వై.శ్రీనివాసరావు, బెల్లంకొండ శ్రీనివాస్, నవీన్, చోటా కె.నాయుడు, శ్రీనివాస్
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని (నాని) నిర్మాణంలో శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మెన్ పి. రామ్మోహన్‌రావు గౌరవ దర్శకత్వం వహించారు.
సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కొత్త సినిమా అంటే కొత్త ఎగై్జట్‌మెంట్ వస్తుంది.నవీన్‌గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. చాలా కథలు విన్నాం. దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చింది. ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘అల్లుడు శీను’ చిత్రం తర్వాత ఛోటాగారితో, తమన్‌తో తొలిసారి వర్క్ చేయబోతున్నందుకు హ్యాపీ’ అన్నారు. ‘‘మా బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రమిది. కథ, కాన్సెఫ్ట్ కొత్తగా ఉంటాయి. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం’’ అన్నారు నవీన్.
‘‘రొమాటింక్ థ్రిల్లర్ చిత్రమిది. కథను నమ్మి అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేశ్‌గారికి కృతజ్ఞతలు.నా పై నమ్మకంతో మంచి టీమ్‌ను అందించిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకునిగా నా ప్రయాణం స్టార్ట్ చేయడానికి కారణమైన నవీన్, శాంతయ్య, సాయి శ్రీనివాస్‌కు థ్యాంక్స్. పెద్ద దర్శకులతో పనిచేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త డైరెక్టర్ అయిన నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మార్చి 2 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం.
ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘కో–డైరెక్టర్‌గా ఎప్పటినుంచో శ్రీనివాస్ నాకు తెలుసు. కొత్తగా అద్భుతమైన కథ చెప్పారు. టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చెలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కెమెరామెన్ ఛోటా కె. నాయుడు. యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘బెల్లంకొండ సురేశ్ మంచి సినిమాలను నిర్మించారు. ఆయన తనయుడు శ్రీనివాస్ నటిస్తున్న ఈ సినిమా వంద రోజులు ఆడాలి. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ తొలి సినిమా హిట్ సాధించాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment