yarapatineni srinivasa rao
-
వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దోపిడీలో భాగస్వాములై, అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఆ టీడీపీ నేతలను ఇప్పుడు అదే చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రమే సొంతమైన ‘యూజ్ అండ్ త్రో’ ఆటలో ఆ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే దిక్కు లేకుండాపోయింది. అధికారంలో ఉండగా ఈ నేతలకు సర్వాధికారాలూ ఇచ్చి, అక్రమ సంపాదనకు వారిని ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారికి టికెట్టు దక్కని పరిస్థితి కల్పించారు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరిపోయాక పక్కన పడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న నైపుణ్యం. సొంత కుటుంబం నుంచి పార్టీలో అనేక మంది నాయకుల వరకు చంద్రబాబు పాలసీకి బలైనవారే. తాజాగా ఆ కోటాలో టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు చేరిపోయారు. 2014–2019 మధ్య యధేచ్ఛగా అవినీతికి పాల్పడి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కి కప్పం గట్టిన వీరికి ఇప్పుడు సీట్లు లేకుండాపోయాయి. అప్పట్లో అధికారం తలకెక్కడంతో చంద్రబాబు చెప్పినట్లు చేసి తమ కోసం పనిచేసిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్నే హింసించారు. తద్వారా కేడర్ వ్యతిరేకతను మోయలేనంతగా మూటగట్టుకున్న ఈ నేతలు ప్రజా క్షేత్రంలో బలం కోల్పోవడంతో చంద్రబాబు వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. ఈ నేతలను పూచికపుల్లల్లా తీసి పక్కన పడేశారు. జలవనరులను దోచి ఇచ్చినా ఉమాను పక్కన పెట్టిన బాబుఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు నిరాకరించడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చంద్రబాబుకు అత్యంత విధేయుడు, సుదీర్ఘకాలం కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్నా ఎవరూ ఆయన గురించి ఒక్క మంచి మాట చెప్పరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టును దోపిడీకి ఉపయోగించుకున్నారు. ఇతర సాగు నీటి ప్రాజెక్టుల్లోనూ అవినీతిని పారించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ అందిన కాడికి దండుకుని వేల కోట్లు పోగేశారు. ఆ అక్రమ సంపాదనను చంద్రబాబు, లోకేశ్‌కి కట్టబెట్టి వారి మెప్పు పొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో అవినీతి పిచ్చిలో మునిగిపోయిన ఉమ తన కేడర్, నేతలను వదిలేశారు. జిల్లాలో ఇతర నాయకులు, సీనియర్లను కూడా ఇబ్బంది పెట్టారు. జిల్లా పార్టీలో తానే సర్వం అయ్యారు. పని మీద వెళ్లిన పార్టీ నేతలను అవమానించారు. దీంతో నియోజకవర్గం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయింది. దీంతో బాబు ఆయన్ని పక్కన పెట్టేశారు. అప్పట్లో తనకు ఎంత సహకరించినా, అవినీతి సొమ్ములో కమీషన్లు కట్టినా చంద్రబాబు కనికరించలేదు. గంటాతో భూకుంభకోణాలు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవకాశవాద రాజకీయానికి, అవినీతికి నిలువెత్తు రూపమైనా చంద్రబాబుకు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారు. గంటా ద్వారా చంద్రబాబు విశాఖలో ఊహించని రీతిలో భూ దందాలు చేయించారు. విశాఖ జిల్లావ్యాప్తంగా నానా బీభత్సం సృష్టించారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిన ప్రతిచోటా గంటా పేరు వినిపించేది. దీంతో పార్టీలో, జనంలోనూ ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇక గంటాతో ఉపయోగం లేదనుకున్న చంద్రబాబు ఈసారి విశాఖలో సీటు లేదని కరాఖండిగా చెప్పారు. ఏకంగా జిల్లా దాటించి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించారు. దీంతో గంటా ఏమి చేయాలో పాలుపోక చింతిస్తున్నారు. అన్ని విధాలుగా వాడుకుని చింతమనేనికే ఎసరు టీడీపీలోని పాపులర్ నాయకుల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైపు చూసేందుకే నేతలు, ప్రజలు భయపడేవారు. పోలవరం కాలువ గట్లపై యధేచ్ఛగా మట్టిని తవ్వి అమ్మేసి డబ్బు దండుకున్నారు. తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా తవ్వి కనీవినీ ఎరుగని రీతిలో సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన అనధికారిక మంత్రిగా వ్యవహరించారు. అంతటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడికి చింతమనేని క్రమం తప్పకుండా కప్పం కట్టారు. వారి అండ చూసుకుని చింతమనేని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను అల్పులుగా చూశారు. ఇసుకను అక్రమంగా తవ్వద్దని అడ్డపడినందుకు మహిళా తహసీల్దార్‌పైనే దాడి చేసిన ఘనుడు. దానికి చంద్రబాబు వంతపాడి తహశీల్దార్నే తప్పుపట్టి రాజీ చేశారు. ఇలా అనేక దౌర్జన్యాలకు పాల్పడిన చింతమనేనిపై 40కిపైగా కేసులున్నాయి. వీటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా గొడవలకు వెళ్లడం, రౌడీయిజంతో భయపెట్టడంతో జనం ఆయన్ని 2019లో ఓడించి కసి తీర్చుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకు సీటిస్తే పని చేసేది లేదని చెప్పడంతో చంద్రబాబూ ఆయన్ని వదిలించుకోవాలనుకున్నారు. దెందులూరు సీటు ఇవ్వనని చెప్పేశారు.యరపతినేనితో గనుల దోపిడీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ డాన్‌గా పేరుపొందారు. లోకేశ్ అండతో ఆయన అక్రమ మైనింగ్‌లో రికార్డులు సృష్టించారు. గనులను కొల్లగొట్టి ఆ సొమ్మును లోకేశ్, చంద్రబాబుకు పంచిపెట్టారు. సొంత పార్టీ నేతలే ఆయన అక్రమ మైనింగ్ చూసి నివ్వెరపోయారు. అధికారులను కూడా బెదిరించి లొంగదీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గుంటూరు జిల్లాలో తానే హోంశాఖ మంత్రి అనేలా పరిస్థితిని తయారు చేశారు. చంద్రబాబు ఇచ్చిన అధికార బలంతో పోలీసు అధికారులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. చివరికి ఆయన పాపం పండి అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇవన్నీ చూసి పార్టీ కేడరే విసుగెత్తిపోయింది. సొంత నియోజకవర్గంలో ప్రజలు, కేడర్ వ్యతిరేకం కావడంతో చంద్రబాబుకు యరపతినేని కరివేపాకు అయ్యారు. ఆయనకు సీటును డౌటులో పెట్టారు. టికెట్టు ఇస్తారో లేదో తెలియక యరపతినేని గందరగోళంలో ఉన్నారు. -
సీనియర్ల మౌనం.. సందేహం!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కీలకంగా పని చేయాల్సిన తరుణంలో ముఖం చాటేయడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వారు పార్టీ వీడే ఆస్కారమూ ఉందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పూర్తి దూరంగా పుల్లారావు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ ముఖ్యనేత ప్రత్తిపాటి పుల్లారావు కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తితో బయటకు రావడంలేదు. ఆయన ఇన్చార్జిగా ఉన్న చిలకలూరిపేట సీటును వేరే వారికి ఇచ్చేందుకు యత్నించడంతో ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికీ రావడంలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపైనా స్పష్టత లేదు. గతంలో ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. పరపతి తగ్గిన యరపతినేని! పల్నాడుకు చెందిన మరో కీలక నేత యరపతినేని శ్రీనివాసరావుకు పార్టీలో పరపతి పూర్తిగా తగ్గిందని సమాచారం. ఫలితంగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గురజాల నుంచి పోటీ చేస్తారో లేదో అనే సందిగ్ధం నెలకొంది. అయ్యో.. ‘చింత’కాయల ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా పార్టీ వ్యవహారాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు విజయ్ కూడా ఇప్పుడు అంత క్రియాశీలకంగా లేరని సమాచారం. గతంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్‌కు ఇన్చార్జిగా ఉన్న విజయ్ను తప్పించి ఆ బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి టీడీపీకి, అయ్యన్న కుటుంబానికి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వారికి నచ్చడంలేదని చెబుతున్నారు. లోకేశ్ తీరే కారణమా..? ఇలా సీనియర్లంతా పార్టీపై అసంతృప్తితో మౌనంగా ఉండడానికి చినబాబు లోకేశ్ తీరే కారణంగా తెలుస్తోంది. ఆయన సీనియర్లను దూరం పెట్టడంతోపాటు వారికి వ్యతిరేకంగా జూనియర్లను ఎగదోయడం అసంతృప్తి జ్వాలలను పెంచిందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి, యరపతినేని తదితర సీనియర్ నేతలు పార్టీని వీడే ఆస్కారం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోలోన రగులుతున్న మరింత మంది మరింత మంది సీనియర్లు లోకేశ్ తీరు కారణంగా లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడప్పుడూ మీడియాలో ఘీంకరించడం తప్ప నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండడం లేదు. ఆయన్ను పార్టీ క్యాడర్ పట్టించుకోవడంలేదు. అసమ్మతి పెరిగిపోవడంతో ఈసారి ఆయనకు సీటు లేదని లోకేశ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన మిన్నకుండిపోయారు. ఏలూరు జిల్లాలో కీలక నేత చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ వంటి నేతలూ చురుగ్గా ఉండడంలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడూ మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. లోకేష్ కోసం ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే కాకుండా తరచూ మీడియా సమావేశాలు కూడా నిర్వహించనీయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన పత్రికా ప్రకటనలతో అచ్చెన్న సరిపెట్టుకుంటున్నారు. పేరుకు అధ్యక్షుడైనా లోకేష్ ఆయన్ను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని లోలోపల ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఇంకా చాలామంది సీనియర్లు ఇలాగే స్తబ్దుగా ఉండడంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోకపోవడం, లోకేశ్ వ్యవహార శైలితో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
రూటు మార్చిన యరపతినేని
-
యరపతినేని నివాసాల్లో సీబీఐ దాడులు
సాక్షి, అమరావతి/దాచేపల్లి(గురజాల): టీడీపీ పాలనలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల నివాసాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) గురువారం మెరుపు దాడులు చేసింది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు గుంటూరు జిల్లా గురజాల, పిడుగురాళ్ల, నడికుడి, నారాయణపురం, కేసానుపల్లి తదితర 25 ప్రాంతాల్లోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము జరిపిన సోదాల్లో అనేక ఆధారాలతో పాటు పలు కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 17 కేసులపై దర్యాప్తు.. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులు 17 మంది సాగించిన అక్రమ సున్నపురాయి తవ్వకాలపై నమోదైన 17 కేసులపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని కేసానుపల్లి, నడికుడి, కోనంకి గ్రామాల పరిధిలో నిందితులు అక్రమ మైనింగ్, క్వారీ తవ్వకాలు, విలువైన సున్నపురాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. పెద్ద ఎత్తున సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారు. 2014 నుంచి 2018 వరకు అనేక లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేశారు. మొత్తంగా అనేక కోట్ల రూపాయల మేర విలువైన సహజ వనరులు దోచుకున్నారు. ఈ వ్యవహారంపై వేగంగా దర్యాపు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. శాటిలైట్ చిత్రాలతో నష్టం అంచనా.. అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నష్టం అంచనా వేయడానికి దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ చిత్రాలను ఉపయోగించుకుంటోంది. అక్రమ మైనింగ్‌కు ముందు, ఆ తర్వాత.. శాటిలైట్ చిత్రాలను తీసుకొని వాటిని సాంకేతిక పద్ధతుల్లో పరిశీలించి ఏ మేరకు అక్రమ మైనింగ్ చేశారనే దానిని సీబీఐ అంచనా వేస్తోంది. కాగా, సీబీఐ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకున్న కొందరు నిందితులు పరారైనట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. -
యరపతినేని అనుచరులపై సీబీఐ కేసు
-
గుండెల్లో రాయి
సాక్షి, అమరావతి/గుంటూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో పల్నాడు ప్రాంతంలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గురజాల నియోజకవర్గంలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకున్నారు. వందల కోట్ల రూపాయలను దండుకున్నారు. మైనింగ్ మాఫియాలో ప్రధాన నిందితుడుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతోపాటుగా మరి కొందరిని బాధ్యులుగా చేస్తూ గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగించారు. టీడీపీ అండదండలతో యరపతినేని అప్పట్లో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో హైకోర్టు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో సీబీఐ అధికారులు అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించిన దర్యాప్తు నివేదికలను సీఐడీ అధికారుల నుంచి స్వాధీనం చేసుకోనున్నారు. వెలుగు చూసిందిలా.. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ వ్యవహారంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదిలో అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టింది. అయితే అప్పట్లో అధికార పార్టీ ఆదేశాలతో మైనింగ్ మాఫియాకు పాల్పడిన వారిని సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టలేదు. అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు ఆదేశంతో విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌పై 17 కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్లు, కూలీలు, మిల్లర్లు, ఇతర వ్యక్తులను సీఐడీ అధికారులు విచారించారు. సుమారు 700 మందిని విచారించి వారి నుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఆయా కేసుల్లో కీలకమైన సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచి సెక్షన్ 164 ప్రకారం మొత్తం 24 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు పరిధిలో ఉన్న కేసులను సీఐడీ అధికారులు ఉపసంహరించుకున్నారు. రోజుల వ్యవధిలో... నెల రోజుల క్రితం సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం సీఐడీ అధికారులు అయా కేసుల వారీగా వారు జరిపిన దర్యాప్తు పత్రాలను సిద్ధం చేశారు. ఎప్పుడు సీఐడీ అధికారులు వచ్చినా అన్ని పత్రాలను అందచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారం రోజుల్లో సీఐడీ అధికారులు వచ్చి కేసుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అక్రమార్కుల గుండెల్లో వణుకు కేసు సీఐడీ అధికారులకు వెళుతున్న విషయం తెలుసుకున్నప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపాటు అక్రమ మైనింగ్‌లో భాగస్వాములైన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ హయాంలో బినామీల పేరిట దాచుకున్న సొత్తునంతా కక్కిస్తారని భయపడుతున్నారు. ఎప్పుడు తమను విచారణకు పిలుస్తారోనని వణికిపోతున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన వందల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్‌కు వెళతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. -
పల్నాడులో టీడీపీ నీచ రాజకీయాలు!
సాక్షి, అమరావతి, గుంటూరు : నిన్నటి వరకూ అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, కే–ట్యాక్సులతో అట్టుడికిన పల్నాడు ప్రాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రశాంతంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రపూరితంగా ప్రశాంత పల్నాడులో చిచ్చుపెట్టే చర్యలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి వంతపాడుతూ నీచ రాజకీయాలకు తెరదీశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు పల్నాడులో సాగించిన ఫ్యాక్షన్ రాజకీయాలను విస్మరించి, ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ దిగజారుడు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. యరపతి నేని శ్రీనివాసరావు, కోడెల కుటుంబం పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలతో నష్టపోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఆత్మకూరు వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మిని మంగళవారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. ‘‘ సత్తెనపల్లిలో గొడుగుల సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన 17 ఎకరాల పొలాన్ని కోడెల కుమారుడు లాగేసుకున్నాడు. కోళ్లఫారాన్ని ఆక్రమించి అక్కడ ఉన్న కోళ్లు తిన్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతనిని ఊరు విడిచిపెట్టి వెళ్లాని కోడెల శివరామ్ బెదించాడు. అప్పుడు మేము వెళ్లి సుబ్బారావును సత్తెనపల్లి రావాలని పిలిస్తే అతను భయపడి రాలేదు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఇక్కడకు వచ్చి పొలాన్ని తీసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాడ’ని’ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో ఓ హోటల్లో చంద్రబాబు దొంగ నాటకాలపై మంత్రి మోపిదేవి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించారు. టీడీపీ పాలనలో బాధితులను తీసుకుని ఆత్మకూరు వెళ్ళాలని నిర్ణయించారు. గుంటూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయల్దేరేలా కార్యచరణ రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రితో కలిసి ఆయన మాట్లాడారు. సత్తెనపల్లిలో అచ్చయ్య అనే వ్యక్తి నుంచి స్కూల్ బిల్డింగ్ పర్మిషన్ కోసం కోడెల కుటుంబం రూ. 20 లక్షలు వసూలు చేసిందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి రూ. 10 లక్షలు ఇచ్చారని తెలిపారు. అక్రమ మైనింగ్‌పై ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్సీ టీజీవీ.కృష్ణారెడ్డిపై కేసులు బనాయించారని, గురువాచారిని చిత్రహింసలు పెట్టారని గుర్తు చేశారు. ఇలా అరాచకపాలన సాగించారు. అందుకే భాదితులతో కలిసి ఆత్మకూరు వెళుతున్నామని, వీరందరికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని, కోడెల బాధితులకు డబ్బులు ఇప్పించాలని కోరారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, దుర్గి, గురజాల ప్రాంతాల్లోని బాధితులంతా గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వస్తారని, వారందరితో కలిసి ఆత్మకూరుకు వెళతామని తెలిపారు. యరపతినేని, కోడెల, పుల్లారావు, జీవీ ఆంజనేయులు చాలా ఆరాచకాలకు అంతు లేదన్నారు. బాబు పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన రాజకీయ హత్యలను మంత్రి మోపిదేవి వెంకటరమణరావు సాక్ష్యాలతో వివరించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిసి ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకటరోశయ్య, షేక్ ముస్తఫా, మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నేతలు కావటి మనోహర్‌నాయుడు, డైమండ్‌బాబు, పానుగంటి చైతన్య, టీడీపీ బాధితుడు గొడుగుల సుబ్బారావు, అచ్చయ్య పాల్గొన్నారు. రాజకీయాల కోసం పల్నాడులో చిచ్చుపెట్టొద్దు పల్నాడు ప్రజలు అభివృద్ధి, శాంతి గురించి ఆలోచిస్తున్నారని, రాజకీయాల కోసం చిచ్చుపెట్టొద్దని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హితవు పలికారు. వరికపూడిసెల, గురజాలలో వైద్యశాల, నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఐదేళ్లల్లో బాబు దొంగ దీక్షలు, దొంగ హామీలతో కాలం గడిపారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసే 23 సీట్లతో పక్కన పెట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా, అంబటి రాంబాబులపై దాడి చేస్తే అప్పుడు న్యాయం ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టి వేధించారని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపై దాడి చేయించారని తెలిపారు. – శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ, నరసరావుపేట టీడీపీ పాలనలో గ్రామాలు విడిచి వెళ్లారు తెలుగుదేశం పాలనలో అనేక మంది గ్రామాలు విడిచి, గుంటూరులో కూలీలుగా మారారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి గ్రామాలను వచ్చారని తెలిపారు. బొల్లాపల్లిలో ఇద్దరు అన్నదమ్ములను చంపారని గుర్తు చేశారు. తన ఫ్యాక్టరీ మూయించి, తనను జీపులో ఎక్కించారని, 72 ఏళ్ల మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై రేప్ కేసు పెట్టించారని, ఇవన్నీ దారుణాలు కావా అని ప్రశ్నించారు. – బొల్లా బ్రహ్మనాయుడు , వినుకొండ ఎమ్మెల్యే కోడెల, యరపతినేనిని తీసుకురావాలి టీడీపీ ఐదేళ్ల పాలనలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఛలో ఆత్మకూరుకు తాము తెలుగుదేశం పార్టీ బాధితులతో కలిసి వస్తామని, చంద్రబాబు మాత్రం కోడెల కుటుంబం, యరపతినేనిని తీసుకొస్తే చాలని పేర్కొన్నారు. ఐదేళ్లల్లో ఏం జరిగిందో, మూడు నెలల్లో ఏం జరిగిందో చర్చిద్దామని బాబుకు సవాల్ విసిరారు. – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే -
‘యరపతినేని’.. ఆ ఐదేళ్లూ అరాచకమే!
సాక్షి, గుంటూరు: ‘‘గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తమ్ముళ్లు రెచ్చిపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారు. కుక్కను కొట్టారని, ఇంటి ముందు ఉమ్మి వేశారని ఇలా చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించుకు తిన్నారు. ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాం. ఆ కష్టాలు, బాధలు పగవారికి కూడా రాకూడదు’’ అంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకుల నుంచి దాడులకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఇతర వర్గాలకు చెందిన ప్రజలను హోం మంత్రి సుచరిత శనివారం పరామర్శించారు. కార్యక్రమానికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీలకతీతంగా వందల మంది ప్రజలు కార్యక్రమానికి హాజరై గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తాము పడ్డ కష్టాలు, బాధలను హోంమంత్రికి తెలియజేశారు. వైఎస్సార్ సీపీకి అండగా ఉన్నారని అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారని బాధితులు చెప్పుకున్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తన, మన అనే బేధాలు లేకుండా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దోచుకున్నారని బాధితులు ఆరోపించారు. తమ మైనింగ్ క్వారీని యరపతినేని అనుచరులు కబ్జా చేస్తే అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సరిపూడి మల్లికార్జునరావు కుమారుడు బుజ్జి హోం మంత్రికి చెప్పుకున్నారు. మైనింగ్‌క్వారీ విషయంలో యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేక ఒకానొక సందర్భంలో తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు వివరించారు. ఇదే తరహాలో అనేక మంది బాధితులు యరపతినేని, ఆయన అనుచరుల అరాచకాలను, వేధింపులను గుర్తు చేశారు. భరోసా ఇచ్చిన హోం మంత్రి సుచరిత : గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల వేధింపులకు గురైన బాధితుల కష్టాలు, బాధలు విన్న హోం మంత్రి వారికి భరోసా ఇచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పార్టీ నాయకులపై నమోదు అయిన కేసులపై పునఃవిచారణ చేపడతామని వాగ్ధానం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల, పట్టణ కన్వీనర్లు చల్లా పిచ్చిరెడ్డి, చింతా వెంకటరామారావు, షేక్ జాకీర్ హుస్సేన్, సిద్ధాడపు గాంధీ, చౌదరి సింగరయ్య, మునగా పున్నారావు, అన్నారావు, జెడ్పీటీసీలు మాజీ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రేపాల శ్రీనివాసరావు, వివిధ విభాగాల నాయకులు కేవీ, కాలే మాణిక్యరావు, చింతారెడ్డి సుబ్బారెడ్డి, వున్నం నాగమల్లికార్జునరావు పాల్గొన్నారు. పల్నాడు ప్రతిష్టను దిగజార్చవద్దు పల్నాడు ప్రాంతంలో ఏదో జరగబోతుందని మాజీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం కోసం పల్నాడు ప్రతిష్టతను దిగజార్చవద్దు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. –శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ యరపతినేని, కోడెల బందిపోట్లు గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్‌రావు బందిపోట్లు వలే ఐదేళ్ల పాటు అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. కుందుర్తి గురవాచారి వంటి వారిని హింసించారు. –కాసు మహేష్‌రెడ్డి, గురజాల ఎమ్మెల్యే రాజకీయ స్వార్థంతో విమర్శలు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయ స్వార్థంతో విమర్శలు చేస్తున్నారు. కోడెల శివప్రసాదరావు, యరపతినేని ఎక్కడ తలదాచుకున్నారో చంద్రబాబుకు మాత్రమే తెలుసు. నిజాలను అసత్యాలుగా చూపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. –పి.రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ వారిని వెంటపెట్టుకుని పల్నాడుకు రావాలి చంద్రబాబుకు ధైర్యం ఉంటే పల్నాడు పర్యటనకు యరపతినేని, కోడెలను వెంటపెట్టుకుని రావాలి. యరపతినేని తప్పుడు కేసులతో అనేక మందిని వేధించారు. అక్రమ మైనింగ్‌పై ఉద్యమాలు చేసిన తనపై కూడా వేధింపులు కొనసాగించారు. వాటిని లెక్కచేయకుండా పోరాటం చేశాం. –జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ 20 కేసులు పెట్టారు అక్రమ మైనింగ్‌పై కోర్టును ఆశ్రయించిన తనపై హత్య కేసులు, రేప్ కేసులు పెట్టించి బెదిరింపులకు యరపతినేని దిగారు. ఐదేళ్లలో తనపై 20కిపైగా కేసులు పెట్టించారు. చంద్రబాబు గొంతుచించుకుని కేకలు వేసినంత మాత్రన నిజాలు అబద్ధాలు కావు. చౌకబారు విమర్శలు మానుకోవాలి. –టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆత్మహత్య చేసుకునేంతగా.. యరపతినేని గెలుపు కోసం పనిచేశాం. మాకు దాచేపల్లి మండలంలోని కేశానుపల్లి గ్రామంలో క్వారీ ఉంది. యరపతినేని శ్రీనివాసరావు అనుచరులైన నెల్లూరి శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు అక్రమంగా క్వారీలోకి చొరబడ్డారు. యరపతినేని మమ్ములను బెదిరించారు. –గడిపూడి బుజ్జి, మాజీ ఎమ్మెల్యే తనయుడు ఎస్సీ, ఎస్టీ కేసు మాచర్లలో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. తాను చేసే కాంట్రాక్ట్ పనుల్లో మామూళ్లు ఇవ్వలేదని నాపై 2014లో మెుదటి సారిగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారు. తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానని ఇంత కక్ష సాధింపు చర్యలు ఇప్పటి వరకు చూడలేదు. –ఉన్నం నరసింహారావు, కాంట్రాక్టర్ -
సీబీఐ విచారణతో టీడీపీలో ఉలికిపాటు
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి, పిడుగురాళ్ల మండలం కొనంకి, సీతారామపురంలో ఐదేళ్లపాటు యథేచ్ఛగా జరిగిన అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సీబీఐ విచారణకు ఆమోదం తెలపటంతో టీడీపీ నేతలు హడలెత్తిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు జోరుగా జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా 32 లక్షల టన్నుల ఖనిజ సంపద దోచుకున్నారని లోకాయుక్త, సీబీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయలకు గండికొట్టారని విచారణలో తేలింది. తాజాగా రాష్ట్ర మంత్రి వర్గం భేటీలో సీబీఐ విచారణకు అంగీకారం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకోవటంతో స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ విచారణ జరిగితే అక్రమ మైనింగ్ వ్యవహారంలో పూర్తిస్థాయి నిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొంటున్నారు. ఇది చదవండి : యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’ తిన్నదంతా రాబట్టాల్సిందే.. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర నుంచి యరపతినేని వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ రోజు అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అక్రమ మైనింగ్‌లో తిన్నదంతా కక్కితీరాల్సిందే. అక్రమ మైనింగ్ వలన ప్రభుత్వం, ప్రజలకు జరిగిన నష్టం వడ్డీతో సహ వసూలు చేయాలి. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాల్సిందే. –షేక్ జాకీర్‌హుస్సేన్, దాచేపల్లి అక్రమార్కులను బయటపెట్టాలి అక్రమ మైనింగ్ వ్యవహారంలో టీడీపీ నాయకులు చేసిన అక్రమాలన్నింటినీ బయటపెట్టాలి. సీఐడీ విచారణ పూర్తిస్థాయిలో అక్రమాలను గుర్తించలేకపోయారు. సీఐడీ విచారణపై కూడా అనుమానాలు లేకపోలేదు. సీబీఐ విచారణ ద్వారానే అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నాం. –మోమిన్ నాగుల్‌మీరా, కేసానుపల్లి -
యరపతినేనికి షాక్..
-
యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతో పాటు మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని కోరాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావిం చారు. యరపతినేని మైనింగ్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారని, ఈ పిటిషన్‌పై తీర్పును వెలువరించాల్సి ఉందని ఆయన ధర్మాసనానికి గుర్తు చేశారు. ఇప్పుడు ఈ కేసులో కోర్టు తీర్పు అవసరం లేదని, ప్రభుత్వమే యరపతినేని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించిందని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు అధికారిక సమాచారం ఇచ్చారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గత విచారణలో కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను.. ఈ కేసులో భారీ అక్రమాలు జరిగినట్లు లభించిన ప్రాథమిక ఆధారాలను.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావడంతో సీఐడీ దర్యాప్తును కొనసాగిస్తే అది కక్ష సాధింపుగా భావించేందుకు అవకాశం ఉందని.. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించిందని చెప్పారు. అందువల్ల టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రీ ఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు కృష్ణారెడ్డి వ్యాజ్యాన్ని సోమవారం రీ ఓపెన్ చేస్తామని తెలిపింది. యరపతినేని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని, కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం యరపతినేని అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరే ఎందుకు కోరకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించింది. -
యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్షులు
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు ధర్మాసనం సీఐడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 మంది సాక్షులు యరపతినేనికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చినా అతన్ని ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని నిలదీసింది. లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం తరలిపోవడమంటే.. అధికారుల సహకారం లేకుండా సాధ్యమయ్యే పనే కాదని, ఆ అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాగ్ దాఖలు చేసిన కౌంటర్లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో గనుల శాఖ అధికారులు సక్రమంగా పని చేయలేదని తేల్చి చెప్పిందని వివరించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 31,30,420 మెట్రిక్ టన్నుల అక్రమ మైనింగ్ జరిగిందని వివరించారు. రూ.20.16 కోట్ల సీనరేజీ ఎగవేశారని తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. -
పల్నాడు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే మైనింగ్ దందా
సాక్షి, గుంటూరు: ఒకప్పుడు అప్పులు తప్ప ఆస్తులు లేవు.. ఆంధ్రా సీడ్స్‌కు అప్పులు ఎగ్గొట్టిన చరిత్ర అతనిది.. 2014 సంవత్సరానికి ముందు ఎన్నికల నిర్వహణ ఖర్చులు పెట్టుకోవడానికి ఇబ్బందులు పడ్డ వ్యక్తి ఆయన.. చివరకు కార్యకర్తల చందాలతో గెలుపొందాడు. అనంతరం ఐదేళ్ల టీడీపీ పాలనలో పల్నాడులో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడు. రూ.వేల కోట్ల ఖనిజ సంపదను దోచేశాడు. ఇలా దందాకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాపం పండింది. అక్రమ మైనింగ్ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజ వనరులను దోచుకున్న యరపతినేని, ఆయన అనుచరుల అస్తులను జప్తు చేస్తారని ప్రచారం సాగుతోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలో కోనంకి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కేశానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్ టన్నుల తెల్లరాయి (లైమ్ స్టోన్)ని దోచేశారు. యరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్‌పై గత ఏడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ అక్రమ మైనింగ్‌పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను షీల్డ్ కవర్లో గత సోమవారం అధికారులు హైకోర్టు ముందుంచారు. మనీ ల్యాండరింగ్ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించకూడదో తెలపాలంటూ ధర్మాసనం యరపతినేనని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు విచారణను కోరే వ్యవహారంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గుండెల్లో రైళ్లు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు బదలాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏడాదిపాటు అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీలు అక్రమ మైనింగ్ కారణంగా రూ. వేల కోట్లు గడించినట్టు గుర్తించారు. మైనింగ్ మాఫియాలో కీలక సభ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు మొదలైన వ్యక్తులు యరపతినేని బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. గత ఐదేళ్లలో వీరందరూ అక్రమ మైనింగ్ కారణంగా రూ. కోట్లు సంపాదించినట్టు దర్యాప్తులో వెలువడినట్టు పోలీస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు బదలాయిస్తున్నట్టు తెలుస్తుండటంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తును అప్పగిస్తే ఆయా సంస్థలు అక్రమంగా సంపాదించిన ఆస్తులను అటాచ్ చేస్తాయని మైనింగ్ మాఫియా సభ్యులు భయపడుతున్నారు. -
యరపతినేని అక్రమ మైనింగ్‌పై కేంద్ర దర్యాప్తు కోరవచ్చుగా?
సాక్షి, అమరావతి/సాక్షి అమరావతి బ్యూరో: టీడీపీ నేత, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరే ఎందుకు కోరకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసి తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ యరపతినేని శ్రీనివాసరావు స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండ మోడులతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఎటువంటి అనుమ తులు తీసుకోకుండా అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు చేస్తున్నారని, అలాగే రూ.31 కోట్ల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ ఛార్జీలు ఎగవేశారంటూ గతంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ సీల్డ్ కవర్లో ధర్మాసనం ముందుంచారు. నిబంధనలకు విరుద్ధంగా యరపతినేని భారీ ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని తేలిందని ఏజీ చెప్పారు. ఈ వ్యవహారంలో 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 24 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. దర్యాప్తు వేగంగా ఎందుకు సాగడం లేదని ప్రశ్నించింది. పలు శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోందని, మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు జరపాల్సి ఉందని శ్రీరామ్ వివరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేస్తే సాంకేతిక అంశాల్లో కూడా వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయాలని ఎందుకు కోరకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, తాము అలా కోరడం సబబు కాదని ఏజీ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడానికి తమ ముందున్న వ్యాజ్యమే అడ్డమని భావిస్తే, ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రమార్కులకు శిక్ష తప్పదు –కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గురజాల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ ద్వారా అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ వ్యక్తికి శిక్ష తప్పదు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి. మనీలాండరింగ్, అక్రమ ఆస్తులు తదితర అంశాలపై లోతుగా విచారణ చేయాలి. వ్యవస్థలను భ్రష్టు పట్టించి అడ్డగోలుగా సంపాదించినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది –టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డవారు చట్టానికి అతీతులు కాదు. వీరి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులో న్యాయం జరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభిస్తుంది. తద్వారా గ్రామాలకు మైనింగ్ సెస్ వచ్చి అవి అభివృద్ధి చెందుతాయి. యరపతినేని అక్రమ మైనింగ్ కేసు పూర్వాపరాలివీ.. – టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని కోనంకి, కేశానుపల్లి, నడికుడి, తదితర క్వారీల్లో 96 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయిని లీజులు తీసుకోకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా తవ్వుకున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు – ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ – అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో 2015లో పిల్ దాఖలు చేసిన గురజాలకు చెందిన కె.గురవాచారి – అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని, అక్రమంగా తరలించిన ఖనిజానికి రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయాలని 2016లో ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు – అసలు నిందితుడు యరపతినేనిని వదిలేసి అనామకులైన నలుగురిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్న మైనింగ్ అధికారులు – ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారో లెక్కపెట్టని వైనం. రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయకుండా నిర్లక్ష్యం – అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తాన్ని ధ్రువీకరించిన లోకాయుక్త – హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలను టీడీపీ సర్కార్ తేలికగా తీసుకోవడంతో అక్రమ మైనింగ్‌పై శాటిలైట్ చిత్రాల ద్వారా ఆధారాలు సేకరించి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి – గతేడాది హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు సీఐడీకి అప్పగించిన టీడీపీ సర్కార్ – 33 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయి అక్రమ మైనింగ్ జరిగినట్లు, రాయల్టీ, పెనాల్టీ రూపంలో రూ.156 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు తేల్చిన భూగర్భ గనుల శాఖ -
యరపతినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
మైనింగ్ మాఫియా ఒంట్లో వణుకు మొదలైంది. అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరులను కొల్లగొట్టిన ఘనుల బండారం బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకపర్వానికి తెర తీసిన అక్రమార్కులకు కళ్లెం పడబోతోంది. చట్టాలను తుంగలో తొక్కి పచ్చ చొక్కాలకు సలాం కొడుతూ గులాంగిరి చేసిన అధికారులను నడిరోడ్డుపై నిలబెట్టనుంది. పల్నాడు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన మైనింగ్ దందా గుట్టురట్టవుతోంది. యరపతినేనితో సహా ఆయనకు సహకరించిన పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికార యంత్రాంగానికి ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సాక్షి, గుంటూరు: మైనింగ్ మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. అక్రమ మైనింగ్‌కు పాల్పడి ప్రకృతి సంపదను దోచుకున్న వాళ్లపై కేసుల రూపంలో ఉచ్చు బిగుస్తోంది. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. చట్టాలను తమ చుట్టాలుగా భావిస్తూ తప్పుల మీద తప్పుల చేస్తూ పోయిన పచ్చపార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని అందరూ అంటున్నారు. అక్రమ మైనింగ్‌పై 2015లో హైకోర్టును ఆశ్రయించినందుకుగాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అప్పటి సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లు, అప్పటి ఆర్డీవో, మైనింగ్ ఏడీలు తనను వేధింపులకు గురిచేసి, చంపాలని చూశారని వైఎస్సార్ సీపీ నాయకుడు కుందుర్తి గురువాచారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు యరపతినేని సహా 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో సంచలనంగా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగింది. రూ.వేల కోట్ల విలువ చేసే లైమ్ స్టోన్ (సున్నం రాయి) నిక్షేపాలు అప్పటి ఎమ్మెల్యే యరపతినేని అండదండలతో మైనింగ్ మాఫియా కొల్లగొట్టిందన్న ఆరోపణలున్నాయి. దర్యాప్తు ప్రారంభం.. యరపతినేని, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు వ్యతిరేకంగా అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం) వేసిన కోపంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, రౌడీలు, సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లతో మానసికంగా, శారీరకంగా వేధించి చంపేందుకు యత్నించారని గురువాచారి ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో యరపతినేని సహా 12మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. 2016లో గురువాచారిని వేధింపులకు గురిచేసిన ఘటనపై ఇటీవల కేసు నమోదు కావడంతో మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరెస్టుల భయం.. పల్నాడు ప్రాంతంలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమ మైనింగ్‌కు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి అరెస్ట్ భయం పట్టుకుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీసీఐడీ అధికారులు తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే యరపతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై మరో కేసు నమోదవడంపై యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన చెందుతున్నారని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. -
ఏపీలో కదులుతున్న మైనింగ్ మాఫియా అక్రమాలు
-
యరపతినేని గ్యాంగ్.. ముస్లింలపై జులుం
సాక్షి – గుంటూరు, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఎన్నికల్లో ఓటమి ఖాయమని నిర్ధారణకు వచ్చిన అధికార టీడీపీ అసహనంతో రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు తెగబడుతోంది. వైఎస్సార్ సీపీ మద్దతుదారులతో పాటు తమకు ఓటు వేయలేదని అనుమానిస్తున్నవారిపై కిరాతకంగా దాడులకు పురిగొల్పుతోంది. గుంటూరు జిల్లా గురజాలలో ముస్లిం మైనార్టీలపై దాడులు చేసిన రౌడీమూకలతో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమావేశం కావడం దీన్ని రుజువు చేస్తోంది. పోలింగ్ రోజున ప్రారంభమైన టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు శుక్రవారం కూడా కొనసాగాయి. మంచినీళ్లూ ఇవ్వం.. గురజాలలో తమకు ఓటు వేయలేదనే ఆగ్రహంతో ముస్లిం మైనార్టీలపై టీడీపీ రౌడీమూకలు పాశవికంగా దాడులు చేయడంతో సగం మంది ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లిపోయారు. గురువారం రాత్రి నుంచి మొదలైన టీడీపీ కార్యకర్తల దాడులతో స్థానిక ముస్లింలు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ నేతల ఆస్తులు కూడా ధ్వంసం కావడం తెలిసిందే. ముస్లింల ఇళ్లకు తాగునీటిని సరఫరా చేసేందుకు చిన్నబావిలో అమర్చిన మోటర్లను సైతం తొలగిస్తామంటూ టీడీపీ నేతలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే అరాచకపర్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. టీడీపీ గూండాల విధ్వంసానికి చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లిపోయారని, తాము మాత్రం ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని ముస్లిం మహిళలు కంట తడిపెడుతున్నారు. తాము చేసిన తప్పేమిటని వారిని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ గురజాల అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేశ్‌రెడ్డి, డీఎస్పీ శ్రీహరిబాబుల ఎదుట బాధితులు విలపించారు. మతోన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని నిరసనలు.. ముస్లింల ఇళ్లకు తాగునీరు అందించే మోటార్లను సైతం తొలగించాలని నిర్ణయించడం, అద్దెకు ఉండేవారిని ఖాళీ చేయాలని బెదిరిస్తూ టీడీపీ నేతలు మతోన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. దాడులకు దిగిన టీడీపీ నేతలు, గుంపులు గుంపులుగా యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు జంగమహేశ్వరపురంలో మాత్రం రోడ్లపై తిరగొద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు గంటల పాటు దాడులకు తెగబడి ముస్లింల ఇళ్లను ధ్వంసం చేసిన రౌడీమూకలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంతవరకూ పోలీసులు వెల్లడించ లేదు. ఎన్నికలకు ముందే గురజాల టౌన్ సీఐ రామారావును బదిలీ చేస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కార్యకర్తలతో యరపతినేని సమావేశం మరోవైపు ముస్లింలపై దాడులకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలతో గురజాలలోని ఓ అపార్టుమెంట్లో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం సమావేశం కావడం గమనార్హం. వైఎస్సార్సీపీ నేతలే దాడులకు పాల్పడ్డారంటూ ఆయన కొత్త డ్రామాలకు తెరతీశారు. బాధిత ముస్లింలను కనీసం పరామర్శించకుండా దాడులకు తెగబడ్డవారితో ఎమ్మెల్యే యరపతినేని సమావేశం కావడం పట్ల అంతా చీత్కరించుకుంటున్నారు. పోలీసుల సహకారంతోనే దాడులు: కాసు టీడీపీ నేతలు కొందరు పోలీసు అధికారుల సహకారంతోనే ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడ్డారని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. దాడిలో ధ్వంసమైన శ్రీసత్యనారాయణ ఐనాక్స్ థియేటర్, శరమాళ్ల శివ కారును ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి ఆయన పరిశీలించారు. దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలపై కఠినంగా వ్యవహరించాలని, దీన్ని ప్రోత్సహించిన సీఐ రామారావుపై చర్యలు తీసుకోవాలని కాసు మహేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఐ తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. టీడీపీ నేతలు గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించేందుకే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అనంతరం వారు థియేటర్లో భద్రపరిచిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు. కుప్పంలో ఈవీఎం ఓపెన్! చిత్తూరు జిల్లా కుప్పం పాతపేట ప్రభుత్వ పాఠశాల బూత్‌లో పోలింగ్ అనంతరం గురువారం అర్థరాత్రి ఓ టీడీపీ నేత ఈవీఎంలను ధ్వంసం చేసే యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈవీఎంలను తరలించడంలో ఆలస్యం కావడంతో తన అనుచరులతో కలసి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయంటూ వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ ఏజెంటు వెంకటాచలపతిపై దాడి చేయడంతోపాటు 170 పోలింగ్ బూత్‌లో ఈవీఎంలను పగలగొట్టే యత్నం చేశాడు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మీ అంతు చూస్తామని దుర్భాషలాడాడు. 170 పోలింగ్ బూత్‌లో ఈవీఎం తెరుచుకోవడంతో విషయం బయటకు పొక్కకుండా అధికారులతో మాట్లాడి సర్దుబాటు చేసినట్లు సమాచారం. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని అందరినీ బయటకు పంపించారు. కుప్పం గ్రామ పంచాయతీ మొదటి వార్డుకు సంబంధించిన బైరుగానిపల్లె, మునస్వామిపురం కాలనీ, విజయలక్ష్మీ రోడ్డు సంబంధిత ప్రాంతాల కోసం ఈ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఓట్లు వైఎస్సార్సీపీకి అనుకూలంగా పడుతున్నాయంటూ టీడీపీ ఏజెంట్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గంటపాటు పోలింగ్‌ను నిలిపివేశారు. ఊళ్లోకొస్తే చంపేస్తాం.. పోలింగ్ రోజు తమకు సహకరించలేదనే ఆగ్రహంతో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ నేతలు మారణాయుధాలను చేతబట్టుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఊళ్లోకి వస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు. పోలింగ్ రోజు టీడీపీ నేతలు కంట్లో కారం చల్లడంతో తీవ్ర అస్వస్థతకు గురైన వైఎస్సార్సీపీ నేత కర్నాటి కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అంతమొందించాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వేముల అచ్చిరెడ్డి మారణాయుధాలతో కోటిరెడ్డి కుటుంబాన్ని దూషిస్తూ బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో భోజనం చేస్తున్న కోటిరెడ్డి కుమారుడు నరసింహ ప్లేటును కాలితో తన్నేశాడు. వృద్ధురాలైన కోటిరెడ్డి తల్లి మంగమ్మతోనూ అసభ్యంగా మాట్లాడాడు. కోటిరెడ్డి కుమార్తెలపై చెయ్యి చేసుకున్నాడు. అనంతరం మలిరెడ్డి పకీరారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్య భద్రమ్మను దుర్భాషలాడాడు. గ్రామ పెద్దల సూచనల మేరకు బాధిత కుటుంబాలు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దాచేపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న రామాపురం మహిళలు జూలకల్లు, ఆళ్లగడ్డలో అరాచకపర్వం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ శ్రేణులు కత్తులు, కర్రలతో స్వైరవిహారం చేశాయి. ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. అహోబిలం, ఆళ్లగడ్డలో గురువారం టీడీపీ శ్రేణుల రాళ్ల దాడుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడగా, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో అదనపు బలగాలను మోహరించారు. ఇర్లపాడులో దళితులపై రెండుసార్లు దాడులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడులో దళితులపై టీడీపీ వర్గీయులు రెండు సార్లు దాడులు చేసి కొట్టడంతో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ బూత్ నంబరు 11లో ఎమ్మెల్యే అభ్యర్థికి పోలైన ఓట్లకు మించి ఎంపీ అభ్యర్థికి 50 ఓట్లు అదనంగా పోలయ్యాయి. బూత్ పరిధిలో మొత్తం 490 ఓట్లు ఉండగా ఎమ్మెల్యే ఈవీఎంలో 485 ఓట్లు నమోదయ్యాయి. ఎంపీ ఈవీఎంలో మాత్రం 535 ఓట్లు నమోదయ్యాయి. దీనిపై బూత్ ఏజెంట్లు అధికారులను నిలదీశారు. అదనంగా వచ్చిన 50 ఓట్లయినా తీసివేయాలని, లేదంటే రీ పోలింగ్ జరపాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఎస్సీ కాలనీకి చెందిన చీదర్ల సుజ్ఞానమ్మ, చిన్నం రాజాబాబు, సుమలత తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు శుక్రవారం ఉదయం కూడా ఆరు గంటల సమయంలో టీడీపీ వర్గీయులు 150 మందికి పైగా ఎస్సీ కాలనీలోకి చొరబడి మరోసారి దాడులకు దిగారు. ఘటనలో దూమాల జోజిబాబు, వాసిమళ్ల రవిబాబు, వాసిమళ్ల జోజిబాబు, ఎడ్ల జ్యోతిరాజు, జెట్టి విక్రంలు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి తలలు పగిలాయి. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి విడదల రజని ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఎన్నికల ఏజెంట్ ఇంటికి తాళం.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఆయన సోదరుడు సురేష్ కలసి వైఎస్సార్ సీపీ తరపున ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన సంగాల రామ్మోహన్‌రెడ్డిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి తాళం వేశారు. రామ్మోహన్‌రెడ్డి ఇంటికి తమ అనుచరులను పంపి తాళం వేయించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్‌రెడ్డి శుక్రవారం పోలీసులను కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అక్కడకు చేరుకుని ఇంటి తాళం తీశారు. తాను ఉంటున్న ఇంటిని ప్రభుత్వం 2002లో మంజూరు చేసిందని, ఇంటి పత్రాలు కూడా సీఎం రమేష్ సోదరుడు తనకు ఇవ్వడం లె?దని రామ్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. దాడులు చేసి ఆపై ధర్నాలు! గుంటూరు జిల్లా వేమూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై దాడి చేసి గాయపరచడమే కాకుండా బాధితుడిపైనే కేసులు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు శుక్రవారం ధర్నాకు దిగటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఓటమి తప్పదని తేలడంతో ఉక్రోషం పట్టలేక గురువారం వేమూరు మండలం బూతుమిల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు మేరుగ నాగార్జునపై దాడి చేయడమే కాకుండా ఆయన కారును ధ్వంసం చేయడం తెలిసిందే. పోలీసుల అదుపులో ఉన్న తమ వారిని విడిపించుకునేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా ఫలించకపోవడంతో వేమూరు టీడీపీ అభ్యర్థి, మంత్రి నక్కా ఆనందబాబు తెనాలి డీఎస్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ధర్నాకు దిగారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిలతో కలసి బైఠాయించారు. టీడీపీ కార్యకర్తలను విడుదల చేసేందుకు పోలీసులు అంగీకరించినట్లు అనంతరం నక్కా ఆనందబాబు చెప్పారు. మేరుగ కారును ఆ పార్టీ వాళ్లే ధ్వంసం చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో బ్లేడుతో దాడి.. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గుడిపాలలో వైఎస్సార్సీపీకి అత్యధికంగా ఓట్లు వేశారనే అనుమానంతో పోలింగ్ అనంతరం టీడీపీ నాయకులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మండల వైఎస్సార్సీపీ యువత అధ్యక్షుడు నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు యుగంధర్, జగపతిబాబులపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శ్రీరాములు నాయుడు, ప్రవీణ్, శంకర్, హేమాచలంతోపాటు మరో 15 మంది కర్రలతో దాడి చేసి చితకబాదారు. బ్లేడుతో గొంతు కోసేందుకు ప్రయత్నించగా చేతిని అడ్డు పెట్టడంతో నారాయణమూర్తికి గాయాలయ్యాయి. మహిళలపై పోలీసుల దాష్టీకం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెంలో వైఎస్సార్ సీపీకి ఓటేశారని రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు ప్రోద్బలంతో ఎస్సై వి.శుభాకర్ తమను చితకబాదించారని మహిళలు పేర్కొన్నారు. 20 ఏళ్లుగా టీడీపీకి మద్దతు ఇచ్చినా స్థానికంగా వంతెనతోపాటు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపాలెంలో పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు, వృద్ధులు కృష్ణా జిల్లాలో కవ్వించి ఇంటిపై రాళ్ల వర్షం.. కృష్ణా జిల్లా మల్కాపురంలో పోలింగ్ రోజు ఉదయం నుంచి టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సంయమనం పాటించారు. పోలింగ్ అనంతరం రాత్రి 10 గంటల సమయంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గనపనేని పిచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు రెడ్డిబోయిన నాగరాజు, చావా కృష్ణయ్య, కళ్యాణం బాస్కరరావులతో పాటు 200 మంది అడ్డుకుని దుర్బాషలాడారు. అనంతరం పిచ్చయ్య చౌదరి ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అంబోజి రామారావు, కుక్కల కిరణ్, ముత్తయ్య, బాగవంతుల నవీన్‌లపై కర్రలతో దాడి చేయడంతో గాయపడ్డారు. అనంతరం గ్రామానికి చేరుకున్న పోలీసులు టీడీపీ నాయకులకు వత్తాసు పలకటంతోపాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలను ఎస్ఐ చిరంజీవి స్టేషన్‌కు తరలించారు. టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగటాన్ని వైఎస్సార్ సీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను తీవ్రంగా ఖండించారు. -
పల్నాడులో నాటు తుపాకుల కలకలం
-
వెంకటేశ్వర్లు హత్యకు కుట్ర.. ఇది వారి పనే!
సాక్షి, గుంటూరు : ప్రత్యర్థులపై హత్యానేరం మోపి రాజకీయంగా లాభం పొందాలని భావించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుల పథకం బెడిసికొట్టింది. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని అనుచరుల వద్ద పోలీసులు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ముప్పన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న కారణంగా యరపతినేని ముగ్గురు ప్రధాన అనుచరులను అరెస్టు చేశారు. నాటు తుపాకులతో పాటు వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ మహిళ విషయంలో వివాదాలే ముప్పన మర్డర్ స్కెచ్‌కు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిన్న యరపతినేని నామినేషన్ కార్యక్రంలో కూడా ముప్పన పాల్గొనడం విశేషం. ఈ క్రమంలో తమలో తమకు తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా ముప్పనను హతమార్చి ఆ నేరాన్ని ప్రత్యర్థులపై నెట్టి వేయాలని యరపతినేని అనుచరులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ప్లాన్ చివరి నిమిషంలో అరెస్టుతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా యరపతినేని శ్రీనివాసరావు తన ధనదాహాంతో ప్రజలనూ, ప్రత్యర్థులనే కాక సొంత పార్టీ నేతల్నే బలి తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి గురజాలలో అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నసంగతి తెలిసిందే. తన పర భేదం లేకుండా... వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. (చదవండి : ఎమ్మెల్యే యరపతినేని దౌర్జన్యకాండ) -
రణజ్వాల.. గురజాల
సాక్షి, గురజాల : చాపకూటి సిద్ధాంతంలాంటి సమానత్వాన్ని చాటుకున్న చోటే.. ఫ్యాక్షన్ రక్తపు మరకల్లో తడిచి ముద్దయిన ప్రాంతం పల్నాడు. నాయకురాలు నాగమ్మ పౌరుషాలను పుణికిపుచ్చుకుని.. బ్రహ్మనాయుడు వంటి సౌమ్య గుణాన్ని కలిగిన ఈ ప్రాంతంలో గురజాల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగార్జున సాగర్ జలాలతో సిరుల పంటలిచ్చిన భూములు.. ఐదేళ్లలో కాలంలో మళ్లీ బీడువారాయి. ఫ్యాక్షన్ హత్యలను పక్కన పెట్టి విద్యా, వ్యాపారాల్లో ముద్ర వేస్తున్న ఈ ప్రాంత ప్రజలు రాజకీయ చైతన్యం చూపిస్తున్నారు.పల్నాడు ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. బాలచంద్రుడు, కన్నమదాసు, నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆ రోజుల్లోనే చాపకూటి సిద్ధాంతాన్ని అమలు చేసి సమానత్వాన్ని చాటారు. తరువాత కాలనుగుణంగా పల్నాడు ప్రాంతం కక్ష్యలు, కార్పణ్యాలతో రగిలిపోయింది. అనంతరం గ్రామాల్లో అక్షరాస్యత శాతం పెరగడంతో ప్రశాంత వాతావరణం నెలకొని శాంతి కపోతాలు ఎగురుతున్నాయి. గురజాల విశిష్టత గురజాల మండలం పులిపాడు, దైద, తేలుకుట్ల గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాలు ఫ్యాక్షన్ విడిచిపెట్టి వ్యాపారాలపై మక్కువ చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వరి, పత్తి, మిరప పంటలు సాగవుతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి కాలువలకు నీరు రాకపోవడంతో వరి సాగు తగ్గి పత్తి, మిరప వైపు రైతాంగం మళ్లింది. ప్రస్తుతం బోర్లు, చెరువులు కింద మాత్రమే వరి సాగవుతోంది. నాగార్జున సాగర్ రాకముందు ఈ ప్రాంతం బీడుగా మారింది. 1967లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి పలనాట సిరుల పంటలు పండుతున్నాయి. ఎన్నికల విజేతలు 1952లో కాసు బ్రహ్మానందరెడ్డి (కాంగ్రెస్)పై కోలా సుబ్బారెడ్డి(సీపీఐ) 11,673 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1955లో కోలా సుబ్బారెడ్డి (సీపీఐ)పై మండవ బాపయ్య చౌదరి (కేఎల్పీ) 6,907 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1962లో కోలా సుబ్బారెడ్డి(సీపీఐ)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 4,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో గడిపూడి మల్లికార్జునరావు(ఇండిపెండెంట్)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 7,167 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. 1972లో కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్)పై మందపాటి నాగిరెడ్డి (సీపీఐ) 8,377 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1978లో మందపాటి నాగిరెడ్డి(సీపీఐ)పై గడిపూడి మల్లికార్జునరావు(కాంగ్రెస్) 23,248 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్)పై జూలకంటి నాగిరెడ్డి (ఇండిపెండెంట్) 12,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985లో కాయితి వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్)పై అంకిరెడ్డి ముత్యం (టీడీపీ) 3,603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో రాచమడుగు సాంబశివరావు (టీడీపీ)పై కాయితీ వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్) 8,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో కనకం రమేష్ చంద్రదత్తుపై యరపతినేని శ్రీనివాసరావు 23,967 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 131 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 7,126 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009లో ఆలా వెంకటేశ్వర్లుపై యరపతినేని శ్రీనివాసరావు 10,565 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో జంగా కృష్ణమూర్తిపై యరపతినేని శ్రీనివాసరావు 7,896 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మార్పు– కూర్పు పునర్విభజన కాక ముందు గురజాల నియోజకవర్గంలో 5 మండలాలు ఉండేవి (గురజాల, రెంటచింతల, మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల) మండలాలు కలిసి ఉండేవి. రెంటచింతల మండలాన్ని మాచర్ల నియోజకవర్గంలో కలిపారు. విద్యా రంగం గురజాల మండల పరిధిలోని జంగమహేశ్వరపురం వద్ద ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్ కళాశాలతోపాటు ప్రైవేట్ కళాశాలలు–2, డిగ్రీ కళాశాల ఒకటి కలవు. బీఎడ్, బీఈడీ ప్రైవేట్ ళాశాలలు ఉన్నాయి. దాచేపల్లి మండలంలో ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వైఎస్ హయాంలో.. గురజాల మండలం మాడుగుల–శ్యామరాజుపురం గ్రామాల మధ్య బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి పలు గ్రామాలకు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పైపు లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద వేల ఎకరాల వరి పంటలు సాగవుతున్నాయి. దాచేపల్లిలోని దండివాగు ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించారు. శ్రీనగర్‌లో రూ.1.50 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. శ్రీనగర్ నుంచి దాచేపల్లికి మంచినీటి ఇరిగేషన్ ఏర్పాటు చేసి అనేక గ్రామాల దాహార్తి తీర్చారు. పొందుగుల–దాచేపల్లికి వాటర్ పైప్‌లైన్ నిర్మించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించారు. మాచవరం మండలంలోని మోర్జంపాడు లిప్టు ఇరిగేషన్ ఏర్పాటు చేసి సుమారుగా 5 వేల ఎకరాలను సస్యశ్యామంలం చేశారు. పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు గోవిందాపురం జలాలను అందించేందుకు రూ.37 కోట్ల నిధులతో పైపు లైన్లు నిర్మించారు. పిడుగురాళ్లలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిని పట్టణం గుండా వెళ్లేలా చేశారు. -
‘కిడారికి పట్టిన గతే నీకూ పడుతుంది’
సాక్షి, గుంటూరు : పల్నాడులో మరోసారి మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని హెచ్చరించారు మావోయిస్టులు. యరపతినేనితో పాటు పలువురు టీడీపీ నేతలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేశారు. ఈ లేఖలు దాచేపల్లి మోడ్రన్ స్కూల్ దగ్గర వెలిశాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు దర్శనమివ్వడం చర్చనీయంశంగా మారింది. -
పల్నాడులో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
-
ఎమ్మెల్యే యరపతినేని దౌర్జన్యకాండ
సాక్షి, గుంటూరు: తన ఆకలి తీర్చుకోవడానికి పాము తన పిల్లల్ని తానే తింటుందని చెబుతుంటారు. అదే తీరున గుంటూరు జిల్లా గురజాల అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధనదాహానికి సొంత పార్టీ నేతల్నే బలి తీసుకుంటున్నారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి అక్రమ తవ్వకాలకు తెగబడుతోంది. ఇప్పుడు వీరి కన్ను సొంత పార్టీ నేతల క్వారీలపై పడింది. వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ అలియాస్ బుజ్జి.. యరపతినేని బెదిరింపులతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడికి చేరుకున్న మైనింగ్ మాఫియా యరపతినేని పేరు బయట పెట్టవద్దంటూ ఆదినారాయణ సోదరులు, బంధువులతో బేరసారాలకు దిగారు. వాటికి లొంగకపోవడంతో దౌర్జన్యానికి దిగారు. మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ నెట్టివేశారు. తమ కుటుంబానికి ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉందని, తమకేం జరిగినా ఆయనదే బాధ్యతని కుటుంబసభుల్య మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల క్వారీల దురాక్రమణ దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ, ఆయన బావమర్ది బెల్లంకొండ పూర్ణచంద్రరావులకు సర్వే నెంబర్ 325లో 2. 10 ఎకరాల భూమి ఉంది. అందులో తెల్లరాయి నిక్షేపాలు ఉండటంతో క్వారీ లీజు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. దీంతో 2018 జూలై 10వ తేదీన పూర్ణచంద్రరావు పేరుతో మైనింగ్ అధికారులు అనుమతులిచ్చారు. ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, సీబీసీఐడీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మైనింగ్ మాఫియా వ్యూహాన్ని మార్చేసింది. గతంలో మూతబడ్డ క్వారీలు, వీరు బెదిరించి నిలుపుదల చేసిన క్వారీలను దౌర్జన్యంగా లాక్కుని వాటికి తిరిగి అనుమతులు తెప్పించుకుని తెల్లరాయిని అక్రమంగా దోచేసే కుట్రకు తెరతీశారు. ఇందులో భాగంగా కేసానుపల్లిలో ఆదినారాయణకు చెందిన క్వారీని కూడా లాగేసుకుని తవ్వకాలు మొదలు పెట్టారు. తమ క్వారీని అప్పగించాలంటూ ఆదినారాయణ గత పదిరోజులుగా యరపతినేని అనుచరుడు, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నెల్లూరి శ్రీనివాసరావును కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే తమకు అప్పగించారని, ఆయనతో మాట్లాడుకుని తేల్చుకోవాలంటూ శ్రీనివాసరావు చెప్పాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు తన క్వారీని లాక్కుని అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న నెల్లూరి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదినారాయణ శనివారం దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో శనివారం రాత్రి ఆదినారాయణ సోదరుడు కోటేశ్వరరావు ఎమ్మెల్యే యరపతినేని వద్దకు వెళ్లి తమ క్వారీ అప్పగించాలంటూ వేడుకున్నారు. ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోవాలంటూ చెప్పడంతో చేసేదేమీ లేక వెనక్కు వచ్చేశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆదినారాయణ ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న ఆదినారాయణను పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. యరపతినేని వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి మా తండ్రి, మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లిఖార్జునరావు పార్టీకి అండగా ఉన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం మేం ఎంతో కష్టపడ్డాం. అలాంటి మాపై యరపతినేని వ్యవహరించిన తీరు బాధాకరం. మా సోదరుని క్వారీని ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించారని ఆయన వద్దకు వెళ్లి చెబితే ఎంతోకొంత డబ్బులు తీసుకోమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కొడుకులమైన మాకే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. అలాగే మా బావమరిదిని కూడా బెదిరించి క్వారీని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడిన తరువాతే మా తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యరపతినేని వల్ల మా కుటుంబానికి ప్రాణ హాని ఉంది. మాకు ఏం జరిగినా ఆయనదే బాధ్యత. – గడిపూడి కోటేశ్వరరావు, లక్ష్మయ్య(ఆదినారాయణ సోదరులు) -
మళ్లీ తెరుచుకున్న అక్రమ గనుల ద్వారాలు
-
తవ్వుకో.. దోచుకో..
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో మరోసారి అక్రమ మైనింగ్‌కు ద్వారాలు తెరుచుకున్నాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒత్తిడికి తలొగ్గిన మైనింగ్ శాఖ అధికారులు గుంటూరు, దాచేపల్లి ప్రాంతాల్లో ఏడు గనుల (మొజాయిక్ చిప్స్) ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధానంగా మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్, ఎక్స్‌ప్లోజివ్స్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ నుంచి అనుమతులు లేకుండానే రెండు రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వేమవరంలోని మరో గనిలో కూడా తవ్వకాలకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత సాగిస్తున్న అక్రమ మైనింగ్‌పై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, గురవాచారిలు ఇటీవల హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాత్ర ఉందని, ఎంతమేరకు అక్రమ మైనింగ్ జరిగిందీ తేల్చి, రాయల్టీ, పెనాల్టీ వసూలు చేసి అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మైనింగ్ అధికారులు అనుమతులు లేని గనులను మూసి వేయించారు. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణ జరిపిస్తోంది. ఇదిలా ఉండగానే మరోసారి అక్రమ మైనింగ్‌కు తెరతీయడం అక్రమార్కుల బరితెగింపునకు నిదర్శనం. ఈ విషయమై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలెక్టర్ కోన శశిధర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే గనులను మూసి వేయించాలని కోరారు. పేలుడు పదార్థాల వినియోగంపై విచారించరా? అక్రమ మైనింగ్‌పై మైన్స్ ఇండస్ట్రియల్ సెక్రటరీ నివేదిక తెప్పించుకొని 31 లక్షల టన్నుల మేరకు అక్రమ మైనింగ్ జరిగినట్లు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. దీనికి సంబంధించి రాయల్టీ, పెనాల్టీతో కలిపి రూ.129 కోట్లు వసూలు చేస్తామని చెప్పారు. అయితే మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 98 లక్షల టన్నుల మేరకు అక్రమ మైనింగ్ జరిగినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా ఆధారాలతో కోర్టుకు నివేదించారు. రాయల్టీ, పెనాల్టీ రూ.546 కోట్ల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని, ఇంతగా అక్రమ మైనింగ్ సాగడానికి వినియోగించిన పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని కోర్టును అభ్యర్థించారు. కాగా, ఈ విషయమై ఏ విచారణా జరగడం లేదు. దీంతో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఏసీ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు సీఐడీ అడిషనల్ డీజీని కలిసి సమగ్ర విచారణ చేయాలని నెల క్రితం రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. హైకోర్టు నివేదించిన అఫిడవిట్ ప్రకారం 31 లక్షల టన్నుల ఖనిజం వెలికి తీసేందుకు, 3 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్, 35 లక్షల ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 15.50 లక్షల జిలెటిన్ స్టిక్స్ అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు మార్కెట్లోకి సరఫరా అవుతుంటే, ప్రత్యేకించి నక్సలైట్ల మూలాలు ఉన్న పల్నాడు ప్రాంతంలో రక్షణకే ప్రమాద సూచిక అవుతుంది. ఈ పేలుడు పదార్థాలు లభ్యమైన దూరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర రాజధాని ఉంది. ఈ పరిణామాలు రాజధాని ఉనికికే ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ శాఖల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ దిశగా విచారించాల్సిన సీబీసీఐడీ కేవలం కూలీలు, మిల్లర్లు, కార్మికులను మాత్రమే టార్గెట్ చేయడం గమనార్హం. అనుమతులు తప్పనిసరి.. గనుల్లో తవ్వకాలు జరపాలంటే అనుమతులు తప్పనిసరి. ఇందులో మేట్లు, మేనేజర్లను నియమించుకోవాలి. మైనింగ్ తవ్వేటప్పుడు, మైన్ పరిస్థితిని వీరు పరిశీలించాలి. మైన్ లోతుకు పోయేకొద్దీ బెంచ్ వదులుకుంటూ తవ్వాలి. ఆ నియమాన్ని మైన్ యజమానులు పాటించకుండా ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. మేట్స్ సర్టిఫికెట్తో బ్లాస్టింగ్ చేసుకోవచ్చు. వీరికి డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోసివ్స్ అనుమతి తప్పనిసరి. వారు ఎంతమేర పేలుడు పదార్థాలు వినియోగించిందీ రిటర్న్ పంపాలి. లీజు హోల్డర్, లైసెన్స్ హోల్డర్ అగ్రిమెంట్‌తో మైన్స్ ప్రారంభించేందుకు అవకాశం లేదు. నిబంధనల మేరకే అనుమతులు నిబంధనల మేరకే గనులు ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నాం. ఎక్స్‌ప్లోజివ్స్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ నుంచి అనుమతి రాలేదు. అందు కోసం వాటికి కొంత సమయం ఇచ్చాం. లైసెన్స్ హోల్డర్, లీజు హోల్డర్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఖనిజం వెలికితీతలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటాం. – శ్రీనివాసకుమార్, మైనింగ్ ఏడీ