం తోడవడంతో సక్సెస్ అందుకున్నాడు. దానికితోడు మంచి సినిమాని ఎప్పుడూ మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ► ‘రాక్షసన్’ రీమేక్ చేయాలనుకున్నప్పుడు వెంకటేశ్‌బాబు రీమేక్ సినిమాల్లా ఏం మార్పులు చేయకుండా చేస్తే సరిపోతుందని చెప్పా. అలా చేయడం వల్లే ‘రాక్షసుడు’ మంచి విజయం సాధించింది. ఇకపై మంచి కథా చిత్రాలే చేయాలనుకున్నాం. మా అబ్బాయి తర్వాతి సినిమాని నిర్మాత ‘దిల్’ రాజుగారికి అప్పచెప్పా.. ఆయనే నిర్మిస్తారు. ఆ తర్వాత మా సొంత బ్యానర్లో ఓ సినిమా ఉంటుంది. -
‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’
భారీ క్యాస్టింగ్‌తో, హై బడ్జెట్ చిత్రాలతో సినిమాలు చేస్తూ మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు బెల్లంకొండ శ్రీనివాస్. తాజాగా రాక్షసుడు చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. మాస్ మంత్రం జపిస్తూ వచ్చిన ఈ హీరో.. తన పంథాను మార్చుకుని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..‘ ‘రాక్షసుడు’ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘అల్లుడు శీను।.. అప్పట్లో చాలా మంది హీరోలకు సమానంగా రూ.34 కోట్లు షేర్ వచ్చింది. గ్రాండియర్, కమర్షియల్ వేల్యూస్ ఉన్న ఈ సినిమాతో వి.వి.వినాయక్ డైరెక్షన్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `జయజానకి నాయక` భారీ క్యాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందింది. అవన్నీ డైరెక్టర్‌కి, ఇతర క్యాస్టింగ్‌కి పేరుని తెచ్చిపెట్టాయి. అయితే `రాక్షసుడు` సినిమా మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా నుంచి మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. -
రీమేక్ చేయడం సులభం కాదు
‘‘నా చిన్నప్పటి నుంచి సూపర్‌గుడ్ ఫిలిమ్స్‌లో చాలా రీమేక్‌లు చేయడం చూశా. అవన్నీ సక్సెస్‌లే. నేనెప్పుడూ రీమేక్ సినిమా చేయాలనుకోలేదు. కానీ, ‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం మామూలు విషయం కాదు. అలాగే రీమేక్ చేయడం కూడా ఈజీ కాదు. ఇండియాలో రీమేక్ అవుతున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయా? నేను సక్సెస్ అయ్యాను’’ అని రమేష్ వర్మ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రమేష్ వర్మ పంచుకున్న విశేషాలు... ► సాయిశ్రీనివాస్‌కి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది నేనే అని వింటుంటే చాలా ఆనందంగా ఉంది. బెల్లంకొండ సురేష్‌గారు వాళ్లబ్బాయిని నా చేతిలో పెట్టినప్పుడు ‘రాక్షసుడు’ సినిమాను ఎంపిక చేసుకున్నా. దీనికన్నా ముందు ఆయన ఓ లవ్ స్టోరీతో డబుల్ బడ్జెట్ ఉన్న సినిమా ఇచ్చారు. ఇద్దరు హీరోయిన్లు, దేవీశ్రీ మ్యూజిక్, లండన్‌లో సినిమా... ఇలా చాలా బెటర్ అవకాశం ఇచ్చారు. కానీ గమ్యం నన్ను ‘రాక్షసుడు’ వైపు తీసుకెళ్లింది. ► ‘కవచం’ సినిమా తర్వాత నేను సాయి శ్రీనివాస్‌కి ఈ కథ చెబితే ‘మళ్లీ పోలీస్‌గా చేయను’ అన్నాడు. బెల్లంకొండ సురేష్గారి దగ్గరకు వెళ్లి ‘రాక్షసన్’ సినిమా చూడమని చెప్పా. వాళ్ల ఫ్యామిలీ మొత్తం చూశారు.. అందరికీ నచ్చడంతో ‘రాక్షసుడు’ ఓకే అయింది. ► ఈ సినిమాలో ఫైట్స్ పెట్టాలని శ్రీనివాస్ కొంచెం ఒత్తిడి చేశాడు. కానీ, నేను ఒప్పుకోలేదు. ‘ఎందుకండీ రమేశ్‌తో రిస్క్. మీ అబ్బాయి హవీశ్‌తో చేసుకుని, వేరే పెద్ద డైరెక్టర్ని పెడితే, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని కొందరు సత్యనారాయణగారితో అన్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ► ఇండియాలో టాప్ గ్రాసర్ సినిమాను ఓ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఐఎండీబీలో టాప్ సెకండ్ సినిమాను మేం చేశాం.. ప్రూవ్ చేసుకున్నాం. ‘రాక్షసుడు’ తో ఆత్మసంతృప్తి కలిగింది. ‘మా అబ్బాయికి బ్లాక్ బస్టర్ ఇచ్చావు’ అని సురేష్‌గారు మెసేజ్ చేయడం హ్యాపీ. ► ప్రస్తుతానికి ‘రాక్షసుడు’ సినిమాను ఇంకా ప్రమోట్ చేసుకోవాలని ఉంది. ‘రాక్షసుడు’ టైమ్‌లో నితిన్ వాళ్ల నాన్నగారు సుధాకర్రెడ్డిగారిని కలిసి కథ చెప్పా.. వాళ్లకు నచ్చింది. అయితే మీడియాలో ఆ విషయం రావడం వల్ల డిస్టర్బెన్స్ జరిగింది. ఆ కథను, ఆ ప్రేమకథని నితిన్‌తో చేయాలని ఉంది. -
‘రాక్షసుడు’కి సాధ్యమేనా!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాక్షసుడు. తమిళ సినిమా రాక్షసన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగులోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా కాలం తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హ్యాపీగా ఉన్నారు. అయితే కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవు. సాయి శ్రీనివాస్ గత చిత్రం ‘సీత’ డిజాస్టర్ కావటంతో ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు వసూళ్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. తొలి రోజు ఈ సినిమా కేవలం 2.3 కోట్ల షేర్ మాత్రమే సాధించగలిగింది. వీకెండ్లోనే పరిస్థితి ఇలా ఉంటే సోమవారం నుంచి వసూళ్లు మరింతగా పడిపోతాయన్న టెన్షన్ నిర్మాతల్లో కనిపిస్తుంది. దీనికి తోడు వచ్చే వారం మూడు ఇంట్రస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మన్మథుడు 2’, భారీ పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’తో పాటు అనసూయ లీడ్ రోల్లో నటించిన ‘కథనం’ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ పరిస్థితుల్లో రాక్షసుడు సేఫ్ జోన్లోకి వస్తాడా లేదా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 17 కోట్లకు పైగా షేర్ సాధించాల్సి ఉంటుంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తాడో లేదో చూడాలి. -
‘రాక్షసుడు’ సక్సెస్ సెలబ్రేషన్