గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు
గుంటూరు : గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరిగిందని హైకోర్టు గుర్తించింది. విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ మైనింగ్ శాఖాధికారులు ఆగమేఘాల మీ కదిలారు. కోనంకి, కేశానుపల్లి, సీతారామాపురం సహా ఎనిమిది చోట్ల సర్వే చేసి అక్రమ తవ్వకాల లెక్కలు తీస్తున్నారు. దీనికి సంబంధించి యరపతినేనికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మైనింగ్, రెవిన్యూ శాఖాధికారులు విచారణ జరుపుతున్నారు.
ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను కూడా ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment