
సాక్షి, గుంటూరు : నరసరావు పేటలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన నివాసానికి వచ్చే దారిలో బారికేడ్ల్ పెట్టి, రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కాగా నేడు గురజాలలోని పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్యారింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు పార్టీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలకు అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని నేతలు ఆరోపిపస్తున్నారు. క్యారింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలు మాయమవుతాయంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు ద్వారా నోటీసులు పంపారు. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని, గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలకు నోటీసులు పంపిన పోలీసులు, రేపల నివాసరావు, గాంధీతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment