kasu mahesh reddy
-
‘సరస్వతి’ భూముల్లో ప్రతి సెంటూ కొన్నదే
సాక్షి, అమరావతి: ‘సరస్వతి పవర్’ భూముల్లో ప్రతి సెంటూ కొనుగోలు చేసిందేనని, ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను రంగంలోకి దించిన విధంగానే.. ఇప్పుడు సరస్వతి భూముల వ్యవహారంలోనూ అదే పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, పేట్రేగుతున్న టీడీపీ మూకల అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సరస్వతి భూములపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు అడిగిన దానికంటే ఎక్కువ చెల్లించి కొన్నారు సరస్వతి కంపెనీ భూసేకరణ ఇప్పుడు జరిగింది కాదని.. పదిహేనేళ్ల క్రితం భూముల సమీకరణ జరిగిందని కాసు మహేశ్‌రెడ్డి చెప్పారు. 2009లో సరస్వతి కంపెనీ భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధపడగా.. అప్పట్లో రైతులంతా సమావేశమై ఎకరం మెట్ట భూమికి రూ.1.50 లక్షలు, పల్లపు భూమికి రూ.2.75 లక్షలు చెల్లించాలని కోరుతూ తీర్మానించారని గుర్తు చేశారు. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వారు కోరిన దానికంటే మిన్నగా.. అధిక ధర చెల్లించారని గుర్తు చేశారు. కొన్ని భూములకు ఆ రోజుల్లోనే ఎకరానికి రూ. 8.50 లక్షలు చెల్లించారన్నారు. ఆ సమయంలోనే ఇదే ప్రాంతంలో భవ్య సిమెంట్ కంపెనీ ఎకరం రూ.50 వేల చొప్పున కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతులకు ఎక్కువ మేలు చేసింది ఎవరని, ఈ విషయాలను పవన్‌కళ్యాణ్ ఎందుకు దాచిపెడుతున్నారని, సరస్వతి భూముల విషయంలో ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ భూముల సంగతి పట్టదా పవన్! గురజాల మండలంలో ప్రభుత్వం నుంచి 40 ఏళ్ల క్రితం సంఘీ సిమెంట్స్ భూములు తీసుకుని ఇప్పటికీ పరిశ్రమ ప్రారంభించలేదని మహేశ్‌రెడ్డి గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని ఒక్క బస్తా సిమెంట్ కూడా తయారు చేయకుండానే అంబుజా సిమెంట్ ఆ భూములను అదానీకి అమ్మేసిందన్నారు. మై హోమ్, ఇమామి వంటి కంపెనీలు దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమలు ప్రారంభించకపోయినా పవన్‌కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ సంస్థలకు ఇచ్చిన భూములను రద్దు చేస్తామని పవన్ ప్రకటించగలరా అని ప్రశ్నించారు. సరస్వతి భూములపైకి వెళ్లిన పవన్‌కళ్యాణ్‌కు.. హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతంలో వేలాది ఎకరాలను అక్రమంగా పొంది రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ భూముల్లోకి వెళ్లే ధైర్యం పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ హెరిటేజ్ కంపెనీ అనేక మార్గాల్లో సేకరించిన భూముల్లో పవన్ పర్యటించగలరా అని సవాల్ చేశారు. ఇవేమీ పట్టించుకోని పవన్‌కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనుగోలు చేసిన ప్రైవేటు భూములను రద్దు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా!డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించిన పవన్ అన్నీ పచ్చి అబద్ధాలే చెప్పారని మహేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయారని గతంలో పవన్‌కళ్యాణ్ ఎలా తప్పుడు ప్రచారం చేశారో.. సరస్వతి భూముల విషయంలోనూ అలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారన్నారు. అటవీ భూములను కన్వర్షన్ చేశారన్నది పూర్తి అబద్ధమని స్పష్టం చేశారు. అటవీ శాఖకు పవన్‌కళ్యాణ్ మంత్రిగా ఉన్నారని, సరస్వతి భూముల విషయంలో కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు కోసం దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరతో జగన్ భూములు కొనుగోలు చేసి, సరస్వతి సిమెంట్ కంపెనీ నెలకొల్పితే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో ఆ కంపెనీ మైనింగ్ లీజును రద్దు చేశారన్నారు. నిర్దేశించుకున్న సమయానికి ఆ పరిశ్రమ ప్రారంభమై ఉంటే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించేదన్నారు. కడప జిల్లాలో మొదలైన భారతి సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవైపు రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలంటూ.. దేశాలు తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఇలా ఫ్యాక్టరీలు పెట్టాల నుకున్న కంపెనీలపై కక్ష సాధిస్తుండటం దుర్మార్గమన్నారు. -
పవన్ వ్యాఖ్యలకు కాసు మహేష్ రెడ్డి కౌంటర్
-
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
పోలీసుల అరాచకాలపై కాసు మహేష్ రెడ్డి వార్నింగ్...
-
టీడీపీ నేతల పై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
‘టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట’
పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, హత్యలు, అక్రమాలు తప్పితే మరేం కనిపించడం లేదని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లులో దళిత మహిళకు అన్యాయం చేశారని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు.రేషన్ షాపు వ్యవహారంలో మనీషా అనే యువతిని టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత రేషన్‌షాపును మనీషా అనే యువతి చూసుకుంటుంటే ఆమెపై టీడీపీ వారు వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆమె షాప్ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడం మొదలుపెట్టారని, రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు కట్టాలని టీడీపీ నేతలు వేధించారన్నారు. టీడీపీ నేతల వేధింపులతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట అని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు.ఆడ పడుచులను మరీ ముఖ్యంగా ఎస్టీ, ఎస్టీలపై టీడీపీ దాడులకు దిగుతుందన్నారు. పోలీసులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు, మా పార్టీ నాయకులు జూలకల్లు వెళ్తామని, మనీషా కుటుంబానికి అండగా ఉంటామని కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీ అరాచకాలు.. 30 రోజుల పాలన ఇదేనా చంద్రబాబు..
-
వైఎస్ జగన్‌ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశనిర్దేశం చేశారు.కాగా, వైఎస్ జగన్ మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి(శనివారం) నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
పిన్నెల్లి అరెస్టుపై కాసు మహేష్ రెడ్డి సీరియస్
-
ఓటమిపై సమీక్ష చేస్తాం
దాచేపల్లి: తమ ఓటమిపై సమీక్షించుకుంటామని పల్నాడు జిల్లా గురజాల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి తెలిపారు. టీడీపీ చేస్తున్న అవమానాలు, వేస్తున్న నిందలను తట్టుకుని నిలబడతామన్నారు. ఇవే తమలో పట్టుదల పెంచుతాయని చెప్పారు. ఆదివారం ఆయన దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత వైఎస్ జగన్‌ను ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని గుర్తు చేశారు. ఈ అవమానాలే ఆయనలో పట్టుదలను పెంచి.. వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి సీఎం అయ్యేలా చేశాయన్నారు. నిండు సభలో పాండవులను అవమానిస్తే యుద్ధం చేసి రాజ్యం సాధించుకున్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ చేసే అవమానాలను దీటుగా ఎదుర్కొంటామన్నారు. మళ్లీ ప్రజల అండదండలతో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. టీడీపీకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. గెలిచిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవమానాల ప్రతిఫలం టీడీపీ అనుభవించాల్సి ఉంటుందన్నారు. తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజలకు మంచి చేసే విధానంలో హుందాగా వ్యవహరిస్తామని తెలిపారు. జగనన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, మహామహులే ఓడిపోయారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అద్భుతంగా చేసినప్పటికీ మద్యం, ఇసుక విషయంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో, కార్మికుల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు గుర్తించామన్నారు. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకుని మళ్లీ అవి జరగకుండా చూసుకుంటామన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ధైర్యంగా ఉండాలని, త్వరలోనే ప్రతి ఒక్కరినీ కలుస్తానన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నివాళిసాక్షి, అమరావతి: దేశహితం కోసం బలిదానం చేసిన మహనీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అంటూ పలువురు బీజేపీ నేతలు కొనియాడారు. బీజేపీ సిద్ధాంతకర్తల్లో ప్రముఖులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆదివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ, వివిధ ప్రాంతాల్లో పార్టీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోషల్ మీడియా ‘ఎక్స్’లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి నివాళి అర్పించారు. -
ఓటమికి కారణాలు తెలుసుకుంటాం.. దాడులు చేయడం సరికాదు
-
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.అనంతరం కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామన్నారు. ‘‘సుమారు 60, 70 బూత్‌ల్లో రిగ్గింగ్ చేశారు. వెబ్ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్ జరపాలని కోరాం. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను సైతం టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. మహిళలు భయాందోళనలకు గురై గుడిలో తలదాచుకున్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలపై చర్యలేవి?. మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చూస్తే పోలీసులు స్పందించలేదు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారు. దాని వల్లనే హింస చెలరేగింది. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్‌ని గెలిపించాలని నిర్ణయించారు. మాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసింది. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముందస్తు భద్రత కల్పించమని అడిగామని.. అయినా భద్రత చర్యలు తీసుకోలేదన్నారు. పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారు. ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
‘రిగ్గింగ్’ వదిలేసి అడ్డుకుంటే కేసులా?
నరసరావుపేట: ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని వదిలేసి అడ్డుకున్న వారిపై ఈసీ కన్నెర్ర చేయడం ఏమిటని గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం నరసరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఈవీఎం ఘటనను పదేపదే చూపిస్తున్న టీడీపీ అనుకూల మీడియా అదేచోట వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై జరిగిన దాడులను ఎందుకు దాచి పెడుతోందని నిలదీశారు. మిగతా వాటి సంగతేంటి? ఒక్క ఈవీఎం ఘటనను చూపిస్తూ పిన్నెల్లి నిందితుడిగా చేర్చారు. మరి పల్నాడులో పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టడం లేదు? టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడి ఈవీఎంలను పగులకొట్టిన వీడియోలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు అమర్చిన ఈసీ పది రోజులుగా మేం ఘోషిస్తున్నా ఎందుకు స్పందించలేదు?రిగ్గింగ్ జరగలేదని నిరూపించాలి..మాచర్లలో ఈసీకి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులొచ్చాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. పాల్వాయి గేటుతో సహా మేం చెబుతున్న చోట్ల రిగ్గింగ్ జరగలేదని వెబ్ కెమెరా వీడియోలను బయటపెట్టి నిరూపించగలరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. కొత్త గణేశునిపాడులో మహిళల నిర్బంధంపోలింగ్ రోజు మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో అర్ధరాత్రి యాదవులు, ఎస్టీల ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు దిగి స్వైరవిహారం చేశాయి. మహిళలు ప్రాణభయంతో 24 గంటల పాటు ఓ దేవాలయంలో తల దాచుకుంటే ఇరువర్గాలపై కేసులు పెడతారా? ఇదేనా ఈసీ చేసే న్యాయం? పోలింగ్‌కు ముందు పల్నాడులో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ ఆ స్థానంలో తాను నియమించిన వారు విధుల్లో అలసత్వం ప్రదర్శించారంటూ సస్పెండ్ చేసింది. ఈసీ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారంటే ఎవరు విఫలమైనట్లు? రీపోలింగ్‌కు హైకోర్టుకెళ్లి పోరాడతాం..ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ సీపీ అందించిన ఫిర్యాదులన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే. రిగ్గింగ్ జరిగినట్లు మేం ఫిర్యాదు చేసిన ప్రతి పోలింగ్ కేంద్రం వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ బహిర్గతం చేయాల్సిందే. అధికారుల నియామకాలు, ఆ తర్వాత వారిని సస్పెండ్ చేయడం, ఎన్నికల ప్రక్రియలో లోపాలపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. రీపోలింగ్ నిర్వహించేలా పోరాటం చేస్తాం. రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన చోట వెబ్ కెమెరాలను తనిఖీ చేసి రీపోలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు, ఏజెంట్లు కలసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేయడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. మేం చెప్పేది నిజం కాకుంటే పూర్తి నిడివి వీడియోలను ఈసీ బయట పెట్టాలి. పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా కచ్చితంగా విజయం సాధిస్తారు. నలుగురు అధికారులను మేనేజ్ చేసి ఎడిటెడ్ వీడియోలు లీక్ చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశాం. బాబు నోట నీతులా..?నరసరావుపేటలో కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా నలుగురు చనిపోతే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన చంద్రబాబు నీతులు చెబుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై ఏ 1గా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ లీడర్లను ప్రోత్సహించేది చంద్రబాబేనని అందరికీ తెలుసు.'గేట్’ వీడియోలన్నీ బయట పెట్టాలి..మాచర్ల నియోజకవర్గంలోని తుమృకోట, వెల్దుర్తి, చింతపల్లి, వేపకంపల్లె, ఒప్పిచర్లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాక్కెళుతున్న వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ దృష్టికి తెచ్చాం. పాల్వాయిగేట్‌లో మా పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాక్కెళ్లి కొడుతుంటే పిన్నెల్లి రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు రెండు మూడు గంటల పాటు సాగిన టీడీపీ మూకల దౌర్జన్యాలు, విధ్వంసకాండను ఎందుకు బయట పెట్టడం లేదు? అక్కడ ఉదయం నుంచి జరిగిన ఘటనల వీడియోలన్నీ బహిర్గతం చేయాలి. -
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు’’ అని కాసు మహేష్ చెప్పారు.‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
-
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
-
ఇంటర్నేషనల్ ఫెసిలిటీ తో ఆస్పత్రి నిర్మాణం
-
మీకు రెండే రెండు ప్రశ్నలు.. టీడీపీ మేనిఫెస్టోపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
పల్నాడు వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది: ఎమ్మెల్యే కాసు
-
షర్మిలకు కాసు మహేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
ముఖ్యమంత్రి జగన్ పాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చారు: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
-
నీకు ఉరి శిక్ష పడేలా చేస్తా...టీడీపీ నేతకు వార్నింగ్..
-
ఈ హత్యకు కారణం ఆయనే..!
-
రూ.300 కోట్ల సారాయి డబ్బులతో చంద్రబాబు ఇళ్లు కట్టుకున్నారు