Bellam konda srinivas
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో మంది స్టార్ యంగ్ హీరోస్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే సీనియర్ హీరో హీరోయిన్ల పిల్లలు కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. శర్వానంద్, వరుణ్ తేజ్, అభిరామ్ వంటి పలువురు హీరోలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరి కొద్ది రోజులలో మరొక హీరో కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోందిటాలీవుడ్లో ఇప్పుడు వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. యంగ్హీరోహీరోయిన్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పి వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు, హీరో నాగచైతన్య పెళ్లి నేడు(డిసెంబర్ 4)న అన్నపూర్ణ స్డూడియోలో జరగనుంది. ఇక నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ పెళ్లి కూడా త్వరలో జరగనుంది. ఈ నెలలోనే కిర్తీ సురేశ్ పెళ్లి కూడా జరగనుంది. నటుడు సుబ్బరాజు కూడా ఓ ఇంటివాడయ్యాడు. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయననే బెల్లం కొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రినివాస్.. తొలి సినిమా అల్లుడు శ్రీనుతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవల ఈ యంగ్ హీరో నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఓకేసారి మూడు సినిమాలతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న శ్రీనివాస్.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే శ్రీనివాస్ పెళ్లి ఉంటుందని ఆయన తండ్రి బెల్లంకొండ సురేశ్ చెప్పారు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సురేశ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇద్దరు కొడుకుల(శ్రీనివాస్, గణేశ్) పెళ్లి ఎప్పుడని ఓ విలేకరి అడగ్గా.. శ్రీనివాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని చెప్పారు. ఇక గణేశ్ పెళ్లికి కాస్త సమయం ఉందని అన్నారు. శ్రీనివాస్‌ది పెద్దలు కుదిర్చిన సంబంధమేనట. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని అమ్మాయిని శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని సురేశ్ వెల్లడించారు. ఇక శ్రీనివాస్ సినిమాల విషయాలకొస్తే.. చివరగా హిందీ‘ఛత్రపతి’ సినిమాలో నటించాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమాకి హిందీ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతం ఆయన ‘బైరవం’, ‘టైసన్ నాయుడు’తో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు. -
శరణ్ది మా ఊరే.. కావాలనే చీటింగ్ కేసు : బెల్లంకొండ సురేశ్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్, అతని తనయుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చీటింగ్ కేసుపై బెల్లంకొండ సురేశ్ స్పందించారు. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగంగా చీటింగ కేసు నమోదైందని ఆయన ఆరోపించారు. శరణ్ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ‘కొంతమంది కావాలనే నాపై, నా కొడుకుపై కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరణ్ నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శరణ్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు . నాకు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా .బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటా. నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు. నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు.నా పై చేసిన ఆరోపణల పై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్ కు నోటీసులు ఇచ్చారు. శరణ్ది మా ఊరే. పదేళ్ల క్రితం పరిచయమయ్యాడు. సినిమా టికెట్ల కోసం అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇలా నాపై ఆరోపణలు చేస్తున్నాడు. అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు. అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’అని బెల్లంకొండ అన్నారు. -
బెల్లంకొండ తమ్ముడి దూకుడు...సెట్స్‌పై మరో మూవీ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు (పవన్ సాధినేని, లక్ష్మణ దర్శకత్వాల్లో సినిమాలు ఆన్సెట్స్లో ఉన్నాయి) కమిట్ అయిన ఈ యువ హీరో తాజాగా తన మూడో చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి హీరో ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎస్.వి2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘నాంది’ ఫేమ్ నిర్మాత సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కృష్ణచైతన్య కథ, మాటలు, పాటలు అందిస్తున్నారు. చదవండి : హీరోగా దిల్‌రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్‌లుక్ రిలీజ్ నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు -
ఎవరా స్టార్ హీరో? సస్పెన్స్ వీడేదెన్నడు?
-
ఎవరా స్టార్ హీరో? సస్పెన్స్ వీడేదెన్నడు?
అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకులందరికీ దగ్గరైపోదామనుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా బాగానే ఆడటంతో తొలి సినిమాతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని ప్రశంసించారంతా! తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడా? అని అందరూ వెయిట్ చేశారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత స్పీడున్నోడు సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాడు. దీంతో ప్రేమ కథలను పక్కన పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ రూట్ ఎంచుకున్నాడు. అలా రమేశ్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడు సినిమా చేశాడు. 2019లో వచ్చిన ఈ చిత్రం బెల్లంకొండ హీరోకు సక్సెస్‌ను రుచి చూపించింది. -
రేపే ‘ఛత్రపతి’ రీమేక్ స్టార్ట్, ముఖ్య అతిథిగా రాజమౌళి
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఛత్రపతి హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 2005లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హజరుకానుండటం విశేషం. ఇక త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం శ్రీనివాస్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మరింత ఫిట్‌గా అయ్యాడు. మాస్ లుక్‌తో బెల్లంకొండ మరి హిందీ ఆడియన్స్ మెప్పిస్తాడో లేదో చూడాలి. -
బాలీవుడ్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం ఇదేనట
Sai Pallavi: విభిన్నమైన పాత్రలు, డాన్స్‌తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల ‘ఫిదా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ కుట్టి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళంలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో తాజాగా నేచురల్ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చిందట. అయితే దాన్ని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి మూవీ హిందీలో రీమేక్స అవుతున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ కాలేదు. ఇటీవల సాయిపల్లవిని కూడా సంప్రదించారట చిత్రబృందం. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ‘విరాటపర్వం’లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల నాగ చైతన్యల లవ్ స్టోరీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్‌లో కూడా సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుంది. ఇలా టాలీవుడ్లో వరుస సినిమాలతో సాయి పల్లవి ఫుల్ బిజీలో ఉంది. అందుకే బాలీవుడ్ ఆఫర్‌ని రిజెక్టు చేసిందట సాయిపల్లవి. చదవండి: సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్ కొట్టేసిన శివానీ రాజశేఖర్ మహేష్‌బాబు ఫోటోను వాడేసిన సైబరాబాద్ పోలీసులు -
Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో రీమేక్ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలోఘీ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ మూవీ రీమేక్‌తో బాలీవుడ్లో ఎంట్రీకీ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బెల్లంకొండ సరసన నటించేందుకు ఇదివరకే కొందరు స్టార్ హీరోయిన్లను సైతం సంప్రదించినా వారు మాత్రం నో చెప్పారట. దీంతో ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ చేసేందుకు అనన్య పాండే ఒప్పుకుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బెల్లంకొండ ఇప్పుడు మరో రీమేక్ చిత్రంతో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇటీవల ధనుష్ హీరోగా తమిళంలో ‘కర్ణన్’ సూపర్ రిలీజైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే బెల్లంకొండ ఈ మూవీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బెల్లంకొండ తెలుగులో నటించిన చివరి మూవీ అల్లుడు అదుర్స్’. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను రిలీజ్ చేసినా బాక్స్‌ఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టింది. దీంతో కర్ణన్ మూవీని రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. చదవండి : 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' నిర్మాతగా మారిన యంగ్ హీరో.. తండ్రితో తొలి సినిమా! -
‘అల్లుడు అదుర్స్’ మూవి స్టిల్స్
-
రియల్ హీరోకు గ్రాండ్ వెల్కమ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా, లాక్డౌన్ అనంతరం టాలీవుడ్ లో తెలుగు సినిమాల షూటింగ్ సందడి మొదలైంది. ఈ క్రమంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా మూవీ 'అల్లుడు అదుర్స్' మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లాక్డౌన్ హీరో సోనూసూద్ కు ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా రియల్ హీరో సోనూసూద్ లోకేషన్ లోకి ఎంటర్ కాగానే యూనిట్ సిబ్బంది అంతా చప్పట్లతో, ఉత్సాహంగా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రకాశ్ రాజ్ సోనూకు శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. కష్టకాలంలో వలసకార్మికులకు అండగా నిలిచిన సోనూను మనస్ఫూర్తిగా అభినందించారు.(ఏసర్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్..) బెల్లకొండ శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నడు హీరో. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన విలక్షణ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో వలస కార్మికులతోపాటు, వేలాదిమందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. కలియుగ దాన కర్ణుడుగా అడిగినవారికి కాదనకుండా తనవంతుగా సాయం చేయడమే కాదు, నిర్మాణాత్మకంగా, ఒక పథకం ప్రకారం తన కార్యక్రమాలను కొనసాగించడం విశేషంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. -
రియల్ హీరో సోనూ సూద్
-
‘సీత’ సినిమాలో పాయల్ పెప్పీ సాంగ్
హైదరాబాద్ : బోల్డ్ యాక్టింగ్, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్‌తో ఇటు కుర్రకారును, అటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న యంగ్ హీరోయిన్ 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న‘ సీత’ సినిమాలో ఒక పెప్పీసాంగ్కు స్టెప్పులేసే లక్కీ చాన్స్ దక్కించుకుందట. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో అనూప్ రూబెన్స్ స్వరపర్చిన ఈ పాటను చిత్రీకరించబోతున్నారని సమాచారం. తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సీత సినిమాలో కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. అంతేకాదు కాజల్ నెగిటివ్‌రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ చాలా కాలం తరువాత మళ్లీ టాలీవుడ్ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే పాయల్, కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ముగిసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కానున్నాయి. ఏప్రిల్ 25న ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇక్కడ వరస ఆఫర్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ సినిమా 'డిస్కో రాజా' తో పాటు, మన్మథుడు-2 మూవీలో కూడా చాన్స్ కొట్టేసింది. అలాగే కవచం సినిమా తరువాత కాజల్‌కు బెల్లంకొండతో ఇది రెండవ సినిమా. మరోవైపు ఇప్పటికే విడుదలైన సీత ఫస్ట్ లుక్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
పాఠాలు చెబుతారట
ఎక్కువగా అల్లరి పాత్రల్లో కనిపించిన అనుపమా పరమేశ్వరన్ అల్లరి చేసే పిల్లలను కంట్రోల్లో పెట్టే టీచర్ క్యారెక్టర్లో కనిపించనున్నారట. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘రాక్షసన్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్నారు. హవీష్ కోనేరు నిర్మాత. ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తమిలో అమలాపాల్ పోషించిన పాత్రను తెలుగులో అనుపమా చేయనున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ థ్రిల్లర్ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్. -
యాక్షన్ప్యాక్డ్గా ‘కవచం’ టీజర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కవచం’ . ఈ సినిమాతో శ్రీనివాస మామిళ్ల దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘భయపెట్టే వాడికి భయపడే వాడికి మధ్య కవచంలా ఒకడు ఉంటాడురా.. వాడే పోలీస్’ , ‘పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉండాలి’ అంటూ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్స్ వింటుంటే కవచం ఫుల్ టూ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా వరుసగా మాస్ ఎంటర్టెయిన్లతో అలరిస్తున్న శ్రీనివాస్ ఈ సినిమాలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
న్యాయాన్ని రక్షించే కవచం
అన్యాయాన్ని ఎదురించడానికి ఖాకీ యూనిఫామ్ వేసుకొని సిద్ధమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఆ ప్రయాణంలో ఏ జరిగిందో తెలియాలంటే ‘కవచం’ చిత్రం విడుదల వరకూ ఆగాల్సిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు శ్రీనివాస మామిళ్ల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కవచం’. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నారు. ‘‘మా సినిమా ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, డిసెంబర్లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు. ∙సాయి శ్రీనివాస్ -
గాయం.. ఓ జ్ఞాపకం
దెబ్బలు తగిలితే ఎవరైనా బాధపడతారు. కానీ ఇక్కడున్న ఫొటో చూశారుగా. హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, నీల్ నితిన్ ముఖేష్ ఎలా నవ్వుతున్నారో. ఇందుకు ఓ కారణం ఉంది. ఈ ముగ్గురూ సినిమాలో భాగంగా ఓ యాక్షన్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన తర్వాత ఇలా నవ్వుతూ ఫొటోకు ఫోజు ఇచ్చారు. ఉత్తుత్తి గాయాలే అయినప్పటికీ యాక్షన్ సీన్ అంటే కష్టమే కదా... అందుకే ఇలా రిలాక్స్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో నవీన్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. ‘‘ఇప్పుడే ఫైట్ కంప్లీట్ చేశాం. నా షూటింగ్ పూర్తయింది. నేను తెలుగులో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్రబృందం సహకారం మరచిపోలేనిది’’ అని పేర్కొన్నారు నీల్. అంటే ఈ సినిమా గాయాలు ఆయనకు ఓ మధుర జ్ఞాపకం అన్నమాట. -
ప్రకృతే సాక్ష్యం
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించారు. జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్ కీలక పాత్రలు చేశారు. హర్షవర్ధన్ రామేశ్వరన్ స్వర పరచిన ఈ సినిమా ఆడియోను జూలై 7న విడుదల చేయనున్నారు. ‘‘ప్రకృతే సాక్ష్యంగా ఈ సినిమాను రూపొందించాం. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆర్తు ఏ.విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలం. ‘బాహుబలి’ చిత్రానికి సీజీ వర్క్ చేసిన టీమ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. టైమ్ మ్యూజిక్ సౌత్ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. జూలై 20న ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కొత్త సినిమా అంటే కొత్త ఎగై్జట్‌మెంట్ వస్తుంది – సాయి శ్రీనివాస్
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని (నాని) నిర్మాణంలో శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి తెలంగాణ ఎఫ్డీసీ చైర్మెన్ పి. రామ్మోహన్రావు గౌరవ దర్శకత్వం వహించారు. సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కొత్త సినిమా అంటే కొత్త ఎగై్జట్‌మెంట్ వస్తుంది.నవీన్గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. చాలా కథలు విన్నాం. దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చింది. ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘అల్లుడు శీను’ చిత్రం తర్వాత ఛోటాగారితో, తమన్‌తో తొలిసారి వర్క్ చేయబోతున్నందుకు హ్యాపీ’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రమిది. కథ, కాన్సెఫ్ట్ కొత్తగా ఉంటాయి. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం’’ అన్నారు నవీన్. ‘‘రొమాటింక్ థ్రిల్లర్ చిత్రమిది. కథను నమ్మి అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేశ్‌గారికి కృతజ్ఞతలు.నా పై నమ్మకంతో మంచి టీమ్‌ను అందించిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకునిగా నా ప్రయాణం స్టార్ట్ చేయడానికి కారణమైన నవీన్, శాంతయ్య, సాయి శ్రీనివాస్‌కు థ్యాంక్స్. పెద్ద దర్శకులతో పనిచేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త డైరెక్టర్ అయిన నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మార్చి 2 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘కో–డైరెక్టర్‌గా ఎప్పటినుంచో శ్రీనివాస్ నాకు తెలుసు. కొత్తగా అద్భుతమైన కథ చెప్పారు. టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చెలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కెమెరామెన్ ఛోటా కె. నాయుడు. యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘బెల్లంకొండ సురేశ్ మంచి సినిమాలను నిర్మించారు. ఆయన తనయుడు శ్రీనివాస్ నటిస్తున్న ఈ సినిమా వంద రోజులు ఆడాలి. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ తొలి సినిమా హిట్ సాధించాలి’’ అన్నారు. -
చెయ్యి చూశావా... ఎంత రఫ్‌గా ఉందో?
అమ్మాయి చేతి స్పర్శ ఎప్పుడూ సుకుమారమే. అందువల్లే, ప్రేమికుడు ఎప్పుడూ ప్రేయసి చేతిలో చేయ్యేసి పులకరించిపోతాడు. అదే, ఫైటింగ్‌కి వచ్చేవాడైతే... అమ్మాయి చెయ్యి పట్టుకుని చాలా సింపుల్‌గా పక్కకు తోసేస్తారు సిన్మాల్లో! కానీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పూజా హెగ్డేను టచ్ చేయడం కాదు, కనీసం చెయ్యి పట్టుకోవాలన్నా విలన్లు భయపడుతున్నారు. ఎందుకంటే... పూజా హ్యాండ్ సాఫ్ట్ కాదు, వెరీ రఫ్. ఆమెతో ఫైటింగ్ ఇంకా టఫ్! స్కిప్ట్ అండ్ క్యారెక్టర్ ప్రకారం పూజా హెగ్డే కూడా కొన్ని స్టంట్ సీక్వెన్సుల్లో కనిపించనున్నారు. అందుకోసం, హ్యాండ్ టు హ్యాండ్ కొంబాట్, ఫిస్ట్ ఫైట్స్‌లో పూజ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ ‘డీజే’తో పాటు గత సినిమాల్లో సుకుమారంగా కనిపించిన ఈ బ్యూటీ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో ‘చెయ్యి చూశావా... ఎంత రఫ్‌గా ఉందో? రఫ్ఫాడించేస్తా’ వంటి డైలాగులు చేబుతూ ఫైట్స్ చేస్తారన్న మాట! -
బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ ప్రారంభం
-
తళుకులీనే తారలెన్నో...
సీనియర్ నట, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి దగ్గర నుంచి కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ దాకా దాదాపు ప్రతి హీరో ఇప్పుడు షూటింగ్‌లోనో, స్క్రిప్ట్ పనిలోనో బిజీగా ఉన్నారు. ప్రజాపంథా చిత్రాలకు పాపులర్ అయిన ఆర్.నారాయణమూర్తి తాజాగా అలాంటి మరో కొత్త చిత్రం పనిలో ఉన్నారు. ‘దృశ్యం’ తరువాత కొంత విరామం తీసుకున్న అగ్రహీరో వెంకటేశ్ కొత్త సినిమా షూటింగ్‌కు స్క్రిప్ట్ ఓకే చేసే పనిలో ఉన్నారు. ఇక, లేటెస్ట్ బాక్సాఫీస్ స్టుపెండస్ హిట్ ‘బాహుబలి... ది బిగినింగ్’తో ఉత్సాహంగా ఉన్న ప్రభాస్ ఈ అక్టోబర్ నుంచి ‘బాహుబలి-2’ షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమవుతున్నారు. రానా కూడా భల్లాలదేవ క్యారెక్టర్లోకి మరోసారి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. వచ్చే సమ్మర్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం (వర్కింగ్ టైటిల్ ‘రథం’ అని ప్రచారం) ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకొంటోంది. మంచు కుటుంబం నుంచి విష్ణు కొత్త చిత్రం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నారు. మంచు మనోజ్ చేసిన వర్మ సినిమా ‘ఎటాక్’ రిలీజ్‌కు రెడీ అవుతుంటే, దశరథ్ దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్ళింది. ‘భలే భలే మగాడివోయ్’తో చిన్న చిత్రాల్లో తాజా పెద్ద విజయం అందుకున్న హీరో నాని తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. తమిళ హిట్ ‘సుందర పాండియన్’కు భీమనేని శ్రీనివాసరావు రూపొందిస్తున్న తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ డెరైక్షన్‌లో ఈసారి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’గా శర్వానంద్ అలరిస్తారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ సినిమా సెట్స్‌పై ఉంది. వీటిలో కొన్ని చిత్రాలు ఈ ఏడాది ఆఖరుకు, మరికొన్ని కొత్త సంవత్సరంలో జనం ముందుకు వస్తాయి.