గుంటూరు జిల్లాలో మరోసారి అక్రమ మైనింగ్‌కు ద్వారాలు తెరుచుకున్నాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒత్తిడికి తలొగ్గిన మైనింగ్ శాఖ అధికారులు గుంటూరు, దాచేపల్లి ప్రాంతాల్లో ఏడు గనుల (మొజాయిక్ చిప్స్) ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధానంగా మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్, ఎక్స్‌ప్లోజివ్స్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ నుంచి అనుమతులు లేకుండానే రెండు రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు.