ప్రత్యర్థులపై హత్యానేరం మోపి రాజకీయంగా లాభం పొందాలని భావించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుల పథకం బెడిసికొట్టింది. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని అనుచరుల వద్ద పోలీసులు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ముప్పన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న కారణంగా యరపతినేని ముగ్గురు ప్రధాన అనుచరులను అరెస్టు చేశారు. నాటు తుపాకులతో పాటు వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ మహిళ విషయంలో వివాదాలే ముప్పన మర్డర్ స్కెచ్‌కు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.