gurajala
-
నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్
సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘రూ.83 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లని రూ.2020 కోట్లతో నిర్మించానని లోకేష్ అబద్ధాలు చెప్పాడు. సారా డబ్బులతో హైదరాబాద్‌లో చంద్రబాబుకు రూ.300 కోట్ల భవనం. ప్రజల్ని లూటీ చేసి చంద్రబాబు, లోకేష్ సంపాదించారు. టీడీపీ హయాంలో లిప్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయినా చేయించారా?’’ అంటూ మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. చదవండి: అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు -
టార్గెట్ యరపతినేని.. టీడీపీలో హాట్ టాపిక్.. అసలేం జరుగుతోంది?
ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు ఒకప్పుడు యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి ఆరు సార్లు పోటీ చేసిన ఆయన మూడు సార్లు విజయం సాధించారు. 2014లో టీడీపీ విజయంతో గురజాలలో యరపతినేని అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పోలీసుల పోస్టింగ్లనుంచి మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియాల వరకు నేరాలకు నాయకత్వం వహించాడు. అన్నిటికీ తన ఇంటినే అడ్డాగా మార్చాడు. నియోజకవర్గంలోని లైమ్ స్టోన్, ముగ్గురాయి అక్రమ క్వారీయింగ్‌తో మైనింగ్ డాన్‌గా ఎదిగాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఐదువేల కోట్లకుపైగా సంపాదించాడనే ఆరోపణలున్నాయి. అయ్యగారు చేసిన అరాచకానికి గత ఎన్నికల్లో గురజాల ఓటర్లు గట్టి గుణపాఠం నేర్పారు. జనం కొట్టిన దెబ్బకు ఏడాదివరకూ యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో కనిపించలేదు. ఎన్నిక రాగానే హడావిడి ప్రజలకు కనిపించకపోతే ఎక్కడ ఉనికి కోల్పోతానో అన్న భయంతో అప్పుడప్పుడు గురజాల వచ్చి తెగ హడావుడి చేస్తున్నారు యరపతినేని శ్రీనివాసరావు. ఆయన ఎంత హడావుడి చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి రెండు గ్రామాల్లో తప్ప నియోజకవర్గంలో ఎక్కడా పార్టీని గెలిపించలేకపోయాడు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో అయితే పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్ది కూడా దొరకలేదు. దీంతో మున్సిపాలిటీలో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అయినా యరపతినేనికి బుద్దిరాలేదు. ఈసారి నేనే గెలుస్తా... మీ సంగతి తేలుస్తానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు. అయితే యరపతినేనికి ఇప్పుడు ఆయన పార్టీలోనే ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. గురజాలకు చెందిన టీడీపీ నేత చల్లగుండ్ల శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. యరపతినేనికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులతో నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేశారు. రెండుసార్లు చంద్రబాబును కలిసి యరపతినేనికి టికెట్ ఇవ్వద్దని, ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం గ్యారెంటీ అని చెప్పారట. చిన వర్సెస్ పెద్ద యరపతినేని వ్యతిరేకులందరినీ కలిపి ఒకేతాటిపైకి తీసుకొచ్చి వ్యవహారం మొదలుపెట్టారు చల్లగుండ్ల శ్రీనివాస్. దీనికితోడు చంద్రబాబు కుటుంబానికి దగ్గరగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం కూడా యరపతినేనికి ఎర్త్ పెట్టడానికి చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా చినకమ్మ, పెద్దకమ్మ ఫీలింగ్ తీసుకొచ్చారు. యరపతినేని పెదకమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్, నాదెండ్ల బ్రహ్మంలు చినకమ్మ వర్గానికి చెందిన నేతలు. నియోజకవర్గంలో చినకమ్మ వర్గం ఓటర్లు 23వేల వరకూ ఉంటే, పెదకమ్మ ఓటర్లు కేవలం రెండు వేలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. తమ ఓట్లతో గెలిచి తమనే అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న యరపతినేనిని ఎలాగైనా ఓడిస్తామంటున్నారు చిన్న కమ్మ వర్గం నాయకులు. అందుకే యరపతినేనితో ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుతున్నారు. యరపతినేనిపై తిరుగుబాటులో భాగంగానే నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్లలో చల్లగుండ్ల శ్రీనివాస్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో ఎక్కడా యరపతినేని ఫొటో లేదు. ఇదే ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోని టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెక్సీల వ్యవహారంతో ఆగ్రహించిన యరపతినేని వర్గీయులు రాత్రికి రాత్రే చల్లగుండ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మొత్తం పీకేయించారు. అంతటితో ఆగకుండా వాటి స్థానంలో యరపతినేని ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం నాయకుల మధ్య ఫ్లెక్సీల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. చదవండి: ఏపీలో బీఆర్ఎస్.. ‘కారు’ సీన్ ఎంత?.. ఈ ప్రశ్నకు సమాధానమిదే.. యరపతినేని శ్రీనివాసరావుతో అమీతుమీ తేల్చుకునేందుకు చినకమ్మ సామాజికవర్గం నేతలందరూ ఏకమవుతున్నారు. గతంలో జనసేన తరపున పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాసరావు కూడా రంగంలోకి దిగారు. ఇలా అందరూ యరపతినేనిని టార్గెట్ చేస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట. సొంతపార్టీ నేతలే తనపై తిరుగుబాటు చేస్తూ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలుసుకుని యరపతినేని వర్గీయులు తెగ హైరానా పడుతున్నారట. పచ్చ పార్టీలో యరపతినేని పరిస్థితి ఏమవుతుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ నేతల ఫ్లెక్సీ వార్
-
గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అమరావతి: గురజాల రైల్వే హాల్ట్‌లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి లేఖ పంపారు. కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆమెతోపాటు తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు. -
ఒడిశా యువతిపై లైంగిక దాడి.. అపస్మారకస్థితిలో
సాక్షి, గురజాల: ఒడిశాకు చెందిన మహిళపై లైంగిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుర్ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు ఒడిశాకు చెందిన మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి శుక్రవారం రాత్రి మాచర్ల ప్యాసింజర్ రైలు నుంచి గురజాల రైల్వే గేట్ హాల్ట్ వద్ద దిగింది. పొట్టకూటి కోసం వచ్చిన ఆమె టికెట్ కౌంటర్ వద్దే రాత్రి నిద్రించింది. ఆ సమయంలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఆమె పడి ఉంది. శనివారం ఉదయం ఆమె పక్కనే మూడేళ్ల బాలుడు బిక్కచూపులు చూస్తూ కూర్చుండడాన్ని గమనించిన స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి బాధితురాలిని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. వైద్యురాలు లక్ష్మి యువతికి ప్రాథమిక చికిత్స చేశారు. పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాధితురాలు మాట్లాడే భాష అర్థం కాకపోవడంతో కొందరు స్థానికులను పిలిపించి విచారణ సాగిస్తున్నారు. మహిళ ఇంకా దిగ్భ్రాంతిలో ఉండడంతో సరైన వివరాలు చెప్పలేకపోతున్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. గురజాల డీఎస్పీ బెజవాడ మోహర జయరాం ప్రసాద్, సీఐ రాయన ధర్మేంద్రబాబు, జీఆర్పీ సీఐ టి శ్రీనివాసరావు, ఆర్పీఫ్ సీఐ నాగార్జునరావు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరిసరాల్లో ఆరా తీస్తున్నారు. చదవండి: (సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం) -
అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్‌రెడ్డి
-
5.7 కేజీల బంగారం స్వాధీనం
దాచేపల్లి (గురజాల): తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 5 కేజీల 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం 11 గంటల సమయంలో జరిపిన వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణ్, విజయ్‌నాథ్ అనే వ్యక్తులు ఈ బంగారాన్ని గుంటూరుకు తరలిస్తున్నారని విచారణలో వెల్లడైంది. ఈ బంగారం విలువ సుమారు రూ.2.47 కోట్లు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. బంగారానికి సంబంధించి పత్రాలు సక్రమంగా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురజాల సీఐ ఉమేష్, ఎస్ఐ బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. -
యరపతినేని నివాసాల్లో సీబీఐ దాడులు
సాక్షి, అమరావతి/దాచేపల్లి(గురజాల): టీడీపీ పాలనలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల నివాసాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) గురువారం మెరుపు దాడులు చేసింది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు గుంటూరు జిల్లా గురజాల, పిడుగురాళ్ల, నడికుడి, నారాయణపురం, కేసానుపల్లి తదితర 25 ప్రాంతాల్లోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము జరిపిన సోదాల్లో అనేక ఆధారాలతో పాటు పలు కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 17 కేసులపై దర్యాప్తు.. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులు 17 మంది సాగించిన అక్రమ సున్నపురాయి తవ్వకాలపై నమోదైన 17 కేసులపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని కేసానుపల్లి, నడికుడి, కోనంకి గ్రామాల పరిధిలో నిందితులు అక్రమ మైనింగ్, క్వారీ తవ్వకాలు, విలువైన సున్నపురాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. పెద్ద ఎత్తున సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారు. 2014 నుంచి 2018 వరకు అనేక లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేశారు. మొత్తంగా అనేక కోట్ల రూపాయల మేర విలువైన సహజ వనరులు దోచుకున్నారు. ఈ వ్యవహారంపై వేగంగా దర్యాపు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. శాటిలైట్ చిత్రాలతో నష్టం అంచనా.. అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నష్టం అంచనా వేయడానికి దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ చిత్రాలను ఉపయోగించుకుంటోంది. అక్రమ మైనింగ్‌కు ముందు, ఆ తర్వాత.. శాటిలైట్ చిత్రాలను తీసుకొని వాటిని సాంకేతిక పద్ధతుల్లో పరిశీలించి ఏ మేరకు అక్రమ మైనింగ్ చేశారనే దానిని సీబీఐ అంచనా వేస్తోంది. కాగా, సీబీఐ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకున్న కొందరు నిందితులు పరారైనట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. -
టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ల సంగతి చూస్తా
పిడుగురాళ్ల (గురజాల): గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాకు చెందిన యువకులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యువకులు ప్రతి ఒక్కరి పేర్లు, చిరునామాలు అన్నీ డైరీలో నమోదు చేస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం వస్తే వారి సంగతి చూస్తామంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. యరపతినేని వ్యాఖ్యలను నియోజకవర్గంలో పలువురు నేతలు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రవర్తన మారలేదని, బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. కాగా, గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విచారణను గత ఏడాది డిసెంబర్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. (2014లో సొంత ఇల్లు లేదు.. నేడు కోట్లకు పడగలు!) -
దేవదాయశాఖ ఈవో అనిత ఆత్మహత్య
సాక్షి, దాచేపల్లి (గురజాల): రెండు రోజుల కిందట సస్పెండైన దేవదాయశాఖ గురజాల మండల ఈవో డి.అనిత (32) కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీటిలో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటికి తీయించిన ఎస్ఐ ఇ.బాలనాగిరెడ్డి.. మృతురాలు అనితగా గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిత భర్త రమేష్ గుంటూరులో ఉంటూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనిత గురజాలలో విధులు నిర్వర్తిస్తూ దాచేపల్లి మండలం శ్రీనగర్‌లో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం ఉదయం భర్త వద్ద నుంచి ఇంటికి బయలుదేరినట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. బస్సులో ఉన్నప్పుడు పలుమార్లు భర్తతో కూడా మాట్లాడారు. దాచేపల్లి బస్టాండ్‌లో దిగానని 9 గంటలకు ఫోన్ చేసి.. మధ్యాహ్నం 12 గంటలైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. అంతలోనే అనిత ఆత్మహత్యకు పాల్పడినట్టు వారికి సమాచారం అందింది. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా గురజాల మండలం దైద, సత్రశాల ఘాట్ల నిర్వహణ బాధ్యతలను అనిత చూశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అండదండలతో నిధుల దుర్వినియోగం జరిగిందని.. త్రిసభ్య కమిటీ విచారణలో అది వాస్తవమని తేలడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెప్పుకొంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. -
దాచేపల్లి, గురజాలకు మున్సిపాలిటీ హోదా
సాక్షి, దాచేపల్లి: దశాబ్దాల కల సాకరమైంది. దాచేపల్లి, గురజాల పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న మున్సిపాల్టీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీలల హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది . ఎన్నికల సమయంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీ హోదాను కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ప్రజల కలను నిజం చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను కలిసి దాచేపల్లి మున్సిపాల్టీగా, గురజాల, జంగమహేశ్వరపురం గ్రామాలను కలిసి గురజాల మున్సిపాల్టీలుగా రూపాంతరం చెందనున్నాయి. మున్సిపాల్టీల ఏర్పాటుతో పాటు అందుకు అవసరమైన సిబ్బంది, కార్యాలయం, ఫర్నిచర్‌తో ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాల్టీలతో అభివృద్ధి.. దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత దశాబ్దాల నుంచి వినిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మున్సిపాల్టీలుగా మారుస్తున్నామని గొప్పలు చెప్పారే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పల్నాడు అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గానికి రూ.66 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. ఆ తర్వాత తంగెడ, మాచవరం గ్రామాల పరిధిలో ఎత్తిపోతల నిర్మాణాలకు రూ.188 కోట్ల ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దాచేపల్లి, నడికుడి, గురజాల, జంగమహేశ్వరపురంలో ఉన్న జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక, మానవ వనరులను పరిగణలోకి తీసుకుని దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపాల్టీలు ఏర్పడితే ప్రతి రోజు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం, ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందుతాయి. మున్సిపాల్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు వస్తాయి. తమ కల ఇన్నాళ్లకు నెరవేరతుండటంతో దాచేపల్లి, గురజాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పిడుగురాళ్ల మున్సిపాల్టీగా ఉండటంతో తాజాగా దాచేపల్లి, గురజాల పట్టణాలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. -
‘యరపతినేని’.. ఆ ఐదేళ్లూ అరాచకమే!
సాక్షి, గుంటూరు: ‘‘గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తమ్ముళ్లు రెచ్చిపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారు. కుక్కను కొట్టారని, ఇంటి ముందు ఉమ్మి వేశారని ఇలా చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించుకు తిన్నారు. ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాం. ఆ కష్టాలు, బాధలు పగవారికి కూడా రాకూడదు’’ అంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకుల నుంచి దాడులకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఇతర వర్గాలకు చెందిన ప్రజలను హోం మంత్రి సుచరిత శనివారం పరామర్శించారు. కార్యక్రమానికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీలకతీతంగా వందల మంది ప్రజలు కార్యక్రమానికి హాజరై గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తాము పడ్డ కష్టాలు, బాధలను హోంమంత్రికి తెలియజేశారు. వైఎస్సార్ సీపీకి అండగా ఉన్నారని అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారని బాధితులు చెప్పుకున్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తన, మన అనే బేధాలు లేకుండా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దోచుకున్నారని బాధితులు ఆరోపించారు. తమ మైనింగ్ క్వారీని యరపతినేని అనుచరులు కబ్జా చేస్తే అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సరిపూడి మల్లికార్జునరావు కుమారుడు బుజ్జి హోం మంత్రికి చెప్పుకున్నారు. మైనింగ్‌క్వారీ విషయంలో యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేక ఒకానొక సందర్భంలో తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు వివరించారు. ఇదే తరహాలో అనేక మంది బాధితులు యరపతినేని, ఆయన అనుచరుల అరాచకాలను, వేధింపులను గుర్తు చేశారు. భరోసా ఇచ్చిన హోం మంత్రి సుచరిత : గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల వేధింపులకు గురైన బాధితుల కష్టాలు, బాధలు విన్న హోం మంత్రి వారికి భరోసా ఇచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పార్టీ నాయకులపై నమోదు అయిన కేసులపై పునఃవిచారణ చేపడతామని వాగ్ధానం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల, పట్టణ కన్వీనర్లు చల్లా పిచ్చిరెడ్డి, చింతా వెంకటరామారావు, షేక్ జాకీర్ హుస్సేన్, సిద్ధాడపు గాంధీ, చౌదరి సింగరయ్య, మునగా పున్నారావు, అన్నారావు, జెడ్పీటీసీలు మాజీ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రేపాల శ్రీనివాసరావు, వివిధ విభాగాల నాయకులు కేవీ, కాలే మాణిక్యరావు, చింతారెడ్డి సుబ్బారెడ్డి, వున్నం నాగమల్లికార్జునరావు పాల్గొన్నారు. పల్నాడు ప్రతిష్టను దిగజార్చవద్దు పల్నాడు ప్రాంతంలో ఏదో జరగబోతుందని మాజీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం కోసం పల్నాడు ప్రతిష్టతను దిగజార్చవద్దు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. –శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ యరపతినేని, కోడెల బందిపోట్లు గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్‌రావు బందిపోట్లు వలే ఐదేళ్ల పాటు అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. కుందుర్తి గురవాచారి వంటి వారిని హింసించారు. –కాసు మహేష్‌రెడ్డి, గురజాల ఎమ్మెల్యే రాజకీయ స్వార్థంతో విమర్శలు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయ స్వార్థంతో విమర్శలు చేస్తున్నారు. కోడెల శివప్రసాదరావు, యరపతినేని ఎక్కడ తలదాచుకున్నారో చంద్రబాబుకు మాత్రమే తెలుసు. నిజాలను అసత్యాలుగా చూపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. –పి.రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ వారిని వెంటపెట్టుకుని పల్నాడుకు రావాలి చంద్రబాబుకు ధైర్యం ఉంటే పల్నాడు పర్యటనకు యరపతినేని, కోడెలను వెంటపెట్టుకుని రావాలి. యరపతినేని తప్పుడు కేసులతో అనేక మందిని వేధించారు. అక్రమ మైనింగ్‌పై ఉద్యమాలు చేసిన తనపై కూడా వేధింపులు కొనసాగించారు. వాటిని లెక్కచేయకుండా పోరాటం చేశాం. –జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ 20 కేసులు పెట్టారు అక్రమ మైనింగ్‌పై కోర్టును ఆశ్రయించిన తనపై హత్య కేసులు, రేప్ కేసులు పెట్టించి బెదిరింపులకు యరపతినేని దిగారు. ఐదేళ్లలో తనపై 20కిపైగా కేసులు పెట్టించారు. చంద్రబాబు గొంతుచించుకుని కేకలు వేసినంత మాత్రన నిజాలు అబద్ధాలు కావు. చౌకబారు విమర్శలు మానుకోవాలి. –టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆత్మహత్య చేసుకునేంతగా.. యరపతినేని గెలుపు కోసం పనిచేశాం. మాకు దాచేపల్లి మండలంలోని కేశానుపల్లి గ్రామంలో క్వారీ ఉంది. యరపతినేని శ్రీనివాసరావు అనుచరులైన నెల్లూరి శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు అక్రమంగా క్వారీలోకి చొరబడ్డారు. యరపతినేని మమ్ములను బెదిరించారు. –గడిపూడి బుజ్జి, మాజీ ఎమ్మెల్యే తనయుడు ఎస్సీ, ఎస్టీ కేసు మాచర్లలో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. తాను చేసే కాంట్రాక్ట్ పనుల్లో మామూళ్లు ఇవ్వలేదని నాపై 2014లో మెుదటి సారిగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారు. తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానని ఇంత కక్ష సాధింపు చర్యలు ఇప్పటి వరకు చూడలేదు. –ఉన్నం నరసింహారావు, కాంట్రాక్టర్ -
పైశాచికమా.. ప్రమాదమా?
సాక్షి, గుంటూరు : గుర్తు తెలియని అగంతకులు పైశాచికంగా వ్యవహరిస్తూ చిన్నారులను చిదిమేస్తున్నారా..? లేకా ప్రమాదవశాత్తూ పిల్లలు చనిపోతున్నారా..? ప్రస్తుతం పల్నాడులో ఇదే చర్చ కొనసాగుతోంది. మాచర్ల, గురజాల పట్టణాల్లో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. మాచర్లలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏడేళ్ల బాలుడు అదృశ్యమై నాలుగు రోజుల తర్వాత క్వారీ గుంతలో శవమై తేలాడు. తాజాగా గురజాలలో వారం రోజుల కిందట నాలుగేళ్ల బాలుడు సుభాష్ అదృశ్యమై నేటికీ ఆచూకీ లభించలేదు. దుండగులు పిల్లలను కిడ్నాప్ చేసి హత్య చేస్తున్నారా..? ఏమైనా ప్రమాదాలకు గురై చిన్నారులు మృత్యువాత చెందుతున్నారా అనే విషయం నేటికీ పోలీసులు తేల్చకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అభం శుభం తెలియని చిన్నారుల నిండు నూరేళ్ల జీవితాలు అర్ధంతంగా కొడిగడుతున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు జీవితకాలం శిక్ష పడుతోంది. ఉన్నతంగా పెంచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకున్న వారికి తీరని శోకమే మిగులుతోంది. చిన్నారులు అదృశ్యమైన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ కేసు నమోదు చేసి సరిపెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాచర్లలో, తాజాగా ఆగస్టు 25న గురజాలలో ఇద్దరు బాలురు అదృశ్యం ఆ ప్రాంత వాసుల్లో కలకలం రేపుతుంది. ఆయా కేసుల్లో నిందితులను గుర్తించడం పోలీసులకు సైతం మిస్టరీగానే మిగిలింది. ఆధునిక పరిజ్ఞానం ఎంత ఉన్నా నిందితుల గుర్తింపులో నెలలు గడుస్తూనే ఉన్నాయి. కేసులను కొలిక్కి తీసుకురావడంలో పోలీసుల వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనలు జరిగిందిలా.. మాచర్లలోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటేశ్వరనాయక్ వెల్ధుర్తి మండలంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుంటాడు. ఇంటి వద్ద భార్య సరోజనీబాయ్ కుమారుడు సాయిసాధిక్ ఉరఫ్ సిద్దు (7) ఈ ఏడాది ఏప్రిల్ 22న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో మాచర్ల టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల అనంతరం బాధితుడి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న క్వారీలోని నీటిలో సిద్దు శవమై తేలాడు. కిడ్నాప్ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆ కేసులో మిస్టరీ వీడలేదు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటిలో పడ్డాడా లేకపోతే ఎవరైనా తీసుకెళ్లి పడేశారా అనే విషయం పోలీసులకు అంతు పట్టడం లేదు. లేకుంటే మరేమైనా కారణాలున్నాయా అనే కోణాల్లో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. బాలుడి తల్లిదండ్రులు సైతం తమ బిడ్డను ఎవరో పొట్టనపెట్టాకున్నారని అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేసి రూరల్ ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా గురజాలకు చెందిన గురవయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తాడు. ఇద్దరు మగ పిల్లలున్నారు. పెద్ద కుమారుడు సుభాష్ ఇంటి ఎదురు ఆడుకుంటుండగా గత నెల 25న గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేశారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మరో ఐదు రోజులకు (అగస్టు 30వ తేదీన) బాధితుడి ఇంటి సమీపంలోని ముళ్ళ పొదల్లో బాలుడు అదృశ్యం అయిన సమయంలో వేసుకున్న లాగు, టీషర్టు రక్తపు మరకలతో తడిచి వేర్వేరు చోట్ల పడేసి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. పోలీస్ జాగిలం కూడా బాలుడు ఇంటి వద్ద నుంచి బట్టలు ఉన్న చోటకు వచ్చి నిలిచిపోయింది. ఎలాంటి క్లూ దొరకలేదు. ఇదిలా ఉంటే మా బిడ్డను ఎవరో హతమార్చారంటూ తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అసలు బాలుడు ఉన్నాడా..? లేదా..? అనే విషయంలో పోలీసులు కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కిడ్నాప్ చేసిన దుండగులు బట్టలకు రక్తపు మరకలు పూశారా? లేకుంటే నిజంగానే పొట్టన పెట్టుకున్నారా? అనే సందేహంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడికి చెందిన బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నట్లయితే... నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌గా ఉన్న గురజాలలో కనీసం ప్రధాన రహదారులను కవర్ చేసేలా ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు లేవు. ప్రధాన దుకాణదారులు, అపార్టుమెంట్లు వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కొందరు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు సుముఖత చూపకపోవడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. అదే సీసీ కెమేరాలు ఉన్నట్లయితే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదని పోలీసులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. -
రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం
సాక్షి, గురజాల: పురిటినొప్పులతో బాధపడుతూ రెండేళ్ల కిందట గురజాలలోని శ్రీకాంత్ నర్సింగ్ హోంలో తల్లీబిడ్డ మృతి చెందారు. మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డకు అప్పట్లో సరైన వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందువల్లే తల్లీబిడ్డ మృతి చెందారని ఇటీవల రాష్ట్ర మానవహక్కుల కమిషన్, ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు. మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి శ్యామ్ రెండో కుమార్తె మాచర్ల శిరీషా రెండోసారి గర్భం దాల్చడంతో 2017 మే నెల 26వ తేదీన గురజాల శ్రీకాంత్ నర్సింగ్ హోంలో చేర్పించారు. వైద్యం చేసే క్రమంలో తల్లీ బిడ్డ మృతి చెందారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాలను మాడుగుల శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. అప్పట్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం 10 రోజుల నుంచి మృతురాలి కుటుంబీకులు మాచర్ల శిరీషా, ఆమెకు పుట్టిన బిడ్డ మరణంపై అనుమానం ఉందని ఫిర్యాదులు చేశారు. దీంతో సీఐ ఓ.దుర్గాప్రసాద్, తహసీల్దార్ షేక్ గౌస్‌బుడేసాహేబ్ సమక్షంలో బుధవారం గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ శివకామేశ్వరావు తల్లీబిడ్డ ఖననం చేసిన చోటు తవ్వకాలు చేపట్టి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వివరాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?
సాక్షి, గుంటూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కన్పించడంలేదని, రెండు నెలల క్రితం బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల చెప్పుడు మాటలు వింటున్నారని గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 16వ తేదీన గురజాలలో కన్నాలక్ష్మీనారాయణ ధర్నా చేస్తామన్నారు. గురజాలలో ఎందుకు ధర్నా చేస్తున్నారో అర్థం కావడంలేదని, గత ప్రభుత్వంలో గురజాలలో సున్నపురాయి దోపిడీ జరుగుతుంటే అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని మండిపడ్డారు. ‘తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు అక్రమ కేసులు పెడితే ఎందుకు మాట్లాడలేదు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకాలు చేస్తే ప్రశ్నించలేదు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ నాయకుల ద్వారా నిజాలు తెలుసుకోవాలని’ కన్నాకు సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ మైనింగ్, అక్రమ గ్రానైట్, నకిలీ విత్తనాలు, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడు జరగకుండా అదుపు చేశాం. గడచిన 3 నెలల్లో గురజాలలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామన్నారు. 2 నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారి మాటలు వింటే పచ్చ కామెర్ల వారికి అంత పచ్చగానే కనపడుతుందనేలాగే ఉంటుందని ఎద్దేవాచేశారు. చంద్రబాబు నాయుడు తన పార్టీ వారిని బీజేపీలోకి పంపి మళ్ళీ 3సంవత్సరాల తర్వాత టీడీపీలో చేర్చుకుంటారని తెలిపారు. చంద్రబాబు ఉద్దేశం బీజేపీ భుజాలపైన గన్ను పెట్టి వైఎస్సార్సీపీపై దాడిచేయాలని, ఇప్పటికైనా బీజేపీ నాయకులు టీడీపీ దుర్మార్గాలను గ్రహించాలని సూచించారు. గతంలో ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తుంటే చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధర్నా చేసే వారికి ప్రొటెక్షన్ కల్పించమని పోలీసు అధికారులకు సూచిస్తుంది అని పేర్కొన్నారు. -
గుంటూరు జిల్లాలో 3 కొత్త నగర పంచాయతీలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు అభివృద్ధి పనులు, ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా త్వరితగతిన వెలువడుతోంది. ఏళ్ల తరబడి కదలని, వదలని సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతోంది. ఇదే కోవలో తాజాగా జిల్లాలో కొత్త నగర పంచాయతీలు ఏర్పాటుకు ముందడుగు పడింది. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలను నగర పంచాయతీలుగా మార్చేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాంతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో మేలు చేకూరనుంది. ఇక తమ ప్రాంతంలో సమస్యలు తీరందాటి అభివృద్ధి పరుగులు తీస్తుందని నిజాంపట్నం వాసులు అంటున్నారు. మరో వైపు పలనాడు రాళ్లపై ఇక అభివృద్ధి రాతలు కనిపిస్తాయని గురజాల, దాచేపల్లి–నడికుడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూడు కొత్త నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. మూడు మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా నగర పంచాయతీలు ఏర్పాటు అంశాన్ని అసెంబ్లీ ముందుకు ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి తీసుకెళ్లారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2015లో అప్పటి ప్రభుత్వం మేజర్ పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ఇచ్చిన జీవో తెరమరుగైంది. ఆ జీవోకు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జీవం పోసి ఈ నెల 31వ తేదీలోపు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 50 మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడేషన్ చేసేందుకు సంబంధిత వివరాలు పంపాలని కలెక్టర్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కోరారు. ఈ జాబితాలో జిల్లాలోని గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మేజర్ పంచాయతీల సమాచారం సేకరించే పనుల్లో జిల్లా పంచాయతీ(డీపీవో) సిబ్బంది, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ అధికారులు నిమగ్నమయ్యారు. 12 అంశాల సేకరణ.. పురపాలక సంఘాలుగా అప్‌గ్రేడ్ చేయడం కోసం ఎంపిక చేసిన మేజర్ పంచాయతీల నుంచి 12 అంశాలపై వివరాలు డీపీవో అధికారులు సేకరించనున్నారు. పంచాయతీలో జనాభా, ఓటర్లు, పాఠశాలల సంఖ్య, వార్షిక ఆదాయం, అప్పులు, ఖర్చులు, విస్తీర్ణం సహా 12 అంశాలపై వారు వివరాలు తీసుకుంటున్నారు. రెండు పంచాయతీలు విలీనం.. మండల కేంద్రానికి 2–3 కి.మీ పరిధిలో ఉన్న పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాంపట్నానికి మూడు కి.మీ పరిధిలో ఉన్న ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలను నిజాంపట్నంలోకి విలీనం చేసి నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. నిజాంపట్నం పంచాయతీలో 19 వేలు, ఆముదాలపల్లి పంచాయతీలో 4 వేలు, బావోపాజీపాలెం పంచాయతీలో 2 వేల జనాభా నివసిస్తున్నారు. అదే విధంగా గురజాల పంచాయతీలో 27 వేలు జనాభా ఉన్నారు. అయితే ఈ గురజాల మండల కేంద్రానికి 3 కి.మీ పరిధిలో ఉన్న జంగమహేశ్వరపురాన్ని కలిపి గురజాల నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దాచేపల్లి మేజర్ పంచాయతీలో 19 వేలు, నడికుడి పంచాయతీలో19 వేల మంది జనాభా నివసిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నాం జిల్లాలో దాచేపల్లి–నడికుడి, నిజాంపట్నం, గురజాల పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ప్రతిపాదనలు పంపామని కోరారు. ఆయా పంచాయతీల్లో జనాభా, విస్తీర్ణం, ఆదాయం, ఖర్చులు, పాఠశాలల సంఖ్య సహా 12 అంశాలపై వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 31వ తేదీలోపు వివరాలు సేకరించి ప్రతిపాదనలు పంపుతాం. – సూర్యప్రకాష్, ఇన్చార్జి డీపీఓ మేజర్ పంచాయతీల పేర్లు జనాభా కుటుంబాలు దాచేపల్లి – నడికుడి 38,462 9,800 నిజాంపట్నం (ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలు కలిపి) 25,547 6,803 గురజాల (జంగమహేశ్వరపురం కలిపి) 28,642 6,932 -
మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!
సాక్షి, తెనాలి: వయస్సు తప్పుగా చెప్పి మోసం చేసి ఓ యువకుడు తనను వివాహం చేసుకున్నాడని సఫియా అనే యువతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన సఫియాకు తన స్నేహితుల ద్వారా గురజాలకు చెందిన షేక మహమ్మద్ హసన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లు. ఈ నేపథ్యంలో గత డిసెంబరులో వివాహం చేసుకున్నారు. మహమ్మద్ హసన్ తనను పెళ్లి చేసుకునే సందర్భంలో అతని వయసు 22గా చెప్పాడని, అయితే వయసు 19గా తెలిసిందని సఫియా తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ టి. అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. సఫియా, ఆమె కుటుంబసభ్యులు తనను మోసం చేసి, మభ్య పెట్టి వివాహం జరిపించారంటూ మహ్మద్ హసన్ గతంలోనే గురజాల పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అక్కడ ఇప్పటికే కేసు కేసు నమోదైంది. -
ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు
-
అంతటా బెట్టింగుల హోరు !
సాక్షి, గురజాల : మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగుల హోరు జోరుగా నడుస్తున్నాయి. రూ.కోట్లలో బెట్టింగ్‌లు పెట్టారని సమాచారం. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఫలితాలు వెలవడనున్నాయి. 2014 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లబ్ధిచేకూరుతుందోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కడ విన్నా ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న చర్చే జరుగుతుంది. పోలింగ్ తర్వాత సుమారుగా నెల రోజులు పాటు స్తబ్ధత రాజ్యమేలింది. ఈ నెల 23వ తేదీన కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడటంతో ఇటు రాజకీయ పక్షాలు, అటు ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఐదేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారని అన్ని సామాజిక వర్గాలు వైఎస్సార్ సీపీకి మొగ్గు చూపి ఓట్లు వేశారని తప్పనిసరిగా అధికారంలోకి వస్తామనే ధీమా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తుంది. పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. చేతులు మారిన రూ.కోట్ల నగదు పోలింగ్ పూర్తయిన తరువాత నియోజకవర్గంలో ఒక్కసారిగా బెట్టింగ్ బాబులు బరిలోకి దిగారు. వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని కొందరు, టీడీపీ అధికారం ఖాయమని కొందరు ఈ విధంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కాసినట్లు తెలిసింది. ప్రస్తుతం కౌంటింగ్ తేదీ సమీపించడంతో బెట్టింగ్ పెట్టిన వారిలో ఆందోళన మొదలైంది. ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో అని అలోచనలో ఉన్నారు. ఓటింగ్ జరిగిన మూడు రోజుల నుంచి వైఎస్సార్ సీపీ గెలుస్తుందని అధికంగా బెట్టింగ్‌లు వచ్చిన ఆ సమయంలో టీడీపీ నుండి బెట్టింగ్ పెట్టెందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై పలువురు విశ్లేషకులు తప్పనిసరిగా వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు. పల్లెల్లో వేడెక్కిన రాజకీయం... సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎండలు ముదరకముందే పోలింగ్ జరగ్గా ఓట్ల్ల లెక్కింపునకు సమయం ఎక్కువగా ఉండటంతో ఎండలు మండిపోతున్నా, రాజకీయ వాతావరణం కాస్త చల్లబడిందనే చెప్పాలి. లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో మళ్లీ కొద్ది రోజుల నుంచి వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయోనని గ్రామస్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకు చర్చించుకుంటున్నారు. ఏ గ్రామంలో ఏ వర్గం ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపారో అన్న అంశాలపై రచ్చబండల వద్ద రోజూ చర్చకు వస్తుండటంతో పల్లెలో వాతావరణం వేడెక్కింది. ప్రజల తీర్పు ఎటు ఉందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడక తప్పదు. -
రౌడీయిజం రాజ్యమేలుతోంది: వైఎస్ జగన్
సాక్షి, పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా) : గురజాల నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మైనింగ్ మాఫియా సృష్టించారని, ఈ దోపిడీని అరికట్టాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ యరపతినేనితో బాగాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా, గురజాల నియోజవకవర్గం పిడుగురాళ్లలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబు తమ పథకాలను కాపీ కొట్టి మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారన్నారు. పసుపు కుంకుమ పథకానికి మోసపోవద్దని, అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. తాగు నీటి సమస్యను పట్టించుకోలేదు.. ‘పక్కనే నాగర్జునసాగర్ ఉంటుంది.. కానీ తాగడానికి మంచి నీళ్లు ఉండవ్. ఐదేళ్ల పాలనలో ఎన్నడు ఈ సమస్యను పట్టించుకోలేదు. ఎన్నికలు ముందు చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ వచ్చి బుగ్గవాగు నుంచి కృష్ణ నీళ్లు తెస్తామని టెంకాయ కొడుతాడు. ఐదేళ్లు గుర్తుకురాని నీటి సమస్య ఎన్నికల ముందే గుర్తుకు వస్తుంది. రైతన్నలకు సాగు నీరు లేదు. పత్తికి గిట్టుబాటు ధరలేదు. మిర్చి పంటకు క్వింటాల్ రూ.6వేలు కూడా రావడం లేదు. 70 గ్రామాలు పూర్తిగా తాగు నీరులేక ఇబ్బందులు పడుతున్నాయి. లక్ష మంది పైచిలుకు నివాసం ఉంటున్న పిడుగురాళ్లలో కనీసం 100 పడకల ఆసుపత్రి లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే గుంటూరుకు వెళ్లే పరిస్థితి. గురజాలలో యరపతినేని అనే దిక్కుమాలిన ఎమ్మెల్యే ఉన్నారు. మైనింగ్ వ్యాపారంతో గనులను దోపిడీ చేస్తున్నారు. కోర్టులు సైతం ఇక్కడ మైనింగ్, మాఫియా జరిగిందని రూ.కోట్లు జరిమాన వేసే పరిస్థితి ఏర్పడింది. మైనింగ్ దోపిడీని అరికట్టాల్సిన సీఎం ఆయన కొడుకు యరపతినేనితో బాగాలను పంచుకుంటున్నారు. రూ.100 కోట్లు జప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే.. చంద్రబాబు జేబులోని సీఐడీతో విచారణ చేయించి.. ఆ సొమ్మును యరపతినేని నుంచి వసూలు చేయకుండా చిన్నిచిన్న మైనింగ్ కంపెనీలను బెదరిస్తూ నోటీసులు పంపిస్తున్నారు. థియేటర్ల యజమానులు డబ్బులు ఇవ్వకుంటే సినిమా థియేటర్లు మూసే పరిస్థితి ఉంది. పేకట క్లబ్బులు, మైనింగ్ మాఫియాతో ఇక్కడ రౌడీయిజం రాజ్యమేలుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఆలోచన చేయమని కోరుతున్నా. ఆయన పాలన మోసం, అబద్దాలు, అవినీతి, అన్యాయం అనే పదాలతో నిండిపోయింది. ఒక్కసారి ఆలోచించండి.. 21 నెలల కిందట మన పార్టీ ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించాం. పాదయాత్రతో ప్రతి పేదవాడి, రైతన్న దగ్గరకు తీసుకు వెళ్లాం. వారి సూచనలు, విన్నపాలతో కొన్ని మార్పులు కూడా చేశాం. మన వాగ్ధానాలు మంచి మనసు నుంచి పుడితే.. చంద్రబాబుకు వాగ్ధానాలు మాత్రం ఓటమి భయంతో పుట్టాయి. రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రూ.50 వేలు ఉచితంగా చేతికి అందిస్తామని 21 నెలల కింద మనం వాగ్ధానం చేశాం. కానీ చంద్రబాబు మాత్రం ఐదేళ్లు రైతన్నలను పూర్తిగా మోసం చేసి.. ఎన్నికలకు ముందు మన పథకాన్ని కాపీ కొడుతూ అన్నదాత సుఖీభవ అంటూ మోసం చేసేందుకు మరోసారి సిద్దమయ్యారు. చంద్రబాబు మాట నమ్మి పూర్తిగా మోసపోయిన డ్వాక్రా మహిళల బాధలను చూసి.. ఎన్నికల తేదివరకు ఎంత రుణం ఉంటుందో అంత మొత్తాన్ని వారి చేతికే అందిస్తామని నవరత్నాల్లో ప్రకటించాం. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అక్కకు ఈ విషయం చెబుతూ భరోసా కల్పించాం. కానీ చంద్రబాబు మాత్రం డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేసి.. సున్నా వడ్డీ రుణాలను ఎగరగొట్టి.. ఇప్పుడు పసుపు-కుంకుమ అని కొత్త సినిమా చూపిస్తున్నారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు ఉన్న 28 వేల కోట్ల రుణాలు నేరుగా చేతికే ఇస్తామని చెప్పిన మనమెక్కడా.. పసుపు కుంకుమతో ముష్టివేసినట్లు ఇస్తానన్న రూ.6 వేల కోట్లు ఎక్కడా? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తామని.. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నా. ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. ఎన్నికల ముందు ముష్టి వేసినట్లు కొంత మందికి ఇస్తూ.. ప్రకటనలు ఇచ్చుకుంటున్న ఈ అన్యాయపు పాలనను చూడమని కోరుతున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదాను తీసుకొస్తామని చెప్పి.. ఆ తరువాత ఆ అంశాన్ని అటకెక్కించిన తీరు.. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయని ఈ ప్రభుత్వంపై ఆలోచన చేయమని కోరుతున్నా. లక్షా 20వేల నిరుద్యోగ భృతి ఎగరగొట్టిన ఈయన పాలనను గమనించమని కోరుతున్నా. గత చరిత్రను గుర్తుతెచ్చుకోండి.. ఎన్నికలకు వచ్చేసరికి అన్ని రకాల స్కీంలతో మోసం చేయడానికి చంద్రబాబు సిద్దంగా ఉంటారు. ఈయన మోసాలకు అండగా అమ్ముడుపోయిన మీడియా ఉంది. వీరంతా కలిసికట్టుగా చేస్తున్న మోసాలు చూడమని కోరుతున్నా. 1994 సంవత్సరంలో చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం.. రూ.2లకే బియ్యం, సంపూర్ణ మధ్యపాన నిషేదం వంటి వాగ్ధానాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది 1995లో బియ్యాన్ని రూ.5.25 చేసి.. సంపూర్ణ మధ్య నిషేదాన్ని ఎత్తేసారు. ఈ విషయాలను గుర్తు తెచ్చుకోని చంద్రబాబు నైజాన్ని చూడమని కోరుతున్నా. అవే అన్యాయాలు.. మోసాలను చూడమని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిరోజు చంద్రబాబునాయుడు పాలనపై చర్చ జరగకూడదని, ఆయన పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావని, ఆయన పచ్చమీడియాతో రోజుకో పుకారు పుట్టిస్తున్నారు. దీనిపై చర్చపెట్టి.. పత్రికల్లో పతాక శీర్షీకలతో ప్రచురిస్తున్నారు. ఇలా చంద్రబాబు మోసపూరిత పాలన ప్రజలకు గుర్తురాకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగనన్నతోనే సాధ్యమని తెలపండి.. ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపించి. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తాడని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మన పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా అన్న భరిస్తాడని చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాడని తెలుపండి. లక్షాధికారులను చేస్తాడని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి ఏడాది మే నెలలో రూ.12500 చేతుల పెడతాడని ప్రతి రైతన్నకు చెప్పండి. సున్నా వడ్డీ రుణాలు జగనన్న రాజ్యంలోనే సాధ్యమని తెలపండి. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాడని తెలపండి. అవ్వా, తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని చెప్పండి. ఇళ్లు లేవని ప్రతి నిరుపేదను కలవండి. ప్రతి పేదవాడికి ఇళ్లు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని తెలపండి. రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తహశీల్దార్ ఆఫీస్‌లో ఆటోలకు టీడీపీ జెండాలు
-
టీడీపీ అభ్యర్థి బరితెగింపు.. తహశీల్దార్ ఆఫీస్‌లోనే..
సాక్షి, గుంటూరు : గురజాల టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని టీడీపీ ఆఫీసుగా మార్చేసుకున్నారు. ప్రచారంలో ఉపయోగించే ఆటోలకు పచ్చ జెండాలు, బ్యానర్లు కట్టడానికి ఏకంగా తహశీల్దారు ఆఫీసును అడ్డాగా చేసుకుని బరితెగించారు. నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టేందుకు ఆటోలను పిడుగురాళ్ల తహశీల్దార్ కార్యాలయానికి రప్పించిన యరపతినేని అక్కడ నుంచే ర్యాలీ చేపట్టారు. ఇక మొదటినుంచీ ఇసుక దోపిడీ, అక్రమ మైనింగ్‌తో వివాదాస్పద నేతగా పేరున్న యరపతినేని ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. గత బుధవారం దాచేపల్లి మండలం ఇరికేపల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ‘మేము అభివృద్ధి చేశాం.. కాలనీ వాసులు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.. నన్ను మరోవైపు చూడవద్దు.. నేను మంచికి మంచివాడిని.. తేడా వస్తే తాట తీస్తా’ అంటూ బెదిరించారు. (చదవండి : ఎమ్మెల్యే యరపతినేని వివాదాస్పద వ్యాఖ్యలు) -
గురజాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రచారం
-
మరోవైపు చూడాలనుకోవద్దు..
దాచేపల్లి(గురజాల): ‘నన్ను ఒకవైపు మాత్రమే చూశారు.. మరోవైపు చూడాలనుకోవద్దు.. తేడా వస్తే తాట తీస్తా..అంటూ’ గురజాల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడారు. ‘మేము అభివృద్ధి చేశాం.. కాలనీ వాసులు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.. ‘నన్ను మరోవైపు చూడవద్దు.. నేను మంచికి మంచివాడిని.. తేడా వస్తే తాట తీస్తా’ అంటూ బెదిరించారు. వైఎస్సార్ సీపీకి బలమైన గ్రామం ఇరికేపల్లి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి ఇరికేపల్లి బలమైన గ్రామం. ఎస్సీ కాలనీలో ఎక్కువగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారు. ఈ కాలనీకి చెందిన మాతంగి మమత వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచింది. ఎస్సీ కాలనీలో పట్టుకోసం టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏ విధంగానైనా సరే బెదిరించి అయినా ఎస్సీ కాలనీలో పాగా వేయాలనే ఉద్దేశం టీడీపీ నేతలకు ఉన్నప్పటికీ..కాలనీలో ఇప్పటివరకు వీరికి ఆదరణ లభించలేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన యరపతినేని ఎస్సీ కాలనీలో వారిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, యరపతినేని చేసిన ఘాటు వ్యాఖ్యలపై దళిత సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళితులను బెదిరించి లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. -
క్వారీల్లో ఉపాధికి ఘోరి..
సాక్షి, దాచేపల్లి(గురజాల) : ఉదయం నుంచి సాయంత్రం వరకు కండలను కరిగించి రాళ్లను బద్దలుకొట్టేవారు. వచ్చే ఆదాయంతో ఇంటిల్లిపాదీ చీకూచింతా లేకుండా హాయిగా జీవించేవారు. కాలేజీ విద్యార్థులు సైతం అప్పుడప్పుడు క్వారీల్లో పనులకు వెళ్లి వచ్చే డబ్బులను చదువుకోసం ఖర్చుచేసేవారు. హాయిగా సాగుతున్న వారి జీవితాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ దెబ్బతీసింది. అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో క్వారీలన్నీ మూతపడ్డాయి. వడ్డెరలకు పనికరువైంది. చేసేదేమీలేక ఇళ్లకు తాళాలు వేసి పనులు వెతుక్కుంటూ వలసబాట పట్టారు. కండలు కరిగించి రాళ్లు బద్దలు కొట్టి జీవనం సాగించే వడ్డెర కార్మికుల బతుకుల్లో టీడీపీ నాయకులు చీకట్లు నింపారు. ఒకప్పుడు దర్జాగా బతికిన వడ్డెర కార్మికులు నేడు దయనీయ పరిస్థితుల్లో జానెడు పొట్టనింపుకొనేందుకు కొందరు వలస బాట పట్టగా, మరికొంత మంది వ్యవసాయ కూలీలుగా మారారు. నిత్యం సమ్మెట చప్పుళ్లు, వడ్డెర కార్మికుల కబర్లతో సందడిగా కనిపించే క్వారీలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. కార్మికులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో క్వారీలతోపాటు, గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు అక్రమంగా క్వారీలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులు సాగించిన అక్రమ మైనింగ్‌తో దాచేపల్లి మండలంలోని నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ల మండలంలోని కొనంకి గ్రామాల్లో క్వారీలు మూతపడ్డాయి. దీంతో వడ్డెర కార్మికులు వలసబాట పట్టారు. రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్లకు తాళాలు వేసి తట్టాబుట్ట సర్దుకుని ఉపాధిని వెతుక్కుంటూ వలసబాట పట్టారు. వడ్డెర కార్మికులు అధికంగా నివసించే నడికుడి పంచాయతీ పరిధిలోని అంజనాపురం కాలనీ నిర్మానుషంగా ఉంది. క్వారీల్లో యరపతినేని అనుచరుల పాగా నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో క్వారీపై ఆధారపడి ఈ మూడు గ్రామాల్లోనే మూడు వేల మందికి పైగా వడ్డెర కార్మికులు జీవించేవారు. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వడ్డెర కార్మికులు నిర్భయంగా క్వారీ పనులు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డెర కార్మికుల బతుకులు పూర్తిగా మారాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు క్వారీలను బలవంతంగా లాగేసుకున్నారు. నడికుడిలో వడ్డెర సొసైటీకి ఉన్న రెండున్నర ఎకరాల లీజును రద్దు చేయించి ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములు, ఓ సిమెంట్ కంపెనీ సొంత భూముల్లో సైతం అక్రమంగా మైనింగ్‌కు పాల్పడి రాయిని తవ్వి తరలించేశారు. కేసానుపల్లిలో ప్రభుత్వ భూములతో పాటుగా ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో కూడా అక్రమంగా క్వారీ పనులు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. వడ్డెర కార్మికుల శ్రమ దోపిడీ క్వారీలను లాగేసుకున్న టీడీపీ నాయకులు వారి శ్రమను సైతం దోచుకున్నారు. గతంలో ట్రక్కు రాయి కొడితే రూ.600లకు పైగా కూలి వచ్చేది. టీడీపీ నాయకులు మాత్రం రూ.450 చొప్పున సరిపెట్టారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా కార్మికుల శ్రమ దోపిడీలో భాగస్వాములుగా మారడంతో కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోజూ వేల టన్నుల తెల్లరాయిని రవాణాచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న టీడీపీ నాయకులు తమకు రావాల్సిన కూలిలో సైతం కోత విధించారని కార్మికులు ఆరోపించారు. వలసబాట పట్టిన కార్మికులు అక్రమమైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో అక్రమమైనింగ్ నిలిచిపోయింది. గతంలో చట్టప్రకారం రాయల్టీ చెల్లించి క్వారీలను నడిపేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయల్టీ చెల్లించకుండా ఇష్టానుసారంగా క్వారీలను నిర్వహిస్తుండటంతో హైకోర్టులో పిల్ దాఖలైంది. అక్రమమైనింగ్‌లో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్వారీలు నిలిచిపోయాయి. దీంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇంటి వద్ద వృద్ధ తల్లిదండ్రులను వదిలిపెట్టి అతికష్టం మీద వలసలకు పయనమయ్యారు. క్వారీ పనులు లేకపోవటంతో కొంతమంది వడ్డెర కుటుంబాల్లోని పిల్లల చదువులు కూడా ఆగాయి. క్వారీని వదిలి.. డ్రైవర్‌గా కుదిరి.. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చల్ల అమరలింగేశ్వరరావు. 17 సంవత్సరాల వయస్సు నుంచే క్వారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరుకుమార్తెలు, ఒకకుమారుడు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్వారీలను అక్రమించుకున్నారు. టీడీపీ నాయకులు కొంతకాలం అమరలింగేశ్వరరావుతో పనులు చేయించినా, వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడంతో పనులకు రాకుండా అడ్డుకున్నారు. ఆ తరువాత బతుకుదెరువు కోసం జేపీ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడా పని కల్పించకుండా యజమాన్యంపై టీడీపీ నాయకుడు బత్తుల రాంబాబు వత్తిడిచేశాడు. చేసేదేమీలేక ఇప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. క్వారీ పనుల్లో రూ.800 ఆదాయం వచ్చేది. ఇద్దరు పిల్లలను చక్కగా చదివించుకునేవాడు. ఇప్పుడు డ్రైవర్‌గా వెళ్లడం వల్ల ఆదాయం తగ్గిపోయింది. వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణభారంగా మారింది. కష్టపడితే నాలుగు రూపాయలు వచ్చే క్వారీ పనులు మానుకుని డ్రైవర్‌గా వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. టీడీపీ నాయకులు తాను క్వారీ పనులు చేయకుండా అడుగడుగునా అడ్డుకుని పంతం నెగ్గించుకున్నారు. తాపీ పనులు చేస్తున్నా క్వారీ పనులు నిలిచిపోవటం వలన పొట్టచేతపట్టుకుని విజయవాడకు వెళ్లి తాపీ పనులు చేసుకుని బతుకుతున్నా. అక్కడ కూడా పనులు అడపా దడపా మాత్రమే లభిస్తున్నాయి. నాకు ఇచ్చే కూలి తినటానికి, ఉండటానికే సరిపోతుంది. అంతా దూరం వెళ్లి నేను సంపాదించిందేమీలేదు. క్వారీ పనులు ఉంటే కుటుంబంతో కలిసి హాయిగా పనిచేసుకుని ఇక్కడే ఉండేవాళ్లం. ఇప్పుడు నేను విజయవాడలో, నా కుటుంబం అంజనాపురంలో ఉంటోంది. –వేముల క్రిష్టయ్య చదువులకు అటంకం నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. క్వారీ పనులు ఉంటే రోజూ ఉదయం పనికి వెళ్లి ట్రక్కురాయి కొడితే రూ.600 వచ్చేవి. ఆ డబ్బును చదువు కోసం ఉపయోగించుకునేవాడిని. ఇప్పుడు క్వారీ పనులు లేవు. చదువుకు ఆటంకంగా మారింది. చదువుకోవటం ఇబ్బందిగా ఉంది. పరిస్థితులు ఇలానే ఉంటే చాలామంది చదువు ఆగిపోయే ప్రమాదం ఉంది. – బత్తుల చిన్నపరాజు -
అమాత్య... అన్న పిలుపేదీ?
సాక్షి, గుంటూరు : జిల్లాలో గతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పనర్విభజనతో 19 నుంచి 17కు తగ్గిపోయింది. అయితే ఇప్పటి వరకూ మూడు నియోజకవర్గాలకు మంత్రి పదవి దక్కలేదు. వాటిలో ఒకటి రద్దయిన దుగ్గిరాల నియోకవర్గంకాగా మిగిలిన రెండు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని సత్తెనపల్లికి కేవలం నెలరోజులే మంత్రి పదవి దక్కింది. దుగ్గిరాల నియోజకవర్గం నుంచి గుదిబండి వెంకటరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. మాజీ మంత్రి ఆలపాటి ధర్మారావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనంతరం వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు. సత్తెనపల్లిది విచిత్ర పరిస్థితి. 1983లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నన్నపనేని రాజకుమారి ఎమ్మెల్యేగా గెలుపొంది నాదెండ్ల భాస్కరరావు మంత్రి వర్గంలో నెలపాటు మంత్రిగా కొనసాగారు. ఆ నెల మినహా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. సత్తెనపల్లి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు సైతం మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 స్వల్ప మెజార్టీతో గెలిచినా శాసన సభ స్పీకర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు మంత్రి పదవి దక్కలేదు. 2014లో మాత్రం మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావు అమాత్యుడిగా ప్రమాణం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గం నుంచి ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవి పొందలేదు. అయితే గురజాల వాసి అయిన డొక్కా మాణిక్యవరప్రసాదరావు తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడూ రెండు సార్లుకంటే ఎక్కువ సార్లు గెలవకపోవడంతో మంత్రి పదవులు దక్కలేదని చెప్పుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవిని పొందలేకపోయారు. ఈ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి గెలిచి రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో సైతం విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ రికార్డు సృష్టించారు. ఆయన మినహా మిగిలిన ఎవరూ రెండు సార్లు గెలవలేదు. -
వెంకటేశ్వర్లు హత్యకు కుట్ర.. ఇది వారి పనే!
సాక్షి, గుంటూరు : ప్రత్యర్థులపై హత్యానేరం మోపి రాజకీయంగా లాభం పొందాలని భావించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుల పథకం బెడిసికొట్టింది. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని అనుచరుల వద్ద పోలీసులు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ముప్పన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న కారణంగా యరపతినేని ముగ్గురు ప్రధాన అనుచరులను అరెస్టు చేశారు. నాటు తుపాకులతో పాటు వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ మహిళ విషయంలో వివాదాలే ముప్పన మర్డర్ స్కెచ్‌కు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిన్న యరపతినేని నామినేషన్ కార్యక్రంలో కూడా ముప్పన పాల్గొనడం విశేషం. ఈ క్రమంలో తమలో తమకు తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా ముప్పనను హతమార్చి ఆ నేరాన్ని ప్రత్యర్థులపై నెట్టి వేయాలని యరపతినేని అనుచరులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ప్లాన్ చివరి నిమిషంలో అరెస్టుతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా యరపతినేని శ్రీనివాసరావు తన ధనదాహాంతో ప్రజలనూ, ప్రత్యర్థులనే కాక సొంత పార్టీ నేతల్నే బలి తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి గురజాలలో అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నసంగతి తెలిసిందే. తన పర భేదం లేకుండా... వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. (చదవండి : ఎమ్మెల్యే యరపతినేని దౌర్జన్యకాండ) -
గురజాల నుంచే విజయఢంకా మోగిస్తాం : కాసు
సాక్షి, పిడుగురాళ్ల: గురజాల నియోజకవర్గం నుంచే వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తామని పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 16వ తేదీన హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యే ప్రాంగణాన్ని గురువారం కాసు, పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ప్రోగ్రామ్ కన్వీనర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గెలుపు శంఖారావం గురజాల నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలపై జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానంతో పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల నుంచే ప్రచార సభ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన రాక పల్నాడు ప్రజల అదృష్టమని భావిస్తున్నామన్నారు. గురజాల నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టోను జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. గురజాల నియోజకవర్గంలో మెడికల్ కళాశాల నిర్మించి అందులోనే హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామని, అదే విధంగా ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు ప్రజలకు తాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. కేవలం పేకాట క్లబ్‌లు, మట్టి మాఫియా, క్వారీలను దోచుకోవడం, వ్యాపారులను ఇబ్బంది పెట్టడం, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై జగన్మోహన్రెడ్డి మాట్లాడతారని వివరించారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ పౌరుషాల పురిటిగడ్డ అయిన పల్నాడు ప్రాంతం నుంచి సమర శంఖారావం పూరించబోతున్నారన్నారు. పల్నాడు ప్రాంతం నుంచి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది జయప్రదం కావడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించడానికి వైఎస్సార్ సీపీ నడుం బిగించిందని, అందుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి సభను విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేపాల శ్రీనివాసరావు, కుందుర్తి గురవాచా రి, జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీటీసీ తాటికొండ చిన ఆంజనేయులురెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతా వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. -
రణజ్వాల.. గురజాల
సాక్షి, గురజాల : చాపకూటి సిద్ధాంతంలాంటి సమానత్వాన్ని చాటుకున్న చోటే.. ఫ్యాక్షన్ రక్తపు మరకల్లో తడిచి ముద్దయిన ప్రాంతం పల్నాడు. నాయకురాలు నాగమ్మ పౌరుషాలను పుణికిపుచ్చుకుని.. బ్రహ్మనాయుడు వంటి సౌమ్య గుణాన్ని కలిగిన ఈ ప్రాంతంలో గురజాల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగార్జున సాగర్ జలాలతో సిరుల పంటలిచ్చిన భూములు.. ఐదేళ్లలో కాలంలో మళ్లీ బీడువారాయి. ఫ్యాక్షన్ హత్యలను పక్కన పెట్టి విద్యా, వ్యాపారాల్లో ముద్ర వేస్తున్న ఈ ప్రాంత ప్రజలు రాజకీయ చైతన్యం చూపిస్తున్నారు.పల్నాడు ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. బాలచంద్రుడు, కన్నమదాసు, నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆ రోజుల్లోనే చాపకూటి సిద్ధాంతాన్ని అమలు చేసి సమానత్వాన్ని చాటారు. తరువాత కాలనుగుణంగా పల్నాడు ప్రాంతం కక్ష్యలు, కార్పణ్యాలతో రగిలిపోయింది. అనంతరం గ్రామాల్లో అక్షరాస్యత శాతం పెరగడంతో ప్రశాంత వాతావరణం నెలకొని శాంతి కపోతాలు ఎగురుతున్నాయి. గురజాల విశిష్టత గురజాల మండలం పులిపాడు, దైద, తేలుకుట్ల గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాలు ఫ్యాక్షన్ విడిచిపెట్టి వ్యాపారాలపై మక్కువ చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వరి, పత్తి, మిరప పంటలు సాగవుతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి కాలువలకు నీరు రాకపోవడంతో వరి సాగు తగ్గి పత్తి, మిరప వైపు రైతాంగం మళ్లింది. ప్రస్తుతం బోర్లు, చెరువులు కింద మాత్రమే వరి సాగవుతోంది. నాగార్జున సాగర్ రాకముందు ఈ ప్రాంతం బీడుగా మారింది. 1967లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి పలనాట సిరుల పంటలు పండుతున్నాయి. ఎన్నికల విజేతలు 1952లో కాసు బ్రహ్మానందరెడ్డి (కాంగ్రెస్)పై కోలా సుబ్బారెడ్డి(సీపీఐ) 11,673 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1955లో కోలా సుబ్బారెడ్డి (సీపీఐ)పై మండవ బాపయ్య చౌదరి (కేఎల్పీ) 6,907 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1962లో కోలా సుబ్బారెడ్డి(సీపీఐ)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 4,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో గడిపూడి మల్లికార్జునరావు(ఇండిపెండెంట్)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 7,167 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. 1972లో కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్)పై మందపాటి నాగిరెడ్డి (సీపీఐ) 8,377 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1978లో మందపాటి నాగిరెడ్డి(సీపీఐ)పై గడిపూడి మల్లికార్జునరావు(కాంగ్రెస్) 23,248 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్)పై జూలకంటి నాగిరెడ్డి (ఇండిపెండెంట్) 12,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985లో కాయితి వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్)పై అంకిరెడ్డి ముత్యం (టీడీపీ) 3,603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో రాచమడుగు సాంబశివరావు (టీడీపీ)పై కాయితీ వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్) 8,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో కనకం రమేష్ చంద్రదత్తుపై యరపతినేని శ్రీనివాసరావు 23,967 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 131 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 7,126 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009లో ఆలా వెంకటేశ్వర్లుపై యరపతినేని శ్రీనివాసరావు 10,565 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో జంగా కృష్ణమూర్తిపై యరపతినేని శ్రీనివాసరావు 7,896 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మార్పు– కూర్పు పునర్విభజన కాక ముందు గురజాల నియోజకవర్గంలో 5 మండలాలు ఉండేవి (గురజాల, రెంటచింతల, మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల) మండలాలు కలిసి ఉండేవి. రెంటచింతల మండలాన్ని మాచర్ల నియోజకవర్గంలో కలిపారు. విద్యా రంగం గురజాల మండల పరిధిలోని జంగమహేశ్వరపురం వద్ద ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్ కళాశాలతోపాటు ప్రైవేట్ కళాశాలలు–2, డిగ్రీ కళాశాల ఒకటి కలవు. బీఎడ్, బీఈడీ ప్రైవేట్ ళాశాలలు ఉన్నాయి. దాచేపల్లి మండలంలో ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వైఎస్ హయాంలో.. గురజాల మండలం మాడుగుల–శ్యామరాజుపురం గ్రామాల మధ్య బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి పలు గ్రామాలకు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పైపు లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద వేల ఎకరాల వరి పంటలు సాగవుతున్నాయి. దాచేపల్లిలోని దండివాగు ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించారు. శ్రీనగర్‌లో రూ.1.50 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. శ్రీనగర్ నుంచి దాచేపల్లికి మంచినీటి ఇరిగేషన్ ఏర్పాటు చేసి అనేక గ్రామాల దాహార్తి తీర్చారు. పొందుగుల–దాచేపల్లికి వాటర్ పైప్‌లైన్ నిర్మించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించారు. మాచవరం మండలంలోని మోర్జంపాడు లిప్టు ఇరిగేషన్ ఏర్పాటు చేసి సుమారుగా 5 వేల ఎకరాలను సస్యశ్యామంలం చేశారు. పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు గోవిందాపురం జలాలను అందించేందుకు రూ.37 కోట్ల నిధులతో పైపు లైన్లు నిర్మించారు. పిడుగురాళ్లలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిని పట్టణం గుండా వెళ్లేలా చేశారు. -
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. (మంత్రి ఆదికి ఊహించని షాక్) గుంటూరు జిల్లా గుజరాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. డాక్టర్ ఉన్నం నాగ మల్లిఖార్జున రావు, వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం తదితర నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. వీరందరినీ వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహేష్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు దాదాపు 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి వచ్చాయి. విశాఖలోనూ... అరకు సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. డీసీసీ కార్యదర్శి కింజేటి అప్పారావు, టీడీపీ నాయకుడు పి. అప్పారావు, పోర్ట్ మాజీ సెక్రటరీ దామోదర్ తదితరులు వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ.. ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు కడలి రాంపండు తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో.. పత్తికొండ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చెరుకులపాడు శ్రీదేవి, పార్టీ నేతలు బివై రామయ్య, ప్రదీప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రామచంద్రతో పాటు 200 మంది కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘జై జగన్.. పొలిటికల్ సూపర్‌స్టార్’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజన్న తనయుడి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బంజారాహిల్స్‌లోని వైఎస్సార్ సర్కిల్ వద్ద గురజాల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి యువత సంబరాలు చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన యువకులు జై జగన్.. పొలిటికల్ సూపర్‌స్టార్ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరులో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐరాల మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిత్తూరులోని అమ్మఒడి ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అల్పాహార వితరణ చేశారు. మైనారిటీ నాయకుడు అను అల్తాఫ్, రాకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. వారాహి యాగం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళంలోని దుర్గా మహాలక్ష్మి దేవాలయంలో వారాహి యాగం నిర్వహించారు. ఈ కార్యక్రంమలో సి.ఇ.సి. మెంబర్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జిల్లాలోని కాళ్ల ఆస్పత్రిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంధర్భంగా రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గం సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు కేక్ కట్ చేశారు. కార్యక్రంమలో పాతపాటి సర్రాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు యోగేంద్ర బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా గణపవరం కన్యకాపరమేశ్వరి వర్తకసంఘ భవనంలో ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచే జననేత జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి తణుకు కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరావు కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ తుదపరి పుట్టినరోజు ముఖ్యమంత్రి హోదాలో జరుపుకొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం కావాలన్నదే ఆంధ్రా ప్రజల అభిలాష అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ జన్మదినం నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు, నియోజకవర్గ యూత్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పేదలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీయల్ ఎస్టేట్ పార్కులో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వాకర్లకు బూట్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, చల్లా ఈశ్వర రావు, రత్నాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సంధర్భంగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు,రొట్టెలు, పండ్లు మరియు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి,కేక్ కట్ చేసిన భీమవరం నియోజకవర్గం సమన్వయకర్త గ్రంధి. శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కొయ్యే. మోసేనురాజు, పేరు చర్ల నరసింహబాబు, మేడిద జాన్సన్,కోడే యుగంధర్, గూడూరి. ఉమాబాల, పలువురు కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్టింగ్. వికలాంగులుకు పాలు, పండ్లు, పంపిణీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండవల్లి సోంబాబు,పొల్నాటి బాబ్జి,సాయిబాల పద్మ, చంద్ర రావు, హరిబాబు, బీవీఆర్ చౌదరి, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో.. ఎస్.కోటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అభిమానులు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.కోటలో ఉచిత మంచినీటి సరఫరా ట్రాక్టర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాయుడు బాబు, రఘురాజు, చిన్న రాము నాయుడు, రాజేశ్వరరావు, వరలక్ష్మి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు మధ్య గార తవుడు కేకు కట్ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రోట్టెలు పంచారు. బూడి వెంకటరావు, వర్రి నర్శింహమూర్తి, బెల్లాన త్రినాదరావు, కరణం ఆదినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్వతీపురం మండలం కోరీ గ్రామంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వయ కర్త జోగారావు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆబాద్ వీధి ఊర్దూ పాఠశాలలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అవనపు విజయ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురష్కరించుకొని విజయనగరంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంద్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి కేక్ కట్ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ విజయవాడ వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58 వ డివిజన్ లో వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా యువజన విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు వంటసామాగ్రి పంపిణీ అనంతపురం జిల్లాలో.. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా పెనుకొండ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్ -
వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ హౌస్ అరెస్ట్
-
గురజాలలో ఉద్రిక్తత
గుంటూరు : నరసరావుపేటలోని గురజాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన ఇంటి పన్నులకు నిరసగా నేడు పిడుగురాళ్ల మున్సిపాలిటీ ముట్టడికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ ఇంటి చూట్టు భారీగా చుట్టుముట్టిన పోలీసులు అతన్ని బయటకు రాకుండా గృహ నిర్భంధం చేశారు. మహేష్ అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ శ్రేణుల భగ్గుమన్నారు. పొద్దునలేస్తే ప్రజాస్వామ్యం పేరుతో గొప్పలు చేప్పుకునే సీఎం చంద్రబాబు.. ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్ట్ చేపిస్తున్నారని మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు, గతంలో వేసిన రోడ్లకు మళ్లీ టెండర్లు పిలవడంపై వైఎస్సార్సీపీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. -
అక్రమ మైనింగ్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్ పట్ల ప్రభుత్వ నిస్సహాయత సరికాదని ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శర్మ వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చూస్తే ఎలా అని మొట్టికాయలేసింది. సుప్రీంకోర్టులో కేసు ఉందనగానే ప్రభుత్వం భయపడుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మేమేమి మనుషులను తినే పులులం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడింది. ఎవరో ఏదో చేస్తారని ప్రభుత్వమే భయపడితే ఎలా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా గుంటూరు జిల్లాలోని గురజాల వంటి ప్రాంతాల్లో టీడీపీ అక్రమంగా మైనింగ్ చేస్తోందంటూ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీతో సహా పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ నియామకం
సాక్షి, అమరావతి : గురజాల అక్రమ గనుల తవ్వకాలపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కమిటీ కన్వీనర్‌గా కాసు మహేశ్ రెడ్డి, సభ్యులుగా బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌తో పాటు నరసరావు పేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
గనుల దోపీడీలో సీబీఐ విచారణకు సిద్ధమా ?
-
సీబీఐ విచారణ చేయాల్సిందే: అంబటి
గుంటూరు: గురజాల నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ చేపట్టాల్సిందేనని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..అక్రమ మైనింగ్‌లో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుతో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ల హస్తం ఉందని ఆరోపించారు. అధికారులు అక్రమార్కులకు సహకరిస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐడీ విచారణతో నిజాలు బయటికి రావు..సీబీఐ విచారణ చేయాల్సిందేనని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నడికుడి, కొనంకి, కేసానుపల్లి గ్రామాల్లో ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి యరపతినేని టన్నుల కొద్దీ ముడి ఖనిజాన్ని తవ్వి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హైకోర్టులో పిల్ వేసిన గురువాచారిని అక్రమ కేసులో ఇరికించి టీడీపీలో చేర్చుకోవాలని చూశారని అన్నారు. అక్రమ మైనింగ్ విషయంలో ఎమ్మెల్యే యరపతినేనికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. అక్రమ మైనింగ్‌పై కోర్టు మెట్లెక్కిన వారిపై యరపతినేని అక్రమ కేసులతో వేధిస్తున్నారని, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణా రెడ్డిపై 6 అక్రమ కేసులు బనాయించారని వెల్లడించారు. కోడెల కుటుంబానికి సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతోన్న సత్తెనపల్లి రెవెన్యూ అధికారులు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని చెప్పారు. -
గుంటూరులో మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
-
ప్రజాప్రతినిధుల నిర్బంధం అప్రజాస్వామికం
-
బాబూ.. పోలీసుబలంతో ఎంతకాలం కవర్ చేసుకుంటావు!
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నియంతృత్వ ధోరణిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురజాలలో సాగుతున్న మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి వెళ్లిన తమ పార్టీ నిజనిర్దారణ కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, గురజాలలో సెక్షన్ 144 విధింపు వంటివి.. మైనింగ్ కుంభకోణంలో నిందితులు ఎవరో చెప్పకనే చెప్తున్నాయని ట్విటర్లో పేర్కొన్నారు. మీ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలపై నినదిస్తున్న గొంతుకలను అణచివేయడానికి ఎంతకాలం ఇలా క్రూరంగా పోలీసుబలాన్ని ప్రయోగిస్తారని సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. గుంటూరులో ప్రభుత్వ దాష్టీకం! గుంటూరులోని అక్రమ క్వారీలపై వైఎస్సార్సీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుతగిలింది. ఎక్కడికక్కడ పార్టీ నేతలను అడ్డుకుంది. అక్రమ మైనింగ్ క్వారీలను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతోపాటు లేళ్ల అప్పిరెడ్డి, ముస్తఫాలను మంగళగిరి కాజ టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దుగ్గిరాల పోలీసుస్టేషన్‌కు తరలివచ్చారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, నిజనిర్దారణలో భాగంగా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నడికుడి రైల్వేస్టేషన్ వద్ద కృష్ణారెడ్డిని బలవంతంగా రైల్లోంచి దించి అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా హంగామా సృష్టిస్తున్న పోలీసులు అడుగడుగునా వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. The unlawful arrests of YSRCP leaders, who were part of the Fact-Finding Committee for Gurajala mining scam; and proclaiming Section 144 is enough to prove who is culpable. @ncbn for how long will you use the brutal police force to suppress voices and cover up your scams? — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 August 2018 -
మైనింగ్ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే..
-
‘అక్రమ మైనింగ్‌లో వారి ప్రమేయముంది’
దుగ్గిరాల : అక్రమ మైనింగ్ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ ప్రమేయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, పంచ భూతాలను సైతం ఆక్రమిస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు లక్షల టన్నుల అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారన్న ఆయన... ఈ విషయంలో టీడీపీ నేతలు అతి తెలివి ప్రదర్శిస్తూ కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం ఉధృతం చేస్తాం.. తమ నేతలను కాపాడుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అనామకులపై కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బొత్స విమర్శించారు. యరపతినేని అక్రమ మైనింగ్‌ను సందర్శించేందుకు అనుమతినివ్వకపోవడం ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా నిర్బంధిస్తునారన్న బొత్స.. ఇలాంటి చర్యలకు భయడేది లేదని భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల తీరుపై బొత్స ఆగ్రహం.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా.. గుంటూరు వెళ్లనంటూ హామీనివ్వాలని, స్టేషనుకు వచ్చి సంతకం పెట్టాలని పోలీసులు ఆయనను కోరారు. ఈ నేపథ్యంలో తానూ చదువుకున్నానని, తనకు చట్టం గురించి తెలుసునని బొత్స అన్నారు. తానేమీ భయపడి పోలీసు స్టేషనుకు రాలేదని, పోలీసుల మీద ఉన్న గౌరవంతోనే వచ్చానని పేర్కొన్నారు. ఏం తప్పు చేశానని సంతకం పెట్టమంటున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. తప్పు చేస్తే కోర్టుకు తీసుకెళ్లాలి గానీ ఈ విధంగా ప్రవర్తించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అక్రమ మైనింగ్‌లో బాబు, లోకేశ్ ప్రమేయం ఉంది’
-
టోల్‌గేటు వద్ద బొత్సను అడ్డుకున్న పోలీసులు
-
గురజాల వెళ్తుంటే భయమెందుకు?
సాక్షి, గుంటూరు : అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌ను తరలించేందుకు యత్నిస్తున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. గురజాల వెళ్లెందుకు అనుమతి లేదని ఆయనను నిరాకరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా అంతా పోలీస్ నిర్భందంలో ఉందని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ ప్రభుత్వంలో కోర్టు, చట్టం, రాజ్యాంగమంటూ లేవంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్భంద పరిస్థితిని ఎన్నడూ చూడలేదని అన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు గురజాల వెళ్తుంటే ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్ వైఎస్సార్సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నడికుడి రైల్వే స్టేషన్ వద్ద కృష్ణారెడ్డిని బలవంతంగా రైల్లోంచి దించి అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు హంగామ సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతను గురజాల వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. -
మైనింగ్‌లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే వారికి భయం
-
పల్నాడ్లో తీవ్ర ఉద్రిక్తత..144 సెక్షన్ అమలు
-
‘మైనింగ్‌లో చంద్రబాబు, లోకేశ్‌కు వాటాలు’
సాక్షి, గుంటూరు : గురజాలలో పోలీసులు భయందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హౌస్ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ దాచేపల్లి, పిడుగురాళ్ల పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో సోమవారం వారిని హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురజాలలో నాలుగేళ్లుగా టీడీపీ నేతలు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగుతోందని, అన్యాయాలు బయటకు వస్తాయని శ్రీనివాసరావు బయపడుతున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే టీడీపీ ర్యాలీకి అనుమతిని ఇచ్చిన పోలీసులు, వైఎస్సార్సీపీ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధంగా అనుమతి కోరితే తిరస్కరించారని, పోలీసులు అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2009లో చనిపోయిన రైతుపై అక్రమ మైనింగ్ కేసు పెట్టారని, అమాయక ప్రజలపై కేసులు పెట్టి టీడీపీ నేతలు తప్పించుకుంటున్నారని మహేష్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోక్‌శ్‌కు వాటా అక్రమ మైనింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి వాటా ఉందని, నిజాలను ఎవరు అణచివేయలేరని నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆరోపించారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరగుతోందని, మైనింగ్‌లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే ఆయన బయపడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు పర్యటిస్తే వారి బండారం బయటడుతుందని తమ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఒక కూలీ 40 కోట్ల దోచుకున్నారంటే ఎవరు నమ్మలేరని అన్నారు. గతంలో కోడెల కుమారుడు నడిరోడ్డుపై సభ పెడితే అనుమతించారని, చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే తమకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆసుపత్రిపై ఆంక్షలు ఎమ్మెల్యే గోపిరెడ్డికి చెందిన ఆసుపత్రిని కూడా పోలీసులు నిర్భందించారు. పోలీసుల ఆంక్షలతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.. యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరగుతోందని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజనాకు గండికొడుతున్నారని ఆయన విమర్శించారు. దీనిపై పలుమార్లు ధర్నా కూడా నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తే ఇలా అక్రమాలు బయటకు వస్తాయని తెలిపారు. -
గురజాలలో పోలీసుల రాజ్యం
సాక్షి, గుంటూరు : గురజాల నియోజకవర్గంలో పోలీసులు అక్రమ అరెస్ట్‌లతో వైఎస్సార్సీపీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేడు పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్యారింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి, పార్టీనేత కాసు మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇళ్లనుంచి బయటకు వచ్చిన అనేక మంది కార్యకర్తలను, పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేతలేవరు బయటకు రాకుండా దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కమిటీ పర్యటిస్తే అక్రమ మైనింగ్‌పై నిజాలు బయటకొస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నియోజవర్గంలో పోలీసులు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తొత్తులుగా మారారు. మూడు రోజుల క్రితం టీడీపీ ర్యాలీకి అనుమతించిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పర్యటనను మాత్రం అడ్డుకుంటున్నారు. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించిన పోలీసులు ముందుగానే వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు పంపించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు కనబడుతోంది. పల్నాడులో 28 లక్షల టన్నుల తెల్లరాయిని దోచుకున్నట్లు ఇటీవల నిర్ధారణ కమిటీ తేల్చిన విషయం తెలిసిందే. తనపై కేసులు రాకుండా టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని పన్నాగం కుట్రలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు అక్రమంగా కోట్లు దోచుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులకు దోపిడీలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
నరసరావు పేటలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : నరసరావు పేటలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన నివాసానికి వచ్చే దారిలో బారికేడ్ల్ పెట్టి, రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కాగా నేడు గురజాలలోని పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్యారింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు పార్టీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలకు అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని నేతలు ఆరోపిపస్తున్నారు. క్యారింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలు మాయమవుతాయంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు ద్వారా నోటీసులు పంపారు. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని, గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు నోటీసులు పంపిన పోలీసులు, రేపల నివాసరావు, గాంధీతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
యరపతినేనిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం
-
రేపు గురజాలలో వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటన
సాక్షి, గుంటూరు : గురజాలలో వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీ సోమవారం పర్యటించనుంది. పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ క్వారీంగ్‌లో కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీని అడ్డుకోవటానికి ప్రభుత్వం కుట్రపన్నుతోంది. పోలీసుల ద్వారా వైఎస్సార్ సీపీ నాయకులకు నోటీసులు పంపింది. అక్రమ క్వారీంగ్ సంబంధించి సాక్ష్యాలు మాయమవుతాయంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. నోటీసుల పేరుతో గురజాల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేతలకు బెదిరింపులు మొదలయ్యాయి. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను హెచ్చరిస్తున్నారు. -
యరపతినేనిని రక్షించడానికి ప్రయత్నాలు
-
యరపతినేనిని రక్షించడానికి ప్రయత్నాలు
గుంటూరు: గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ కేసు విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించారు. కోర్టు ఏమని ఆదేశాలు జారీ చేసింది.. మైనింగ్ అధికారులు అక్కడ ఎవరిని విచారిస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ చేసిన వారిని వదిలేసి సంబంధం లేని వారికి నోటీసులు ఇచ్చి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఈ కేసుకు సంబంధం లేని పల్వరైజింగ్ మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు..ఇది చాలా అన్యాయం, దారుణమని అన్నారు. పల్వరైజింగ్ మిల్లర్లు భయపడవద్దు..మీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే యరపతినేని స్థానికుల్ని రెచ్చగొట్టి కేసు పక్కద్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో సున్నపురాయిని దోచేసిన వారికి శిక్షపడేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. -
కోర్టు ఆదేశాలతో కదిలిన మైనింగ్ శాఖ
గుంటూరు : గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరిగిందని హైకోర్టు గుర్తించింది. విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ మైనింగ్ శాఖాధికారులు ఆగమేఘాల మీ కదిలారు. కోనంకి, కేశానుపల్లి, సీతారామాపురం సహా ఎనిమిది చోట్ల సర్వే చేసి అక్రమ తవ్వకాల లెక్కలు తీస్తున్నారు. దీనికి సంబంధించి యరపతినేనికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మైనింగ్, రెవిన్యూ శాఖాధికారులు విచారణ జరుపుతున్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను కూడా ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. -
గురజాల టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
-
ఇసుక మాఫియా : టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై మైనింగ్ ఆరోపణల వ్యవహారంలో హైకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. -
దాచేపల్లి ఘటన: సుబ్బయ్య మృతిపై అనుమానాలు?
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దాచేపల్లి అత్యాచార ఘటనలో నిందితుడు రామ సుబ్బయ్య మరణంపై అనుమానాలు మొదలయ్యాయి. సుబ్బయ్యని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు మృతదేహం ఫోటోను చూపించిన తర్వాత.. వాళ్లు తమ వాదనను వినిపిస్తున్నారు. సుబ్బయ్య కాళ్లు నేలను తాకినట్లుగా ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుండటంతో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపణలకు దిగారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా సుబ్బయ్యను చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. ‘మా చేతుల్లో చావలేదని బాధపడుతున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుబ్బయ్య కొడుకును కూడా ఉరితీయాలి’ అని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య 48 గంటల హైడ్రామా తర్వాత శవమై తేలాడు. గురజాల మండలం దైద వద్ద అటవీలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. మరి కాసేపట్లో దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
ఇది అంతం కాదు.. ఆరంభం
పిన్నెల్లి (మాచవరం): దుర్మార్గపు టీడీపీ పాలన పతనం పిన్నెల్లి నుంచే ప్రారంభం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేబాట పాదయాత్ర ముగింపు సభ మాచవరం మండంలోని పిన్నెల్లి గ్రామంలో శని వారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైయినా.. ఆటంకాలు వచ్చినా.. చివరకు అక్రమంగా జైలులో పెట్టినా.. మన అధినేత జగన్మోహన్రెడ్డి ధర్మ యుద్ధం చేస్తున్నారని, ఇది అంతంకాదని.. ఆరంభం మాత్రమేనని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టించిన నాయకులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు అధికారం మారితే సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నారని.. తాము అధికారంలోకి వస్తే అటువంటి అధికారులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. టీడీపీ చేస్తున్న ప్రతి అక్రమాలు అన్నింటినీ గుర్తు పెట్టుకుంటున్నామని, తమ కార్యకర్తలపై పెట్టిన కేసులకు వడ్డీతో బదులు తీర్చుకుంటున్నామని స్పష్టంచేశారు. మద్దతు ధర ఏది? రైతులు పండించే పంటలకు టీడీపీ పాలనలో కనీస మద్దతు ధర లభించటంలేదని కాసు మహేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింల సంక్షేమానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషిని గుర్తుచేశారు. చంద్రబాబు క్యాబినెట్లో 26 మంది మంత్రులు ఉన్నారని, ముస్లింలకు మాత్రం చోటు కల్పించలేదని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రి అయిన ఆరునెలల్లో గురజాల నియోజకవర్గానికి సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.600 కోట్లు అక్రమంగా సంపాదించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంచేశారు. కార్యకర్తలను ఇబ్బందిపెడితే సహించం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందిపెడితే ఊరుకునేదిలేదని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు. టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా పాటిస్తున్న అధికారులను వదిలిపెట్ట బోమన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిపాలనా కావా లంటే జగన్‌ను సీఎంగా చేసుకోవాలని సూచించారు. నియోజకర్గంలో ఎమ్మెల్యే యరపతినేని ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏమీ ఇవ్వని యరపతి నేని ఇప్పుడు అక్రమంగా దోచుకున్న సంపాదనతో షష్టిపూర్తి, సీమంతాలు చేస్తూ ముక్కుపుడకలు, చీరలు, పంచెలు పంచడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో గనులు దోచుకోవడమే కాకుండా అన్నింటా కమీషన్లు వసూలు చేస్తూ వ్యాపారులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు జగన్‌కు ఓట్లు వేసి సీఎం చేయాలని కోరారు. ఇటీవల పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో ముస్లింలపై టీడీపీ అగ్రకుల నేతలు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురజాల ఎమ్మెల్యేగా మహేష్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలను హింసించే స్థానిక ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించి మంచికల్లుకు పంపించాలని పిలుపునిచ్చారు. కాసు కుటుంబం నుంచి వచ్చిన నేటితరం యువనాయకుడు మహేష్‌రెడ్డిని అఖండమెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలుత నగరి ఎమ్మెల్యే రోజ ప్రసంగించారు. ఈ సభలో యువనాయకుడు జంగా కోటయ్య, మాజీ సర్పంచ్ చింతపల్లి నన్నే, మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వట్టె రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు చింతపల్లి సైదా, ఎంపీటీసీ సభ్యులు పార్లగొర్ల కోటేశ్వరరావు, యడవల్లి మరియదాసు, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు శివయాదవ్, వెంకటరెడ్డి, రమేష్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి అనిల్‌కుమార్, అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, సేవాదళ్ మండల కన్వీనర్ షేక్ మహ్మద్‌జానీ, సొసైటీ డైరెక్టర్ గుర్రం వీరాంజనేయరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతలే సైంధవులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నాలుగు వరుసల రహదారి ప్రాజెక్టు అది. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించింది. నిర్మించు–నిర్వహించు–బదలాయించు(బీవోటీ) విధానం కింద నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఏపీఆర్డీసీ రూపొందించిన డీపీఆర్‌ను సైతం ఆమోదించింది. కానీ, అధికార పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఒప్పుకోలేదు. అంచనా వ్యయాన్ని మూడు రెట్లు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేకుంటే టెండర్ల ప్రక్రియ జరగనివ్వబోమని తేల్చిచెబుతున్నారు. వారి బెదిరింపుల వల్ల కాంట్రాక్టర్లు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆరు నెలలు దాటుతున్నా టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. 51 కిలోమీటర్లు.. రూ.505 కోట్లు హైదరాబాద్–గుంటూరు మార్గంలో నార్కట్‌పల్లి నుంచి అద్దంకి వరకు రహదారిని గతంలోనే అభివృద్ధి చేశారు. ఈ మార్గంలో కొండమోడు–పేరేచర్ల మధ్య నాలుగు వరుసల రహదారిని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలని 2016లో నిర్ణయించారు. దీనిద్వారా హైదరాబాద్–విజయవాడ రహదారికి ప్రత్యామ్నాయంగా నాలుగు లేన్ల రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, టోల్ వసూలు, బదిలీ (డీబీఎఫ్ఓటీ) కింద ఈ రహదారిని నిర్మించేందుకు ఏపీఆర్డీసీ కేంద్రం నుంచి అనుమతి పొందింది. ఏపీఆర్డీసీ రెండు చోట్ల హై లెవల్ వంతెనలతో 51 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసింది. జాతీయ రహదారుల ప్రమాణాల ప్రకారం కిలోమీటర్‌కు రూ.10 కోట్ల చొప్పున 51 కిలోమీటర్లకు రూ.505 కోట్ల వ్యయం అవుతుందని తేల్చింది. ఈ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించి అనుమతులు జారీ చేసింది. దీంతో టెండర్ల ప్రక్రియలో మొదటి అంకంగా అర్హత గల కంపెనీలు రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్క్యూ) టెండర్లలో పాల్గొనాలని గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.20 కోట్లు అదనంగా ఇచ్చిన ప్రభుత్వం రహదారి నిర్మాణానికి రూ.505 కోట్లు అవసరమని ఏపీఆర్డీసీ పేర్కొంది. రెండు హైలెవల్ వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో రూ.20 కోట్లు అదనంగా మంజూరు చేసింది. హైదరాబాద్–గుంటూరు మధ్య హైలెవల్ బ్రిడ్జికి రూ.15 కోట్లు, సత్తెనపల్లి–అమరావతి మార్గంలో హైలెవల్ బ్రిడ్జికి రూ.5 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది. మూడు నియోజకవర్గాలు కొండమోడు–పేరేచర్ల మధ్య నాలుగు వరుసల రహదారిని గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల మీదుగా నిర్మించాలి. అయితే ఈ రోడ్డును నిర్మించాలంటే అంచనాలు పెంచాల్సిందేనని ఆయా నియోజకవర్గాల పరిధిలోని అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. లేకుంటే పనులు జరగనిచ్చేది లేదని చెబుతుండడంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అంచనా వ్యయాన్ని పెంచితేనే భూ సేకరణ ప్రక్రియ సాఫీగా జరగనిస్తామని హెచ్చరించడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని దోచుకోవడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు టెండర్లు వాయిదా అంచనా వ్యయాన్ని డీపీఆర్ అంచనా కంటే మూడు రెట్లు.. అంటే రూ.1,500 కోట్లకు పైగా పెంచాలని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి టెండర్లలో పాల్గొనాలంటూ ఆహ్వానిస్తున్నా.. కాంట్రాక్టు సంస్థలేవీ ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు ఏపీఆర్డీసీ నాలుగుసార్లు టెండర్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ టెండర్లలో కాంట్రాక్టు సంస్థలు పాల్గొనకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నట్లు ఆర్అండ్బీ వర్గాలు వెల్లడించాయి. చివరగా మార్చి 9న తుది గడువుగా మరో టెండర్ నోటిఫికేషన్‌ను ఏపీఆర్డీసీ జారీ చేసింది. -
ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న
గురజాల (గుంటూరు) : ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి సొంత పిన్ని, తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తమ్ముడు మృతిచెందగా.. పిన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాలలోని ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అన్నపురెడ్డి కోటేశ్వర్రావు, అన్నపురెడ్డి రమేష్(31) ల మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి వివాదం నెలకొని ఉంది. ఈ విషయంపై వారి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. తమ్ముడి ఆస్తిని ఎలాగైనా కాజేయాలని ఆశించిన కోటేశ్వర్రావు ఆదివారం ఉదయం రమేష్ ఇంటికి వచ్చి అతనితో గొడవకు దిగాడు. కత్తితో రమేష్‌పై దాడి చేశాడు. అడ్డొచ్చిన పిన్ని అరుణను కూడా విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిద్దనిరి ఆస్పత్రికి తరలించగా.. రమేష్ మృతిచెందాడు. అరుణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పులిపాడులో మొసలి కలకలం
గుంటూరు జిల్లా గురజాల మండలలోని పులిపాడు గ్రామంలో మొసలి కలకలం రేపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పులిపాడు గ్రామ సరిహద్దులో బ్రిడ్జి దగ్గర కొన్నిరోజుల నుంచి ముసలి సంచరిస్తూ కోతులను, లేగదూడలను తింటున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అనంతరం అటవీ శాఖకు సమచారం అందించడంతో ఆ శాఖ అధికారులు స్థానికుడు జమ్మిగుంపుల రాంబాబు సహకారంతో జేసీబీ ద్వారా తవ్వించారు. వాగుకట్టలో 25 అడుగుల సొరంగంలో మొసలి బయట పడింది. మెసలిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. మొసలిని పట్టుకొని దగ్గరలో ఉన్న కృష్ణానదిలో వదిలిపెడతామని ఫారెస్టు రేంజ్ అధికారి కె.రామిరెడ్డి తెలిపారు. ఫారెస్టు డిఫ్యూటిరేంజ్ అధికారి జి.రాజశేఖర్ గౌడ్, ఫారెస్టు బీట్ అధికారి ఆర్వీఎస్ తిరుపతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గురజాల రామాలయంలో చోరీ
గుంటూరు జిల్లా గురజాలలోని రాములవారి ఆలయంలో దొంగలు పడి అతి పురాతన ఉత్సవ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. రామాలయంలోని పంచలోహ నిర్మిత శ్రీరాముడు, సీత, లక్షణస్వామి వారి విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న రామాలయంలో సోమవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వెళ్లిన భక్తులు ఈ విషయాన్ని గమనించి పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎత్తుకెళ్లిన విగ్రహాల విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంటున్నారు. -
అనుమానంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు
గురజాల: భార్యపై అనుమానంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీదేవి రైస్‌మిల్ సెంటర్లో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న వెంకటస్వామి, రమాదేవి(47) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటస్వామి గొడవ పడుతున్నాడు. ఇదే విషయం పై శుక్రవారం భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన వెంకట స్వామి, భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గురజాలలో రోహిత్ కుటుంబసభ్యుల విచారణ
-
గురజాలలో రోహిత్ కుటుంబసభ్యుల విచారణ
గుంటూరు : హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా గురజాలలోని రోహిత్ నాయనమ్మ మాధవమ్మ, తాతయ్య వెంకటేశ్వర్లును పోలీసులు బుధవారం విచారించారు. మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీశారు. అలాగే రోహిత్ కుటుంబం ఎంతకాలంగా గురజాలలో నివాసం ఉంది, ఎప్పుడు హైదరాబాద్ వచ్చిందనే దానిపై వివరాలు సేకరించారు. రోహిత్ కుటుంబసభ్యులు, ఇంటి చుట్టుపక్కలవారితో పాటు అతని స్నేహితులను ప్రశ్నించారు. రోహిత్ ఆదివారం హెచ్‌సీయూ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
బీభత్సం
గురజాల/దాచేపల్లి, న్యూస్‌లైన్: భీకర ఉరుములు గుండెల్లో దడపుట్టించాయి. మిరుమిట్లు గొలిపే మెరుపులు భయాందోళనకు గురిచేశాయి. పెనుగాలులు విధ్వసం సృష్టించాయి. పలు చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు భారీగా నీరుచేరింది. ప్రధాన రహదారులు, రైలు మార్గాల్లో చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మట్టిమిద్దెలు కుప్పకూలాయి. పల్లెల్లో విద్యుత్ సరఫరా లేక అంధకారం నెలకొంది. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంమీద ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాను అతలాకుతలం చే సింది. ఈదురుగాలుల ధాటికి దాచేపల్లి-మాచర్ల ప్రధాన రహదారిలోని రైల్వే ఓవర్బ్రిడ్జివద్ద భారీగా పెరిగిన చింతచెట్లు నేలకొరిగాయి. ఆర్అండ్ అధికారులు చెట్ల తొలగింపు చర్యలు తీసుకున్న తరువాత వాహనాలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. నడికుడి రైల్వేస్టేషన్లో ఒకటి, మూడవ నంబర్ ప్లాట్‌ఫాంలపై ఉన్న చెట్లు విరిగి పట్టాలపై పడ్డాయి. అతికష్టం మీద రైల్వే సిబ్బంది వాటిని తొలగించారు. చెట్టు విరిగి పడటంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లన్నీ రెండవ నంబర్ ప్లాట్‌ఫాం నుంచే వెళ్లటంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ స్టేషన్లో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో పలు రైళ్లు నడికుడి రైల్వేస్టేషన్లో కొద్దిసేపు ఆపివేశారు. తాత్కాలిక మరమ్మతుల అనంతరం రైళ్లు పునరుద్ధరించారు.ధాటికి నడికుడి గ్రామంలో వేల్పుల రాజారావుకు చెందిన రేకుల ఇల్లు నేలమట్టం అయింది. ఇంటిపైకప్పు లేచింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో ప్రమాదం తప్పింది. అదే గ్రామంలో చెందిన మంగళగిరి మరియదాసుకు చెందిన రేకుల ఇల్లు కూడా కూలిపోయింది. కార్యాలయాల్లో తడిచిన రికార్డులు గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో నాలుగు మట్టిమిద్దెలు కూలినట్టుగా రెవెన్యూ వర్గాలు గుర్తించాయి.స్థానిక ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో కార్యాలయంలో రికార్డులు, ఫర్నిచర్లు తడిసిపోయాయి. లోపల నీరు నిలవడంతో సిబ్బంది ఆరుబయటే విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. మండలంలో 7.4 సెం,మీ వర్షపాతం నమోదు జరిగినట్లు తహశీల్దార్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. వృద్ధుల మృతి..: భీకర శబ్ధంతో కూడిన ఉరుముల ధాటికి జిల్లాలో ఇద్దరు వృద్ధులు గుండె ఆగి మృతిచెందారు. అచ్చంపేట మండలం హసనాబాద్ ఎస్సీ కాలనీకి చెందిన ఆపత్తుల చిట్టెమ్మ (50) ఉరుముల ధాటికి గుండెపోటుతో మరణించింది. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు మద్దురి కాశమ్మ(75) ఉరుములకు భయపడి బంధువుల ఇంటికి వెళ్తూ దారిలోనే మృతిచెందింది. -
కాయితికి ప్రముఖుల నివాళి
ఆనందపేట(గుంటూరు)/రెంటచింతల, న్యూస్‌లైన్ :గురజాల మాజీ శాసనసభ్యుడు కాయితి వెంకటనర్సిరెడ్డి(68)కి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శనివారం ఉదయం ఆయన మృతదేహాన్ని గుంటూరులోని సాయిభాస్కర ఆస్పత్రి నుంచి శ్యామలానగర్ 1వలైనులోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్ట్రీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, ఎం.డి.నసీర్ అహ్మద్(గుంటూరు తూర్పు), రాతంశెట్టి రామాంజనేయులు(పెదకూరపాడు), ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్, పార్టీ నాయకులు యేటిగడ్డ నరసింహారెడ్డి, చింతుగుంట్ల రంగారెడ్డి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, కాంగ్రెస్‌పార్టీ నాయకుడు కూచిపూడి సాంబశివరావు, అభిమానులు, కార్యకర్తలు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన రెంటచింతలకు తరలించారు. రెంటచింతలలోని వైఆర్ఎస్ పాఠశాలలో ఉంచిన మృతదేహాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సందర్శించారు. తన రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడిన ఆత్మబంధువును కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమయాత్రలో శ్మశానం వరకు ఆయన పాల్గొన్నారు. మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పంపిన సంతాప సందేశాన్ని స్థానిక తహశీల్దార్ నూనె వెంకటప్రసాద్ చదివి వినిపి ంచారు. నివాళ్లర్పించిన వారిలో ఎమ్మెల్సీ టి.జి.వి కృష్ణారెడ్డి తదితరులున్నారు. కుటుంబ నేపథ్యం.. కాయితి కృష్ణారెడ్డి, అచ్చమ్మ దంపతులకు 1945 డిసెంబర్ 9న రెంటచింతల గ్రామంలో కాయితి వెంకటనర్సిరెడ్డి జన్మించారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీకృష్ణ సాఫ్ట్వేర్ ఇంజినీర్. రెండవ కుమారుడు రవికృష్ణ పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేపథ్యం సర్పంచ్‌గా, గురజాల సమితి అధ్యక్షుడిగా ఆయన ప్రజలకు సేవలందించారు. 1985లో గురజాల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2800 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎం.అంకిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1989లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అనుమొల శెట్టి సాంబశివరావుపై 26వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ టికెట్టు రాకపోవడంతో రెబల్‌గా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గంలోఅభివృద్ధి పనులు.. కాయితి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రెంటచింతలలో 4 సంక్షేమ హాస్టళ్లు, గురజాలలో సబ్-కోర్టు, పొందుగులలో బ్రిడ్జి, 30 పడకల ఆస్పత్రి, విద్యుత్ సబ్-స్టేషన్ మంజూరు చేయించారు. స్థానిక సాగర్మాత జూనియర్ కళాశాలకు అటాచ్డ్ హాస్టల్ మంజూరులో కీలక పాత్ర పోషించారు. బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటుకు స్థలాన్ని ఉచితంగా అందజేశారు. -
గురజాల నియోజక వర్గంలో టీడీపికి షాక్
-
గురజాల నియోజక వర్గంలో టీడీపికి షాక్
గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు ముఖ్యనేతలు సహా కార్యకర్తలు రాజీనామా చేశారు. గుదే శివ, దాచినేని వెంకయ్య, మల్లెల ఆదినారాయణ, బుల్లబ్బాయితో పాటు మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ సభ్యులు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు నాయుడు నోట సమైక్యాంధ్ర మాట రాకపోవడం తమను బాధించిందని వారు తెలిపారు. చంద్రబాబు కన్నా తమకు ప్రజలు ముఖ్యమని టీడీపీకి రాజీనామా చేసిన నేతలు పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకే టీడీపీకి రాజీనామా చేశామని వారు వెల్లడించారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
గురజాల నియోజకవర్గం నుంచి చంద్రబాబు బస్సుయాత్ర?
గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాలోని గురజాల నియోజకవర్గం నుంచి బస్సుయాత్రను చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు. కాగా, బాబు బస్సుయాత్ర చేపడతారా? లేదా? అనే దానిపై పలు అనుమానాలున్నాయి. వచ్చే నెల 1 నుంచి దాచేపల్లి మండలం పొందుగల గ్రామం నుంచి బస్సుయాత్ర చేపడతారని సమాచారం ఉన్నా.. ఈ యాత్రపై అనేక సందేహాలున్నాయి. ముందు ప్రకటించిన యాత్ర కాస్తా వెనక్కి పోవడంతో ..తాజాగా ప్రకటించిన యాత్ర జరుగుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సీమాంధ్రలో ఆగస్టు 25వ తేదీ నుంచి బస్సుయాత్రను చేపడుతున్నట్లు ముందుగా చంద్రబాబు ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఓ దశలో ఎలాగైనా యాత్రను చేపట్టేద్దామని నిర్ణయించుకున్న బాబుకు సీమాంధ్ర నేతలు అసలు సంగతి చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం వికటించిందని కళ్లు తెరిపించారు. దీంతో బాబు బస్సు యాత్రకు బ్రేక్ పడింది. తొలుత ప్రకటించిన షెడ్యల్ ప్రకారం విజయనగరం జిల్లా కొత్త వలస నియోజకవర్గం నుంచి రోడ్ షోను ఆరంభించాల్సి ఉంది. బస్సుయాత్రపై సీమాంధ్ర నాయకులతో సంప్రదింపులు జరిపినప్పుడు అక్కడి నేతలు బాబుపై వ్యతిరేకతను పూసగుచ్చినట్టు వివరించారు. రాష్ట్ర విభజనను స్వాగతించి ప్యాకేజీలు గురించి మాట్లాడిన బాబు వైఖరిని సీమాంధ్ర ప్రజలు ఛీ కొడుతున్నారని కొంతమంది ముఖ్యనేతలు కుండబద్దలు కొట్టారు. సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందేమేనని భయపడిన బాబు యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. అంతే కాకుండా సీమాంధ్ర మొత్తం సమైక్యాంధ్ర కోరుతున్నప్పుడు జనంలోకి వచ్చి ఏం చెప్తారన్న విషయమై కూడా బాబును పార్టీనేతలు ప్రశ్నించారు. దీంతో అప్పటి యాత్రకు బ్రేక్ పడక తప్పలేదు.