బొత్స సత్యనారాయణను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, గుంటూరు : అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌ను తరలించేందుకు యత్నిస్తున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. గురజాల వెళ్లెందుకు అనుమతి లేదని ఆయనను నిరాకరించారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా అంతా పోలీస్ నిర్భందంలో ఉందని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ ప్రభుత్వంలో కోర్టు, చట్టం, రాజ్యాంగమంటూ లేవంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్భంద పరిస్థితిని ఎన్నడూ చూడలేదని అన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు గురజాల వెళ్తుంటే ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్
వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నడికుడి రైల్వే స్టేషన్ వద్ద కృష్ణారెడ్డిని బలవంతంగా రైల్లోంచి దించి అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు హంగామ సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతను గురజాల వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment