ఇటీవల సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో మంది స్టార్ యంగ్ హీరోస్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే సీనియర్ హీరో హీరోయిన్ల పిల్లలు కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. శర్వానంద్, వరుణ్ తేజ్, అభిరామ్ వంటి పలువురు హీరోలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరి కొద్ది రోజులలో మరొక హీరో కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది
టాలీవుడ్‌లో ఇప్పుడు వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. యంగ్‌హీరోహీరోయిన్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పి వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు, హీరో నాగచైతన్య పెళ్లి నేడు(డిసెంబర్ 4)న అన్నపూర్ణ స్డూడియోలో జరగనుంది. ఇక నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ పెళ్లి కూడా త్వరలో జరగనుంది. ఈ నెలలోనే కిర్తీ సురేశ్ పెళ్లి కూడా జరగనుంది. నటుడు సుబ్బరాజు కూడా ఓ ఇంటివాడయ్యాడు. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయననే బెల్లం కొండ సాయి శ్రీనివాస్.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రినివాస్.. తొలి సినిమా అల్లుడు శ్రీనుతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవల ఈ యంగ్ హీరో నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఓకేసారి మూడు సినిమాలతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న శ్రీనివాస్.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే శ్రీనివాస్ పెళ్లి ఉంటుందని ఆయన తండ్రి బెల్లంకొండ సురేశ్ చెప్పారు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సురేశ్ మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఇద్దరు కొడుకుల(శ్రీనివాస్, గణేశ్) పెళ్లి ఎప్పుడని ఓ విలేకరి అడగ్గా.. శ్రీనివాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని చెప్పారు. ఇక గణేశ్ పెళ్లికి కాస్త సమయం ఉందని అన్నారు. శ్రీనివాస్‌ది పెద్దలు కుదిర్చిన సంబంధమేనట. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని అమ్మాయిని శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని సురేశ్ వెల్లడించారు. ఇక శ్రీనివాస్ సినిమాల విషయాలకొస్తే.. చివరగా హిందీ‘ఛత్రపతి’ సినిమాలో నటించాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమాకి హిందీ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతం ఆయన ‘బైరవం’, ‘టైసన్ నాయుడు’తో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment