Bellamkonda Suresh
-
సమంత మా ఇంటిమనిషి, రూ. 25 లక్షలిచ్చా: బెల్లంకొండ సురేశ్
హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురైనప్పుడు రూ.25 లక్షల ఆర్థిక సాయం చేశానంటున్నాడు నిర్మాత బెల్లంకొండ సురేశ్. తాను చేసిన సాయాన్ని సామ్ ఎప్పటికీ మర్చిపోలేదని చెప్తున్నాడు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సురేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమంత మా ఇంటిమనిషిలాగే! మాతో మూడు సినిమాలు చేసినప్పుడు మా ఇంటి నుంచే క్యారేజీ వెళ్లేది. ఎవరూ సాయం చేయలేదుఅప్పట్లో తనకు చర్మ వ్యాధి సోకింది. అప్పుడు నేనే సాయం చేశాను. బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి తనకు సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ తీసుకుని అక్కడే ఉంచాను. ట్రీట్మెంట్ కోసం డబ్బు కావాలని పలువురు నిర్మాతలకు ఫోన్ చేసింది.. కానీ ఎవరూ స్పందించలేదు.నాలుగు నెలల్లో కోలుకుందిదాంతో నేనే చికిత్స కోసం రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేశాను. మూడు, నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకున్నాక తన ఆరోగ్యం కుదుటపడింది. నేను చేసిన సాయం సమంత మనసులో బలంగా ఉండిపోయింది' అని పేర్కొన్నాడు. కాగా బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన అల్లుడు శ్రీను మూవీలో సమంత హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే! ఇకపోతే సమంత రెండేళ్లుగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. -
ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది – బెల్లంకొండ సురేష్
‘‘శ్రీహరి హీరోగా నటించిన ‘సాంబయ్య’ (1999) సినిమాతో నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభమైంది. ప్రొడ్యూసర్‌గా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్నేళ్లలో 38 సినిమాలు చేశాను. ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది. డబ్బు, పేరు, హోదా అన్నీ ఇక్కడే సంపాదించుకున్నాను. ఈ ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు, నేడు (డిసెంబర్ 5) తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం బెల్లంకొండ సురేష్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో మోహన్‌బాబుగారు నాకు గాడ్ ఫాదర్. నాకు ఎవరూ సపోర్ట్ లేనప్పుడు ఆయన తన సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్ని చేశారు. శ్రీహరిగారితో తీసిన ‘సాంబయ్య’ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే శ్రీహరిగారు, ఆ సినిమా డైరెక్టర్ కేఎస్ నాగేశ్వర రావుగారు మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. శ్రీహరిగారు మంచి నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. ఒక ఫ్రెండ్‌గా ఆయన పిల్లల భవిష్యత్‌కి నా వంతు బాధ్యతగా అవసరమైనప్పుడు చేయూతనిస్తాను. 2015లో వచ్చిన ‘గంగ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు సినిమా నిర్మించలేదు నేను. మా అబ్బాయిలు సాయి శ్రీనివాస్, సాయి గణేశ్ బయట బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు... అందుకే ఇన్నేళ్లు విరామం ఇవ్వాల్సి వచ్చింది. శ్రీనివాస్ కెరీర్ సెట్ అయ్యింది. పెళ్లి కూడా కుదిరింది. వచ్చే ఏడాది చేసుకుంటాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. గణేశ్ తన కెరీర్ సెట్ చేసుకుంటున్నాడు. రెండు మంచి ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి. నా రీ ఎంట్రీలో భాగంగా మా అబ్బాయిలతోనే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో రెండు కొత్త ప్రాజెక్ట్స్ప్రారంభిస్తాను. ఈ రెండు సినిమాలతో కొత్త దర్శకులని పరిచయం చేస్తున్నాను. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ని 4కే క్వాలిటీలో సిద్ధం చేశాను. రవితేజ బర్త్‌డేకి (జనవరి 26) రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో మంది స్టార్ యంగ్ హీరోస్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే సీనియర్ హీరో హీరోయిన్ల పిల్లలు కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. శర్వానంద్, వరుణ్ తేజ్, అభిరామ్ వంటి పలువురు హీరోలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరి కొద్ది రోజులలో మరొక హీరో కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోందిటాలీవుడ్లో ఇప్పుడు వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. యంగ్హీరోహీరోయిన్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పి వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు, హీరో నాగచైతన్య పెళ్లి నేడు(డిసెంబర్ 4)న అన్నపూర్ణ స్డూడియోలో జరగనుంది. ఇక నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ పెళ్లి కూడా త్వరలో జరగనుంది. ఈ నెలలోనే కిర్తీ సురేశ్ పెళ్లి కూడా జరగనుంది. నటుడు సుబ్బరాజు కూడా ఓ ఇంటివాడయ్యాడు. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయననే బెల్లం కొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రినివాస్.. తొలి సినిమా అల్లుడు శ్రీనుతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవల ఈ యంగ్ హీరో నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఓకేసారి మూడు సినిమాలతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న శ్రీనివాస్.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే శ్రీనివాస్ పెళ్లి ఉంటుందని ఆయన తండ్రి బెల్లంకొండ సురేశ్ చెప్పారు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సురేశ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇద్దరు కొడుకుల(శ్రీనివాస్, గణేశ్) పెళ్లి ఎప్పుడని ఓ విలేకరి అడగ్గా.. శ్రీనివాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని చెప్పారు. ఇక గణేశ్ పెళ్లికి కాస్త సమయం ఉందని అన్నారు. శ్రీనివాస్‌ది పెద్దలు కుదిర్చిన సంబంధమేనట. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని అమ్మాయిని శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని సురేశ్ వెల్లడించారు. ఇక శ్రీనివాస్ సినిమాల విషయాలకొస్తే.. చివరగా హిందీ‘ఛత్రపతి’ సినిమాలో నటించాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమాకి హిందీ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతం ఆయన ‘బైరవం’, ‘టైసన్ నాయుడు’తో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు. -
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ
-
నిర్మాత బెల్లంకొండ కారు అద్దాలు ధ్వంసం
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజికారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న ఖరీదైన మద్యం సీసాలతో పాటు నగదు తస్కరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో ఉంటున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఇంటి ముందు టీఎస్ 09 ఈసీ 3033 నెంబర్ బెంజి కారును పార్కింగ్ చేశాడు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై ఉన్నాయి. అందులో ఉండాల్సిన 11 రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు(ఒక్క బాటిల్ ధర రూ. 28 వేలు), రూ. 50 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు డయల్ 100కు ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెంజి కారు వెనుకాల అద్దం పగలగొట్టిన ఆగంతకులు డిక్కీలో ఉన్న మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద అనుమతి లేకుండా ఆరు కంటే ఎక్కువ మద్యం సీసాలు ఉండకూడదు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో 11 మద్యం సీసాలు ఎందుకు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినప్పుడు 11 సీసాలు చోరీకి గురైనట్లు చెప్పగా ఫిర్యాదులో మాత్రం ఐదు బాటిళ్లు చోరీ అయ్యాయంటూ మాట మార్చిన విషయాన్ని పోలీసులు గమనించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు: వీవీ వినాయక్
‘నేటి యువతలో చాలామంది తెలుగు ‘ఛత్రపతి’ (2005) సినిమాను చూసి ఉండరు. వారికి హిందీ రీమేక్ ‘ఛత్రపతి’ (2023) ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక అప్పట్లో ‘ఛత్రపతి’ని చూసినవారు తెలుగు ‘ఛత్రపతి’ సినిమాను పాడు చేయకుండా బాగా తీశారని అనుకుంటారు. లొకేషన్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తగా ఉంటాయి. ఓ ప్రాపర్ హిందీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ) ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో జయంతి లాల్ గడ నిర్మించిన ఈ సినిమా మే 12న హిందీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో సాయి హీరోగా నటించిన సినిమాలు హిందీలో అనువాదమై, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం తను ఫిజిక్ బాగా మెయిన్టైన్ చేశాడు. హిందీ నేర్చుకున్నాడు. ఇంట్రవెల్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. (చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! ) ఈ చిత్రంతో సాయి బాలీవుడ్లో హీరోగా నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. రీమేక్ అంటే కొన్ని ఐకానిక్ షాట్స్‌ను టచ్ చేయకపోవడమే మంచిది. మేమూ అదే చేశాం. ఇక యాక్టింగ్ పరంగా ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు. అయితే ‘ఛత్రపతి’ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు సాయి న్యాయం చేశాడని మాత్రం చెప్పగలను. హిందీ ‘ఛత్రపతి’ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో వీవీ వినాయక్‌గారు ఒకరు. తెలుగులో ‘అల్లుడు శీను’తో మా అబ్బాయి (బెల్లంకొండ సాయి)ని ఇంట్రడ్యూస్ చేసిన వినాయక్‌గారు హిందీలోనూ పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయవచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాను హిందీ భాషలోనే ఆడియన్స్‌కు చూపిద్దామన్నారు వినాయక్‌గారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో పెన్ స్టూడియోస్ లాంటి నిర్మాణసంస్థ మా అబ్బాయితో సినిమా నిర్మించడం నాకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. -
గణేష్‌కు ఆ అదృష్టం దక్కింది
‘‘నా చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన ‘స్వాతిముత్యం’తోనే ప్రేక్షకులు తనను నటుడిగా అంగీకరించడం నాకు హ్యాపీగా ఉంది. దర్శకుడు లక్ష్మణ్‌ను కూడా ప్రేక్షకులు అంగీకరించారు. తొలి సినిమాతోనే ప్రేక్షకాదరణ పొందాలంటే అదృష్టం ఉండాలి. అది ‘స్వాతిముత్యం’తో గణేష్‌కు దక్కడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజైంది. సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘స్వాతిముత్యం’ రిలీజైన తొలి రోజు, రెండో రోజు కలెక్షన్స్ చూసి భయపడ్డాం. కానీ మూడో రోజు నుంచి వసూళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’ సినిమా ఉన్నా ‘స్వాతిముత్యం’కూ ప్రేక్షకాదరణ లభించింది. ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్లో చిరంజీవిగారు ‘స్వాతిముత్యం’ సినిమాను కూడా ఆదరించాలని చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు. గణేష్‌ను హీరోగా లాంచ్ చేసిన నాగవంశీ, చినబాబులకు రుణపడి ఉంటాను. ఓ నిర్మాతగా నేను కూడా ఇలాంటి లాంచింగ్‌ను గణేష్‌కు ఇచ్చి ఉండేవాడిని కాదేమో! ఇక బాలకృష్ణగారి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను రీ రిలీజ్ చేయడం వల్ల వచ్చిన ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలను బసవతారకం ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నాం. ఎన్టీఆర్‌గారి ‘ఆది’ సినిమాను కూడా రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇక ‘జగదేకవీరుని కథ’ సినిమాను మళ్లీ తీయాలన్నది నాకున్న లక్ష్యాల్లో ఒకటి. ఎప్పటికైనా తీస్తా’’ అన్నారు. ‘‘తొలి సినిమాతోనే నటుడిగా నాకు ఇంత మంచి పేరు వస్తుందని ఊహించలేదు’’ అన్నారు గణేష్. ‘‘రిపీట్ ఆడియన్స్ ఉన్న చిత్రం ‘స్వాతిముత్యం’. నన్ను నమ్మి, ప్రోత్సహించిన నాగవంశీ, చినబాబు, బెల్లంకొండ గణేష్గార్లకు ధన్యవాదాలు. దర్శకుడిగా నా రెండో సినిమా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్ కె. కృష్ణ. -
25న చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్
‘‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని 20 ఏళ్ల క్రితం ఒక పండగలా రిలీజ్ చేశాం. ఇప్పుడు కూడా రీ రిలీజ్‌లా లేదు.. కొత్త సినిమాని విడుదల చేస్తున్నట్లే అనిపిస్తోంది. మంచి ఉద్దేశం కోసం రీ రిలీజవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, నందమూరి ఫ్యాన్స్ ఆదరించాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బాలకృష్ణ హీరోగా, టబు, శ్రియ హీరోయిన్లుగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెన్నకేశవ రెడ్డి’. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా 2002 సెప్టెంబర్ 25న రిలీజైంది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 25న రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు బెల్లంకొండ సురేష్. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’లో బాలయ్యగారిని ఎలా చూపించాలా? అనే పిచ్చితో కొన్ని గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి. ఈ సినిమాలో వచ్చే మేజర్ రెవెన్యూని ‘బసవతారకం ట్రస్ట్’కి విరాళంగా ఇస్తాం’’ అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్ గురించి బాలకృష్ణగారికి చెప్పగానే సంతోషపడ్డారు. ఈ నెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలతో విడుదల చేస్తున్నాం. రీ రిలీజ్లో ఒక సినిమాని కోటి రూపాయలకు అడిగిన దాఖలాలు లేవు.. కానీ పలువురు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోటి రూపాయలకు అడగడం ‘చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్‌కి నిదర్శనం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం ‘బసవతారకం ట్రస్ట్’కి, మిగతాది నాకు సంబంధించిన అసోషియేషన్స్కి ఇస్తాను. నవంబర్ నుంచి మళ్లీ యాక్టివ్‌గా ప్రొడక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
రూ. 85 లక్షల మోసం! బెల్లంకొండ సురేష్‌పై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమా నిర్మిస్తున్నానంటూ బెల్లంకొండ సురేష్ 2018లో రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మరో సినిమా అంటూ మరోసారి నమ్మించి డబ్బు తీసుకున్నాడని శరణ్ ఆరోపించాడు. ఇలా తన దగ్గర నుంచి మొత్తంగా రూ.85 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడంతో పోలీసులు నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: క్యారెక్టర్ ఆర్టిస్టుపై లైంగిక దాడి, ఇద్దరు నిందితుల అరెస్ట్ '20 కోట్ల రూపాయలిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా?'' ప్రపోజల్‌కు ఓకే చెప్పిన హీరో -
బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ
బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మొదటి కుమారుడు శ్రీనివాస్ టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు. అతనే ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్. కాగా బెల్లంకొండ గణేశ్ హీరోగా రుపొందుతున్న ‘స్వాతిముత్యం’ ఫస్ట్‌లుక్ విడుదలయింది. గణేశ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్ 14)న ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా చేస్తుండగా.. లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించొచ్చు. అయితే వి.వి. వినాయక్ దర్శకత్వంలో తొలి తెలుగు సినిమా చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. త్వరలో ఆయన డెరెక్షన్‌లోనే ‘ఛత్రపతి’ రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. Wishing you all the success and happiness this year and all the years coming ahead! Congratulations on your new project! 🤗#GaneshBellamkonda #SwathiMuthyam @VarshaBollamma @Lakshmankkrish2 #mahathi_sagar @dopSURYAA #vamsi84 @NavinNooli @SitharaEnts pic.twitter.com/muLNWlgqkM — Bellamkonda Sreenivas (@BSaiSreenivas) September 14, 2021 -
అభిమానికి బెల్లంకొండ ఫ్యామిలీ సర్ప్రైజ్
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. తన నూతన ఇంటి గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించి సదరు అభిమాని ఫంక్షన్‌కు వెళ్లి అతడికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించాడు బెల్లంకొండ. అసలు విషయం ఎంటంటే.. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి బెల్లంకొండ శ్రీనివాస్‌కు వీరాభిమాని. అయితే ఇటీవల అతడు నూతన ఇంటిని నిర్మించుకున్నాడు. దీంతో గృహప్రవేశ వేడుకకు రావాల్సిందిగా శ్రీనివాస్‌కు ఆహ్వానం అందించాడు. దీంతో అభిమాని కోరిక మేరకు శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే తాను వెళ్లడమే కాకుండా తనతో పాటు తండ్రి బెల్లంకోండ సురేశ్, తల్లి పద్మ, సోదరుడు గణేశ్‌ను కూడా తీసుకుని హైదరాబాద్ నుంచి కర్నూలుకు పయనమయ్యాడు. కరోనా కారణంగా కాలు బయటక పెట్టలేని పరిస్థితిలో కూడా అభిమాని ఫంక్షన్‌కు కుటుంబ సమేతంగా హాజరవ్వడం అనేది సాధారణ విషయం కాదు. ఇలా ఆ అభిమాని కోరికను మన్నించి కుటుంబ సమేంతంగా ఆ ఫంక్షన్‌కు హాజరై అతడికి, అతడి కుటుంబానికి బెల్లంకొండ ఫ్యామిలీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించింది. అది చూసి నెటిజన్లు, అభిమానులు బెల్లకొండ శ్రీనివాస్, అతడి ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కిల్ రాజు అంటావా..సినిమా ఎవడు ఇస్తాడు?
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుపై డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్రంగా ఖండించారు. దిల్‌రాజు గురించి మాట్లాడే అర్హత శ్రీను లేదన్నారు. శనివారం ఆయన అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను అనే వ్యక్తి ఈరోజు దిల్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. అసలు శ్రీను అనే వ్యక్తికి దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత ఉందా? శిరీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. వాళ్లతో మాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది.. అసలు దిల్ రాజు-శిరీష్ అనేవాళ్లు నైజాం ఏరియాలో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యుసర్ అనేవాళ్లే ఉండరు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నారు. వాళ్లు కనుక పక్కకు తప్పుకుంటే సినిమాలు చేయలేం బాబోయ్ అనే ప్రొడ్యుసర్లు ఉన్నారు. వాళ్లదగ్గరకు వెళ్లి సినిమా ఆగిపోతుంది.. రిలీజ్ కష్టంగా ఉంది అంటే ఎంత డబ్బు ఇచ్చి అయినా రిలీజ్ చేస్తారు. నాకు కూడా చాలా డబ్బు ఇచ్చారు. నాలా చాలామంది ఉన్నారు. (చదవండి : దిల్ రాజుపై ఫైరైన క్రాక్ డిస్ట్రిబ్యూటర్) ఇప్పుడేదో క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతున్నాడు.. నేను ఆరేళ్లలో ఆరు సినిమాలు చేశాను అని. నువ్ ఆరు చేస్తే వాళ్లు వంద సినిమాలు చేశారు. మొత్తం ఎగ్జిబిటర్స్‌కి లైఫ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ థియేటర్స్‌కి రప్పించారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకి కావాలి. శిరీష్-దిల్ రాజు అనే వ్యక్తులు లేకపోతే.. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే నాశనం అయిపోయేది. తెలిసీ తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నేను హుషారు సినిమా చేశానంటున్నాడు. హుషారు సినిమా బెక్కం వేణుగోపాల్ అనే చిన్న నిర్మాత చేశారు. ఇప్పటికీ ఆయన డబ్బులు కోసం తిరుగుతూనే ఉన్నాడు. కనీసం జీఎస్టీ కూడా కట్టలేదట. అలాంటి వ్యక్తి నేను ఎడ్యుకేటెడ్, పవర్ ఫుల్ మేన్‌ని అని పక్కన ఓయూ జేఏసీ విద్యార్థుల్ని పెట్టుకుని మాట్లాడుతున్నాడు.ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఉన్నారు.. ఇండస్ట్రీ పుట్టకు ముందు నుంచి ఉన్నారు. అన్యాయం జరిగితే వాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు.. బోలెడు అసోసియేషన్స్ ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్. నీ సినిమాలో దమ్ము ఉంది. ఆడుతుంది.. నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్ కనీసం జీఎస్టీ కట్టలేదు.. నీకు నెక్స్ట్ సినిమా ఎవడు ఇస్తాడు. ఇచ్చినా ఇలాగే ఉంటుంది. ఓయూ జేఏసీ వాళ్లకి చెప్తున్నా.. మీరు అన్నీ తెలుసుకుని ఇలాంటి జీఎస్టీ కట్టని వాళ్లకోసం మాట్లాడొద్దు. మీరు వెనకేసుకుని వస్తున్న ఆ వ్యక్తితో ముందు జీఎస్టీ కట్టించి.. అప్పుడు మాట్లాడండి. నేను ప్రెస్ మీట్ ఈ విషయం మాట్లాడాలని అనుకున్నా. కానీ సందర్భం కాదని అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్లో మళ్లీ చెప్తున్నా.. దిల్ రాజు, శిరీష్ లేకపోతే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది కాదు. ఆయనకి ఇంగ్లీష్ రాకపోతే నీకు ఎందుకు? తమిళ్ వస్తే నీకెందుకు? ఆయన మంచి సినిమాలు తీస్తున్నాడు. జనాలు ఆదరించే సినిమాలు చేస్తున్నాడు. అతన్ని పట్టుకుని కిల్ రాజు అంటావా? మేం వాళ్లతో 20 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాం.. ఇలాంటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీలో ఉండాలి’ అని బెల్లంకొండ సురేష్ ఫైర్ అయ్యారు. కాగా, ఇటీవల క్రాక్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను దిల్‌రాజు తనకు థియేటర్లు ఇవ్వడంలేదని మండిపడ్డ సంగతి తెలిసిందే. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తనకు థియేటర్లు ఇవ్వకుండా ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశాడు. దిల్ రాజు నియంతలా వ్యవహరిస్తూ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని బానిసలుగా చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. -
‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’
‘‘రాక్షసుడు’ సినిమా బడ్జెట్ రూ.22 కోట్లు అయ్యింది. ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లు అమ్ముడు కాగా, హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రూ.5.90కోట్లు వ్యాపారం జరిగింది. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్‌కు పెట్టిన ఖర్చు రూ.12 కోట్లు సోమవారానికే వచ్చాయి’’ అని బెల్లంకొండ సురేశ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. మంగళవారం జరిగిన ప్రెస్మీట్లో బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘చాలా చోట్ల వర్షం వల్ల ‘రాక్షసుడు’ కలెక్షన్లకు అంతరాయం కలిగింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ సృష్టించేది. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ బాగున్నాయి. వైజాగ్, ఈస్ట్ హక్కులను నేనే కొన్నాను. వైజాగ్‌లో సోమవారానికే రూ.2 కోట్లు వచ్చాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన రమేశ్ వర్మగారికి, కోనేరు సత్యనారాయణగారికి, హవీశ్‌గారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాకు కథే హీరో.. ఆ తర్వాత పని చేసినవారందరూ హీరోలే. జీబ్రాన్ ఫస్ట్ హీరో, ఆ తర్వాతే మా అబ్బాయే హీరో. ఈ నెల 15 తర్వాత టూర్ ప్లాన్ చేస్తాం. ‘అల్లుడు శీను’కి మించిన వినోదం, పాటలుండి స్క్రిప్ట్ కుదిరితే మా అబ్బాయితో సినిమా చేస్తాను. గ్రాండ్ సినిమానే తీస్తాను. ‘జయజానకీ నాయకా’ భారీ బడ్జెట్‌తో తీశాం. కొంచెం నష్టపోయాం. మంచి కథ కుదరగానే మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి ఓ సినిమా చేస్తాను. అభిషేక్‌తో ‘సాక్ష్యం’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘కవచం, సీత’ లాంటి సినిమాలు కొని, నష్టపోయినవాళ్లతో మా అబ్బాయి సినిమా చేసేలా చూస్తాను. మా అబ్బాయిని స్టార్ హీరోని చేయాలనే పెద్ద సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఎవరైనా తమ పిల్లలు పెద్ద పొజిషన్లోనే ఉండాలనుకుంటారు కదా. ఇండస్ట్రీలో, యూ ట్యూబ్‌లో తనకు మంచి బిజినెస్ క్రియేట్ అయ్యింది’’ అన్నారు. ‘‘రాక్షసుడు’ సినిమాకి 10రోజుల్లోనే లాభాలు సాధించాం’’ అన్నారు నిర్మాత ‘మల్టీడైమన్షన్’ వాసు. ‘‘తొలివారంలో నాలుగో రోజు వసూళ్లు కాస్త డల్ కాగానే భయపడ్డా. రెండో వారంలో అద్భుతంగా ఉన్నాయి’’ అన్నారు రమేశ్ వర్మ. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సేఫ్ అయ్యారు. ఆర్టిస్ట్‌గా పేరు రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నను గర్వపడేలా చేయాలనుకున్నాను. అందరూ హీరోగా నా జాబ్ ఈజీ అనుకుంటారు. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇక్కడ పేరు తెచ్చుకుంటే నాన్నకు అది సంతోషం ఇస్తుంది. రీమేక్ సినిమా హిట్ చేయడం చాలా కష్టం. ఇందులో నేను చేసిన పాత్ర మిగతా సినిమాల్లా కాదు. చాలా అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్ నాది. అందుకే ప్రయోగాత్మక సినిమా అని చెప్పొచ్చు. ఇక పై కూడా మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ అలరిస్తాను’’ అన్నారు. ‘మా అబ్బాయి సినిమాల్లో నేనెక్కువగా ఇన్వాల్స్ అవుతానని అందరూ అనుకుంటారు. కానీ పెద్దగా జోక్యం చేసుకోను. సెట్‌కి కూడా తక్కువ వెళ్తాను. తమిళ ‘రాక్షసన్’లో ఓ ఎమోషనల్ సీన్ ఉంది. ఆ సీన్ మా అబ్బాయి ఎలా చేస్తాడా? అనుకున్నా. ఆ సీన్ తీశాక చూశాను. అప్పుడే హిట్ అవుతుందనుకున్నా. మా రెండో అబ్బాయి గణేశ్‌ని కూడా హీరోని చేయబోతున్నాను. కథ, డైలాగ్ వెర్షన్ రెడీ అయ్యాయి’ అని బెల్లంకొండ సురేష్ అన్నారు. -
వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది
‘‘నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లయింది. సినిమాలు నిర్మించడం ప్రారంభించి 21 సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో 25 స్ట్రయిట్ సినిమాలు నిర్మించా.. 8 చిత్రాలు డబ్బింగ్ చేశా. అవేవీ నాకు ఆనందం ఇవ్వలేదు. మా అబ్బాయి చేసిన ‘రాక్షసుడు’ సినిమాకి అందరి ప్రశంసలు దక్కడంతో చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకూ తను చేసిన ఆరు సినిమాలు ఒక ఎత్తయితే ‘రాక్షసుడు’ మరో ఎత్తు. ఫస్ట్ టైమ్ ఓవర్సీస్లో మా సినిమాకి 100 ప్రీమియర్ షోలు పడటం విశేషం’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసు డు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా గత శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న సందర్భంగా బెల్లంకొండ సురేశ్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.. ఆ విశేషాలు. ► మా అబ్బాయి ఈ ఐదేళ్లలో 7 సినిమాలు చేశాడు. ‘అల్లుడు శీను’ సినిమాకి చాలా మంది హీరోలకి తీసిపోని విధంగా ఎక్స్ట్రార్డినరీ ఓపెనింగ్స్‌తో 6 రోజుల్లో 34కోట్ల షేర్ వచ్చింది. అన్ని వాణిజ్య అంశాలతో వీవీ వినాయక్‌గారి దర్శకత్వంలో ఆ సినిమాలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేశా. ఆ తర్వాత బోయపాటి శ్రీనుగారి సినిమాని భారీ బడ్జెట్‌తో, భారీ నటీనటులతో నిర్మించాం. కానీ, వాటికి దర్శకులకు, తోటి నటీనటులకు పేరొచ్చింది. అయితే ‘రాక్షసుడు’ మాత్రం మా అబ్బాయికి మంచి పేరు తీసుకొచ్చింది. రెవెన్యూ సైడ్ కూడా సూపర్ హిట్ అయింది. మాకు ఇంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ► ‘రాక్షసుడు’ కచ్చితంగా హిట్ అవుతుంది.. తెలుగులో మంచి పేరు వస్తుందని నెలన్నర పాటు రమేశ్ వర్మ తమిళ ‘రాక్షసన్’ హక్కుల కోసం ప్రయత్నించాడు.. నేను కూడా తనకు సపోర్ట్‌గా ప్రయత్నించాను. ఈ రోజుల్లో స్ట్రయిట్ సినిమా తీయడం ఈజీ కానీ, రీమేక్ తీయడం చాలా కష్టం. సరిగ్గా తీయకపోతే మంచి సినిమాని చెడగొట్టారంటూ తిడతారు. రమేశ్ వర్మకి కోనేరు సత్యనారాయణ వంటి మంచి నిర్మాత కుదిరారు. మా అబ్బాయికి మంచి సినిమా ఇచ్చినందుకు నిర్మాతకి పాదాభివందనం. సాయిని అందంగా, యూత్‌ఫుల్‌గా చూపించిన కెమెరామేన్ వెంకట్‌కి హ్యాట్సాఫ్. ► మా అబ్బాయి ‘అల్లుడు శీను, జయ జానకి నాయక’ సూపర్ హిట్స్.. స్పీడున్నోడు, కవచం, సీత’ వంటి ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మరచిపోయేలా ‘రాక్షసుడు’ హిట్ కొట్టింది. సౌత్ నుంచి హిందీలో డబ్బింగ్ అయిన íహీరోల సినిమాల్లో నంబర్ వన్‌గా ఉన్నవన్నీ మా అబ్బాయి సినిమాలే. కావాలంటే యూ ట్యూబ్‌లో చూసుకోవచ్చు. ‘జయ జానకి నాయక’ సినిమాకి సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్కపోవడం వల్ల కొంచెం నష్టం జరిగింది. లేకుంటే ఆ సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సింది.. దీంతో హిట్‌తోనే సరిపెట్టుకున్నాం. ► సాయితో బాలీవుడ్లో స్ట్రయిట్ హిందీ సినిమా చేస్తామంటూ హాలీవుడ్ సినిమాలు తీసే ఓ పెద్ద కంపెనీ నుంచి సోమవారమే మెయిల్ వచ్చింది. మేమింకా ఓకే చెప్పలేదు. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాం. లేదంటై వచ్చే ఏడాది మా సొంత బ్యానర్లో తెలుగులో హిట్ అయిన ఓ సినిమాని హిందీలో రీమేక్ చేస్తాం. ఇప్పటి వరకూ మా అబ్బాయి ఫైట్స్, డ్యాన్సులు బాగా చేయగలడనే పేరుంది.. ‘రాక్షసుడు’తో బాగా నటించగలడని పేరొచ్చింది. ► హీరో అవ్వాలని ఐదో తరగతిలోనే సాయి అనుకున్నాడు. అప్పటి నుంచే ఓ వైపు చదువుతూనే మరోవైపు డ్యాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ నేర్చుకున్నాడు. నిర్మాత కొడుకు హీరోగా ఎదగడం చాలా కష్టం. కానీ, మా అబ్బాయిది ఎంతో కష్టపడే తత్వం.. దానికి దేవుడి ఆశీర్వాదం, ప్రేక్షకులు అభిమానం తోడవడంతో సక్సెస్ అందుకున్నాడు. దానికితోడు మంచి సినిమాని ఎప్పుడూ మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ► ‘రాక్షసన్’ రీమేక్ చేయాలనుకున్నప్పుడు వెంకటేశ్‌బాబు రీమేక్ సినిమాల్లా ఏం మార్పులు చేయకుండా చేస్తే సరిపోతుందని చెప్పా. అలా చేయడం వల్లే ‘రాక్షసుడు’ మంచి విజయం సాధించింది. ఇకపై మంచి కథా చిత్రాలే చేయాలనుకున్నాం. మా అబ్బాయి తర్వాతి సినిమాని నిర్మాత ‘దిల్’ రాజుగారికి అప్పచెప్పా.. ఆయనే నిర్మిస్తారు. ఆ తర్వాత మా సొంత బ్యానర్లో ఓ సినిమా ఉంటుంది. -
నన్ను బెదిరిస్తున్నాడు: సినీ నిర్మాత
హైదరాబాద్: తన కుమారుడు నటించిన ఓ సినిమాకు సంబంధించి పాట చిత్రీకరణలో భాగంగా లైట్లు ఏర్పాటు చేసిన వ్యక్తికి తాను డబ్బులు చెల్లించినప్పటికీ అందుకు సంబంధం లేని వ్యక్తి తనపై బెధిరింపులకు పాల్పడుతున్నాడంటూ ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ హీరోగా 'జయ జనాకీ నాయక' చిత్ర నిర్మాణం గత ఏడాది డిసెంబర్ 26 నుంచి గత జనవరి 2వ తేదీ వరకు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇందులో పాట చిత్రీకరణ కోసం లైట్ల ఏర్పాటుకు ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చామని, పని పూర్తయిన తరువాత అతడికి రూ.2.75 లక్షల బిల్లు చెల్లించినట్లు తెలిపాడు. అయితే ఈ కాంట్రాక్ట్ తనదని రూ.10.75 లక్షల బిల్లు చెల్లించాలని అశోక్ రెడ్డి అనే వ్యక్తి తనను ఒత్తిడి చేస్తున్నాడని, తరచూ ఫోన్లు చేసి వేధిస్తున్నందున తన పనులకు ఆటంకం కలుగుతున్నదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా తనకు లైట్లు అమర్చినందుకు గాను రూ. 10.75 లక్షలు రావాల్సి ఉందని గతంలోనే మాదాపూర్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు అశోక్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నయ్య అడిగితే తమ్ముడు కాదంటాడా!
మాస్... రాఘవా లారెన్స్ అంటేనే మాస్! హీరోలతో ఆయన వేయించే స్టెప్పులైనా... దర్శకుడిగా ఆయన తీసిన సినిమాలైనా మాసే. ఇప్పుడీయన ‘అల్లుడు శీను’తో ఇండస్ట్రీలో హీరోగా ఫస్ట్ స్టెప్ వేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కోసం మాంచి మాస్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట! లారెన్స్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హారర్ థ్రిల్లర్ ‘కాంచన’ను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ దాదాపు ఐదేళ్ల క్రితం విడుదల చేశారు. అప్పటినుంచి ఇద్దరూ చాలా క్లోజ్. సురేష్‌ను లారెన్స్ ‘అన్నయ్యా’ అని పిలుస్తారు. తన కుమారుడితో మాంచి మాస్ సినిమా తీయమని బెల్లంకొండ సురేశ్ అడగడం, ఈ స్టార్ కొరియోగ్రాఫర్ వెంటనే ఓకే చెప్పడం జరిగాయని ఫిల్మ్‌నగర్ టాక్. -
నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆఫీసు సీజ్
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆఫీసును బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. తమకు తిరిగి చెల్లించాల్సిన రూ. 11 కోట్ల రుణాన్ని ఆయన చెల్లించకపోవడంతో కోటక్ మహీంద్రా బ్యాంకు అధికారులు ఈ ఆఫీసును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ 'అల్లుడు శ్రీను' సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్పీడున్నోడు అనే మరో సినిమాలో కూడా శ్రీనివాస్ నటించాడు. అంతలోనే ఆయన తండ్రి, నిర్మాత సురేష్ కార్యాలయం సీజ్ కావడం గమనార్హం. -
యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ కారు
-
యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ కారు
ఫిలింనగర్ లోని రోడ్ నెంబర్ 7లో ఓ యువకుడిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారు ఢీకొంది. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతడు ఫిలింనగర్ బస్తీకి చెందినవాడుగా గుర్తించారు. అదుపు తప్పిన కారు జనం మీదకు దూసుకెళ్లిపోయింది. అందులో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. బెల్లంకొండ సురేష్ కార్యాలయంపై దాడి చేశారు. ఆయన కార్యలయానికి ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ ఘటన జరిగిన వెంటనే కారు నడుపుతున్న డ్రైవర్ మాత్రం పరారైపోయినట్లు తెలిసింది. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో కారు డ్రైవర్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. -
'రభస'తో దిమ్మతిరిగిపోయింది!
చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రభస'తో ఆ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు దిమ్మతిరిగిపోయింది. ఈ చిత్రం కారణంగా సురేష్ భారీ నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. బకాయిలు పెరిగిపోయాయి. తనయుడు శ్రీనివాస్ నటించిన 'అల్లుడు శ్రీను' విజయం సాధించినప్పటికీ అతను బయటపడలేకపోయారు. దాంతో తన కొడుకు శ్రీనివాస్ తదుపరి మూవీని నల్లమలుపు బుజ్జికి అప్పగించారు. అల్లు అర్జున్ హీరోగా తను నిర్మించిన 'రేసుగుర్రం' సినిమా హిట్‌తో బుజ్జి మంచి ఊపుమీద ఉన్నారు. బుజ్జి నిర్మించే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తమన్నా నటిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ** -
బెల్లంకొండ సురేష్, మంచు లక్ష్మిలపై పోలీస్ కేసులు
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, నటి మంచు లక్ష్మీప్రసన్నలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. డబ్బు లావాదేవీలకు సంబంధించి ఇరువురూ ఒకరిపై ఒకరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. బెల్లంకొండ సురేష్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంచు లక్ష్మిపై కేసు నమోదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, సమంత జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 'రభస' సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి నిర్మించిన 'ఊ కొడతారా...ఉలిక్కి పడతారా' సినిమా సెట్‌ను రభస చిత్రం కోసం అద్దెకు తీసుకున్నారు. దీనికి 58 లక్షల రూపాయలు ఇస్తానని సురేష్ మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆ డబ్బు ఇవ్వకపోవడంతో . తమకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి ఈ చిత్రం విడుదల చేసుకోమని మంచు లక్ష్మి గట్టిగా పట్టుబట్టారు. అంతే కాకుండా బెల్లంకొండ సురేష్ ఇంటివద్ద మంచు లక్ష్మికి చెందిన కొందరు వ్యక్తులు తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వాలని ధర్నా చేశారు.. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ వివరణ ఇస్తూ గతంలో తన బ్యానర్లో మంచు విష్ణుతో ఓ సినిమా నిర్మించేందుకు కొంత డబ్బు అడ్వన్స్ ఇచ్చానని తెలిపారు. వివిధ కారణాల వల్ల ఆ సినిమా నిర్మించలేకపోయినట్లు చెప్పారు. అందువల్ల ఆ మొత్తంలో తను ఇవ్వల్సిన మొత్తంని మినహాయించుకోమని చెప్పినట్లు తెలిపారు. అయితే విష్ణుకు ఇచ్చిన డబ్బుకు దీనికి లింక్ పెట్టవద్దని మంచు లక్ష్మి చెప్పారు. తన డబ్బు తనకు ఇవ్వమని కోరారు. చిలికి చిలికి చివరకు ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునేవరకు ఈ సమస్య వచ్చింది. -
ఈ కథకు శ్రీనివాస్ యాప్ట్ : బోయపాటి
‘‘కథకి నప్పే హీరోతో సినిమా చేయడం నా అలవాటు. నా దగ్గర శ్రీనివాస్‌కి నప్పే కథ ఉంది కాబట్టే, నా అంతట నేను అడిగాను. ఈ కథకు భారీ బడ్జెట్ అవుతుంది. అందుకే, కథ విన్నాక, తానే నిర్మిస్తానని, బయటి బేనర్లో వద్దని బెల్లంకొండ సురేశ్ అన్నారు. ‘భద్ర’ తరహాలో లవ్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఓ ప్రేమికుడు ఎలాంటి దారిలో వెళ్లాడన్నదే కథ’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేశ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వినాయక్ ద్వారా హీరోగా పరిచయం కావడం, రెండో సినిమానే బోయపాటి శ్రీనుతో చేయడం తన అదృష్టమని శ్రీనివాస్ అన్నారు. బోయపాటితో మూడు హిట్ చిత్రాలకు పని చేశానని, తమ కాంబినేషన్లో మరో హిట్ ఖాయం అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పారు. ‘అల్లుడు శీను’తో శ్రీనివాస్‌ని వినాయక్ హీరోగా నిలబెట్టారని, ఆ సినిమా విడుదలకు ముందే బోయపాటి సినిమా చేస్తాననడం ఆనందంగా ఉందని బెల్లంకొండ సురేశ్ చెప్పారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించడం ఖాయమని బెల్లంకొండ గణేశ్ అన్నారు. నవంబరులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక. ఓ ప్రత్యేక పాత్రలో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: రత్నం. -
బెల్లంకొండ ఇంటి ఎదుట మంచు లక్ష్మి అనుచరుల ఆందోళన
బంజారాహిల్స్: తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇంటి ఎదుట మంగళశారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నటుడు మోహన్‌బాబు కూతురు మంచులక్ష్మి అనుచరులు ఆందోళనకు దిగారు. మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలికిపడతారా...’ సినిమా సెట్టింగ్‌ను నిర్మాత బెల్లండ సురేశ్ రభస సినిమా కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం రూ.58 లక్షలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అనుకున్న ప్రకారం... డబ్బులు ఇవ్వడానికి బెల్లంకొండ సురేశ్ వెనుకడుగు వేశారని మంచు లక్ష్మి అనుచరులు ఆరోపిస్తున్నారు. రభస సినిమా బుధవారం విడుదలవుతుంది. తమ డబ్బులు చెల్లించిన తరువాతే సినిమా విడుదల చేసుకోవాలంటూ వీరంతా సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించారు. దీంతో ఫిలింనగర్‌లోని సురేశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
నిర్మాత బెల్లంకొండ ఇంటి ముందు మంచు లక్ష్మీ అనుచరుల ధర్నా
బంజారాహిల్స్: తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇంటి ఎదుట మంగళశారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నటుడు మోహన్‌బాబు కూతురు మంచులక్ష్మి అనుచరులు ఆందోళనకు దిగారు. మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలికిపడతారా...’ సినిమా సెట్టింగ్‌ను నిర్మాత బెల్లండ సురేశ్ రభస సినిమా కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం రూ.58 లక్షలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అనుకున్న ప్రకారం... డబ్బులు ఇవ్వడానికి బెల్లంకొండ సురేశ్ వెనుకడుగు వేశారని మంచు లక్ష్మి అనుచరులు ఆరోపిస్తున్నారు. రభస సినిమా బుధవారం విడుదలవుతుంది. తమ డబ్బులు చెల్లించిన తరువాతే సినిమా విడుదల చేసుకోవాలంటూ వీరంతా సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించారు. దీంతో ఫిలింనగర్‌లోని సురేశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
మా రెండో అబ్బాయిని కూడా హీరోని చేస్తాను!
‘‘మా అబ్బాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు శీను’ విడుదలై ఇప్పటికి మూడు వారాలైంది. ఇంకా మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది కాబట్టి, ఎన్టీఆర్ హీరోగా నేను నిర్మిస్తున్న ‘రభస’ విడుదలను వాయిదా వేశామని అనుకుంటున్నారు. కానీ, అందులో నిజం లేదు’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బెల్లంకొండ మాట్లాడుతూ- ‘‘ఈ నెల 15న ‘రభస’ను విడుదల చేయాలనుకున్నాం. కానీ, ఇంకొన్ని కార్యక్రమాలు పూర్తి కావాలి. అందుకే వాయిదా వేశాం. ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. శ్రీనివాస్‌కి బయటి సంస్థల్లో అవకాశాలు వచ్చాయని బెల్లంకొండ చెబుతూ - ‘‘మీ అబ్బాయి బాగా నటించాడని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. తొలి చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించినా, అందుకు తగ్గ వసూళ్లు రాబడుతోంది కాబట్టి, మలి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తోనే నిర్మించడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రాన్ని నా సంస్థలోనే తీయాలా? లేక బయటి సంస్థకు ఇవ్వాలా? అనేది నిర్ణయించలేదు’’ అన్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ని ఎంపిక చేశారట? అనే ప్రశ్నకు, ఇంకా కథానాయికను ఖరారు చేయలేదని చెప్పారు బెల్లంకొండ. తన రెండో కుమారుడు గణేశ్‌ని కూడా హీరోని చేయాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు.