గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు ముఖ్యనేతలు సహా కార్యకర్తలు రాజీనామా చేశారు.
గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు ముఖ్యనేతలు సహా కార్యకర్తలు రాజీనామా చేశారు. గుదే శివ, దాచినేని వెంకయ్య, మల్లెల ఆదినారాయణ, బుల్లబ్బాయితో పాటు మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ సభ్యులు టీడీపీకి గుడ్‌బై చెప్పారు.
చంద్రబాబు నాయుడు నోట సమైక్యాంధ్ర మాట రాకపోవడం తమను బాధించిందని వారు తెలిపారు. చంద్రబాబు కన్నా తమకు ప్రజలు ముఖ్యమని టీడీపీకి రాజీనామా చేసిన నేతలు పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకే టీడీపీకి రాజీనామా చేశామని వారు వెల్లడించారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే.