‘నేటి యువతలో చాలామంది తెలుగు ‘ఛత్రపతి’ (2005) సినిమాను చూసి ఉండరు. వారికి హిందీ రీమేక్ ‘ఛత్రపతి’ (2023) ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక అప్పట్లో ‘ఛత్రపతి’ని చూసినవారు తెలుగు ‘ఛత్రపతి’ సినిమాను పాడు చేయకుండా బాగా తీశారని అనుకుంటారు. లొకేషన్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తగా ఉంటాయి. ఓ ప్రాపర్ హిందీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్.
(చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి )
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో జయంతి లాల్ గడ నిర్మించిన ఈ సినిమా మే 12న హిందీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో సాయి హీరోగా నటించిన సినిమాలు హిందీలో అనువాదమై, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం తను ఫిజిక్ బాగా మెయిన్‌టైన్ చేశాడు. హిందీ నేర్చుకున్నాడు. ఇంట్రవెల్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను.
(చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! )
ఈ చిత్రంతో సాయి బాలీవుడ్‌లో హీరోగా నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. రీమేక్ అంటే కొన్ని ఐకానిక్ షాట్స్‌ను టచ్ చేయకపోవడమే మంచిది. మేమూ అదే చేశాం. ఇక యాక్టింగ్ పరంగా ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు. అయితే ‘ఛత్రపతి’ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు సాయి న్యాయం చేశాడని మాత్రం చెప్పగలను. హిందీ ‘ఛత్రపతి’ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అని అన్నారు.
‘‘మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో వీవీ వినాయక్‌గారు ఒకరు. తెలుగులో ‘అల్లుడు శీను’తో మా అబ్బాయి (బెల్లంకొండ సాయి)ని ఇంట్రడ్యూస్ చేసిన వినాయక్‌గారు హిందీలోనూ పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయవచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాను హిందీ భాషలోనే ఆడియన్స్‌కు చూపిద్దామన్నారు వినాయక్‌గారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో పెన్ స్టూడియోస్ లాంటి నిర్మాణసంస్థ మా అబ్బాయితో సినిమా నిర్మించడం నాకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్.
Comments
Please login to add a commentAdd a comment