సాక్షి, గుంటూరు : ధృడమైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, అది వైఎస్ ఒక్క జగనన్నతోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేశ్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో శనివారం నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నర్సరావుపేట ప్రస్తుతం లంచాలపేటగా మారిపోయింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నర్సరావుపేటలో అభివృద్ధి జరిగింది. ఆయన మరణాంతరం టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు, కుమార్తె, వారి అనుచరులు కలిసి నర్సరావుపేటను అవినీతిమయం చేశారు.
చేతకాని టీడీపీ దద్దమ్మ ప్రభుత్వం పోయి, మంచి ప్రభుత్వం రావాలి. ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అరికట్టి వైఎస్ జగన్ను సీఎం చేయాలన్న ఆరాటం అందరిలో ఉంది. వైఎస్ జగన్ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నర్సరావుపేట రూపురేఖలు మార్చుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డి ఇక్కడ ఉండడు అంటూ... కొందరు టీడీపీ నేతలు పుకార్లు రేపుతున్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఈగ వాలినా ...కాకితో కబురు చేస్తే కాసు మహేష్ రెడ్డి వస్తాడు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాటిని ఎవరూ నమ్మొద్దు. పార్టీ అభివృద్ధికి అందరం కలిసి పని చేస్తాం.’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment